ఎంత‌ ప‌నిచేశావు రోహిత్‌..పాపం అక్ష‌ర్ ప‌టేల్‌! వీడియో వైర‌ల్‌ | Costly Mistake by Rohit Sharma denies Axar Patel first-ever hat-trick for India at ICC Champions Trophy | Sakshi
Sakshi News home page

IND vs BAN: ఎంత‌ ప‌నిచేశావు రోహిత్‌..పాపం అక్ష‌ర్ ప‌టేల్‌! వీడియో వైర‌ల్‌

Published Thu, Feb 20 2025 4:22 PM | Last Updated on Thu, Feb 20 2025 4:31 PM

Costly Mistake by Rohit Sharma denies Axar Patel first-ever hat-trick for India at ICC Champions Trophy

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌(Bangladesh) కు ఆరంభంలోనే పేస‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, హ‌ర్షిత్ రాణా చుక్క‌లు చూపించ‌గా.. ఆ త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్ త‌న స్పిన్ మ‌యాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు.  అక్షర్ పటేల్ తృటిలో తన తొలి హ్యాట్రిక్‌ను కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన తప్పిదం వల్ల అక్షర్ ఈ ఫీట్‌ను సాధించలేకపోయాడు.

అసలేం జరిగిందంటే..?
బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్‌​.. రెండో బంతికి తాంజిద్ హసన్, మూడో బంతికి ముష్ఫికర్ ర‌హీంల‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో అక్ష‌ర్‌కు తొలి హ్యాట్రిక్ సాధించే అవ‌కాశం ల‌భించింది. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన జాకీర్ అలీకి రోహిత్ శ‌ర్మ క్లోజ్ ఫీల్డ్‌ను సెట్ చేశాడు.

ఆ ఓవ‌ర్‌లో నాలుగో బంతిని అక్ష‌ర్.. అలీకి ఔట్‌సైడ్ ఆఫ్ దిశ‌గా ఆఫ్ బ్రేక్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశ‌గా వెళ్లింది. అయితే మొదటి స్లిప్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ ఈజీ క్యాచ్‌ను జార‌విడిచాడు. అంద‌రూ రోహిత్ అందుకున్నాడ‌ని భావించిన‌ప్ప‌టికి ఆఖ‌రి నిమిషంలో బంతి అత‌డి చేతి నుంచి జారిపోయింది. 

అంతా ఒక్క‌సారిగా షాక్ అయిపోయారు. రోహిత్ క్యాచ్ విడిచిపెట్టిన వెంట‌నే అక్ష‌ర్‌కు సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇక 25 ఓవ‌ర్లు ముగిసే స‌రికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 92 ప‌రుగులు చేసింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్‌.. 31 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా జాకీర్‌ అలీకి రెండు ఛాన్స్‌లు లభించాయి. భార‌త బౌల‌ర్ల‌లో ఇప్పటివ‌రకు అక్షర్ పటేల్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. హ‌ర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించారు.

తుది జట్లు..
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్‌

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
చదవండి: CT 2025: ‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్‌ వరకు అతడే కెప్టెన్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement