
అండర్-19 వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌కు నమీబియా క్రికెట్ బోర్డు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ ఎంపికయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ నమీబియా అండర్-19 కెప్టెన్‌గా ఎలా ఎంపికయ్యాడని ఆలోచిస్తున్నారా? అయితే మీరు అనుకుంటున్నట్లు ఆ డుప్లెసిస్ .. ఈ డుప్లెసిస్ ఒకరు కాదు. ఒకే పేరుతో ఉన్నప్పటికి ఈ ఇద్దరు క్రికెటర్లు వేర్వేరు.
17 ఏళ్ల డుప్లెసిస్ దేశవాళీ టోర్నీల్లో మెరుగ్గా రాణించి నమీబియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ మాదిరిగానే ఈ ఫాఫ్ డుప్లెసిస్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటరే కావడం గమనార్హం. ఈ డుప్లెసిస్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక సీనియర్ డుప్లెసిస్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్దమవుతున్నాడు.
ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిసిన డుప్లెసిస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 24న వైజాగ్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది.

వరల్డ్‌కప్‌లో ఆడడమే లక్ష్యంగా..
కాగా జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఆడేందుకు నమీబియాకు ఇదొక సువర్ణ అవకాశం. నైజీరియాలోని లాగోస్‌లో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో సత్తాచాటి ఈ మెగా టోర్నీకి ఆర్హత సాధించాలని ఈ ఆఫ్రికా జట్టు పట్టుదలతో ఉంది. డివిజన్ 1 క్వాలిఫైయర్‌లలో సియెర్రా లియోన్, టాంజానియా, కెన్యా, నైజీరియా, ఉగాండా వంటి జట్లతో నమీబియా తలపడనుంది. మార్చి 28 నుంచి డివిజన్ 1 క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ రౌండ్‌లో గెలిచిన జట్టు నేరుగా 2026 అండర్-19 ఆఫ్రికా ఉపఖండం తరపున ప్రపంచకప్‌కు ఆర్హత సాధిస్తారు.
నమీబియా జట్టు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అడ్రియన్ కోయెట్జీ, బెన్ బ్రాసెల్, డాన్ బ్రాసెల్, ఎరిక్ లింట్‌వెల్ట్, హెన్రీ గ్రాంట్, జాంకో ఎంగెల్‌బ్రెచ్ట్, జునియన్ తనయాండా, లియామ్ బెసన్, లుకా మైకెలో, మాక్స్ హెంగో, రోవాన్ వాన్ వురెన్, టియాన్ వాన్ డెర్ మెర్వే, వాల్డో స్మిత్.
చదవండి: IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. అఫీషియల్ అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment