ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!
నిబంధనలు ఇవీ
అంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.
అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు.
గరిష్టంగా ఆరుగురు
ఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.
ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.
రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత
అయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.
ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవే
ముంబై ఇండియన్స్
1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు
2. జస్‌ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు
3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు
4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు
5. నమన్ ధీర్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
5. ఆకాశ్ మధ్వాల్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
పర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు
2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు
3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు
4. యశ్ దయాల్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
5. అనూజ్ రావత్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్
1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు
2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు
3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు
4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు
5. ఎంఎస్ ధోని(అన్‌క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్
1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు
2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు
3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు
4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు
5. హర్షిత్ రాణా(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. అంగ్‌క్రిష్ రఘువంశీ(అన్‌కాప్డ్)- రూ. 4 కోట్లు
పర్సులో మిగిలేది: రూ. 55 కోట్లు
రాజస్తాన్ రాయల్స్
1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు
2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు
3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు
4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు
5. సందీప్ శర్మ(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది- రూ. 55 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్
1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు
2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు
3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు
4. ఆయుశ్ బదోని(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
5. మొహ్సిన్ ఖాన్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు
పంజాబ్ కింగ్స్
1. అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు
2. సామ్ కరన్- రూ. 14 కోట్లు
3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు
4. అశుతోశ్ శర్మ(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
5. ప్రభ్‌సిమ్రన్ సింగ్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు
2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు
3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు
4. రసిఖ్ సలాం దర్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
5. అభిషేక్ పోరెల్(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)
2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు
3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు
4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు
5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు
6. రైట్ టు మ్యాచ్ కార్డు
పర్సులో మిగిలేది: రూ. 45 కోట్లు
గుజరాత్ టైటాన్స్
1. శుబ్‌మన్ గిల్- రూ. 18 కోట్లు
2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు
3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు
4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు
5. రాహుల్ తెవాటియా(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
6. మోహిత్ శర్మ(అన్‌క్యాప్డ్)- రూ. 4 కోట్లు
పర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.
చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్
Comments
Please login to add a commentAdd a comment