![Nitish kumar Reddy, Klaasen guide Sunrisers to 201 runs](/styles/webp/s3/article_images/2024/05/2/nk.gif.webp?itok=-yiS1V95)
ఐపీఎల్-2024లో భాగంగా మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగారు. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment