Axar Patel
-
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్‌కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
శివాలెత్తిన అక్షర్ పటేల్.. ఒకే ఓవర్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో అక్షర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విద్యాధర్ అనే వ్యక్తి బౌలింగ్‌లో అక్షర్ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్ విజృంభించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్ చేసింది. AXAR PATEL SMASHED 6,2,6,4,0,6 - 24 RUNS IN THE FINAL OVER. 🤯 pic.twitter.com/lTV3Of4CLV— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024ఓపెనర్ ఆర్య దేశాయ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్, ఈ సీజన్లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ దేశాయ్ 32 బంతుల్లో 47.. హేమంగ్ పటేల్ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్ పాటిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్ రవిచంద్రన్ (49), మయాంక్ అగర్వాల్ (45), మనీశ్ పాండే (30), కృష్ణణ్ శ్రీజిత్ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నగస్వల్లా చెరో 2, చింతన్ గజా, విశాల్ జేస్వాల్, ఆర్య దేశాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
సౌతాఫ్రికాతో టీ20లు.. తిలక్ రీ ఎంట్రీ.. ఆర్సీబీ స్టార్ అరంగేట్రం!
టీమిండియా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన విజయాలు సాధించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్లతోనే శ్రీలంక పర్యటనలో పొట్టి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై 3-0తో వైట్‌వాష్ చేసి సత్తా చాటాడు.సఫారీ పిచ్‌లపై అంత ఈజీ కాదుఅయితే, సౌతాఫ్రికా టూర్ రూపంలో సూర్యకు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను క్లీన్‌స్వీప్ చేసినంత సులువుగా సౌతాఫ్రికాను పడగొట్టడం సాధ్యం కాదు. సొంత పిచ్‌లపై చెలరేగే సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదే.పైగా టీ20 ప్రపంచకప్-2024లో స్వల్ప తేడాతో టీమిండియా చేతిలో ఓడి తొలి టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది సౌతాఫ్రికా. అందుకు ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అలాంటపుడు యువ జట్టుతో ప్రొటిస్ టీమ్‌ను ఎదుర్కోవడం సూర్యకు బిగ్ చాలెంజ్ అనడంలో సందేహం లేదు.తిలక్ వర్మ పునరాగమనం ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే జట్టులో లేరు. వీరిలో నితీశ్, సుందర్ ఆస్ట్రేలియా పర్యటనతో బిజీ కానున్నారు. ఈ క్రమంలో 11 నెలల తర్వాత హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ పునరాగమనం ఖాయం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ అరంగేట్రం కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.ఈసారి ఛాన్స్ పక్కా ఈ ఇద్దరితో పాటు.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్షర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టులు ఆడిన జట్లలో సభ్యుడే. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే, సౌతాఫ్రికా సిరీస్‌లో అక్షర్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రొటిస్‌తో తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లను తుదిజట్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యశ్ దయాళ్ ఎంట్రీ ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలి రిటెన్షన్స్‌లో భాగంగా ఆర్సీబీ యశ్‌ను రూ. 5 కోట్లకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.సౌతాఫ్రికాతో తొలి టీ20- భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, ఆవేశ్ ఖాన్.చదవండి: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు..?
న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది. ఆకాశ్‌దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్.. ఘనంగా భార్య సీమంతం (ఫొటోలు)
-
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.తొలి టెస్టులో పూర్తిగా విఫలంసుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్‌మెషీన్‌కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!ఈ నేపథ్యంలో నెట్స్‌లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను ఎదుర్కొన్నాడు.జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లిఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్‌లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్‌ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది. సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్‌లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్‌లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్‌లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్‌కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్‌దీప్, యశ్ దయాల్లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.బంగ్లాతో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్చదవండి: ముమ్మర సాధనలో... -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్‌లో.. రెండో ఇన్నిం గ్స్‌లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్‌లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్‌లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇండియా-డి జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్‌రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్‌దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్‌దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
Duleep Trophy 2024: అక్షర్ ఆల్‌రౌండ్ షో..
సాక్షి, అనంతపురం: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తా చాటాడు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘సి’ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ (118 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. టాపార్డర్ విఫలమైన చోట అక్షర్ ఆదుకోవడంతో భారత్ ‘డి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (9), దేవదత్ పడిక్కల్ (0), యశ్ దూబే (10), అథర్వ (4)తో పాటు ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (13), రికీ భుయ్ (4) ఆకట్టుకోలేకపోయారు.76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్‡్షదీప్ సింగ్ (13)తో తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘సి’ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) విఫలం కాగా... బాబా ఇంద్రజీత్ (15 బ్యాటింగ్), అభి పొరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ ‘సి’ జట్టు... భారత్ ‘డి’ స్కోరుకు 73 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) విజయ్ కుమార్ (బి) అన్షుల్ 4; యశ్ దూబే (సి) పొరెల్ (బి) అన్షుల్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) పొరెల్ (బి) విజయ్ కుమార్ 9; దేవదత్ పడిక్కల్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) విజయ్ కుమార్ 0; రికీ భుయ్ (సి) అన్షుల్ (బి) హిమాన్షు 4; శ్రీకర్ భరత్ (సి) ఇంద్రజీత్ (బి) మానవ్ 13; అక్షర్ పటేల్ (సి) మానవ్ సుతార్ (బి) హృతిక్ షోకీన్ 86; సారాంశ్ జైన్ (రనౌట్) 13; హర్షిత్ రాణా (సి) రజత్ పాటిదార్ (బి) హిమన్షు 0; అర్ష్‌దీప్ సింగ్ (సి) మానవ్ సుతార్ (బి) విజయ్ కుమార్ 13; ఆదిత్య (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–23, 4–23, 5–34, 6–48, 7–76, 8–76, 9–160, 10–164, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 12–0–47–2; విజయ్ కుమార్ వైశాఖ్ 12–3–19–3; హిమాన్షు చౌహాన్ 9–2–22–2; మానవ్ సుతార్ 7–2–34–1; హృతిక్ షోకీన్ 8.3–1–32–1. భారత్ ’సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) అథర్వ (బి) హర్షిత్ రాణా 5; సాయి సుదర్శన్ (సి) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 7; ఆర్యన్ జుయెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 12; రజత్ పాటిదార్ (బి) అక్షర్ పటేల్ 13; బాబా ఇంద్రజీత్ (బ్యాటింగ్) 15; అభిõÙక్ పొరెల్ (బ్యాటింగ్) 32; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: (33 ఓవర్లలో 4 వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1–11, 2–14, 3–40, 4–43, బౌలింగ్: హర్షిత్ రాణా 7–5–13–2; అర్‡్షదీప్ సింగ్ 8–1–24–0; ఆదిత్య 7–1–18–0, అక్షర్ పటేల్ 6–2–16–2; సారాంశ్ జైన్ 5–1–14–0. -
Duleep Trophy 2024: ఆదుకున్న అక్షర్ పటేల్
దులీప్ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇండియా-సితో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. THE SHOW OF AXAR PATEL. 🔥He smashed an excellent fifty when his team was 8 down on just 76 runs - AXAR PATEL, THE CRISIS MAN. 👏pic.twitter.com/ezWupOFTKQ— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..ఇండియా-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్‌కుమార్ వైశాఖ్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ఇండియా-డి: దేవదత్ పడిక్కల్, యష్ దూబే, రికీ భుయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైడే (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరే -
విశ్వ విజేతలకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్.. టీమిండియా గెలుపుకు పునాది వేసిన అక్షర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్‌పై ఈ స్కోర్ ఫైటింగ్ స్కోర్‌గా చెప్పవచ్చు. ఈ స్కోర్‌ను ఛేదించే క్రమంలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. 20 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు (బట్లర్, మొయిన్ అలీ, బెయిర్‌స్టో) తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు.అక్షర్ రెచ్చిపోవడంతో డిఫెన్స్‌లో పడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్‌తో పాటు మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-19-3), బుమ్రా (2.4-0-12-2) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 2022 ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనానికి పునాది వేసిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 WC 2024: సెమీస్‌లో ఇంగ్లండ్ చిత్తు.. ఫైనల్‌కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్‌కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..సెమీస్‌కు టీమిండియా (ఫొటోలు)
