మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట... నితీష్ తన విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు.
స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొంటూ.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి సత్తా చూపించాడు. నితీశ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 105 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. దీంతో అద్బుత సెంచరీతో మెరిసిన నితీశ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నజరానా ప్రకటించింది. నితీశ్‌కు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందించనున్నట్లు ఏసీఏ అధ్యక్షడు కేశినేని శివనాథ్ తెలిపారు. నేటి యువతకు నితీశ్ రోల్ మోడల్ అని ఆయన కొనియాడారు. ఏసీఏ అధ్యక్షడుతో పాటు కార్యదర్శి సానా సతీష్ బాబు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సైతం నితీశ్‌ను అభినందించారు.
చదవండి: VHT 2024: సచిన్ తనయుడికి భారీ షాక్.. జట్టు నుంచి తీసేశారు!!
Comments
Please login to add a commentAdd a comment