india vs australia
-
BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్?
ముంబై క్రికెటర్ తనుశ్ కొటియాన్‌కు అరుదైన అవకాశం దక్కింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ( Border-Gavaskar Trophy- బీజీటీ)లో భాగంగా.. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు.. టీమిండియా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. తనుశ్కు జాతీయ జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.కాగా బీజీటీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం కంగారూల చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయింది.అశ్విన్ రిటైర్మెంట్ఇక ఈ మ్యాచ్ ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అశూ స్థానంలో ముంబై ఆటగాడు తనుశ్ కొటియాన్(Tanush Kotian)కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. నిజానికి మరో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు జట్టుతోనే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం అతడిని ఎంపిక చేశారు.ఎవరీ తనుశ్ కొటియాన్?మహారాష్ట్ర చెందిన తనుశ్ కొటియాన్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 26 ఏళ్ల తనుశ్ ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 25.70 సగటుతో 101 వికెట్లు తీశాడు.అదే విధంగా.. బ్యాటింగ్‌లోనూ రాణించిన అతను 47 ఇన్నింగ్స్‌లలో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2023–24 రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై గెలుచుకోవడంలో తనుశ్దే కీలకపాత్ర. ఆ ఎడిషన్‌లో 502 పరుగులు చేసి 29 వికెట్లు పడగొట్టిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలవడం విశేషం. ఇక ఇటీవల భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఒక మ్యాచ్‌లోనూ తనుశ్ బరిలోకి దిగాడు. వన్డే టోర్నీలో సత్తా చాటుతూతనుశ్ కొటియాన్ ప్రస్తుతం ముంబై తరఫు విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy) మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టీమిండియాలోకి ఎంపికైన రోజే అతడు అహ్మదాబాద్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించడం విశేషం. రెండు వికెట్లు తీయడంతో పాటు.. 37 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో నాలుగో టెస్టు జరుగనుంది. తదుపరి సిడ్నీ వేదికగా ఇరుజట్లు ఆఖరి టెస్టులో తలపడతాయి.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!? -
వాడిగా 'వేడిగా' సాగనున్న బాక్సింగ్ డే టెస్ట్!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరుగనున్న నాలుగో టెస్ట్ ఆరంభానికి ముందే వేడిని పుట్టిస్తోంది. సిరీస్ పరంగా చూస్తే, భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలుపొందింది. దీంతో, సిరీస్ ని 1-1తో సమమైంది. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో మెల్బోర్న్ లో, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతనడంలో సందేహంలేదు. వాతావరణ శాఖ హెచ్చరిక ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ఈ మ్యాచ్ కి ముందే వేడెక్కిస్తున్నాయి.మెల్బోర్న్లో ఓవర్ హీట్..ఈ మ్యాచ్ జరిగే తరుణంలో మెల్బోర్న్ లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖంగా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపడుతున్నారు.ఆటగాళ్లకు అవసరమైతే డ్రింక్స్ విరామాన్ని పెంచాలని నిర్ణయించారు. త్వరలో మెల్బోర్న్ లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అయితే ఉష్ణోగ్రత 38డిగ్రీల సెల్సియస్ దాటితే మ్యాచ్‌లను నిలిపివేస్తారు.అయితే క్రికెట్ లో ఇలాంటి నిబంధనలు లేవు. గతంలో 2018 లో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా సిడ్నీ లో జరిగిన టెస్ట్ సమయం లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినప్పటికీ మ్యాచ్ ని కొనసాగించారు.చెన్నైలో డీన్ జోన్స్ డబుల్, ఆసుపత్రిపాలు ప్రఖ్యాత ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ జోన్స్ 1986 లో చెన్నై లోని చేపక్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 41 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.తన సుదీర్ఘ క్రీడా జీవితంలో 52 టెస్ట్‌లు, 164 వన్డే మ్యాచ్ లు ఆడి, రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా కూడా ప్రఖ్యాతి వహించిన జోన్స్ 59 ఏళ్ళ ప్రాయంలో ఐపీఎల్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్ లో ఆకస్మిక గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2017 -18 యాషెస్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 40డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ మధ్యలో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం రూట్ ఆసుపత్రి పాలయ్యాడు, ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 4-౦ తో విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశముంది. బాక్సింగ్ డే టెస్టుకు ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.హెడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుతూ కన్పించాడు. అతడు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.అయితే కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. కాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల హెడ్ నాలుగో టెస్టు కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్లో కూడా కన్పించలేదంట.అతడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. కాగా హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలు నమోదు చేశాడు.ఒకవేళ బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరమైతే అసీస్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు జోషల్ హాజిల్‌వుడ్ సైతం గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
అఫీషియల్.. ఆసీస్‌తో టెస్టు సిరీస్ నుంచి షమీ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరిచింది. గాయం నుంచి కోలుకున్న షమీ.. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వస్తాడని వార్తలు వినిపించాయి. అయితే షమీ మరోసారి గాయం బారిన పడ్డాడు.బౌలింగ్ ఓవర్‌లోడ్ కారణంగా షమీ మోకాలి వాపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో సుదీర్ఘ స్పెల్‌లు వేయడానికి సిద్ధంగా లేడని బీసీసీఐ వైద్య బృందం తెల్చింది. ఈ క్రమంలోనే షమీ టీమిండియా రీఎంట్రీ మరింత అలస్యం కానుంది."ఈ ఏడాది రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ తరుపున షమీ 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మొత్తం 9 మ్యాచ్‌ల్లో ఆడాడు. ఆ సమయంలో అతడు టెస్టు క్రికెట్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని భావించాము. అందుకు తగ్గట్టు షమీ కూడా అదనపు బౌలింగ్ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గోన్నాడు. కానీ బౌలింగ్ వర్క్‌లోడ్ ఎక్కువ కావడంతో అతడి ఎడమ మోకాలి వాపు వచ్చింది. ఈ క్రమంలో అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పరిశీలించింది. అతడు ఇంకా ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేసే ఫిట్నెస్ సాధించలేదని మా వైద్య బృందం నిర్ధారించింది. అతడు పూర్తి స్ధాయి క్రికెట్‌కు అందుబాటులోకి రావడం మరింత సమయం పట్టనుంది.దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్ట్‌లకు షమీ దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పరిశీలను ఉంటాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను పాల్గొనడం కూడా అనుమానమే" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఏంటి రోహిత్ భయ్యా? ఆఖరికి అతడి చేతిలో కూడా ఔటయ్యావు (వీడియో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ బ్యాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు తిరిగి తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే తన ప్రాక్టీస్ తిరిగి మొదలుపెట్టిన హిట్‌మ్యాన్.. పార్ట్ టైమ్ బౌలర్ దేవ్‌దత్త్ పడిక్కల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు "ఏంటి రోహిత్ భయ్యా అతడి బౌలింగ్‌లో కూడా ఔట్ అయ్యావు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..కాగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం హిట్‌మ్యాన్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాకుండా గత ఏడాదిగా రోహిత్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తనచివరి 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే రోహిత్ పరిమితమయ్యాడు. కనీసం ఆస్ట్రేలియాతో ఆఖరి రెండు మ్యాచ్‌లలోనైనా రోహిత్ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. Rohit Sharma got beaten by Part-time Bowler Devdutt Padikkal in the nets 🥲 pic.twitter.com/6iGlPXO6Nl— Jyotirmay Das (@dasjy0tirmay) December 22, 2024 -
సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపొందిన భారత్.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓటమిని చవిచూసింది.బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధంఇక వర్షం వల్ల బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగియడంతో ఇరుజట్లు ఇప్పటికీ 1-1తో సమంగా ఉన్నాయి. తదుపరి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో భారత్- ఆసీస్ తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ముమ్మరం చేసిన భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ లైవ్లీ ఫీల్డింగ్ డ్రిల్‌తో టీమిండియా ప్లేయర్ల మధ్య పోటీ నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. వీటికి యువ క్రికెటర్లనే కెప్టెన్లుగా నియమించడం విశేషం.సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో కోహ్లిగ్రూప్-1లో భాగంగా సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.. గ్రూప్-2లో మహ్మద్ సిరాజ్ సారథ్యంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.. గ్రూప్-3లో ధ్రువ్ జురెల్ నాయకత్వంలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, ప్రసిద్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు.జురెల్ సారథ్యంలోని జట్టుదే గెలుపుఅయితే, ఫీల్డింగ్‌తో అద్భుత నైపుణ్యాలతో మెరిసిన జురెల్ బృందం గెలిచింది. ఈ నేపథ్యంలో జురెల్ కెప్టెన్సీలోని జట్టుకు మూడు వందల డాలర్ల క్యాష్ రివార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. కాగా మెల్బోర్న్లో డిసెంబరు 26 నుంచి 30 వరకు నాలుగో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.అలా అయితేనే ఫైనల్ ఆశలు సజీవంఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన ఈ రెండు టెస్టులు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండటంతో అశూ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
టెస్ట్ సిరీస్‌లో విఫలమయ్యాడు.. బీబీఎల్‌లో ఇరగదీశాడు..!
టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టాడు. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 22) జరిగిన మ్యాచ్‌లో మెక్‌స్వీని మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి తన జట్టును (బ్రిస్బేన్ హీట్) గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌స్వీని 49 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మెక్‌స్వీనికి జతగా మ్యాట్ రెన్షా (27 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్పై బ్రిస్బేన్ హీట్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (24 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ బాజ్లీ (11 బంతుల్లో 23; బౌండరీ, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (13), క్రిస్ లిన్ (24), ఓలీ పోప్ (34), అలెక్స్ రాస్ (20) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో ప్రెస్ట్‌విడ్జ్ 2, బార్ట్లెట్, విట్నీ, వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు.175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ చివరి బంతికి గెలుపుతీరాలకు (7 వికెట్లు కోల్పోయి) చేరింది. మెక్‌స్వీని, రెన్షా అర్ద సెంచరీలతో రాణించారు. వీరు కాకుండా బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్‌లో పాల్ వాల్టర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. కొలిన్ మున్రో (7), జిమ్మీ పియర్సన్ (8), మ్యాక్స్ బ్రయాంట్ (3), విల్ ప్రెస్ట్‌విడ్జ్ (0), బార్ట్లెట్ (3) విఫలమయ్యారు. మిచెల్ స్వెప్సన్ చివరి బంతికి సింగిల్ తీసి బ్రిస్బేన్ హీట్‌ను విజయతీరాలకు చేర్చాడు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్ పోప్, హెన్రీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ షార్ట్, జేమీ ఓవర్టన్, లియామ్ స్కాట్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఇదిలా ఉంటే, డిసెంబర్ 26 నుంచి టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్ట్ కోసం ఆసీస్ జట్టును ప్రకటించారు. తొలి మూడు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన నాథన్ మెక్‌స్వీని జట్టులో చోటు కోల్పోయాడు. మెక్‌స్వీని స్థానంలో యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. -
నాలుగో టెస్టుకు ముందు భారత్‌కు నాలుగు సవాళ్లు..
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ అయిదు టెస్టుల సిరీస్ లో భాగంగా గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ లో అతి కష్టం మీద ఓటమి తప్పించుకున్నరోహిత్ సేన, ప్రతిష్టాంత్మికమైన బాక్సింగ్ డే టెస్ట్ కు ముందు పెను సవాళ్ళని ఎదుర్కుంటోంది. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ మానసికంగా జట్టును కుంగ తీస్తున్న తరుణంలో సిరీస్ మధ్యలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం జట్టును మానసికంగా కుంగదీస్తునడంలో సందేహం లేదు. రోహిత్ తడ'బ్యాటు'ఈ సిరీస్ లోని పెర్త్ లో జరిగిన తొలిటెస్ట్ లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసినా, ఆ టెస్టు లో జట్టుకి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించాడు. తన కొడుకు పుట్టిన సందర్భంగా తొలి టెస్ట్ లో పాల్గొనలేక పోయిన రోహిత్ శర్మ, ఆ తర్వాత రెండు టెస్టుల్లో పేలవంగా ఆడి మొత్తం మూడు ఇన్నింగ్స్ లో 6.33 సగటుతో కేవలం 19 పరుగులు (౩, 6, 10 ) సాధించాడు.జట్టును ముందుండి నడిపించాల్సిన జట్టు సారధి ఇలాంటి అతిప్రాధాన్యం ఉన్న టెస్ట్ సిరీస్ లో వరసగా విఫలమవడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనడంలో సందేహంలేదు. మరో పక్క ఆదివారం జరిగిన ప్రాక్టీస్ కు రోహిత్ గాయం కారణంగా దూరంగా ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది.ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బ్యాండేజ్ వేసుకొని కుర్చీలో కూర్చొని కనిపించడం గమనార్హం. రోహిత్ గాయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేనందున, ప్రస్తుత పరిస్థితిలో రోహిత్ మెల్బోర్న్ లో జరిగే జరిగే నాలుగో టెస్టులో ఆడటంపై ఇంకా స్పష్టత లేదు.అశ్విన్ రిటైర్మెంట్అడిలైడ్ లో జరిగిన డే అండ్ నైట్ రెండో టెస్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశించిన రీతిలో రాణించలేక పోయాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లలో 53 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ పడగొట్టిన అశ్విన్ కి బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో స్థానం లభించలేదు. అతని స్థానం లో వచ్చిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో రాణించి 77 పరుగులు సాధించి, భారత్ కు ఓటమి తప్పించడంలో కీలకపాత్ర పోషించాడు.తన వ్యూహాత్మకమైన బౌలింగ్ తో భారత్ కి ఎన్నెన్నో ఘన విజయాలు సమకూర్చిన ఘనత వహించిన 38 ఏళ్ళ అశ్విన్ మొత్తం 106 టెస్టుల్లో ప్రాతినిర్ధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకకి చెందిన ముత్తయ్య మురళీధరన్ (800 ), ఆస్ట్రేలియాకి చెందిన షేన్ వార్న్ (708), భారత్ కి చెందిన అనిల్ కుంబ్లే (619) ల తర్వాత, ప్రపంచంలో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ గా ఘనత వహించిన అశ్విన్, ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం, జట్టులోని ఇతర ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తునడంలో సందేహంలేదు. ప్రధానంగా జట్టులో సీనియర్ ఆటగాళ్ళయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా ఆశించిన స్థాయిలో రాణించనలేకపోతున్న తరుణంలో అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం పలు ప్రశ్నలకు తావిస్తుంది అనడంలో సందేహం లేదు.బుమ్రా ఒంటరి పోరుభారత్-ఆస్ట్రేలియా వంటి అత్యంత ప్రాధాన్యం ఉన్న సిరీస్ లో భారత్ బౌలింగ్ కి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మొత్తం భారం మోయడం బాధాకరం. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో జట్టుకి సారధ్యం వహించిన బుమ్రా, మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో జట్టును విజయాపథంవైపు నడిపించాడు. అయితే, బుమ్రాకి తన సహచర బౌలర్ల నుంచి సరియైన సహకారం లభించడంలేదు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ లేని లోటు భారత జట్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియా జట్టులో పేస్ బౌలర్లు అందరూ రాణిస్తుండటం ఆ జట్టుకి సమతుల్యాన్ని ఇవ్వడమే గాక భారత్ పై ఆధిక్యాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర వహిస్తోంది. భారత్ కి ట్రావిస్ 'హెడ్' తలనొప్పిభారత్ గడ్డపై జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర వహించిన ఆ జట్టులోని ఎడమచేతివాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రస్తుత సిరీస్ లోను భారత్ కి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో విఫలమయినా, తర్వాత విజృంభించి రెండు, మూడు టెస్టుల్లో వరుసగా సెంచరీలు సాధించి తన జట్టు బ్యాటింగ్ కి వెన్నుముకగా నిలిచాడు. భారత్ ఈ సిరీస్ లోని మిగిలిన రెండు టెస్టుల్లో రాణించి ఈ సిరీస్‌లో విజయం సాధించాలంటే, ట్రావిస్ హెడ్ పరుగుల ప్రవాహానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ గా వ్యూహం రూపొందించాలి. ప్రధానంగా ట్రావిస్ హెడ్ ని నిలవరించ గలిగితేనే ఈ సిరీస్ లో భారత్ కి విజయం దక్కేది.చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం -
టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో బంతి రోహిత్ ఎడమ మోకాలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వెంటనే అతడికి ఫిజియో ఐస్ ప్యాక్‌ను తెచ్చి మోకాలి మర్ధన చేశాడు. ఆ తర్వాత రోహిత్ తన ప్రాక్టీస్‌ను కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అతడి గాయంపై బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.మ్యాచ్ ఆరంభానికి ముందు హిట్‌మ్యాన్ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్ ఓ అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతడు దూరమైతే సర్ఫరాజ్ ఖాన్ లేదా ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఇక ఇది ఇలా ఉండగా.. రోహిత్ కంటే ముందు నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్ సైతం గాయపడ్డాడు. అతడి కుడి చేతి మణికట్టుకు బంతి తాకింది. అయితే అతడి గాయం తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. డిసెంబర్ 26 నుంచి ఈ బ్యాక్సింగ్ డే టెస్టు ఆరంభం కానుంది.చదవండి: ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ -
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో శనివారం ప్రాక్టీస్ అనంతరం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.మెల్బోర్న్ టెస్టులో భారత టాపార్డర్నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నట్లు జడేజా అన్నాడు. ఆరంభంలో పరుగులు రాకపోతే ఆ తర్వాత ఒత్తిడి పెరిగిపోతుందని అతను అభిప్రాయ పడ్డాడు.‘ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలాంటి చోట టాపార్డర్ పరుగులు కీలకంగా మారతాయి. వారు పరుగులు చేయకపోతే లోయర్ ఆర్డర్‌పై చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ టెస్టులో అలా జరగదని ఆశిస్తున్నా. జట్టుగా చూస్తే బ్యాటింగ్‌లో అందరూ రాణిస్తేనే భారీ స్కోరుకు అవకాశం ఉన్నా టాపార్డర్, మిడిలార్డర్ పరుగులు ప్రధానం’ అని జడేజా వ్యాఖ్యానించాడు.గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జడేజా... ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన దగ్గరినుంచి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూ సాధన చేసినట్లు వెల్లడించాడు.‘మూడు టెస్టుల తర్వాత 1–1తో సమంగా ముందుకు వెళ్లడం మంచి స్థితిగా భావిస్తున్నా. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతాయి. మేం ఒకటి గెలిచినా చాలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటాం. ఇందులో సత్తా చాటితే చివరి టెస్టు గురించి ఆలోచన లేకుండా ఫలితం సాధించవచ్చు. గత పర్యాయాలు ఇక్కడ భారత్ సిరీస్ గెలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశాము" అని జడ్డూ పేర్కొన్నాడు. -
‘అతడికి దూకుడు ఎక్కువ.. సూపర్ బ్యాటర్’
యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ అతడు బ్యాటింగ్ చేసే విధానం చూడముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. ఇక టీమిండియా వంటి పటిష్ట జట్టుపై ఓపెనర్‌గా అరంగేట్రం చేసే అవకాశం రావడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ఓడిపోయిన కంగారూలు.. అడిలైడ్‌లో గెలుపొందారు. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేశారు. అయితే, ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో నాలుగు, సిడ్నీలో ఐదో టెస్టు జరుగనున్నాయి.కొత్త కుర్రాడికి చోటుఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టును ప్రకటించింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీని తప్పించి.. సామ్ కొన్‌స్టాస్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఒకవేళ డిసెంబరు 26 నుంచి జరిగే ‘బాక్సింగ్ టెస్టు’ (నాలుగో మ్యాచ్)లో తుది జట్టు తరఫున కొత్త కుర్రాడు బరిలోకి దిగితే చరిత్రే.వారిద్దరి తర్వాతడెబ్బై ఏళ్ల తర్వాత.. అంతర్జాతీయ టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఆసీస్ టీనేజ్ బ్యాటర్‌గా కొన్‌స్టాస్ ఘనత వహిస్తాడు. 1953లో ఇయాన్ క్రెయిగ్ 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ తరఫున స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అరంగేట్రం చేశాడు. అయితే 2011లో ప్యాట్ కమిన్స్ (ప్రస్తుత కెప్టెన్) 18 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసినప్పటికీ అతను స్పెషలిస్టు బౌలర్(పేసర్)!ఈ నేపథ్యంలో మైక్ హస్సీ ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ.. ‘‘మెక్‌స్వీనీ పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించారన్న మాట వాస్తవం. అతడిపై నాకు సానుభూతి ఉంది. అయితే, కొన్‌స్టాస్ తక్కువేమీ కాదు. బిగ్‌బాష్ లీగ్‌లో అతడి ఆట నన్ను ఆకట్టుకుంది.ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదుఅద్భుతమైన సందర్భంలో కొన్‌స్టాస్ అరంగేట్రం చేయబోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే టీమిండియా మీద.. అది కూడా బాక్సింగ్ డే టెస్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా అవకాశం. వావ్.. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది’’ అని కొన్‌స్టాస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.కాగా ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలతో పాటు ఆసీస్ ‘ఎ’, బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లలో కొన్‌స్టాస్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టులో అజేయ అర్ధ శతకం (73 నాటౌట్) బాదాడు కొన్‌స్టాస్.అదే విధంగా.. అడిలైడ్‌లో డే-నైట్ టెస్టుకు ముందు భారత్‌తో జరిగిన సన్నాహక పింక్ బాల్ (రెండు రోజుల మ్యాచ్) పోరులో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తరఫున శతకం (107) సాధించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుర్ర బ్యాటర్.. శనివారం సిడ్నీ సిక్సర్‌తో మ్యాచ్ పూర్తయ్యాక ఆసీస్ టెస్టు జట్టుతో కలుస్తాడు.చదవండి: BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఫైర్ -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!?
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం.. భారత జట్టు ఇప్పటికే మెల్బోర్న్కు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్ భారీ షాక్ తగిలింది.ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్ చేతి మణికట్టుకు గామైంది. వెంటనే ఫిజియో వచ్చి రాహుల్ మణి కట్టుకు టేప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే రాహుల్ గాయంపై మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు.పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుకు ముందు కూడా రాహుల్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పెర్త్ టెస్టులో భారత జట్టులో భాగమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే చేతి మణికట్టుకు గాయం కావడంతో భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.సూపర్ ఫామ్‌లో రాహుల్.. కాగా రాహుల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత తరపున లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన రాహుల్ 235 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు డ్రా కావడంలో రాహుల్ ది కీలక పాత్ర పోషించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ KL Rahul suffered a hand injury at the MCG nets today during practice session. #INDvAUS pic.twitter.com/XH8sPiG8Gi— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2024 -
BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఫైర్
ఆస్ట్రేలియా సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు నాథన్ మెక్‌స్వీనీని తప్పించడాన్ని తప్పుబట్టాడు. కేవలం మూడు మ్యాచ్‌ల ఆధారంగా అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా అని మండిపడ్డాడు. కాగా భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చివరి రెండు టెస్టులకు ఆసీస్ తమ జట్టులో ఒక మార్పు చేసిన విషయం తెలిసిందే.టీనేజ్ సంచలనం ఎంట్రీమూడు టెస్టుల్లోనూ విఫలమైన టాపార్డర్ బ్యాటర్ మెక్స్వీనీనిపై కంగారూ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. 25 ఏళ్ల ఈ యువ ఓపెనర్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 10, 0, 39, 10 నాటౌట్, 9, 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడి స్థానంలో టీనేజ్ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌ను జాతీయ టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది.సీనియర్ల మాటేమిటి?ఈ విషయంపై మైకేల్ క్లార్క్ స్పందించాడు. ‘‘నాథన్ మెక్‌స్వీనీ కాకుండా.. 30 ఏళ్లు, ఆపై వయసున్న వాళ్ల పట్ల మన విధానం ఎలా ఉంది? యువకులకు ఒకటీ అరా అవకాశాలు ఇచ్చి.. వెంటనే జట్టు నుంచి తప్పిస్తారా? అనుభవం ఉన్నా విఫలమవుతున్న, వయసు పైబడుతున్న వాళ్లను మాత్రం కొనసాగిస్తారా?ఒకవేళ రెండు టెస్టుల వ్యవధిలో ఉస్మాన్ ఖవాజా రిటైర్ అయితే ఏం చేస్తారు? మళ్లీ మెక్‌స్వీనీని వెనక్కి తీసుకువస్తారా? అసలు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు? ‘అతడిని ఎంపిక చేసి తప్పుచేశాం’ అని అనుకుంటున్నారా?ఇది నాథన్ మెక్‌స్వీనీ కెరీర్. దానితో మీరు ఆటలాడవద్దు. అతడు మరిన్ని అవకాశాలకు అర్హుడు. ఈ సమ్మర్లో మిగిలిన టెస్టులన్నింటిలోనూ అతడిని ఆడించాలి. ఉస్మాన్ ఖవాజాకు 38 ఏళ్లు. అతడొక సీనియర్ ప్లేయర్. మరి ఓపెనర్‌గా ఈ సిరీస్‌లో పరుగులు రాబట్టలేదు కదా!.. అతడిని కొనసాగించినపుడు మెక్‌స్వీనీని ఎందుకు తప్పించారు?’’ అని క్లార్క్ ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించాడు.వార్నర్ రిటైర్మెంట్ తర్వాతకాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయోగం విఫలం కావడంతో.. ఈసారి మెక్‌స్వీనీకి అవకాశం వచ్చింది. అయితే, తొలి మూడు టెస్టుల్లో అతడు విఫలం కావడం వల్ల.. 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్కు సువర్ణావకాశం దక్కింది.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 26-30 వరకు మెల్బోర్న్లో నాలుగో టెస్టు జరుగుతుంది. ఆఖరి టెస్టుకు సిడ్నీ వేదిక.చదవండి: ముంబై ప్లేయర్‌గా అతడికి ఇదే లాస్ట్ సీజన్: భారత మాజీ సెలక్టర్ -
అశ్విన్ రిటైర్మెంట్పై భార్య ప్రీతి తొలి రియాక్షన్.. వైరల్
‘‘గత రెండు రోజులుగా నాకు అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం చెప్పాలో.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్‌కు నీరాజనం సమర్పించాలా?... లేదంటే.. జీవిత భాగస్వామి కోణంలో ఆలోచించాలా? లేదంటే.. ఫ్యాన్ గర్ల్‌లా ఓ ప్రేమ లేఖను రాయాలా?.. లేదా ఈ భావోద్వేగాల సమాహారాన్ని పూసగుచ్చాలా?!అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినపుడు చిన్నా, పెద్దా.. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. గత 13- 14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బా గెలుపు... టీ20లలో పునరాగమనం.. వీటన్నింటి వల్ల మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. అదే సమయంలో ఓటముల వల్ల మా హృదయం ముక్కలైనపుడు ఉండే భయంకర నిశ్శబ్దం కూడా నాకు గుర్తే.ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలిసేదే కాదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.అత్యుత్తమ గణాంకాలు, అరుదైన రికార్డులు, లెక్కలేనన్ని అవార్డులు.. అయినా సరే ప్రతిసారి మ్యాచ్‌కు ముందు నువ్వు సన్నద్ధమయ్యే తీరు, నీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే విధానం గురించి ఎలా వర్ణించను?..నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు. నచ్చిన భోజనం తిను. కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించు. మన పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో’’.... అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగానికి లోనయ్యారు. టీమిండియా తాజా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణే ప్రీతి.తొలి స్పందన.. ఉద్వేగపూరిత నోట్ వైరల్అంతర్జాతీయ క్రికెట్‌కు తన భర్త రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి ఈ మేర ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. అశూ ఇకపై తమకు మరింత దగ్గరగా ఉంటాడని భార్యగా ఆనందపడుతూనే.. మరోవైపు అభిమానిగా విచారం వ్యక్తం చేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అయితే, టెస్టు క్రికెట్ రారాజుగా వెలుగొందిన అశూ అన్నకు సరైన వీడ్కోలు లభించలేదన్నది వాస్తవం. బ్రిస్బేన్‌లో టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన అశూ తన నిర్ణయాన్ని చెప్పి నిష్క్రమించాడు.ఎందుకింత అకస్మాత్తుగా?ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మేనేజ్మెంట్ పట్ల అసంతృప్తితోనే అతడు గుడ్‌బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు తీసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్.. ఆయా ఫార్మాట్లలో 3503, 707, 184 పరుగులు సాధించాడు.ఇక అశ్విన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2011, నవంబరు 13న చిరకాల ప్రేయసి ప్రీతి నారాయణన్‌ను చెన్నైలో వివాహమాడాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు అఖీరా అశ్విన్(2015), ఆద్యా అశ్విన్(2016).చదవండి: 'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు' -
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
BGT: ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీకి ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటిచ్చింది.అతడి పునరాగమనంఅదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్కు కూడా భారత్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులకు ఎంపిక చేసింది. కాగా గాయం వల్ల 2021-22 యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు జట్టుకు దూరమైన రిచర్డ్సన్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక సీన్ అబాట్ కూడా పునరాగమనం చేయగా.. అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా జట్టుతో కొనసాగనున్నాడు.ఇక పిక్క కండరాల నొప్పి కారణంగా మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. నాలుగు, ఐదో టెస్టులకు పూర్తిగా దూరమయ్యాడు. కాగా ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున రాణించిన మెక్‌స్వీనీ టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా పెర్త్‌లో అరంగేట్రం చేశాడు.వరుస సెంచరీలతో చెలరేగిఅయితే, ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడు నిరాశపరిచాడు. ఫలితంగా మెక్‌స్వీనీ (ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 72 రన్స్)పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సామ్ కొన్‌స్టాస్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. కాగా సామ్ తన చక్కటి బ్యాటింగ్ శైలితో జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. 19 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ఇటీవల షెఫీల్డ్‌షీల్డ్ మ్యాచ్‌లో సౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుస సెంచరీలు(152, 105) బాదాడు.ఫాస్టెస్ ఫిఫ్టీతోఅంతేకాదు.. భారత్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున 73 రన్స్‌తో చెలరేగాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం.. సిడ్నీ థండర్ తరఫున అరంగేట్రంలోనే ఫాస్టెస్ ఫిఫ్టీ(27 బంతుల్లో 56) నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా.. అడిలైడ్ టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపొందాయి. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ టెస్టు డ్రా అయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో, సిడ్నీ(జనవరి 3-7) నాలుగు, ఐదో టెస్టులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల ఫలితంపైనే ఆసీస్- టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.భారత్‌తో మూడు, నాలుగు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్(వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
అశ్విన్ బాటలో రోహిత్ శర్మ?!.. హిట్‌మ్యాన్ సమాధానం ఇదే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి సారథ్యంలో భారత జట్టు 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇప్పటికి మిశ్రమ ఫలితాలే వచ్చాయి.పితృత్వ సెలవుల కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరం కాగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ నేతృత్వంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అడిలైడ్‌లో కంగారూలతో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేదంటే.. పరిస్థితి ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఇక అడిలైడ్, బ్రిస్బేన్‌లో రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా.. ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్ ఆడి అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 3, 6, 10. దీంతో కెప్టెన్‌గా రోహిత్ తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో బ్రిస్బేన్ టెస్టు ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అనుకున్న ఫలితం రాకపోతే రోహిత్ కూడా గుడ్‌బై చెబుతాడనే వదంతులు వ్యాపించాయి.అయితే, రోహిత్ శర్మ మాత్రం వాటిని కొట్టిపడేశాడు. ‘‘నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయానన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఎల్లవేళలా మెరుగ్గా ఆడేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. అనుకున్న లక్ష్యాలలో దాదాపుగా అన్నిటినీ చేరుకున్నాను.క్రీజులో మరింత ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా శరీరం, నా మనసు సహకరించినంత కాలం.. నేను ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఈ ప్రయాణంలో విధి నాకోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తా’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా చెరో విజయం సాధించి.. మూడో టెస్టును డ్రా చేసుకున్నాయి. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.తదుపరి డిసెంబరు 26- 30 మధ్య బాక్సింగ్ డే టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌తో పాటు.. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులోనూ గెలిస్తేనే.. భారత్ ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే వీలుంటుంది. చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’
‘టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలోనే శాశ్వతంగా భారత్‌ను వీడనున్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉండబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’... ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు.. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.క్రికెట్ కింగ్‌గా పేరొందిన విరాట్ కోహ్లి.. 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. పాప పుట్టిన దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవలే అనుష్క- కోహ్లి మగబిడ్డకు జన్మనిచ్చారు.అప్పటి నుంచి ఎక్కువగా లండన్లోనేఇక వామిక భారత్‌లోనే జన్మించగా.. రెండోసారి ప్రసవం కోసం భర్త విరాట్‌తో కలిసి అనుష్క లండన్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. విరాట్ కూడా సొంతగడ్డపై మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. విదేశాల్లో సిరీస్‌లు ఉన్న సమయంలో లండన్ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటున్నాడు.లండన్‌లో స్థిర నివాసంఅదే విధంగా.. అనుష్క శర్మ సైతం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ముంబైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ ఈ వదంతులు నిజమేనని పేర్కొన్నాడు.‘‘అవును.. విరాట్ కోహ్లి లండన్‌కు పూర్తిగా మకాం మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఇండియాను శాశ్వతంగా వదిలివెళ్తాడు’’ అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. అనుష్కకు కూడా భారీగానే అభిమానగణం ఉంది.కారణం ఇదేకాబట్టి ఈ సెలబ్రిటీ జంటకు సంబంధించిన చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. అదే విధంగా.. మీడియా, సోషల్ మీడియాలోనూ వీరి గురించి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కామెంట్లు శ్రుతిమించుతాయి కూడా! అప్పట్లో ఓ మ్యాచ్‌లో కోహ్లి భారత పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడన్న కారణంతో అతడి కుమార్తెను ఉద్దేశించి నీచంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు దిగారు కొందరు దుండగులు.ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న విరుష్క జోడీ.. ఇప్పటి వరకు వారి ఫొటోలను కూడా ప్రపంచానికి చూపించలేదు. తమ పిల్లల గోప్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శాశ్వతంగా లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆ తర్వాత శాశ్వతంగా లండన్లోఇటు కుటుంబ గోప్యతతో పాటు.. లండన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోనే విరాట్ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ రికార్డుల రారాజు.. వన్డే, టెస్టుల నుంచి తప్పుకొన్న తర్వాత మకాం మొత్తంగా లండన్‌కు మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం కోహ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. భార్య అనుష్కతో పాటు పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కాగా కోహ్లి ఖాతాలో ఇప్పటికే 81(టెస్టు 30, వన్డే 50, టీ20 1) అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.చదవండి: సంజూ శాంసన్‌కు షాక్ -
‘అప్పుడే డిసైడ్ అయ్యాను’.. రోహిత్ అలా.. అశ్విన్ ఇలా!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.టీమిండియా క్రికెటర్‌గా మాత్రమేబ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్‌గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్‌గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.జీరో రిగ్రెట్స్ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్‌లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోహిత్ అలా.. అశూ ఇలాకాగా తాను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్‌లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.సీఎస్కే తరఫునఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇకపై అశూ క్లబ్ క్రికెట్‌కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్The countless battles on the field are memorable ❤️But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌 Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024 -
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్‌ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్‌లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనపై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు చాలా కాలంగా అవమానానికి గురవుతున్నాడని, అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అద్భుతమైన కెరీర్ రికార్డు కలిగి ఉన్నప్పటికీ ప్లేయింగ్ XIలో రెగ్యులర్‌గా స్థానం పొందలేకపోవడాన్ని యాష్ అవమానంగా భావించవచ్చని అభిప్రాయడపడ్డాడు.CNN న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని ఆరోపించాడు. యాష్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే కారణం అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన విన్నప్పుడు అందరి లాగే తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని తెలిపాడు. అశ్విన్ మనస్సులో ఏముందో తెలియదు కానీ, అతని నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తున్నానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విధానం చూస్తే ఓ పక్క సంతోషం, మరో పక్క బాధగా ఉందని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అన్నది అశ్విన్ వ్యక్తిగతం. అందులో నేను జోక్యం చేసుకోలేను. కానీ అతని ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవి అశ్విన్‌కి మాత్రమే తెలుసు. బహుశా తనుకు రెగ్యులర్‌గా జట్టులో చోటు దక్కకపోవడాన్ని అశ్విన్ అవమానంగా భావించి ఉండవచ్చని రవిచంద్రన్ చెప్పుకోచ్చాడు. కాగా, రిటైర్మెంట్పై అశ్విన్ గత కొంతకాలంగా మదన పడుతున్న విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ వరకు రిటైర్మెంట్ను పోస్ట్‌పోన్ చేసుకోవాలని అశ్విన్‌ను కోరినట్లు హిట్‌మ్యాన్ స్వయంగా చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి చేరుకున్న అశ్విన్.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు. అశ్విన్ చెన్నైలోని తన స్వగృహానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలతో అశ్విన్ ఇంటివద్ద కోలాహలం నెలకొంది. WELCOME BACK TO INDIA, RAVI ASHWIN. 🇮🇳❤️- Ash reaches Chennai after announcing his retirement. 🥹 pic.twitter.com/kIQ1gxzHIA— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2024వాయిద్యాల నడుమ అశ్విన్ తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. అశ్విన్‌కు మొదటిగా తన తండ్రి ఎదురుపడి అభినందించాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా యాష్‌ను విష్ చేశారు. అభిమానులు యాష్‌ను పూల మాలలతో సత్కరించారు. ఫ్యాన్స్ అశ్విన్‌తో ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు.HOME TOWN HERO IS BACK. 🇮🇳- A Grand welcome for Ravichandran Ashwin at his home. 🤍 pic.twitter.com/WNGywMr4Sj— Johns. (@CricCrazyJohns) December 19, 2024కాగా, అశ్విన్ ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్పై అశ్విన్ బీజీటీ ప్రారంభానికి ముందు నుంచే క్లారిటీ కలిగి ఉన్నాడు. అశ్విన్ తాను రిటైర్ కావాలనుకుంటున్న విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో తొలి టెస్ట్ సందర్భంగా చెప్పాడు. అయితే రోహిత్ అప్పుడు అశ్విన్‌ను వారించి రెండో టెస్ట్ వరకు ఎదురుచూడాలని కోరాడు. రెండో టెస్ట్ అయిన పింక్ బాల్ టెస్ట్‌లో అశ్విన్ చివరిసారి టీమిండియా జెర్సీలో కనిపించాడు. జట్టు సమీకరణల దృష్ట్యా ఆశ్విన్కు మూడో టెస్ట్‌లో ఆడే అవకాశం రాలేదు. దీంతో ఇదే రిటైర్మెంట్కు సరైన సమయమని భావించిన యాష్.. బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం మీడియా సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించాడు.38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆస్ట్రేలియాను వీడి భారత్‌కు పయనమయ్యాడు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో ఆడతాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 180 వికెట్లు తీశాడు. అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు. -
అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడానికి సమయమా ఇది..?
ఆసీస్‌తో మూడో టెస్ట్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ సడెన్‌గా ఆటకు వీడ్కోలు పలికినందుకు భారత అభిమానులంతా బాధపడుతుంటే.. క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. సిరీస్ మధ్యలో ఈ ఆకస్మిక నిర్ణయమేంటని ప్రశ్నిస్తున్నాడు. అశ్విన్ రిటైర్ కావాలనుకుంటే సిరీస్ అయిపోయే దాకా వేచి ఉండాల్సిందని అన్నాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన టీమిండియా ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి దశలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన సిరీస్ ఫలితాన్ని తారుమారు చేయగలదని అంచనా వేశాడు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం వల్ల భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఒక ఆటగాడి సేవలు కోల్పోతుందని అన్నాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే సిరీస్ మధ్యలో రిటైరైన విషయాన్ని ప్రస్తావించాడు. సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్‌లో అశ్విన్ తన ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారముండేదని అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌కు స్పిన్నర్లకు సహకరించిన చరిత్ర ఉందని గుర్తు చేశాడు. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతూనే గవాస్కర్ మరో కీలక వ్యాఖ్య చేశాడు. మిగిలిన సిరీస్ కోసం అశ్విన్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ముందున్నాడని అన్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో గెలవాల్సి ఉంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో మూడో టెస్ట్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్‌కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్‌లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్‌క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను గనుక 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై! -
ఆసీస్‌తో మూడో టెస్ట్.. రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన
భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 26న మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలుకానుంది.పంత్ అద్భుత ప్రదర్శనఆసీస్తో మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తం 9 క్యాచ్‌లు పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టుకున్న పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఐదుగురిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంత్ బ్యాట్‌తో సత్తా చాటలేకపోయిన వికెట్ల వెనుక చురుగ్గా కదిలాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోగా.. పంత్ ఐదుగురిని పెవిలియన్‌కు పంపడంలో భాగమయ్యాడు. పంత్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఐదు క్యాచ్‌లు పట్టాడు. పంత్ తన 41 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 143 క్యాచ్‌లు, ఓ రనౌట్, 15 స్టంపింగ్‌లు చేశాడు.