Heinrich Klaasen
-
'నోరు మూసుకొని వెళ్లి ఆడు'.. రిజ్వాన్ ఓవరాక్షన్! వీడియో వైరల్
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.అసలేం ఏమి జరిగిందంటే?దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన పాక్ పేసర్ హారీస్ రవూఫ్ ఆఖరి బంతిని క్లాసెన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో క్లాసెన్‌ను రవూఫ్ ఏదో అన్నాడు. అందుకు ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సైతం గట్టిగా బదులిచ్చాడు. దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహ్మద్ రిజ్వాన్ అనవసరంగా జోక్యం చేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ముందు వెళ్లి సైలెంట్‌గా ఆడు అన్నట్లు సైగ చేశాడు.దీంతో చిర్రెత్తిపోయిన క్లాసెన్ సైతం తన నోటికి పని చెప్పాడు. క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డాడు. ఈ క్రమంలో అంపైర్లు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.క్లాసెన్‌కు ఫైన్..కాగా ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. 97 పరుగులు చేసిన క్లాసెన్ ఆఖరి వికెట్‌గా వెనుదిరగాడు. దీంతో ఔటైన కోపంలో క్లాసెన్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. Fight on the field between Mohammad Rizwan and Heinrich Klaasen.💀😭 pic.twitter.com/XRb4yjYCl4— MEER YASIR🇵🇸 (@MY_EDITS_56) December 19, 2024 -
SA vs Pak: పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్‌టౌన్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్‌ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
SA VS PAK 1st ODI: రాణించిన క్లాసెన్
పార్ల్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) రాణించడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి (33), ర్యాన్ రికెల్టన్ (36), ఎయిడెన్ మార్క్రమ్ (35), మార్కో జన్సెన్ (10), కగిసో రబాడ (11), ఓట్నీల్ బార్ట్‌మన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (8), ట్రిస్టన్ స్టబ్స్ (1), అండైల్ ఫెహ్లుక్వాయో (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఓపెనర్లు జోర్జి, రికెల్టన్ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇక్కడే పాక్ స్పిన్నర్ సల్మాన్ అఘా సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అఘా 18 పరుగుల వ్యవధిలో జోర్జి, రికెల్టన్, డస్సెన్, స్టబ్స్ వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మార్క్రమ్.. కొద్దిసేపు క్లాసెన్‌తో కలిసి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. మార్క్రమ్ ఔటయ్యాక జన్సెన్ సాయంతో క్లాసెన్ సెంచరీ దిశగా సాగాడు. అయితే సఫారీలను ఈ సారి షాహీన్ అఫ్రిది ఇబ్బందుల్లోకి నెట్టాడు. సెంచరీకి చేరువలో ఉండగా అఫ్రిది క్లాసెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.ఆఖర్లో టెయిలెండర్లు ఒక్కో పరుగు పోగు చేయడంతో సౌతాఫ్రికా 239 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో సల్మాన్ అఘా 4, అబ్రార్ అహ్మద్ 2, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
పాక్‌తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్‌తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు! -
పాకిస్తాన్‌తో సిరీస్.. సౌతాఫ్రికా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (డిసెంబర్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా విధ్వంసకర వీరుడు, వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కమిట్మెంట్స్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్ట్ ముగిసిన మరుసటి రోజే టీ20 సిరీస్ మొదలుకానుండటంతో మార్క్రమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిరీస్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. మార్క్రమ్తో పాటు లంకతో టెస్ట్ సిరీస్‌లో సభ్యులైన మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్ కూడా పాక్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నారు. లంకతో టెస్ట్ సిరీస్‌లో సభ్యులైన ర్యాన్ రికెల్టన్, క్వేనా మపాకా, మాథ్యూ బ్రీట్జ్కీ మాత్రం పాక్‌తో టీ20లకు ఎంపికయ్యారు.మరోవైపు, టీ20 వరల్డ్‌కప్ అనంతరం జట్టుకు దూరంగా ఉన్న అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి పాక్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. మూడేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జార్జ్ లిండే కూడా పాక్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. కాగా, పాకిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు జరుగనున్నాయి. డిసెంబర్ 10, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. డిసెంబర్ 26-30 వరకు తొలి టెస్ట్.. జనవరి 3-7 వరకు రెండో టెస్ట్ జరుగనున్నాయి. ఈ మూడు సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళే ప్రకటించారు. పాక్‌తో టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రుగర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్జే, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంషి, అండైల్ సైమ్‌లేన్, రస్సీ వాన్ డర్ డస్సెన్ -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
IPL 2025: కోహ్లి, రోహిత్ కాదు.. రిటెన్షన్‌లో అత్యధిక ధర దక్కింది అతనికే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఇవాళ (అక్టోబర్ 31) విడుదల చేశాయి. ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే ఎంపికలు జరిగాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసమే చేశాయి. మరి కొన్ని ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను తప్పని పరిస్థితుల్లో వేలానికి వదిలేశాయి.ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ అందరూ ఊహించినట్టుగా విరాట్‌కు కాని రోహిత్‌కు కాని అత్యధిక ధర దక్కలేదు. వీరిద్దరితో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక ధర దక్కింది. క్లాసెన్‌పై ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ. 23 కోట్లు వెచ్చించింది. భారత స్టార్ల విషయానికొస్తే.. విరాట్‌కు రూ. 21 కోట్లు.. రోహిత్‌కు రూ. 16.30 కోట్లు లభించాయి. ఐపీఎల్ రిటెన్షన్‌లో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. విరాట్‌తో సమానంగా లక్నో ఆటగాడు నికోలస్ పూరన్‌కు కూడా రూ. 21 కోట్లు లభించాయి.పాట్ కమిన్స్ (సన్‌రైజర్స్), రుతురాజ్ (సీఎస్కే), బుమ్రా (ముంబై), రషీద్ ఖాన్ (గుజరాత్), సంజూ శాంసన్‌లకు (రాజస్థాన్), యశస్వి జైస్వాల్ (రాజస్థాన్), రవీంద్ర జడేజా (సీఎస్కే) రూ. 18 కోట్లు దక్కాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద ఎంఎస్ ధోనికి అత్యల్పంగా రూ. 4 కోట్లు దక్కాయి. కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ జాక్ పాట్ కొట్టాడు. అతని పారితోషికం రూ. 55 లక్షల నుంచి రూ. 13 కోట్లకు పెరిగింది.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. రిటెన్షన్ పూర్తి లిస్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!నిబంధనలు ఇవీఅంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురుఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంతఅయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవేముంబై ఇండియన్స్1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు2. జస్ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు5. నమన్ ధీర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ఆకాశ్ మధ్వాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు4. యశ్ దయాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అనూజ్ రావత్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు5. ఎంఎస్ ధోని(అన్క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు5. హర్షిత్ రాణా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. అంగ్క్రిష్ రఘువంశీ(అన్‌కాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 55 కోట్లురాజస్తాన్ రాయల్స్1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు5. సందీప్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది- రూ. 55 కోట్లులక్నో సూపర్ జెయింట్స్1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు4. ఆయుశ్ బదోని(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. మొహ్సిన్ ఖాన్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుపంజాబ్ కింగ్స్1. అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు2. సామ్ కరన్- రూ. 14 కోట్లు3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు4. అశుతోశ్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ప్రభ్‌సిమ్రన్ సింగ్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు4. రసిఖ్ సలాం దర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అభిషేక్ పోరెల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు 6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్1. శుబ్‌మన్ గిల్- రూ. 18 కోట్లు2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు5. రాహుల్ తెవాటియా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. మోహిత్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
సన్‌రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ గత సీజన్లో తన అద్భుత ఆటతో జట్టును ఫైనల్ వరకు చేర్చిన హెన్రిచ్ క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ నమ్మకముంచింది. వచ్చే సీజన్‌కూ అతడిని తమతో అట్టి పెట్టుకునేందుకు రైజర్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇందు కోసం భారీగా రూ. 23 కోట్లు చెల్లించేందుకు కూడా టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. వీరిలో ఒకరైనా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. ఈ ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు అక్టోబర్ 31 వరకు గవరి్నంగ్ కౌన్సిల్ గడువు ఇచి్చంది. ప్రతీ టీమ్ తాము కొనసాగించే తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్క్యాప్డ్ అయితే రూ. 4 కోట్లు చెల్లించాలి. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచి్చన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఫ్రాంచైజీలకు ఉంది. ఈ నేపథ్యంలో కెపె్టన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇచ్చేందుకు రైజర్స్ సిద్ధంగా ఉంది. 2024 సీజన్లో క్లాసెన్ 15 ఇన్నింగ్స్‌లలో 171.07 స్ట్రయిక్‌రేట్‌తో 479 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 38 సిక్స్‌లు ఉన్నాయి.అభిõÙక్ 16 ఇన్నింగ్స్‌లలో 204.21 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేయగా... 36 ఫోర్లు, 42 సిక్స్‌లు బాదాడు. 2023 ఐపీఎల్‌కు ముందు మినీ వేలంలో క్లాసెన్‌ను సన్‌రైజర్స్ రూ. 5.25 కోట్లకు తీసుకొని తర్వాతి ఏడాది కొనసాగించింది. ఇప్పుడు అతనికి లభించే మొత్తం గతంతో పోలిస్తే ఏకంగా 338 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ముగ్గురి కొనసాగింపు దాదాపు ఖరారు కాగా... నాలుగో, ఐదో ఆటగాళ్లుగా ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను కూడా అట్టి పెట్టుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి విధ్వంసకర వీరుడు ఔట్
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 నుంచి సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల చేత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు క్లాసెన్ ప్రకటించాడు. సీజన్ మొత్తానికి తాను దూరంగా ఉండనున్నట్లు క్లాసెన్ వెల్లడించాడు. క్లాసెన్ వైదొలగడం అతని ఫ్రాంచైజీ సెయింట్ లూసియా కింగ్స్‌కు కోలకోలేని ఎదురుదెబ్బ. సెయింట్ లూసియా క్లాసెన్ స్థానాన్ని న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫర్ట్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెయింట్ లూసియా ఈ ఏడాది జూన్‌లో డ్రాఫ్ట్ కంటే ముందు క్లాసెన్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు (2022 ఎడిషన్‌లో) అతను గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడాడు. క్లాసెన్ రీప్లేస్మెంట్ అయిన టిమ్ సీఫర్ట్‌కు కూడా మంచి టీ20 ట్రాక్ రికార్డు ఉంది. సీఫర్ట్ 2020లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.మరోవైపు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా వైదొలిగాడు. గాయం కారణంగా జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ప్రకటించాడు. రజా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండింది. ఆ ఫ్రాంచైజీ రజా స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌కు మరికొంత మంది స్టార్ ఆటగాళ్లు పాక్షికంగా దూరం కానున్నారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరం కానుండగా.. బార్బడోస్ రాయల్స్ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ సీజన్ తొలి రెండు మ్యాచ్‌లు మిస్ కానున్నారు. టిమ్ డేవిడ్ స్థానాన్ని యూస్ఏ ఆండ్రియస్ గౌస్.. డేవిడ్ మిల్లర్ స్థానాన్ని దునిత్ వెల్లలగే.. కేశవ్ మహారాజ్ స్థానాన్ని షమారా బ్రూక్స్ భర్తీ చేయనున్నారు. కాగా, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఈ రోజు (ఆగస్ట్ 29) నుంచి ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లు మరుసటి రోజు ఉదయం ప్రారంభమవుతాయి. -
T20 WC: అందరినీ ఓడిస్తాం.. ఈసారి ట్రోఫీ మాదే: మార్క్రమ్
ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలో అదరగొట్టడం.. నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోయి ఇంటి బాట పట్టడం.. ఫలితంగా ‘చోకర్స్’ అనే ముద్ర. అవును.. సౌతాఫ్రికా గురించే ఈ ప్రస్తావన. పటిష్ట జట్టుగా పేరొందిన ప్రొటిస్ జట్టు 1998లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించింది.అదే మొదలు.. అదే ఆఖరుహాన్సీ క్రోంజీ సారథ్యంలో ఫైనల్లో వెస్టిండీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అయితే, ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ ఒక్కసారి కూడా మెగా టోర్నీ విజేతగా నిలవలేకపోయింది. కానీ.. ఈసారి మాత్రం ఆ అపవాదును చెరిపేసుకుంటామంటున్నాడు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్.టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు మార్క్రమ్. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ప్రొటిస్ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డీ లో ఉంది.ఈ క్రమంలో న్యూయార్క్ వేదికగా సోమవారం శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ వరల్డ్‌కప్ గెలిచేందుకే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నాడు.ఈసారి ట్రోఫీ మాదే‘‘నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ టోర్నీలో పోటీపడుతున్న జట్లన్నీ గొప్పగానే ఆడుతున్నాయి. అయితే, మేము గనుక ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చామంటే.. మా అత్యుత్తమ ప్రదర్శనతో ముందుకు సాగుతూనే ఉంటాం.ప్రత్యర్థి ఎవరైనా ఓడించే తీరతాం. మా ఆట తీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, మేము ఇక్కడికి వచ్చింది మాత్రం ట్రోఫీ గెలిచేందుకే!’’ అని పేర్కొన్నాడు. ఈసారి చాంపియన్లుగా నిలిచేది తామేనంటూ మార్క్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సౌతాఫ్రికా జట్టు ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది? -
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్‌బ్లాంక్! వీడియో
ఐపీఎల్-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఈ మ్యాచ్‌లో గనుక సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిచి.. తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్తాన్ రాయల్స్‌ను ఓడిస్తే ఏకంగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్ సింగ్(45 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సన్‌రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ముప్పుతిప్పలు పెట్టాడు.ఈ క్రమంలో 15వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన విజయకాంత్ వియస్కాంత్ రెండో బంతికి ప్రభ్‌సిమ్రన్‌ను ఊరించాడు. దీంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ప్రభ్‌సిమ్రన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అలా దురదృష్టకరరీతిలో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌బ్యాటర్ రిలీ రొసో(49), కెప్టెన్ జితేశ్ శర్మ(15 బంతుల్లో 32 నాటౌట్) రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన ఆరెంజ్ ఆర్మీకి ఆరంభంలోనే షాకిచ్చాడు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. అతడి దెబ్బకు రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(0) పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 33)ని హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. Right wicket at the right time 😎Prabhsimran's solid knock comes to an end courtesy of a Klaasy catch 💪Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/a87LCfvi9g— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
నితీశ్ రెడ్డి మెరుపులు..సన్‌రైజర్స్ అనూహ్య గెలుపు (ఫొటోలు)
-
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మన్లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. ఎంఐ కేప్‌టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి. -
SRH: ‘బాధితులు’ మరింత అసూయ పడేలా..
(43 X 4) + (38 X 6).. మొత్తం 81.. ఇదేంటి లెక్క తప్పు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండీ.. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో నమోదైన ఫోర్లు, సిక్సర్లూనూ!! చిన్నస్వామి స్టేడియం బౌండరీ చిన్నదే కావొచ్చు.. అయినా.. ఇలా బ్యాట్ తాకించగానే అలా బంతి అవతల పడదు కదా.. ఫోర్స్‌గా కొడితేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలా తమ పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులకు కనువిందు చేశారు ఇరు జట్ల బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ 2, ట్రావిస్ హెడ్ 8, హెన్రిచ్ క్లాసెన్ 7, ఐడెన్ మార్క్రమ్ 2, అబ్దుల్ సమద్ 3 సిక్స్‌లు బాదారు. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 ఇలా ఓవరాల్‌గా ఎస్ఆర్హెచ్ ఖాతాలో 22 సిక్సర్లు నమోదు కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డులకెక్కింది. మరోవైపు.. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండు, ఫాఫ్ డుప్లెసిస్ 4, దినేశ్ కార్తిక్ 7, మహిపాల్ లామ్రోర్ రెండు సిక్స్‌లు బాదారు. తడిసి ముద్దైన చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ ఆద్యంతం ఇలా సిక్సర్ల వర్షంలో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవుతుంటే టీ20 ప్రేమికులంతా కేరింతలు కొట్టారు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే ఇది కదా పొట్టి ఫార్మాట్ మజా అనుకుంటూ మురిసిపోయారు. బ్యాటర్‌ను అయినా బాగుండు ఫలితం ఎలా ఉన్నా మంచినీళ్ల ప్రాయంలా సన్‌రైజర్స్- ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో బాధితులుగా మిగిలిపోయిన బౌలర్లు కూడా తాము కూడా అప్పటికప్పుడు బ్యాటర్ అయి పోయి ఉంటే బాగుండు అనుకునేంతగా అసూయ పడేలా చేశారు. విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్, మూడు వికెట్లు తీసిన పేసర్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘నేను బ్యాటర్‌ను అయినా బాగుండు. సూపర్ మ్యాచ్. అద్భుతమైన దృశ్యాలు. అంతకు మించిన వినోదం. చిన్నస్వామి స్టేడియం పిచ్ ఈరోజు పొడిగా ఉంది. దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాం’’ అని కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సృష్టించిన అరుదైన రికార్డులు ►ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- 22 ►టీ20 క్రికెట్లో నేపాల్(314) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు(287). ►ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు- 287/3. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం చదవండి: #RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్ -
శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్, ఓపెనింగ్ జోడీ లేకపోవడం.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ రాణించకపోవడం.. హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్‌రైజర్స్‌కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 విన్నింగ్ కెప్టెన్ కోసం 20 కోట్లు కానీ.. సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అదే విధంగా వరల్డ్‌కప్ హీరో ట్రావిస్ హెడ్‌ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్‌ను కెప్టెన్ చేయడం సన్‌రైజర్స్ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా! నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్ కానీ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్ వంటి హిట్టర్లకు తోడు నితీశ్ కుమార్‌రెడ్డి, అబ్దుల్ సమద్ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈ స్టార్ పేసర్ తనతో పాటు భువీ, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్‌లతో పాటు స్పిన్నర్ మయాంక్ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. మాస్టర్ మైండ్ ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో పిచ్‌ను సరిగ్గా రీడ్ చేసిన కమిన్స్ వన్‌డౌన్‌లో క్లాసెన్‌ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్(31 బంతుల్లో 67) ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఆఖర్లో మార్క్రమ్(17 బంతుల్లో 32), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 37) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. Abdul Samad in the house now 😎 Flurry of sixes at the Chinnaswamy 💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/eWFCtZ5Usq — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్ కమిన్స్ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు. ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్..నటరాజన్ ఇలా ఒక్కో ఓవర్‌కు వైవిధ్యం చూపించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్ మయాంక్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం మయాంక్ మార్కండే కోహ్లి(42) బౌల్డ్ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62), దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్‌గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్ కూల్ ధోనిలా కూల్‌గా డీల్ చేస్తూ సన్‌రైజర్స్‌ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు. తద్వారా రైజర్స్ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్ బౌలర్.. తొలుత ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టాడు. Nothing but bright smiles and 𝙜𝙤𝙤𝙤𝙤𝙤𝙤𝙙 vibes after a historic night of cricket 😁🔥#PlayWithFire #RCBvSRH pic.twitter.com/RXn6mb5pF1 — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్‌ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. డేవిడ్ వార్నర్ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 -
ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్ వైరల్
‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన మాదిరే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్.. లేదంటే ఫోర్.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67) ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్ విరాట్ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్‌లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ చూసి ఫ్యాన్స్.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC — Rohan Naik (@RohanNaik_) April 15, 2024 ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్ మండిపాటు ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఆఖర్లో దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్ రావత్(14 బంతుల్లో 25 నాటౌట్) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A 1⃣0⃣8⃣m monster! 💥 The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf — IndianPremierLeague (@IPL) April 15, 2024 -
క్లాసెన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఉర మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్ ఇన్నింగ్స్‌లోని ఓ సిక్స్ దెబ్బకు స్టేడియం పైకప్పు దాటి వెళ్లింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన ఫెర్గూసన్ రెండో బంతిని క్లాసెన్‌కు లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ అద్బుతమైన లాఫ్టెడ్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. దెబ్బకు బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. అతడు కొట్టిన సిక్స్ ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. Got an update from #Chandrayaan, the ball is still travelling at the speed of light 😉#TATAIPL #RCBvSRH #IPLonJioCinema #HeinrichKlaasen #IPLinTelugu pic.twitter.com/fmVeijmSlk — JioCinema (@JioCinema) April 15, 2024 -
క్లాసెన్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులు మాత్రమే ఎదుర్కొన్న క్లాసెన్.. 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 -
గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అద్బుతమైన స్టంపింగ్‌తో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను క్లాసెన్ పెవిలియన్‌కు పంపాడు. మెరుపు వేగంతో స్టంప్ చేసిన క్లాసెన్.. భారత లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడింది. ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌ను ఎదుర్కోవడానికి పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో భువీ స్వింగ్‌ను కట్ చేసేందుకు ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన భువీ బౌలింగ్‌లో ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి అద్బుతమైన షాట్ ఆడాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వికెట్ కీపర్ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా తీసుకువచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. భువీ వేసిన అదే ఓవర్లో నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి.. వికెట్ల వెనకు క్లాసెన్‌కు చిక్కాడు. గంటకు 140 కి.మీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్ మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 𝗤𝘂𝗶𝗰𝗸 𝗛𝗮𝗻𝗱𝘀 𝘅 𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 ⚡️ Relive Heinrich Klaasen's brilliant piece of stumping 😍👐 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/sRCc0zM9df — IndianPremierLeague (@IPL) April 9, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH Vs GT: రషీద్ ఖాన్ సూపర్ డెలివరీ.. క్లాసెన్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 24 పరుగులు చేశాడు. అయితే తనకు వచ్చిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్గామలచడంలో క్లాసెన్ విఫలమయ్యాడు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్బుతమైన బంతితో క్లాసెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో మూడో బంతిని రషీద్ ఫ్లాట్‌గా సంధించాడు. బంతి టర్న్ అవుతుందని భావించిన క్లాసెన్.. ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఫ్లాట్‌గా వచ్చిన బంతి క్లాసెన్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ క్లాసెన్ మాత్రం నిరాశతో తన బ్యాట్‌కు పంచ్‌లు ఇస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. pic.twitter.com/J6y5BOQ5IE — Sitaraman (@Sitaraman112971) March 31, 2024 -
చెప్తే అర్థం కాదా?.. సన్‌రైజర్స్ స్టార్‌కు చెప్పు చూపించిన యువీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో ‘‘నీకోసం.. ప్రత్యేకంగా ఓ చెప్పు ఎదురుచూస్తోంది’’ అంటూ ఊహించని షాకిచ్చాడు. ఇంతకీ విషయమేమిటంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులతో అదరగొట్టాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి.. సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు. Abhishek Sharma's scintillating knock comes to an end but he's put @SunRisers on 🔝 with his astonishing strokes 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/OoHgAK6yge — IndianPremierLeague (@IPL) March 27, 2024 అయితే, ముంబై బౌలర్ పీయూష్ చావ్లా సంధించిన షార్ట్‌బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేక నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సూపర్ సర్.. వారెవ్వా అభిషేక్.. గొప్ప ఇన్నింగ్స్. కానీ ఇలాంటి షాట్‌కు అవుటవుతావా? నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా? అందుకే ఇప్పుడు నీ కోసం ప్రత్యేకంగా ఓ స్లిప్పర్ ఎదురుచూస్తోంది. వచ్చెయ్’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అదే విధంగా.. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్‌ను కూడా కొనియాడాడు. కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌కు యువీ ఆరాధ్య క్రికెటర్. అంతేకాకుండా.. అతడికి మెంటార్ కూడా! Waah sir Abhishek waah 👏🏻 great innings but what a splendid shot to get out on! Laaton ke bhoot baaton se nahi maante! Special 🩴 waiting for you now @IamAbhiSharma4 Great knock by Klassy #Klaasen! #SRHvMI #IPL2024 — Yuvraj Singh (@YUVSTRONG12) March 27, 2024 అందుకే యువరాజ్ ఈ మేరకు అభిషేక్ ఆట తీరును విశ్లేషిస్తూ.. చొరవగా ఇలా ట్వీట్ చేశాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా 277 పరుగులు స్కోరు చేసిన సన్‌రైజర్స్.. ముంబైని 246 పరుగులకు కట్టడి చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది. చదవండి: #SRHvsMI: ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ! వైరల్ The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
గంతులేసిన కావ్య.. ఈ దారుణం చూడలేనని కళ్లు మూసుకున్న నీతా!
IPL 2024: సిక్సర్ల మోత.. బౌండరీల జాతర.. ముంబై బౌలింగ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత చూస్తుంటే ఇది కదా అసలైన ఐపీఎల్ మ్యాచ్ మజా అనిపించింది. ముఖ్యంగా స్లో బ్యాటింగ్ జట్టు అనే అపఖ్యాతి మూటగట్టుకున్న సన్‌రైజర్స్ సొంత మైదానంలో రెచ్చిపోవడంతో అభిమానులకు కన్నుల పండుగే అయ్యింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. సిక్సర్ల వర్షం కురిపిస్తూ రైజర్స్ ఆటగాళ్లు బ్యాట్ ఝులిపిస్తే.. ముంబై బౌలర్ల ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) ఏమాత్రం జాలి లేకుండా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వెరసి ఉప్పల్‌లో సన్‌రైజర్స్ 277 పరుగులు చేసి ఐపీఎల్లో ఆల్‌టైమ్ అత్యధిక రన్స్ స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. మరోవైపు.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభమే లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా జోరు మీదున్న ఓపెనర్లు రోహిత్ శర్మ(12 బంతుల్లో 26), ఇషాన్ కిషన్(13 బంతుల్లో 34) త్వరగానే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఆ తర్వాత నమన్ ధిర్(14 బంతుల్లో 30) కాసేపు మెరుపులు మెరిపించినా.. స్థానిక బ్యాటర్ తిలక్ వర్మ(34 బంతుల్లో 64) అద్భుతమైన అర్థ శతకం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ ధనాధన్ ఇన్నింగ్స్(22 బంతుల్లో 42 నాటౌట్)తో చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఫలితంగా 31 పరుగులతో ఓడిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది. The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఇక ఆద్యంతం ఆసక్తి రేపుతూ.. అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు సెలబ్రిటీల హావభావాలు మాత్రం హైలైట్‌గా నిలిచాయి. వారు మరెవరో కాదు సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్.. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ. ఎప్పుడూ ఆఖరిదాకా ఊరించి ఓటమి పాలయ్యే జట్టుగా పేరున్న రైజర్స్ ఉప్పల్‌లో అదరగొడుతుంటే కావ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్లు బాదినపుడు ఆమె సీట్లో నుంచి లేచి నిలబడి చిన్నపిల్లలా గెంతులు వేశారు. pic.twitter.com/I3UhbAzCiP — Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2024 అదే విధంగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగానే.. ఆమె సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు.. రైజర్స్ బ్యాటర్ల ఊచకోత ఇక చూడలేనన్నట్లు నీతా అంబానీ తలపట్టుకుని కళ్లు మూసుకున్నారు. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 అంతేకాదు.. ఇక ఇది అయ్యే పని కాదన్నట్లుగా కొడుకు ఆకాశ్ అంబానీతో కలిసి ఫోన్ చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 18 సిక్సర్లు, 19 ఫోర్లు బాదితే.. ముంబై 20 సిక్స్‌లు, 12 బౌండరీలు బాదింది. చదవండి: #srhvsmi: మా బౌలర్ల తప్పు లేదు.. వారి వల్లే ఓడిపోయాం: పాండ్యా WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
Kavya Maran Photos: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప (ఫొటోలు)