INDW Vs SAW: ఫైనల్లో త్రిష మాయాజాలం.. 82 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ | INDW Vs SAW, U19 T20 WC: South Africa Women Have Been Bowled Out For Just 82 Runs, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

INDW Vs SAW: ఫైనల్లో త్రిష మాయాజాలం.. 82 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌

Published Sun, Feb 2 2025 1:29 PM | Last Updated on Sun, Feb 2 2025 1:58 PM

INDW vs SAW, U19 T20 WC: South Africa women have been bowled out for just 82 runs

మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌటయ్యారు. 

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్‌ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మైకే వాన్ వూర్ట్స్‌(23), జెమా బోథా(16), ఫే కోవిలింగ్‌(15) పరుగులతో పర్వాలేదన్పించగా..మిగితా బ్యాటర్లంతా దారుణంగా నిరాశపరిచారు.

అదరగొట్టిన త్రిష.. 
కాగా ఈ టోర్నీ అసాంతం త్రిష తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్‌ వరుసగా రెండో సారి ఫైనల్‌ చేరడంలో ఆమెది కీలక పాత్ర. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిష 59 బాల్స్‌లో ఏకంగా 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన త్రిష..66.25 సగటుతో 265 పరుగులు చేసి టాప్‌​ స్కోరర్‌గా కొనసాగుతోంది. అటు బౌలింగ్‌లోనూ 7 వికెట్లతో త్రిష సత్తాచాటింది.

తుది జట్లు
దక్షిణాఫ్రికా మహిళల U19 జ‌ట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్‌), కరాబో మెసో(వికెట్ కీప‌ర్‌), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నిని

తుది జట్లు
దక్షిణాఫ్రికా మహిళల U19 జ‌ట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్‌), కరాబో మెసో(వికెట్ కీప‌ర్‌), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నిని
చదవండి: #Virat Kohli: 'వావ్ వాట్ ఎ బాల్‌'.. తనను ఔట్‌ చేసిన బౌలర్‌పై కోహ్లి ప్రశంసలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement