
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో భారీ సిక్సర్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుతమైన సిక్స్ బాదాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి ప్రేక్షకుల మధ్య పడింది.
ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ముంబై స్పిన్నర్ విఘ్నేష్ పుథూర్.. తొలి బంతిని క్లాసెన్‌కు షార్ట్‌బాల్‌గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ 106 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్‌తో అభిషేక్‌ను క్లాసెన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ను క్లాసెన్ తన ఫైటింగ్ నాక్‌తో ఆదుకున్నాడు.
కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.
Upping the ante.
Heinrich Klaasen and Abhinav Manohar on the move 👌
A fighting 34-ball FIFTY from Heinrich Klaasen 👏
Updates ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI | @SunRisers pic.twitter.com/6waLHTurl5— IndianPremierLeague (@IPL) April 23, 2025