ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. ఓ మోస్తరు జట్టైన పంజాబ్ కింగ్స్.. చిచ్చరపిడుగులతో నిండిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని (చంఢీఘడ్) మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
పంజాబ్ గత మ్యాచ్‌లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించగా.. సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్, పంజాబ్ చెరి 2 విజయాలు (4 మ్యాచ్‌ల్లో) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఆరెంజ్ ఆర్మీ 14, పంజాబ్ 7 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. రెండు జట్ల మధ్య చివరిసారిగా (2023 సీజన్) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.
బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో అయితే సన్‌రైజర్స్‌ను ఆపడం కష్టమనే చెప్పాలి. ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ విధ్వంసకర వీరులతో నిండుకుని ఉంది. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ భీకర ఫామ్‌లో ఉండి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ సన్‌రైజర్స్ పటిష్టంగానే ఉంది. కెప్టెన్ కమిన్స్, భువనేశ్వర్, ఉనద్కత్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్‌లతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది.
పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఒకరిద్దరి ప్రదర్శనలతో నెట్టుకుని వస్తుంది. శిఖర్ ధవన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్, సామ్ కర్రన్, సికందర్ రజా, జితేశ్ శర్మ లాంటి బ్యాటర్లు ఉన్నా వీరెప్పుడు రాణిస్తారో చెప్పలేని పరిస్థితి. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు.
ఈ జట్టు బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపిస్తుంది. హర్ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రబాడ, కర్రన్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడి మ్యాచ్‌ల్లో రాణించారు. హర్షల్ పటేల్ ఒక్కడే ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. విధ్వంసకర ఆటగాడు లివింగ్‌స్టోన్ గాయపడటంతో సికందర్ రజా గత మ్యాచ్‌లోనే తుది జట్టులో వచ్చాడు. ఓవరాల్‌గా చూస్తే.. నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment