PC: INDIA Tv.com
అండర్ 19 వరల్డ్‌కప్-2024ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా మాజీ విజేత బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన గ్రూప్ 'ఎ' తొలి లీగ్ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ తన సహానాన్ని కోల్పోయాడు. మైదానంలోనే బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో మాటల యుద్ధానికి సహారాన్ దిగాడు.
అంతలోనే మరో బంగ్లా ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలవడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకరికొకరు దగ్గరకు వచ్చి కొట్టుకునేంత పనిచేశారు. అయితే అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ సంఘటన భారత ఇన్నింగ్స్ 25 ఓవర్‌లో చోటు చేసుకుంది. అయితే సహారాన్ కోపానికి గల కారణమేంటో తెలియలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సహారన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 7.2 ఓవర్లలో కేవలం 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ అర్ధ సెంచరీలతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ యువ జోడీ మూడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదర్శ్ సింగ్(76), ఉదయ్ సహారన్(64) పరుగులు చేశారు.
చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు
— Sitaraman (@Sitaraman112971) January 20, 2024
Comments
Please login to add a commentAdd a comment