యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని.. అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్‌రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీశ్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.
ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం
ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం(నవంబరు 22) ఈ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి రెండు రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడు.
వికెట్-టు- వికెట్ బౌలింగ్ వేయగల సత్తా నితీశ్ సొంతం. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్లూ పేసర్లకు సహాయపడగల ఆల్‌రౌండర్‌ను కోరుకుంటుంది. అయితే, జస్‌ప్రీత్ నితీశ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్‌లో అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదు’’ అని నితీశ్ రెడ్డిని మోర్కెల్ ప్రశంసించాడు.
కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఆసీస్‌తో పర్యటనలో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
అదనపు బలం అదే
ఇప్పటికే పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ల వంటి సీనియర్లతో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా ఉన్నా.. బ్యాటింగ్ కూడా చేయడం నితీశ్‌కు ఉన్న అదనపు బలం. కాబట్టి బుమ్రా, సిరాజ్‌లతో పాటు 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తుదిజట్టులో ఆడించేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా..
రోహిత్ శర్మ (కెప్టెన్)
జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)
యశస్వి జైస్వాల్
అభిమన్యు ఈశ్వరన్
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
సర్ఫరాజ్ ఖాన్
ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)
రవిచంద్రన్ అశ్విన్
రవీంద్ర జడేజా
మహ్మద్ సిరాజ్
ఆకాశ్ దీప్
ప్రసిద్ కృష్ణ
హర్షిత్ రాణా
నితీశ్ కుమార్ రెడ్డి
వాషింగ్టన్ సుందర్.
చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment