Nitesh kumar
-
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు ఇప్పటికే పెర్త్‌కు చేరుకుని తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆసీస్ జట్టు కూడా తొలి టెస్టు వేదికకు చేరుకుంది.కాగా ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు తుది జట్టులో నితీష్‌కు అవకాశమివ్వాలని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ విషయం ఇప్పటికే నితీష్‌కు జట్టు మేనెజ్మెంట్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ తీవ్రంగా చేస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కూడా దూరం కానున్నారు. ఈ క్రమంలోనే నితీష్ అరంగేట్రానికి మార్గం సుగమమైనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. కాగా ఈ ఏడాది నితీష్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.ఐపీఎల్లో అదరగొట్టి..ఐపీఎల్-2024లో నితీష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్బుత ప్రదర్శన కనబరిచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రెడ్డి 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. దీంతో అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.అక్కడ కూడా నితీష్ తనను తను నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 74 పరుగులతో ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. అదేవిధంగా బీజీటీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధాకరిక టెస్టులో కూడా నితీష్ భారత-ఎ జట్టు తరపున 47 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి తన మార్క్‌ను చూపించాడు. ఇప్పటివరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి.. 779 పరుగులతో పాటు 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: Pat Cummins: కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్ -
నితీష్ రెడ్డి ఒక అద్భుతం.. నేను అనుకున్నదే జరిగింది: భారత కెప్టెన్
టీ20ల్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో యంగ్ ఇండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా వికెట్ పడగొట్టారు.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మరో టీ20 సిరీస్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా టాపార్డర్ బ్యాటర్ల విఫలమైనందుకు మేము నిరాశ చెందలేదు. నిజంగా చెప్పాలంటే నేను కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మిడిలార్డర్ బ్యాటర్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని నేను భావించాను. క్లిష్ట సమయంలో ఎలా ఆడుతారో పరీక్షించాలనకున్నాము. ముఖ్యంగా ఐదు, ఆరు, ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే వారు ఆటగాళ్లు జట్టుకు చాలా ముఖ్యం. ఒకవేళ టాపర్డర్ విఫలమైనా వారు జట్టును ఆదుకునే విధంగా ఉండాలి. అయితే ఈ మ్యాచ్‌లో నేను కోరుకున్న విధంగానే మా మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.రింకూ, నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లను కూడా టెస్టు చేయాలనుకున్నాను. ప్రస్తుత తరం క్రికెట్లో జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్! అతడి అరంగేట్రం
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సూర్య సేనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.నితీష్ కుమార్‌కు నో ఛాన్స్..ఇక రెండో టీ20లో అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్‌కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇదొక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
IND Vs BAN: బంగ్లాతో తొలి టీ20.. మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఢిల్లీ యువ పేసర్ మయాంక్ యాదవ్ భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేతుల మీదగా వీరిద్దరూ భారత క్యాప్‌లను అందుకున్నారు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేయడంతో ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. కాగా గ్వాలియర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.తుది జట్లుబంగ్లాదేశ్: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాంభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎప్ఎల్-3 ఈవెంట్లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో నితేశ్.. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బేతెల్పై 21-14, 18-21, 23-21 తేడాతో విజయం సాధించాడు. NITESH KUMAR - THE GOLD MEDAL MOMENT. 👌- One for the History of India in Paralympics. pic.twitter.com/kmhLrZAAV2— Johns. (@CricCrazyJohns) September 2, 2024ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో పతకం. ఈ రోజే పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
హార్దిక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.. అది చూసి నేను షాకయ్యా: నితీష్
ఆంధ్రా స్టార్ ఆల్‌రౌండర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2024 తర్వాత స్పోర్ట్స్ హెర్నియా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న నితీష్ కుమార్.. సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో నితీష్‌కు భారత జట్టు నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వే సిరీస్‌కు నితీష్ కుమార్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు నితీష్ దూరమయ్యాడు. అయితే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇష్టమైన ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడని, తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడని నితీష్ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాకాల్లో బీజీగా ఉన్నప్పటకి హార్దిక్ భాయ్ నాకు ఓ మెసేజ్ చేశాడు. ఫీల్డ్‌లో నా ఎఫక్ట్, ఎనర్జీ, ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు పాండ్యా ఆ మెసేజ్‌లో రాసుకొచ్చాడు. త్వరలోనే మనం కలిసి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.నిజంగా అతడి మెసెజ్‌ను చూసి షాక్ అయ్యాను. ఎందకంటే ఓ మెగా టోర్నీకి సన్నద్దమవుతున్న సమయంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్. వెంటనే పాండ్యా భయ్యాకు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లే ఇచ్చాను.అదే విధంగా ఓ ఆల్‌రౌండర్‌గా బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యాలను నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో 11 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్.. 303 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డును సైతం ఈ ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ గెలుచుకున్నాడు. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్‌కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్‌కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్‌పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే కూడా తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్‌పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్‌పాండే రాణిస్తున్నాడు. -
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్
టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో భాగమైన భారత ఆటగాళ్లంతా దాదాపుగా దూరమయ్యారు. సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్ మినహా మిగితా ఆటగాళ్లందరికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ పర్యటనలో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండేకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే. -
నితీష్ ఊచకోత.. 8 సిక్స్‌లతో వీర విహారం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌కు అయితే నితీష్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే నితీష్ కుమార్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(28) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.pic.twitter.com/mTZPleUfH5— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 2, 2024 -
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగారు. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
శెభాష్ నితీష్ కుమార్.. తెలుగోడి సత్తా చూపించావు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్ మిడిల్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి మన తెలుగు బిడ్డ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 ఓవర్ వేసిన పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను నితీష్ ఊచకోత కోశాడు. ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ నితీష్ కుమార్.. తెలుగోడి సత్తా చూపించావు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక నితీష్ విధ్వంసకర ఫలితంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. A special counter attacking innings from Nitish Kumar Reddy 🙌 He is leading #SRH's fightback with some glorious shots 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/6SFysFcqKz — IndianPremierLeague (@IPL) April 9, 2024 -
సెంచరీలతో చెలరేగిన రాహుల్, నితేష్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా మిజోరం జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ క్రికెట్ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 120/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 458 పరుగులు సాధించింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (108; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితేశ్ రెడ్డి (115; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు సాధించారు. ప్రజ్ఞయ్ రెడ్డి (91; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకం చేజార్చుకోగా... రోహిత్ రాయుడు (60; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. -
ఆర్ఎస్ఎల్పీకి భారీ షాక్
పట్నా: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్ విజయకుమార్ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హరూన్ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. -
రంగులుమారే రాజకీయాలా? పారదర్శక పాలనా?
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు, కాంగ్రెస్ సహా మిగిలిన పక్షాలన్నీ ఒకవైపుగా పోరు నడుస్తోంది. కానీ బిహార్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రాష్ట్రంలో ఫలితాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరచూ మిత్రుల్ని మార్చే రాజకీయాలకు ఒక రిఫరెండంగా భావిస్తున్నారు. సుపరిపాలనకు పెట్టింది పేరైన నితీశ్ గత ఆరేళ్లలో ప్రతీ ఎన్నికలకి కూటములు మారడం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ? ఒకప్పుడు బిహార్‌లో మోదీని అడుగు పెట్టనివ్వనన్న నితీశ్ ఇప్పుడు బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పేందుకు చేస్తున్న కృషి ఫలితాన్నిస్తుందా ? సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. తొలి నుంచీ రాజకీయాలూ, కులం కలగలిసి ఉన్న రాష్ట్రం బిహార్. ఇటు రాజకీయాల్లోనూ, అటు సామాజిక కోణంలోనూ మిగిలిన రాష్ట్రాలకు పూర్తి భిన్నత్వం గల బిహార్ ఎన్నికల్లో ఈ సారి రాజకీయానుభవం, ప్రజల మద్దతు కలిగిన ఆర్జేడీ నేత లాలూ లేకపోవడం కూడా ప్రత్యేకమే. ఓ పక్క అపర రాజకీయ దురంధరుడూ, చమత్కారీ లేని లోటుతో పాటు, రాష్ట్ర సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌పై బీజేపీ పూర్తిగా నమ్మకం ఉంచడం మరో ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) చేతులు కలిపి చెరో 17 సీట్ల నుంచి పోటీ పడుతున్నారు. శత్రువులు మిత్రులైన వేళ భారతీయ జనతా పార్టీ 2013లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీశ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయారు. ఏనాటిౖకైనా ప్రధాన మంత్రి కావాలని కలలు కన్న ఆయన బీజేపీతో 17ఏళ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీపై విమర్శల దాడిచేశారు. ఆయనను బిహార్ గడ్డపై అడుగుపెట్టనివ్వనని ప్రతినబూనారు. మాటల గారడీ చేస్తారంటూ విమర్శించారు. మోదీ కూడా మోసం చేయడం నితీశ్ డీఎన్ఏలోనే ఉందని ఎదురుదాడి చేశారు. గత ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకున్నారు. కానీ మోదీ హవా ముందు నితీశ్ నిలబడలేకపోయారు. నితీశ్ పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకప్పుడు శత్రువుగా చూసిన లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపి నెగ్గారు. సీఎం పదవిని కూడా అందుకున్నారు. మళ్లీ నాలుగేళ్లు తిరిగిందో లేదో లాలూకి హ్యాండిచ్చి తిరిగి బద్ధశత్రువులా చూసిన మోదీతో చేతులు కలిపారు. మోదీ అధికారంలోకి వస్తేనే దేశం భద్రంగా ఉంటుందని, బిహార్ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నితీష్ మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా ? నితీశ్ ఎంత పరిపాలనాదక్షుడైనప్పటికీ ఇలా కూటములు మారడం వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు హిందూస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్ జితన్ రామ్ మాంఝీ ‘‘బహుశా ఇదే నితీశ్‌కి ఆఖరి ఎన్నికలు. అధికారంలో కొనసాగడానికి ఆయన ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు‘‘అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కంటే జేడీ(యూ)కి తక్కువ సీట్లు వచ్చాయని, లాలూ కుమారుడు ఎక్కడ సీఎం అవుతారోనని లోలోపల ఆయనకి భయం ఉందని ఆరోపించారు. కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా నితీష్ గోడదూకుడు రాజకీయాలను తప్పుపడుతున్నారు. ‘‘నితీష్ కుమార్లో ఈ మార్పు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా నితీ‹Ô నోటి వెంట మోదీ జపం విస్మయానికి గురిచేస్తోంది’’అని సీమాంచల్, కోశి ప్రాంతంలో వరద బాధితుల సమస్యలపై పనిచేస్తోన్న మహేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి నితీశ్, మోదీ కాంబినేషన్‌కి తిరుగులేదని అభిప్రాయపడ్డారు. ‘‘మా రెండు పార్టీల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. లెక్కలు కూడా పక్కాగా వేశాం.గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ ఓటు షేర్ని బట్టి అంచనాలు వేసుకుంటే ఈ సారి మా కూటమి 40కి 38 సీట్లు గెలుచుకుంటుంది‘‘అని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేతలు కూడా ఈ ఎన్నికలు మోదీ, నితీశ్ పరిపాలనకు రిఫరెండంగానే భావిస్తున్నారు. ‘‘ఎన్డీయేకి నితీ‹శ్ కుమారే ప్రధానమనీ, ఇప్పటికీ నితీశ్ బ్రాండ్ ఇక్కడ పనిచేస్తోందనీ జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అంటున్నారు. మహిళా ఓటర్లే నితీశ్‌కి అండదండ ! బిహార్‌లో ఇప్పటివరకు 14 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గయ మినహా మిగతా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగా మెరుగు పడడం, అమల్లో లోపాలు ఉన్నప్పటికీ మద్యపానంపై నిషేధం విధించడంతో మహిళలంతా నితీశ్‌వైపే ఉంటారని అంచనాలున్నాయి. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న వ్యక్తిగత కరిష్మాతో నితీశ్‌కుమార్‌కి ఉన్న క్లీన్ ఇమేజ్ తోడుకావడంతో వెనుకబడిన కులాలన్నీ ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. అందుకే మహిళలంతా కులాలకు అతీతంగా ఈ సారి మోదీ, నితీశ్ ద్వయానికే ఓట్లు వేసినట్టుగా అంచనాలున్నాయి. మరోసారి రాష్ట్రంలో ఎన్డీయే స్వీప్‌చేయడం ఖాయం‘‘అని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సైబాల్ గుప్తా అభిప్రాయపడ్డారు. మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు అనుకూలంగా లేవా ? ఈ సారి ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. సీట్ల పంపకం ఆ కూటమిలో సంక్షోభాన్నే నింపింది. కూటమిలో ఆర్ఎస్ఎల్పీ, హెచ్ఏఎం వంటి చిన్నా చితకా పార్టీలు సంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, ఆర్జేడీ కత్తులు దూసుకున్నాయి. చివరికి ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాయి. ఆర్జేడీ 20 స్థానాల్లో పోటీ చేస్తుంటే, క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు కట్టబెట్టింది. మిగిలిన 11 సీట్లు చిన్నపార్టీలు పంచుకున్నాయి. ఇవన్నీ మహాగఠ్‌బంధన్ కొంప ముంచుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో గట్టెక్కారు. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 140 ఓట్లు పడగా వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీ బలం 243 సీట్లు కాగా, పది ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 233 మంది సభ్యులు ఉన్నారు. తీర్మానం తొలుత మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే ప్రభుత్వం పట్టబట్టడంతో డివిజన్ ఓటింగ్ జరిపారు. మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ మినహా మిగిలిన జేడీయూ అసమ్మతి ఎమ్మెల్యేలు అనర్హత భయంతో పార్టీ విప్‌కు కట్టుబడి సర్కారుకు మద్దతు పలికారు. ఏ పార్టీకీ చెందని ఎమ్మెల్యే అయిన తనకు విప్ ఎలా వర్తిస్తుందని మాంఝీ ప్రశ్నించి, సభ నుంచి వెళ్లిపోయారు. -
‘ప్రత్యేక హోదా’ సమరం
బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో కదం తొక్కిన పార్టీలు పాట్నాలో సీఎం నితీశ్ కుమార్ సత్యాగ్రహం జార్ఖండ్‌లో మూడు పార్టీల ఆధ్వర్యంలో బంద్ భువనేశ్వర్‌లో రాజ్‌భవన్ వద్ద బీజేడీ నిరసన పాట్నా/రాంచీ/భువనేశ్వర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం సీమాంధ్రకు కల్పించిన ప్రత్యేక హోదాను తమ రాష్ట్రాలకూ ఇవ్వాలని ఆదివారం బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లోని ప్రధాన పార్టీలు కదం తొక్కాయి. ధర్నాలు, ఆందోళనలనతో హోరెత్తించాయి. కేంద్రం తమ డిమాండ్‌ను పెడచెవిన పెడుతోందని నిప్పులు చెరిగాయి. బీహార్‌లో.. : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలో ఐదున్నర గంటలపాటు ధర్నా చేశారు. అధికార జేడీయూ పిలుపునిచ్చిన బీహార్ బంద్‌లో భాగంగా గాంధీ మైదాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆయన సత్యాగ్రహం చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జేడీయూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘కేంద్రం బీహార్‌పై వివక్ష చూపుతోంది. ప్రత్యేక హోదా ఆత్మగౌరవం, ప్రతిష్టకు సంబంధించిన విషయం. దీని కోసం ప్రజలు చివరివరకు ఐక్యంగా పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు ప్రజల మద్దతు కూడట్టేందుకు ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. అంతకుముందు ఆయన మంత్రులు, పార్టీ నేతలతో ఇంటి నుంచి 5కి.మీ నడిచి ధర్నాస్థలి చేరుకున్నారు. జేడీయూ బంద్‌తో రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. పార్టీ కార్యకర్తలు పాట్నా సహా పలు చోట్ల రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు రైళ్లకు అంతరాయం కలిగింది. జార్ఖండ్‌లో..: జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్), ఏజేఎస్‌యూ పార్టీ, జేడీయూ ఆధ్వరంలో బంద్ జరిగింది. మొత్తం 24 జిల్లాలకుగాను బొకారో, రాంచీ, ధన్‌బాద్ సహా పది జిల్లాల్లో సంపూర్ణంగా జరగగా, మిగతా జిల్లాల్లో మిశ్రమ స్పందన లభించింది. నిరసనకారులు అడ్డుకోవడంతో పలుచోట్ల బస్సులు, రైళ్ల రాకపోకలకు ఆటంకమేర్పడింది. ఒడిశాలో..: ఒడిశాకు కేంద్రం ప్రత్యేక హోదా నిరాకరిస్తోందని ఆరోపిస్తూ పాలక బీజేడీ కార్యకర్తలు రాష్ట్రవాప్తంగా ఆందోళనకు దిగారు. యువకార్యకర్తలు, కొంతమంది ఎమ్మెల్యేలు భువనేశ్వర్‌లోని రాజభవన్ వద్ద నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని బ్లాకే డే పాటించారు. గంజాం జిల్లా ఛత్రపూర్తోపాటు, మరో చోట జరిగిన కార్యక్రమాల్లో సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రపతిని కలిసిన గూర్ఖాలాండ్ బృందం డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ప్రతినిధి బృందం ఆదివారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. ప్రతినిధి బృందానికి జీజేఎం నేత రోషన్ గిరి నేతృత్వం వహించారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధి బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడి జీజేఎం వర్గాలు తెలిపాయి. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకెళ్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సీమాంధ్రకు ఇచ్చి మాకు ఇవ్వరా?: నితీశ్, నవీన్ ‘బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న న్యాయమైన డిమాండ్‌ను పట్టించుకోని కేంద్రం సీమాంధ్రకు మాత్రం ఆ హోదా కట్టబెట్టింది. కాంగ్రెస్ మా డిమాండ్‌ను అటకెక్కించింది. బీహారీల అభివృద్ధి ప్రత్యేక ప్రతిపత్తి వంటి వాటితోనే సాధ్యం’ అని నితీశ్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోటి మంది సంతకాలతో తమ పార్టీ మెమొరాండం ఇచ్చినా, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తమ డిమాండ్‌లో బలముందని తెలిసి కేంద్రం రఘురామ్ రాజన్ కమిటీని వేసిందని, బీహార్ అత్యంత వెనుకబడి రాష్ట్రాల్లో ఒకటని ఆ కమిటీ చెప్పిందని వెల్లడించారు. బీజేపీని విమర్శిస్తూ.. ఆ పార్టీ మద్దతు లేకుంటే సీమాంధ్రకు ప్రత్యేక హోదా వచ్చేది కాదని, ఆ పార్టీ బీహార్‌కూ ఈ హోదా కోరి ఉండాల్సిందని అన్నారు. ఓట్ల కోసమే బీజేపీకి బీహార్ గుర్తొస్తుందని దుయ్యబట్టారు. కొత్తగా ఏర్పడే సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం దీని కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న తమ రాష్ట్రానికి ఎందుకివ్వలేదని ఒడిశా సీఎం నవీన్ ప్రశ్నించారు. ఈ హోదాకు అవసరమైన అన్ని అర్హతలూ ఒడిశాకు ఉన్నాయన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ను విభజించినందుకే సీమాంధ్రకు ఆ హోదా ఇచ్చారని, బీజేడీ ఒడిశాకు కూడా ఆ హోదా కావాలనుకుంటే రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.