-
అక్షర్, బుమ్రాతో నేను కలిసి క్రికెట్ ఆడాను: అమెరికా కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2024లో సంచలన విజయాలు నమోదు చేస్తున్న అమెరికా జట్టు ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా పటిష్టమైన టీమిండియాను అమెరికా ఢీ కొట్టనుంది. పాక్‌పై విజయం సాధించి మంచి ఊపులో ఉన్న ఆతిథ్య అమెరికా.. భారత్‌పై కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియాను అడ్డుకునేందుకు యూఎస్ఎ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది. ఈ క్రమంలో యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్.. భారత ఆటగాళ్లు అక్షర్ పటేల్,జస్ప్రీత్ బుమ్రాతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ తను ఒకే పట్టణం నుంచి వచ్చామని మోనాంక్ పటేల్ తెలిపాడు."అండర్-19, అండర్-15 మ్యాచ్‌ల్లో గుజరాత్ తరపున అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నేను ఒకే గ్రామం నుంచి క్రికెట్ కెరీర్ వైపు అడుగులు వేశాము. అక్షర్ మా ఊరిలో చాలా యువకులకు ఆదర్శంగా నిలిచాడు. అంతేకాకుండా వారికి క్రికెట్ వైపు అడుగులు వేసేందుకు అన్నిరకాలగా అక్షర్ మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు బుమ్రా, అక్షర్ భారత జట్టులో కీలక ఆటగాళ్లగా కొనసాగుతుండటం చాలా సంతోషంగా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫిరెన్స్‌లో మోనాంక్ పటేల్ పేర్కొన్నాడు. కాగా మోనాంక్ పటేల్ భారత సంతతికి చెందిన ఆటగాడు కావడం గమనార్హం.ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్‌లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్..
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు."ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్‌లో మా జట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అతడు గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా చాలా అనుభవం ఉంది. గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవకాశం రావడంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాంటింగ్ పేర్కొన్నాడు. -
వరల్డ్‌కప్ బెర్త్ కోసం ఇద్దరితో పోటీపడుతున్న అక్షర్ పటేల్..!
టీ20 వరల్డ్‌కప్ 2024 జట్ల ప్రకటన కోసం మే 1 డెడ్‌లైన్ కావడంతో అన్ని దేశాల సెలెక్షన్ ప్యానెల్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు కూడా తమ జట్టుకు తుది రూపు తెచ్చేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. టీమిండియా విషయంలో సెలెక్టర్లు ఇదివరకే ఓ అంచనాతో ఉన్నప్పటికీ ఒకట్రెండు బెర్తుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. హార్దిక్ బెర్త్ కన్ఫర్మ్..?ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మధ్య పోటీ ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సెలెక్టర్లు పాండ్యావైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. శివమ్ దూబేకు ఐపీఎల్లో బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడం అతనికి మైనస్ అవుతుంది. దూబే బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నా ఆల్‌రౌండర్ కోటా కాబట్టి సెలెక్టర్లు రెండు విభాగాలను పరిగణలోకి తీసుకుంటారు. హార్దిక్‌కు గత అనుభవం కూడా కలిసొస్తుంది. పంత్ ఫిక్స్.. సంజూ వర్సెస్ రాహుల్రిషబ్ పంత్ టీ20 వరల్డ్‌కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2024లో ప్రదర్శనల ఆధారంగా పంత్ ఎంపిక జరుగనున్నట్లు సమాచారం.సెకెండ్ ఛాయిస్ వికెట్‌కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. రాహుల్వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.అక్షర్ వర్సెస్ ఆవేశ్ వర్సెస్ బిష్ణోయ్బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ బెర్త్‌లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఒక్క బెర్త్ విషయంలో సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు తలలుపట్టుకున్నారు. వరల్డ్‌కప్ వేదికలు స్లో ట్రాక్స్ కావడంతో అక్షర్‌కు మెరుగైన అవకాశాలు ఉండచ్చు. -
తెలివిగా వ్యవహరిస్తున్న హార్దిక్.. పాపం శివం దూబే! నిజంగా నష్టమేనా?
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నాకెందుకో అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ.. క్రికెటింగ్ కోణంలో చూస్తే.. సరికాదనే అనిపిస్తోంది. ఇక్కడ 12 మందితో కాదు 11 మందితోనే ఆడాలి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీమిండియాకు ఇదైతే శుభసూచకం కాదు’’- రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు నేను అనుకూలం కాదు. ఈ నిబంధన వల్ల జట్లు నిఖార్సైన బ్యాటర్లు లేదంటే బౌలర్ల సేవలనే ఉపయోగించుకుంటాయి. ఆల్రౌండర్లను ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి నిబంధనలు రూపొందించే వాళ్లు కేవలం బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తుందని అనుకుంటారేమో(నవ్వులు).. ఈ రూల్ వల్ల బౌలర్లకు తిప్పలు తప్పవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్టులో అదనపు సభ్యుడు చేరతాడు. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉంటే వాళ్లు బ్యాటర్‌ను.. బౌలింగ్ వీక్‌గా ఉంటే బౌలర్‌ను తెచ్చుకుంటారు. అందుకే బ్యాటర్ వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలుపెడతాడు. గత రెండేళ్లుగా గమనిస్తూనే ఉన్నా.. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉంటారు కాబట్టి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తారు’’- అక్షర్ పటేల్, టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. మొన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లకు నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. ఏమిటీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన? ఐపీఎల్-2023కి ముందు నిర్వాహకులు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేయడానికి జట్టులోకి వచ్చే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్. ఈ నిబంధన ప్రకారం ఇండియన్ ప్లేయర్‌ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. టాస్ సమయంలో కెప్టెన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా నలుగురి పేర్లను నామినేట్ చేయాలి. అందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే ఓవర్ పూర్తైన తర్వాత.. లేదంటే వికెట్ పడిన అనంతరం.. లేదా బ్యాటర్ రిటైర్ అయినపుడు కెప్టెన్ తమ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించవచ్చు. ఒక బౌలింగ్ చేస్తున్న జట్టు ఓవర్ మధ్యలోనే(వికెట్ పడ్డా/బ్యాటర్ రిటైర్ అయినా) ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకువస్తే ఆ వ్యక్తిని మిగిలిన ఓవర్ పూర్తయ్యేదాకా బౌలింగ్ చేసేందుకు అనుమతించరు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత.. ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారో.. సదరు ఆటగాడు మిగిలిన మ్యాచ్‌కు దూరమవుతాడు. కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఉండే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ విదేశీ ప్లేయర్‌ని తీసుకుంటే? నిబంధనల ప్రకారం తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. కాబట్టి అప్పటికే జట్టులో నలుగురూ ఉన్నారంటే కచ్చితంగా ఇండియన్ ప్లేయర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చుకోవాలి. అయితే, టాస్ సమయంలోనే నలుగురు సబ్ట్యూట్లలో ఒకరిగా విదేశీ ప్లేయర్‌ను నామినేట్ చేయాలి. జట్టులో ఎంతమంది? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా జట్టులో 11 మంది కంటే ఎక్కువయ్యే అవకాశం లేదు. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్‌నే ఎక్కువగా సబ్ట్యూట్గా ఉపయోగించుకుంటారు. ఒకవేళ బౌలింగ్ టీమ్ గనుక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలర్‌ను తీసుకువస్తే.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. లేదంటే పవర్ ప్లే లేదా డెత్ ఓవర్ల స్పెషలిస్టు సేవలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. శివం దూబేకు నో ఛాన్స్! ముందే సర్దుకున్న హార్దిక్ అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్‌రౌండర్లు నష్టపోతున్నారనేది చర్చ. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెప్పినట్లు బ్యాటింగ్ టీమ్ స్పెషలిస్టు బ్యాటర్‌ను.. బౌలింగ్ టీమ్ స్పెషలిస్టు బౌలర్‌ను తెచ్చుకుంటుంది. ఒకవేళ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఇచ్చినా వాళ్లు ఏదో ఒక సేవకే పరిమితం అవుతారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుంటోంది. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండగా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీకి ముందు ఇలా జరగడం ఒక విధంగా అతడికి నష్టం చేకూరుస్తోంది. ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం హార్దిక్ పాండ్యాతో పోటీ పడుతున్న దూబే.. బౌలింగ్ చేయనట్లయితే సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపరు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాడేమో మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టి తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చూసుకుంటే కష్టమే ఆల్రౌండర్లకు జరుగుతున్న నష్టం గురించి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగానే మారుతుంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఫామ్(బ్యాటింగ్/బౌలింగ్) కోల్పోయిన ఆల్‌రౌండర్‌కు జాతీయ జట్టు తరఫున ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే! -
Ind vs Eng: బ్యాటింగ్‌లో విఫలమైనా.. అద్భుత క్యాచ్‌తో మెరిసి..
India vs England, 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి డైవ్ చేసి మరీ ఒడిసిపట్టి భారత శిబిరంలో నవ్వులు నింపాడు. కాగా హైదరాబాద్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో విఫలం అయితే, ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. 59 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. తద్వారా జట్టుతో పాటు అభిమానులనూ నిరాశపరిచాడు. అయితే, రెండో రోజు ఆటలో భాగంగా శనివారం సూపర్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్‌ను టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. డైవ్ చేసి.. క్యాచ్ పట్టి అతడి బౌలింగ్‌లో రెండో బంతికి ఫోర్ బాదిన ఇంగ్లిష్ ఓపెనర్ జాక్ క్రాలే.. మరుసటి బాల్‌కు కూడా షాట్ ఆడాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరుగెత్తి.. డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దీంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాలే కథ ముగిసింది. రెండో వికెట్ దక్కడంతో టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. ఇక శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘బ్యాటింగ్‌తో కాకపోయినా.. ఫీల్డింగ్‌తోనైనా జట్టులో చోటిచ్చినందుకు కనీస న్యాయం చేస్తున్నావు’’ అంటూ సెటైరికల్‌గా ప్రశంసిస్తున్నారు. చదవండి: Ind vs Eng: పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: గిల్‌కు మాజీ కోచ్ వార్నింగ్ 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄 That was a ripper of a catch! ⚡️ ⚡️ Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @ShreyasIyer15 | @IDFCFIRSTBank pic.twitter.com/JSAHGek6nK — BCCI (@BCCI) February 3, 2024 -
Day 3: భారత బౌలర్లకు 6 వికెట్లు.. పోప్ సెంచరీ.. హైలైట్స్ ఇవే
India vs England 1st Test Day 3 Updates: టీమిండియాతో తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్‌లో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 77 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. మూడో రోజు హైదరాబాద్ టెస్టు ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. ఆరంభంలో టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లండ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ దశలో మ్యాచ్ ఇండియా వైపే మొగ్గు చూపినా.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పోరాడడంతో ఆ జట్టుకు 126 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసే సరికి పోప్ 148, రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 316/6 స్కోరు చేసిన ఇంగ్లండ్ ప్రస్తుతం భారత జట్టు కంటే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ డౌన్.. 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన బెన్ ఫోక్స్‌ను.. అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రెహాన్ ఆహ్మద్ వచ్చాడు. అతడితో పాటు ఓలీ పోప్(125) పరుగులతో ఉన్నాడు. ఒలీ పోప్ టాప్ క్లాస్ సెంచరీ 60.2: జడేజా బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్. ఇంగ్లండ్ స్కోరు: 245/5 (61) 200 పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 52 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 200-5 ఆధిక్యంలోకి ఇంగ్లండ్.. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. 50 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో పోప్(81), బెన్ ఫోక్స్(10) పరుగులతో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 172/5 (42) ఒలీ పోప్ 67, బెన్ ఫోక్స్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 18 పరుగులు వెనుబడి ఉంది. స్టోక్స్ అవుట్ 36.5: అశ్విన్ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్(6). ఇంగ్లండ్ స్కోరు: 163/5 (36.5). టీమిండియా ఇంకా 27 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టోక్స్ స్థానంలో బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 60 పరుగులతో ఆడుతున్నాడు. 28.3: పోప్ హాఫ్ సెంచరీ నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 27.4: .జడేజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో బౌల్డ్(10). బెన్‌స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 140/4 (27.4) 27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 136/3 బెయిర్ స్టో ఆరు, పోప్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఆధిక్యం 54 పరుగులు ఇంగ్లండ్ స్కోరు: 122/3 (24).. టీమిండియాకు 68 పరుగుల ఆధిక్యం బెయిర్‌స్టో 3, ఒలీ పోప్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. దెబ్బకు దెబ్బ కొట్టిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బెయిర్‌స్టో క్రీజులోకి వచ్చాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3. కాగా అంతకు ముందు రూట్ బుమ్రాను బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. బుమ్రా మ్యాజిక్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 18.5: బుమ్రా బౌలింగ్‌లో బెన్ డకెట్(47) క్లీన్‌బౌల్డ్. దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 31 పరుగులతో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 113/2 (18.5). టీమిండియాకు ఇంకా 77 పరుగుల ఆధిక్యం నిలకడగా ఆడుతున్న డకెట్, పోప్ 16.3: డకెట్, పోప్ కలిసి 43 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు: 97-1(17). టీమిండియా ఆధిక్యం 93 రన్స్. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 89/1 (15) ఒలీ పోప్ 16, బెన్ డకెట్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 67/1 డకెట్ 30, పోప్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలే దూకుడుకు బ్రేక్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే. 33 బంతుల్లోనే 31 పరుగులతో జోరు మీదున్న క్రాలేకు అశూ అడ్డుకట్ట వేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 45/1 (9.2) 7 ఓవర్లలో స్కోరు: 33-0 క్రాలే 25, డకెట్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన క్రాలే 5.5: అశ్విన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన క్రాలే 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 13-0 ఓపెనర్లు జాక్ క్రాలే 10, బెన్ డకెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 177 పరుగులు వెనుకబడి ఉంది. హైలైట్స్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 246 టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 436 టీమిండియా ఆలౌట్.. ఓవరాల్‌గా 190 పరుగుల ఆధిక్యం 120.6: రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బౌల్డ్. పదో వికెట్ కోల్పోయిన టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు: 436 (121). మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు వికెట్లు తీయగా... రెహాన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చీ రాగానే బుమ్రా బౌల్డ్ 119.4: జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన బుమ్రా జో రూట్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 436/9 (120). 190 పరుగుల ఆధిక్యంలో టీమిండియా జడ్డూ అవుట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 119.3: జో రూట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన రవీంద్ర జడేజా. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా ఆధిక్యం 190 రన్స్ 118.6: ఫోర్ బాదిన అక్షర్ 179 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 113: జడేజా 84, అక్షర్ పటేల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య మొదలైన మూడో రోజు ఆట రవీంద్ర జడేజా 83, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 423-7(112). రెండో రోజు హైలైట్స్ ►శుక్రవారం నాటి ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 421/7 ►కేఎల్ రాహుల్(86), జడేజా అర్ధ సెంచరీలు ►రాణించిన కేఎస్ భరత్(41), అక్షర్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభమైంది. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల విజృంభణతో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన ప్రస్తుతం 175కు పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. చదవండి: మొదటి టెస్టు మన చేతుల్లోకి... -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్‌కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
T20 WC: ప్రపంచకప్ జట్టులో కుల్దీప్‌నకు నో ఛాన్స్! ఆ ముగ్గురే..
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ దళ కూర్పు గురించి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్రాధాన్యం మాత్రం వీళ్లేనంటూ ముగ్గురు స్టార్ల పేర్లు చెప్పాడు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్-2024 జూన్ 4 నుంచి ఆరంభం కానుంది. ఈవెంట్ మొదలైన మరుసటి రోజు టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్పిన్ విభాగం నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. తొలి రెండు మ్యాచ్‌లలో చైనామన్ బౌలర్ కుల్దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కలేదు. రవి, అక్షర్, సుందర్ ఈ రెండు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అఫ్గన్‌తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో అక్షర్ రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కలర్స్ షోలో మాట్లాడుతూ ప్రజ్ఞాన్ ఓజా అక్షర్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ రాణించగల ఈ ఆల్‌రౌండర్ అసలైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అక్షర్ సొంతమని ఓజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి కచ్చితంగా చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా..."నా వరకైతే వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. నంబర్ 1.. రవీంద్ర జడేజా. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరం. ఇక రెండో బౌలర్.. రవి బిష్ణోయి, మూడో ఆటగాడు అక్షర్ పటేల్. క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా బౌలింగ్ చేయగలడు" అని మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. ఆ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. కుల్దీప్ యాదవ్‌ను మాత్రం విస్మరించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో చేరనున్నాడు. చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్‌లో అఫ్గన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్‌కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్‌లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది.