Anushka Sharma
-
ఈ పాపమంతా భార్యలదేనంట..!
-
వామిక, అకాయ్‌లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
నితీశ్ రెడ్డి కుటుంబంతో అనుష్క శర్మ.. ఫొటో వైరల్
-
‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’
‘టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలోనే శాశ్వతంగా భారత్‌ను వీడనున్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉండబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’... ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు.. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.క్రికెట్ కింగ్‌గా పేరొందిన విరాట్ కోహ్లి.. 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. పాప పుట్టిన దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవలే అనుష్క- కోహ్లి మగబిడ్డకు జన్మనిచ్చారు.అప్పటి నుంచి ఎక్కువగా లండన్లోనేఇక వామిక భారత్‌లోనే జన్మించగా.. రెండోసారి ప్రసవం కోసం భర్త విరాట్‌తో కలిసి అనుష్క లండన్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. విరాట్ కూడా సొంతగడ్డపై మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. విదేశాల్లో సిరీస్‌లు ఉన్న సమయంలో లండన్ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటున్నాడు.లండన్‌లో స్థిర నివాసంఅదే విధంగా.. అనుష్క శర్మ సైతం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ముంబైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ ఈ వదంతులు నిజమేనని పేర్కొన్నాడు.‘‘అవును.. విరాట్ కోహ్లి లండన్‌కు పూర్తిగా మకాం మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఇండియాను శాశ్వతంగా వదిలివెళ్తాడు’’ అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. అనుష్కకు కూడా భారీగానే అభిమానగణం ఉంది.కారణం ఇదేకాబట్టి ఈ సెలబ్రిటీ జంటకు సంబంధించిన చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. అదే విధంగా.. మీడియా, సోషల్ మీడియాలోనూ వీరి గురించి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కామెంట్లు శ్రుతిమించుతాయి కూడా! అప్పట్లో ఓ మ్యాచ్‌లో కోహ్లి భారత పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడన్న కారణంతో అతడి కుమార్తెను ఉద్దేశించి నీచంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు దిగారు కొందరు దుండగులు.ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న విరుష్క జోడీ.. ఇప్పటి వరకు వారి ఫొటోలను కూడా ప్రపంచానికి చూపించలేదు. తమ పిల్లల గోప్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శాశ్వతంగా లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆ తర్వాత శాశ్వతంగా లండన్లోఇటు కుటుంబ గోప్యతతో పాటు.. లండన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోనే విరాట్ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ రికార్డుల రారాజు.. వన్డే, టెస్టుల నుంచి తప్పుకొన్న తర్వాత మకాం మొత్తంగా లండన్‌కు మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం కోహ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. భార్య అనుష్కతో పాటు పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కాగా కోహ్లి ఖాతాలో ఇప్పటికే 81(టెస్టు 30, వన్డే 50, టీ20 1) అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.చదవండి: సంజూ శాంసన్‌కు షాక్ -
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్‌ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్‌లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
ముద్దులు విసురుతూ విరాట్ సెలబ్రేషన్స్.. అనుష్క ఎదురుగా ఉంటే..!
-
అనుష్క ఎదురుగా ఉంటే.. అది మరింత ప్రత్యేకం: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. తన సతీమణి అనుష్క శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అన్ని వేళలా తన వెన్నంటే ఉండి.. కష్టసుఖాల్లో అండగా ఉంటుందని కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. తమ మదిలో మెదిలే భావాలను కూడా చక్కగా అర్థం చేసుకుని.. అందుకు తగ్గట్లుగా ఉంటుందని ప్రేమ కురిపించాడు. కాగా గత కొంతకాలంగా పేలవఫామ్‌తో విమర్శల పాలైన కోహ్లి ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు.అనుష్క వైపు ముద్దులు విసురుతూఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పెర్త్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి శతకంతో సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించి విజయం దిశగా అడుగులువేసేలా చేశాడు. స్టాండ్స్‌లో ఉన్న భార్య అనుష్క వైపు ముద్దులు విసురుతూ సెంచరీ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.కాగా స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆట పట్ల మునుపటిలా అంకితభావం కనిపించడం లేదని.. భార్యాపిల్లల కోసం తరచూ లండన్ ప్రయాణాలు చేయడమే సరిపోతుందంటూ కోహ్లిని ట్రోల్ చేశారు. అనుష్క ఎదురుగా ఉంటే.. అది మరింత ప్రత్యేకంఈ నేపథ్యంలో టెస్టుల్లో తన ముప్పైవ సెంచరీ నమోదు చేసిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ‘‘మంచి ప్రదర్శన చేయనప్పుడు మైదానంలో పదే పదే తప్పులు చేస్తుంటాం. జట్టు విజయాలకు సహకరించాలని ఎప్పుడూ అనుకుంటా. అంతే కానీ ఊరికే అలా కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. కష్టసుఖాల్లో అనుష్క శర్మ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. నా మదిలో ఏం మెదులుతుందో తను బాగా అర్థం చేసుకుంటుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా భావిస్తా. అదీ అనుష్క ఎదురుగా ఉంటే మరింత ప్రత్యేకంగా ఉంటుంది’’ అని పెర్త్ సెంచరీ తనకెంతో ప్రత్యేకమని కోహ్లి పేర్కొన్నాడు.కాగా కోహ్లి భార్య అనుష్క లండన్‌లో తమ రెండో సంతానం అకాయ్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎక్కువగా కోహ్లి కుటుంబం అక్కడే ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లి తన ఫ్యామిలీని కూడా తీసుకువచ్చాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో అనుష్క భర్తను చీర్ చేస్తూ సందడి చేసింది. ఇక విరుష్క జోడీకి కుమారుడు అకాయ్ కంటే ముందు కూతురు వామిక జన్మించిన విషయం తెలిసిందే. చదవండి: బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా -
‘కోహ్లి కార్బన్ కాపీలా అకాయ్’.. ఫొటోలు వైరల్! మండిపడుతున్న ఫ్యాన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. పెర్త్ టెస్టులో అర్ధ శతకంతో మెరిసి అభిమానులను అలరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77) బలమైన పునాది వేయగా.. కోహ్లి తన హాఫ్ సెంచరీతో స్కోరును 400 దాటించాడు.కాగా ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లికి ఇది కేవలం రెండో ఫిఫ్టీ కావడం గమనార్హం. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తొలి టెస్టు సందర్భంగా కోహ్లి 70 పరుగులు సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఫిఫ్టీ బాదడం.ఇదిలా ఉంటే.. కోహ్లిని చీర్ చేసేందుకు అతడి భార్య అనుష్క శర్మ పెర్త్ స్టేడియానికి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆమె స్టాండ్స్‌లో సందడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే, ఆదివారం నాటి ఆటలో విరుష్క జోడీ కుమారుడు అకాయ్‌గా చెబుతున్న బుడ్డోడి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఈ నేపథ్యంలో అకాయ్ కోహ్లి కార్బన్ కాపీలా ఉన్నాడంటూ కొంతమంది నెటిజన్లు ఆ ఫొటోలను వైరల్ చేయగా.. విరుష్క ఫ్యాన్స్ మాత్రం బ్రాడ్‌కాస్టర్స్‌పై మండిపడుతున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోహ్లి- అనుష్క చెబుతున్నా.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవరూ కూడా అకాయ్ ఫొటోలను షేర్ చేయవద్దని.. తమ కుమారుడి గోప్యత విషయంలో కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని హితవు పలుకుతున్నారు.కాగా కోహ్లి కుమార్తె వామిక ఫొటోలు కూడా గతంలో ఇలాగే బ్రాడ్‌కాస్టర్స్ తప్పిదం వల్ల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడిన కోహ్లికి ఇద్దరు పిల్లలు. ఈ జోడీకి మొదటి సంతానంగా కుమార్తె వామిక 11 జనవరి, 2021లో జన్మించగా.. రెండో సంతానం కుమారుడు అకాయ్. 2024, ఫిబ్రవరి 15న లండన్‌లో జన్మించాడు. అయితే, ఇంతవరకు విరుష్క జోడీ తమ పిల్లలను బయటిప్రపంచానికి చూపించలేదు.ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. సెలబ్రిటీ లైఫ్నకు.. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా వారిని పెంచాలని భావిస్తున్నట్లు కోహ్లి దంపతులు గతంలో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ 500 పరుగులకు పైగా ఆదిక్యంలో కొనసాగుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి కేవలం ఐదు పరుగులకే నిష్క్రమించిన విషయం తెలిసిందే.Don't post Akaay's pics. Let them have privacy. Just respect their decision— A (@_shortarmjab_) November 24, 2024is that akaay??? pic.twitter.com/jQChs3N5i1— Nush (@kyayaarcheeks) November 24, 2024Baby akaay clip❤️ pic.twitter.com/Ax6q3Xnptz— Krishn_editx (@Krishn_editx) November 24, 2024 -
‘వదినమ్మ వచ్చేసింది’.. పెర్త్ స్టేడియంలో అనుష్క రియాక్షన్స్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో నిరాశపరిచిన కోహ్లి.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా శుభారంభం అందుకోలేకపోయాడు.జాగ్రత్త పడి ఉంటే..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన టెస్టులో కోహ్లి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేశాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, కోహ్లి జాగ్రత్త పడి ఉంటే.. వికెట్ పడకుండా ఉండేదే!ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా!ఈ నేపథ్యంలో మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొంతమందైతే అతడి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగుతూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగుస్తుందా.. ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా! అని చూడటం తప్ప.. జట్టు కోసం నేనేం చేస్తున్నాన్న ఆలోచనే లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత విరుష్క జోడీ ఎక్కువగా అక్కడే గడుపుతోంది. ముఖ్యంగా అనుష్క ఏవైనా ప్రమోషన్లు ఉంటే మాత్రమే ఇండియాకు వస్తోంది.ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కుటుంబ సమేతంగా!మరోవైపు.. కోహ్లి సైతం ఇండియాలో మ్యాచ్ పూర్తవగానే లండన్ వెళ్లిపోతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లి కుటుంబ సమేతంగా వచ్చినట్లు తెలుస్తోంది. తమ పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా వెంట తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక పెర్త్ స్టేడియంలో అనుష్క టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది. ముఖ్యంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో ఆసీస్ ఆలౌట్ కాగానే ఆమె ఇచ్చిన రియాక్షన్ అభిమానులకు ఫిదా చేస్తోంది.వదినమ్మ వచ్చేసింది..‘‘వదినమ్మ వచ్చేసింది.. కోహ్లి భాయ్ నువ్వు సెంచరీ చేయడమే మిగిలి ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ రన్‌మెషీన్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్‌ను 104 పరుగులకే కట్టడి చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Anushka Sharma Reaction, After Australia's last wicket😍#ViratKohli | #AnushkaSharma pic.twitter.com/AItKHrFfpB— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) November 23, 2024 -
Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
క్రికెట్ కింగ్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుట్టినరోజు నేడు(నవంబరు 5). ఈ సందర్భంగా ఈ రన్మెషీన్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సహా యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు కోహ్లికి విషెస్ తెలిపారు. అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్‌ను విష్ చేస్తూ కోహ్లి పేరును ట్రెండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో విరాట్ ఫ్యాన్స్‌కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది అతడి సతీమణి అనుష్క శర్మ. తమ ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌లతో కోహ్లి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కోహ్లి అకాయ్‌ను ఎత్తుకోవడంతో పాటు తన గారాలపట్టి వామికను ఒంటిచేత్తో మోస్తూ కనిపించాడు. అయితే, అనుష్క ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు.తమ చిన్నారుల ముఖాలు కనిపించకుండా లవ్ సింబల్స్‌తో కవర్ చేశారు. ఏదేమైనా తొలిసారి వామిక, అకాయ్‌లను ఈమాత్రం చూపించినందుకు ‘థాంక్స్ వదినా’ అంటూ కోహ్లి ఫ్యాన్స్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఇదివరకు వామిక ఫొటోలను అడపాదడపా షేర్ చేసినా.. అకాయ్‌కు సంబంధించి మాత్రం ఇదే తొలి ఫొటో. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నవంబరు 5, 1988లో ఢిల్లీలో జన్మించాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. కోహ్లి తోబుట్టువులు అన్న వికాస్ కోహ్లి, అక్క భావనా కోహ్లి ధింగ్రా ఉన్నారు.కెప్టెన్‌గానూ సేవలు2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు కోహ్లి. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి వరల్డ్ రికార్డు సాధించాడు కోహ్లి. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలెన్నో సాధించాడు.ఇప్పటి వరకు టీమిండియా తరపున 118 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడిన కోహ్లి 27,134 పరుగులు చేశాడు. ఇందులో 80 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్లలో కోహ్లి సభ్యుడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న కోహ్లి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.బాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లిఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలో 2017, డిసెంబరు 11న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్క జోడీకి తొలి సంతానంగా 2021లో కూతురు వామిక జన్మించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్‌కు ఈ జంట జన్మనిచ్చింది. చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
కోహ్లి, అనుష్క త్రాగే నీళ్లు ఏ దేశం నుంచి వస్తాయో తెలుసా..!
-
బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ నటి, దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా అందం, ఫిట్నెస్ పరంగా యువహీరోయిన్లకు తీసిపోని వన్నె తరగని అందం అనుష్కాది. ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యం, ఫాలో అయ్యే డైట్ గురించి షేర్ చేసుకుంది. తాను ప్రతిరోజు ఒకే రకమైన ఆహారాన్ని తింటానని చెప్పుకొచ్చింది. ఇలా తినడాన్ని మోనోట్రోపిక్ డైట్ అనిపిలుస్తారని చెప్పింది. ప్రతిరోజూ ఒకేరకమైన లేదా ఒకలాంటి ఆహారాన్నే ఈ డైట్లో తీసుకుంటారు. ఇలాంటి డైట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ డైట్లో ఆహారం సరళంగా, సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ డైట్ ఎక్కువగా తినాలనే ఆసక్తిని తగ్గిస్తుంది. అలసటను కూడా పోగొడుతుంది. అనుష్క కూడా అల్పాహారంలో ఇడ్లీ సాంబార్ తినాలనుకుంటే ఆరునెలలపాటు అదే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటుందట. ఇక్కడ అనుష్క తీసుకనే సాంబార్, ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల ఇందులోని గట్ స్కిన్‌ని మెరిసేల చేసుంది. దీనిలో ఉండే విటన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల శోషణ మేని ఛాయు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఈ మోనోట్రోఫిక్ డైట్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..ఈజీగా ఫుడ్ ప్లాన్భోజన ప్రణాళికను గణనీయంగా సులభతం చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో ఒకరకమైన ఆహారం లేదా ఒకే విధమైన ఆహార తినవల్సి ఉంటుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తీసుకునే ఆసక్తి తగ్గుతుంది. ఒక విధమైన అలసటను నివారస్తిఉంది. ఒక నియమబద్ధమైన ఆహార నియమావళికి కట్టుబడి ఉండటాన్ని సులభతరం చేస్తంది.జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందిఒకేసారి ఒక రకమైన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. శరీరం ఏకకాలంలో బహుళ ఆహార రకాలను నిర్వహించడంలో సంక్లిష్టత లేకుండా ఒకే పోషకాన్ని విచ్ఛిన్నం చేయడం, గ్రహించడంపై దృష్టి పెడుతుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరచడంలో, జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తీసుకోవడం తగ్గిస్తొంది..భోజనాన్ని ఒకే ఆహారం లేదా ఒక విధమైన ఆహార సమూహానికి పరిమితం చేసినప్పుడు..ఆటోమెటగ్గా కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే వివిధ రకాల ఆహార పదార్థాల కొరత ఉన్నప్పుడు అతిగా తినడాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది. ఎందుకంటే..? ఒకేరకమైన ఆహారం అతిగా తినాలనే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఇది చివరికి బరువు నిర్వహణలో సహాయపడుతుంది.మైండ్‌ఫుల్ ఈటింగ్‌లో సహాయపడుతుందిఒక మోనోట్రోపిక్ ఆహారం సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. అనేక రుచులు వైప దృష్టిపోనివ్వకుండా, నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. పైగా అతిగా తినడాన్ని నిరోధస్తుంది.నిర్విషీకరణలో సహాయపడుతుందిఒక రకమైన ఆహారంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు శరీరం నిర్విషీకరణ ప్రక్రియలలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్లను తొలగించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఆహారం పట్ల అవగాహనను పెంచుతుందిమోనోట్రోపిక్ డైట్ వల్ల వివిధ ఆహారాలు, శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మొత్తం శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహనను పెంచుతుంది. ఆహారాన్ని వేరుచేయడం ద్వారా, రీరంపై ప్రతి ఒక్కటి ప్రత్యక్ష ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఆహారంలో సంక్లిష్టతను తొలగిస్తుందిమోనోట్రోపిక్ డైట్ సరళత ఆహార సున్నితత్వం లేదా అలెర్జీలను గుర్తించడం సులభం చేస్తుంది. ఆహార సమూహాలను వేరుచేసినప్పుడు, ఏ ఆహారాలు ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతాయో సులభంగా గుర్తించవచ్చు. అలాగే శరీరం ఆహారంలో సర్దుబాట్లు చేసేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.(చదవండి: 90 ఏళ్లు... రెండు మైళ్లు..: సొసైటీకీమె దివిటీ) -
Virat Kohli: అకాయ్‌ను ఆడిస్తున్న కోహ్లి.. వీడియో వైరల్
భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు అకాయ్‌ను కోహ్లి ఎత్తుకున్న వీడియో వైరల్ అవుతోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంలో కోహ్లి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్‌లలో తేలిపోయినా.. వెస్టిండీస్‌లో జరిగిన ఫైనల్లో ఈ రన్‌మెషీన్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.బార్బడోస్‌లో టైటిల్ కోసం సౌతాఫ్రికాతో జరిగిన పోరులో ఈ ఓపెనర్ 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(31 బంతుల్లో 47 రన్స్)తో కలిసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.ఇక భారత్ విధించిన 177 పరుగుల లక్ష్మాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా తడబడటంతో ట్రోఫీ రోహిత్ సేన సొంతమైంది. ఏడు పరుగుల స్వల్ప తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలిచిన టీమిండియా ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.ఈ మ్యాచ్ ముగియగానే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. విజయోత్సవాల కోసం జట్టుతో పాటు స్వదేశానికి తిరిగి వచ్చాడు. అనంతరం లండన్ వెళ్లిపోయాడు.కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి అంతకంటే ముందే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబాన్ని కలుసుకున్న కోహ్లి ప్రస్తుతం వారితో సరదాగా సమయం గడుపుతున్నాడు.ఈ నేపథ్యంలో కోహ్లి.. చిన్నారి అకాయ్‌ను ఎత్తుకుని ఆడిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో అకాయ్ ముఖం మాత్రం కనబడలేదు. కాగా తమ పిల్లల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు వారిని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని విరుష్క జోడీ నిర్ణయం తీసుకుంది.అందుకే ఇంతవరకు వామిక, అకాయ్‌లకు సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాట్- అనుష్క అకాయ్‌కు లండన్‌లో జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Virat Kohli Fan Club 👑 (@trend_vkohli) -
లండన్‌లో కోహ్లి స్థిరనివాసం..? ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రత్యక్షం! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ విజయోత్సవ యాత్రం ముగిసిన మరుసటి రోజే తన భార్య పిల్లలను చూసేందుకు కోహ్లి లండన్‌కు పయనమయ్యాడు.అక్కడ హాలిడేస్‌ను కోహ్లి తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ అతడి భార్య అనుష్క శర్మ ఇద్దరూ లండన్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు కృష్ణ దాస్ కీర్తనకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా కృష్ణ దాస్ కీర్తనలకు విరాట్-అనుష్క సూపర్ కపుల్ హాజరుకావడం ఇదేమి తొలిసారి కాదు. ఇంతకుముందు చాలా సార్లు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కన్పించారు. అదే విధంగా కృష్ణ దాస్ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబాను సైతం విరాట్, అనుష్క ఎక్కువగా ఆరాధిస్తారు. కాగా లండన్‌లో విరాట్ కోహ్లి స్థిరనివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్నట్లు చాలా రోజులగా ప్రచారం జరుగుతోంది.విరాట్ ఇటీవల కాలంలో ఎక్కువగా లండన్‌లోనే గడుపుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. విరాట్ కొడుకు అకాయ్ కూడా లండన్‌లోనే జన్మించడం గమనార్హం. ఇప్పటివరకు ఆకాయ్ను కోహ్లి భారత్‌కు తీసుకురాలేదు. విరుష్క జంట లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ కలిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ఉన్నారు.ఇవన్నీ చూస్తుంటే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత కోహ్లి, అనుష్కశర్మలు లండన్‌లో స్థిరపడే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేలు, టెస్టుల్లొ కొనసాగనున్నాడు. అయితే ఈ నెలలో జరిగే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. అతడు తిరిగి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టుతో చేరే అవకాశముంది. Virat Kohli & @AnushkaSharma at @KrishnaDas' Kirtan in London! 😇#ViratKohli • #Virushka • #ViratGang pic.twitter.com/efk3dYheFh— ViratGang.in (@ViratGangIN) July 14, 2024 -
Alia Al Rufai: తానొక.. అందమైన ఫ్యాషన్ లేడీ!
బాలీవుడ్లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్‌గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్‌కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్‌కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్‌గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్‌కి కంటెంపరరీ టచ్నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్‌లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్‌ని, కల్చర్స్ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్‌ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్‌గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్‌గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్‌లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.ఆ సినిమా ఆమె కెరీర్‌కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్‌గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్‌ఫుల్‌గా కనిపించసాగింది ఆ నటి.దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్‌ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్‌కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది.ఫ్యాషన్‌లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది."అంకితభావం, హార్డ్‌వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్‌తో మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్‌కి ఇన్స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్‌ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్లకు తిరుగులేదు.నేర్చుకోవడానికి బాలీవుడ్‌ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫైఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ! -
మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)
-
అనుష్క శర్మతో ఫొటోలకు ఫోజులిచ్చిన ధనశ్రీ.. ఈసారి
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి వైరల్‌గా మారారు. పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్-2024కు ఎంపికైన భారత జట్టులో చహల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. దీంతో చాలాకాలం తర్వాత అతడు జాతీయ జట్టులో తిరిగి అడుగుపెట్టాడు.అయితే, గ్రూప్ దశలో భాగంగా టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో చహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌ల నేపథ్యంలో తుదిజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకే పెద్దపీట వేసింది. అదే విధంగా ముగ్గురు స్పెషలిస్టు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లతో బరిలోకి దిగింది.ఇదిలా ఉంటే.. యజువేంద్ర చహల్‌తో పాటు అతడి భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కూడా అమెరికా వెళ్లారు. వీరితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం తర్వాత ధనశ్రీ వర్మ ఓ ఫొటో షేర్ చేశారు. ‘‘మనం గెలిచేశాం’’ అన్న క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫొటోలో.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ధనశ్రీ విక్టరీ సింబల్ చూపుతూ కనిపించారు.కాగా యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆమె ట్రోలింగ్ బారిన పడ్డారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె పేరును ముడిపెట్టి దారుణంగా ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు.కేవలం ఫేమ్ కోసమే చహల్‌ను ధనశ్రీ పెళ్లాడారని.. అతడికి అన్యాయం చేసేందుకు ఆమె ఏమాత్రం వెనుకాడంటూ వ్యక్తిత్వ హననం చేసేలా కామెంట్లు చేశారు. విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ప్రచారం చేశారు. అయితే, ఆ సమయంలో చహల్ భార్యకు అండగా నిలిచాడు. ధనశ్రీ సైతం ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చి మానసికంగా తాను స్ట్రాంగ్ అని చెప్పకనే చెప్పారు.ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బౌలింగ్👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అమెరికాలోని డలాస్ వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఐసీసీ టోర్నీ కోసం సన్నద్ధమైంది.న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి కూడా భారీ అంచనాల నడుమ రోహిత్ సేన ప్రపంచకప్ బరిలో దిగనుంది. టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకు, టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌కప్ అన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇరువురిపై ఒత్తిడి ఉండటం సహజం.అదే విధంగా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంచనాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆటగాళ్లు అంత ఎక్కువగా ఒత్తిడికి లోనై.. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేరని పేర్కొన్నాడు.‘‘రాహుల్ ద్రవిడ్ చాంపియన్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నడంలో దిట్ట. అయితే, రిలాక్స్ కావడానికి తనకూ కొంత సమయం కావాలి.రోహిత్ భార్య(రితికా సజ్దే)ను స్టాండ్స్‌లో చూసినపుడు మనకే అర్థమవుతుంది. ఆమె ఎంత ఒత్తిడిలో ఉన్నారో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అదే విధంగా.. విరాట్ భార్య(అనుష్క శర్మ)ను చూసినపుడు కూడా ఇదే అనిపిస్తుంది.ఆమె ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారో తెలిసిపోతుంది. ఆటగాళ్లపై ఆశలు పెట్టుకున్నామంటూ వాళ్లను ఎంత ఒత్తిడికి లోను చేస్తోంది మనమే. తప్పు మనవైపే ఉంది. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఇదే జరిగింది.మేజర్ టోర్నీల్లో ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆడుతున్నపుడు ఒత్తిడి పెట్టకుండా స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించగలగాలి’’ అని గంగూలీ రెవ్స్ట్పోర్స్తో వ్యాఖ్యానించాడు. అంచనాల పేరిట ఆటగాళ్లపై మానసికంగా భారం మోపడం సరికాదని దాదా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ఇక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లోనూ టీమిండియా ఓడిపోవడానికి ఇదే కారణమని.. ఆటగాళ్లు కూడా కాస్త రిలాక్స్‌గా ఉండి ఒత్తిడి పడకుండా చూసుకోవాలని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. -
అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. అందులో విరాట్ కోహ్లీ మినహా.. మిగతా ప్లేయర్లంతా ఉన్నారు. విరాట్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంకా భారత్‌లోనే ఉండిపోయారు. ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రైన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ముంబైలో తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న కోహ్లీ.. మంగళవారం రాత్రి కుటుంబంతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఇందులో తన భార్య అనుష్క శర్మతో పాటు.. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య సాగరిక ఘట్గే, క్రికెట్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్, తదితరులు ఉన్నారు. వారందరితో విరుష్క దంపతులు సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, పోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ ఆ అనుష్క పట్టుకున్న హ్యాడ్బ్యాగ్ హాట్‌టాపిక్‌గా మారింది. చెప్పాలంటే డిన్నర్ డేట్లో ఆ హ్యాండ్‌బ్యాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇది గాబ్రియేలా హర్స్ట్ నినా బ్రాండ్‌కి చెందిన లగ్జీరియస్ బ్యాగ్. దీన్ని ఎక్కువగా బ్రిటీష్ రాజవంశస్తులు, కొందరూ హాలీవుడ్ ప్రముఖులు ఉపయోగిస్తారు. అచ్చం ఇదే మాదిరి బ్యాగ్‌ని ప్రిన్స్ హ్యరీ భార్య మేఘనా మార్కిల్ ధరించింది. ప్రఖాత్య హాలీవుడ్ ప్రముఖులు, ధనవంతులు ఉపయోగించే ఫేమస్ బ్రాండ్ లెదర్ బ్యాగ్ ఇది. అలాంటి లగ్జరీయస్ బ్యాగ్ అనుష్కా ధరించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ బుడ్డి బ్యాగ్ ధర ఏకంగా రూ. 2.3 లక్షలు పైనే పలుకుతుందట. దీన్ని ఎక్కువగా రాజవంవస్తులు, ధనవంతుల దర్పాన్ని ప్రదర్శించే రేంజ్లో ఉండే లగ్జరీయస్ హ్యాండ్ బ్యాగ్ అని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రముఖులు. సినీ సెలబ్రెటీలు ధరించే దుస్తుల నుంచి హ్యాండ్ బ్యాగ్‌లు వరకు అన్ని కళ్లు చెదిరిపోయేంత ఆకర్షణీయంగా ఉండటమేగాక అత్యంత విలావంతమైన వస్తువులుగా ఉంటాయి. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?) -
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్
-
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
-
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సత్తాచాటాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. సీఎస్కే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ అద్బుతమైన క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కోహ్లి లాంగాన్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ టైమింగ్‌లో జంప్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మిచెల్ బౌండరీ రోప్‌కు తాకడాని అంతా భావించారు. కానీ రీప్లేలో అతడు క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న కోహ్లి సతీమణి అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Anushka Sharma also thinks Virat Kohli was not out 😭😭😭@JayShah, please bring King Kohli back. He should be batting out there 🇮🇳💔💔💔#IPL2024 #RCBvsCSK #tapmad #HojaoADFree pic.twitter.com/5fnBv6hAJO— Farid Khan (@_FaridKhan) May 18, 2024 -
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్‌లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హైలైట్‌గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.వావ్.. థాంక్ గాడ్!‘వావ్’ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్‌లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 నాటౌట్.. ఒక వికెట్ (1/19)). Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్
-
Anushka Sharma Rare Photos: బర్త్‌డే స్పెషల్.. అన్నింట్లోనూ అనుష్క శర్మ టాపే (ఫొటోలు)
-
అందుకే ఆ రెండు నెలలు అక్కడే ఉన్నాం: కోహ్లి
రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు. ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్‌మెషీన్.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) బ్యాటర్. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి.. సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 𝗙𝗹𝘂𝗲𝗻𝘁! ✨ King Kohli is off the mark in the chase and how 😎 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/mgYvM716Gs — IndianPremierLeague (@IPL) March 25, 2024 ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి. ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే. -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం?!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా భారత్‌ను వీడనున్నారా? ముంబైకి గుడ్‌బై చెప్పి యునైటెడ్ కింగ్డంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?.. విరుష్క జోడీ గురించి సోషల్ మీడియాలో తాజాగా నడుస్తున్న చర్చ ఇది. భారత క్రికెట్ జట్టులో అడుగుపెట్టిన అనతికాలంలోనే కీలక సభ్యుడిగా ఎదిగి.. కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు ఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి. నాటి సారథి మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. నాయకుడిగా తన పాత్ర పూర్తైన తర్వాత కేవలం ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ రన్‌మెషీన్ ప్రస్తుతం పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక కోహ్లి వ్యక్తిగత జీవితానికొస్తే.. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు. ఈ జంటకు 2021, జనవరిలో తొలి సంతానంగా కుమార్తె వామిక జన్మించింది. అయితే, బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియాకు వామికను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ఫేస్‌ను రివీల్ చేయలేదు విరుష్క. ఇక ఇటీవలే లండన్‌లో జన్మించిన(ఫిబ్రవరి 15) తమ కుమారుడు అకాయ్ విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది ఈ స్టార్ జోడీ. పిల్లల గోప్యత, భద్రత దృష్ట్యా వారికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లి- అనుష్క దేశాన్ని వీడి యూకేలోనే సెటిల్ అవ్వనున్నారంటూ నెటిజన్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు రెడిట్‌లో.. ‘‘విరాట్ ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చాడు. అయితే, అతడి కుటుంబం యూకేకు షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.కోహ్లి క్రికెట్‌కు దూరమైన తర్వాత శాశ్వతంగా అక్కడే సెటిల్ అవుతారనిపిస్తోంది. అవును.. నిజమే తనకు యూకే అంటే ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. అక్కడైతే సామాన్య పౌరుడిలా జీవనం గడపవచ్చని అన్నాడు. తన పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. నిజానికి డబ్బున్నవాళ్లు యూకేలో ప్రశాంత జీవనం గడపవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ పాపరాజీల గోల ఉండదు. ముంబైలో విరుష్క కూతురిని ఫొటోలు తీసేందుకు వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం కదా!’’ అంటూ నెటిజన్ల మధ్య సంభాషణ సాగింది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ సదరు పోస్టులపై మండిపడుతున్నారు. కావాలంటే లండన్‌కు వెళ్లివస్తారే తప్ప విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఎప్పటికీ దేశాన్ని వీడరని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి ఐపీఎల్-2024 కోసం ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా.. పిల్లలతో కలిసి అనుష్క లండన్‌లోనే ఉన్నట్లు సమాచారం! It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్‌క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్‌లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
Virushka: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?!
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. క్రీడా, సినీ సెలబ్రిటీలు.. వ్యాపార దిగ్గజాలు మూడు రోజుల పాటు జరిగే ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విచ్చేసి అంబానీ కుటుంబ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ‘‘విరాట్ కోహ్లి- అనుష్క శర్మ.. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. రాజు- రాణి వచ్చేశారు’’ అంటూ ఎయిర్‌పోర్టులో కోహ్లి- అనుష్క దంపతులు నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పాత ఫొటో. గతేడాది జూన్‌లో ఈ జంట ఎయిర్‌పోర్టు వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మానవ్ మంగ్లానీ అనే పాపరాజీ అప్పట్లో షేర్ చేశాడు. అయితే, తాజాగా కొంతమంది ఇందులోని ఫొటోలు గ్రాబ్ చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి వెళ్తున్నాడా? విరాట్ కోహ్లి 2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లాడాడు. ఇటలీ వేదికగా పెళ్లి జరుగగా.. ముంబైలో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో కలిసి హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడులకు కోహ్లి దంపతులు హాజరుకావడం లేదని సమాచారం. ఇటీవలే అనుష్క శర్మ లండన్‌లో తమ రెండో సంతానం అకాయ్‌కు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన విరాట్.. కుటుంబంతో కలిసి లండన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌కు విరుష్క జోడీ రావడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్రికెట్ సూపర్స్టార్లు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ తదితరులు అంబానీ ఇంట సంబరాల్లో పాల్గొనేందుకు గుజరాత్‌కు విచ్చేశారు. -
Ind Vs Eng: టీమిండియా గెలుపుపై కోహ్లి స్పందన.. పోస్ట్ వైరల్
టీమిండియా సిరీస్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఇంగ్లండ్‌పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని ప్రశంసించాడు. ఆటగాళ్ల పట్టుదల, అంకిత భావమే.. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా తీసుకువచ్చిందని కోహ్లి కొనియాడాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో అతడు తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లి లేకుండా టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ బరిలో దిగింది. మరోవైపు.. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సమస్యలతో అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో రెండో టెస్టులో రజత్ పాటిదార్, మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేశారు. ఇక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వీళ్లలో రజత్ పాటిదార్ మినహా మిగతా ముగ్గురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విరాట్ కోహ్లి స్పందిస్తూ.. ‘‘అవును.. టీమిండియా గెలిచింది. అద్భుతమైన సిరీస్‌లో యువ జట్టు దేశాన్ని గెలిపించింది. పట్టుదల, అంకిత భావం.. సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే తత్వమే ఈ విజయానికి కారణం’’ అని పేర్కొన్నాడు. YES!!! 🇮🇳 Phenomenal series win by our young team. Showed grit, determination and resilience.@BCCI — Virat Kohli (@imVkohli) February 26, 2024 కాగా హైదరాబాద్ టెస్టులో ఓడి పరాజయంతో సిరీస్ ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్.. తాజాగా రాంచి టెస్టులో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఇక కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి రాక గురించి తెలియజేసే పోస్ట్ తర్వాత.. కోహ్లి తాజాగా టీమిండియా విజయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చదవండి: #Rohit Sharma: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం.. వాళ్లు లేకపోయినా గెలిచాం! -
సన్నాఫ్ విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్ కోహ్లీ. అయితే ‘అకాయ్’ ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో ‘అకాయ్’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్‌ను విరాట్ ఎత్తుకున్నట్లు, విరాట్–అనుష్కలు అకాయ్‌తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్ చేశారు. ‘అకాయ్ ఫొటో షేర్ చేయకుండా విరాట్ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం..!?
విరాట్ కోహ్లి.. గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. విరాట్‌కు ఏమైంది..? ఎక్కడ ఉన్నాడు? అన్న ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి తాజా పోస్టుతో ఈ ప్రశ్నలకు తెరపడింది. కింగ్ కోహ్లి రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కొడుకుకు అకాయ్‌గా పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని విరుష్క జోడీ కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే అభిమానులు ఓవైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు కోహ్లి రీ ఎంట్రీపై చర్చ మొదలెట్టేశారు. కోహ్లి రీ ఎంట్రీ డౌటే.. ఇక విరాట్ సతీమణి అనుష్క అనారోగ్య సమస్యలతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని, అందుకే లండన్‌కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్కకు తోడుగా కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే మరి కొంత కాలం పాటు విరాట్ ఫ్యామిలీ లండన్‌లో ఉండనున్నట్లు సమాచారం. దీంతో కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు సైతం వారితో పాటు కొద్ది రోజులు లండన్‌లోనే నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ఫస్ట్‌హాఫ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు అయితే ఆర్సీబీ ఫ్రాంఛైజీ నుంచి గానీ కోహ్లి నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. కాగా ఐపీఎల్-17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్ పౌరసత్వం?!.. అందుకే లండన్‌లో..? -
Virat Kohli- Akaay: బ్రిటన్ పౌరుడిగా కోహ్లి కుమారుడు?
Virat Kohli And Anushka Sharma Son Akaay: క్రికెట్, సినీ అభిమాన వర్గాల్లో ఇప్పుడంతా ‘అకాయ్’ గురించే చర్చ. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ ముద్దుల కుమారుడికి అకాయ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. వామికకు తమ్ముడు పుట్టాడంటూ ఈ సెలబ్రిటీ జంట ప్రకటించగానే బాబు పేరుకు అర్థమేమిటి? చూడటానికి ఎలా ఉంటాడు? లండన్‌లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటిష్ పౌరసత్వం ఇస్తారా? వంటి అంశాల గురించి ఇటు కింగ్ కోహ్లి అభిమానులు.. అటు అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాయ్ అన్న పేరుకు అర్థం టర్కిష్ భాషలో ప్రకాశించే చంద్రుడు అని కొందరు.. హిందీలో అయితే.. ‘భౌతిక శరీరానికి మించి అతీతమైన వ్యక్తి’ అని ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. కోహ్లి దంపతులు ఇప్పట్లో అకాయ్ రూపాన్ని చూపించే చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకొందరు కృత్రిమ మేధతో ఫొటోలు సృష్టించి వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? మరి ‘అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? స్పోర్ట్స్ తక్ అందించిన వివరాల ప్రకారం.. కేవలం యునైటైడ్ కింగ్డం ఆస్పత్రిలో జన్మించాడు కాబట్టి జన్మతః అకాయ్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఇవ్వరు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా బ్రిటిష్ సిటిజన్ అయి ఉండాలి/ లేదంటే అక్కడ సుదీర్ఘకాలంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే యూకేలో పుట్టిన బిడ్డకు బ్రిటిష్ సిటిజన్‌గా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా.. బ్రిటన్ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు యూకే వెలుపల జన్మించిన బిడ్డకు తమ సిటిజన్‌గా గుర్తింపునిస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే, బిడ్డ పుట్టేనాటికి తల్లిదండ్రుల సిటిజన్‌షిప్ స్టేటస్ ఏమిటన్న దానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. కేవలం అదొక్కటే ఇక అకాయ్ విషయానికొస్తే.. ఈ చిన్నారి లండన్‌లో జన్మించినా అతడి తల్లిదండ్రులు ఇద్దరూ ‘విరుష్క’ భారత పౌరులు అన్న విషయం తెలిసిందే. కాబట్టి అకాయ్ బ్రిటిష్ పౌరసత్వం పొందేందుకు అనర్హుడు. భారత పౌరుడిగానే అతడికి గుర్తింపు ఉంటుంది. అయితే, అకాయ్ పాస్‌పోర్ట్ మాత్రం బ్రిటన్‌లో తయారు చేస్తారు. కాగా 2017లో ఇటలీ వేదికగా పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి- అనుష్క శర్మలకు తొలుత కుమార్తె వామిక(2021, జనవరి) జన్మించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ జంట తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సంతోష సమయంలో కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన కోహ్లి.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. చదవండి: ఆటలో విఫలం..! ఖరీదైన కారు కొన్న రహానే.. ధర ఎన్ని కోట్లంటే?! -
#Virat Kohli- Akay: కోహ్లి కొడుకు అకాయ్ ఫోటో.. వైరల్!?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండింట మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ గుడ్ న్యూస్‌ను కాస్త ఆలస్యంగా మంగళవారం(ఫిబ్రవరి 20) అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడుకి అకాయ్ అని పేరు పెట్టినట్లు విరుష్క జోడీ వెల్లడించింది. అదే విధంగా తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి చేశాడు. కాగా తన పిల్లల విషయంలో కోహ్లి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన గారాలపట్టి వామికను పుట్టినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంచుతూ కోహ్లి వస్తున్నాడు. ఇప్పటివరకు విరుష్క దంపతులు ఆమె ఫొటోను సైతం బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఆకాయ్ విషయంలోనూ అదే జాగ్రత్తలను ఈ సూపర్ కపుల్ పాటిస్తోంది. తమ మరోసారి తల్లిదండ్రులమయ్యామని ప్రకటించిన విరుష్క జోడీ.. ఎక్కడ కూడా ఆకాయ్ ఫోటోను షేర్ చేయలేదు. కానీ అభిమానులు మాత్రం జూనియర్ విరాట్ ఎలా ఉంటాడో చూడటానికి తహతహలడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఫ్యాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. అకాయ్ టీమిండియా జెర్సీలో.. అనుష్క, విరాట్‌తో కలిసి ఉన్నట్లు ఫోటోను క్రియేట్ చేశారు. అది కూడా కోహ్లి జెర్సీ నెం18తో కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా అకాయ్ పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సైతం పుట్టుకుట్టుకొచ్చాయి. నాకు జన్మనిచ్చినందుకు నాన్న విరాట్ కోహ్లి, అమ్మ అనుష్క శర్మకు ధన్యవాదాలు అంటూ అకాయ్ పేరిట ఓ పోస్ట్ ఎక్స్‌లో వైరలవుతోంది. కాగా విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. A cute ai generated family photo of Virushka 💖😍#Akaay #akaaykohli #ViratKohli #AnushkaSharma #Vamika pic.twitter.com/zq63tXinNM — ꧁Priyanshu꧁ (@Hey_ImPriyanshu) February 21, 2024 AI images of akaay ❤️🔥#akaaykohli#Akaay#AnushkaSharma #ViratKohli pic.twitter.com/cre7GGmvna — kikuuuuuu (@MemeCreatorrr) February 21, 2024 -
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్‌కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
జూనియర్ విరాట్ ‘అకాయ్’.. అర్థమేంటో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటే ఈ జంట(Virushka Second Baby) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ బాబుకు ‘అకాయ్’ (Akaay)గా నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే.. కాస్త కొత్తగా అనిపిస్తుండడంతో విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని చెబుతున్నారు. ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధృవీకరించలేదనే విషయం తెలిసిందే. అంతకు ముందు.. ‘‘ ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ ‘అకాయ్’.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని విరాట్-అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. గంట వ్యవధిలో మిలియన్లకు పైగా లైక్‌లను అందుకుంది. క్రీడా, సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కాగా, 2017లో ఇటలీలో టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2021, జనవరి 11న ఓ పాప జన్మించింది. ఆ చిన్నారికి వామిక అని పేరు పెట్టారు. -
మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి రెండోసారి తండ్రి అయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క దంపతులు కొద్ది సేపటి క్రితం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. బిడ్డకు 'అకాయ్' (Akaay) అని నామకరణం చేసినట్లు వారు పేర్కొన్నారు. మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రేమ మరియు కృతజ్ఞతతో విరాట్ మరియు అనుష్క అంటూ విరుష్క దంపతులు ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) కాగా, విరాట్ తండ్రి కాబోతున్నాడని గతకొంతకాలంగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా, కోహ్లి సహచరుడు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2017లో విరాట్ కోహ్లిని పెళ్లాడిన అనుష్క శర్మ.. 2021లో మొదటి సంతానం వామికకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే, విరాట్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లకు విరాట్ దూరంగా ఉన్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందే విరాట్ బీసీసీఐ వద్ద పర్మిషన్ తీసుకున్నాడు. -
Virat Kohli: సెలవులో ఉన్న కోహ్లి.. విష ప్రచారం!
Virat Kohli- Deepfake: సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కే సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారు. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో తర్వాత ఈ విపరీత ధోరణి మరింత ఎక్కువైంది. సినీ సెలబ్రిటీలతో పాటు సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లను సైతం సైబర్ క్రిమినల్స్ వదలడం లేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా తాజాగా ఈ బాధిత జాబితాలో చేరాడు. ఓ బెట్టింగ్ యాప్‌ను కోహ్లి ప్రమోట్ చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. తాను తక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టి.. భారీ మొత్తంలో ఆర్జించినట్లు కోహ్లి చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను... ఏకంగా ఓ టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు క్రియేట్ చేశారు సైబర్ మాయగాళ్లు. ఇది నిజమా? ఏఐ మాయా? గతంలో కోహ్లి ఇచ్చిన ఇంటర్వ్యూలోని మాటలను టెక్నాలజీని ఉపయోగించి తమకు అనుగుణంగా మార్చుకుని.. నిజమైన వీడియో అన్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను నెట్టింట షేర్ చేసిన ఓ జర్నలిస్టు.. ‘‘నిజంగా విరాట్ కోహ్లి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నాడా? లేదంటే ఇదంతా ఏఐ(కృత్రిమ మేధ) మాయా? ఒకవేళ అదే నిజమైతే.. వీడియో అసలైనదానిలా చిత్రీకరించడంలో సృష్టికర్తలు సఫలమయ్యారు. టెక్నాలజీని మరీ ఇంత దుర్వినియోగం చేస్తారా? ఒకవేళ ఈ వీడియో నిజమే అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు! మీలో ఎవరికైనా వాస్తవం ఏమిటో తెలిస్తే చెప్పండి’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇది కచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ మాయ అని అర్థమవుతోంది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కుటుంబానికి సమయం కేటాయించిన అతడు.. సెలవు పొడగించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తామని.. అత్యవసరం అయితే తప్ప ఈ దిగ్గజ బ్యాటర్ సెలవు పెట్టడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ పరిణామాల క్రమంలో కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని.. అయితే, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు తలెత్తాయనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త.. విరుష్క జోడీ లండన్‌లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారంటూ ట్వీట్ చేసి దుమారం రేపారు. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లి పేరిట ఇలాంటి వీడియో ప్రత్యక్షం కావడం గమనార్హం. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం
-
Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు!
Virat Kohli- Anushka Sharma To Be Born 2nd Child Rumours: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల గురించి నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంక చేసిన పోస్ట్ ఇందుకు కారణం. కాగా విరుష్క జోడీ రెండో సంతానం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. అనుష్క గర్భవతి అంటూ ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తికమక పెట్టిన డివిలియర్స్ ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల దూరం కావడం.. ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. అదే విధంగా.. సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్, కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ సైతం విరుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని తన యూట్యూబ్ చానెల్లో వెల్లడించాడు. అయితే, వెంటనే మాట మార్చి తాను తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యానంటూ కోహ్లి- అనుష్కలను క్షమాపణలు కోరాడు. ఈ క్రమంలో.. డివిలియర్స్ తొలుత చెప్పిందే నిజమని.. అయితే, అనుష్క శర్మ ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉన్న కారణంగానే అతడు ఈ మేరకు ప్రకటన చేశాడని ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ అయింది. దీంతో.. విరుష్క అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అనుష్క ఆరోగ్యం బాగుండాలని తాము కోరుకుంటున్నామంటూ పోస్టులు పెట్టారు. తాజాగా హర్ష్ గోయెంక పరోక్షంగా కోహ్లి- అనుష్కల రెండో సంతానం గురించి కామెంట్ చేశారు. ఆ బిడ్డ క్రికెటర్ లేదంటే సినిమా స్టార్ ‘‘మరికొన్ని రోజుల్లో ఓ బిడ్డ ఈ ప్రపంచంలోకి రానుంది! ఆ బేబీ తన తండ్రిలాగే క్రికెట్లో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందో.. లేదంటే.. తన తల్లిలా సినిమా స్టార్ అవుతుందో?!’’ అని గోయెంక ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇందుకు #MadeInIndia #ToBeBornInLondon అనే హ్యాష్‌ట్యాగ్‌లు జతచేశారు. మీకు ఆ హక్కు లేదు.. చెత్తగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రసవం కోసం విరాట్ అనుష్కను లండన్ తీసుకువెళ్లాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం హర్ష్ గోయెంక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోకి రాకముందే.. క్రికెటర్ లేదంటే ఫిల్మ్ స్టార్ అంటూ భారం మోపడం సరికాదు. పుట్టబోయే ఏ బిడ్డకైనా తమకు నచ్చిన రంగం ఎంచుకోవడం, నచ్చిన పని చేయడం వారి హక్కు. దాన్ని కాలరాసేలా మీరు మాట్లాడుతున్నారు. అయినా.. ఇండియాలో తయారై.. లండన్‌లో అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ఏమిటి? మరీ చెత్తగా ఉంది’’ అని మండిపడుతున్నారు. కాగా క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లి- అనుష్క శర్మను 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఈ సెలబ్రిటీ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. ఇక రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు వీరు సిద్ధమవుతున్నారనే వార్తలపై విరుష్క అధికారికంగా స్పందిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై A new baby is to be born in the next few days! Hope the baby takes India to great heights like the greatest cricketing father. Or will it follow the mother and be a film star? #MadeInIndia #ToBeBornInLondon — Harsh Goenka (@hvgoenka) February 13, 2024 -
కోహ్లీ భార్య అనుష్క శర్మకు ఏమైంది..?
బాలీవుడ్ నటి అనుష్కశర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మళ్లీ గర్భం దాల్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు స్టార్ ఆటగాడైన కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ల్లో మూడు సిరీస్‌లకు దూరంగానే ఉన్నాడు. అదీగాక తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండటంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడనే అంతా అనుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్టార్ కపుల్ విరుష్కరెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలొచ్చాయి. ఇంతలోనే అనుష్కకు ప్రెగ్నెన్సీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో అనుష్కకు ఏమైంది అంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నిజంగానే అనుష్క ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందా? అందుకే విదేశాలకు వెళ్లారా? అనే ఊహగానాలకు జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్వీట్ మరింత ఊత మిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విటర్లో వారితో సంభాషించిన ట్వీట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విదేశాలకు వెళ్లినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. విరాట్ తన కుటుంబంతో గడిపేందుకు వృత్తిపరమైన విరామం తీసుకున్నారనీ, ముఖ్యంగా అనుష్క ఆరోగ్య సమస్యల కారణంగా విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నట్లు ఆ ట్వీట్లో ఉంది. అందువల్లే కోహ్లీ తన కుటుంబంతో ఉండేందుకు మ్యాచ్‌లకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్కాకు ఏమైందంటూ చర్చలు మొదలయ్యాయి. తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు.అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని, జట్టుతో తిరిగి చేరతాడనేవార్త వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీ విషయంలో ఏ చిన్న విషయం బయటకు పొక్కినా.. అదో పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఏం జరిగిందంటూ..సోషల్ మీడియాలో పోస్టుల హడావిడి అంత ఇంతాకాదు. వీటన్నింటికి చెక్ పడాలంటే..పూర్తి స్పష్టత రావాలంటే ఏం జరిగిందనేది విరుష్క అధికారంగా ప్రకటించాల్సి ఉంది. (చదవండి: స్లిమ్‌గా మారిన టాలీవుడ్ నటుడు సురేష్! ఆయన ఫాలో అయ్యే డైట్ ఇదే..!) -
Virat Kohli: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్!
Is Problem In Anushka Sharma Pregnancy, Rumours Viral: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. అదీ సొంతగడ్డపై అంటే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మెరుపులు ఉండాల్సిందే! ప్రత్యర్థి బజ్‌బాల్ అంటూ హెచ్చులకు పోతే.. అందుకు మన కింగ్ దూకుడైన ‘విరాట్‌బాల్’తో అడ్డుకట్ట వేయడం ఖాయం.. అంటూ ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా తప్పుకొన్న విషయం తెలిసిందే. కోహ్లి లేకుండానే జరిగిన ఈ మ్యాచ్‌లలో తొలుత ఇంగ్లండ్.. తర్వాత టీమిండియా గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. సెలక్షన్‌కు అందుబాటులో లేడు ఇక మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడనుకుంటే.. అతడి విజ్ఞప్తి మేరకు సెలవు పొడిగించినట్లు ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లి గోప్యతకు భంగం కలగకుండా.. అతడు తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని జట్టు ప్రకటించిన సందర్భంలో తెలిపింది. మాట మార్చిన డివిలియర్స్ మరోవైపు.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ధ్రువపరిచిన సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ తర్వాత మాట మార్చాడు. తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానని.. కోహ్లి దంపతులను క్షమాపణ కోరాడు. దీంతో అసలు కోహ్లి కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. విరుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలంటూ వదంతులు ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్ వారి ఆందోళనను రెట్టింపు చేసేలా పోస్ట్ పెట్టారు. ఏబి డివిలియర్స్ విరుష్క జోడీ గురించి చెప్పింది నిజమే.. కానీ అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని.. అందుకే వాళ్లు విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని సదరు పోస్ట్ సారాంశం. ఈ క్రమంలో అనుష్క శర్మ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాంటి బ్యాడ్‌న్యూస్ వినాలనుకోవడం లేదంటూ విరుష్క కోసం తాము ప్రార్థిస్తామని పేర్కొంటున్నారు. ఊరట కలిగించే అప్డేట్ మరోవైపు.. తాజాగా ఓ బీసీసీఐ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ ఇచ్చిన అప్డేట్ విరాట్ కోహ్లి అభిమానులకు ఊరట కలిగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని.. జట్టుతో తిరిగి చేరతాడని సదరు అధికారి పేర్కొనడం విశేషం. దీంతో అంతా బాగుంది గనుకే కోహ్లి తిరిగి మైదానంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. తర్వాత రాంచి(ఫిబ్రవరి 23 నుంచి)లో నాలుగో, ధర్మశాల(మార్చి 7 నుంచి) ఐదో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
తూచ్.. అంతా అబద్ధం: కోహ్లి విషయంలో డివిలియర్స్ యూటర్న్
AB de Villiers Apology For Spreading False Information: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట మార్చాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల గురించి తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానంటూ బాంబు పేల్చాడు. కోహ్లి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలు చూపుతూ తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి కుటుంబ సభ్యుల గురించి వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వదంతులు అతడి భార్య అనుష్క గర్భవతి అని.. అందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యానే అతడు ఆటకు దూరమయ్యాడని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, తమ తల్లి సరోజ్ ఆరోగ్యంగానే ఉందని కోహ్లి సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన యూట్యూబ్ చానెల్లో డివిలియర్స్ మాట్లాడుతున్న సందర్భంలో కోహ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘కోహ్లి బాగానే ఉన్నాడు. కోహ్లి దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’’ అని ఏబీడీ తెలిపాడు. దీంతో కోహ్లి- అనుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతా అబద్ధం.. నేనన్న మాటల్లో నిజం లేదు ఏబీ డివిలియర్స్ ఈ వార్తను ధ్రువీకరించాడంటూ పలు వార్తా సంస్థలు కూడా ప్రముఖంగా కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నిజానికి నా యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఆరోజు నేను ఓ పెద్ద తప్పు చేశాను. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా అతడు బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా. ఆట నుంచి తను ఎందుకు విరామం తీసుకున్నాడో తెలియదు. అయితే, మరింత రెట్టించిన ఉత్సాహంతో.. సరికొత్తగా కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టుకు కోహ్లి తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ మొదలుకానుంది. చదవండి: మహా క్రీడా సంబరం: విశాఖలో ఫైనల్ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు! ముగింపు వేడుకలు ఆరోజే -
Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం
ABD- Virat Kohli-Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి గల కారణం వెల్లడైంది. సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్‌మెషీన్‌కు లేదంటూ కింగ్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు ఏబీడీ. మా అమ్మ బాగానే ఉన్నారు కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ.. హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి కోహ్లి వైదొలిగినట్లు తెలిపింది. అయితే, ఇందుకు గల కారణం గురించి స్పష్టతనివ్వకపోవడంతో కోహ్లి కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చెందాయి. గర్భవతి అయిన భార్య కోసం సమయం వెచ్చించేందుకు కోహ్లి బ్రేక్ తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్యం వల్లే సెలవులో ఉన్నాడని ఇంకొందరు.. బీసీసీతో విభేదాల వల్లే ఇలా అని మరికొందరు నెట్టింట ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి.. తమ తల్లి సరోజ్ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఏబీ డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు. అవును.. మళ్లీ తండ్రికాబోతున్నాడు కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. ‘‘తను బాగున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని నేను అనుకుంటున్నా. కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు తను కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది విరాట్.. ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమో. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విరాట్ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దు’’ అని స్పష్టం చేశాడు. Ab De Villiers said - "Virat Kohli and Anushka Sharma expecting their second child, so Virat Kohli is spending his time with his family". (On ABD YT)#viratkohli #anushkasharma pic.twitter.com/XDqx76ZfeX — 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) February 3, 2024 వామికకు తోబుట్టువు రాబోతోంది కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు విరాట్ కోహ్లి. వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించగా.. రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని డివిలియర్స్ వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడేమో అన్న సందిగ్దానికి తెరపడినట్లయింది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు
Ind vs Eng Virat Kohli: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నుంచైనా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తాడా? జట్టుతో చేరతాడా? లేదా? అన్న అంశం మీద క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఢిల్లీ బ్యాటర్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, ఆ కారాణాలు ఏమిటన్న దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కోహ్లి, అతడి కుటుంబం గురించి వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే దూరంగా ఉన్నాడా? ‘‘ప్రస్తుతం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడు’’ అని కొందరు.. ‘‘లేదు.. కోహ్లి తల్లి సరోజ్ అనారోగ్యం వల్లే అతడు ఆటకు దూరమయ్యాడు’’ అని ఇంకొందరు ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లి తాజాగా స్పందించాడు. తమ తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ దుష్ప్రచారాన్ని ఖండించాడు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు ‘‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారమవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. మా అమ్మ పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియకుండా దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా వికాస్ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. కాగా ఢిల్లీలో జన్మించిన విరాట్ తల్లిదండ్రుల పేర్లు సరోజ్- ప్రేమ్ కోహ్లి. విరాట్‌కు అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. భావనా ఎంటర్ప్రెన్యూర్ కాగా.. వికాస్ కూడా వ్యాపారరంగంలో ఉన్నట్లు సమాచారం. కాగా టీమిండియా.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కోహ్లి పేరు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం ధ్రువీకరించింది. విశాఖలో విజయం కోసం ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. విశాఖపట్నం మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి ఈ టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. మరోవైపు.. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి స్టార్లు కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. View this post on Instagram A post shared by Vikas Kohli (@vk0681) -
Ind vs Eng Tests: కోహ్లి రీఎంట్రీ డౌటే!.. అసలు కారణాలేంటి?
Ind vs Eng Test Series 2024: బజ్‌బాల్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపు జెండా ఎగురవేసింది ఇంగ్లండ్. హైదరాబాద్ మ్యాచ్‌లో ఆరంభంలో తడబడ్డా ఆఖరికి విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఊహించని రీతిలో ఓటమిపాలైన రోహిత్ సేనకు రెండో టెస్టుకు ముందే మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సహా కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఆ ముగ్గురికి పిలుపు ఈ నేపథ్యంలో వైజాగ్‌లో జరిగే టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు పిలుపు వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు కూడా జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం సెలక్టర్లు మంగళవారం(జనవరి 30) భేటీకాన్నుట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కోహ్లి రీఎంట్రీ ఇస్తాడా.. అసలు ఎందుకు దూరమయ్యాడు? అయితే, కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి దూరమయ్యాడని మేనేజ్మెంట్ చెప్పినప్పటికీ.. అందుకు గల అసలు కారణంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలంటూ రూమర్లు వస్తున్నప్పటికీ.. అవన్నీ వట్టి పుకార్లే అని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఈ క్రమంలో.. భార్య అనుష్క శర్మ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వ్యక్తిగతంగా ఆమెకు దగ్గరగా ఉండేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు అంటున్నారు. కాగా అనుష్క ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ ఇప్పటికే కొన్ని ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఏదేమైనా కోహ్లి ఆఖరి మూడు టెస్టులకు అందుబాటులోకి రాకుంటే టీమిండియాకు మాత్రం తిప్పలు తప్పవు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: విరాట్‌ను చూసి నేర్చుకోవాలి: కోహ్లిపై రోహిత్ శర్మ ప్రశంసలు -
ఈ హీరోయిన్‌కు విరాట్ బావ అవుతాడట! కోహ్లి గురించి ఏమందంటే?
'చి.ల.సౌ.' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది రుహానీ శర్మ. ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. వెంకీ మామకు అభిమానిని తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఈ బ్యూటీ తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నేను చిన్నప్పటినుంచి వెంకీ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. సైంధవ్‌లో నటించాక ఆయనకు ఇంకా పెద్ద అభిమానిగా మారాను. ఇప్పుడాయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచి డాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు సైంధవ్‌లో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. అక్కడున్న విలేఖరి.. అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది. విరాట్ బావ ెలా ుంటాడంటే? ఇది విని అవాక్కైన హీరోయిన్.. 'నేను ఈ విషయం గురించి ఎప్పుడూ, ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు. గోప్యంగానే ఉంచాను. మీకెలా తెలిసింది? అడిగారు కాబట్టి చెప్తున్నా.. అవును, అనుష్క నాకు సోదరి అవుతుంది' అని చెప్పింది. దీంతో విలేఖరి.. 'అనుష్క అక్క అంటే విరాట్ కోహ్లి బావ అవుతాడు.. మీ బావ మీతో ఎలా ఉంటాడు?' అని అడిగింది. రుహానీ మాట్లాడుతూ.. 'విరాట్ నాతో చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చింది. రుహానీ శర్మకు విరాట్- అనుష్క దగ్గరి బంధువులే అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చదవండి: 'విక్రమ్‌కు అస్సలు నటించడమే రాదు'.. నటి భర్త, డైరెక్టర్ సంచలన కామెంట్స్! -
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్‌లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్‌లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్‌లు.. శిఖర్‌ధావన్: అప్‌స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్‌కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్‌ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు. -
మనసంతా నువ్వే.. నీపై నా ప్రేమ అనంతం.. కోహ్లి పోస్ట్ వైరల్
Virat Kohli- Anushka Sharma Cut Cake On Their 6th Wedding Anniversary: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా మనసంతా నువ్వే... నీపై నా ప్రేమ అనంతం’’ అన్న చందంగా ఎమోజీలతో భార్య పట్ల తన భావాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడీ రన్‌మెషీన్. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు. నాడు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా.. అనుష్క నుదిటిన సింధూరం దిద్ది భార్యగా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు కోహ్లి. పబ్లిసిటీకి దూరంగా అప్పటి నుంచి విరుష్క జోడీ మరింత పాపులర్ అయింది. ఇక పెళ్లినాటికే విరాట్ టీమిండియా కెప్టెన్‌గా.. అనుష్క కూడా బీ-టౌన్లో హీరోయిన్గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను సీక్రెట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఇక వివాహ సమయంలో విరుష్క సవ్యసాచి డిజైన్ చేసిన పేస్టల్ కలర్ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో విరాట్ అనుష్కను పెళ్లాడాడు. వీరి పరిణయం సందర్భంగా పంజాబీ సింగర్ హర్ష్‌దీప్ కౌర్ తన గాత్రంతో అద్భుతమైన పాటను ఆలపించింది. ‘పీర్ వి తూ’(పవిత్రమైన ప్రేమ అన్న అర్థంలో) అంటూ సాగే ఈ గీతం విరుష్క జోడీకి చక్కగా సరిపోయిందంటూ అప్పట్లో ప్రశంసలు కురిశాయి. ఇక విరాట్ -అనుష్క ఆరో పెళ్లి రోజు సందర్భంగా హర్ష్‌దీప్ కౌర్ మరోసారి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అనుష్క సైతం తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా విరుష్క జంటకు కుమార్తె వామిక సంతానం. సౌతాఫ్రికా టూర్‌తో రీఎంట్రీ ఇక వన్డే వరల్డ్‌కప్-2023 టాప్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. డిసెంబరు 26 నుంచి టీమిండియా- సౌతాఫ్రికా ఆడబోయే తొలి టెస్టులో అతడు భాగం కానున్నాడు. మరోవైపు అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని.. విరుష్క జోడీ రెండోసారి తల్లిదండ్రులు కానున్నానరే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Harshdeep Kaur (@harshdeepkaurmusic) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
#Virushka: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ పెళ్లి బంధానికి ఆరేళ్లు (ఫొటోలు)
-
#Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఇటలీలోని టస్కనీ వేదికగా ‘విరుష్క’ వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్- అనుష్క ఒక్కటయ్యారు. షాంపూ యాడ్ ద్వారా 2013లో పరిచయమైన వీరిద్దరు చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సెలబ్రిటీల లాగే వీరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ వదంతులు వ్యాప్తి చేసిన వారి మాటలను నీటి మూటలు చేస్తూ విరుష్క వెడ్లాక్తో ముడిపడిపోయారు. కాగా విరాట్- అనుష్క జోడీ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా .. రహస్యంగా పెళ్లి తంతు ముగించేశారు. విరాట్ కాదు రాహుల్! ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్‌తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్- తాను ఒక్కటయ్యామని తెలిపింది. అంతేకాదు విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్ కాకుండా నకిలీ పేరు వాడినట్లు వెల్లడించింది. ‘‘మేము నిరాడంబరంగా.. హోమ్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మొత్తం ఆరోజు 42 మంది ఉన్నారు. అదొక సెలబ్రిటీ జంట పెళ్లిగా కాకుండా.. కేవలం విరాట్- అనుష్కల పెళ్లిలా ఉండాలని కోరుకున్నాం. అంతేకాదు కేటరర్ విషయంలో విరాట్ పేరు బయటికి రాకుండా అతడికి ‘రాహుల్’ అనే నకిలీ పేరును వాడాం. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించాం. అందుకే హంగూఆర్భాటాలు లేకుండా పవిత్రత, శాంతితో కూడిన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపింది. అప్పటికే టీమిండియా కెప్టెన్‌గా విరాట్ పెళ్లినాటికి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి- నటిగా అనుష్క శర్మ తమ కెరీర్లో తారస్థాయిలో ఉన్నారు. అయితే, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీడియాకు దూరంగా వామిక ఇక ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించింది. పాపకు వామికా కోహ్లిగా నామకరణం చేసిన విరుష్క... ఇంతవరకు ఆమె ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా.. స్టార్ కిడ్‌గా కాకుండా సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఇప్పటికే విరుష్క జోడీ వెల్లడించింది. రికార్డుల రారాజు.. వరల్డ్‌కప్ ఓటమితో కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2023 టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెలవులు తీసుకున్న కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్ టూర్‌కు వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రన్‌మెషీన్ డిసెంబరు 26న మైదానంలో దిగే అవకాశం ఉంది. చదవండి: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది........ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!.. -
భారత్ ఓటమి.. విరాట్, అనుష్క హార్ట్ బ్రోకెన్ ఫోటో వైరల్
క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరి పోరాటంలో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ప్రపంచ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కంగారూ జట్టు.. ఎక్కడా కూడా తడబాటు పడకుండా తమ ప్లాన్‌ను అమలుచేసింది. దీంతో దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది. 2003 తర్వాత అదే జట్టుతో ఫైనల్ ఫైట్ మళ్లీ ఎదురైంది.. అప్పటి ఓటమి లెక్కలు సరిచేసి ఇప్పుడు గెలిచి రివేంజ్ తీర్చుకుంటారనుకుంటే... మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్ సమరం ఓటమితో ముగిసింది. భారత్ ఓటమితో విరాట్ కోహ్లీ తీవ్రమైన నిరుత్సాహానికి గురైయాడు.. ఆ సమయంలో విరాట్‌కు ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ ఆనుష్క శర్మ అండగా నిలబడింది. విరాట్‌ను దగ్గరకు తీసుకుని ఎంతో ఉద్వేగంతో కౌగిలించుకుని ఓదార్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమ్ ఇండియా ఓటమి తర్వాత అనుష్క కూడా గుండె పగిలినట్లు కనిపించింది. అయితే, మ్యాచ్ తర్వాత ఆమె భర్త విరాట్‌కు పూర్తి మద్దతుగా నిలిచి ధైర్యాన్ని నింపేలా ఓదార్చింది.నెటిజన్లు ఈ జంటపై ప్రేమను కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భర్తకు ఇలా సపోర్ట్ చేయడం ఎంతో అవసరమని మరోకరు తెలిపారు. బాలీవుడ్ నటి అనుష్క విరాట్‌కు మద్దతు ఇచ్చే విధానం క్రికెట్,సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్ ఓటమిని పలువురు సెలబ్రిటీలు కూడా జట్టుకు తమ తిరుగులేని మద్దతును తెలిపారు. షారుక్ ఖాన్ కాజోల్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్, ఆయుష్మాన్ ఖురానా . ప్రతి ఒక్కరూ భారత్ ఓటమిపై తమ బాధను వ్యక్తం చేశారు. అయితే టోర్నమెంట్లో భారత జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. అనుష్క శర్మ తదుపరి చిత్రం 'చక్దా ఎక్స్‌ప్రెస్' (Chakda 'Xpress) చిత్రంతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహింస్తున్నారు. What a tragedy! @AnushkaSharma and @theathiyashetty must be devastated beyond words. Life's just so unfair, isn't it? 😔 pic.twitter.com/WcIBMJnUUH — ⚡ai_Prabha⚡ (@_Prabhas2K01) November 19, 2023 -
మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ
బాలీవుడ్నటి అనుష్క శర్మ మరోమారు గర్భం దాల్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో అనుష్కశర్మ బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అనుష్కకు సంబంధించి తాజా వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆమె గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమెతో పాటు కుమార్తె వామికా కోహ్లీ కూడా ఉంది. ఒక అభిమాని షేర్ చేసిన ఈ వీడియోలో మొదట వామికా కోహ్లీ, తరువాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుంచి తెల్లటి సూట్లో బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్..‘ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ కుమార్తె వామికాతోపాటు అహ్మదాబాద్ చేరుకున్నారు’ అని రాశారు. కాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? అనేది స్పష్టం కా లేదు. నవంబర్ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చూడండి: భారత్-ఆసీస్ ఫైనల్ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే? Anushka Sharma has arrived at Ahmedabad for the finals with Vamika #INDvsAUS #WorldcupFinal#AUSvsSA #SAvsAUS #CWC23#ViratKohli𓃵 #RohithSharma#NarendraModiStadium#anushkasharmapic.twitter.com/U0FsYm6TDs — 𝑴𝑺 𝑭𝑶𝑶𝑻𝑪𝑹𝑰𝑪 ⚽🏏 (@IFootcric68275) November 18, 2023 -
అప్పుడు అందరి కళ్లు అనుష్క శర్మ డ్రెస్ మీదే.. ఎందుకో తెలుసా?
ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ మెస్మరైజ్ ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ఆమె ముంబైకి వచ్చింది. ఆట జరుగుతున్నప్పుడు క్రీజ్‌లో విరాట్ దుమ్ములేపుతుంటే.. స్టాండింగ్‌లో ఉన్న అనుష్క చప్పట్లు కొడుతూ.. అప్పడప్పుడు విరాట్‌కు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ సంతోషంగా కనిపించింది. ఆ సమయంలో కెమెరాలు కూడా ఆమెను పదేపదే స్క్రీన్‌పై చూపించాయి. తాను మైదానంలో వేలాదిమంది మధ్యలో ఉన్నానని సంగతి మర్చిపోయి, ఎంతో ఉత్సాహంతో ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేసింది. వాంఖడే స్టేడియంలో విరాట్ ఆట ఎంత హిట్టో.. ఆ సమయంలో ఉత్సాహంగ కనిపించిన అనుష్క నవ్వులు కూడా అంతే హిట్ అయ్యాయి. అప్పుడు అందరి దృష్టి ఆమె డ్రెస్‌పై పడింది. అనుష్క ఈ మ్యాచ్ కోసం కో-ఆర్డ్ సమిష్టిలో అద్భుతంగా కనిపించింది. అనుష్క ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు, కానీ ఆమె తన స్టైలిష్ ప్రదర్శనలతో తన అభిమానులను ఎలా ఆకర్షించాలో ఖచ్చితంగా తెలుసు. ఆకుపచ్చ పూల డిజైన్లతో ఉన్న షర్ట్‌లో ఆమె చాలా అందంగా కనిపించింది. అనుష్క శర్మ దుస్తులు ధృవ్ కపూర్ లేబుల్ నుంచి వచ్చాయి. ఫ్లోరల్ డిజైన్‌తో కూడిన ఆ షర్ట్ ధర రూ.19,500 కాగా షర్ట్, మ్యాచింగ్ షార్ట్‌లతో కూడిన కో-ఆర్డ్ సెట్ మొత్తం కావాలంటే రూ. 27,500 అని తెలుస్తోంది. తాజాగా విరాట్ చేసిన సెంచరికి ఒక ప్రత్యేకత ఉంది. 50 సెంచరీలతో టాప్ ప్లేస్‌లోకి చేరడం.. ఆ సమయంలో అనుష్క ఇచ్చిన ఫ్లయింగ్ కిస్‌లు ఇలా అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో అనుష్క ధరించిన డ్రెస్ ఎంత ఉండవచ్చని సోషల్ మీడియాలు భారీగా కామెంట్లు వస్తున్నాయి. -
CWC 2023: మా ఆయన దేవుడి బిడ్డ.. కోహ్లి సతీమణి భావోద్వేగం
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి 50 వన్డే సెంచరీలు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విరాట్ ఈ ఘనత సాధించిన అనంతరం అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ కోహ్లి! నీ తలరాతను గొప్పగా రాశాడు. నీ ప్రేమను దక్కించుకున్న నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్ను చూస్తుంటే, నీ ప్రదర్శనను గమనిస్తుంటే నాకనిపిస్తుంది. ఆడేకొద్దీ, పెరిగే కొద్దీ నీ సత్తా సామర్థ్యం పెరుగుతోంది. ఆటకోసం నిరంతరం నిజాయితీగా శ్రమించే నీవు నిజంగా దేవుడి బిడ్డవే’ అంటూ భావోధ్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగో సారి వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అనంతరం నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించి ఎనిమిదో సారి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్‌ల మధ్య నవంబర్ 19న తుది సమరం జరుగనుంది. -
CWC 2023: ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ.. కష్టంగా ఉంది: కోహ్లి
ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్‌కతాలో కూడా చెప్పాను కదా!.. ఓ గొప్ప వ్యక్తి నన్ను అభినందించారు. ఇప్పుడు కూడా ఇదంతా ఓ కలలానే ఉంది. నిజానికి కల నిజమైనట్లు ఉంది. ఏంటో నాకే కొత్తగా ఉంది. ఈరోజు కూడా కీలక మ్యాచ్.. ఇందులో నా వంతుగా ఏం చేయాలో అది చేశాను. సింగిల్స్, డబుల్స్.. ఏదైనా జట్టు కోసమే నా సహచర ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అన్నీ అనుకూలించి ఈరోజు మేము భారీ స్కోరు చేయగలిగాం. జట్టును గెలిపించాలన్నదే నా అంతిమ లక్ష్యం. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. సింగిల్స్, డబుల్స్.. బౌండరీలు.. ఏదైనా జట్టు నా నుంచి ఆశిస్తున్న ప్రదర్శనకు అనుగుణంగానే ఆడతాను. నా శక్తిసామర్థ్యాల మేరకు అత్యుత్తమ ఆట తీరుతో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటా. ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ ఇక ఈరోజు నా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే.. అనుష్క, సచిన్ పాజీ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఈ ఫీలింగ్‌ను ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ఓ పరిపూర్ణ ఛాయాచిత్రం గీయాలనుకుంటే.. బహుశా అది ఇదేనేమో! నేను అత్యంత ప్రేమించే వ్యక్తి.. నా జీవిత భాగస్వామి అనుష్క.. నా హీరో సచిన్ టెండుల్కర్.. వీళ్లిద్దరి ముందు నేను వన్డేల్లో 50వ శతకం సాధించగలగడం.. అది కూడా చారిత్రాత్మక వాంఖడేలో.. ఇంతకంటే అత్యద్భుతం ఏముంటుంది?! అందరూ బాగా ఆడినందు వల్లే ఈరోజు మేము నాకౌట్ మ్యాచ్‌లో 400 పరుగుల స్కోరుకు చేరువగా వచ్చాం. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.. షాట్లు బాదాడు.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టాప్‌లో శుబ్‌మన్, రోహిత్ అద్భుతం చేశారు. కేఎల్ రాహుల్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు’’- వన్డేల్లో 50 సెంచరీల వీరుడు, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ముంబైలోని వాంఖడేలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(47), శుబ్‌మన్ గిల్(80- నాటౌట్).. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డు సెంచరీతో మెరిశాడు. సచిన్ రికార్డు బద్దలు ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ గండాన్ని దాటి 117 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా 80వ శతకం సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 50వ సెంచరీ. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఫైనల్‌కు చేరువయ్యేందుకు మరోవైపు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సైతం శతకం(105) బాదాడు. ఐదో నంబర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రోహిత్ సేన 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. తన రికార్డు సెంచరీ సమయంలో కలిగిన భావోద్వేగాలు, జట్టు భారీ స్కోరు సాధించిన విధానం గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
IND VS NED: విరాట్ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేస్తుండటంతో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు స్కోర్ 38 ఓవర్లు ముగిసిన అనంతరం 173/6గా ఉంది. ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలిచే అవకాశాలు లేవు. pic.twitter.com/tuz5dcN5Tw — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) November 12, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో టీవీల్లో తారసపడిన పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సూపర్ టచ్‌లో కనిపించిన విరాట్ కోహ్లి 51 పరుగుల వద్ద వాన్ డర్ మెర్వ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో అతని భార్య అనుష్క శర్మ ముఖంలో కనిపించిన హావభావాలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. కోహ్లి 50వ వన్డే సెంచరీ కోసం అతని కంటే అతని భార్య ఎక్కువగా పరితపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే మ్యాచ్‌లో తారసపడిన మరో సన్నివేశం సైతం నెట్టింట హల్చల్ చేస్తుంది. విరాట్ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన అనంతరం అతనికంటే అతని భార్య అనుష్క శర్మనే ఎక్కువగా సంబురాలు చేసుకుంది. ఈ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి విరాట్-అనుష్క వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోలో సైతం వీరిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే, విరాట్ వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును (49) బద్దలు కొట్టేందుకు కేవలం సెంచరీ దూరంలో ఉన్న విషయం తెలిసిందే. -
బేబీ బంప్‌తో అనుష్క.. మరోసారి తండ్రి కాబోతున్న విరాట్
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి దంపతులు మరోబిడ్డకు జన్మనివబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ తమ రెండవ బిడ్డ గురించి అసలు విషయం రివీల్ చేస్తారని చాలారోజుల నుంచి వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారు ఇప్పటి వరకు అధికారికంగా ఆ విషయంపై ఎక్కడా ప్రకటించలేదు. ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్- 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు: రచయిత) తాజాగా అనుష్క తన భర్త విరాట్‌తో కలిసి ఒక హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. అనుష్క తన బేబీ బంప్‌పై చేతులు ఉంచి నడుస్తూ ఉన్నారు. అందులో ఆమె బేబీ బంప్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. దీంతో విరాట్- అనుష్క అభిమానులు దానిని షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఈ జంట ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు వెళ్లారు. ఎందుకు వచ్చామనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పి ఫొటోలు తీయొద్దని కోహ్లి మీడియాను అభ్యర్థించారు. ఆ సమయం నుంచి ఈ వార్తలు ప్రచారంలోనే ఉన్నాయి. తాజాగా అనుష్కకు సంబంధించిన వీడియోలో బేబీ బంప్ చాలా క్లియర్‌గా కనిపించడంతో ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఛోటా విరాట్ రాబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా గతంలో వచ్చిన పుకార్లన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లుగా తెలుస్తోంది. వరల్డ్ కప్ పూర్తి అయిన తర్వాత ఈ విషయంపై విరాట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ విషయంపై విరుష్క జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వారికి 2021లో వామిక జన్మించిన విషయం తెలిసింది. Virushka in Bangalore 🧿💘 pic.twitter.com/feLpF35i09 — Alaska • WC Era🏏 (@alaskawhines) November 9, 2023 -
అలాంటి రికార్డ్ కింగ్ కోహ్లీకి మాత్రమే సాధ్యం.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విరాట్‌కు క్రికెటర్స్, ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం విరాట్ స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశారు. మరో సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంచరీల రికార్డ్‌ను సమం చేయనున్నారు. నవంబర్ 5న కోహ్లీ బర్త్ డే కావడంతో ఆయన భార్య, నటి అనుష్క శర్మ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన భర్తకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో రాస్తూ..'తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడు! కానీ ఏదో ఒక విధంగా నేను కూడా అతని అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నా. నా ఈ జీవితంలో అంతకు మించి ప్రేమిస్తున్నా. అది ఏ రూపంలోనైనా, ఏదైనా కావచ్చు. లవ్ యూ విరాట్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే తన పోస్ట్‌లో కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన ఫోటోను పంచుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క బంతి కూడా వేయకుండా వికెట్ సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అంటూ పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్‌ను అవుట్ చేశాడు. అయితే ఆ బాల్ వైడ్ వెళ్లగా.. ధోని అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. దీంతో ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇలాంటి ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదంటూ అనుష్క శర్మ తన భర్తపై ప్రేమను కురిపించింది. ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. (ఇది చదవండి: హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!) కాగా.. అనుష్క, విరాట్ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట జనవరి 2021లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించారు. తమ ముద్దుల కూతురికి వామిక అని పేరు పెట్టారు. సినిమాల విషయాకొనిస్తే అనుష్క శర్మ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
స్నేహితులకు ముఖ్య గమనిక.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు నన్ను టికెట్లు అడగొద్దు: కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన స్నేహితులందరికీ ఓ ఇంపార్టెంట్ మెసేజ్‌ను పాస్ చేశాడు. త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు సంబంధించి, తనను ఎవరూ టికెట్లు అడగ వద్దని విన్నవించుకున్నాడు. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికి టికెట్లు దొరకపోతే, ఇంట్లో కూర్చొని హాయిగా టీవీల్లో మ్యాచ్‌లు చూడాలని సూచించాడు. ఈ మెసేజ్‌ను కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా, గతంలో కొందరు స్టార్ క్రికెటర్లకు ఎదురైన అనుభవాల దృష్ట్యా విరాట్ తన స్నేహితులకు ఈమేరకు నిర్ధేశకం చేసినట్లు తెలుస్తుంది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్‌కప్ సందర్భంగా కొందరు భారత స్టార్ క్రికెటర్లు తమ స్నేహితుల నుంచి టికెట్ల కోసం తారా స్థాయిలో విన్నపాలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వారు అప్పట్లో చాలా సందర్భాల్లో మీడియాతో షేర్ చేసుకున్నారు. సదరు క్రికెటర్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కోహ్లి ఈ మెసేజ్‌ను సోషల్‌మీడియా ద్వారా తన స్నేహితులతో పంచుకున్నాడు. మరోవైపు కోహ్లి షేర్ చేసిన మెసేజ్‌ను అతని భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా తన ప్రొఫైల్ ద్వారా షేర్ చేసింది. కోహ్లి సమాధానం ఇవ్వకపోతే టికెట్ల కోసం తనను అభ్యర్థించవద్దని ఆమె కూడా వేడుకుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటు అనుష్క తన ప్రొఫైల్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్ 5) వన్డే వరల్డ్‌కప్ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. వరల్డ్‌కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
WC 2023: కేరళలో టీమిండియా.. ముంబైకి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే!
ICC World Cup 2023- India vs Netherlands Warm Up Match: వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కేరళకు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్నాహక మ్యాచ్ ఆడేందుకు తిరువనంతరపురంలో అడుగుపెట్టింది. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం భారత జట్టుతో లేకపోవడం గమనార్హం. గువాహటిలో తొలి వార్మప్ మ్యాచ్ వర్షార్పణమైన అనంతరం అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లంతా ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరారు. పర్సనల్ ఎమర్జెన్సీ కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి ముంబైకి వెళ్లినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ధ్రువీకరించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. అయితే, సోమవారం నాటికి అతడు తిరిగి జట్టుతో చేరతాడని వెల్లడించింది. భార్య అనుష్కను చూడటానికే.. విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మను కలిసేందుకే గువాహటి నుంచి నేరుగా ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సెలబ్రిటీ జంట త్వరలోనే తమ రెండో సంతానానికి జన్మనివ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హఠాత్తుగా ఇలా కోహ్లి ఇంటికి వెళ్లడం చూస్తుంటే విరుష్క శుభవార్త చెప్పడం ఖాయమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి 2017లో ఆమెను పెళ్లాడాడు. డచ్ జట్టుతో మ్యాచ్ కూడానా? ఈ జంటకు 2021 , జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మరోసారి అనుష్క గర్భం దాల్చిందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. ఇక తిరునవంతరపురంలోనూ ఇదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..! #WATCH | Thiruvananthapuram: Indian Cricket team arrive at Trivandrum Domestic Airport ahead of the World Cup scheduled to be held between October 5 to November 19. pic.twitter.com/LH1Ra5FhpW — ANI (@ANI) October 1, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 'వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి వన్‌ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మరోసారి గుడ్‌న్యూస్ చెప్పనున్న అనుష్క- కోహ్లీ.. ఆ రోజే ఫిక్స్
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి రంగంలో వారు అగ్రగామిగానే ఉన్నారు. వీరిద్దరి ప్రొఫెషన్ వేరు అయినా మొదట ఓ యాడ్ షూట్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు వారు చెప్పారు. అలా మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. అప్పట్లో వారిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వచ్చినా వాటిని లెక్కచేయకుండా 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే వారిద్దరూ కూడా కెరీర్లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. (ఇదీ చదవండి; Hariteja: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన ఆమె కామెంట్) విరాట్ సీక్రెట్స్‌ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అనుష్క ఫిదా చేస్తే... విరాట్ కూడా పలు ఇంటర్వ్యూలలో అనుష్కను ఆట పట్టిస్తూ తమ లవ్ సీక్రెట్స్‌ను తెలుపుతూ ఉంటాడు. తాజాగా క్యూట్ జంట మరోసారి తల్లిందండ్రులు కానున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతోంది. 2021లో ఈ జోడీకి వామిక జన్మించిన విషయం తెలిసిందే. కానీ ఆ చిన్నారి ఫొటోను ఇప్పటి వరకు సరిగ్గా వారు చూపించింది లేదు. కానీ ఈ దంపతులిద్దరూ పాపతో పలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసినా అందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడేవారు. ఈ క్రమంలో తాజాగా విరాట్, అనుష్క తమ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలుస్తోంది. త్వరలో తమ రెండో సంతనానికి సంబంధించిన వార్తను తమ అభిమానులకు షేర్ చేయనున్నారని సమాచారం. అనుష్క ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే తాము మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని అదికారికంగా విరుష్క జంట ప్రకటించలేదు. నవంబర్ 5న విరాట్ పుట్టినరోజు ఉంది. బహుశా ఆ సందర్భంగా తమ అభిమానులకు ఈ శుభవార్తను చెప్తారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్) -
వాళ్లంతా అంబానీ అంటీలియాలో! కోహ్లి మాత్రం ఆ లీడర్ ఇంట్లో.. వైరల్
Virat Kohli- Anushka Sharma- Gansesh Chatirthi 2023: ఆసియా కప్-2023 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సహా పలువురికి విశ్రాంతి దొరికింది. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు ఆస్ట్రేలియాతో మూడో వన్డేతో వీరంతా మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు రన్‌మెషీన్ విరాట్ కోహ్లి. వినాయక చవితి సందర్భంగా భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి పండుగ జరుపుకొన్నాడు. ముంబైలోని తమ నివాసంలో విరుష్క దంపతులు ఎకో ఫ్రెండ్లీ గణనాథునికి పూజలు చేశారు. వాళ్లంతా అంటీలియాలో హార్దిక్ పాండ్యా, సచిన్ టెండుల్కర్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితరులు.. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట(అంటీలియా) వినాయకుడి పూజలో పాల్గొనగా.. కోహ్లి మాత్రం తమ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక విఘ్నేశ్వరుడి పూజలో కోహ్లి, అనుష్క సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. #WATCH | Indian Cricketer KL Rahul with his wife Athiya Shetty arrive at Mukesh Ambani's residence 'Antilia' in Mumbai to attend Ganesh Chaturthi celebrations #GaneshChaturthi2023 pic.twitter.com/P2t3GXmSCG — ANI (@ANI) September 19, 2023 గోధుమ రంగు ఎరుపు రంగులు మేళవించిన చీర ధరించి అనుష్క నిండుగా కనిపించగా.. కోహ్లి తెలుపు రంగు కుర్తా ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇందుకు స్పందించిన సినీ సెలబ్రిటీలు సమంత రుతుప్రభు, కరిష్మా కపూర్ తదితరులు హార్ట్ ఎమోజీలతో ప్రేమను తెలియజేశారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) కోహ్లి మాత్రం ఆ లీడర్ ఇంట్లో ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి.. శివసేన నాయకుడు రాహుల్ కనాల్ ఇంట్లో గణేశ్ దర్శనానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ కోహ్లి కారెక్కుతుండగా అభిమానులు అతడిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ వీడియోను వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Virat Kohli At Rahul Kanal's Home For Ganpati Darshan.🙏🖤 🎥: @viralbhayani77 #ViratKohli #GaneshChaturthi @imVkohli @Iamrahulkanal pic.twitter.com/IT0FVVQRdX — virat_kohli_18_club (@KohliSensation) September 20, 2023 వన్డే వరల్డ్‌కప్‌కి ముందు కాగా ఆసియా వన్డే కప్-2023లో కోహ్లి పాకిస్తాన్ మీద అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 122 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ స్టార్ బ్యాటర్.. అంతర్జాతీయ కెరీర్లో 77వ సెంచరీ నమెదు చేశాడు. ఇక సెప్టెంబరు 27న ఆసీస్‌తో ఆఖరి వన్డేల్లో మళ్లీ కోహ్లి మెరుపులు చూసే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో అతడు పాల్గొంటాడు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!
సెలబ్రెటీలు ధరించే డ్రెస్‌లు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. వాటి ధర కూడా ఖరీదుగానే ఉంటాయి. క్రికెటర్లనే పెళ్లి చేసుకున్న భాలీవుడ్ భామలు ఇద్దరూ ఒకేలాంటి స్లీవ్లె్లెస్ టాప్‌లు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్‌ని గత నెలలో పెళ్లిబంధంలో ఒక్కటయ్యారు. ఇక అనుష్కా క్రికెటర్ విరాట్‌ని కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి వామిక అను కూతురు కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు ఒకే బ్రాండ్ మాలీకి చెందిన దుస్తులు ధరించారు. అందులో ఇద్దరు తమ అందంతో చూపురులను కట్టిపడేశారు. అయితే వారు ధరించి ఆ షార్ట్ టాప్ల ధర వింటే షాకవ్వడం ఖాయం. సెలబ్రెటీలు దరించేవి చాలా ఖరీదైనవే అయినప్పటికీ..కొన్ని దుస్తులుకు ఇంతపెట్టారా అనే ఫీల్ వస్తుంది. అది సహజం. ఏ చీర లేదా లెహంగా అంత ధర ఉందంటే ఓకే చిన్న షార్ట్ లాంటి టాప్ ఏకంగా రూ. 18000/ అంటే నిజమేనా? అనిపిస్తుంది కదా! కానీ బ్రాండ్లకు పెట్టింది పేరు అయిన మలై బ్రాండ్ ధరలు ఎక్కువనే చెప్పాలి. ఆయా ఫ్యాషన్ కాస్ట్యూమ్‌లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అతియా శెట్టి గూలాబీ రంగు స్లీవ్‌లెస్ టాప్, జీన్స్ ఫ్యాంట్లో అదర్సు అన్నట్లు ఉంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) చక్కటి ఈయర్ రింగ్స్, మ్యాచింగ్ లిప్‌స్టిక్‌తో మంచి లుక్‌తో ట్రెండీగా ఉంది అతియా. ఇక అనుష్క శర్మ కూడా సేమ్ అదే మాదిరి పసుపు రంగు టాప్‌లో చూడచక్కగా ఉంది. కంఫర్ట్ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే అనుష్క రెండు నెలల క్రితం ఈ టాప్‌ని ధరించిన ఫోటోని నెట్టింట షేర్ చేసింది. ఇప్పుడూ అతియా అదే టాప్ వేసుకోవడంతో నెలక్రితం నాటి అనుష్క ఫోటోతో కలిపి అతియా ఫోటో నెట్టింట సందడి చేయడం. దీంతో నెటిజన్లు మీ భుజాలను కవర్ చేసేలా డ్రస్‌లు వేయకూడదనుకుంటున్నారా అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్ట్‌లు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: పండుగ వేళ ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!) -
రూ.19 కోట్లతో కోహ్లీ లగ్జరీ ఫోమ్ హౌస్
-
కోహ్లి బావ గురించి తెలుసా? వందల కోట్లు పెట్టి..
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి, అతని భార్య అనుష్క శర్మ గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ కోహ్లీకి స్వయానా బావ, అనుష్క శర్మ అన్న 'కర్నేష్ శర్మ' (Karnesh Sharma) గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇతడు ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కూడా. రూ. కోట్లలో సంపాదిస్తున్న కర్నేష్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లీన్ స్లేట్ ఫిలింజ్.. బాలీవుడ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన కర్నేష్ శర్మ తన చెల్లెలు అనుష్క శర్మతో కలిసి 2013లో క్లీన్ స్లేట్ ఫిలింజ్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇది అతి తక్కువ సమయంలోనే మంచి హిట్ కొట్టి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. ఫిలౌరీ, NH10 సహా పలు హిట్ చిత్రాలను కూడా ఇందులోనే నిర్మించారు. నిజానికి కర్నేష్ శర్మ విజయ ప్రస్థానం అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్10తో ప్రారంభమైంది. రూ.30 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్దగా రాణించలేదు, కానీ ఆ తరువాత మంచి యాక్షన్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఫిలౌరీ, పారి, బుల్బుల్ వంటివి కూడా మంచి హిట్స్ అందించాయి. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) కర్నేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఖాలా (Qala) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈయన తరువాత చిత్రం 'చక్‌దే ఎక్స్‌ప్రెస్'. ఇది ఇండియన్ క్రికెటర్ 'ఝులన్ గోస్వామి' జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. (ఇదీ చదవండి: ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!) నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం.. కర్నేష్ శర్మ అండ్ అనుష్క శర్మల నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 400 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. దీని కింద ఎనిమిది చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు. చివరగా కర్నేష్ శర్మ నికర విలువ దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. -
ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!
బాలీవుడ్ హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోరు. జవాన్ చిత్రంలో నటిస్తోన్న దీపికా పదుకొణె భారీగానే పారితోషికం అందుకోనుంది. సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ వారికి సాధారణంగానే ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నటనతో పాటు బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపారం రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర తారలు చేస్తున్న వ్యాపారాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు బిజినెస్‌లో కూడా జోరు కొనసాగిస్తున్నారు. కొంతమంది నటీమణులు సైడ్ బిజినెస్ చేస్తూ పారిశ్రామికవేత్తలు కూడా రాణిస్తున్నారు. ఈ నటీమణులు తమ సైడ్ బిజినెస్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఆదిపురుష్ భామ కృతి సనన్: ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లో నటించింది. పలు భాషల్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటి కృతి సనన్ ఇటీవలే తన సోదరి నూపూర్‌తో కలిసి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. కాగా.. కృతి సనన్ నిర్మాణ సంస్థ పేరు బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్. తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇదే ప్రొడక్షన్ హౌస్‌లో దో పట్టి సినిమా నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో నటి కాజోల్ కూడా నటిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సీనియర్ నటి సుస్మితా సేన్ సుస్మితా సేన్: మరో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మంచి నటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జ్యువెలరీ బ్రాండ్‌ను కలిగి ఉన్నారు. అంతే కాకుండా తంత్ర ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా ఉన్నారు. సుస్మితకు అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2022 ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం సుస్మితా సేన్ బిజినెస్ టర్నోవర్ విలువ రూ.74 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. విరాట్ భార్య అనుష్క శర్మ అనుష్క శర్మ: బాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నటీమణులలో అనుష్క శర్మ ఒకరు. అనుష్క తన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించింది. ఆమె ప్రొడక్షన్ హౌస్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. అనుష్కకు నుష్ అనే డ్రెస్ బ్రాండ్ వ్యాపారం కూడా ఉంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. సినిమాల్లో కంటే బిజినెస్‌లోనే బాగా రాణిస్తోంది. దీపికా పదుకొణె బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తాజాగా ఆమె షారూక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో కనిపించనుంది. 'ఆల్ అబౌట్ యు' అనే దుస్తుల బ్రాండ్‌ను నడుపుతోంది. అంతే కాకుండా 'లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు కూడా. ఓ కథనం ప్రకారం దీపికా పదుకొణె బిజినెస్ నికర విలువ రూ.498 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు బాలీవుడ్ హీరోయిన్స్‌తో పాటు.. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన పలువురు నటీమణులు సైతం.. సొంతంగా సైడ్ బిజినెస్‌లు చేస్తూ రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు. -
'బయట 'కింగ్' కావొచ్చు.. భార్య ముందు మాత్రం పిల్లే'
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ లీగ్ దశకే పరిమితమైంది. అయితే సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి ప్లేఆఫ్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దీంతో టైటిల్ సాధించాలన్న కోరిక అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇక కోహ్లి మళ్లీ టీమిండియా తరపున వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ డే అంటూ స్టోరీ షేర్ చేశాడు. ఇక కోహ్లికి బయట ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి కోహ్లిని భార్య అనుష్క శర్మ అందరిముందు టీజ్ చేయడం ఆసక్తి కలిగించింది. కోహ్లి లండన్‌కు వెళ్లడానికి ముందు భార్య అనుష్కతో కలిసి పుమా కంపెనీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో బిట్స్ బిట్స్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ ఒక్కటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో భాగంగా యాంకర్ గా ఉన్న వ్యక్తి, కోహ్లీ సెలబ్రేషన్స్ ని ఇమిటేట్ చేసి చూపించమని అనుష్కని అడిగారు. దీంతో అవతల జట్టు వికెట్ పడ్డప్పుడు కోహ్లీ ఎలా బిహేవ్ చేస్తాడనేది అనుష్క ఉన్నది ఉన్నట్లుగా చేసి చూపించింది. కోహ్లీ చూసి నవ్వుకున్నాడు. చెప్పాలంటే ఈ ఈవెంట్ లో అందరిముందే విరాట్ కోహ్లీని అనుష్క ర్యాగింగ్ చేసిందనే చెప్పాలి. ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉంటూనే మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. ఆ తర్వాత కోహ్లి అనుష్క నటించిన బాండ్ బజా బరాత్ సినిమాలోని రణ్‌వీర్‌సింగ్ డైలాగులు చెప్పి అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు కోహ్లి బయట కింగ్ కావొచ్చు.. కానీ భార్య అనుష్క ముందు మాత్రం పిల్లే అంటూ కామెంట్ చేశారు. Fun moments between Virat Kohli and Anushka Sharma. Anushka imitating Virat's celebration was the best! pic.twitter.com/e3ono4oXlG — Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2023 చదవండి: సచిన్‌తో గిల్ ముచ్చట.. పండగ చేసుకున్న గాసిప్ రాయుళ్లు -
ఇట్లుంటరన్నమాట!
మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో చూడడానికి ఫొటో ఆల్బమ్‌లు ఉన్నాయి. మరి వయసు పైబడిన తరువాత ఎలా ఉంటామో చూడడానికి ఏమీలేవు. ‘ఎందుకు లేవు’ అంటూ రంగంలోకి దిగాడు ఏఐ ఆర్టిస్ట్ షాహిద్. ‘మిడ్‌జర్నీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బాలీవుడ్ అందాల కథానాయికలు దీపిక పదుకోణ్, కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ.. .మొదలైన వారిని బామ్మలుగా మార్చేశాడు. ‘వావ్ రే వావ్’ అంటూ ఈ ఫొటోలు నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి కొందరు తత్వంలోకి దిగి ఇలా అన్నారు... ‘భౌతిక అందం అశాశ్వతం. అంతఃసౌందర్యమే శాశ్వతం’ -
#ViratKohli: అనుష్కకు వీడియోకాల్.. కోహ్లి ఎమోషనల్
ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కింగ్ కోహ్లి 62 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్లో సెంచరీ సాధించి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్లో ఆరో సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు బాదిన గేల్ రికార్డును సమం చేశాడు. తన సెంచరీతో జట్టు గెలవడంతో పాటు కీలకమైన ప్లేఆఫ్ రేసులో ఆర్సీబీ నిలవడం కోహ్లికి తెగ సంతోషాన్నిచ్చింది. అందుకే మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులతో పాటు అభిమానులతో కోహ్లి తన సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా వీడియో కాల్ మాట్లాడుతూ కోహ్లి ఎమోషనల్ అయినట్లు అనిపించింది. కోహ్లి సెంచరీ చేసిన సమయంలో అనుష్క స్టేడియంలో ఉండుంటే ఆ ఫీల్ వేరుగా ఉండేదని అభిమానులు పేర్కొన్నారు. అయితే అనుష్క తన భర్త కోహ్లి సాధించిన ఘనతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ''He Is Bomb.. What An Innings My Love..''అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ఈ స్వీట్ కపుల్ తమ చర్యతో మరోసారి అభిమానులకు సంతోషాన్ని పంచారు. ఇక నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ హోంగ్రౌండ్లో ఆడుతున్నప్పటికి ఆ ఫీల్ ఎక్కడా కలగలేదు. ఎందుకంటే మ్యాచ్‌కు వచ్చినవారిలో ఎక్కువమంది అభిమానులు ఆర్సీబీకే మద్దతిచ్చారు. దీంతో మ్యాచ్ జరుగుతుంది బెంగళూరు లేదా హైదరాబాద్ అన్న అనుమానం కూడా వచ్చింది. Virat talking to Anushka Sharma on video call after the match, I wish she would also come to the stadium today to cheer Virat #ViratKohli𓃵 #ViratKohli #anushkasharma #RCBvsSRH pic.twitter.com/wParcOuvvP — Akshay Kumar (@AkshayK63721592) May 18, 2023 Job well done in Hyderabad ✅ pic.twitter.com/PjhKVupn2C — Virat Kohli (@imVkohli) May 18, 2023 A magnificent CENTURY by Virat Kohli 🔥🔥 Take a bow, King Kohli! His SIXTH century in the IPL.#TATAIPL #SRHvRCB pic.twitter.com/gd39A6tp5d — IndianPremierLeague (@IPL) May 18, 2023 చదవండి: Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి! -
బాడీగార్డ్ బైక్‌పై అనుష్క శర్మ చక్కర్లు... చలాన్ వేసిన పోలీసులు
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి అటు సినిమా, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'రబ్ నే బనాదే జోడీ' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ పలు సినిమాలు చేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తున్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. తన కారు ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనుష్క బైక్‌ను ఆశ్రయించింది. బైక్‌పై తన బాడీగార్డ్‌తో కలిసి లొకేషన్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె, డ్రైవర్ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనిపై ముంబై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అనుష్క బాడీగార్డ్ కమ్ డ్రైవర్ సోనూ షేక్‌కు రూ.10,500 జరిమానా విధించామని, ఆ డబ్బులు మొత్తం చెల్లించేశారని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఈ మధ్యే బిగ్ బీ అమితాబ్ కూడా హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించారు. ఆయనకు రూ.1000 జరిమానా విధించగా ఆ మొత్తాన్ని చెల్లించేశారని పోలీసులు ట్వీట్ చేశారు. Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T — Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023 చదవండి: 11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్లానని తిట్టారు: యాంకర్ శ్యామల -
ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్‌తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి . ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్‌పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్‌తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా 23 వేల ఇన్‌స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్‌తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్‌బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్‌గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
బాలీవుడ్ స్టార్స్ ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్ ఇదే!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ బైక్ రైడ్‌పై ముంబయి పోలీసులు స్పందించారు. అమితాబ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెళ్లారు. అయితే బైక్‌పై ఇద్దరు ఎలాంటి హెల్మెట్ లేకుండా కనిపించారు. బైక్‌పై కూర్చొని ఉన్న చిత్రాన్ని బిగ్ బీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై ముంబయి పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (ఇది చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి) మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఎలాంటి హెల్మెట్ లేకుండా బైక్‌పై కనిపించారు. తన బాడీగార్డ్‌తో బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. వాళ్లద్దరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో నెటిజన్స్ వెంటనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలపై ముంబయి పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది. ఇదే కాకుండా బిగ్ బి రిభు దాస్‌గుప్తా మూవీ కోర్ట్ రూమ్ డ్రామా సెక్షన్ 84లో కనిపించనున్నారు. ఆ తర్వాత అతను టైగర్ ష్రాఫ్, కృతి సనన్ చిత్రం గణపత్‌లో కూడా నటించనున్నారు. (ఇది చదవండి: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) మరోవైపు.. అనుష్క చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి జీరోలో కనిపించింది. ఈ ఏడాది ఆమె చక్దా 'ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి సినిమాల్లోకి రానుంది. తన కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. #AnushkaSharma ditches the car and takes a bike ride to travel in the city! pic.twitter.com/jUwiCsyhbJ — Pinkvilla (@pinkvilla) May 15, 2023 We have shared this with traffic branch. @MTPHereToHelp — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) May 15, 2023 -
అమ్మ.. అత్తమ్మ ఫొటోలతో కోహ్లి! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న సచిన్!
Mothers Day 2023- Virat Kohli- Sachin Tendulkar: స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయతకు ప్రతిరూపం అమ్మ. అమ్మంటే అంతులేని అనురాగం. కడుపులో నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డను కంటికి రెప్పలా కాచే దైవం. కడుపున పుట్టిన బిడ్డల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భర్తతో కలిసి అనేకానేక త్యాగాలు చేసి వారు కోరుకున్న జీవితాన్ని ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసే సహనశీలి. అలాంటి మాతృమూర్తి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ముఖ్యంగా అబ్బాయిలు చాలా మంది అమ్మకూచిగానే ఉంటారు. మన టీమిండియా స్టార్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి కూడా ఆ కోవకు చెందినవారే! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మాతృ దినోత్సవం సందర్భంగా అందమైన ఫొటోలను పంచుకున్నారు ఈ సెంచరీల వీరులు. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. ‘‘కృత్రిమ మేధ(AI)తో అద్భుతాలు చేస్తున్న ఈ నవయుగంలో.. ఒక్క అమ్మ(AAI- ఆయి) స్థానాన్ని మాత్రం దేనితో భర్తీ చేయలేం’’ అంటూ తల్లి తనను దీవిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. అద్భుతమైన క్యాప్షన్‌తో అమ్మపై ఉన్న అనంతమైన ప్రేమను చాటుకున్నాడు. అమ్మ.. అత్తమ్మ.. వామిక తల్లి! ఇక విరాట్ కోహ్లి సైతం మదర్స్ డేను పురస్కరించుకుని తన తల్లి సరోజ్ కోహ్లి, అత్తగారు ఆషిమా శర్మల ఫొటోలను పంచుకున్నాడు. వారిద్దరితో పాటు తన సతీమణి అనుష్క శర్మ తమ గారాల పట్టి వామికను ఎత్తుకుని ఉన్న చిత్రాన్ని షేర్ చేస్తూ ఆమెకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. కోహ్లి ఈ మేరకు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్-2023లో కాగా వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మెంటార్‌గా ఉన్న సచిన్.. అదే జట్టు తరఫున తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఈ ఏడాది అరంగేట్రం చేయడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి నేడు (మే 14) రాజస్తాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82*. చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా 'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్ Happy Mother’s Day ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/oXTBkKWeIE — Virat Kohli (@imVkohli) May 14, 2023 In the Age of AI, the one that is irreplaceable will always be A”AI”!#MothersDay pic.twitter.com/p9Ys5CSVcP — Sachin Tendulkar (@sachin_rt) May 14, 2023 -
Cannes Film Festival 2023: కాన్స్ కాలింగ్
బాలీవుడ్ నటి – నిర్మాత అనుష్కా శర్మకు కాన్స్ నుంచి కాల్ వచ్చిందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఈ నెల 16 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో ΄ాల్గొనవలసిందిగా జ్యూరీ నుంచి అనుష్కా శర్మకు ఆహ్వానం అందిందట. ఈ వేడుకల్లో ‘టైటానిక్’ ఫేమ్ హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్తో కలిసి కొందరు మహిళా విజేతలకు అవార్డులు అందిస్తారట అనుష్కా శర్మ. ఇక గతంలో ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకోన్, సోనమ్ కపూర్, ఆలియా భట్ వంటి తారలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈసారీ పలువురు నాయికలు అక్కడ సందడి చేసే చాన్స్ ఉంది. -
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. హీరోయిన్ను పెళ్లాడతాను..!
టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తాను టీమిండియా క్రికెటర్ కావాలని, అలాగే పెద్దయ్యాక హీరోయిన్ను పెళ్లాడాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడట. టీమిండియా క్రికెటర్ కావాలన్నది తన ధ్యేయమని, చిన్నతనంలో తన స్నేహితుడి (షలజ్ సోంధి) స్లాం బుక్‌లో రాసిన కోహ్లి.. అదే స్నేహితుడి తల్లితో తాను హీరోయిన్ను పెళ్లాడతానని అప్పుడే చెప్పాడట. కోహ్లి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఆసక్తికర విషయాలను ఆర్సీబీ ఇటీవలే ఓ ప్రత్యేక వీడియోలా రూపొందించి సోషల్‌మీడియాలో విడుదల చేసింది. Stories from Virat Kohli’s childhood in Delhi We met Virat’s first coach Rajkumar Sharma, childhood friend Shalaj & his mother, and they tell us beautiful unheard anecdotes from Virat’s early days as a budding cricketer in Delhi, on @HombaleFilms brings to you Bold Diaries.… pic.twitter.com/wzbpeoTxfu — Royal Challengers Bangalore (@RCBTweets) May 5, 2023 కోహ్లి గొప్ప క్రికెటర్ అవుతాడని ముందే తెలుసు.. ఈ వీడియోలో కోహ్లి చిన్ననాటి గురువు రాజ్‌కుమార్ శర్మ, అతని చిన్ననాటి నేస్తం షలజ్ సోంధి, సోంధి తల్లి.. కోహ్లితో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. కోహ్లి చిన్నతనం నుంచే చాలా యాక్టివ్‌గా ఉండేవాడని, 10 ఏళ్ల వయసులోనే అతను పెద్దపెద్ద లక్ష్యాలను పెట్టుకునే వాడని, కోహ్లి ఓ నాచురల్ టాలెంటెడ్ ఆటగాడని, అతను పెద్దయ్యాక తప్పక గొప్పవాడవుతాడని తాను ముందే గుర్తించానని కోహ్లి గురువు రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. టీమిండియా క్రికెటర్ కావాలన్న కోరిక.. కోహ్లి స్నేహితుడు షలజ్ మాట్లాడుతూ.. కోహ్లి చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడని, ప్రాక్టీస్ అవ్వగానే తాము స్ట్రీట్ ఫుడ్ వేటలో పడే వారమని తెలిపాడు. షలజ్.. కోహ్లికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సైతం వెల్లడించాడు. కోహ్లి చిన్నతనంలోనే భారత క్రికెటర్ కావాలని యాంబిషన్గా పెట్టుకున్నాడని, చీకూ (కోహ్లి ముద్దు పేరు).. దాన్ని తన కఠిన దీక్షతో నెరవేర్చుకున్నాడని తెలిపాడు. హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాను.. కోహ్లికి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని కోహ్లి స్నేహితుడు సోంధీ తల్లి షేర్ చేసుకున్నారు. తాను చిన్నతనంలో సోంధీ అతని గ్యాంగ్‌కు తిండి పట్టుకెళ్లేదాన్నని, ఓ రోజు కోహ్లి గోడపై ఉన్న పోస్టర్‌ను చూపిస్తూ.. నా ఫోటో కూడా ఓ రోజు ఇలాగే పోస్టర్‌పై ఉంటుందని, తాను పెద్దయ్యాక హీరోయిన్ను పెళ్లాడతానని చెప్పాడని సోంధి తల్లి చెప్పుకొచ్చింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. 2005లో 17 ఏళ్ల కోహ్లి.. తాను క్రికెట్ ప్రపంచాన్ని శాసించబోతున్నాని తెలిపినట్లు స్టార్ మహిళా క్రికెటర్లు హీలీ, పెర్రీ వెల్లడించారు. కోహ్లికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికర విషయాలన్నిటితో కూడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, కోహ్లి అనుకున్నట్లుగానే టీమిండియా క్రికెటర్ అయ్యాడు, చెప్పినట్లుగానే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, అలాగే తాను ఆశించినట్లు హీరోయిన్ను (అనుష్క శర్మ) పెళ్లాడాడు. -
స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అనుష్క శర్మ
-
స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అనుష్క శర్మ
స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అనుష్క శర్మ