ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క! | on her lip job have nothing to hide, says Anushka | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క!

Published Fri, May 20 2016 10:59 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క! - Sakshi

ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క!

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్లాస్టిక్ సర్జరీ విషయంపై మరోసారి సీరియస్ అయింది. ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని, ఇక ఈ విషయంపై వదంతులకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని అందరికీ వార్నింగ్ ఇచ్చింది. తాను అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా బయటకు చెప్పే హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సుల్తాన్ మూవీ షూటింగ్ తో ఆమె బిజీబిజీగా ఉంటోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయిక. అయితే 'బాంబే వెల్వేట్' మూవీ సమయంలో తలెత్తిన వివాదం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఫ్యాన్స్ కు నిజాన్ని చెప్పాలని భావించానని అందుకే ఈ విషయంపై మాట్లాడుతున్నట్లు పేర్కొంది.

'అందరిలాగే నేను మనిషినే. నాలో కొన్ని లోపాలుంటాయి. ఎప్పుడూ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నా పెదవులపై కత్తికి  పని పెట్టించ లేదు' అంటూ వివరణ అనుష్క అంటోంది. బాంబే వెల్వేట్ మూవీ కోసం పెదవులకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారైందని కథనాలు వచ్చాయి. అయితే మొదట్లో తనకు మేకప్ గురించి అంతగా అవగాహన లేదని, ఆ తర్వాత తాను ఈ విషయంలో ఎంతో మెరుగయ్యానని చెప్పింది. ఆ మూవీ సమయంలో తాను వాడే మేకప్ కిట్ తో పాటు అందంగా కనిపించడం కోసం ఎన్నో కిటుకులు నేర్చుకున్నానని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై అంతగా స్పష్టతలేని వాళ్లు, అనవసరంగా లేనిపోని వార్తలు ప్రచారం చేశారని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement