IPL 2024
-
ఇదేం చెత్త ఆట బ్రో.. ఐపీఎల్‌లోనే ఆడుతావా! ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అభిషేక్.. ఇప్పుడు పోర్ట్ ఎలిజిబెత్‌లో జరిగిన రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన అభిషేక్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. సఫారీ పేసర్ కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఈ పంజాబీ స్టార్ బ్యాటర్ ఔటయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇదేమి ఆట భయ్యా..కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతావా? అంటే ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మరి కొంతమంది అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ అవకాశం ఇవ్వండి అంటూ భారత జట్టు మేనెజ్మెంట్ను సూచిస్తున్నారు.ఒక్క సెంచరీ మినహా.. కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఇప్పుడు భారత్ తరపున 9 మ్యాచ్‌లు ఆడాడు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. జైశ్వాల్‌కు బ్యాకప్‌గా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ తన తొమ్మిది టీ20 ఇన్నింగ్స్‌లలో ఎనిమిదింటిలో కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తానే అభిషేక్ జట్టులో కొనసాగే అవకాశముంది.ఐపీఎల్లో అదుర్స్ఐపీఎల్-2024లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆ దూకుడును అభిషేక్ ప్రదర్శించలేకపోతున్నాడు.Abhishek Sharma's last 9 T20i innings:0(4), 100(47), 10(9), 14(11), 16(7), 15(11), 4(4), 7(8), 4(5)He is clearly missing IPL tracks and his partner Travis Head.#INDVSSA pic.twitter.com/rZLiTGUmxe— JassPreet (@JassPreet96) November 10, 2024చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా -
సన్‌రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ గత సీజన్లో తన అద్భుత ఆటతో జట్టును ఫైనల్ వరకు చేర్చిన హెన్రిచ్ క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ నమ్మకముంచింది. వచ్చే సీజన్‌కూ అతడిని తమతో అట్టి పెట్టుకునేందుకు రైజర్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇందు కోసం భారీగా రూ. 23 కోట్లు చెల్లించేందుకు కూడా టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. వీరిలో ఒకరైనా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. ఈ ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు అక్టోబర్ 31 వరకు గవరి్నంగ్ కౌన్సిల్ గడువు ఇచి్చంది. ప్రతీ టీమ్ తాము కొనసాగించే తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్క్యాప్డ్ అయితే రూ. 4 కోట్లు చెల్లించాలి. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచి్చన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఫ్రాంచైజీలకు ఉంది. ఈ నేపథ్యంలో కెపె్టన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇచ్చేందుకు రైజర్స్ సిద్ధంగా ఉంది. 2024 సీజన్లో క్లాసెన్ 15 ఇన్నింగ్స్‌లలో 171.07 స్ట్రయిక్‌రేట్‌తో 479 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 38 సిక్స్‌లు ఉన్నాయి.అభిõÙక్ 16 ఇన్నింగ్స్‌లలో 204.21 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేయగా... 36 ఫోర్లు, 42 సిక్స్‌లు బాదాడు. 2023 ఐపీఎల్‌కు ముందు మినీ వేలంలో క్లాసెన్‌ను సన్‌రైజర్స్ రూ. 5.25 కోట్లకు తీసుకొని తర్వాతి ఏడాది కొనసాగించింది. ఇప్పుడు అతనికి లభించే మొత్తం గతంతో పోలిస్తే ఏకంగా 338 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ముగ్గురి కొనసాగింపు దాదాపు ఖరారు కాగా... నాలుగో, ఐదో ఆటగాళ్లుగా ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను కూడా అట్టి పెట్టుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
లక్నోలోకి రోహిత్ శర్మ..? హింట్ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్
ఐపీఎల్-2025 సీజన్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడిడంపై ఊహాగానాలు ఊపుందుకున్నాయి. రోహిత్ వచ్చే ఏడాది సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.అతడి కోసం ఎంత మొత్తాన్ని నైనా వెచ్చించేందుకు లక్నో ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి."శర్మ వేలంలోకి వస్తే అతడిని స్వాగతించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దంగా ఉంది. అతడు చాలా గొప్ప ఆటగాడు. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే ప్రతీ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముంబై ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్‌తో చాలా క్లోజ్‌గా పనిచేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టమని" న్యూస్ 24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోడ్స్ పేర్కొన్నాడు. దీంతో రోహిత్‌పై లక్నో దృష్టిసారించినట్లు తేటతెల్లమైంది.కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి ముంబై తమ జట్టు పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై యాజమాన్యం పట్ల హిట్‌మ్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ మారేందుకు రోహిత్ శర్మ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
ముంబై ఇండియన్స్ కాదు.. నా ఫేవరేట్ ప్రత్యర్ధి ఆ జట్టే: కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదివారం(ఆగస్టు 18)తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ నుంచి పలు ప్రశ్నలు కోహ్లికి ఎదురయ్యాయి. తన ఫేవరేట్ క్రికెటర్లను ఎంచుకోమని ఎంఎస్ ధోని, ఎబీ డివిలియర్స్ పేర్లు అప్షన్స్ ఇవ్వగా.. కోహ్లి ఇద్దరూ కూడా తనకు ఇష్టమైన వారేనని తెలివగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత తనకు ఇష్టమైన షాట్ ఫ్లిక్ లేదా కవర్ డ్రైవ్? అని అడగ్గా.. అందుకు కవర్ డ్రైవ్ తన ఫేవరేట్ షాట్ అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఐపీఎల్లో తన ఫేవరేట్ ప్రత్యర్ధి జట్టు ఏదన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు అప్షన్స్గా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కాస్త సమయం తీసుకున్న కోహ్లి.. ఆలోచించి కేకేఆర్‌ను తనకు ఇష్టమైన ప్రత్యర్ధిగా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా విరాట్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగతున్నాడు. 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీలోనే కోహ్లి ఉన్నాడు.తొట్టతొలి సీజన్ నుంచి ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లినే. ఇక ఐపీఎల్లో కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ అంటే అభిమానలకు పండగే. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు హోరహోరీగా జరుగుతాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. -
పంజాబ్ కింగ్స్ ఓనర్‌తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కారణమిదే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది. -
హార్దిక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.. అది చూసి నేను షాకయ్యా: నితీష్
ఆంధ్రా స్టార్ ఆల్‌రౌండర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2024 తర్వాత స్పోర్ట్స్ హెర్నియా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న నితీష్ కుమార్.. సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో నితీష్‌కు భారత జట్టు నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వే సిరీస్‌కు నితీష్ కుమార్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు నితీష్ దూరమయ్యాడు. అయితే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇష్టమైన ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడని, తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడని నితీష్ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాకాల్లో బీజీగా ఉన్నప్పటకి హార్దిక్ భాయ్ నాకు ఓ మెసేజ్ చేశాడు. ఫీల్డ్‌లో నా ఎఫక్ట్, ఎనర్జీ, ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు పాండ్యా ఆ మెసేజ్‌లో రాసుకొచ్చాడు. త్వరలోనే మనం కలిసి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.నిజంగా అతడి మెసెజ్‌ను చూసి షాక్ అయ్యాను. ఎందకంటే ఓ మెగా టోర్నీకి సన్నద్దమవుతున్న సమయంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్. వెంటనే పాండ్యా భయ్యాకు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లే ఇచ్చాను.అదే విధంగా ఓ ఆల్‌రౌండర్‌గా బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యాలను నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో 11 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్.. 303 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డును సైతం ఈ ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ గెలుచుకున్నాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్!?
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాప్‌లో లక్ష్మణ్ భాగం కానున్నట్లు సమాచారం. లక్నో ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్‌లోకి భారత దిగ్గజ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌పై కన్నేసినట్లు వినికిడి. అతడిని తమ జట్టు మెంటార్‌గా నియమించాలని లక్నో యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్ష్మణ్‌తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.కాగా లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( (NCA) ఛీప్‌గా ఉన్నాడు. లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. తన కాంట్రాక్ట్‌ను పొడగించే అవకాశం బీసీసీఐ ఇచ్చినా.. వీవీయస్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.లక్ష్మణ్ తన నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక మెంటార్‌గా లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2013 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్ జట్టుకు లక్ష్మణ్ పనిచేశాడు. ఆ తర్వాత ఏన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో మెంటార్ పదవి నుంచి ఈ ఈ సొగసరి బ్యాటర్ తప్పుకున్నాడు. ఇక లక్ష్మణ్ తర్వాత ఎన్సీఏ ఛీప్‌గా మాజీ భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. -
IPL 2025: డుప్లెసిస్‌కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్‌ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్‌ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
IPL 2025: రిషబ్ పంత్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. !?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్‌ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు పంత్‌ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్‌కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లు పేర్కొంది.అదేవిధంగా పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్‌కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రిషబ్.. ఐపీఎల్లో ఢిల్లీ తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. -
గంభీర్‌తో గొడవలు.. బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన కోహ్లి!
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియామకం నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భవిష్యత్తు ఏమవుతుందోనంటూ క్రికెట్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరూ దూకుడు స్వభావం ఉన్నవాళ్లే కావడం.. పైగా గతంలో మైదానంలోనే ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం ఇందుకు కారణం.గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గౌతీ- కోహ్లి కొట్టుకున్నంత పనిచేశారు. నాడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్న గంభీర్.. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి మధ్య వివాదానికి అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ అన్న సంగతి తెలిసిందే.హోరాహోరీగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో నవీన్- కోహ్లి మధ్య మాటా మాటా పెరగగా.. గంభీర్ జోక్యం చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. ‘మీ ఆటగాళ్లకు ముందుగా బుద్ధి చెప్పండి’ అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.గంభీర్ కూడా ఇందుకు ఘాటుగానే స్పందించాడని వినికిడి. అయితే, ఐపీఎల్-2024లో సీన్ మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా వచ్చిన గౌతీ.. ఆర్సీబీ ఓపెనర్ కోహ్లితో కలిసిపోయాడు.They hugged 😭😭😭Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him.I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb— RanaJi🏹 (@RanaTells) March 29, 2024ఇద్దరూ మైదానంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య విభేదాలు సమసిపోయాయన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే, తీవ్ర విమర్శల నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పోయినట్లు నటించారని.. లోలోపల పరస్పరం గుర్రుగానే ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.దీంతో గంభీర్, కోహ్లి వాటిని ఖండించారు. అయినా దుష్ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపికకాగానే.. కోహ్లికి కష్టాలు మొదలు అన్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్‌తో బంధం గురించి కోహ్లి బీసీసీఐకి స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.గతంలోని గొడవల తాలూకు ప్రభావం కోచ్- ఆటగాడిగా తమ రిలేషన్‌పై ఉండబోదని.. భారత జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తామిద్దరం ముందుకు సాగుతామని కోహ్లి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.తమ విషయంలో మేనేజ్మెంట్కు ఎలాంటి తలనొప్పి రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని కోహ్లి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ అనంతరం సెలవు తీసుకున్న విరాట్ కోహ్లి.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే, హెడ్ కోచ్‌గా ఈ పర్యటనతో ప్రస్థానం మొదలుపెట్టనున్న గంభీర్.. కోహ్లిని సెలవులు రద్దు చేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిసింది.ఇందుకు తగ్గట్లుగానే కోహ్లి శ్రీలంకతో సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఈ క్రమంలో గురువారం ప్రకటించిన జట్టులో అతడి పేరు ఉండటం గమనార్హం. చాంపియన్స్ ట్రోఫీ-2025(వన్డే)ని దృష్టిలో పెట్టుకుని గంభీర్ ప్రతిపాదనకు కోహ్లి ఇలా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
కోలుకున్న పేస్‌గన్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే!
భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ శుభవార్త పంచుకున్నాడు. గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం చెమటోడ్చక తప్పదని పేర్కొన్నాడు.కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన ఈ యంగ్ పేస్‌గన్.. వరుసగా రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు.రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యూపీ ఎక్స్‌ప్రెస్ రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.అయితే, దురదృష్టవశాత్తూ పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్-2024లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు మయాంక్ యాదవ్. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.వందశాతం ఫిట్నెస్ సాధించాలంటేఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నా చికిత్స పూర్తైంది. గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉపశమనం లభించింది.పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, వందశాతం ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం ఇక్కడ ఉండక తప్పదని తెలుసు.గత కొన్ని రోజులుగా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం సానుకూలాంశం. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు.రీఎంట్రీ అప్పుడే కాగా పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌పై దృష్టి సారించిన సెలక్టర్లు అతడి పునరాగమనం కోసం వేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దులీప్ ట్రోఫీ- 2024 ద్వారా ఈ బౌలర్ రీఎంట్రీ ఇస్తే.. ఆ ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో చోటు ఇచ్చే అంశం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అరంగేట్రం ఆ తర్వాతే ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘మయాంక్ యాదవ్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఫాస్ట్‌బౌలర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత వేర్వేరు ఫార్మాట్లలో ఆడించాలనుకుంటున్నాం.అక్కడ ప్రతిభ నిరూపించుకున్న తర్వాతే టీమిండియా అరంగేట్రం గురించి స్పష్టత వస్తుంది. అంతేతప్ప హడావుడిగా జాతీయ జట్టులోకి పంపితే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా తదుపరి శ్రీలంకతో తలపడనుంది.చదవండి: అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..! -
నా కల నెరవేరింది.. పాస్ పోర్ట్, ఫోన్ కూడా మర్చిపోయా: పరాగ్
టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. యువ భారత జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీమ్ జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.పాస్ పోర్ట్ కూడా మర్చిపోయా?ఇక తొలిసారి భారత జట్టు నుంచి పిలుపురావడంపై రాజస్తాన్ రాయల్స్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. "భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్స్ జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సా నుంచి వచ్చిన నేను భారత్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాను. నా కలను ఎన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను. ఈ ఉత్సాహంలో పాస్‌పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్లీ దొరికాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా.ఇప్పటికే నేను చాలా మ్యాచ్‌లు విదేశాల్లో ఆడాను. కానీ భారత్ జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. భారత జట్టులో చోటు కొట్టేశాడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రానాకు జాక్ పాట్ తగిలింది. హర్షిత్ రానాకు భారత సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు రానాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్‌కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను జింబాబ్వే సిరీస్‌కు ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రానాకు చోటు దక్కింది. రానాతో పాటు సాయిసుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది.ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు పయనం కాగా.. వీరు ముగ్గురు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేయగా.. సాయిసుదర్శన్, రానాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటి సారి. అయితే సాయి మాత్రం భారత తరపున వన్డేల్లో మాత్రం డెబ్యూ చేశాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అదేవిధంగా భారత-ఎ జట్టు తరపున కూడా రానా ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
Shivam Dube: ఐపీఎల్లో హీరో.. ఇండియా తరఫున జీరో
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్‌ను (14 మ్యాచ్‌ల్లో 162.30 స్ట్రయిక్‌రేట్‌తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్‌తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఐపీఎల్లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు. వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.కాగా, ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్‌కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్‌కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్‌పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే కూడా తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్‌పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్‌పాండే రాణిస్తున్నాడు. -
కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? కేకేఆర్ స్టార్ రిప్లై వైరల్
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మెగా టోర్నీలో హర్షిత్ మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్ సెలబ్రేషన్స్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్ రాణా. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్ పేసర్.మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోతఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్‌ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్‌కు సెండాఫ్ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.భయ్యాతో మాట్లాడానుతాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హర్షిత్ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్ భయ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.ఆ సమయంలో వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్ కూడా నా వైపే ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మయాంక్ భయ్యాను కలిశాను.తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? ఈ క్రమంలో విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్‌లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.నన్ను చాలెంజ్ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్ దశలో దుమ్ములేపిన కేకేఆర్.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! -
BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్?
టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్‌తో పాటు వాళ్లంతా అవుట్!ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్‌లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్‌కు ఇంత వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
భారత క్రికెట్‌కు శుభవార్త.. తిరిగి రంగంలోని దిగిన ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్‌కు శుభవార్త. ఐపీఎల్ 2024 సందర్భంగా గాయపడిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తిరిగి రంగంలోకి దిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అనంరతం మయాంక్ ఇవాళే ప్రాక్టీస్ షురూ చేశాడు. మయాంక్ నెట్స్‌లో సాధన చేస్తున్న దృశ్యాలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.Mayank Yadav has been gearing up for the tour against Sri Lanka and Zimbabwe in July. pic.twitter.com/PZ7WS8mFo9— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2024గత సీజన్‌తోనే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ ఆడిన 4 నాలుగు మ్యాచ్‌ల్లో తనేంటో రుజువు చేసుకున్నాడు. తన ప్రధాన అస్త్రమైన పేస్‌తో భారత క్రికెట్లో హాట్ టాపిక్ అయ్యాడు. దాదాపుగా ప్రతి బంతిని 150 కిమీ పైగా వేగంతో సంధించగల సత్తా ఉన్న మయాంక్.. తన పేస్ పదునుతో ప్రత్యర్ధులను గడగడలాడించాడు.తన అరంగేట్రం మ్యాచ్‌లోనే (పంజాబ్‌పై (4-0-27-3)) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మయాంక్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో (4-0-14-3) మరింత రెచ్చిపోచి, వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సీజన్లో ముగిసే లోపు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటాడనుకున్న తరుణంలో మాయంక్ గాయపడ్డాడు. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక ఓవర్ వేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత అతను తిరిగి బరిలోకి దిగలేదు.తాజాగా గాయం పూర్తిగా నయం కావడంతో మయాంక్ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వచ్చే నెల (జులై) భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. భారత సెలెక్టర్లు మయాంక్ పేరును పరిశీలించవచ్చని తెలుస్తుంది. -
ఐపీఎల్లో ఆడకపోవడం మంచిదైంది: ఆసీస్ స్టార్ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న ఆసీస్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన విజయాలు సాధించింది. తొలుత ఒమన్‌ను చిత్తు చేసిన కంగారులు.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఓడించారు. తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 12న నమీబియాతో ఆసీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే సూపర్-8కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2024లో ఆడకపోవడం తనకు కలిసొచ్చిందని జంపా తెలిపాడు. ఇప్పటివరకు ఆసీస్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జంపా.. ఈ ఏడాది సీజన్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. "ఐపీఎల్-2024లో ఆడకూడదని సీజన్ ఆరంభానికే ముందే నిర్ణయించుకున్నాను. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైనదే అన్పించింది. ఎందుకంటే నిరంతర క్రికెట్‌తో నేను బాగా అలిసిపోయాను. ఈ లీగ్ ఆరంభ సమయానికి నేను కొంచెం మోకాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. ఒకవేళ ఐపీఎల్లో ఆడి మళ్లీ గాయం తిరగబెడితే వరల్డ్‌కప్‌నకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగాను.అదే విధంగా నాకు ఫ్యామిలీ కూడా. కొన్ని సార్లు పనికంటే ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యమని" క్రికెట్ ఆస్ట్రేలియాతో జంపా పేర్కొన్నాడు. కాగా ఈ ప్రస్తుత పొట్టిప్రపంచకప్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన జంపా 4 వికెట్లు పడగొట్టాడు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్‌ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్‌లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్‌తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించిన రుతురాజ్.. మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభణ
యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024 ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ లీగ్‌లో పూణేరీ బప్పాకు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 4) కొల్హాపూర్ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్దశతకం (35 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఫలితంగా పూణేరీ బప్పా 22 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతు.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లోనూ తన జట్టుకు (పూణేరీ బప్పా) నాయకత్వం వహిస్తున్నాడు. అయితే రుతు ఐపీఎల్లోలా ఎంపీఎల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతను మిడిలార్డర్లో బరిలోకి దిగాడు.మ్యాచ్ విషయానికోస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణేరీ బప్పా 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పూణేరీ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. RUTURAJ GAIKWAD SHOW...!!!!- Captain Ruturaj smashed 61*(35) in 14 over game while batting in the middle order in the Maharashtra Premier League. 🔥🌟 pic.twitter.com/dumVXn87br— Johns. (@CricCrazyJohns) June 4, 2024శుభమ్ తైస్వాల్ (10), సూరజ్ షిండే (24), రాహుల్ దేశాయ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కొల్హాపూర్ టస్కర్స్ బౌలర్లలో నిహాల్ తుసామద్ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ చవాన్ 2, యశ్ కలాద్కర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టస్కర్స్ 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూణేరీ బౌలర్లు పియుశ్ సాల్వీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ సాంగ్వి (38), అంకిత్ పోర్వాల్ (28), అంకిత్ బావ్నే (21) ఓ మోస్తరు పరుగులు చేసినా టస్కర్స్‌కు ఓటమి తప్పలేదు. కాగా, కొద్ది రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024లో రుతురాజ్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, నాలుగు అర్దసెంచరీల సాయంతో 583 పరుగులు చేశాడు. 15 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్దసెంచరీల సాయంతో 741 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. -
ఐపీఎల్ 2025.. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి అశ్విన్!?
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్‌కు సీఎస్కే ఫ్రాంచైజీ యాజయాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశూతో సీఎస్కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ చెన్నై శివారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్స్ చేయలేం. అశ్విన్‌ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు. అతడు మొదటగా మా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఛీప్‌గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రామ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశూ ఇప్పుడు సీఎస్కే వెంచర్లో భాగమయ్యాడు.అదే విధంగా టీఎన్సీఎ ఫస్ట్-డివిజన్ క్రికెట్లో ఇండియా సిమెంట్స్ జట్లకు సైతం ప్రాతినిథ్యం వహిస్తాడని" ఓ ప్రకటనలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి అశ్విన్‌ను రాజస్తాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ పదేళ్ల తర్వాత సీఎస్కే ఫ్యామిలీలో అశూ భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
Pat Cummins: ఆమెపై కోపం వచ్చింది.. కానీ!
ఇండియాలో ఉన్నన్ని రోజులు తమ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపిందని ఆస్ట్రేలియా సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐపీఎల్-2024 నేపథ్యంలో తొలిసారిగా తమ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందని.. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకుందని పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత అయిన ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్‌గా నియమించగా.. అనూహ్య రీతిలో జట్టు పుంజుకుంది.గత మూడేళ్ల వైఫల్యాలకు చరమగీతం పాడుతూ ఏకంగా ఫైనల్ చేరుకుంది. అయితే, తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయినా.. గతం కంటే మెరుగైన ప్రదర్శన కారణంగా అభిమానుల మనసు గెలుచుకుంది కమిన్స్ బృందం.ఇక ఇండియాలో ఉన్నపుడు ఆట నుంచి విరామం దొరికిన సమయంలో ప్యాట్ కమిన్స్ కుటుంబంతో కలిసి వివిధ రకాల హోటళ్లను సందర్శించి భోజనం రుచిచూశాడు. అదే విధంగా బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తూ ఫ్యామిలీ అంతా సరాదాగా గడిపారు.తాజాగా ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్యాట్ కమిన్స్.. ఆసకిక్తకర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా సోదరి పట్టుబట్టడం వల్లే నేను డాన్స్ చేయాల్సి వచ్చింది.తనే నన్ను బాలీవుడ్ డాన్సింగ్ క్లాసుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తనే మా డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నాకు చాలా కోపం వచ్చింది.అయితే, ఇప్పుడు అదెంతో గొప్పగా అనిపిస్తోంది. ఐపీఎల్ కోసం అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేశాం. ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? అన్న విషయాల గురించి నా సహచర ఆటగాళ్లు మంచి సలహాలు ఇచ్చారు.తొలిసారి నా ఫ్యామిలీ ఇండియా సందర్శించి.. అందమైన జ్ఞాపకాలు పోగు చేసుకుంది’’ అని ప్యాట్ కమిన్స్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జూన్ 5 ఆసీస్ ఒమన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Pat Cummins dancing on a Bollywood song wasn't on my Bingo Card 😂😂👏👏👏 pic.twitter.com/OZgP6qtJ8G— aman (@bilateral_bully) May 8, 2024 -
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్‌లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్‌రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్‌ను కనీసం స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్‌కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్‌కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
పెళ్లి పీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. (ఫొటోలు)