టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో మెరిసిన కోహ్లి.. మూడేళ్ల సెంచరీ కరువుకు చెక్ పెట్టడంతో పాటు పూర్తిస్థాయి ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆసియా కప్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న కోహ్లి.. భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్ టూర్ వెళ్లాడు. తాజాగా భారత్‌కు తిరిగొచ్చిన కోహ్లి.. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ పురస్కరించుకొని టీమిండియాలో జాయిన్ అయ్యాడు. ఆస్ట్రేలియా తొలి టి20 మ్యాచ్ ఆడేందుకు టీమిండియా శనివారం మొహలీ చేరుకుంది. మంగళవారం(సెప్టెంబర్ 20న) తొలి టి20 మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టును షేర్ చేసింది. ''నా భర్తను మిస్సవుతున్నా.. ఈ ప్రపంచం మొత్తం అందంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నాకు లోపల మాత్రం ఏదో తెలియని వెలితి ఉంది. నా హబ్బీని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాలో కలుగుతుంది..'' అంటూ పేర్కొంది. అనుష్క పోస్ట్‌కు స్పందించిన విరాట్ కోహ్లి.. లవ్ ఎమోజీ పెట్టాడు.
కాగా టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లు ఆడనున్న టీమిండియాకు ఇది మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది. కాగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమయ్యాడు.
చదవండి: కెవిన్ ఒబ్రెయిన్ సెంచరీ .. గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment