ఎస్ఆర్‌హెచ్‌ షాకింగ్ నిర్ణ‌యం.. విధ్వంస‌క‌ర వీరుడికి గుడ్ బై!? | SRH to release Heinrich Klaasen, add Rs 23 crore to purse before auction? | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్ఆర్‌హెచ్‌ షాకింగ్ నిర్ణ‌యం.. విధ్వంస‌క‌ర వీరుడికి గుడ్ బై!?

Nov 4 2025 3:42 PM | Updated on Nov 4 2025 4:15 PM

SRH to release Heinrich Klaasen, add Rs 23 crore to purse before auction?

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.స్టార్ బ్యాట‌ర్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను వేలంలోకి విడిచి పెట్టేందుకు ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.. అత‌డిని వేలంలోకి విడిచిపెట్టి త‌మ ప‌ర్స్ బ‌లాన్ని పెంచుకోవాల‌ని స‌న్‌రైజ‌ర్స్ యోచిస్తుందంట‌. 

ఐపీఎల్‌-2025 వేలానికి ముందు క్లాసెన్‌ను ఏకంగా రూ.23 కోట్ల‌కు ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. గ‌త సీజన్‌లో క్లాసెన్‌దే అత్యంత ఖరీదైన రిటెన్షన్. క్లాసెన్ ఎస్ఆర్‌హెచ్‌ తరఫున గత కొన్ని సీజ‌న్ల‌గా అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌టికి.. వేలంలోకి విడిచి పెట్టి త‌క్కువ మొత్తానికి తిరిగి సొంతం చేసుకునేందుకు కావ్య మార‌న్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

హెన్రిస్ క్లాసెన్ విడిచిపెట్టేందుకు సన్‌రైజ‌ర్స్ సిద్ద‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఎస్ఆర్‌హెచ్‌ది తెలివైన నిర్ణ‌యంగా చెప్పుకోవ‌చ్చు.  రూ.23 (క్లాసెన్ ప్ర‌స్తుత ధ‌ర‌) కోట్ల‌తో బౌలింగ్ బ‌లాన్ని, మిడిల్ ఆర్డ‌ర్ లోటును ఎస్ఆర్‌హెచ్ భ‌ర్తీ చేయ‌వ‌చ్చు . అయితే మినీ వేలంలో రూ. 15 కోట్లకు తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నించవ‌చ్చు. మిగిలిన మొత్తంతో యువ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశ‌ముంద‌ని ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కావ్య ఆ త‌ప్పు చేస్తుందా?
అయితే క్లాసెన్ వేలంలోకి విడిచిపెట్టి తిరిగి జ‌ట్టులోకి తీసుకోపోతే స‌న్‌రైజ‌ర్స్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టాల్సిందే. ఎందుకంటే గ‌త మూడు సీజ‌న్ల‌గా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో క్లాసెన్ కీలక స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.  క్లాసెన్ ఐపీఎల్‌- 2023 నుండి ఎస్ఆర్‌హెచ్‌ జట్టులో ఉన్నాడు. అతను ఫ్రాంచైజీ తరఫున ఆడిన ప్రతి సీజన్‌లో 400 పరుగుల మార్కును అధిగమించాడు. ఐపీఎల్‌ అతనికి అత్యుత్తమ సీజన్. అందులో అతను ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీతో సహా 487 పరుగులు చేశాడు.
చదవండి: కావ్య మారన్ సంచలన నిర్ణయం.. జట్టు పేరు మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement