
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమిస్తున్నట్లు ఇవాళ (మార్చి 17) వెల్లడించింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్‌ను ఢిల్లీ ఈ సీజన్ మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఢిల్లీ ఫాఫ్‌ను బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది.
కొద్ది రోజుల కిందటే ఢిల్లీ యాజమాన్యం తమ నూతన కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. ఈ సీజన్‌లో ఫాఫ్ అక్షర్‌కు డిప్యూటీగా పని చేస్తాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా, సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఫాఫ్‌కు మంచి అనుభవం ఉంది. ఫాఫ్ కెప్టెన్సీ అనుభవం ఈ సీజన్‌లో అక్షర్ పటేల్‌కు చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తుంది.
ఫాఫ్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఫాఫ్ తన ఐపీఎల్ కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడి 136.37 స్ట్రయిక్‌రేట్‌తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ ఈ సీజన్‌లో ఢిల్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్ యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌తో ఫాఫ్ జోడీ కట్టవచ్చు.
కాగా, ఢిల్లీ మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించకముందు ఈ సీజన్‌లోనే తమతో చేరిన కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఆఫర్‌ను రాహుల్ తిరస్కరించాడని సమాచారం. రాహుల్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సీజన్‌లో రాహుల్, డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ కూడా ఢిల్లీతో జతకట్టాడు.
ఈ సీజన్ మెగా వేలంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్ స్టార్క్‌కు మంచి ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను ఈ సీజన్‌లో లక్నో రికార్డు ధరకు (రూ.27 కోట్లు) సొంతం చేసుకుంది. పంత్ లక్నో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం.. మే 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో మొదలవుతుంది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..
అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్
Comments
Please login to add a commentAdd a comment