under-19 world cup
-
అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ నుంచి మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్-19 అండర్ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన యువ పేసర్ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్ఎల్-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం లాహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హునైన్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసెన్ రాయ్‌ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. పీఎస్ఎల్లో హునైన్కు ఇదే తొలి వికెట్. కాగా హునైన్ షా ఎవరో కాదు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీం షాకు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్ఎల్ వికెట్ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటైడ్ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. hunain shah, remember the name pic.twitter.com/kkONIs1qXg — :) (@babardrive) February 22, 2024 -
అదే మా కొంపముంచింది.. కానీ చాలా గర్వంగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు. అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్‌మన్, రాఫ్ మెక్‌మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు. "ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయాం. బ్యాటింగ్‌లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్‌తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఫైనల్లో టీమిండియా ఓటమి.. మనోడే మనకు విలన్! ఎవరీ హర్జాస్ సింగ్?
140 కోట్ల మంది భారతీయులకు మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ అదే కథ.. అదే వ్యథ. అండర్-19 వరల్డ్ కప్ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లో మరోసారి ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గతేడాది వరల్డ్‌కప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు. కానీ కంగరూలు జోరు ముందు తల వంచిన జూనియర్లు.. కనీసం పోరాడకుండానే ఓటమిని అంగీకరించారు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో 74 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. బరువెక్కిన హృదయాలతో ఇంటిముఖం పట్టింది. మనోడో విలన్.. ఎవరీ హర్జాస్ సింగ్? ఇక ఆసీస్ నాలుగో సారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హర్జాస్ సింగ్‌ది కీలక పాత్ర. కీలక సమయంలో బ్యాటింగ్‌లో వచ్చిన హర్జాస్ సింగ్.. తన అద్బుతమైన ఆటతీరుతో భారత బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఆసీస్ 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అదుకున్నాడు. అచతూచి ఆడుతూ హాఫ్ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఈ టోర్నీ మొత్తం పేలవ ప్రదర్శన కనబరిచిన హర్జాస్ సింగ్ ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లో 55 పరుగులు చేశాడు. అయితే ఈ ఆసీస్ వరల్డ్‌కప్ హీరో భారత భారత మూలాలు కలిగిన క్రికెటర్ కావడం గమనార్హం. హర్జాస్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్ లోని చండీగడ్. హర్జాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. అయితే వారిద్దరూ హర్జాస్ పుట్టడానికి ఐదేళ్ల ముందే సిడ్నీకి వలసవెళ్లారు. అక్కడే హర్జాస్ 2005లో జన్మించాడు. 19 ఏళ్ల హర్జాస్ చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో హర్జాస్ సింగ్ తన ఎనిమిదేళ్ల వయస్సులో సిడ్నీలోని రెవ్స్బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాగా హర్జాస్ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా అంటే ఎంతో ఇష్టం. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ వైపు హర్జాస్ అడుగులు వేశాడు. అయితే హర్జాజ్ చివరగా 2015లో భారత్‌కు వచ్చాడు. అయితే -
కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్‌దే వరల్డ్‌కప్
అచ్చు సీనియర్లలాగే... జూనియర్లూ సమర్పించుకున్నారు. ఆఖరి పోరు దాకా అజేయంగా నిలిచిన యువ భారత్ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్ చేరింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలోనే కంగుతింది. ఇక్కడా భారత జూనియర్ జట్టు ఫైనల్ చేరే క్రమంలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన తుది పోరులో ఆ్రస్టేలియా జట్టు చేతిలోనే ఓటమి చవిచూసింది. వెరసి మూడు నెలల వ్యవధిలో ఆ్రస్టేలియా సీనియర్, జూనియర్ జట్లు వన్డే ప్రపంచకప్ టైటిల్స్‌ను హాట్ ఫేవరెట్ అయిన భారత్‌పైనే గెలవడం పెద్ద విశేషం. బెనోని (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ కోసం ప్రతీ మ్యాచ్‌లో చిందించిన చెమటంతా ఫైనల్‌కు వచ్చేసరికి ఆవిరైంది. యువ భారత్ జైత్రయాత్ర కప్ అందుకోవాల్సిన మ్యాచ్‌లో పేలవంగా ముగిసింది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 79 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. మొదట ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జస్ సింగ్ (55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ హ్యూగ్ వీగెన్ (48; 5 ఫోర్లు) రాణించారు. సీమర్లు రాజ్ లింబాని 3, నమన్ తివారి 2 వికెట్లు తీశారు. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (77 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ (46 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బియర్డ్‌మన్ (3/15) కోలుకోలేని దెబ్బ తీయగా, రాఫ్ మెక్‌మిలన్ (3/43) ఇంకెవరినీ క్రీజులో నిలువనీయలేదు. చక్కగా కట్టడి చేసినప్పటికీ... టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా బ్యాటర్లెవరూ భారీ స్కోర్లు చేయకుండా భారత బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. హర్జస్ అర్ధసెంచరీ సాధించగా, వీగెన్, డిక్సన్ (56 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ఒలీవర్ (43 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అర్ధశతకాల వరకు రానివ్వలేదు. లింబాని, నమన్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అందువల్లే పెద్దస్కోరైతే నమోదు కాలేదు. రాణించిన ఆదర్శ్, అభిషేక్ కష్టమైన లక్ష్యం కాదు... ఈ మెగా ఈవెంట్లో మన కుర్రాళ్ల ఫామ్ ముందు ఛేదించే లక్ష్యమే! పెద్దగా కష్టపడకుండా ఏ ఇద్దరు ఫిఫ్టీలు బాదినా... ఇంకో ఇద్దరు 30 పైచిలుకు పరుగులు చేసినా చాలు గెలవాల్సిన మ్యాచ్ ఇది! కానీ టాపార్డర్‌లో అర్షిన్ (3), ముషీర్ ఖాన్ (22), మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్లు కెప్టెన్ ఉదయ్ సహారణ్ (8), సచిన్ దాస్ (8)ల వికెట్లను పారేసుకోవడంతో 68/4 స్కోరు వద్దే భారత్ పరాజయం ఖాయమైంది. ఎందుకంటే తర్వాత వచ్చిన వారెవరూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడలేనివారే! ఆదర్శ్, అభిషేక్‌ల పోరాటం అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. 1 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై నెగ్గడం ఆస్ట్రేలియాకిదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్‌లోనూ తలపడగా రెండుసార్లూ భారత జట్టే గెలిచింది. 4 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించిన నాలుగో జట్టు ఆ్రస్టేలియా. గతంలో పాకిస్తాన్ (2006), వెస్టిండీస్ (2016), బంగ్లాదేశ్ (2020) ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచాయి. 4 అండర్–19 ప్రపంచకప్ సాధించడం ఆ్రస్టేలియాకిది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది. 2012 భారత అండర్–19 జట్టుపై 2012 తర్వాత ఆస్ట్రేలియా యువ జట్టు మళ్లీ గెలుపొందడం విశేషం. గత 12 ఏళ్లలో ఆ్రస్టేలియా జూనియర్ జట్టుతో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: డిక్సన్ (సి) అభిషేక్ (బి) తివారి 42; కొన్‌స్టాస్ (బి) లింబాని 0; వీగెన్ (సి) ముషీర్ (బి) తివారి 48; హర్జస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌమీ పాండే 55; హిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 20; ఒలీవర్ (నాటౌట్) 46; మెక్‌మిలన్ (సి అండ్ బి) ముషీర్ 2; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 13; స్ట్రేకర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–16, 2–94, 3–99, 4–165, 5–181, 6–187, 7–221. బౌలింగ్: రాజ్ లింబాని 10–0–38–3, నమన్ తివారి 9–0–63–2, సౌమీ పాండే 10–0–41–1, ముషీర్ 9–0–46–1, అభి షేక్ 10–0–37–0, ప్రియాన్షు 2–0–17–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) హిక్స్ (బి) బియర్డ్‌మన్ 47; అర్షిన్ (సి) హిక్స్ (బి) విడ్లెర్ 3; ముషీర్ (బి) బియర్డ్‌మన్ 22; ఉదయ్ (సి) వీగెన్ (బి) బియర్డ్‌మన్ 8; సచిన్ (సి) హిక్స్ (బి) మెక్‌మిలన్ 9; ప్రియాన్షు (సి) విడ్లెర్ (బి) అండర్సన్ 9; అవనీశ్ రావు (సి అండ్ బి) మెక్‌మిలన్ 0; అభిషేక్ (సి) వీగెన్ (బి) విడ్లెర్ 42; లింబాని (బి) మెక్‌మిలన్ 0; నమన్ (నాటౌట్) 14; సౌమీ (సి) హిక్స్ (బి) స్ట్రేకర్ 2; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.5 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–3, 2–40, 3–55, 4–68, 5–90, 6–91, 7–115, 8–122, 9–168, 10–174. బౌలింగ్: విడ్లెర్ 10–2–35–2, అండర్సన్ 9–0–42–1, స్ట్రేకర్ 7.5–1–32–1, బియర్డ్ మన్ 7–2–15–3, మెక్‌మిలన్ 10–0–43–3. -
వరల్డ్‌కప్ ఫైనల్లో బోల్తా పడ్డ భారత్.. నాలుగో సారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్‌మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 168 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కల్లమ్ ముల్దర్ బౌలింగ్‌లో మురుగన్ అశ్విన్ (42) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. 122 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మెక్‌మిలన్ బౌలింగ్‌లో రాజ్ లింబాని (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 115 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. బియర్డ్మ్యాన్ బౌలింగ్‌లో ఆదర్శ్ సింగ్ (47) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 139 పరుగులు చేయాలి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ డౌన్ 91 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్ రాఫ్ మెక్‌మిలన్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో భారత్ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఆండర్సన్ బౌలింగ్‌లో ప్రియాంశు మోలియా (9) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 164 పరుగులు చేయాలి. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ్ సింగ్ (32), అవీనశ్ రావు క్రీజ్‌లో ఉన్నారు. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఛేదనలో యంగ్ ఇండియా 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ త్రయం ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సహా అర్శిన్ కులకర్ణి ఔట్ కాగా.. ఆదర్శ్ సింగ్ (31), ప్రియాంశు మోలియా (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో మరో 170 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్ 40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బియర్డ్మెన్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ (12), ఉదయ్ సహారన్ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 213 పరుగులు చేయాలి. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ జట్టు 3 పరుగులకే వికెట్ కోల్పోయింది. కల్లమ్ విడ్లెర్ బౌలింగ్‌లో ర్యాన్ హిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ కులకర్ణి (3) ఔటయ్యాడు. ఆదర్శ్ సింగ్‌కు జతగా ముషీర్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో రాఫ్ మెక్‌మిలన్ (2) ఔట్ అయ్యాడు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/6గా ఉంది. ఒలివర్ పీక్ (10), చార్లీ ఆండర్సన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌమీ పాండే బౌలింగ్‌లో హర్జస్ సింగ్ (55) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 38 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 181/5గా ఉంది. ఒలివర్ పీక్ (6), రాఫ్ మెక్‌మిలన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబాని బౌలింగ్‌లో ర్యాన్ హెండ్రిక్స్ (20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 35 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 167/గా ఉంది. ఒలివర్ పీక్ (1), హర్జస్ సింగ్ (46) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. నమన్ తివారి బౌలింగ్‌లో మురుగన్ అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి హ్యారీ డిక్సన్ (42) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 100/3గా ఉంది. ర్యాన్ హిక్స్ (1), హర్జస్ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 94 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. నమర్ తివారి బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ క్యాచ్ పట్టడంతో హగ్ వెబ్జెన్ (48) ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 94/2గా ఉంది. హ్యారీ డిక్సన్ (39), హర్జస్ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 49/1 12 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(244), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(14), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ రాజ్ లింబానీ బౌలింగ్‌లో సామ్ కాన్స్టాస్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డిక్సాన్(15), సామ్ కాన్స్టాస్(0) పరుగులతో ఉన్నారు. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది. తుది జట్లు: ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్ భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్‌కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే -
టీమిండియా కెప్టెన్ ఒక సంచలనం.. రింకూ సింగ్‌లానే: అశ్విన్
అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరుకు యువ భారత్ సిద్దమైంది. ఆదివారం బెనోని వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆరోసారి ప్రపంచప్ టైటిల్‌ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. ఆసీస్ కూడా నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత అసాధారణ ఫామ్‌లో ఉంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. ముఖ్యంగా కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ పరంగా సత్తాచాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ సహారన్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో సహారాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అశ్విన్ కొనియాడు. ప్రోటీస్ సెమీఫైనల్లో ఉదయ్ 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. "ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఉదయ్ సహారాన్ కెప్టెన్సీకి కొత్త అర్ధాన్ని చెప్పాడు. తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టును కూడా అద్బుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు జూనియర్ వరల్డ్‌కప్‌లో చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఉదయ్ చేసిన పరుగులు చూసి నేను ఇదింతా చెప్పడం లేదు. అతడి మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టకుంది. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అదే కూల్‌నెస్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడు. ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాడు అతడిని చూస్తుంటే మరో రింకూ సింగ్లా కన్పిస్తున్నాడు. రింకూ కూడా అంతే చాలా కూల్‌గా ఉంటాడు. ఉదయ్ బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ మనదే అన్నట్లు అన్పిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. Final Ready 🙌 The two captains are all set for the #U19WorldCup Final 👌👌#TeamIndia | #BoysInBlue | #INDvAUS pic.twitter.com/9I4rsYdRGZ — BCCI (@BCCI) February 10, 2024 -
ఆరో ప్రపంచకప్ వేటలో భారత్.. ఫైనల్లో ఆసీస్‌తో ఢీ
బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆరో ప్రపంచకప్ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్‌లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించిన భారత్‌కు ఫైనల్ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ ఐదుసార్లు ఫైనల్ చేరింది. పాక్ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్‌కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్‌లో మాత్రం రెండు సార్లు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్ ఆల్‌రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఉదయ్ సహరణ్ (389 పరుగులు), ముషీర్ ఖాన్ (338), సచిన్ దాస్ (294) సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్ తరఫున ఓపెనర్ హ్యారీ డిక్సన్ (267 పరుగులు), కెప్టెన్ హ్యూగ్ వేగన్ (256) రాణించారు. బౌలింగ్‌లో కలమ్ విడ్లెర్ (12 వికెట్లు), టాస్ స్ట్రేకర్ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు. విజయాల పరంగా కూడా ఆసీస్... భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్‌లో విండీస్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. -
'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు'
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్ చేరడంలో స్పిన్నర్ సౌమీ పాండేది కీలక పాత్ర. ఈ టోర్నీ ఆసాంతం 19 ఏళ్ల సౌమీ పాండే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పాండే 17 వికెట్లు పడగొట్టి.. మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్లో సౌమీ మరో మూడు వికెట్లు పడగొడితే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అయితే ప్రతీమ్యాచ్‌లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సౌమీ పాండేను కొంతమంది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పోలుస్తున్నారు. భారత క్రికెట్‌కు మరో జడేజా దొరికేశాడని, జూనియర్ జడ్డూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన సౌమీ పాండే తండ్రి కృష్ణ కుమార్ పాండే స్పందించాడు. దయ చేసి తన కొడుకును జడేజాతో పోల్చవద్దని కృష్ణ కుమార్ విజ్ఞప్తి చేశాడు. జడేజాతో పోల్చవద్దు.. "కొంతమంది అభిమానులు సౌమీ పాండేను రవీంద్ర జడేతో పోలుస్తున్నారు. అయితే నా కొడుకును జడేజాతో పోల్చడం సరికాదు. సౌమీ ఇంకా నేర్చుకునే స్ధాయిలో ఉన్నాడు. జడేజా ఇప్పటికే తన పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. అతడు తన కెరీర్లో అత్యుత్తమ స్ధాయిలో ఉన్నాడు. అతడు ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. జడ్డూ ఈ స్ధాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. భారత్‌కు అతడు ఎన్నో అద్బుత విజయాలను అందిచాడు. సౌమీ ఇంకా మొదటి మెట్టు వద్దే ఉన్నాడు. దయచేసి ఇకనైనా సౌమీని జడేజాతో పోల్చవద్దు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ కుమార్ పేర్కొన్నాడు. చదవండి: ILT 20: నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్ -
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన ఆసీస్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అంతకముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్.. 9వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా? కాగా గత ఏడాదికాలంలో ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడో సారి. గత రెండు ఈవెంట్ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్‌కప్ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది.. భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత జట్టు అయినా ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి. కంగారులపై మనదే పై చేయి.. ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో మాత్రం కంగారులపై టీమిండియాదే పై చేయి. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడో సారి. 2003 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్- టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్ వ్యవహరించగా.. భారత జట్టును సౌరవ్ గంగూలీ ముందుకు నడిపించాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్‌ను ఆసీస్ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీల్లో మాత్రం భారత్ జూలు విధిల్చింది. అనంతరం మళ్లీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్- భారత్ అమీతుమీ తెల్చుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టును ఆసీస్‌ను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. అదే విధంగా 2018 వరల్డ్‌కప్ తుదిపోరులోనూ యువ భారత్ మట్టికరిపించింది. ఈ సారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అద్భుత ఫామ్‌లో భారత్.. కాగా ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే ఆసీస్‌ను ఓడించి మరోసారి టైటిల్‌ను ఎగరేసుకోపోయేలా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్ చేరింది. భారత కెప్టెన్ ఉదయ్ సహారాన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ వంటి యువ సంచలనాలు అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిశిచ్చే అంశం. మరోవైపు బౌలర్లలో రాజ్ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్ అంటే ఆసీస్‌కు పూనకాలే. పరిస్థితులు ఎలా ఉన్న ఆఖరి వరకు పోరాడడమే ఆసీస్ ప్రధాన అస్త్రం. 17 runs for 10th Wicket Partnership! 𝗔𝘂𝘀𝘁𝗿𝗮𝗹𝗶𝗮 in to U19WC finals 💥 U19WC Finals 1988 - PAK vs AUS 1998 - NZ vs ENG 2000 - SL vs IND 2002 - SA vs AUS 2004 - PAK vs WI 2006 - PAK vs IND 2008 - IND vs SA 2010 - AUS vs PAK 2012 - AUS vs IND 2014 - PAK vs SA 2016 - WI… pic.twitter.com/gDjUfyJEnx — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 8, 2024 -
ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్లో ఆసీస్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్‌పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్‌ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది. జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్‌మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్ దాస్?
సచిన్ దాస్.. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ఈ యువ ఆటగాడిది కీలక పాత్ర. క్రికెట్ గాడ్ పేరు పెట్టుకున్న ఈ యువ సంచలనం.. అందుకు తగ్గట్టుగానే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో సచిన్ తనకు కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో జతకట్టిన సచిన్.. తన విరోచిత పోరాటంతో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్‌పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దాస్.. తన సంచలన ఇన్నింగ్స్‌తో మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న సచిన్ 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరీ సచిన్ దాస్ అని నెటిజన్లు అరాతీసున్నారు. ఎవరీ సచిన్ దాస్? సచిన్ దాస్.. 2005 ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. సచిన్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నాలుగున్నర ఏళ్ల వయస్సు నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కానీ అతడు ఉన్న చోట క్రికెట్ ఆడేందుకు అత్యుత్తమ సౌకర్యాలు లేవు. అతడు ప్రాక్టీస్ చేయడానికి పూర్తి స్ధాయి క్రికెట్ పిచ్‌లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దాస్ హాఫ్ టర్ఫ్లపైనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. సచిన్ తన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందిలు ఎదుర్కొన్నప్పటికీ తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. నిరంతరం శ్రమ, పట్టుదలతో భారత జెర్సీ ధరించే స్ధాయికి చేరుకున్నాడు. అయితే సచిన్ భారత్ అండర్-19 క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల కూడా కీలక పాత్ర. సచిన్ తండ్రి పేరు సంజయ్ దాస్. అతడు మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. సంజయ్ దాస్‌కు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువే. యూనివర్సిటీ స్థాయి వరకు అతడు క్రికెట్ ఆడాడు. కానీ అతడు అంతకంటే ముందుకు వెళ్లలేదు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకు తనయడు జన్మించిన వెంటనే ఎలాగైనా క్రికెటర్ చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు సచిన్ తల్లిపేరు సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోచ్ కూడా.. అదే విధంగా సచిన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో కోచ్ షేక్ అజార్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. సచిన్‌కు పేస్ బౌలర్లకు ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతూ వస్తుండేవాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో సచిన్.. కోచ్ షేక్ అజార్ సాయంతో తన సమస్యను అధిగమించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి సంజయ్ దాస్ తెలిపాడు. సచిన్ దాస్ పేరు ఎలా వచ్చిందంటే? సచిన్ దాస్ తండ్రి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమాని. అయితే తన ఆరాధ్య క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల సచిన్ దాస్ కూడా టెండూల్కర్‌కు వీరాభిమాని. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వరల్డ్‌కప్‌లో వేసుకుంటున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన సచిన్ దాస్.. 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు. -
శ్రమించి... ఛేదించి...
ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్ ఉదయ్ సహారణ్కు జతయిన సచిన్ దాస్ ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్ పోరుకు అర్హత పొందింది. బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్–19 ప్రపంచకప్‌లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు సెమీస్‌లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిచర్డ్ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రాజ్ లింబాని 3; ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉదయ్ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. సీన్ మార్చిన సచిన్ జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్ సింగ్ (0), కాసేపటికే ముషీర్ ఖాన్ (4), అర్షిన్ (12), ప్రియాన్షు (5) పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఉదయ్‌కి సచిన్ దాస్ జతయ్యాడు. కెప్టెన్ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్ దాస్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు. అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావు (10), అభిషేక్ మురుగన్ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్, 1 ఫోర్) జట్టును విజయ తీరానికి చేర్చాడు. గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) అభిõÙక్ (బి) ముషీర్ 76; స్టీవ్ స్టోల్క్ (సి) అవనీశ్ (బి) రాజ్ 14; టీగెర్ (బి) రాజ్ 0; రిచర్డ్ (సి) మొయిలా (బి) నమన్ 64; ఒలీవర్ (సి) సచిన్ (బి) ముషీర్ 22; మరయిస్ (సి) అభిషేక్ (బి) సౌమీ పాండే 3; జేమ్స్ (సి) అవనీశ్ (బి) రాజ్ 24; నార్టన్ నాటౌట్ 7; ట్రిస్టన్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్: రాజ్ లింబాని 9–0–60–3, నమన్ తివారి 8–0–52–1, అభిõÙక్ మురుగన్ 4–0–14–0, అర్షిన్ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) ప్రిటోరియస్ (బి) మఫక 0; అర్షిన్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 12; ముషీర్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 4; ఉదయ్ (రనౌట్) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్ (బి) ట్రిస్టన్ 5; సచిన్ (సి) టీగెర్ (బి) మఫక 96; అవనీశ్ (సి) నార్టన్ (బి) మఫక 10; అభిషేక్ (రనౌట్) 0; రాజ్ (నాటౌట్) 13; నమన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్: మఫక 10–0–32–3, ట్రిస్టన్ 10–1–37–3, నార్టన్ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్ 2–0–18–0, జేమ్స్ 8–0–44–0, వైట్‌హెడ్ 2–0–17–0. -
దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్ పోరు..
అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్–19 ప్రపంచకప్‌ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరిన భారత్... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని యువ జట్టు ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఉంది. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్‌లో సఫారీ జట్టును భారత్ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్‌కు ముందు యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌమీ కుమార్ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్ పోరును స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్.. 214 పరుగుల తేడాతో ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీ సూపర్ సిక్స్ దశను విజయంతో ఆరంభించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత విజయంలో ముషీర్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 ముషీర్ పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్‌తో పాటు ఓపెనర్ ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. 4 వికెట్లతో చెలరేగిన సౌమ్య పాండే.. 296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమ్య పాండే 4 వికెట్లతో బ్లాక్‌క్యాప్స్ పతనాన్ని శాసించగా.. రాజ్ లింబానీ, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జాక్సన్(19) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
వరల్డ్ కప్‌లో చెలరేగిన భారత బ్యాటర్లు.. 326 పరుగుల భారీ స్కోర్
అండర్-19 వరల్డ్‌కప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో కులకర్ణి 108 పరుగులు చేశాడు. అతడితో పాటు ముషీర్ ఖాన్(73), కెప్టెన్ ఉదయ్ సహారన్(35) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో సుబ్రమణ్యన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరిన్, ఆర్యా గార్గ్, రిషి రమేష్ తలా వికెట్ సాధించారు. అనంతరం 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ 8 ఓవర్లలో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు తివారీ రెండు వికెట్లు పడగొట్టగా.. రాజ్ లింబానీ ఒక్క వికెట్ సాధించారు. -
నేడు అమెరికాతో యువ భారత్ ‘ఢీ’
అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ఉదయ్ సహారణ్ నాయకత్వంలోని టీమిండియా నేడు గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో అమెరికా జట్టుతో తలపడనుంది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, ఐర్లాండ్‌పై గెలిచి ‘సూపర్ సిక్స్’ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించాలని పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం గం. 1:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
న్యూజిలాండ్‌కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
అండర్-19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని పాక్ అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఈస్ట్ లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 25.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పాక్ ఓపెనర్లు షాజైబ్ ఖాన్(80 నాటౌట్), షమీల్ హుస్సేన్(54నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. పాక్ బౌలర్ల దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఉబైద్ షా, ఆరాఫాట్ మిన్హాష్ తలా 3 వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు నవీద్ రెండు,అలీ, జీషన్ ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ గ్రూపు-డి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. చదవండి: IND vs ENG: సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు -
వరల్డ్‌కప్‌లో సెంచరీ.. గిల్ సెలబ్రేషన్స్ కాపీ కొట్టిన కివీస్ క్రికెటర్
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్-2024ను న్యూజిలాండ్ ఆటగాడు స్నేహిత్ రెడ్డి ఘనంగా ఆరంభించాడు. ఈస్ట్ లండన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. స్నేహిత్ తెలుగు సంతతికి చెందిన క్రికెటరే కావడం విశేషం. 17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. ఇక సెంచరీతో చెలరేగిన స్నేహిత్ రెడ్డి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్నేహిత్ మాట్లాడుతూ.. టీమిండియా ప్రిన్స్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. శుబ్‌మన్ గిల్ తనను ఎంతగానే ప్రభావితం చేశాడని స్నేహిత్ తెలిపాడు. అంతేకాకుండా గిల్ బోడౌన్ సెంచరీ సెలబ్రేషన్స్ స్టైల్‌ను స్నేహిత్ రెడ్డి అనుకరించాడు. "తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్. ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేశాను. కాగా ఈ మ్యాచ్‌కు ముందే మా సెంచరీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. నేను అయితే శుబ్‌మన్ గిల్ 'బౌడౌన్' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని చెప్పాను. ఎందుకంటే నా అభిమాన క్రికెటర్లలో శుబ్‌మన్ ఒకడు. అతడు బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టం. అతడి షాట్ సెలక్షన్ కూడా అద్బుతం. గిల్ బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్నేహిత్ రెడ్డి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 64 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! ❤️ A moment shared with family 🫶 Enjoying the occasion ✨ Shubman Gill's influence New Zealand's Snehith Reddy reflects on his #U19WorldCup century 💯 pic.twitter.com/szYB81B0yi — ICC (@ICC) January 22, 2024 -
‘బుమ్రా గొప్పొడే కానీ...’
సొంత గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ స్పీడ్‌స్టర్ క్వేనా మఫాకా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మఫాకా 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 17 ఏళ్ల మఫాకాకు వరించింది. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మఫాకా మాట్లాడుతూ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మఫాకా వికెట్ పడగొట్టిన ప్రతీసారి బుమ్రా స్టైల్లోనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. వికెట్ తీసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలో ప్రపంచ కప్‌కు ముందు నా సోదరుడిని అడిగాను. అతడు నాకు తెలియదు అని సమాధనమిచ్చాడు. అందుకు బదులుగా వెంటనే నేను 'ఐ డోంట్ నో' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని నవ్వుతూ అన్నాను. అందుకే బుమ్రా సెలబ్రేషన్స్‌ను అనుకరించాలని నిర్ణయించుకున్నాను. బమ్రా కూడా వికెట్ పడగొట్టిన పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అయితే బుమ్రా కంటే నేను బెటర్ అనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! -
గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్
అండర్ 19 వరల్డ్‌కప్-2024ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా మాజీ విజేత బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన గ్రూప్ 'ఎ' తొలి లీగ్ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ తన సహానాన్ని కోల్పోయాడు. మైదానంలోనే బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో మాటల యుద్ధానికి సహారాన్ దిగాడు. అంతలోనే మరో బంగ్లా ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలవడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకరికొకరు దగ్గరకు వచ్చి కొట్టుకునేంత పనిచేశారు. అయితే అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్ 25 ఓవర్లో చోటు చేసుకుంది. అయితే సహారాన్ కోపానికి గల కారణమేంటో తెలియలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సహారన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 7.2 ఓవర్లలో కేవలం 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ అర్ధ సెంచరీలతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ యువ జోడీ మూడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదర్శ్ సింగ్(76), ఉదయ్ సహారన్(64) పరుగులు చేశారు. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు pic.twitter.com/fmqCEQ5ipB — Sitaraman (@Sitaraman112971) January 20, 2024 -
వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు
అండర్ 19 వరల్డ్‌కప్- 2024లో భారత్ బోణీ కొట్టింది. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. భారత స్పిన్నర్ల దాటికి 167 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. ముషీర్ ఖాన్ 2 వికెట్లతో సత్తాచాటాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్ష్ సింగ్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఉదయ్ సహ్రన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో మరూప్ మిరందా 5 వికెట్లతో చెలరేగాడు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 25న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. చదవండి: #Mohammed Shami: పెళ్లి కొడుకు గెటప్‌లో షమీ.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? -
ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు టీమిండియా సన్నదమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు యువ భారత జట్టు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ టీమ్స్‌తో ట్రైసిరీస్‌లో తలపడతోంది. ఈ ట్రైసిరీస్ కూడా సఫారీ గడ్డపైనే జరగుతుంది. ఈ ట్రైసిరీస్ టీమిండియా బోణీ కొట్టింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 198 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమీ పాండే 6 వికెట్లతో చెలరేగాడు. సౌమీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి అఫ్గానిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే 6 వికెట్లు సాధించాడు. కాగా ఈ నెల 16న జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా సౌమీ భాగమయ్యాడు. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ సోహిల్ ఖాన్(71) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హసన్ ఈసాఖిల్(54) పరుగులతో రాణించాడు. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్(112) సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 2న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: IND vs SA 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్‌ను అండర్-19 వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
Under-19 Womens T20 World Cup 2023: ఫైనల్ సమరానికి సిద్ధం
పొచెఫ్‌స్ట్రూమ్: మహిళల క్రికెట్లో ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత జట్టు ఆ ఘనతకు అడుగు దూరంలో ఉంది. సీనియర్ అమ్మాయిల జట్టు మూడు ప్రపంచకప్ (రెండు వన్డే, ఒకటి టి20) ఫైనల్లో ఆడినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ జూనియర్ జట్టు ఫైనల్ విజయంతో వస్తే... భారత మహిళల క్రికెట్ ప్రగతి మరో దశకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. శనివారమే పుట్టినరోజు జరుపుకున్న షఫాలీకి వున్న అంతర్జాతీయ అనుభవం, జట్టు ఈ టోర్నీలో కనబరిచిన ప్రదర్శనను బట్టి చూస్తే భారతే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. పైగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన షఫాలీ తన నైపుణ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చితే ఆమె ఖాతాలో అరుదైన రికార్డు చేరుతుంది. సెమీఫైనల్లో షఫాలీ సేన న్యూజిలాండ్‌పై అలవోక విజయం సాధించింది. మొదట బౌలర్లు, తర్వాత బ్యాటర్లు కివీస్ అమ్మాయిలపై ఆధిపత్యం చలాయించారు. ఫైనల్లోనూ ఇదే పట్టుదల కనబరిస్తే ప్రపంచకప్ చేతికందుతుంది. మరో వైపు సెమీస్‌లో హోరాహోరీ సమరంలో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించడంతో ఇంగ్లండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత జట్టుకు తగిన పోటీ ఇవ్వగల సత్తా ఇంగ్లండ్‌కు ఉంది. నేడు హాకీ ప్రపంచకప్ ఫైనల్ ► జర్మనీ X బెల్జియం ► రా.గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ► సా.గం.5.15 నుంచి ‘ఫ్యాన్‌కోడ్’ యాప్‌లో ప్రసారం -
మహిళల టి20 వరల్డ్‌కప్: కివీస్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023