Nitish Kumar Reddy
-
వంద శాతం ఫిట్‌గా ఉన్నా.. మేనేజ్మెంట్ నుంచి పిలుపు రాలేదు: టీమిండియా స్టార్
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశంఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్‌ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్‌ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ముంబై తరఫున రంజీ బరిలోఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్‌పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.వంద శాతం ఫిట్నెస్ సాధించానుఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆరంభ మ్యాచ్‌లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్నెస్ సాధించాను.బౌలింగ్‌లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్‌లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్‌లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.ఇప్పటి వరకు పిలుపు రాలేదుటీమిండియా మేనేజ్మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్‌లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్ చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డ్!
ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా ఆసీస్‌లో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇక ఆసీస్‌తో సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఇండోర్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు(శుక్రవారం- ఆదివారం) ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA) ఇందుకు వేదిక. కేవలం పదిహేను పరుగులకేఅయితే, ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్‌ను కొనసాగించినట్లు సమాచారం. కేవలం పదిహేను పరుగులకే అతడు అవుట్ అయినట్లు తెలుస్తోంది. తనదైన శైలిలో చక్కగా ఆట మొదలుపెట్టి కవర్ డ్రైవ్‌లతో అలరించిన కోహ్లి.. తప్పుడు షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు. భారత పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు.పంత్ క్లీన్బౌల్డ్మరోవైపు.. రిషభ్ పంత్ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కూడా 16 పరుగులకే అవుటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్టు ఒకరు పెర్త్ నుంచి ఈ మేరకు సోషల్ మీడియాలో అప్డేట్స్ షేర్ చేశారు.కోహ్లికి గాయం?ఇక వార్మప్ మ్యాచ్‌లో అవుటైన వెంటనే కోహ్లి, పంత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు తిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌కు ముందు కోహ్లి గాయపడినట్లు వార్తలు వచ్చాయి. స్కానింగ్ తర్వాత మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. మరోవైపు.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ సైతం గాయం కారణంగా ఫీల్డ్‌ను వీడినట్లు సమాచారం.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో రాణించడం తప్పనిసరి. ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు రోహిత్ సేన అర్హత సాధిస్తుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవంఅయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తొలిసారిగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు క్లీన్‌స్వీప్‌నకు గురైంది.ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1. ఇక నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్ మొదలుకానుంది. ఇక టీమిండియా కంటే ముందు ఆసీస్‌లో అడుగుపెట్టిన ఇండియా-‘ఎ’ అనధికారిక టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ అయింది.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు ముందు రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్‌పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్‌లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్‌లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్‌లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. రిటెన్షన్ పూర్తి లిస్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!నిబంధనలు ఇవీఅంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురుఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంతఅయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవేముంబై ఇండియన్స్1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు2. జస్ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు5. నమన్ ధీర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ఆకాశ్ మధ్వాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు4. యశ్ దయాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అనూజ్ రావత్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు5. ఎంఎస్ ధోని(అన్క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు5. హర్షిత్ రాణా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. అంగ్క్రిష్ రఘువంశీ(అన్‌కాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 55 కోట్లురాజస్తాన్ రాయల్స్1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు5. సందీప్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది- రూ. 55 కోట్లులక్నో సూపర్ జెయింట్స్1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు4. ఆయుశ్ బదోని(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. మొహ్సిన్ ఖాన్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుపంజాబ్ కింగ్స్1. అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు2. సామ్ కరన్- రూ. 14 కోట్లు3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు4. అశుతోశ్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ప్రభ్‌సిమ్రన్ సింగ్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు4. రసిఖ్ సలాం దర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అభిషేక్ పోరెల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు 6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్1. శుబ్‌మన్ గిల్- రూ. 18 కోట్లు2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు5. రాహుల్ తెవాటియా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. మోహిత్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
గంభీర్ సర్ చెప్పడం వల్లే.. ఆరోజు అలా: నితీశ్ రెడ్డి
క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అరుదుగా ఉంటారు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆ కోవకు చెందిన వాడే. ప్రస్తుతం భారత్ తరఫున టాప్ క్లాస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఈ బరోడా క్రికెటర్ కొనసాగుతున్నాడు. అయితే, అతడి సేవలు పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాయి. ఫిట్నెస్ దృష్ట్యా వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్న హార్దిక్.. టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల మరోసారి రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్ చేసినా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జట్టులో మాత్రం అతడి పేరు లేదు.తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డికే ఓటుఈ క్రమంలో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కాదని మరీ సెలక్టర్లు తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డికి ఓటు వేశారు. పొట్టి ఫార్మాట్లో రాణిస్తున్న ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్‌ను ఆసీస్ టూర్‌కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడైన పేస్‌తో రాణించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. గంటకు 140- 145 కిలోమీటర్ల వేగం కంటే.. 130- 135 మధ్య వేగంతో బౌలింగ్ చేస్తూ పేస్పై ఎక్కువగా దృష్టి పెడతానని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విలువైన సూచనలు ఇచ్చాడని.. ఆయన మార్గదర్శనంలో అనుకున్న ఫలితాలు రాబట్టగలనని ధీమా వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన నితీశ్‌రెడ్డి.. ఇటీవల బంగ్లాతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. రెండో టీ20లో మాత్రం దుమ్ములేపాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగుల వరద పారించాడు.4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడికేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి ఏకంగా 74 పరుగులు రాబట్టాడు. అదే మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో తన ప్రదర్శన గురించి తాజాగా గుర్తుచేసుకున్న నితీశ్‌రెడ్డి గంభీర్ వల్లే తను స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగానని తెలిపాడు. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆరంభంలో నాకేమీ అర్థం కాలేదు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం దూకుడుగా ఆడమని చెప్పింది. ఐపీఎల్లో ఎలా ఆడానో అచ్చం అలాగే ప్రత్యర్థి బౌలింగ్‌పై అటాక్ చేయాలని చెప్పారు. అదే మైండ్సైట్తో ఇక్కడా ఆడాలని సూచించారు. పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయమన్నారు. నాకింకా గుర్తుంది.. ఆరోజు డ్రింక్స్ బ్రేక్‌కు ముందు నేను రివర్స్ స్వీప్ షాట్ ఆడాను.నీకు ఆ పవర్ ఉందిఅయితే, ప్రత్యర్థి జట్టు డీఆర్ఎస్కు వెళ్లగా అంపైర్స్ కాల్ ద్వారా నాటౌట్‌గా నిలిచాను. అప్పుడు గౌతం సర్ నా దగ్గరికి వచ్చారు. ‘నితీశ్ నువ్వు బలంగా బంతిని బాదగలవు. నీకు ఆ పవర్ ఉంది. బంతిని బౌండరీ లైన్‌ను ఈజీగా దాటేలా చేయగలవు. అలాంటపుడు రివర్స్ షాట్‌తో నీకు పనిలేదు. ముఖ్యంగా ఇలాంటి వికెట్ల(ఢిల్లీ)పై అలా ఆడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.ఆయన మాటలు నాలో ఉత్సాహం నింపాయి. నా బ్యాట్ పవరేంటో చూపించాను. ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు నేను మరింత దూకుడుగా ఆడాను’’ అని నితీశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకూ సిద్ధంగా ఉన్నానన్న 21 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ బౌలింగ్‌లోనూ నిలకడ ప్రదర్శించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూ జిలాండ్‌తో టెస్టులతో బిజీగా ఉన్న టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో నితీశ్ సహా పలువురు యువ ఆటగాళ్లు ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టారు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
BGT: ఆసీస్‌తో టెస్టు సిరీస్ జట్టు.. నితీశ్ కుమార్ రెడ్డికి చోటు
ముంబై: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ సిరీస్‌కు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన 21 ఏళ్ల నితీశ్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ కాలం పేస్ ఆల్‌రౌండర్‌గా సేవలందించగల సత్తా ఉండటంతోనే సెలెక్టర్లు నితీశ్ వైపు మొగ్గుచూపారు. నవంబర్ 22 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీని కోసం బీసీసీఐ శుక్రవారం రాత్రి 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నితీశ్‌తో పాటు ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పరిగణించలేదు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ ఆసీస్ పర్యటనకూ ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. సఫారీతో టి20 సిరీస్‌కు రమణ్‌దీప్, వైశాక్ దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం కూడా బీసీసీఐ శుక్రవారమే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్, కర్ణాటక సీమర్ విజయ్ కుమార్ వైశాక్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. గాయాల బారిన పడ్డ శివమ్ దూబే, మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో నాలుగు టి20 మ్యాచ్‌లు నవంబర్ 8న (డర్బన్), 10న (పోర్ట్ ఎలిజబెత్), 13న (సెంచూరియన్), 15న (జొహనెస్‌బర్గ్) జరుగుతాయి. ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టు ప్రకటన అప్పుడే.. రేసులో ఆంధ్ర కుర్రాడు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ అనంతరం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మీడియా కథనాల మేరకు ఆంధ్ర యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత జట్టుకు ఎంపిక చేస్తారని తెలుస్తుంది. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్ ఎంపిక జరగవచ్చని ప్రచారం జరుగుతుంది. ఆస్ట్రేలియా కండీషన్స్‌లో నితీశ్ సీమ్ బౌలింగ్ భారత్‌కు లబ్ది చేకూరుస్తుందని సెలెక్టర్లు భావిస్తున్నారట. మరోవైపు ఇదే సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బెర్త్ కోసం శార్దూల్ ఠాకూర్ కూడా పోటీ పడుతున్నాడని తెలుస్తుంది. శార్దూల్‌కు గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉండటంతో సెలెక్టర్లు ఇతని పేరును కూడా పరిశీలిస్తునట్లు సమాచారం. బీజీటీ కోసం శార్దూల్, నితీశ్లలో ఎవరిని ఎంపిక చేస్తారో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.కాగా, 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో నితీశ్ ఓ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్శించాడు. నితీశ్ ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ విశేషంగా రాణించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టులో కూడా నితీశ్ చోటు దక్కించుకున్నాడు.నవంబర్ 22 నుంచి మొదలు..భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 3తో ఈ పర్యటన ముగియనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జంబో జట్టును ఎంపిక చేస్తారని సమాచారం.చదవండి: బంగ్లాదేశ్ గడ్డపై సరికొత్త చరిత్ర -
మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డికి బంపరాఫర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సత్తా చాటిన యువ క్రికెటర్లు మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డిల రాత మారిపోయింది. ఇటీవలే వీరిద్దరు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్, నితీశ్ సెలక్టర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.కివీస్‌తో సిరీస్‌కు...ఈ సిరీస్‌లో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. రెండో టీ20లో నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్(34 బంతుల్లో 74)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికచేశారు సెలక్టర్లు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ వీరికి మరో శుభవార్త అందించాడు. కివీస్‌తో సిరీస్‌లో వీరిని టెస్టుల్లో ఆడించే ఉద్దేశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారో? లేదో?‘‘యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాం. అయితే, వాళ్లు ఎక్కువగా రెడ్‌బాల్ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ వారిలోని నైపుణ్యాలకు మరింత పదునుపెట్టేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. అందుకే మరింత నిశితంగా పరిశీలించేందుకు వీలుగా రిజ్వర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాం.తమకు దొరికిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. టెస్టు క్రికెట్ ఆడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. మా బెంచ్ స్ట్రెంత్‌ను పెంచుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.గాయాల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ బ్యాకప్ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సిరీస్‌లో వారు మాతో పాటే ప్రయాణిస్తారు కాబట్టి.. దగ్గరగా గమనిస్తాం. వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయగలరా? జట్టుకు ఎంతమేర ఉపయోగపడతారు? అన్న అంశాలు పరిశీలిస్తాం.ముఖ్యంగా ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. మా దగ్గర ఇప్పుడు 8- 9 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలోనూ వీలైనంత మంది అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉందివీరిలో చాలా మంది దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఆడారు. ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లను కివీస్‌తో టెస్టులకు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేయడానికి కారణం.. వాళ్లను దగ్గరగా గమనించి ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉండటమే’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.కాగా ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా న్యూజిలాండ్ టెస్టులకు ట్రావెలింగ్ రిజర్వులుగా ఉన్నారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున వికెట్లు పడగొట్టిన మయాంక్ గాయం కారణంగా ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం, జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి పునరావాసం పొందాడు. తర్వాత నేరుగా టీమిండియాలో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వగలిగాడు.చదవండి: షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ 💬💬 Our focus is to improve and better our performance.#TeamIndia Captain Rohit Sharma ahead of the #INDvNZ Test series 👌👌@IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/mJMOvVgVDw— BCCI (@BCCI) October 15, 2024 -
