border gavaskar trophy
-
‘గంభీర్‌కు ఏం అవసరం?.. ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్‌కోచ్‌కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.గంభీర్ సూచనల మేరకు!కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది. హెడ్‌కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.పది సూత్రాలు ఇవేదేశవాళీ మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది. వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్‌కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఇక మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది. అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయిఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.ఎవరి పని వారు చూసుకుంటే మంచిదిఅయినా.. హెడ్‌కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది. అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్‌కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
విరాట్ కోహ్లికి గాయం!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) గాయపడినట్లు సమాచారం. మెడ నొప్పితో అతడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపశమనం కోసం కోహ్లి ఇంజక్షన్ కూడా తీసుకున్నాడని.. ప్రస్తుతం అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వర్గాలు వెల్లడించాయి.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలంకాగా కోహ్లి ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆడిన ఐదు టెస్టుల్లోనూ భాగమయ్యాడు. అయితే, కంగారూ గడ్డపై తనకున్న ఘనమైన రికార్డును ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈసారి కొనసాగించలేకపోయాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా అన్నింట్లోనూ విఫలమయ్యాడు.రంజీలు ఆడతాడనుకుంటేఅంతేకాదు.. ఒకే రీతిలో అవుట్ కావడం కూడా కోహ్లి ఆట తీరుపై విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడు కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున రంజీ(Ranji Trophy) సెకండ్ లెగ్‌లో ఆడతాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ స్టార్ బ్యాటర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ ఇటీవలే తెలిపాడు.అంతేకాదు.. దేశీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ముంబై క్రికెటర్లను చూసి కోహ్లి నేర్చుకోవాలని విమర్శలు గుప్పించాడు. ఇక జనవరి 23 నుంచి ఆరంభం కాబోయే రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులోనూ కోహ్లి పేరును డీడీసీఏ చేర్చింది. ఈ నేపథ్యంలో అతడు గాయపడినట్లు తాజాగా వార్తలు రావడం గమనార్హం.ఇంజక్షన్ కూడా తీసుకున్నాడుఈ విషయం గురించి డీడీసీఏ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి మెడనొప్పితో బాధపడుతున్నాడు. ఇంజక్షన్ కూడా తీసుకున్నాడు. తొలి రెండు రంజీలకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. సెలక్టర్లు మాత్రమే ఈ విషయం గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వగలరు’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ వద్దన్న పంత్ఇక మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం రంజీలు ఆడేందుకు సిద్ధమయ్యాడు. తొలుత అతడే ఢిల్లీ సారథిగా వ్యవహరిస్తాడని వార్తలు రాగా.. పంత్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయుష్ బదోని కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌరాష్ట్ర, రైల్వేస్‌తో మ్యాచ్‌లకు డీడీసీఏ శుక్రవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు సమాచారం.కాగా విరాట్ కోహ్లి 2012లో చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య ఘజియాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 14, 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాటి మ్యాచ్‌లో యూపీ చేతిలో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. రిషభ్ పంత్ 2017-18లో ఆఖరిగా ఢిల్లీ తరఫున రంజీ బరిలో దిగాడు. విదర్భతో నాటి ఫైనల్లో 21, 32 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
ఢిల్లీ కెప్టెన్‌గా రిషభ్ పంత్!.. కోహ్లి ఆడుతున్నాడా?
దేశవాళీ క్రికెట్లో విరాట్ కోహ్లి ఆడతాడా? లేదా? ఢిల్లీ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడా? అన్న ప్రశ్నలకు తెరదించేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సిద్దమైంది. రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23న మొదలుకానున్న మ్యాచ్‌కు శుక్రవారం తమ జట్టును ప్రకటించనుంది.కోహ్లి, పంత్‌లపై విమర్శలుకాగా రంజీ ట్రోఫీ తాజా సీజన్ కోసం డీడీసీఏ గతంలోనే 41 మందితో కూడి ప్రాబబుల్ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు ఉన్నాయి. అయితే, జాతీయ జట్టు విధుల దృష్ట్యా కోహ్లి, పంత్ ఢిల్లీ తరఫున ఆడలేకపోయారు. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి(Virat Kohli), పంత్ విఫలమైన తీరు విమర్శలకు దారి తీసింది.ముఖ్యంగా ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్ల షాట్ సెలక్షన్, వికెట్ పారేసుకున్న విధానం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లి, పంత్ రంజీ బరిలో దిగి.. తిరిగి మునుపటి లయను అందుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలో రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు రిషభ్ పంత్ అందుబాటులోకి రాగా.. కోహ్లి మాత్రం ఇంత వరకు తన నిర్ణయం చెప్పలేదు.ఈ విషయాన్ని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్వయంగా వెల్లడించాడు. పంత్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడని.. అయితే, కోహ్లి మాత్రం ఈ విషయంపై మౌనం వీడటం లేదని విమర్శించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా రిషభ్ పంత్అంతేకాదు.. ముంబై తరఫున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బరిలోకి దిగనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ముంబై క్రికెటర్లును చూసి కోహ్లి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమ జట్టును ప్రకటించేందుకు డీడీసీఏ సిద్ధమైంది. ఈ విషయం గురించి డీడీసీఏ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం మధ్యాహ్నం సెలక్షన్ మీటింగ్ జరుగుతుంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌కు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది’’ అని తెలిపారు. అయితే, కోహ్లి గురించి మాత్రం తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. హర్షిత్ రాణా మాత్రం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రంజీలకు అందుబాటులో ఉండడని తెలిపారు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్- ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి(సమాచారం లేదు), రిషబ్ పంత్, హర్షిత్ రాణా (అందుబాటులో లేడు), ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధూల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), జాంటీ సిద్ధూ, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్ శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కండ్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివాంక్ వశిష్ట్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా (వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్ సింగ్, మయాంక్ రావత్, తేజస్వి దహియా (వికెట్ కీపర్), పార్థీక్, రాహుల్ డాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్. -
ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు: రోహిత్‌పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్‌తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్‌నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్‌గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్‌కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్‌లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్‌రూమ్‌లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్‌తో కలిసి రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనదే: అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ‘గేమ్ ఛేంజర్’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్ పేసర్ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు. 3-1తో గెలిచి పదేళ్ల తర్వాతఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్.. మెల్బోర్న్, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.తద్వారా రోహిత్ సేనను 3-1తో ఓడించిన కమిన్స్ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌పై ప్రశంసలు కురిపించాడు.అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం‘‘ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్ బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్ గనుక ఈ సిరీస్‌లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.అయితే, ఇక్కడ నేను జోష్ హాజిల్‌వుడ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్. అయితే, భారత్‌తో సిరీస్‌లో మాత్రం హాజిల్‌వుడ్‌ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. అయితే, బోలాండ్ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్‌లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్‌లో మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా బోలాండ్ నిలిచాడు. భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లిని అనేకసార్లు అవుట్ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా రైజింగ్ స్టార్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాళ్లపై తిరుమల దర్శనానికి వెళ్లాడు. నితీశ్ ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన విషయాన్ని నితీశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నితీశ్ మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Nitish Kumar Reddy climbing stairs of Tirupati after scoring ton in his debut series. The peace is in the feet of Govinda 🧡 pic.twitter.com/23xKmNOpaC— Pari (@BluntIndianGal) January 13, 2025కాగా, నితీశ్ ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ భారత్ తరఫు రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో నితీశ్ సూపర్ సెంచరీ సాధించి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ సెంచరీతో నితీశ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్.. ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో నితీశ్ ఐదు టెస్ట్‌ల్లో 37.25 సగటున 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.బీజీటీతో భారత్‌కు నితీశ్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ లభించాడు. ఈ సిరీస్‌లో నితీశ్ రాణించినా భారత్ 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. బీజీటీ అనంతరం భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో నితీశ్ చోటు దక్కించుకున్నాడు. నితీశ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే భారత్ జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా జరుగనుంది. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు గ్రూప్-ఏలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 19న ప్రకటించే అవకాశం ఉంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, దృవ్ జురెల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hogg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్ పనైపోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి అన్నాడు. గత ఆరేడు నెలలుగా అతడి విఫలమవుతున్న తీరు.. కెరీర్ ముగింపునకు వచ్చిందనడానికి సంకేతం అని పేర్కొన్నాడు.అయితే, వన్డే(ODI Cricket)ల్లో మాత్రం రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా అతడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.వరుస వైఫల్యాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో తేలిపోయిన ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు.అయితే, తొలి టెస్టులో ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ హిట్ కావడంతో.. రోహిత్ తప్పనిసరి పరిస్థితుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం మూడో టెస్టులోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్‌లోనూ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విశ్రాంతి పేరిట తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత చతికిల పడి ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.రోహిత్ ఖేల్ ఖతంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పనైపోయిందనే అనుకుంటున్నా. ఇక అతడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిది. గత ఆరు- ఏడు నెలలుగా అతడి ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు.వికెట్ పారేసుకున్న తీరు మరీ ఘోరంఅంతేకాదు అతడు బౌల్డ్ అయ్యాడు. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. ఒక ఓపెనర్ అయి ఉండి ఇలా అవుట్ కావడం సరికాదు. ముఖ్యంగా అతడు ఎల్బీడబ్ల్యూ కావడం మరీ ఘోరం’’ అని విమర్శలు గుప్పించాడు. అయితే, ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడాన్ని బ్రాడ్ హాగ్ ప్రశంసించాడు.‘‘రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం నిరాశాజనకం. అయితే, సిడ్నీలో అతడు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ అంతకంటే ముందే.. అంటే మెల్బోర్న్ టెస్టు సందర్భంగానే అతడు తుదిజట్టు నుంచి తప్పుకొంటే ఇంకా బాగుండేది. తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆడించి ఉంటే మేలు జరిగేది’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందిఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ ఫార్మాట్లో కాస్త దూకుడుగా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వయసు మీద పడుతున్న దృష్ట్యా అతడు కాస్త జాగ్రత్తగా ఆడితేనే ఇంకొన్నాళ్లు కొనసాగగలుగుతాడు.ఇప్పటి వరకు అతడి వన్డే కెరీర్ అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు రోహిత్ శర్మనే టీమిండియాకు ముందుకు నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
వామిక, అకాయ్‌లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం కాస్త ఘాటుగా స్పందించాడు. భారత జట్టులో "సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని, కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే భవిష్యత్తు సిరీస్‌లకు ఎంపిక చేయాలని బీసీసీఐకి భజ్జీ సూచించాడు.ఈ క్రమంలో హర్భజన్ సింగ్ తాజాగా మరో క్రిప్టిక్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. దీంతో ఈ మాజీ క్రికెటర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.బీజీటీ ఓటమి తర్వాత భజ్జీ ఏమన్నాడంటే?"ప్రస్తుతం భారత క్రికెట్లో సూపర్ స్టార్ సంస్కృతి బాగా పెరిగింది. జట్టుకు పేరు ప్రఖ్యాతుల ఉన్న వాళ్లు కాదు, బాగా ప్రదర్శన చేసేవారు కావాలి. సూపర్ స్టార్లు కంటే బాగా ఆడేవారు ఉంటేనే జట్టు విజయ పథంలో ముందుకు వెళ్తుంది. సూపర్ స్టార్ కావాలనుకునే వారు ఇంట్లోనే ఉండి క్రికెట్ ఆడాలి.మరో ఆరు నెలలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ టూర్‌కు ఎవరు వెళ్తారు? ఎవరికి చోటు దక్కదు? అన్న చర్చ మొదలైంది. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. నావరకు అయితే బాగా ఆడే వారే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. అప్పట్లోనే కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లనే జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు సూచించారు.కాబట్టి ఇప్పుడు కూడా బీసీసీఐ, సెలక్టర్లు అదే పనిచేయాలి. ముఖ్యంగా సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. భారత్ సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి. ఆటగాళ్లను వారి ప్రదర్శన బట్టి ఎంపిక చేయాలి"భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.విరాట్ కోహ్లి, రోహిత శర్మ వంటి స్టార్ ప్లేయర్లను ఉద్దేశించే హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. అంతలోనే తాజా పోస్ట్‌తో భజ్జీ మరోసారి వార్తలోకెక్కాడు. కాగా బోర్డర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. బీజీటీని భారత్ చేజార్చుకోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణ ప్రదర్శన కనబరిచారు.కోహ్లి ఓ సెంచరీ చేసినప్పటికి, రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్సీ, ఇటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఈ సీనియర్ ద్వయం టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలకాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే భారత్ తదుపరి టెస్టు పర్యటనకు మరో ఆరు నెలలు ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. కోహ్లి, రోహిత్ టెస్టుల్లో కొనసాగుతారా లేదా అన్నది తెలియాలంటే మరో 6 నెలలు ఆగక తప్పదు.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు -
BGT 2024-25: సిడ్నీ పిచ్‌పై ఆస్ట్రేలియన్ల మౌనమేల..?
భారత్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడలేక గగ్గోలు పెట్టే ఆస్ట్రేలియన్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌లో పేస్ బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ పై మాత్రం మౌనం వహించారు. గత ఆదివారం ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలవ్వడంతో 1-3 తేడాతో ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో ఓ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గళమెత్తడం అభినందనీయం. ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ టిమ్ పెయిన్ సిడ్నీ పిచ్ ని దుమ్మెత్తి పోయడం విశేషం."ఈ టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఏ జట్టూ 200 పరుగుల మార్కును చేరుకోలేదు. ఈ మ్యాచ్ కి ఉపయోగించిన పిచ్ ఉపరితలం బాగానే ఉంది. కానీ పగుళ్లు రావడంతో అస్థిరమైన బౌన్స్ తో బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడ్డారు.ఈ పిచ్‌పై బ్యాట్స్మన్లు వ్యక్తిగత నైపుణ్యం కంటే అదృష్టంపై ఎక్కువగా ఆధారపడినట్లు స్పష్టమైంది. ఈ పిచ్ కి అంతర్జాతీయ క్రికెట్ అధికారులు సంతృప్తికరమైన రేటింగ్ ఇచ్చినప్పటికీ, నేను మాత్రం దానికి సాధ్యమైనంత తక్కువ రేటింగ్ ఇస్తాను. వాళ్ళు మళ్ళీ ఇలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించేవాడ్ని.ఇలాంటి హెచ్చరిక వల్ల సిడ్నీ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి పిచ్ ని తయారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. దీనివల్ల వాళ్ళు అలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కనీసం భయపడతారు" అని పెయిన్ తన కాలమ్‌లో రాశాడు."గతంలో ఐసిసి సిడ్నీ పిచ్ కు ‘సంతృప్తికరంగా’ రేటింగ్ ఇచ్చింది. ఇది రెండో అత్యధిక రేటింగ్ . సిడ్నీ పిచ్ అరిగిపోయి స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా మారే ముందు కొద్దిగా బౌన్స్ అవుతుంది. అయితే ఈ పిచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకు ఉత్తేజకరమైన ముగింపును అందించింది. ఇది వచ్చే సీజన్ లో జరిగే యాషెస్ సిరీస్ కి శుభసూచకమని," క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ అండ్ షెడ్యూలింగ్ హెడ్ పీటర్ రోచ్ అన్నారు.స్వదేశం లో సిరీస్ లు జరిగినప్పుడు ఆతిధ్య జట్లు పిచ్ లు తమ బౌలర్లకు అనుకూలంగా రూపాందించుకోవడం ఆనవాయితీ. అయితే విదేశీ పర్యటనలకు వచినప్పుడు మాత్రం వాళ్ళ ఆటగాళ్లు విఫలమైనప్పుడు ఆతిధ్య జట్టు పై దుమ్మెత్తి పోయడం మాత్రం సరికాదు. ఇది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు గుర్తుంచుకోవాలి! -
‘కొన్‌స్టాస్ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపుటీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే అర్ధ శతకంఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.కోహ్లి, బుమ్రాలతో గొడవఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.డిఫెన్సివ్ టెక్నిక్ లేదుఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్‌స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో కొన్‌స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: IND vs ENG: విరాట్ కోహ్లి కీలక నిర్ణయం -
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించికాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకున్నాడుఅసలు గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ తివారి విమర్శించాడు. కాగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకున్నాడు.ఘోర వైఫల్యాలుఅయితే, గంభీర్ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ 3-0తో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అభిషేక్ నాయర్.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్‌ను ముందుకు నెట్టేలా ప్లాన్ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్ కోచ్ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?వారి వల్ల ఏం ఉపయోగం?ప్రధాన కోచ్ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్ కోచ్ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్‌తో కలిసి పనిచేశారు. గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్ హాయిగా తనదైన కంఫర్ట్జోన్లో ఉన్నాడు’’ అని న్యూస్18 బంగ్లా చానెల్‌తో పేర్కొన్నాడు.సమన్వయం లేదుఅదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు సమన్వయం లోపించిందన్న మనోజ్ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్. మరోవైపు.. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా టైటిల్స్ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.క్రెడిట్ అంతా తనకే అంటాడుకాగా ఐపీఎల్-2024లో గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవిని ఇచ్చింది. ఈ విషయం గురించి మనోజ్ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్‌కతాకు టైటిల్ అందించలేదు. జాక్వెస్ కలిస్, సునిల్ నరైన్.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా కోల్పోయినప్పటికి.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనతో ప్రత్యర్ధిలను సైతం ఆకట్టుకున్నాడు. పెర్త్ నుంచి సిడ్నీ వరకు మొత్తం 5 టెస్టుల్లోనూ బుమ్రా సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో చాలా సందర్భాల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.బుమ్రా మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. బుమ్రా మరో రెండు వికెట్లు సాధించి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పర్యాటక బౌలర్‌గా రికార్డులెక్కెవాడు.ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలింగ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. బర్న్స్ 1911-12 సిరీస్‌లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ ఫార్మాట్లలో బుమ్రాను మించిన బౌలర్ లేడని క్లార్క్ కొనియాడాడు."బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. నా వరకు అయితే అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్. చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్‌గ్రాత్ దిగ్గజ బౌలర్లు ఉన్నా, వారు టీ20 క్రికెట్ ఆడలేదు.కాబట్టి బుమ్రాను ఆల్‌ఫార్మాట్ బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాను. ఆడే ఫార్మాట్, కండీషన్స్‌తో సంబంధం లేకుండా బుమ్రా అద్బుతంగా రాణించగలడు. అదే అతడి అత్యుత్తమ బౌలర్‌గా మార్చింది. సిడ్నీ టెస్టులో భారత్ మరో 20 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. జట్టులోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా బెటర్‌గా ఉన్నాడు" అని క్లార్క్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతడు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బుమ్రా తిరిగి మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక వీడ్కోలు పలికితే బెటర్'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సిరీస్‌లో అతడు సారథ్యం వహించిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండింట ఓటమి.. ఓ మ్యాచ్‌ను డ్రా ముగించింది. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. ఆఖరి టెస్టుకు పేలవ ఫామ్ కారణంగా తనంతట తనే తప్పుకున్నాడు.అయితే ఐదో టెస్టు నుంచి వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. డూ ఆర్‌డై మ్యాచ్‌లో రోహిత్ జట్టును ముందుండి నడిపించి ఉంటే బాగుండేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడి ఉండాల్సింది. అతడు జైశ్వాల్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పి సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించి ఉంటే బాగుండేది. రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్. పరుగులు సాధించికపోయినా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతడిపై ఉంది.ఈ సిరీస్‌లో రోహిత్ ఒక్కడే కాదు, స్టార్ ప్లేయర్లు ఎవరూ ఫామ్‌లో లేరు. కోహ్లి, ఖవాజా వంటి ప్లేయర్లు కూడా తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. అయినప్పటికి వారు జట్టులో కొనసాగారు. లబుషేన్, స్మిత్‌లు కూడా కాస్త ఆలస్యంగా తమ ఫామ్‌ను తిరిగి పొందారు.ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్క బ్యాటర్ కష్టపడ్డారు. కేఎల్ రాహుల్ ఆరంభంలో రాణించినప్పటికి, తర్వాత మాత్రం విఫలమయ్యాడు. కాబట్టి ఒక నాయకుడిగా రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా జట్టులో ఉండి సాధించాలి.కీలకమైన మ్యాచ్‌లోనే ఆడనప్పుడు, అతడు ఇక టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటే బెటర్. ఐదో టెస్టులో రోహిత్ లేని లోటు కన్పించింది. బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. ఆ సమయంలో రోహిత్ ఉండి ఉంటే బాగుండేదని ప్రతీ ఒక్కరికి అన్పించింది" అని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. చదవండి: IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్.. -
IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్..
భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్‌ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్‌ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్‌కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్‌తో కనిపించిన ఈ పిచ్‌పై పేస్ బౌలర్లు చెలరేగారు. గ్రౌండ్స్‌మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్‌లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్‌తో ఐసీసీ కితాబునిచ్చింది.సిడ్నీలో ఘోర ఓటమి.. కాగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్‌తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు టీమిండియా సిద్దం కానుంది.చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’ -
గంభీర్, రోహిత్‌తో అగార్కర్ భేటీ!.. గుర్రుగా ఉన్న యాజమాన్యం!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) గురించే చర్చ. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత ఈమేర ఘోర పరాభవం ఎదుర్కోవడం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ జట్టు లోని అగ్రశ్రేణి క్రికెటర్లయిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఆస్ట్రేలియా గడ్డపై మునుపెన్నడూ లేని రీతిలో ఘోరంగా విఫలమవడం అందుకు ప్రధాన కారణం. ఈ సిరీస్ ముగించి భారత్ కి తిరిగిరాక ముందే జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. భారత్ క్యాంప్‌లో విభేదాలు ఉన్నాయని, జట్టు ఓటమికి ఇదే ముఖ్య కారణమని విమర్శలు వచ్చాయి. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ టీం మేనేజిమెంట్ జట్టు కూర్పులో సరైన నిర్ణయాలు తీసుకోలేదనేది ఈ విమర్శల సారాంశం.గుర్రుగా ఉన్న అగార్కర్!ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా జట్టు వైఫల్యాన్ని సమీక్షించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలవడానికి సిద్దమౌతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో సెలెక్టర్లు, బోర్డులోని ప్రధాన అధికారుల మధ్య అనేక అధికారిక, అనధికారిక సమావేశాలు జరుగుతాయని.. భారత్ టెస్ట్ క్యాలెండర్, జట్టు ఆస్ట్రేలియాలో పేలవమైన ప్రదర్శన గురించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గంభీర్ బాధ్యత ఎంత?భారత్ జట్టు వైఫల్యానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు ఒక కారణమని, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత భారత్ జట్టు పతనం ప్రారంభమైందని భజ్జీ వ్యాఖ్యానించాడు. భారత్ జట్టు టి 20 ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం ద్రావిడ్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు. 'గత ఆరు నెలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. భారత్ T20 ప్రపంచ కప్ చేజిక్కించుకుంది. అయితే గంభీర్ పదవిని చేప్పట్టినుంచే భారత్ జట్టు పతనం ప్రారంభమైంది," అని భజ్జీ వ్యాఖ్యానించాడు.'ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి'జాతీయ సెలెక్టర్లు ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని హర్భజన్ కోరుతున్నాడు. “మీరు పేరు ప్రతిష్టల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటే, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఇతర మ్యాచ్ విన్నర్లను జట్టులో చేర్చుకోండి. బీసీసీఐ, సెలక్టర్లు సూపర్ స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలి' అని భజ్జీ హితవు పలికాడు. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందనేది భజ్జీ వాదన.సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. "అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు తీసుకెళ్లారు, కానీ అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే కదా సరైనా రీతిలో రాణిస్తున్నాడో లేదో తెలుస్తుంది. సర్ఫరాజ్ విషయంలోనూ అదే తప్పిదం జరిగిందని," హర్భజన్ పేర్కొన్నాడు.ఇక ఇంగ్లండ్ పర్యటన(టెస్టులు)కు ఏడు నెలల వ్యవధి ఉన్నందున భారత్ జట్టు పునర్నిర్మాణానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. "బంతి ఇప్పుడు సెలెక్టర్ల కోర్టులో ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా" అని హర్భజన్ ముగించాడు.చదవండి: ‘బుమ్రాను అస్సలు కెప్టెన్ చేయకండి.. కెప్టెన్సీకి వాళ్లే బెటర్ ఆప్షన్’ -
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు
అరంగేట్రంలోనే అద్భుత అర్ధ శతకంతో దుమ్ములేపాడు ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas). బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ టీనేజర్. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి మ్యాచ్‌లో 60 పరుగులతో సత్తా చాటాడు.అనంతరం.. సిడ్నీ టెస్టులోనూ సామ్ కొన్‌స్టాస్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 45 పరుగులు చేశాడు. అయితే, భారత్‌తో ఆఖరిదైన ఈ టెస్టు మ్యాచ్‌లో కొన్‌స్టాస్.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో వాగ్వాదానికి దిగాడు. సిడ్నీలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులకు ఆలౌట్ అయింది.బుమ్రాతో గొడవ పడిన కొన్స్టాస్అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో.. ఆఖరి బంతి వేసే సమయానికి ఖవాజా తనకు కాస్త సమయం కావాలని అడగ్గా.. బుమ్రా విసుక్కున్నాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాతో గొడవకు సిద్ధమయ్యాడు. ఇందుకు బుమ్రా కూడా గట్టిగానే బదులివ్వగా.. అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు.టైమ్ వేస్ట్ చేయాలని చూశానుఅయితే, ఆఖరి బాల్‌కు ఖవాజా వికెట్ పడగొట్టిన బుమ్రా... కొన్‌స్టాస్ వైపు చూస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా కూడా కొన్‌స్టాస్‌ను ఇక వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తూ చుట్టుముట్టారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్‌స్టాస్.. ‘‘నాకు ప్రత్యర్థులతో పోటీ పడటం అంటే ఇష్టం.అయితే, టీమిండియాతో సిరీస్ నాకెన్నో విషయాలు నేర్పించింది. నిజానికి ఆరోజు నేను బుమ్రా సమయం వృథా చేయాలని ప్రయత్నించాను. టీమిండియాకు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకూడదని భావించాను. కానీ.. ఆఖరికి అతడే పైచేయి సాధించాడు.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్ఏదేమైనా అతడొక ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీశాడు’’ అని బుమ్రా నైపుణ్యాలను కొనియాడాడు. అదే విధంగా.. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి(Virat Kohli)తో గొడవ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘మ్యాచ్ పూర్తైన తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. నాకు అతడే ఆదర్శం అని చెప్పాను.నా ఆరాధ్య క్రికెటర్‌కు ప్రత్యర్థిగా బరిలో దిగడం నిజంగా నాకు దక్కిన గౌరవం. అతడు చాలా నిరాడంబరంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అతడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శ్రీలంక పర్యటనకు గనుక ఎంపికైతే బాగా ఆడాలని నన్ను విష్ చేశాడు’’ అని 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా పేరొందాడు.ఫైనల్‌కు ఆసీస్.. టీమిండియా ఇంటికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-3తో చేజార్చుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత తొలిసారి కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. టీమిండియాను వెనక్కినెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది. ఇక టీమిండియా తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. -
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
టీమిండియాకు మరో పరాభవం
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. మరోపక్క భారత్ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్.. బీజీటీలో ఒక్క మ్యాచ్ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ (న్యూజిలాండ్ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది. బీజీటీ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానానికి పడిపోయిన భారత్ 109 రేటింగ్ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్‌క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్‌లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్‌లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. దీంతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారిపోయింది.అయితే ఈ సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన యశస్వి.. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు.మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ (448) తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యశస్వి ఈ పోస్ట్ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ పనిని ప్రేమించు బ్రదర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్ View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్‌లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్‌వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్‌దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్‌ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్‌తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర -
గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం
టెస్టు క్రికెట్లో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రాణించలేకపోయింది. కంగారూ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తద్వారా దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తొలిసారి ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.పేలవ ప్రదర్శన.. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) పూర్తిగా విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ఇద్దరు దిగ్గజాలు పేలవ ప్రదర్శనతో తేలిపోయారు. రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్లు కూడా కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఇంటా బయట పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ప్లేయర్లకు... క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చురకలు అంటించాడు. భారత ఆటగాళ్లందరూ దేశవాళీల్లో ఆడాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా అందరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూడాలని సన్నీ సూచించాడు. ఎవరికీ మినహాయింపు వద్దు‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత భారత జట్టులో నుంచి ఎంతమంది ఆటగాళ్లు అందులో పాల్గొంటారో చూడాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు లేకుండా అందరూ దేశవాళీ టోర్నీలో పాల్గొనాలి.గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలిరంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తాజా ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎలాగూ లేవు. ఈ సమయంలో తదుపరి టోర్నీ కోసం అయినా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. తమను తాము నిరూపించుకోవాలనే తపన ఉన్న ఆటగాళ్లు ముఖ్యం. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల సమయంలోనే ఇంగ్లండ్‌తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మరి దానికి ఎంపిక కాని వారిలో ఎంతమంది దేశవాళీ ట్రోఫీలో పాల్గొంటారో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.గంభీర్దీ అదే మాటవరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా భారత స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి లేనట్లే.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. జట్టులోని ఏ ఒక్కరి భవిష్యత్ గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం గురించి కూడా ఏమీ చెప్పలేను. అయితే వారిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది. జట్టులో అందరూ సమానమే. అందరితో ఒకే రీతిన వ్యవహరిస్తా. చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని రోహితే నిర్ణయించుకున్నాడు. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని రోహిత్ చాటాడు’’ అని సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల కలనేరవేరింది.సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. బీజీటీతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ది కీలక పాత్ర.సిరీస్ అసాంతం కమ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్.. తన జట్టును వరుసగా రెండు సార్లు వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.కమ్మిన్స్ అరుదైన ఘనత..ఈ క్రమంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్(2021-23, 2023-25)లో కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.కమ్మిన్స్ తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సారథ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడగా.. 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడో స్ధానంలో 14 విజయాలతో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
టీమిండియాతో ఎప్పుడూ సవాలే.. కానీ కలిసికట్టుగా పోరాడం: కమ్మిన్స్
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత తిరిగి బీజీటీని రిటైన్ చేసుకుంది.చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ సారథ్యంలో ఆసీస్ విజేతగా నిలవగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ బీజీటీ టైటిల్‌ను కంగారులు దక్కించుకున్నారు. కాగా ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన కమ్మిన్స్ సేన.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపింది. భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తిరిగి చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది. మా జట్టులో చాలా మంది ఇంతవరకు ఈ ట్రోఫీ నెగ్గలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేకపోయాం. ఆ తర్వాత కలిసికట్టుగా రాణించడం బాగుంది.జట్టులోని ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన ముగ్గురు కొత్త ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో మెరుగైన ఆటతీరు కనబర్చారు. నా కెరీర్లో ఇది చాలా ఇష్టమైన ట్రోఫీ. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యా. భారత్ వంటి ప్రత్యర్ధితో తలపడటం ఎప్పుడూ సవాలే" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు.. కోచ్‌లను మారిస్తే బెటర్: సునీల్ గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్‌కు టీమిండియా సమర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత జట్టుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్లేయర్స్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గంభీర్ అండ్ కో పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు."అస్సలు కోచ్‌లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్‌పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్‌కు సరైన ప్రణాళికలతో వెళ్లాల్సింది. కానీ కోచ్‌లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా బ్యాటర్ల ఆట తీరు మెరుగు పడలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్‌లే సమాధనమివ్వాలి. ఆటగాళ్లతో పాటు కోచ్‌ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కోచ్‌లు ప్లాన్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్‌ను ఆర్డర్‌ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌కు బదులుగా కోచ్‌లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.ప్రతీ ఒక్కరూ బ్యాటర్లను మాత్రమే తప్పుబడుతున్నారు. కానీ కోచ్‌లను కూడా ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం. ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ఫైరయ్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్ -
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు! -
గౌతమ్ గంభీర్‌పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది.డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా టీమిండియా తొలి సిరీస్‌లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్‌నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్‌పై టెస్ట్, టీ20 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్‌కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. -
కోహ్లి ఇప్పట్లో రిటైర్ కాడు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. సొంత అభిమానులు సైతం కోహ్లిని ఎండగడుతున్నారు. తాజాగా ముగిసిన బీజీటీలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు మాత్రమే చేశాడు. బీజీటీ 2024-25 ద్వారా కోహ్లికి ఉన్న ఓ వీక్ పాయింట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోలేక నానా అవస్థలు పడ్డాడు. తొమ్మిదింట ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో రిటైర్మెంట్పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోహ్లి అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని పీటీఐ నివేదిక కొట్టిపారేస్తుంది. కోహ్లికి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని సదరు నివేదిక పేర్కొంది. కోహ్లి తనకు తాను లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకున్నాడని తెలిపింది. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ప్రణాళికలు సెట్ చేసుకున్నాడని పేర్కొంది.ఇదిలా ఉంటే, కోహ్లి సహా రోహిత్ శర్మను త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి తప్పిస్తారని తెలుస్తుంది. రో-కోను ఏ ప్రాతిపదికన ఇంగ్లండ్‌తో పరిమత సిరీస్‌లకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు ప్రశిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి దేశవాలీ క్రికెట్ ఆడి ఫామ్‌లోకి రావాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ నిరూపించుకున్నాకే వారు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని గవాస్కర్ పేర్కొన్నాడు. విశ్లేషకుల అంచనా మేరకు, రోహిత్‌తో పోలిస్తే కోహ్లికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు అవకాశాలు రాకపోవడానికి అతని ఫామ్ లేమితో పాటు వయసు కూడా ప్రధాన అంశమే. వయసులో కోహ్లి రోహిత్ కంటే సంవత్సరం చిన్నవాడు. ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి రోహిత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు. బీజీటీ.. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లి సెంచరీలు చేశాడు. రోహిత్ పరిస్థితి అలా లేదు. అతను ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తే.. కోహ్లి కంటే ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కోహ్లికి ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశమే లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.కాగా, బీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు. నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. -
చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు: జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది.162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు డిఫెండ్ చేసుకోలేకపోయింది.మూడో రోజు ఆటకు స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా తత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఓడిపోయినప్పటికి తమ జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచందని బుమ్రా చెప్పుకొచ్చాడు."కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశపరిచింది. అంతేకాకుండా గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడం కాస్త అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరానికి ప్రధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.మన శరీరంతో మనం పోరాడలేం.ఈ సిరీస్‌లోనే బాగా బౌలింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పవడం బాధగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ నా సెకెండ్ స్పెల్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో మా కుర్రాళ్లతో చర్చించి బయటకు వెళ్లిపోయాను. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఒక బౌలర్ లోటుతోనే ఆడాము. అయినప్పటకి మిగితా బౌలర్లు బాధ్యత తీసుకుని అద్బుతంగా రాణించారు. ఈ రోజు ఉదయం కూడా మా బౌలర్లతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాను. ఆఖరి ఇన్నింగ్స్‌లో కూడా అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని వారితో చెప్పాను. ఏదమైనప్పటికి ఆస్ట్రేలియాకు మేము గట్టిపోటీ ఇచ్చాము. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్ ఏకపక్షంగా సాగలేదు. మేము ఆఖరి వరకు అద్బుతంగా పోరాడాము. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది.గేమ్‌లో ఉండాలంటే ప్రత్యర్ధిపై ఒత్తిడికి గురిచేయడం, పరిస్థితికి అనుగుణంగా ఆడటం వంటివి చాలా ముఖ్యమైనవి. ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. భవిష్యత్తులో అవి కచ్చితంగా ఉపయోగపడతాయి. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.వారు కూడా లా అనుభవాన్ని పొందారు. ఈ సిరీస్‌తో టీమ్‌లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ప్రపంచానికి చూపించాము. కుర్రాళ్లు గెలవలేదని నిరాశతో ఉన్నారు. కానీ ఈ ఓటమిని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంటారు. ఇక విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు కూడా అద్బుతంగా పోరాడరని" పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు. He was devastating at times, so it's no surprise to see Jasprit Bumrah named the NRMA Insurance Player of the Series. #AUSvIND pic.twitter.com/7qFlYcjD2d— cricket.com.au (@cricketcomau) January 5, 2025 -
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భారత్ మిస్
టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2025 ఫైనల్(WTC Final) ఆశలు ఆడియాశలు అయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. 2019-21 సైకిల్లో టీమిండియా 70 విన్నింగ్ శాతంతో తొట్ట తొలి సీజన్లో భారత్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. కానీ విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది.ఆ తర్వాత సైకిల్(2021-23)లో కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. కానీ డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం తమ ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించలేకపోయింది. ఈ సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్ శాతంతో మూడో స్ధానానికే రోహిత్ సేన పరిమితమైంది.ఫైనల్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హతసాధించింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో 17 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. 11 విజయాలు, 4 ఓటములును నమోదు చేసింది. పాయింట్లపట్టికలో ఆస్ట్రేలియా 63.73 విన్నింగ్ శాతంతో రెండో స్ధానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ప్రోటీస్ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.చదవండి: IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్ -
సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి.ఇక మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్‌కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.నిప్పులు చెరిగిన బోలాండ్.. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించిం భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా బోలాండ్ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. -
India vs Aus 5th test: సిడ్నీ టెస్టులో భారత్ చిత్తు.. బీజీటీ ఆసీస్‌దే
IND vs Aus 5th Test Day 3 Live updates and Highlights: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. ఇక మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.ఓటమి దిశగా భారత్..సిడ్నీ టెస్టులో టీమిండియా ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 162 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 15 పరుగులు కావాలి.ఆసీస్ నాలుగో వికెట్ డౌన్.. ఖావాజా ఔట్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 81/3ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(26 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(8 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(19 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(5 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.ఆసీస్ మూడో వికెట్ డౌన్..ప్రస్దిద్ద్ కృష్ణ భారత్‌కు మరో వికెట్ అందించాడు. 4 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 65/3. లబుషేన్ ఔట్..ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 52/2. ఆసీస్ తొలి వికెట్ డౌన్సామ్ కాన్స్టాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కాన్స్టాస్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(5), మార్నస్ లబుషేన్ ఉన్నారు.భారత్‌కు భారీ షాక్..కాగా మూడో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా బ్యాటింగ్ అనంతరం బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆలౌట్..టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. 141 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో ఆస్ట్రేలియా ముందు 161 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఉంచగల్గింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టగా... కమ్మిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఇక భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సుందర్ క్లీన్ బౌల్డ్..భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.భారత్ ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జడేజా.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 148/7మూడో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు ఆటలో పింక్ జెర్సీతో భారత్ బరిలోకి దిగింది. -
ఆఫ్‌స్పిన్‌ను పక్కనపెట్టి... పేస్ ఆల్‌రౌండర్‌గా
అచ్చొచ్చిన సొంత మైదానంలో స్టీవ్ స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... టీమిండియాపై దంచి కొట్టే హెడ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు! టీనేజ్ కుర్రాడు కొన్‌స్టాస్ మెరుపులు 3 బౌండరీలకే పరిమితం కాగా... మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా వైఫల్యాన్ని కొనసాగించాడు! ఆదుకుంటాడనుకున్న లబుషేన్ ఆరంభంలోనే చేతులెత్తేయగా... అలెక్స్ కేరీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!అయినా ఆ్రస్టేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది అంటే అదంతా అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ చలవే. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న మిషెల్ మార్ష్ ను తప్పించి... చివరి టెస్టులో వెబ్‌స్టర్‌కు అవకాశం ఇవ్వగా... అతడు భారత జట్టుకు ప్రధాన అడ్డంకిగా నిలిచి భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించి... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా మారిన ఆ్రస్టేలియా నయా తార వెబ్స్టర్పై ప్రత్యేక కథనం... – సాక్షి, క్రీడావిభాగం సుదీర్ఘ దేశవాళీ అనుభవం... వేలకొద్దీ ఫస్ట్‌క్లాస్ పరుగులు... బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్నా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయిన వెబ్‌స్టర్... ఎట్టకేలకు జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లే నిలవలేకపోతున్న చోట... చక్కటి సంయమనంతో ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్యామ్ కొన్‌స్టాస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో పాటు నోటి దురుసుతో వార్తల్లోకెక్కగా... వెబ్‌స్టర్ మాత్రం నింపాదిగా ఆడి తనదైన ముద్ర వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన అతడు... 2.23 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. బౌలింగ్‌లో వికెట్ తీయలేకపోయినా... స్టార్క్, కమిన్స్ వంటి స్టార్ బౌలర్ల కంటే తక్కువ పరుగులు ఇచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులో అడుగుపెట్టిన వెబ్‌స్టర్... తనలో మంచి బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ ఉండటంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ అతడికే ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ అవుట్ కాగా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది తొలి మ్యాచే అయినా... దేశవాళీల్లో వందల మ్యాచ్‌ల అనుభవం ఉండటంతో లోయర్ ఆర్డర్‌తో కలిసి జట్టును నడిపించాడు. అతడు ఒక్కో పరుగు జోడిస్తుంటే... టీమిండియా ఆధిక్యం కరుగుతూ పోయింది. ఆరో వికెట్‌కు అలెక్స్ కెరీతో 41 పరుగులు, ఏడో వికెట్‌కు కెపె్టన్ కమిన్స్‌తో కలిసి 25 పరుగులు జోడించాడు. ఇక కింది వరుస బ్యాటర్ల అండతో పరుగులు చేయడం కష్టమని భావించి భారీ షాట్లకు యత్నించిన వెబ్‌స్టర్... చివరకు తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. గత నాలుగు టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న మిషెల్ మార్‡్ష ఒక్క మ్యాచ్‌లోనూ అటు బ్యాట్‌తో కానీ, ఇటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... తొలి మ్యాచ్‌లోనే వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనూహ్య బౌన్స్, అస్థిర పేస్ కనిపించిన సిడ్నీ పిచ్‌పై వెబ్‌స్టర్ గొప్ప సంయమనం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయిన చోట ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన వెబ్‌స్టర్... ఆ తర్వాత బంతితోనూ ఆకట్టుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన వెబ్‌స్టర్ అందులో కీలకమైన శుబ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు. కామెరూన్ గ్రీన్ వంటి ప్రధాన ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడంతో మిషెల్ మార్ష్ జట్టులోకి రాగా... ఇప్పుడు వెబ్‌స్టర్ ప్రదర్శన చూస్తుంటే ఇక మార్ష్ జట్టులో చోటుపై ఆశలు వదులుకోవడమే మేలనిపిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన 31 ఏళ్ల వెబ్‌స్టర్... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 6 అడుగుల 7 అంగుళాలున్న వెబ్‌స్టర్‌కు బంతిని స్పిన్ చేయడం కంటే... వేగంగా విసరడం సులువు అని కోచ్‌లు సూచించడంతో తన దిశ మార్చుకున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచే నిలకడ కొనసాగించిన వెబ్‌స్టర్... 2014లో తన 20 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు రాబట్టినా... జాతీయ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆసీస్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా దేశవాళీల్లో రాణించిన వెబ్‌స్టర్ ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున బరిలోకి దిగి అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించాడు. 2023–24 షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెబ్‌స్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సీజన్ ఆసాంతం ఒకే తీవ్రత కొనసాగించిన అతడు... 58.62 సగటుతో 938 పరుగులు చేయడంతో పాటు... 30.80 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత ఒకే సీజన్లో రెండు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా రాణించిన వెబ్‌స్టర్ తనను పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. కెరీర్లో ఇప్పటి వరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన వెబ్‌స్టర్ 5297 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 24 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 148 వికెట్లు పడగొట్టాడు. -
నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టం
సిడ్నీ: ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకపోయినా... ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా కష్టమే అని భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. సిడ్నీ వికెట్ అనూహ్యంగా స్పందిస్తోందని... భారీ స్కోరు చేయడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు. శనివారం ఆట ముగిసిన అనంతరం ప్రసిధ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. ముఖ్యంగా కొన్ని భాగాల్లో పిచ్‌ను తాకిన తర్వాత తక్కువ ఎత్తులో వస్తోంది. మరికొన్ని చోట్ల బాగా బౌన్స్ అవుతోంది. ఇలాంటి చోట ఎంత లక్ష్యం సురక్షితం అని చెప్పలేం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయతి్నస్తాం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ‘ఎ’ తరఫున ఇక్కడ పర్యటించడం మంచి ఫలితాన్నిచ్చింది.దానివల్లే సులువుగా బౌలింగ్ చేశా. మొదట్లో కాస్త ఒత్తిడికి గురైనా... ఆ వెంటనే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగా. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ప్రాథమిక సూత్రానికి కట్టుబడే బంతులు విసిరా. దాంతోనే ఫలితం రాబట్టగలిగా. ఇక ముందు కూడా ఇదే కొనసాగిస్తా. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించాడు. ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ఆఖరి టెస్టులో ప్రస్తుతం భారత జట్టు ఓవరాల్‌గా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
మొదట్లో అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్
యువ పేసర్ ప్రసిద్ కృష్ణ సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అన్నాడు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. వేరొకరిని తుదిజట్టులో ఆడించడం కోసం ప్రసిద్‌ను పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా 2023లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు 28 ఏళ్ల ప్రసిద్(Prasidh Krishna).షమీ లేకపోవడంతోకర్ణాటకకు చెందిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చి.. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరమైన కారణంగా ప్రసిద్‌కు మరోసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్‌లతో కలిసి ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ప్రసిద్ స్థానం సంపాదించాడు. అయితే, బుమ్రా, సిరాజ్‌లతో పాటు హర్షిత్ రాణాకు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. పెర్త్ వేదికగా అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ కృష్ణకు మొండిచేయి ఎదురైంది.ఆకాశ్ దీప్ గాయం కారణంగాఇక ఆసీస్‌తో తొలి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా.. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో హర్షిత్‌పై వేటు వేసిన యాజమాన్యం.. తర్వాతి రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్‌ను ఆడించింది. దీంతో మరోసారి ప్రసిద్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.అయితే, కీలకమైన ఐదో టెస్టుకు ముందు ఆకాశ్ గాయపడటంతో ప్రసిద్ కృష్ణకు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్టులో ప్రసిద్ మెరుగ్గా రాణించాడు. స్టీవ్ స్మిత్(33), అలెక్స్ క్యారీ(21), బ్యూ వెబ్‌స్టర్(57) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.అనధికారిక సిరీస్‌లోనూ సత్తా చాటిమొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రసిద్ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తన సత్తా ఏమిటో చాటుకోగలిగాడు. అంతేకాదు.. అంతకు ముందు భారత్-‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ప్రసిద్ కృష్ణ పది వికెట్లతో మెరిశాడు.తప్పు చేశారుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెస్టు సిరీస్ మొదలుకావడానికి ముందు భారత్-‘ఎ’ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉందో చూసిన తర్వాత కూడా.. ప్రసిద్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం బుర్రలేని పని. ప్రసిద్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. అయినా సరే.. సిరీస్ ఆరంభం నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ తప్పుచేసింది’’ అని పేర్కొన్నాడు.కాగా సిడ్నీ వేదికగా శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లొ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆసీస్‌ను 181 పరుగులకే కుప్పకూల్చి నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బారత్ 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: పంత్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
అస్సలు ఏమైంది కోహ్లి నీకు..? మళ్లీ అదే బంతికి ఔట్! వీడియో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనతో ముగించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు(ఐదో టెస్టు)లోనూ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును కనబరిచాడు.కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కింగ్ కోహ్లి మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి దొరికిపోయాడు. విరాట్ కోహ్లి వీక్నెస్ను బోలాండ్ మళ్లీ క్యాష్ చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బోలాండ్ తొలి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి సంధించాడు.ఆ బంతిని హార్డ్ హ్యాండ్స్‌తో కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సిరీస్‌లో కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి కావడం గమనార్హం. కాగా ఒకప్పుడు ఆఫ్ సైడ్ బంతులను అద్భుతంగా ఆడే కోహ్లి.. ఇప్పుడే అదే బంతులకు తన వికెట్‌ను కోల్పోతుండడం అభిమానులను నిరాశపరుస్తోంది. ఏమైంది కోహ్లి నీకు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్న విరాట్.. ఈసారి మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులు చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ తీవ్ర నిరాశపరిచాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహంThe Scott Boland show is delivering at the SCG!He's got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j— cricket.com.au (@cricketcomau) January 4, 2025 -
పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల దూకుడుకు పంత్ కళ్లేం వేశాడు.తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన పంత్.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానుల అలరించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే ఈ ఢిల్లీ డైనమెట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 33 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఈ జాబితాలో రిషబ్‌నే తొలి స్ధానంలో ఉన్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా రికార్డు..ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్‌గా రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజాల ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. Aate hi RISHABH-PANTI shuru! 🔥When @RishabhPant17 steps in, the entertainment level goes 𝗨𝗽&𝗨𝗽 📈#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/tiJiuBOEDO— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
India vs Aus 5th test: ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్
India vs Aus 5th test day 2 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది.ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) నాటౌట్‌గా ఉన్నారు.అంతకుముందు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, వెబ్‌స్టర్ తలా వికెట్ సాధించారు. కాగా ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియానితీశ్ రెడ్డి(21 బంతుల్లో 4) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. జడేజా రెండు పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 129/6 (27.4). ఆసీస్ కంటే 133 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.రిషబ్ పంత్ ఔట్..రిషబ్ పంత్ ధనధాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసిన పంత్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు భారత్ స్కోర్ 125-5. క్రీజులో జడేజా(2), నితీశ్ కుమార్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ప్రస్తుతం 129 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్ 61 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 22 ఓవర్లకు భారత్ స్కోర్: 124/2. టీమిండియా ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.దూకుడుగా ఆడుతున్న పంత్..టీమిండియా వరుస క్రమంలో వికెట్లు పడతున్నప్పటికి రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 97/4. భారత్ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.భారత్ నాలుగో వికెట్ డౌన్..శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన గిల్..వెబ్‌స్టర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4భారత్ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి మరి కోహ్లి ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్ 68/3. క్రీజులో గిల్(13), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాబోలాండ్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసిన ఈ పేస్ బౌలర్.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(22)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 47/2 (9.5). గిల్ ఐదు పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టీమిండియా స్కోరు: 42/1 (7.3). శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 22 పరుగులతో ఉన్నాడు.ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 36/0 (6)జైస్వాల్ 21, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.జైశ్వాల్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో 16 పరుగులుభారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 16 పరుగులు రాబట్టాడు.181 పరుగులకు ఆసీస్ ఆలౌట్..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ తమ తొన్నింగ్స్‌లో 181 పరుగులకు కుప్పకూలింది. 9/1 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అదనంగా 172 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్.. వెబ్‌స్టర్ ఔట్ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన వెబ్‌స్టర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 48 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 170/9ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్.. ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన స్టార్క్.. నితీశ్‌కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ ఏడో వికెట్ డౌన్..ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కమ్మిన్స్.. నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. 46 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 163/7. ప్రస్తుతం క్రీజులో వెబ్‌స్టర్(56 నాటౌట్), స్టార్క్(1) ఉన్నారు.ఆరో వికెట్ డౌన్.. క్యారీ ఔట్ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న వెబ్‌స్టర్, క్యారీ..లంచ్ బ్రేక్ అనంతరం వెబ్‌స్టర్, క్యారీ నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్లు ముగిసే 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వెబ్‌స్టర్(37), క్యారీ(5) ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టర్(28), క్యారీ(4) పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన స్మిత్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు.సిరాజ్ ఆన్ ఫైర్..మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. 12 ఓవర్ వేసిన సిరాజ్ రెండో బంతికి సామ్ కాన్స్టాస్ను ఔట్ చేయగా.. ఐదో బంతికి డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/4. క్రీజులో వెబ్‌స్టర్(0), స్మిత్(4) ఉన్నారు.ఆసీస్ రెండో వికెట్ డౌన్..రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన లబుషేన్.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 25/2. క్రీజులో సామ్ కాన్స్టాస్(18), స్మిత్(4) ఉన్నారు.రెండో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. తొలి రోజు ఆట మగిసే సమయానికి ఆసీస్ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. -
తీరు మార్చుకోని కోహ్లికి రిటైర్మెంట్ తప్పదా..?
భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్‌ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్‌కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్‌లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది. -
టీమిండియాతో ఐదో టెస్ట్.. స్కాట్ బోలాండ్ రికార్డు
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఓ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన బోలాండ్ టెస్ట్‌ల్లో 50 వికెట్ల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బోలాండ్ 35 ఏళ్ల 267 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. న్యూజిలాండ్‌కు చెందిన బెవాన్ కాంగ్‌డాన్ 37 ఏళ్ల 10 రోజుల వయసులో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ 50వ టెస్ట్ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో బోలాండ్ జోష్ హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఈ సిరీస్‌లో బోలాండ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 15.46 సగటున 15 వికెట్లు పడగొట్టాడు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ టెస్ట్‌లో బోలాండ్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బీజీటీలో బోలాండ్ ఐదో లీడింగ్ వికెట్‌టేకర్‌గా ఉన్నాడు. బోలాండ్ తన టెస్ట్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.సిడ్నీ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఓ వికెట్ తీసి టీమిండియా భరతం పట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రవీంద్ర జడేజా 26, జస్ప్రీత్ బుమ్రా 22, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 17, వాషింగ్టన్ సుందర్ 14, యశస్వి జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, నితీశ్‌కుమార్ రెడ్డి 0, ప్రసిద్ద్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (2) తొలి రోజు ఆటలో చివరి బంతికి ఔటయ్యాడు. సామ్ కొన్‌స్టాస్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది. -
రిషబ్ పంత్ సూపర్ సిక్సర్... నిచ్చెనెక్కి బంతిని తీశారు! వీడియో
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22) రాణించారు.భారత బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆసీస్‌కు తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్ ఉస్మాన్ ఖావాజాను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.పంత్ భారీ సిక్సర్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(Rishabh Pant) విరోచిత పోరాటం కనబరిచాడు. విరాట్ కోహ్లి ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతులు బుల్లెట్లా తన శరీరానికి తాకుతున్నప్పటకి పంత్ మాత్రం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ బౌలింగ్‌లో రిషబ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. అతడు కొట్టిన షాట్ పవర్ బంతి ఏకంగా సైడ్స్క్రీన్పై చిక్కుకుపోయింది. దీంతో ఆ బంతిని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. నిచ్చెనను తీసుకువచ్చి మరి ఆ బంతిని కిందకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే.. A six so big the ground staff needed a ladder to retrieve it!#AUSvIND pic.twitter.com/oLUSw196l3— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
IND Vs AUS: పంత్ మోచేతికి గాయం.. అయినా సరే! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh pant) అద్బుతమైన పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పులు పెడుతున్నప్పటికీ.. పంత్ మాత్రం తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ చాలాసేపు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటకి రిషబ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 40 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ Rishabh Pant facing some serious punishment from the Australian bowlers. Taking some heavy blows. #AUSvIND #Rishabpant #BorderGavaskarTrophy #ToughestRivalry https://t.co/QiLSnpRbYE— 𝕊𝕙𝕒𝕙𝕚𝕕 𝕌𝕝 𝕀𝕤𝕝𝕒𝕞 (@Shahid_shaban) January 3, 2025 -
మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు.మరోసారి కోహ్లి వీక్నెస్ను ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ సొమ్ము చేసుకున్నాడు. 31 ఓవర్లో బోలాండ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని వెంటాడి మరి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. ఆ ఓవర్లో మూడో బంతిని బోలాండ్.. విరాట్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో థర్డ్ స్లిప్‌లో ఉన్న ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో చేసేదేమి లేక కోహ్లి(17) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్‌సైడ్ బంతులకు కోహ్లి ఔట్ కావడం ఇది ఏడో సారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 43 ఓవర్లు ముగిసే భారత్ 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. Virat Kohli wicket. 😞#INDvsAUS #AUSvIND #ViratKohli pic.twitter.com/mqCMNWMdA3— Tanveer (@tanveermamdani) January 3, 2025 -
రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే?
అంతా ఊహించిందే జరిగింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) దూరమయ్యాడు. అతడి స్దానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడని టాస్ సమయంలో బుమ్రా తెలిపాడు."ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ తనంతటతానే విశ్రాంతి తీసుకుని తన గొప్పతానాన్ని చాటుకున్నాడు. ఈ పరిణామం జట్టులో చాలా ఐక్యత ఉందని చూపిస్తుంది. టీమిండియాలో స్వార్దం అనే పదానికి తావు లేదు. అందరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.రోహిత్ విశ్రాంతి తీసుకోగా, ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమయ్యాడు. రోహిత్ స్ధానంలో గిల్ జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడని" బుమ్రా పేర్కొన్నాడు. కాగా సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడనే వార్తలు ముందు నుంచే వినిపించాయి.దానికితోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించకపోవడం, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ బుమ్రాతో సుదీర్ఘమైన చర్చలు జరపడంతో హిట్‌మ్యాన్ బెంచ్‌కే పరిమితం కానున్నడన్న విషయం అర్దం అయిపోయింది. అంతా అనుకున్నట్లే ఆఖరి టెస్టుకు ఈ ముంబైకర్ దూరమయ్యాడు.కాగా ఈ సిరీస్‌లో రోహిత్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. తన ట్రేడ్‌మార్క్ ఫ్రంట్ పుల్ షాట్ ఆడటంలో కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్చదవండి:లంక పర్యటనకు కమిన్స్ దూరం -
బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్.. వికెట్‌తో తొలిరోజు ముగించిన భారత్
India vs Aus 5th test day 1 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్(20), రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించగా.. రిషభ్ పంత్(40), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(17 బంతుల్లో 22) రాణించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వికెట్ తీసిన బుమ్రాఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(2)ను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశాడు. సిడ్నీలో శుక్రవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆసీస్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.185 పరుగులకు టీమిండియా ఆలౌట్..సిడ్నీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరి కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు జడేజా(26) పర్వాలేదన్పించాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మిచెల్ స్టార్క్ మూడు, కమ్మిన్స్ రెండు, లియోన్ ఒక్క వికెట్ సాధించారు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణ(3) తొమ్మిదో వికెట్‌గా వెనునదిరిగాడు. సామ్ కొన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వరుస ఫోర్లు కొట్టి బుమ్రా 12 పరుగులతో క్రీజులో ఉండగా.. సిరాజ్ ప్రసిద్ స్థానంలో వచ్చాడు. భారత్ స్కోరు: 168/9 (68.2).సుందర్ ఔట్..టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. 66 ఓవర్లకు భారత్ స్కోర్: 149/8భారత్ ఏడో వికెట్ డౌన్..రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్పంత్ స్థానంలోక్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి తొలి బంతికే అవుటయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 120/6 (57) ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాపంత్(40) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్ చేరాడు. నితీశ్ కుమార్ రెడ్డిక్రీజులోకి వచ్చాడు.56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 119/4 (56) .జడ్డూ 14, పంత్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.టీ బ్రేక్‌కు భారత్ స్కోర్: 107/4టీ విరామానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) ఉన్నారు.48 ఓవర్లకు భారత్ స్కోర్: 100/4రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 28 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 48 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్..విరాట్ కోహ్లి ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు రిషబ్ పంత్(19 నాటౌట్), రవీంద్ర జడేజా(4 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 87/4టీమిండియా నాలుగో వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి(17) ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 76/4నిలకడగా ఆడుతున్న కోహ్లి, పంత్లంచ్ అనంతరం తొలి రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 30 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 67/3. క్రీజులో పంత్(7)తో పాటు విరాట్ కోహ్లి(14) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్.. గిల్ ఔట్‌శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామానికి ముందు లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్: 57/3నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..శుబ్‌మన్ గిల్, కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/2జైశ్వాల్ ఔట్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.రాహుల్ ఔట్..కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రాహుల్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1రోహిత్ ఔట్.. గిల్ ఇన్సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆఖరి టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు.రోహిత్‌తో పాటు గాయం కారణంగా ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. రోహిత్ స్ధానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మిచెల్ మార్ష్ స్ధానంలో వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ -
Ind vs Aus: అతడు లేని లోటు సుస్పష్టం.. సిడ్నీలో భారత్ రికార్డు?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్‌లో ఆఖరిది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసీస్‌తో సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ప్రస్తుత సిరీస్‌లో పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్బోర్న్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.అతడు లేని లోటు సుస్పష్టంఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్‌లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్‌లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.పుజారాతో కలిసి పంత్ కూడాజట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.కనీసం డ్రా అయినాకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్‌ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్‌ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్‌ను వేధిస్తున్నాయి.ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడుఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా! శుబ్‌మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్‌కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది. ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.సిడ్నీలో గెలిస్తేనేకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్‌లో గెలిచిన భారత్.. అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
IND Vs AUS: భారత్‌తో ఐదో టెస్టు.. ఆసీస్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25పై ఆతిథ్య ఆస్ట్రేలియా కన్నేసింది. సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సిడ్నీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌పై జట్టు ఆసీస్ టీమ్ మెనెజ్‌మెంట్ వేటు వేసింది. అతడి స్ధానంలో బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌తో వెబ్‌స్టర్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.వెబ్‌స్టర్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్యూ వెబ్‌స్టర్ 5297 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి తుది జట్టులో చోటు ఇచ్చారు.మరోవైపు నాలుగో టెస్టులో పక్కటెముకల నొప్పితో బాధపడ్డ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి తన ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఐదో టెస్టులో కూడా స్టార్క్ ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగితా ఆసీస్ జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఆసీస్ ఉంది. ఆఖరి టెస్టులో ఆసీస్ గెలిస్తే సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. సిడ్నీ వేదికగా శుక్రవారం(జనవరి 3) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్ అమీ తుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టుకు యువ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఆకాష్ దీప్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆకాష్ కేవలం 43 ఓవర్ల బౌలింగ్ మాత్రమే చేశాడు. దీంతో అతడికి ఆఖరి టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించిందంట.ఆకాష్ స్ధానంలో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికరిక టెస్టుల్లో కృష్ణ అద్భుతంగా రాణించాడు.ఈ క్రమంలోనే తొలి రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రానాను కాదని ప్రసిద్ద్‌కు చాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా తర్వాత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన ఆకాష్ దీప్.. సిడ్నీ టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.బ్రిస్బేన్ టెస్టు డ్రా ముగియడంలో దీప్ది కీలక పాత్ర. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైతే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.చదవండి: బుమ్రా లేకుంటే బీజీటీ ఏకపక్షమే: గ్లెన్ మెక్‌గ్రాత్ -
బుమ్రా లేకుంటే వార్ వన్ సైడే: గ్లెన్ మెక్‌గ్రాత్
భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ఏకపక్షంగా సాగేదని ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించడంలో బుమ్రా బుర్ర చురుకైందని మెక్‌గ్రాత్ కితాబిచ్చాడు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ముగియగా... టీమిండియా 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు విఫలమైనా... బుమ్రా ఒంటి చేత్తో జట్టును పోటీలో నిలిపాడని మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ‘బుమ్రా లేకుండా సిరీస్ మరింత ఏకపక్షం అయ్యేది. అతడు టీమిండియాకు ప్రధాన బలం. అతడి బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. భారత జట్టు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి.భారత్‌లో క్రికెట్‌కు చాలా క్రేజ్ ఉంది. గత 12 ఏళ్లుగా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తరఫున భారత్‌లో పనిచేస్తున్నా. మా సంస్థ ద్వారా ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ఎందరో లబ్ధి పొందారు. క్రికెట్లోని అన్నీ ఫార్మాట్లలో టెస్టులే అత్యుత్తమం. మెల్బోర్న్ టెస్టును ఐదు రోజుల్లో కలిపి 3,70,000 మంది వీక్షించడం ఆనందాన్నిచి్చంది. ఇది టెస్టు క్రికెట్‌కున్న ఆదరణను వెల్లడిస్తుంది’ అని మెక్‌గ్రాత్ అన్నాడు.చదవండి: బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలని చట్టం తెస్తాం -
ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తుంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.ప్రస్తుతం ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 12.83 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్లు ఘనతలు ఉండగా..రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లండ్‌పై)2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లండ్‌పై)3. శుభాష్చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)5. హర్భజన్ సింగ్ - 32 (ఆస్ట్రేలియాపై)6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్‌పై)7. రవిచంద్రన్ అశ్విన్ - 31 (దక్షిణాఫ్రికాపై)8. బిషన్ సింగ్ బేడీ - 31 (ఆస్ట్రేలియాపై)9. జస్ప్రీత్ బుమ్రా - 30 (ఆస్ట్రేలియాపై)కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. -
టీమిండియాతో ఆఖరి టెస్ట్.. ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగబోయే చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనుందని తెలుస్తుంది. ఫామ్‌లో లేని మిచెల్ మార్ష్‌పై వేటు పడే అవకాశం ఉందని సమచారం. పక్కటెముకల సమస్యతో బాధపడుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతినిస్తారని తెలుస్తుంది. మ్యాచ్ సమయానికి స్టార్క్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తుది జట్టులో ఉంటాడు. లేదంటే అతని స్థానంలో జై రిచర్డ్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రిచర్డ్సన్ గాయపడిన హాజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. మార్ష్ విషయానికొస్తే.. అతను ఫామ్ లేమితో పాటు ఫిట్నెస్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మార్ష్ ఎక్కువగా బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. అతను పెద్దగా బౌలింగ్ చేయలేదు. మార్ష్ ఈ సిరీస్ 10.43 సగటున కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్లో మార్ష్ ఆసీస్‌కు పెద్ద సమస్యగా మారాడు. అందుకే అతనిపై వేటు పడనుందని తెలుస్తుంది. ఆఖరి టెస్ట్‌లో మార్ష్ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్ తుది జట్టులోకి వస్తాడని సమాచారం. పై రెండు మార్పులతో ఆసీస్ చివరి టెస్ట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్‌తో ఐదో టెస్ట్‌కు ఆసీస్ తుది జట్టు (అంచనా)..ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్ (ఫిట్‌గా ఉంటేనే) లేదా జై రిచర్డ్సన్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. -
BGT: చాలానే చేశారు.. ఇక చాలు.. మండిపడ్డ గంభీర్!
టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.కాగా గంభీర్ ప్రధాన కోచ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడం మినహా ఇంత వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది.దారుణ వైఫల్యాలుసొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్ కావడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారి తీసింది. ఆసీస్‌తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది.స్టార్ బ్యాటర్ల వైఫల్యంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.అదే విధంగా.. ఐదు టెస్టుల సిరీస్‌ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్‌లపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.చాలా ఎక్కువే చేశారుఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్.. డ్రెసింగ్‌రూమ్‌లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కోచ్‌గా నాకు కావాల్సినంత దక్కింది.. చాలా ఎక్కువే చేశారు’’ అంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్‌తో రోహిత్‌కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3న ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందులో గనుక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
టెస్టుల్లో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. గత తొమ్మిది టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కేవలం మూడే విజయాలు సాధించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చేదు అనుభవాలు చవిచూసింది.స్వదేశంలో ఘోర పరాభవంస్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి ఇంతటి ఘోర పరాభవం చవిచూసిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ పరాభవాన్ని మరిపించేలా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో రాణించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.ఆసీస్‌లో శుభారంభం చేసినా..ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఆసీస్‌ను ఎదుర్కొన్న టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చిందనే సంకేతాలు ఇచ్చింది. కానీ.. రోహిత్ శర్మ జట్టుతో చేరిన తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.వరుస ఓటములతోఆసీస్తో అడిలైడ్ టెస్టులో ఓడిన టీమిండియా.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే, మెల్బోర్న్ టెస్టులో మాత్రం చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుని.. 184 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలని.. గంభీర్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలగాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం కూడా హీటెక్కినట్లు సమాచారం. రోహిత్, గంభీర్‌పై చర్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపక్రమించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.అతడి కోసం పట్టుబట్టిన గంభీర్..ఆసీస్ పర్యటనకు టీమిండియా వెటరన్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను ఎంపిక చేయాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. అయితే, సెలక్టర్లు మాత్రం అతడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పెర్త్ టెస్టు తర్వాత అయినా.. పుజారాను పిలిపిస్తే బాగుంటుందని గంభీర్ సూచించినా.. మేనేజ్మెంట్ మాత్రం అతడి మాటను పట్టించుకోలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్రకాగా పుజారాకు ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్ర ఉంది. 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పుజారా 1258 బంతులు ఎదుర్కొని.. 521 పరుగులు చేశాడు. తద్వారా భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2020-21 సీజన్లోనూ రాణించాడు. ఇక ఓవరాల్‌గా కంగారూ గడ్డపై పుజారా పదకొండు మ్యాచ్‌లు ఆడి 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు.ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భాగంగా ఆఖరిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన పుజారా.. 14, 27 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల ఈ సౌరాష్ట్ర బ్యాటర్ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీల్లో, దేశీ రంజీల్లో రాణిస్తున్నాడు. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?ఈ నేపథ్యంలోనే పుజారా గురించి గంభీర్ ప్రస్తావించగా.. సెలక్టర్లు మాత్రం అతడి పేరును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి గౌతీ మాట చెల్లడం లేదని.. త్వరలోనే అతడిపై వేటు తప్పదనే వదంతులు వ్యాపిస్తున్నాయి.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది: రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ఎప్పుడూ కొత్త సవాళ్లను విసురుతుంది. అదీ ఆస్ట్రేలియా గడ్డ పై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో పోటీ ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. భారత్ ఆటగాళ్ల క్రీడా జీవితానికి ఇది ఎప్పుడూ కఠిన పరీక్ష గా నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఈ సిరీస్ కి సన్నద్ధమయ్యే తీరు. ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ గడ్డ పై జరిగే టెస్ట్ సిరీస్ కి అత్యున్నత స్థాయిలో సిద్దమౌవుతారు. అదే స్థాయిలో పోటీ పడతారు. అందుకు భిన్నంగా భారత్ ఆటగాళ్లు ఈ సిరీస్ కి ముందు చాల పేలవంగా ఆడి సొంత గడ్డ పై న్యూజిలాండ్ చేతిలో వరసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసారు.అయితే ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో జట్టుకి నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో భారత్ ని గెలిపించాడు. అయితే తొలి టెస్ట్ కి వ్యకిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో పునరాగమనం భారత జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఇందుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ పేలవమైన ఫామ్. రోహిత్ శర్మ కి జోడీగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే స్థాయిలో ఘోరంగా విఫలవడంతో ప్రస్తుత వారి టెస్ట్ క్రికెట్ జీవితం కొనసాగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాధ్యతారహితమైన షాట్ ల పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ లో చివరి రోజున కొట్టిన దారుణమైన షాట్. టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్న సమయంలో రిషబ్ (104 బంతుల్లో ౩౦ పరుగులు) ఒక చెత్త షాట్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్లకు కొత్త ఉత్సాహాన్ని అందించాడు. దీంతో భారత్ వికెట్లు వడి వడి గా పడిపోవడంతో జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ రిషబ్ పంత్ కొట్టిన షాట్ ఆటలో భాగంగా జరిగిందనీ చెబుతూ అతన్ని హెచ్చరించాడు. పంత్ జట్టు అవసరాలకు అనుగుణంగా తన షాట్ లు కొట్టేందుకు ప్రయత్నించాలి, అని రోహిత్ వ్యాఖ్యానించాడు. "పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అతని హై-రిస్క్ పద్ధతులు గతంలో జట్టుకు అద్భుతమైన విజయాల్ని అందించాయని అంగీకరించాడు. అయితే పంత్ అవుటైన తీరును బాధాకరం అంటూనే అతను జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. "రిషబ్ పంత్ స్పష్టంగా జట్టు కి తన నుంచి ఎలాంటి అవసరమో ఉందో అర్థం చేసుకోవాలి," అని రోహిత్ వ్యాఖ్యానించాడు.అయితే పంత్ ని భారత్ మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి సమర్ధించాడు. "పంత్ తన ఆటతీరును మార్చడానికి ప్రయత్నించకూడదు. అతను సహజంగానే అద్భుతమైన ఆటగాడు. తన సహజ సిద్ధమైన ఆటతీరుతో జట్టుని చాల సార్లు గెలిపించాడు. కానీ అప్పుడప్పుడు అనుచిత షాట్లతో జట్టుని నిరాశపరుస్తాడు," అని దోషి వ్యాహ్యానించాడు. మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు రిషబ్ పంత్, హైదరాబాద్ మీడియం పేసర్ మహ్మద్ సిరాజ్ లు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే జట్టులో పంత్ స్థానానికి ప్రస్తుతం ఢోకా లేకపోవచ్చు కానీ అతని బ్యాటింగ్ తీరు పై నిఘా నేత్రం ఉంటుందనేది స్పష్టం. -
సిగ్గుపడాలి!.. భారత్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ఘాటు విమర్శలు చేశాడు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఈ ఢిల్లీ బ్యాటర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడని.. అతడికి బదులు యువ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నా బాగుండేదని పేర్కొన్నాడు. కోహ్లి సగటున సాధిస్తున్న పరుగులు చూస్తుంటే.. ఇప్పడిప్పుడే జట్టులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లను తలపిస్తున్నాడని విమర్శించాడు.ఆ సెంచరీ మినహా..శతకాల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి గత కొన్నేళ్లుగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)తో బిజీగా ఉన్న కోహ్లి.. పెర్త్ టెస్టులో శతకం మినహా మిగిలిన మూడు టెస్టుల్లో విఫలమయ్యాడు. కంగారూ గడ్డపై గొప్ప చరిత్ర ఉన్న ఈ రన్‌మెషీన్ ఈసారి మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.ఇప్పటి వరకు ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కోహ్లి వరుసగా 5, 100(నాటౌట్), 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడటంతో.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు భారంగా మారాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కోహ్లి.భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి ఐదేళ్లు గడిచాయి. ఇలాంటి గొప్ప ఆటగాడి సగటు మరీ 28కి పడిపోతే ఎలా?.. భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు తగునా?ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందేతమ అత్యుత్తమ ఆటగాడి బ్యాటింగ్ సగటు 28కి దగ్గరగా ఉండటం సబబేనా?.. కచ్చితంగా కానేకాదు. జట్టుకు ఇంతకంటే గొప్పగా ఆడే బ్యాటర్ అవసరం ఉంది. అక్టోబరు 2024 నుంచి అతడి బ్యాటింగ్ సగటు మరీ 21గా ఉంది. టీమిండియాకు ఇలాంటి వాళ్లు అవసరం లేదు.యువ ఆటగాడు కూడా సగటున 21 పరుగులు చేయగలడు. విరాట్ నుంచి మనం కోరుకునేది ఇది కాదు కదా!.. ఓ ఆటగాడి కెరీర్లో సగటు 50 కంటే తక్కువగా ఉందంటే.. ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందే’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.పదే పదే అదే తప్పు.. తెలివైన వారు అలా చేయరు!కాగా 2020 నుంచి 2024 వరకు కోహ్లి 38 టెస్టుల్లో కలిపి సగటున 31.32తో 2005 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడు టెస్టుల్లో కోహ్లి మరీ దారుణంగా 260 పరుగులకే పరిమితమయ్యాడు. సగటు 21.67. ఇక ఆసీస్‌తో టెస్టుల్లో ఒకే తరహాలో కోహ్లి అవుట్ కావడం పట్ల కూడా ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేశాడు.ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో ఓసారి విఫలమైనా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశాడని పఠాన్ విమర్శించాడు. తెలివైన ఆటగాళ్లు ఇలా ఒకే రకమైన తప్పులు చేయరంటూ పరోక్షంగా కోహ్లికి చురకలు అంటించాడు. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో ఐదో టెస్టు(జనవరి 3-7) జరుగనుంది. రోహిత్ పరిస్థితి మరీ దారుణంఈ మ్యాచ్‌లో రాణిస్తేనే కోహ్లి టెస్టు భవితవ్యం బాగుంటుంది. లేదంటే.. రిటైర్మెంట్ ప్రకటించి.. యువ ఆటగాళ్లకు న్యాయం చేయాలనే డిమాండ్లు మరింత ఎక్కువవుతాయి. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే.. రోహిత్ శర్మ మరీ దారుణంగా ఆడుతూ.. పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నాడు. వెంటనే అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పాలంటూ సూచనలు, సలహాలు ఎక్కువయ్యాయి.చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను -
ఆ మాత్రం తెలియదా?.. అతడికి నేనేం చెప్పగలను: రోహిత్ శర్మ
భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంది. ఆసీస్‌తో ఇప్పటి వరకు పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ వేదికలుగా జరిగిన నాలుగు టెస్టుల్లోనూ పంత్ బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఒక్క హాఫ్ సెంచరీ లేదుఈ నాలుగు టెస్టుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ చేసిన స్కోర్లు వరుసగా.. 37, 1, 21, 28, 9, 28, 30. ముఖ్యంగా మెల్బోర్న్లో సోమవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో పంత్ కాసేపు పోరాడి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది. కానీ.. వైఫల్యాల నుంచి తాను గుణపాఠాలు నేర్చుకోనని అతడు మరోసారి నిరూపించాడు.పరిస్థితులకు తగినట్లుగా ఆడకుండా తనకు నచ్చిన షాట్లనే ఆడతానని పంత్ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191/5తో కష్టాల్లో ఉన్న సమయంలో స్కూప్ షాట్ ఆడబోయి డీప్ థర్డ్‌మాన్ వద్ద పంత్ క్యాచ్ ఇచ్చాడు.స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్.. రిషభ్ పంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్’ అంటూ అతడికి టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లే అర్హతే లేదంటూ ఘాటుగా విమర్శించాడు.నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యంగతంలో ఇవే షాట్లు తనకు పరుగులు అందించినా... ఇది సమయం కాదని సన్నీ విమర్శించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్ అదే పని చేయడం గమనార్హం. జైస్వాల్‌తో 88 పరుగుల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఓటమి నుంచి తప్పించుకునే స్థితిలో ఉన్న దశలో.. పంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ పుల్ షాట్ ఆడి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతే భారత్ ఓటమికి బాటలు పడి.. 184 పరుగుల భారీ తేడాతో పరాజయం ఎదురైంది.అతడికి నేనేం చెప్పగలనుఈ నేపథ్యంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మెల్బోర్న్ టెస్టులో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు.. పంత్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘తనకేం ఏం కావాలో పంత్ అర్థం చేసుకోగలగాలి.అతడికి మేము చెప్పడం కంటే.. తనకు తానుగా తన తప్పేమిటో తెలుసుకుంటే బాగుంటుంది. అలా అయితే, సరైన దారిలో నడిచేందుకు వీలు ఉంటుంది. గతంలో ఇలాంటి షాట్లతో అతడు ఎన్నోసార్లు విజయాలు అందించాడు.కాబట్టి కెప్టెన్‌గా తన పట్ల నా స్పందన మిశ్రమంగానే ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రయోగాలు విఫలమవుతాయి. అలాంటి సమయంలో ఇలాంటి విమర్శలు వస్తాయి. అయితే, కెప్టెన్‌గా ఈ విషయంలో నేను అతడికి చెప్పాల్సింది ఏమీలేదు.ఆ మాత్రం తెలిసి ఉండాలి కదా!ఎలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకువచ్చో ఆటగాడికి తెలిసి ఉండాలి. మన చర్యల వల్ల ప్రత్యర్థికి అవకాశం దొరుకుతుందని భావిస్తే ఆచితూచి ఆడటమే ఉత్తమం. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుని ముందుకు సాగాలి. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో పంత్‌కు తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3-7 మధ్య సిడ్నీలో జరుగనుంది.చదవండి: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. సరికొత్త చరిత్ర.. కానీ -
టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Test Retirement) ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలంకాగా సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా.. రోహిత్ కెప్టెన్సీలో అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది.కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తాజాగా ముగిసిన మెల్బోర్న్ టెస్టులో రోహిత్(3, 9) తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాడు. పట్టుమని పది పరుగులు చేయకుండానే అవుటయ్యాడు.త్వరగా రిటైర్ పోవాలంటూఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. త్వరగా రిటైర్ పోవాలంటూ హిట్‌మ్యాన్‌కు సూచనలు వస్తున్నాయి. అయితే, ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం.టెస్టులకు గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి సెలక్టర్లు, బీసీసీఐ నాయకత్వంతో చర్చించిన రోహిత్ శర్మ.. సిడ్నీ టెస్టులో ఓడితే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడట. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిచి.. టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే అవకాశాలు ఉంటే మాత్రం.. ఆ మెగా మ్యాచ్ వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఏదేమైనా సిడ్నీ టెస్టుతో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యంపై ఒక అంచనాకు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. గణాంకాలు ఇవీకాగా టెస్టుల్లో గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు ఇవే 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అయితే, ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది. కానీ.. 37 ఏళ్ల రోహిత్ వికెట్ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్పై చర్చలు ఎక్కువయ్యాయి.టీమిండియాకు చేదు అనుభవాలుఇక ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు జరుగనుంది. జనవరి 3-7 వరకు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. పెర్త్‌లో భారత్ 275 పరుగులతో గెలవగా.. అడిలైడ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా కాగా.. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ 184 పరుగుల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసింది. తద్వారా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: 2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..! -
జైస్వాల్ నాటౌట్.. ఆస్ట్రేలియా మోసం
-
IND VS AUS: రికార్డులు తిరగరాసిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రికార్డులను తిరగరాసింది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 3 లక్షల 73 వేల 691 మంది ప్రేక్షకులు (ఐదు రోజుల్లో) హాజరయ్యారు. బాక్సింగ్ డే టెస్ట్‌ల చరిత్రలో ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ హాజరుకాలేదు. ఈ మ్యాచ్ 88 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1936-37 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌కు 3,50,534 మంది (అప్పట్లో టెస్ట్ మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగేది) హాజరయ్యారు.ప్రేక్షకుల హాజరు పరంగా తాజాగా జరిగిన బాక్సింగ్ డే రెండో అత్యధికం. 1989-99లో భారత్-పాకిస్థాన్ మధ్య టెస్ట్ మ్యాచ్‌కు 4,65,000 మంది హాజరయ్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే.రోజు వారీగా బాక్సింగ్ డే 2024-25 టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు..తొలి రోజు 87,242రెండో రోజు 85,147మూడో రోజు 83,073నాలుగో రోజు 43,867ఐదో రోజు 74,363మొత్తం 3,73,691ఆస్ట్రేలియాలో ఓ టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య (3,73,691) కూడా ఇదే.మ్యాచ్ విషయానికొస్తే.. చివరి రోజు వరకు రసవత్తరంగా సాగిన తాజా బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.తాజా బాక్సింగ్ డే టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు గతానికి భిన్నంగా ఉన్నారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే ఏ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లకు ఆసీస్ క్రికెటర్లతో సమానమైన మద్దతు లభిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఆసీస్ ప్రేక్షకులు గతానికి భిన్నంగా టీమిండియాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని టార్గెట్‌గా చేసుకుని ఓవరాక్షన్ చేశారు. కోహ్లి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. కోహ్లి ఔటై పెవిలియన్‌కు చేరే సమయంలో కొందరు ఆసీస్ ప్రేక్షకులు దురుసుగా ప్రవర్తించారు. -
‘థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే.. జైస్వాల్ నాటౌట్’
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు((Yashasvi Jaiswal’s controversial dismissal) )పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. జైసూ నాటౌట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. అవుట్‌గా ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.సరైన కారణాలు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేయడం ఏమిటని రాజీవ్ శుక్లా(Rajiv Shukla) మండిపడ్డారు. అదే విధంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులుఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టు ఆఖరిరోజైన సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఘోర ఓటమిభారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒంటరి పోరాటం చేసిన యశస్వి జైస్వాల్ అవుటైన విధానం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో భాగంగా కమిన్స్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు జైస్వాల్. అయితే, బంతి అతడి గ్లౌవ్‌ను తాకినట్లుగా కనిపించి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ వికెట్ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా స్నీకో మీటర్లో స్పైక్ రాకపోయినా.. థర్డ్ అంపైర్ జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోగా.. మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరికి 184 పరుగుల తేడాతో కంగారూ జట్టు రోహిత్ సేనపై విజయదుందుభి మోగించి.. 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేఅయితే, జైస్వాల్ అవుటా? నాటౌటా? అన్న అంశంపై క్రీడా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల జైస్వాల్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మీరు సాంకేతికతను ఉపయోగించాలనుకుంటే.. మొత్తంగా దానినే పరిగణనలోకి తీసుకోండి.అంతేకానీ మిథ్యనే నిజమని భావించవద్దు. అక్కడ స్నీకో మీటర్ ఉంది. అందులో లైన్ స్ట్రెయిట్గానే ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా నాటౌట్’’ అని తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ షోలో పంచుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నాడు.సిరీస్‌లో వెనుకబడిన టీమిండియాకాగా ఆసీస్‌తో పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు డ్రా చేసుకున్న రోహిత్ సేన.. మెల్బోర్న్ టెస్టులో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. కమిన్స్ బృందం విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 155 పరుగులకే కుప్పకూలింది. ఇరుజట్ల మధ్య జనవరి 3న సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి దురదృష్టకరరీతిలో రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగుల వద్ద థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
ప్యాట్ కమిన్స్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అద్బుతమైన విజయం సాధించింది. ఆఖరి రోజు వరకు జరిగిన ఈ బాక్సింగ్ డే పోరులో 184 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో ఆసీస్ నిలిచింది.ఈ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 90 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన పాట్ కమిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన కమ్మిన్స్..టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎక్కవ సార్లు ఔట్ చేసిన సారథిగా కమిన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మను ఇప్పటివరకు కమ్మిన్స్ ఆరు సార్లు ఔట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిచీ బెనాడ్ పేరిట ఉండేది. రిచీ బెనాడ్ ఇంగ్లండ్ లెజెండరీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ను 5 సార్లు ఔట్ చేశాడు. తాజా మ్యాచ్‌తో రిచీ బెనాడ్ ఆల్‌టైమ్ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి!
ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చుక్కెదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్(India) ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 వెనకంజలోకి వెళ్లింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది.ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే..డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కి పడిపోయింది.మరోవైపు ఆసీస్ మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్‌కు చేరడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ప్రస్తుత సైకిల్లో భారత్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే భారత్‌కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశముంటుంది. లేదా రెండు మ్యాచ్‌ల 0-0 డ్రాగా ముగిసిన భారత్‌కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్ -
అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
మెల్బోర్న్ టెస్టు అద్భుతంగా సాగిందని.. ఆఖరికి తామే పైచేయి సాధించడం పట్ల సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ తాను రాణించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ట్రవిస్ హెడ్‌కు బాల్ ఇవ్వడం వెనుక తమ కోచ్ హస్తం ఉందని.. ఈ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇస్తానని కమిన్స్ తెలిపాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియా(India vs Australia)తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్ మ్యాచ్‌లో ఓడిన కంగారూ జట్టు.. అడిలైడ్ టెస్టుతో విజయాన్ని రుచిచూసింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టు వర్షం వల్ల డ్రా కాగా.. ఇరుజట్లు మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టు జరిగింది.340 పరుగుల లక్ష్యంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన కంగారూలు.. భారత్‌ను 369 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయిన కమిన్స్ బృందం.. టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని విధించింది.అయితే, సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆసీస్ 184 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 90(49, 41) పరుగులు చేయడంతో పాటు.. కమిన్స్ ఆరు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.మాదే పైచేయిఈ క్రమంలో విజయానంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టెస్టు మ్యాచ్ ఆడాము. ప్రేక్షకులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారి నుంచి అద్భుత స్పందన లభించింది. విజయంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.లబుషేన్(72, 70), స్మిత్(140, 13 ) రాణించడం వల్ల పటిష్ట స్థితిలో నిలిచాం. నిజానికి ఈరోజు తొలి సెషన్లో మాదే పైచేయి. కానీ అనూహ్య రీతిలో వాళ్లు పుంజుకుని.. రెండో సెషన్లో రాణించారు. అయితే, మేము మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నాము.ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక హెడ్‌తో బౌలింగ్ చేయించాలన్నది మా కోచ్ ఆలోచనే. ఆ విషయంలో క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఇదే తరహా ఫలితం పునరావృతం చేస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైన ట్రవిస్ హెడ్(0, 1) రిషభ్ పంత్(Rishabh Pant-30) రూపంలో కీలక వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో సహాయం చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
మెల్బోర్న్ టెస్టులో భారత్ ఓటమి
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి వరకు డ్రా కోసం భారత్ ప్రయత్నించినప్పటకి, ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.జైశ్వాల్ పోరాటం వృథా.. లక్ష్య చేధనలో ఆరంభంలోనే భారత్‌కు ఆసీస్ బౌలర్లు బిగ్ షాకిచ్చారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా పడింది. ఈ సమయంలో యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలబడ్డారు. తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. రెండో సెషన్లో మాత్రం జైశ్వాల్, పంత్ విరోచిత పోరాటం వల్ల ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. కానీ మూడో సెషన్లో మాత్రం ఆసీస్ బౌలర్లు తిరిగి పంజా విసిరారు. అప్పటివరకు కుదురుగా ఆడిన పంత్.. ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. జడేజా, నితీశ్ రెడ్డి వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి జైశ్వాల్ తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు ప్రయత్నించాడు. కానీ వివాదస్పద రీతిలో జైశ్వాల్ ఔట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో భారత్ ఓటమి లాంఛనమైంది. భారత బ్యాటర్లలో జైశ్వాల్ (208 బంతుల్లో 84) జైశ్వాల్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్ పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 340 పరుగుల టార్గెట్‌ను కంగారులు ఉంచారు. ఆ లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికలపడింది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా వేదికగా ప్రారంభం కానుంది. -
IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్ అయిపో రోహిత్'..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలమ ఫామ్ కొనసాగుతోంది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు భారత కెప్టెన్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.ఇంగ్లండ్‌పై అదరగొట్టి..స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 455 పరుగులు చేసి ఈ ఏడాదిని అద్బుతంగా ఆరంభించిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. రోహిత్ తన ఆఖరి 15 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు.బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీ(52) మినహా.. గత 14 ఇన్నింగ్స్‌లలో అతడు చేసింది 112 పరుగులు మాత్రమే. ఈ క్రమంలో రోహిత్ శర్మను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక ఆడింది చాలు రిటైర్మెంట్ ఇచ్చే రోహిత్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో మరోసారి హ్యాపీ రిటైర్మెంట్ రోహిత్ అనే హ్యాష్ ట్యాగ్ డ్రెండ్ అవుతోంది.చదవండి: ఈజీ క్యాచ్‌లు విడిచిపెట్టిన జైశ్వాల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్ Rohit Sharma should retire not because he didn't perform but he didn't put his team's interest before him. There shouldn't be any place for selfish player in team India. #AUSvINDIA— Cricket Devotee 🇮🇳 (@DevoteesCricket) December 30, 2024 -
Ind vs Aus MCG: మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఓటమి
IND vs AUS 4th Test Day 5 Live Updates: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ గెలుపుతో ఆసీస్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ ఆశలను సజీవం చేసుకోగా.. టీమిండియా రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే! కాగా మెల్బోర్న్లో 340 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ (84)ఒంటరి పోరాటం చేయగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు. రోహిత్ శర్మ(9), కేఎల్ రాహుల్(0), విరాట్ కోహ్లి(5) దారుణంగా విఫలం కాగా.. రిషభ్ పంత్ 30 పరుగులు చేశాడు.మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జడేజా 2, నితీశ్ రెడ్డి 1, ఆకాశ్ దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 పరుగులు చేశారు. 45 బంతులు ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్ 5 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. నాథన్ లియాన్ రెండు, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 155 పరుగులకు టీమిండియా ఆలౌట్నాథన్ లియాన్ బౌలింగ్‌లో సిరాజ్(0) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 155 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ కాగా.. ఆసీస్ 184 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్స్మిత్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన బుమ్రా(0).ఎనిమిదో వికెట్ డౌన్..ఆకాష్ దీప్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆకాష్.. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మ్యాచ్ డ్రాగా ముగియాలంటే భారత్ ఇంకా 14 ఓవర్లు ఆడాల్సి ఉంది. ఆసీస్ విజయానికి ఇంకా 2 వికెట్లు కావాలి.జైశ్వాల్ ఔట్..యశస్వి జైశ్వాల్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 84 పరుగులు చేసిన జైశ్వాల్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ ఔటైన విధానం వివాదస్పదమైంది. స్నికో మీటర్లో బంతికి బ్యాట్ తాకనట్లు తేలినప్పటికి థర్డ్ అంపైర్‌గా మాత్రం ఔట్‌గా ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియాలంటే భారత్ ఇంకా 20 ఓవర్లు ఆడాల్సి ఉంది.టీమిండియాకు షాక్.. ఆరో వికెట్ డౌన్‌నితీశ్ రెడ్డి(1) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ వెనుదిరిగాడు. జట్టు స్కోరు: 130/6 (63.2) టీమిండియాకు భారీ షాక్!లక్ష్య ఛేదనలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. 127 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో జడేజా ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. నితీశ్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 74 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ స్కోరు: 127/5 (62.4)నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియాట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ అవుయ్యాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ స్కోరు: 121/4(59). జడేజా క్రీజులోకి రాగా.. జైస్వాల్ 70 పరుగులతో ఉన్నాడు.యశస్వి, పంత్ విరోచిత పోరాటం..రెండో సెషన్లో టీమిండియా అద్బుతంగా ఆడింది. భారత బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ విరోచిత పోరాటం కనబరుస్తున్నారు. వీరిద్దరూ 79 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.టీ బ్రేక్ సమయానికి 54 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(63 నాటౌట్), పంత్(28 నాటౌట్) ఉన్నారు. టీమిండియా విజయానికి 228 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్‌కు 7 వికెట్లు కావాలి.యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ..టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 86/3దూకుడుగా ఆడుతున్న జైశ్వాల్..లంచ్ విరామం తర్వాత మళ్లీ ఆట ప్రారంభమైంది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(27), పంత్(4) ఉన్నారు.కష్టాల్లో భారత్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఖావాజా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 33/3కమ్మిన్స్ ఫైర్..ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు భారత్ భారీ షాకిచ్చాడు. 17 ఓవర్లో తొలి బంతికి రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపిన కమ్మిన్స్.. ఆఖరి బంతికి రాహుల్(0)ను ఔట్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 25/2రోహిత్ శర్మ ఔట్..340 పరుగుల లక్ష్యచేధనలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు.234 పరుగులకు ఆసీస్ ఆలౌట్..మెల్బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. 228/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా అదనంగా 6 పరుగులు చేసి 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 340 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ ఉంచింది. -
పడగొట్టి... పట్టు వదిలేసి!
తొలి ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియాకు 105 పరుగుల ఆధిక్యం... ఆ తర్వాత భారత పదునైన పేస్ బౌలింగ్ ముందు రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్ తడబడింది... 11 పరుగుల వ్యవధిలో భారత్ 4 వికెట్లు తీయడంతో స్కోరు 91/6కు చేరింది... ఇక్కడే టీమిండియా కాస్త పట్టు విడిచింది... దాంతో స్కోరు 173/9 వరకు వెళ్లింది... ఇక్కడా ఆట ముగిస్తే రోహిత్ బృందం పని సులువయ్యేది... కానీ చివరి వికెట్‌కు కంగారూలు మళ్లీ పోరాడారు... దాంతో ఆ్రస్టేలియా స్కోరు 228/9కు... ఆధిక్యం కాస్తా 333కు చేరిపోయింది... మ్యాచ్ చివరి రోజు ఆసీస్ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసినా దాదాపు అసాధ్యమైన లక్ష్యం ఇది... నాలుగేళ్ల క్రితం బ్రిస్బేన్‌లో చెలరేగిన తరహాలో భారత్ దూకుడుగా ఆడి విజయం వైపు వెళుతుందా... లేక తలవంచుతుందా... లేక పోరాడి టెస్టును ‘డ్రా’గా ముగిస్తుందా అనేది చివరి రోజు ఆటలో ఆసక్తికరం. ఆదివారం ఆటలో బుమ్రా, సిరాజ్‌లు భారత్‌కు విజయావకాశాలు సృష్టించగా... లబుషేన్, కమిన్స్, లయన్ ఆసీస్‌కు ఆపద్భాంధవులుగా నిలిచారు.మెల్బోర్న్: అనూహ్య మలుపులతో సాగుతున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నాలుగో టెస్టు మ్యాచ్ చివరి ఘట్టానికి చేరింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. లబుషేన్ (139 బంతుల్లో 70; 3 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (90 బంతుల్లో 41; 4 ఫోర్లు), నాథన్ లయన్ (54 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం క్రీజ్‌లో లయన్‌తో పాటు స్కాట్ బోలండ్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. వీరిద్దరు ఇప్పటికే చివరి వికెట్‌కు ఏకంగా 18.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 55 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/9తో తమ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 21 బంతులు ఆడి 11 పరుగులు చేసి 369 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (189 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 333 పరుగులు ముందంజలో ఉంది. కీలక భాగస్వామ్యాలు... ఆసీస్ ఓపెనర్లు కొన్‌స్టాస్ (18 బంతుల్లో 8; 1 ఫోర్), ఖ్వాజా (65 బంతుల్లో 21; 2 ఫోర్లు) చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో తనపై దూకుడు ప్రదర్శించిన కొన్‌స్టాస్‌ను ఈసారి అద్భుత బంతితో పడగొట్టి బుమ్రా సంబరాలు చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ బౌలింగ్‌తో 122 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సిరాజ్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శనతో ఆసీస్ పని పట్టాడు. ఖ్వాజాను పదునైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేసి జోరు ప్రదర్శించిన సిరాజ్... లంచ్ విరామం తర్వాత స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 13; 1 ఫోర్)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఆదివారం తన 31వ పుట్టిన రోజు జరుపుకున్న ట్రావిస్ హెడ్‌కు కలిసి రాలేదు. బుమ్రా పన్నిన ఉచ్చులో పడిన హెడ్ (2 బంతుల్లో 1) స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్లో మిచెల్ మార్ష్(4 బంతుల్లో 0)ను కూడా అవుట్ చేసిన బుమ్రా, తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతికి అలెక్స్ కేరీ (7 బంతుల్లో 2) పని పట్టాడు. దాంతో ఆ్రస్టేలియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది.ఇలాంటి స్థితిలో లబుషేన్, కమిన్స్ కలిసి జట్టును ఆదుకున్నారు. 19.1 ఓవర్ల పాటు వీరిద్దరు భారత బౌలర్లను నిలువరించగలిగారు. లబుషేన్ తనదైన శైలిలో పట్టుదల కనబరుస్తూ 105 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, తొలి ఇన్నింగ్స్‌లాగే కమిన్స్ మళ్లీ బ్యాటింగ్‌లో ప్రభావం చూపించాడు. ఎట్టకేలకు మూడో సెషన్లో లబుషేన్‌ను అవుట్ చేసి సిరాజ్ 57 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. స్టార్క్ (13 బంతుల్లో 5) రనౌట్ కాగా, కమిన్స్ వికెట్ జడేజా ఖాతాలో చేరింది. ఈ దశలో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ లయన్, బోలండ్ టీమిండియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అప్పటికే బాగా అలసిపోయిన భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో చివరి వికెట్ దక్కకుండానే రోజు ముగిసింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: కొన్‌స్టాస్ (బి) బుమ్రా 8; ఖ్వాజా (బి) సిరాజ్ 21; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 70; స్మిత్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; హెడ్ (సి) నితీశ్ (బి) బుమ్రా 1; మార్ష్(సి) పంత్ (బి) బుమ్రా 0; కేరీ (బి) బుమ్రా 2; కమిన్స్ (సి) రోహిత్ (బి) జడేజా 41; స్టార్క్ (రనౌట్) 5; లయన్ (బ్యాటింగ్) 41; బోలండ్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (82 ఓవర్లలో 9 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–20, 2–43, 3–80, 4–85, 5–85, 6–91, 7–148, 8–156, 9–173. బౌలింగ్: బుమ్రా 24–7–56–4, ఆకాశ్‌దీప్ 17–4–53–0, సిరాజ్ 22–4–66–3, జడేజా 14–2–33–1, నితీశ్ రెడ్డి 1–0–4–0, సుందర్ 4–0–7–0. బుమ్రా ‘ద గ్రేట్’ 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కెరీర్ ఆరంభంలో టి20, వన్డే స్పెషలిస్ట్ బౌలర్‌గానే చూశారు. ఈ రెండు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగిన రెండేళ్ల తర్వాత గానీ అతను తొలి టెస్టు ఆడలేదు. కానీ ఇప్పుడు టెస్టుల్లో బుమ్రా ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అతని పదునైన బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే ఉండటంలేదు. తన భిన్నమైన బౌలింగ్ శైలి అదనపు ప్రయోజనం కల్పిస్తుండగా... అసాధారణ బౌలింగ్ ప్రదర్శనలు అతని ఖాతాలో చేరాయి. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా... జట్టు ఏదైనా బుమ్రాను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బుమ్రా స్పెల్‌ను దాటితే చాలనుకుంటున్నారు. తాజా సిరీస్‌లో ఇది మరింత బాగా కనిపించింది. ఇప్పటికే అతను కేవలం 13.24 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసి 200 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా ఎందరితో సాధ్యం కాని అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. » 200 వికెట్లు తీసిన 85 మంది బౌలర్లలో 20కంటే తక్కువ సగటుతో ఈ మైలురాయిని చేరిన ఏకైక బౌలర్ బుమ్రానే. అతను కేవలం 19.56 సగటుతో ఈ వికెట్లు తీశాడు. బుమ్రా తన 44వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. » అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా (8484) నాలుగో స్థానంలో ఉన్నాడు. వఖార్ యూనిస్ (7725), స్టెయిన్ (7848), రబడ (8154) అతనికంటే తక్కువ బంతులు వేశారు. » బుమ్రా తీసిన 202 వికెట్లలో 142 వికెట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో రావడం విదేశీ గడ్డపై అతని విలువ ఏమిటో అర్థమవుతుంది. » భారత్ గెలిచిన 20 టెస్టుల్లో బుమ్రా భాగంగా ఉండగా... ఈ టెస్టుల్లో 110 వికెట్లతో అతని బౌలింగ్ సగటు కేవలం 14.4 కావడం అతని ప్రభావాన్ని చూపిస్తోంది. -
మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు!
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. హోరా హోరీగా సాగుతున్న ఈ బాక్సింగ్ డే టెస్టు ఫలితం సోమవారం తేలిపోనుంది. నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్స్‌లో భారత్ పై చేయి సాధించినప్పటికి.. ఆఖరి సెషన్లో మాత్రం కంగారులు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు.ముఖ్యంగా టెయిలాండర్లు నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ పదో వికెట్‌కు 55 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తంగా ఈ వెటరన్ జోడీ 110 బంతులు ఎదుర్కొని తమ జట్టుకు అడ్డుగోడగా నిలిచారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజ్‌లో నాథన్ లైయన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆసీస్ భారత్ ముందు 333 నుంచి 350 పరుగుల మధ్య టార్గెట్‌ను నిర్దేశించే అవకాశముంది. ఈ క్రమంలో భారత్ ఈ టార్గెట్‌ను చేధిస్తే 96 ఏళ్ల ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బద్దలు కానుంది.మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టెస్టుల్లో అత్యధిక రన్ ఛేజింగ్ 322 పరుగులగా ఉంది. 1928లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 322 లక్ష్యాన్ని చేధించింది. ఆ తర్వాత ఈ వేదికగా 300పైగా టార్గెట్‌ను ఏ జట్టు కూడా చేధించలేకపోయింది. ఇప్పుడు భారత్‌కు చరిత్రను తిరగరాసే అవకాశం లభించింది.మెల్బోర్న్లో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవే..322- ఇంగ్లండ్- ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1928297-ఇంగ్లండ్- ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1895295-దక్షిణాఫ్రికా-ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1953286-ఆస్ట్రేలియా-ప్రత్యర్ధి(ఇంగ్లండ్)-1929282-ఇంగ్లండ్-ప్రత్యర్ధి(ఇంగ్లండ్)-1908ఎంసీజీలో భారత్ రికార్డు ఎలా ఉందంటే?కాగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే లక్ష్యాన్ని చేధించిగల్గింది. 2020 డిసెంబర్లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. అంతకమించి లక్ష్యాన్ని భారత్ ఛేజ్ చేయలేకపోయింది. అయితే 2018/19 ఆసీస్ పర్యటనలో భాగంగా ఇదే మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్బుతవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టి కంగారులను దెబ్బ తీశాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత్ అత్యధిక టెస్టు ఛేజింగ్ 329గా ఉంది. 2021లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఈ ఫీట్ సాధించింది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ అల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
IND VS AUS 4th Test: భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన లయోన్, బోలాండ్
మెల్బోర్న్ టెస్ట్ నాలుగో రోజు ఆసీస్ చివరి వరుస ఆటగాళ్లు నాథన్ లయోన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ 110 బంతులు ఎదుర్కొని చివరి వికెట్‌కు అమూల్యమైన 55 పరుగులు జోడించారు. లయోన్, బోలాండ్‌ను ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. మరికొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా బుమ్రా లయోన్ను ఔట్ చేసినప్పటికీ అది నో బాల్ అయ్యింది. లయోన్-బోలాండ్ భాగస్వామ్యం పుణ్యమా అని ఆసీస్ ఆధిక్యం 333 పరుగులకు చేరింది.ఐదో రోజు ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు అంత ఈజీ కాదు. మెల్బోర్న్ మైదానంలో ఇప్పటివరకు ఛేదించిన అతి భారీ లక్ష్యం 332. ఈ సంఖ్యను ఆసీస్ నాలుగో రోజే దాటేసింది. ఐదో రోజు లయోన్, బోలాండ్ తమ అద్బుత బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తే లక్ష్యం మరింత పెద్దది అవుతుంది. లయోన్, బోలాండ్ చివరి వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆఖరి రోజు ఏమైనా జరిగేందుకు ఆస్కారముంది. ఆస్ట్రేలియా, భారత్‌లలో ఏ జట్టైనా మ్యాచ్ గెలవచ్చు. మ్యాచ్ డ్రా లేదా టై కూడా కావచ్చు.తొలుత దెబ్బేసిన లబూషేన్, కమిన్స్ఈ మ్యాచ్‌లో భారత్‌ను తొలుత లబూషేన్ (70), కమిన్స్ (41) దెబ్బేశారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. బుమ్రా, సిరాజ్ రెచ్చిపోవడంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. లబూషేన్, కమిన్స్ పుణ్యమా అని అనూహ్యంగా పుంజుకుంది. వీరిద్దరి భాగస్వామ్యంతోనే ఆసీస్ గెలుపు రేసులోకి వచ్చింది. అంతవరకు ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు.91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. లబూషేన్-కమిన్స్, లయోన్-బోలాండ్ జోడీలు అతి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి రోజు 96 ఓవర్ల పాటు ఆట జరిగే అవకాశం ఉంది. -
IND VS AUS 4th Test: టీమిండియా 300కు పైగా లక్ష్యాన్ని ఛేదిస్తుందా..?
మెల్బోర్న్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీమిండియా ముందు 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఉంచనుంది. ప్రస్తుతం ఆ జట్టు 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. నాథన్ లయోన్ (16), స్కాట్ బోలాండ్ (8) టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇవాళ మరో 16 ఓవర్ల ఆట మిగిలి ఉంది.ఛేజింగ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ మైదానంలో గడిచిన 70 ఏళ్లలో ఛేజింగ్ చేసిన అత్యధిక స్కోర్ 258. ఆసీస్ ఇప్పటికే 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ 300 ప్లస్ టార్గెట్‌ను ఛేదిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ విజయవంతంగా ఛేదించిన లక్ష్యాలను చూస్తే.. టీమిండియా కేవలం మూడు పర్యాయాలు మాత్రమే టెస్ట్ క్రికెట్లో 300 ప్లస్ స్కోర్‌ను ఛేదించింది. 1976లో వెస్టిండీస్‌పై 406 పరుగులు.. 2008లో ఇంగ్లండ్‌పై 387.. 2021లో ఆస్ట్రేలియాపై 329 పరుగుల లక్ష్యాలను విజయవంతగా భారత్ ఛేదించింది.గణాంకాలు, గత చరిత్ర ఆధారంగా చూస్తే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అంత ఈజీ కాదు. ఏదైన అద్భుతం జరిగి భారత టాపార్డర్ ఇరగదీస్తే ఈ మ్యాచ్ టీమిండియా సొంతం అవుతుంది. పిచ్ కూడా చివరి రోజు బ్యాటర్లకు అంతగా అనుకూలించకపోవచ్చు. ఒకవేళ అనుకూలించినా 300 ప్లస్ టార్గెట్‌ను ఛేజ్ చేసేంత సీన్ ఉండకపోవచ్చు.స్కోర్ల విషయానికొస్తే.. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
BGT 2024-25: ఆస్ట్రేలియాకు షాక్
టీమిండియాతో ఐదో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సిడ్నీ టెస్ట్‌కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లిస్ గాయపడ్డాడు. ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయలేదు. ప్రస్తుత ఆసీస్ జట్టులో ఇంగ్లిస్ ఒక్కడే స్పేర్ బ్యాటర్‌గా ఉన్నాడు. ఆసీస్ బోర్డు బిగ్‌బాష్ లీగ్ కోసం బ్యూ వెబ్‌స్టర్‌ను ఇదివరకే రిలీజ్ చేసింది. ఇంగ్లిస్ వైదొలగడంతో ఐదో టెస్ట్ కోసం నాథన్ మెక్‌స్వీనికి పిలుపు అందవచ్చు. మిచెల్ మార్ష్ పేలవ ఫామ్‌తో సతమతమవుతండటంతో ఐదో టెస్ట్‌లో మెక్‌స్వీనికి అవకాశం రావచ్చు. మెక్‌స్వీనికి ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఇంగ్లిస్ ప్రస్తుతం భారత్‌తో ఆడుతున్న ఆసీస్ జట్టులో సభ్యుడు కాదు. నాలుగో టెస్ట్ రేపటితో ముగియనుండగా.. ఈ సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3న మొదలుకానుంది.భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ విషయానికొస్తే.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లయోన్ (13), బోలాండ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.