ఆఖరి పోరులో పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్ విజయం
పాయింట్ల పట్టికలో రెండో స్థానం ఖరారు
సొంతగడ్డపై గెలుపుతో ముగింపు
అదరగొట్టిన అభిషేక్, నితీశ్ రెడ్డి, క్లాసెన్
సాక్షి, హైదరాబాద్: అద్భుత ప్రదర్శనలు, మెరుపు ఇన్నింగ్స్‌లతో సీజన్ ఆసాంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో విజయంతో లీగ్ దశను ముగించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్, రాజస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది.
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), రిలీ రోసో (24 బంతుల్లో 49; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అథర్వ తైడే (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిõÙక్ శర్మ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (26 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (25 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
భారీ భాగస్వామ్యం...
పంజాబ్ ఓపెనర్లు అథర్వ, ప్రభ్‌సిమ్రన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు సాధించారు. ఎట్టకేలకు 10వ ఓవర్లో అథర్వను అవుట్ చేసిన నటరాజన్ ఈ జోడీని విడదీశాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు బ్యాటర్లు 55 బంతుల్లో 97 పరుగులు జోడించారు.
ప్రభ్‌సిమ్రన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మూడో స్థానంలో వచ్చిన రోసో కూడా దూకుడు ప్రదర్శిస్తూ నితీశ్ కుమార్ రెడ్డి ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ఆ తర్వాత పంజాబ్ తక్కువ వ్యవధిలో ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్ (2), రోసో, అశుతోష్ శర్మ (2) వికెట్లు కోల్పోయింది.
అయితే చివర్లో జితేశ్ శర్మ ధాటిగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 పరుగులు దాటింది. నితీశ్ వేసిన ఆఖరి ఓవర్లో జితేశ్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్ట డంతో 19 పరుగులు వచ్చాయి.
హెడ్ విఫలం...
ఛేదనలో రైజర్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన చక్కటి బంతికి హెడ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ తడబాటు లేకుండా విజయం దిశగా సాగింది. వరుసగా 72, 57, 47 పరుగుల భాగస్వామ్యాలు రైజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించాయి.
ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. రిషి ధావన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ శర్మ...అర్‡్షదీప్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. హర్షల్ పటేల్ ఓవర్లో 22 పరుగులు రాబట్టిన రైజర్స్ 6 ఓవర్లలో 84 పరుగులు సాధించింది.
21 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అభిషేక్ అవుటయ్యాక అటు నితీశ్, ఇటు క్లాసెన్ జోరు ప్రదర్శించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. అనంతరం వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో రైజర్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (సి) సన్విర్ (బి) నటరాజన్ 46; ప్రభ్‌సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) విజయకాంత్ 71; రోసో (సి) సమద్ (బి) కమిన్స్ 49; శశాంక్ (రనౌట్) 2; జితేశ్ (నాటౌట్) 32; అశుతోష్ (సి) సన్వీర్ (బి) నటరాజన్ 2; శివమ్ సింగ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–97, 2–151, 3–174, 4–181, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–0, కమిన్స్ 4–0–36–1, నటరాజన్ 4–0–33–2, విజయకాంత్ 4–0–37–1 షహబాజ్ 1–0–13–0, నితీశ్ రెడ్డి 3–0–54–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) శివమ్ (బి) శశాంక్ 66; రాహుల్ త్రిపాఠి (సి) అర్‡్షదీప్ (బి) హర్షల్ 33; నితీశ్ కుమార్ రెడ్డి (సి) శివమ్ (బి) హర్షల్ 37; క్లాసెన్ (బి) హర్‌ప్రీత్ 42; షహబాజ్ (సి) శశాంక్ (బి) అర్‡్షదీప్ 3; సమద్ (నాటౌట్) 11; సన్వీర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–0, 2–72, 3–129, 4–176, 5–197, 6–208. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–2, రిషి ధావన్ 3–0–35–0, హర్షల్ 4–0–49–2, చహర్ 4–0–43–0, హర్‌ప్రీత్ 3–0– 36–1, శశాంక్ 1–0–5–1, అథర్వ 0.1–0–4–0.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్
మే 21: క్వాలిఫయర్–1
కోల్‌కతా నైట్‌రైడర్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్
వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి
మే 22: ఎలిమినేటర్
బెంగళూరు X రాజస్తాన్ రాయల్స్
వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి
మే 24: క్వాలిఫయర్–2
క్వాలిఫయర్–1లో
ఓడిన జట్టు X ఎలిమినేటర్ విజేత
వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి
మే 26: ఫైనల్
క్వాలిఫయర్–1 విజేత క్వాలిఫయర్–2 విజేత
వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి
Comments
Please login to add a commentAdd a comment