క్వీన్స్ లాండ్ వేదికగా గురువారం (నవంబర్ 6) ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాన్‌బెర్రాలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది.
కానీ హోబర్ట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఐదు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు నాలుగో టీ20 పైనే పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కీలక పోరులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
దూబేపై వేటు.. రాణాకు చోటు
హోబర్ట్ టీ20లో బెంచ్‌కే పరిమితమైన హర్షిత్ రాణా.. నాలుగవ టీ20కి తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్ శివమ్ దూబేను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. దూబే స్దానంలోనే రాణా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మెల్‌బోర్న్ టీ20లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వచ్చి కీలక నాక్ ఆడిన రాణాకు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మరో అవకాశమివ్వనున్నట్లు సమాచారం.
సంజూకు నో ఛాన్స్..
ఇక వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. హోబర్ట్‌లో ఆడిన జితేశ్ శర్మను తుది జట్టులో కొనసాగించాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తుందంట. గత మ్యాచ్‌లో జితేశ్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. కేవలం 3 బంతుల్లో 22 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ సిరీస్‌లో సంజూ తొలి రెండు మ్యాచ్‌లో ఆడినప్పటికి ఒక్క మ్యాచ్‌లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. మెల్‌బోర్న్ టీ20లో టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని మూడో టీ20కు పక్కన పెట్టారు.
మరోవైపు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌లో కూడిన స్పిన్ త్రయాన్ని భారత్ కొనసాగించనుంది. గత మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయని సుందర్‌కు నాలుగో టీ20లోనైనా బౌలింగ్ చేసే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. కానీ హెబర్ట్‌లో సుందర్ బ్యాట్‌తో మాత్రం అద్భుతం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణా బంతిని పంచుకోనున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: కావ్య మారన్ సంచలన నిర్ణయం.. జట్టు పేరు మార్పు