గంభీర్ సూచించాడు నేను పాటించాను: నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్‌పై రెండో టి20లో చెలరేగేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ కిటుకులు దోహదం చేశాయని చెప్పాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శన క్రెడిట్ అంతా కోచ్‌కే దక్కుతుందన్నాడు. పవర్‌ప్లేలోనే టాపార్డర్‌ను కోల్పోయిన దశలో నితీశ్, హిట్టర్ రింకూ సింగ్‌లు మెరుపు అర్ధశతకాలతో బంగ్లా బౌలర్లను చితగ్గొట్టారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు కేవలం 49 బంతుల్లోనే 108 పరుగులు జోడంచడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆంధ్ర హిట్టర్ ఏకంగా ఏడు సిక్సర్లు బాదడం విశేషం. 34 బంతుల్లోనే 74 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే! భాగస్వామ్యంపై అతను మాట్లాడుతూ ‘మా ఇద్దరి మధ్య సానుకూల సంభాషణ జరిగింది. ఎలాంటి ఒత్తిడికి గురవొద్దని నిర్ణయించుకున్నాం. మా దృష్టి ఎదుర్కొనే స్పిన్నర్లపైనే ఉండింది. స్కోరుపై కాదు! ఈ ఓవర్ మనకు కీలకమని అనుకున్నాం. అదే అదనుగా దంచేశాం. నిజం చెప్పాలంటే ఈ మెరుపు ప్రదర్శనకు కారణం కోచ్ గంభీరే. అతను నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ముఖ్యంగా బౌలింగ్‌పై బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు. బౌలింగ్ చేసేటపుడు బౌలర్‌గానే ఆలోచించాలని బ్యాటర్‌గా కాదని చెప్పాడు. ఇది నాకు బాగా పనిచేసింది. యథేచ్చగా ఆడేలా, స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా ఉపకరించింది’ అని బీసీసీఐ వీడియోలో నితీశ్ వెల్లడించాడు. భారత్ తరఫున ఆడుతూ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. రింకూ సింగ్ మాట్లాడుతూ... ‘నితీశ్, నేను బ్యాటింగ్‌లో చెలరేగడాన్ని ఆస్వాదించాను’ అని చెప్పాడు. ఇలా బాదడం బహుశా భగవంతుడి ప్రణాళిక కావొచ్చని నితీశ్‌కు చెప్పినట్లు రింకూ పేర్కొన్నాడు. టాపార్డర్ కూలినపుడు, ఒత్తిడిలోనే ఇలాంటి భాగస్వామ్యాలు సాధ్యమైనట్లు చెప్పాడు. తాను భారత్‌కు ఎంపికైన ప్రతీసారి సిరీస్ గెలుపొందడం చెప్పుకోదగ్గ విశేషమన్నాడు. కెపె్టన్ సూర్యకుమార్ తమదైన శైలిలోనే ఆడేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పాడు. -
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
IND vs BAN: న్యూఢిల్లీలో నితీశ్ ‘షో’.. సిరీస్ భారత్ సొంతం
అందివచ్చి న అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్ముదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. వైజాగ్ కుర్రాడి వీరవిహారం... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్‌లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆది నుంచి తడబాటే! ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్ దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్ దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–17, 2–25, 3–41, 4–149, 5–185, 6–213, 7–214, 8–214, 9–220, బౌలింగ్: మిరాజ్ 3–0–46–0; తస్కీన్ 4–0–16–2; తన్జీమ్ 4–0–50–2; ముస్తఫిజుర్ 4–0–36–2; రిషాద్ 4–0–55–3; మహ్ముదుల్లా 1–0–15–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిõÙక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–40, 3–42, 4–46, 5–80, 6–83, 7–93, 8–120, 9–127, బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1; నితీశ్ కుమార్ రెడ్డి 4–0–23–2; వాషింగ్టన్ సుందర్ 1–0–4–1; వరుణ్ చక్రవర్తి 4–0–19–2; అభిషేక్ 2–0–10–1; మయాంక్ యాదవ్ 4–0–30–1; రియాన్ పరాగ్ 2–0–16–1. -
బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. నితీశ్ కుమార్ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకెర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం
బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టి20లు ఆడిన 116వ, 117వ ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్‌కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీశ్... టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్‌లు అందుకున్నారు. వైజాగ్‌కు చెందిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డికి ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ఆకట్టుకోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా... చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా నితీశ్ ఆ టూర్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నితీశ్ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్‌రేట్‌తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్–2024 సీజన్లో తన ఎక్స్‌ప్రెస్ బౌలింగ్‌తో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో అతను 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. -
బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
ముంబై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును శనివారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్లో తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్‌కు కూడా తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి పునరాగమనం చేశాడు. విశాఖపట్నంకు చెందిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి గత జూలైలో జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే జట్టును ప్రకటించాక నితీశ్ గాయపడటంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 142.92 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు సాధించి ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్‌లో... రెండో మ్యాచ్ అక్టోబర్ 9న న్యూఢిల్లీలో... మూడో మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. ఆరు మార్పులు... గత నెలలో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో పాల్గొన్న ఆరుగురు భారత క్రికెటర్లను బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సిరాజ్, ఖలీల్ అహ్మద్ ఆడారు. వీరి స్థానాల్లో అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లకు చోటు దక్కింది. భారత టి20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిõÙక్ శర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. -
Duleep Trophy: ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే అందరి దృష్టి!
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్-ఏ, టీమ్-బి, టీమ్-సి, టీమ్-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా హైలైట్‌గా నిలవనున్నారు.అభిమన్యు ఈశ్వరన్బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ దులిప్ ట్రోఫీ-2024లో టీమ్-బి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్‌లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యశ్ దయాల్దులిప్ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ టీమ్-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్ ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్ టోర్నీలో యశ్ దయాల్ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.హర్షిత్ రాణాఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఢిల్లీ బౌలర్ జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. దులిప్ ట్రోఫీలో టీమ్-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.నితీశ్‌కుమార్ రెడ్డిఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్‌కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్ ట్రోఫీ(టీమ్-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ముషీర్ ఖాన్టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్.. గత రంజీ సీజన్లో ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్ ఖాన్ దులిప్ ట్రోఫీలో టీమ్-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్‌తో రంగంలోకి దిగనున్నాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
Ind vs Zim: నితీశ్ రెడ్డికి చేదు అనుభవం.. శివం దూబేకు ఛాన్స్
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ యువ ఆల్‌రౌండర్ గాయం బారిన పడ్డాడు. ఫలితంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో తీశ్ రెడ్డి స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ప్రకటించింది.వైజాగ్ కుర్రాడుకాగా విశాఖపట్నానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అదరగొట్టిన ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు.జింబాబ్వే పర్యటన కోసంఈ సీజన్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి చరిత్రకెక్కాడు. అయితే, ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.అతడితో భర్తీనితీశ్ రెడ్డి చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి స్థానాన్ని ముంబై పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లంతా విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఇక జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ హరారే వేదిక.జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(రివైజ్డ్)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే.చదవండి: ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!Nitish Kumar Reddy: అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది -
అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది: నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియాకు ఎంపిక కావడం పట్ల ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు. ‘‘భారత జట్టుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అయితే నా స్వప్నం 50 శాతమే సాకారమైంది. నేను టీమిండియా జెర్సీ వేసుకొని మైదానంలో దిగి సెంచరీతో జట్టును గెలిపించినపుడే నా పూర్తి కల నెరవేరుతుంది’’ అని ఈ విశాఖపట్నం కుర్రాడు అన్నాడు.‘‘నా కెరీర్‌ను తీర్చిదిద్దేందుకు నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఇప్పుడు ఆయన కళ్లలో ఆనందం చూస్తుంటే ఇదే కదా ఆయన లక్ష్యమని గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఆంధ్ర క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా జెర్సీ ధరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ సీజన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున చెలరేగిన అతను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ అసాంతం నితీశ్ కనబరిచిన నిలకడ, కచ్చితత్వంతో కూడిన షాట్లు, మెరిపించిన మెరుపులు భారత సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతన్ని భారత జట్టులోకి ఎంపిక చేశారు.శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండేలాంటి పలు కొత్తముఖాలకు తొలిసారి చోటు కల్పించింది. ప్రస్తుతం రెగ్యులర్ టీమిండియా జట్టు వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తదుపరి సూపర్–8 దశ మ్యాచ్‌ల్ని ఆడుతోంది. ఈ మెగా టోర్నీలో ముందుగా రోహిత్ బృందం అమెరికాలోనే మొత్తం లీగ్ మ్యాచ్‌ల్ని ఆడింది.ఇక ఈ టోర్నీ ముగిసిన వెంటనే జూలై 6 నుంచి జింబాబ్వే టూర్లో ద్వైపాక్షిక సిరీస్ మొదలవుతుంది. పూర్తిగా టి20 ఫార్మాట్‌కే పరిమితమైన ఈ పర్యటనలో భారత జట్టు జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. మెగా టోర్నీ కోసం ఎంపికైన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్‌లు ఇద్దరే జింబాబ్వే పర్యటనకు కొనసాగుతున్నారు. స్టాండ్‌బైలుగా ఉన్న గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేశ్ ఖాన్లకు చోటిచ్చారు.సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రవీంద్ర జడేజా, చహల్, సిరాజ్‌లతో పాటు శివమ్ దూబే, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్ లకు కూడా విశ్రాంతినివ్వడం ఆశ్చర్యకరం. బహుశా సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టి అంతా 2026 టీ20 ప్రపంచకప్‌పైనే ఉండటం వల్ల పూర్తిస్థాయిలో రిజర్వ్ బెంచ్‌కే అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. భారత టీ20 జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ సామ్సన్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే. -
జింబాబ్వే టూర్‌కు నితీష్‌కుమార్
విశాఖ స్పోర్ట్స్: జింబాబ్వేతో తలపడే భారత్ టీ20 జట్టులోకి నితీష్‌కుమార్ రెడ్డి చేరాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నితీష్‌కుమార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. విశాఖకు చెందిన కె.నితీష్‌కుమార్ రెడ్డి భారత్ టీ20 జట్టులో స్థానం సాధించడం పట్ల ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి అభినందనలు తెలిపారు. జింబాబ్వే టూర్లో రాణించాలని ఆకాంక్షించారు. సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నితీష్‌కుమార్‌ను అభినందించారు. -
టీమిండియాలో ఎంట్రీ.. నితీశ్ కుమార్ రెడ్డికి ఏసీఏ అభినందనలు
టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్‌రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్‌గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించాడు.ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్‌ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా యోహానన్నియామకంక్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్‌లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్‌ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా నియమించారు.అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్‌లుగా నియమించారు.ఇంటర్నేషనల్‌కు ఆడిన యోహానన్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్‌గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.యోహానన్ గురించి..యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి కోరారు. -
భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్... వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత టీ–20 జట్టులోకి ఆంధ్ర నుంచి ఎంపికయిన మొదటి ఆటగాడు నితీశ్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న నితీశ్.. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్లో నితీశ్ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. కెరీర్లో మరింత ఎదగాలని తెలిపారు.కాగా, ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీశ్‌కుమార్‌రెడ్డి భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్ భారత టీ–20 జట్టుకు ఎంపికయ్యారు. -
టీమిండియాలో చోటే లక్ష్యం
విశాఖ స్పోర్ట్స్: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే.. ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన కాకి నితీష్‌కుమార్‌రెడ్డి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతానంటున్న నితీష్కుమార్రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌గా.. అండర్–12, 14లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అకాడమీ ద్వారా శిక్షణ తీసుకున్నా. అనంతరం అండర్–16లో రాణించి ఏకంగా దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌గా బీసీసీఐ నుంచి జగ్మోహన్ దాల్మియా అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. 2020లో తొలి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడి ఆ తర్వాతి ఏడాదే లిస్ట్–ఏ మ్యాచ్‌ల్లో ఇండియా–బి జట్టుకు ఆడాను. 2021 చివరికల్లా టి20ల్లో ఆడే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఐపీఎల్లో ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు లభించడం వల్ల నా ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం కలిగింది. అది.. గొప్ప అనుభూతి ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం ఆనందాన్నిచ్చింది. కీలక సమయాల్లో రాణించి సన్‌రైజర్స్ గెలుపులో భాగం కావడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. టైటిల్ పోరులో సరిగ్గా ఆడలేకపోవడం కాస్త నిరాశ కలిగించింది. స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా నా ఆటకు అన్వయించుకున్నా. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ భాయ్(ధోనీ) చూస్తుండగా చివరి బంతిని స్టాండ్స్‌లోకి తరలించడం.. మా జట్టు విజయం సాధించడం మరపురాని సంఘటన. మొత్తంగా ఐపీఎల్లో రాణించడం గొప్ప అనుభూతినిచి్చంది. ఏపీఎల్‌లోనూ రాణిస్తా.. ప్రస్తుతం నా దృష్టి ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్‌పైనే ఉంది. గోదావరి టైటాన్స్ ఫ్రాంచైజీ అత్యధిక ధరకు నన్ను దక్కించుకుంది. ఈ నెలాఖరు నుంచి ఏపీఎల్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. నా అనుభవంతో జట్టును ముందుకు తీసుకువెళ్తా. నేను బౌలింగ్‌లోనూ రాణించేందుకు యార్కర్లపై దృష్టి పెడుతున్నా. అప్పుడే ఫర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదగగలను. ఐపీఎల్‌తో పాటు ఏపీఎల్ నా లక్ష్యానికి దోహదపడతాయని భావిస్తున్నా. ఆల్‌రౌండర్‌గా రాణించి జాతీయ జట్టులో స్థానం సాధించడమే నా తదుపరి లక్ష్యం. అదీ త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా. -
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్. హైదరాబాద్‌కు చెందిన యువ బ్యాటర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆల్‌టైమ్ స్పిన్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడింది. బలంగా బాదితే వైడ్ లాంగాన్ దిశగా సిక్సర్! ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్ చహల్ వచ్చాడు. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడిగా, 350 వికెట్లు తీసిన అనుభవం అతనిది. వరుసగా ఫోర్, సిక్సర్! అంతటితో ఆగిపోలేదు. మరో రెండు బంతుల విరామం తర్వాత అదే ఓవర్లో వరుసగా మళ్లీ సిక్స్, ఫోర్.. కొద్ది సేపటికి అశ్విన్ తిరిగొచ్చాక వరుస బంతుల్లో మళ్లీ రెండు భారీ సిక్సర్లు! ఎక్కడా ఎలాంటి తడబాటు లేదు. పొరపాటున బ్యాట్ చివర తగిలి బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది కాదు. పూర్తిగా సాధికారికంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఆడిన షాట్లతో అతను ఆయా బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ తరహాలో అతను ఆడిన తీరు, అగ్రశ్రేణి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న శైలి.. మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు అతని గురించి మాట్లాడుకునేలా చేసింది. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ కుర్రాడే కె. నితీశ్ కుమార్ రెడ్డి. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నితీశ్ తాజా ఐపీఎల్లో తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. అటు బ్యాటింగ్‌లో చెలరేగుతూ, ఇటు బౌలింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా చురుకైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరేళ్ల క్రితమే జూనియర్ స్థాయి క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటిన నితీశ్ ఇప్పుడు సీనియర్ ఇండియా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఒక అచ్చమైన తెలుగబ్బాయి ఆటను చూసి ఎంత కాలమైంది! హైదరాబాద్ టీమ్ దక్కన్ చార్జర్స్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి సన్‌రైజర్స్ వరకూ మనవాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అటు ఆంధ్ర నుంచి గానీ, ఇటు హైదరాబాద్ నుంచి గానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా సందర్భాల్లో బయటి ఆటగాళ్లతోనే లోకల్ టీమ్‌ను ఫ్రాంచైజీ నడిపిస్తూనే ఉంది. ఏ సగటు క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెబుతాడు. టీమ్‌లోకి తీసుకున్నా తుది జట్టులో ఆడించకుండా, ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా సాగిన రోజులే ఎక్కువ. అక్కడక్కడా ఎవరైనా బరిలోకి దిగినా.. వాహ్ అనిపించే గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలూ తక్కువే. ఇలాంటి స్థితిలో నితీశ్‌ను అందరూ రెండు రాష్ట్రాల ప్రతినిధిగా, తమవాడిగా అభిమానిస్తున్నారు. అతను కూడా తన అద్భుత ఆటతో అందరి నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సంచలనంలా మారాడు. అలా మొదలై..నితీశ్లోని సహజ ప్రతిభే అతడిని బ్యాటింగ్‌లో రాటుదేలేలా చేసింది. చాలా మందిలాగే నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అబ్బాయి అల్లరిని భరించలేక ఆరేళ్ల వయసులో వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో మైదానంలో అతని ఆట మొదలైంది. ఆపై అబ్బాయి ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల వెరసి పూర్తి స్థాయిలో తండ్రి అతడిని క్రికెట్ శిక్షణ వైపు మళ్లించేలా చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో రాటుదేలిన నితీశ్ చిన్న వయసులోనే తనలోని అపార ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు. అండర్–12 స్థాయికి వచ్చేసరికి గమ్యం స్పష్టమైపోయింది. అప్పటికే అతని బ్యాటింగ్‌లో స్ట్రోక్ మేకింగ్, పట్టుదల చూసినవారికి భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్ కావాల్సిన లక్షణాలున్నాయని అర్థమైంది. ఈ క్రమంలోనే అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టి కూడా నితీశ్‌పై పడింది. ట్రయల్స్‌లో అతని ప్రతిభను చూసిన ఎమ్మెస్కే కడపలోని ఏసీఏ అండర్–14 అకాడమీలో చేరే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి నితీశ్‌కు 24 గంటలూ క్రికెట్టే జీవితంగా మారిపోయింది. తన ఆటను మరింత సానబెట్టుకునే అవకాశం దక్కిన చోట కష్టపడిన అతను మరింత రాటుదేలాడు. మరో వైపు వైజాగ్ జింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్న తండ్రి ముత్యాల రెడ్డికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్ఫర్ అయింది. తాను అక్కడికి వెళితే బిడ్డ భవిష్యత్తుకు ఇబ్బంది రావచ్చని భావించిన ఆయన ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో కొడుకుకు అండగా ఉండి సరైన మార్గనిర్దేశనంలో నడిపించారు. పరుగుల వరద పారించి..నితీశ్ కెరీర్లో 2017–18 దేశవాళీ సీజన్ హైలైట్‌గా నిలిచింది. 14 ఏళ్ల నితీశ్ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్లపై చెలరేగిన 8 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 176.71 సగటుతో రికార్డు స్థాయిలో 1237 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్నింటికి మించి నాగాలాండ్‌తో జరిగిన పోరులో అతను సాధించిన క్వాడ్రూపల్ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నితీశ్ 366 బంతులు ఎదుర్కొని 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు సాధించడం విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ అండర్–19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న అతను బీసీసీఐ చాలెంజర్ టోర్నీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అదే జోరులో 17 ఏళ్ల వయసులో ఆంధ్ర తరఫున తొలి సీనియర్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒంగోలులో జరిగిన కేరళతో జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీలో అతను అరంగేట్రం చేశాడు. తర్వాతి సీజన్లో విజయ్‌హజారే వన్డే టోర్నీలో అడుగు పెట్టిన నితీశ్‌కు కొన్నాళ్ల తర్వాత ముస్తాక్ అలీ టి20 టోర్నీలోనూ ఆంధ్రకు ఆడే అవకాశం దక్కింది. ప్రతికూల పరిస్థితులను దాటి..అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్నా.. అక్కడి నుంచి సీనియర్ స్థాయికి చేరే క్రమంలో యువ క్రికెటర్లంతా ఒక రకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. రెండింటి మధ్య ఉండే అంతరం కారణంగా అంచనాలను అందుకోలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దాదాపు అందరు ఆటగాళ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. నితీశ్‌కు కూడా ఇలాగే జరిగింది. జూనియర్ స్థాయి మెరుపుల తర్వాత కొంత కాలం పాటు అతను ఇదే స్థితిని అనుభవించాడు. రంజీ అరంగేట్రం తర్వాత ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో పాటు కోవిడ్ వల్ల వచ్చిన విరామం, ఇతర వేర్వేరు కారణాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో అతను తన ఆటకు మరో రూపంలో పదును పెట్టాడు. అప్పటి వరకు వేర్వేరు వయో విభాగాల్లో ఓపెనర్‌గా భారీగా పరుగులు సాధించి అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్ చేసిన నితీశ్ ఇప్పుడు తన బౌలింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాడు. అది 2022–23 రంజీ సీజన్లో బ్రహ్మండంగా పని చేసింది. 8 మ్యాచ్‌లలో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో ఆంధ్ర టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా అతనికి గుర్తింపు దక్కింది. ఇదే క్రమంలో 2023–24 సీజన్లో పూర్తి స్థాయి ప్రదర్శనతో రెగ్యులర్‌గా టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను మళ్లీ 25 వికెట్లతో చెలరేగడంతో పాటు గతంలోలాగా బ్యాటింగ్‌లో కూడా తన పదును చూపించడం విశేషం. ఐపీఎల్లో అదరగొట్టి..‘నితీశ్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు మరో 25 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆ సమయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ హతాశులయ్యారు. సహజంగానే ఆ తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మేమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే వాటి ప్రభావం అబ్బాయిపై పడరాదని భావించాం. అతడి ఆటకు మాత్రం ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకున్నాం. అసలు ఆటల గురించి ఏమాత్రం అవగాహన లేని నా భార్య మానస కూడా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి శ్రమించింది. ఇప్పుడు అతడిని ఐపీఎల్లో చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ భావోద్వేగంతో ముత్యాల రెడ్డి నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.నితీశ్ గత ఏడాదే సన్‌రైజర్స్ టీమ్‌తో పాటు ఉన్నాడు. కానీ ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ అవకాశమే రాకపోగా, బౌలింగ్‌లోనూ వికెట్లు దక్కలేదు. అప్పుడు కొంత నిరాశకు గురైనా.. ఈసారి దక్కిన అవకాశాన్ని అతను అద్భుతంగా వాడుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెలరేగుతూ రైజర్స్ టీమ్‌లో కీలకంగా మారాడు.‘చిన్నప్పుడే నితీశ్‌లో ప్రతిభను గుర్తించాం. ఆపై సరైన అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఐపీఎల్లో అతని ఆట చూస్తే సంతోషం కలుగుతోంది. ఒత్తిడిలోనూ ఎక్కడా తడబాటుకు, ఆందోళనకు గురికాని అతని ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. ఇప్పుడు అతను కెరీర్ కీలక దశలో ఉన్నాడు. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్‌లో స్టోక్స్, పాండ్యా తరహాలో మీడియం పేస్‌తోనే వేరియేషన్లు ప్రదర్శించడం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయడం వంటివి మెరుగుపరచుకుంటే మంచి ఆల్‌రౌండర్‌గా త్వరలోనే టీమిండియాకు ఆడగలడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనలాగే సగటు తెలుగు క్రికెట్ అభిమానులదీ అదే కోరిక. త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.-మొహమ్మద్ అబ్దుల్ హాది