India vs Bangladesh
-
ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆసీసా?.. ముందే కొట్టేస్తారు అనుకున్నా: సెహ్వాగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే భారత్ విజయం సాధించినప్పటికి ఛేజింగ్‌లో మాత్రం కాస్త తడబడిందనే చెప్పాలి.ఎందకంటే 229 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. లక్ష్య చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో స్పీడ్ తగ్గింది. 30 ఓవర్లు ముగిసే సరికి 144/4 స్కోరుతో భారత్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.కానీ శుబ్‌మన్ గిల్(101), కేఎల్ రాహుల్(41) ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఈ స్లో రన్ ఛేజింగ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్‌ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ అన్నాడు."బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోను. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలి.బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు ఇంకా ఏమి భయపడతాను. టెన్షన్ పడడానికి ప్రత్యర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్‌లో 35 ఓవర్లలోనే ముగిసి ఉండేదని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ టాపిక్ హైలైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్‌తో మ్యాచ్‌ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్‌లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్‌ను ఏకి పారేసి, రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్‌ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
CT 2025: వారిద్దరు బాగా ఆడారు.. అయినా క్రెడిట్ మా వారికే దక్కుతుంది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. ఫీల్డింగ్‌లో నిరాశపరిచినా బౌలర్లు, బ్యాటర్లు టీమిండియాకు విజయం చేకూర్చారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ను ఓడించడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లా బ్యాటర్లు హృదయ్, జాకిర్ అలీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని అభినందించాడు. షమీ ఐదు వికెట్ల ప్రదర్శనను కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శనల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని అన్నాడు. షమీ సామర్థ్యం గురంచి తెలుసని చెప్పాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి షమీ అద్భుత ప్రదర్శనలతో ముందుకొస్తాడని కితాబునిచ్చాడు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌ను కూడా ప్రశంసించాడు. గిల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు ఆశ్చర్యానికి గురి చేయవని అన్నాడు. గిల్ స్థాయి ఏంటో తమకు తెలుసని తెలిపాడు. అతనో క్లాసికల్ ప్లేయర్ అని కొనియాడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.అక్షర్ హ్యాట్రిక్‌ను నేలపాలు చేయడంపై స్పందిస్తూ.. అది చాలా సులభమైన క్యాచ్. నా స్థాయి క్రికెటర్ అలాంటి క్యాచ్‌ను తప్పక పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగలేదు. సునాయాసమైన క్యాచ్‌ను వదిలేసినందుకు చింతిస్తున్నాను. అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు చాలా బాధేసింది. రేపు అతన్ని డిన్నర్‌కు తీసుకెళ్తానంటూ నవ్వులు పూయించాడు.పిచ్ తీరుపై స్పందిస్తూ.. ఊహించిన దానికంటే నిదానంగా ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని చెప్పలేమని తెలిపాడు. ఒక్క మ్యాచ్‌తోనే పిచ్‌ను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. ముందుగా పిచ్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను క్యూరేటర్‌ను కాదని జోక్ చేశాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుందని, జట్టుగా మేము దాన్ని అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ (22), శ్రేయస్ (15), అక్షర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 23న దుబాయ్‌లోనే జరుగుతుంది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్‌ల్లో ఓడింది. మూడు మ్యాచ్‌లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్‌గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్‌ల్లో వచ్చాయి. కెప్టెన్‌గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్‌తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్‌కు 324 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్‌కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్‌లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా.. రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు పట్టింది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
IND Vs BAN: శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాపై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను గిల్ ఫినిష్ చేశాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. వరుసగా వికెట్ల పడడంతో కాస్త ఆచితూచి ఆడాడు. ఎప్పుడైతే లక్ష్యానికి జట్టు చేరువైందో గిల్ తన బ్యాటింగ్‌లో జోరును పెంచాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో గిల్ తన ఎనిమిదవ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గిల్..9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. తాజా మ్యాచ్‌తో లిటల్మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్‌లు2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్‌ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
రోహిత్ శర్మ మంచి మనసు.. ఫ్యాన్స్ ఫిదా! వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో సహచర ఆటగాళ్లపై పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల పట్ల కూడా రోహిత్ తన మంచి మనుసు చాటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.తాజాగా రోహిత్ శర్మ మరో తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్‌ను రోహిత్ కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో సోషల్ మీడియా వేదికగా భారత కెప్టెన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ హిట్‌మ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో జాకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు జాకర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను జాకర్ అలీ, హృదయ్ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs BAN: ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్ -
ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్(Bangladesh) కు ఆరంభంలోనే పేసర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా చుక్కలు చూపించగా.. ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. అక్షర్ పటేల్ తృటిలో తన తొలి హ్యాట్రిక్‌ను కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన తప్పిదం వల్ల అక్షర్ ఈ ఫీట్‌ను సాధించలేకపోయాడు.అసలేం జరిగిందంటే..?బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. రెండో బంతికి తాంజిద్ హసన్, మూడో బంతికి ముష్ఫికర్ రహీంలను పెవిలియన్‌కు పంపాడు. దీంతో అక్షర్‌కు తొలి హ్యాట్రిక్ సాధించే అవకాశం లభించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీకి రోహిత్ శర్మ క్లోజ్ ఫీల్డ్‌ను సెట్ చేశాడు.ఆ ఓవర్లో నాలుగో బంతిని అక్షర్.. అలీకి ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా ఆఫ్ బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మొదటి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. అందరూ రోహిత్ అందుకున్నాడని భావించినప్పటికి ఆఖరి నిమిషంలో బంతి అతడి చేతి నుంచి జారిపోయింది. అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రోహిత్ క్యాచ్ విడిచిపెట్టిన వెంటనే అక్షర్‌కు సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్.. 31 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా జాకీర్ అలీకి రెండు ఛాన్స్‌లు లభించాయి. భారత బౌలర్లలో ఇప్పటివరకు అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తలా రెండు వికెట్లు సాధించగా.. హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: CT 2025: ‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’This moment could have put Axar's name in the record books for decades. But Rohit Sharma successfully ruined it 😒 pic.twitter.com/zDnFk83r0D— Mark. (@CheekuGang) February 20, 2025 -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్‌లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్‌ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్‌లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్‌లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్‌లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు హిట్‌మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్‌లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్‌లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్‌గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్‌ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. రోహిత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్‌లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్‌కు 260వ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్‌ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్‌లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్‌ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
Ind vs Ban: ‘నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.గంభీర్‌తో జడ్డూ వాదన!ఇక తొలి మ్యాచ్‌లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్‌లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.వాళ్లిద్దరికి జట్టులో చోటుఅయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్‌తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్‌ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
CT 2025 IND Vs BAN: శుభారంభంపై భారత్ గురి
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై ఆశలు పెట్టుకుంది. సమష్టిగా చెలరేగితే... భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్‌ను కట్టిపడేయగల సమర్థులు. బలహీన బ్యాటింగ్... తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్‌ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.పిచ్, వాతావరణంఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్‌పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్‌ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. -
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 19)న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ తెలిపాడు."దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదే. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాము. అయితే ప్రస్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్‌లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్‌ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్‌ను మార్చుకోవాలి" అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.బుమ్రా లేకుండానే..ఇక ఈ మెగా ఈవెంట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్‌కప్‌నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.బంగ్లాపై మనదే పై చేయి..కాగా వన్డేల్లో బంగ్లాదేశ్‌పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్‌ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎక్కువే! -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు -
'భారత జట్టులో అతడు లేడు.. మీకు ఇదే మంచి ఛాన్స్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన టీమిండియాను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా భారత్‌ను ఓడించాలని బంగ్లా టైగర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. బంగ్లా క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.ఈ టోర్నీకి ముందు వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. అదేజోరును ఈ మినీ వరల్డ్‌కప్‌లోనూ కనబరచాలని బంగ్లా జట్టు భావిస్తోంది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం బంగ్లాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ఓపెనర్ ఇమ్రాల్ కైస్ తమ జట్టుకు పలు సూచనలు చేశాడు. భారత జట్టులో బుమ్రాలేని లోటును బంగ్లా సొమ్ముచేసుకోవాలని కైస్ అభిప్రాయపడ్డాడు."భారత్ బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ను కలిగి ఉంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. అయితే జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం మా జట్టుకు కలిసొచ్చే ఆంశం. బుమ్రా గత రెండేళ్లలో భారత జట్టుకు ఎటువంటి విజయాలను అందించాడో మనకు మనందరికీ తెలిసిందే. అతడి గైర్హాజరును బంగ్లాదేశ్ సద్వినియోగం చేసుకోవాలి. బుమ్రా లేనప్పటికి మహ్మద్ షమీ వంటి స్పీడ్ స్టార్ జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ప్రస్తుతం ఫిట్నెస్తో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతడు తన రిథమ్‌ను తిరిగి పొందితే, బంగ్లాదేశ్‌కు పెనుముప్పులా మారుతాడని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైస్ పేర్కొన్నాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా.చదవండి: మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ -
బంగ్లాతో మ్యాచ్.. స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్! గంభీర్ సపోర్ట్ అతడికే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 1996 వరల్డ్‌కప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీంతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఇక భారత్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అదేవిధంగా తొలి మ్యాచ్ కోసం తుది జట్టు కూర్పుపై కూడా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.హర్షిత్‌కు నో ఛాన్స్..బంగ్లాతో మ్యాచ్‌కు పేసర్ హర్షిత్ రాణాకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా వెటరన్ మహ్మద్ సిరాజ్‌ను కాదని మరి అర్ష్‌దీప్‌ను సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉందని అజిత్ అగార్కకర్ అండ్ కో సెలక్ట్ చేశారు.ఈ క్రమంలోనే హర్షిత్ కంటే అర్ష్‌దీప్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ తొలి ప్రాధన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అర్ష్‌దీప్ అంచనాలకు తగ్గట్టు రాణించకపోతే రాణా తర్వాతి మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. వాస్తవానికి తొలుత ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో రాణా లేడు.జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో రాణాకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన రాణా పర్వాలేదన్పించాడు. ఈ ఢిల్లీ పేసర్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు తీసుకు వెళ్లారు.బంగ్లాతో మ్యాచ్‌కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs PAK: షాకింగ్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.4 లక్షలు -
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్‌ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్‌కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్‌కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
CT 2025: రోహిత్ శర్మ ఇంకో 183 పరుగులు చేస్తే...
ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది.అరుదైన రికార్డు ముంగిట హిట్మ్యాన్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్‌లో చరిత్ర సృష్టించేందుకు హిట్‌మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.ఇంకో 183 పరుగులు జతచేశాడంటేఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్‌లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్‌లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్‌లో కొనసాగుతున్నాడు.కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
BCCI: బుమ్రా ఆడతాడా?.. రిస్క్ వద్దు!.. ఆ డాక్టర్ చేతిలోనే అంతా..
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు. మూడు వారాలుగా విశ్రాంతిమ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్‌గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది. ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులుఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.అదొక అద్భుతమని తెలుసుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్కు పంపించి.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఫిబ్రవరి 12 వరకు అవకాశంఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా? -
‘నితీశ్ రెడ్డికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.కెప్టెన్‌కు నో ఛాన్స్!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్ జట్టులో గావస్కర్, పఠాన్ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం తమ టీమ్‌లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్-2023లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.సంజూను ఎలా కాదనగలం?ఇక శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్‌లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్ పంత్ ఆడాలి. ఇక సంజూ శాంసన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డికి చోటు ఇవ్వాల్సిందేఇక ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్ పఠాన్.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్ విధానంలో భారత్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.సునిల్ గావస్కర్- ఇర్ఫాన్ పఠాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: CT 2025: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్ అయ్యర్ -
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) కీలక అప్డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.భద్రతా కారణాల దృష్ట్యాఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది.ఇక తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆసీస్‌తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీస్‌ను వారి స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాంఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడేఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా(Devjith Saikiya), కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.చదవండి: CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు -
భారత క్రికెట్‌కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్‌కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్ షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్ ఉండబోతోందని పేర్కొంది. అంతేకాదు.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.44 సిరీస్లుఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 44 సిరీస్‌లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్ వనన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్ కింగ్డమ్లో 2026లో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్‌కప్‌నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోయే దేశాలుఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే.ఆస్ట్రేలియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. అదే విధంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక పర్యటన.ఇండియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనబంగ్లాదేశ్ షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పర్యటనఇంగ్లండ్ షెడ్యూల్స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక పర్యటనఐర్లాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటనన్యూజిలాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్ పర్యటనపాకిస్తాన్ షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనసౌతాఫ్రికా షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే పర్యటనశ్రీలంక షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో... న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనవెస్టిండీస్ షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనజింబాబ్వే షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్‌లతో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటన.చదవండి: ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు -
Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు!.. ఎట్టకేలకు కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అర్ధ శతకం బాది.. తొమ్మిది నెలల నిరీక్షణకు తెరదించాడు. తనకు సొంత మైదానం(ఐపీఎల్- ఆర్సీబీ)లాంటి బెంగళూరు చిన్వస్వామి స్టేడియంలో.. చక్కని షాట్లతో అలరిస్తూ.. టెస్టుల్లో తన 31వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డెబ్బై బంతుల్లో ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.అరుదైన మైలురాయికాగా సంప్రదాయ క్రికెట్లో కోహ్లి చివరగా గతేడాది డిసెంబరులో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో అరుదైన మైలురాయిని దాటాడు. టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో కోహ్లి నిరాశపరిచిన విషయం తెలిసిందే.బంగ్లాతో తొలి మ్యాచ్‌లో కేవలం 23 పరుగులే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టులో 76(47, 29*) చేయగలిగాడు. అయితే, న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి పాత కథనే పునరావృతం చేశాడు. అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు.ధీటుగా బదులిస్తున్న టీమిండియాఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసింది. అయితే, రోహిత్ సేన ఇందుకు ధీటుగా బదులిస్తోంది. 40 ఓవర్ల ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(52) చేయగా.. సర్ఫరాజ్ ఖాన్, కోహ్లి అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టెస్టుల్లో త్వరలోనే ఎంట్రీ!.. గంభీర్ భయ్యా చెప్పారు: సంజూ
కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడా? కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను రెడ్‌బాల్ క్రికెట్ ఆడించేందుకు సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంజూ శాంసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సంజూ 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20ల సందర్భంగా అరంగేట్రం చేసిన అతడికి ఆరేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 వన్డేలు, 33 టీ20లు ఆడిన సంజూ శాంసన్.. ఆయా ఫార్మాట్లలో 510, 594 పరుగులు చేశాడు.టీమిండియా తరఫున టీ20 సెంచరీఇక వన్డేల్లో ఓ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లో శతకం నమోదు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల జట్టులోనే ఇప్పటి వరకు సంజూకు నిలకడైన స్థానం లేదు. అయినప్పటికీ టెస్టుల్లోనూ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. మేనేజ్మెంట్ పిలిచి మరీ రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని చెప్పడంతో లక్ష్యానికి చేరువవుతున్నాడు.మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందిఈ విషయాల గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. రెడ్‌బాల్ క్రికెట్లో రాణించగలననే నమ్మకం నాకుంది. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనేది నా చిరకాల కోరిక.దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు నాకు నాయకత్వ బృందం(కెప్టెన్, కోచ్) నుంచి సందేశం వచ్చింది. రెడ్‌బాల్ క్రికెట్ జట్టులోనూ నా పేరును పరిశీలిస్తున్నామని మేనేజ్మెంట్లోని ముఖ్యులు చెప్పారు. రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని.. రెడ్‌బాల్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు’’ అని పేర్కొన్నాడు.గంభీర్ భయ్యా మద్దతు ఉంది అదే విధంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గౌతం భయ్యా నాకెల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డాడు. నిజానికి టీమిండియాకు ఆడుతున్నపుడు బ్యాటింగ్ స్థానం సుస్థిరంగా ఉండదు. మూడు వారాల ముందే చెప్పారు!అయితే, బంగ్లాతో సిరీస్‌కు మూడు వారాల ముందే నేను ఓపెనర్‌గా రావాలని మేనేజ్మెంట్ చెప్పింది. కొత్త పాత్రలో ఇమిడిపోయేలా నేను మానసికంగా సిద్ధపడేందుకు తగిన సమయం ఇచ్చింది’’ అంటూ 29 ఏళ్ల సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.సంజూకు అంత ఈజీ కాదుకాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సంజూ శాంసన్ ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడి 38.96 సగటుతో 3819 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-డి జట్టుకు ఆడిన అతడు మెరుపు సెంచరీ(101 బంతుల్లో 106) సాధించాడు. అయితే, టెస్టుల్లో వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్ పాతుకుపోగా.. ధ్రువ్ జురెల్ బ్యాకప్‌గా ఉన్నాడు. సంజూ కూడా రేసులోకి రావాలంటే వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు బ్యాటింగ్ పరంగానూ మరింత గొప్పగా రాణించాల్సి ఉంటుంది. అలా అయితే, జురెల్‌ను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్’ -
Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..
టీమిండియా క్రికెటర్లు ఎవరైనా సరే తమ సహజ శైలిలో చెలరేగుతుంటే... జట్టు వ్యూహాల పేరుతో వారి దూకుడుకు హద్దులు పెట్టబోమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్ కింగ్’ విరాట్ కోహ్లి ఫామ్‌పై తమకెలాంటి ఆందోళనా లేదని, అతని పరుగుల దాహం ఎప్పటికీ తీరదని గంభీర్ తెలిపాడు. అయితే, బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియాకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు.ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్ సహ కివీస్‌తో టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలపై గంభీర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో జరిగే సిరీస్లకంటే ప్రస్తుత సిరీస్‌పైనే తమ దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...అడ్డు ఎందుకు? ‘‘భారత బ్యాటింగ్‌కు నిర్దిష్టమైన శైలి ఇదని, ఇలాగే ఆడాలనే కచ్చితమైన ప్రణాళికలేమీ లేవు. ఆటగాళ్లు దూకుడుగా ఆడితే ఆడని... చెలరేగితే చెలరేగని ఇందులో అడ్డుకట్టలెందుకు పెట్టాలి. వారి సహజశైలిని వారు కొనసాగించే స్వేచ్ఛ ఇవ్వాలి కదా! గట్టిగా చెప్పాలంటే... మేం ఒక రోజులో 400–500 పరుగులైనా చేయాలనుకుంటాం. తప్పదు అవసరమనుకుంటే రెండు రోజుల పాటు జిడ్డుగా ఆడి ‘డ్రా’ అయినా చేసుకోగలుగుతాం.ఎందుకంటే కొన్నిసార్లు 100 పరుగులకే ఆలౌటయ్యే ప్రమాదం రావొచ్చు. అప్పుడు క్రీజులో నిలబడే ఓపిక, గంటల తరబడి ఆడే సామర్థ్యం కూడా అవసరం. టీమిండియా ఇలా తయారుకావడమే ముఖ్యం. అప్పుడే దూకుడైన ఆటతో అభిమానులకు మజా దక్కుతుంది. పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఈ సిరీస్‌లో ఇలా ఆడాలని, ఆ ప్రత్యర్థిని అలా ఎదుర్కోవాలనే ముందస్తు ప్రణాళికలపైనే ఆధారపడటం కుదరదు. వీలును బట్టి, అప్పటి పరిస్థితులు, పిచ్‌లో ఎదురయ్యే సవాళ్లు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలుంటాయి. దీనికి పక్కా ప్రణాళికంటూ అమలు కాదు... అప్పటి పరిస్థితులే ప్రామాణికం. దాన్నిబట్టే ఆటతీరు మారుతుంది. ఆడే శైలి మరో దశకు చేరుకుంటుంది.కివీస్‌తో గట్టిపోటీ న్యూజిలాండ్ సాదాసీదా ప్రత్యర్థి కానేకాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా షాక్‌లు తప్పవు. సొంతగడ్డ అనే అనుకూలతలు, గత సిరీస్ గెలిచాం... ఇదీ గెలుస్తామనే ధీమా తప్పు. బంగ్లాదేశ్‌తో పోల్చితే కివీస్ పూర్తిగా భిన్నమైన ప్రత్యర్థి. ఆ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నాణ్యమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.కాబట్టి ప్రతీ మ్యాచ్‌లోనూ మాకు సవాళ్లు తప్పవు. అయితే ప్రత్యర్థి కివీసా లేదంటే ఆసీసా అని చూడం. జట్టు గెలుపొందడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. వచ్చే నెలలో మొదలయ్యే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్తే లక్ష్యంగా కివీస్‌ను ఓడించేపనిలో ఉంటాం .వరల్డ్‌క్లాస్ ప్లేయర్కోహ్లిపై నా ఆలోచనలు సుస్పష్టం. అతనో విశ్వవిఖ్యాత క్రికెటర్. సుదీర్ఘకాలంగా గొప్పగా రాణిస్తున్న బ్యాటర్. కోహ్లి అరంగేట్రం చేసినపుడు ఎలాంటి పరుగుల దాహంతో ఉన్నాడో... ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఇప్పటికి అలాంటి ఆకలితోనే ఉన్నాడు. కివీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో తప్పకుండా రాణిస్తాడనే ఆశిస్తున్నాను.ఇకపైనా అదే ఆటతీరును ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నాను. వరుసగా కొన్ని మ్యాచ్‌ల్లో... లేదంటే ఒకట్రెండు సిరీస్‌లలోనే విఫలమైనంత మాత్రాన అతడిబ్యాటింగ్లో సత్తా లేదని కాదు. ఆటగాళ్లు కదా... ఎవరికైనా వైఫల్యాలు సహజం. అలాగే వాటిని అధిగమించడం కూడా జరుగుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్‌లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్‌లో లంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్‌వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో బంగ్లా బౌలింగ్‌ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్‌గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
India vs Bangladesh: దసరా ధమాకా
హైదరాబాద్‌లో విజయదశమి రోజున సాయంత్రం...పండగ సంబరాలను కాస్త పక్కన పెట్టి క్రికెట్ వైపు వచి్చన అభిమానులు అదృష్టవంతులు! అటు స్టేడియంలో గానీ ఇటు ఇంట్లో గానీ మ్యాచ్ చూసినవారు ఫుల్ దావత్ చేసుకున్నట్లే! అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చి భారత క్రికెటర్లు పారించిన పరుగుల ప్రవాహంతో పండగ ఆనందం రెట్టింపు అయిందంటే అతిశయోక్తి కాదు. 25 ఫోర్లు, 23 సిక్స్‌లు...ఈ 47 బౌండరీలతోనే ఏకంగా 232 పరుగులు...రెండు ఓవర్లు మినహా మిగతా 18 ఓవర్లూ పదికి పైగా పరుగులు వచి్చన పవర్‌ప్లే ఓవర్లే! 43 బంతులకే 100, 84 బంతులకే 200 వచ్చేశాయి...అలా వెళ్లిన స్కోరు 300కు కాస్త ముందు ఆగింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలు...సరికొత్త రికార్డులు నమోదు. అంతర్జాతీయ టి20ల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత కూడా 2 అర్ధసెంచరీలు, ఇరవై లోపు లోపు 20 స్కోర్లతో తన సెలక్షన్‌పై సందేహాలు రేకెత్తిస్తూ వచి్చన సంజు సామ్సన్ ఎట్టకేలకు అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా అతని మెరుపు సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అతి భారీ లక్ష్యం ముందుండగా ముందు చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి లాంఛనం ముగించింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సమరాన్ని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా 3–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లోనే 86 పరుగుల ఓటమి తర్వాత సిరీస్ కోల్పోయి కునారిల్లిన బంగ్లాకు చివరి పోరులో అంతకంటే పెద్ద దెబ్బ పడింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ 133 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఎప్పటిలాగే చెలరేగాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 173 పరుగులు జోడించడం విశేషం. వీరిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడు కనబర్చడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. తౌహీద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిటన్ దాస్ (25 బంతుల్లో 42; 8 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 6, 6, 6, 6, 6... అభిషేక్ (4)ను తొందరగా అవుట్ చేయడం ఒక్కటే బంగ్లాకు దక్కిన ఆనందం. ఆ తర్వాత 69 బంతుల పాటు వారికి సామ్సన్, సూర్య చుక్కలు చూపించారు. తస్కీన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 4 ఫోర్లు కొట్టగా, తన్జీమ్ ఓవర్లో సూర్య వరుసగా 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలోనే జట్టు 82 పరుగులు చేసింది. 22 బంతుల్లో సామ్సన్ అర్ధసెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత బంగ్లా స్పిన్నర్ రిషాద్ బాధితుడయ్యాడు. రిషాద్ తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన సామ్సన్...అతని తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికి పరుగు తీయని సామ్సన్ తర్వాతి ఐదు బంతుల్లో 6, 6, 6, 6, 6తో చెలరేగాడు. మరో వైపు 23 బంతుల్లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తయింది. మహేదీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా ఫోర్ కొట్టడంతో సామ్సన్ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు సెంచరీ తర్వాత సామ్సన్ను ముస్తఫిజుర్ వెనక్కి పంపడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే సూర్య అవుటయ్యాడు. ఆ తర్వాతా భారత్‌ను నిలువరించడం బంగ్లా వల్ల కాలేదు. పాండ్యా తన జోరును చూపిస్తూ తన్జీమ్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టగా...మహేదీ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 బాదాడు. వీరిద్దరు 26 బంతుల్లోనే 70 పరుగులు జత చేశారు. మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచి్చన నితీశ్ కుమార్ రెడ్డి (0) తొలి బంతికే వెనుదిరగ్గా...300కు 3 పరుగుల ముందు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహీద్, దాస్ నాలుగో వికెట్‌కు 38 బంతుల్లో 53 పరుగులు జోడించి కాస్త పోరాడటం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) మహేదీ (బి) ముస్తఫిజుర్ 111; అభిషేక్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 4; సూర్యకుమార్ (సి) రిషాద్ (బి) మహ్ముదుల్లా 75; పరాగ్ (సి) దాస్ (బి) తస్కీన్ 34; పాండ్యా (సి) రిషాద్ (బి) తన్జీమ్ 47; రింకూ (నాటౌట్) 8; నితీశ్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 0; సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 297. వికెట్ల పతనం: 1–23, 2–196, 3–206, 4–276, 5–289, 6–289. బౌలింగ్: మహేదీ 4–0–45–0, తస్కీన్ 4–0–51–1, తన్జీమ్ 4–0–66–3, ముస్తఫిజుర్ 4–0–52–1, రిషాద్ 2–0–46–0, మహ్ముదుల్లా 2–0–26–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) పరాగ్ (బి) మయాంక్ 0; తన్జీద్ (సి) వరుణ్ (బి) సుందర్ 15; నజ్ముల్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 14; లిటన్‌దాస్ (సి) (సబ్) తిలక్ (బి) బిష్ణోయ్ 42; తౌహీద్ (నాటౌట్) 63; మహ్ముదుల్లా (సి) పరాగ్ (బి) మయాంక్ 8; మహేదీ (సి) పరాగ్ (బి) నితీశ్ 3; రిషాద్ (సి) అభిషేక్ (బి) బిష్ణోయ్ 0; తన్జీమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–35, 3–59, 4–112, 5–130, 6–138, 7–139. బౌలింగ్: మయాంక్ 4–0–32–2, పాండ్యా 3–0–32–0, సుందర్ 1–0–4–1, నితీశ్ 3–0–31–1, రవి 4–1– 30–3, వరుణ్ 4–0–23–0, అభిషేక్ 1–0–8–0. -
శాంసన్ సరికొత్త చరిత్ర.. ధోనికి కూడా సాధ్యం కాలేదు
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో నిరాశపరిచిన సంజూ.. ఆఖరి టీ20లో మాత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా బౌలర్లకు శాంసన్ చుక్కులు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ కేరళ స్టార్ క్రికెటర్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంజూ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ సాధించాడు. అదే విధంగా భారత్ తరపున ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.➔ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. హోస్సేన్ వేసిన 10 ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆరు సిక్స్‌లు బాదాడు.➔భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు శాంసన్ సంజూ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు మాత్రమే. 2022లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఇషాన్ కిషన్ 89 పరుగులు చేశాడు.➔బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన భారత క్రికెటర్‌గా సంజూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2019లో రాజ్‌కోట్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 23 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
'టీమ్ కంటే ఏదీ ఎక్కువ కాదు.. జట్టులో నిస్వార్థ క్రికెటర్లు ఉండాలి'
టీ20ల్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 297 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లో 164 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తమ కుర్రాళ్ల ఆటతీరు పట్ల సూర్య సంతోషం వ్యక్తం చేశాడు."బంగ్లాతో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక జట్టుగా చాలా సాధించాము. నా జట్టులో నిస్వార్థమైన క్రికెటర్లు ఉండాలని కోరుకుంటా. హార్దిక్ చెప్పినట్లుగా ఫీల్డ్‌లోనైనా, ఆఫ్‌ది ఫీల్డ్‌లోనైనా ఒకరి ప్రదర్శనలను ఒకరు ఆస్వాదించాలనుకుంటున్నాము.వీలైనంత ఎక్కువ సమయం సరదగా గడపాలని అనుకుంటున్నాము. మైదానంలో కూడా మా స్నేహాన్ని కొనసాగిస్తాము. ఇక గతంలో శ్రీలంకతో సిరీస్‌కు వెళ్లినప్పుడు గౌతీ భాయ్(గౌతమ్ గంభీర్) ఏం చెప్పాడో.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అదే సలహా ఇచ్చాడు. జట్టు కంటే ఏది ముఖ్యం కాదు. ఎవరైనా 99 లేదా 49 మీద ఉన్నప్పుడు షాట్ ఆడే ఆవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఆడేయాలి. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదే చేశాడు. నిజంగా అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలి. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావడం చాలా అనందంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
సంజూకు ఊపు వచ్చింది.. ఉప్పల్‌లో ఊచకోత! వీడియో వైరల్
సంజూ శాంసన్.. ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంజూ.. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో తనపై విమర్శల చేస్తున్న వారి నోరు మూయించాడు. తను బ్యాట్‌కు పని చెబితే ఏ విధంగా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి రెండు టీ20ల్లో పెద్దగా రాణించకపోయిన శాంసన్.. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉప్పల్‌లో బంగ్లా బౌలర్లను ఈ కేరళ బ్యాటర్ ఊచకోత కోశాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూను అపడం ఎవరూ తరం కాలేదు. అతడు బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. మైదానం నలుమూలల సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. రోహిత్ శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న సంజూ 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకే ఓవర్లో 5 సిక్స్లుఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. 10 ఓవర్ వేసిన రిషాద్ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది అదరహో అనిపించాడు. ఈ ఓవర్ తొలి బంతిని డాట్ చేసిన సంజూ శాంసన్.. ఫుల్‌టాస్‌గా వచ్చిన రెండో బంతిని సిక్సర్‌గా తరలించాడు.మూడో బంతిని లాంగాఫ్ దిశగా... నాలుగో బంతిని స్ట్రైట్‌గా.. ఐదో బంతిని లాంగాన్ దిశగా.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా మలిచాడు. అతడి విధ్వంసం చూసి బంగ్లా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Sanju Samson - you beauty!🤯#IDFCFirstBankT20ITrophy #INDvBAN #JioCinemaSports pic.twitter.com/JsJ1tPYKgD— JioCinema (@JioCinema) October 12, 2024 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా జూలు విధిల్చింది. ఈ ఆఖరి టీ20లో బంగ్లాను 133 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన భారత జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.భారత్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ రికార్డు సాధించిన జాబితాలో నేపాల్ ఉంది. ఆసియా క్రీడలు-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 314 పరుగులు చేసింది. కాగా ఈ 297 పరుగులే భారత్‌కు టీ20ల్లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 260 పరుగులు భారత అత్యధిక స్కోర్‌గా ఉండేది.➔ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సాధించింది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ ఏకంగా 47 బౌండరీలు బాదింది. అందులో22 సిక్స్‌లు, 25 ఫోర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు చెక్ రిపబ్లిక్(43 పేరిట ఉండేది.➔వరల్డ్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు భారత జట్టు టీ20ల్లో 37 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టు సొమర్సెట్ పేరిట ఉండేది. సొమర్సెట్ 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో సొమర్సెట్ ఆల్‌టైమ్ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.➔టీ20ల్లో వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టు కూడా టీమిండియానే. ఈ మ్యాచ్‌లో భారత్ 7.1 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.6 ఓవర్లతో భారత్ పేరిటే ఉండేది.➔ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల బాదిన జాబితాలో భారత్ మూడో స్ధానంలో నిలిచింది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ 22 సిక్స్‌లు కొట్టింది.చదవండి: IND vs BAN: చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్ -
చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊతికారేశారు.అభిషేక్ శర్మ మినహా మిగితా అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.3 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో మెరిశాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో తహిద్ హృదాయ్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! 🚨 ONE OF THE MOST RIDICULOUS SHOTS EVER 🚨- Sanju Samson is a beast...!!!! pic.twitter.com/e3hblLeXyA— Johns. (@CricCrazyJohns) October 12, 2024 -
సంజూ శాంసన్ విధ్వంసకర శతకం.. టీమిండియా అతి భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్ రికార్డు స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 4, రింకూ సింగ్ 8, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS BAN 3rd T20: మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 16, 15, 4 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ల గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ఉసూరుమనిపించాడు. ఇటీవలే జింబాబ్వేపై మెరుపు సెంచరీ చేసిన అభిషేక్‌పై భారీ అంచనాలు ఉండేవి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడని మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. అయితే అభిషేక్ అందరి అంచనాలను వమ్ము చేస్తూ తేలిపోయాడు. ప్రస్తుతమున్న కాంపిటీషన్లో అభిషేక్‌కు మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమే.కాగా, హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా 23 పరుగుల వద్దే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే సంజూ శాంసన్ (25 బంతుల్లో 59; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిసున్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 113/1గా ఉంది. చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! -
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 లైవ్ అప్డేట్స్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
రోహిత్, కోహ్లి సరసన చేరేందుకు 31 పరుగుల దూరంలో ఉన్న సూర్య
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లో మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 12) జరుగబోయే మ్యాచ్‌లో స్కై మరో 31 పరుగులు చేస్తే 2500 పరుగుల క్లబ్లో చేరతాడు. భారత్ తరఫున కేవలం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాత్రమే 2500 పరుగుల మార్కును దాటారు. స్కై నేటి మ్యాచ్‌లో 31 పరుగులు సాధిస్తే.. కోహ్లి, రోహిత్ సరసన చేరతాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 2469 పరుగులు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక టీ20 పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్లో 4231 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 125 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయానంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుంటే భారత్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియానే గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ -
IND VS BAN: మూడో టీ20కి వర్షం ముప్పు..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
బంగ్లాతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తాము: టీమిండియా కోచ్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శనివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నదే మా జట్టు, అభిమానుల కోరిక. కచ్చితంగా అలాగే ముగించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.దేశం తరపున ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని గంభీర్ భావిస్తాడు. ప్రతీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా అన్ని మ్యాచ్‌లకు సన్నద్దమైనట్లే సిద్దమయ్యాము. ప్రస్తుతం భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది. కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భారత జట్టు తరపున ఆడుతున్న కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జితేష్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రానాలకు ఆడే అవకాశం ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్‌టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
ఉప్పల్‌లో గెలుపెవరిదో!
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్– బంగ్లాదేశ్ టీ20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సు«దీర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,600 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానం చేసినట్లు తెలిపారు. 3 గంటల ముందే అనుమతి.. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందుగానే స్డేడియంలోకి అనుమతిస్తారు. ఈవ్‌టీజింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి బయటి వస్తువులు, తినుబండారాలను తీసుకురావద్దు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి వచ్చి గేట్ నంబర్ 1, 2 ద్వారా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. దివ్యాంగులు రామంతాపూర్ గేట్– 3 ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నంబర్ –4 నుంచి 10కి వచ్చే వారు తమ వాహనాలను ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద, రామంతాపూర్ చర్చి గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ సేవలను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ నుంచి స్టేడియం వైపు, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లించనున్నారు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్ రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సైతం నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. -
భారత్– బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న (శనివారం) భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: ఒక్కసారిగా వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షంరామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
బంగ్లాతో మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే..! అతడి అరంగేట్రం?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత జట్టు 2-0 తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. మరో పొట్టి క్రికెట్ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.అయితే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక జట్టుతో తలపడనుంది. శనివారం హైదరాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్దమైనట్లు భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమచారం. తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తొలి రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన తిలక్ వర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు ఆఖరి టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టీ20కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా -
ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే తీరును కనబరిచింది.ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు. "ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్లో లేవు. దయచేసి భారత్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.ప్రస్తుతం బారత జట్టు మెన్జ్మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్‌లా చెలరేగాడు. అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. -
బంగ్లాతో మూడో టీ20.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా
బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది.గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్లు తమకు కేటాయించిన హోటల్స్‌కు పయనమయ్యారు. ఇందుకు సబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భాగ్యనగరానికి చేరుకున్న భారత్, బంగ్లా జట్లు శుక్రవారం ఉప్పల్‌లో ప్రాక్టీస్ చేయనున్నాయి. కాగా తొలి రెండు టీ20ల్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.చదవండి: విండీస్ మహిళల ధనాధన్ విక్టరీ -
వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు.సూపర్ మ్యాన్‌లా..221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు.ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్‌కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Athleticism at its best! 😎An outstanding running catch from Hardik Pandya 🔥🔥Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024 -
రియాన్ పరాగ్ ఓవరాక్షన్.. షాకిచ్చిన అంపైర్(వీడియో)
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ వింత బౌలింగ్ యాక్షన్‌తో అందరిని ఆశ్యర్యపరిచాడు. కొత్త బౌలింగ్ యాక్షన్‌ను ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ చేతికి బంతి అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రియాన్ వేసిన మొదటి బంతినే బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా భారీ సిక్సర్‌గా మలిచాడు.తద్వారా పరాగ్ కాస్త నిరాశచెందాడు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించి బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. దీంతో లసిత్ మలింగ స్టైల్లో బౌలింగ్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని రియాన్.. మహ్మదుల్లాకు స్లింగ్లింగ్ డెలివరీగా సంధించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్ మధన్ గోపాల్ థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రిప్లేలో బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా తేలింది. డెలివరీ సంధించే క్రమంలో పరాగ్ బ్యాక్ ఫుట్ ట్రామ్‌లైన్ వెలుపల ఉంది. అందుకునే థర్డ్ అంపైర్ బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో మహ్మదుల్లాకు ఫ్రీ హిట్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What was that Riyan Parag ? 🤣🤣#INDvsBAN pic.twitter.com/JAOTn2mLZM— sajid (@NaxirSajid32823) October 9, 2024 -
నితీష్ రెడ్డి ఒక అద్భుతం.. నేను అనుకున్నదే జరిగింది: భారత కెప్టెన్
టీ20ల్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో యంగ్ ఇండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా వికెట్ పడగొట్టారు.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మరో టీ20 సిరీస్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా టాపార్డర్ బ్యాటర్ల విఫలమైనందుకు మేము నిరాశ చెందలేదు. నిజంగా చెప్పాలంటే నేను కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మిడిలార్డర్ బ్యాటర్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని నేను భావించాను. క్లిష్ట సమయంలో ఎలా ఆడుతారో పరీక్షించాలనకున్నాము. ముఖ్యంగా ఐదు, ఆరు, ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే వారు ఆటగాళ్లు జట్టుకు చాలా ముఖ్యం. ఒకవేళ టాపర్డర్ విఫలమైనా వారు జట్టును ఆదుకునే విధంగా ఉండాలి. అయితే ఈ మ్యాచ్‌లో నేను కోరుకున్న విధంగానే మా మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.రింకూ, నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లను కూడా టెస్టు చేయాలనుకున్నాను. ప్రస్తుత తరం క్రికెట్లో జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు అదరగొట్టింది.నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.చరిత్ర సృష్టించిన భారత్..ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్‌ను చూపించాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించి ఔరా అన్పించాడు. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ బంతిని పంచుకున్నారు. అయితే ఆ ఏడుగురు బౌలర్లలో ప్రతీ ఒక్కరు వికెట్ సాధించారు. కాగా 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో ఏడుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా తీయడం ఇదే తొలిసారి. 1932లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు.. ఢిల్లీ టీ20 ముందు వరకు ఏ ఫార్మాట్(వన్డే, టీ20, టెస్టు)లో కూడా భారత జట్టు ఈ అరుదైన ఫీట్ నమోదు చేయలేదు. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో టెస్టుల్లో 4 సార్లు, వన్డేల్లో 10 సార్లు, టీ20ల్లో 4 సార్లు ఈ ఫీట్ నమోదు అయింది.చదవండి: కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..! -
బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. నితీశ్ కుమార్ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకెర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
బంగ్లాతో రెండో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లా కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.కోహ్లి రికార్డుపై కన్నేసిన సూర్య.. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.కోహ్లి 73 మ్యాచ్‌ల్లో ఈ రేర్ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు సూర్యకుమార్ కూడా ఢిల్లీ టీ20లో 39 పరుగులు చేస్తే సరిగ్గా 73 మ్యాచ్‌ల్లోనే అందుకుంటాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్ధానంలో ఉన్నాడు. బాబర్ 67 మ్యాచ్‌ల్లోనే 2500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్. -
Ind vs Ban మెదడు సరిగ్గా వాడితేనే: యువీ ఘాటు విమర్శలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘చురకలు’ అంటించాడు. బ్యాటింగ్ చేసేటపుడు మెదడును కాస్త అదుపులో పెట్టుకుంటేనే రాణించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయమేమిటంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అభిషేక్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపుఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. అయితే, మరుసటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత అభిషేక్ శర్మ మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.రనౌట్‌గా వెనుదిరిగిస్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న క్రమంలో అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేసిన టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సంజూ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్‌కు ఆస్కారం ఉందని భావించిన సంజూ, అభిషేక్ పరుగుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రమాదాన్ని గ్రహించిన సంజూ.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బంతిని అందుకున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ తౌహీద్ హృదోయ్..నేరుగా స్టంప్స్ వైపునకు విసిరాడు. దీంతో.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు వెళ్లిపోయిన అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16 పరుగులు) పెవిలియన్‌కు చేరకతప్పలేదు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడలేదు. సంజూ శాంసన్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! ఈ నేపథ్యంలో విజయానంతరం అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో టీమిండియా ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! సిరీస్‌లో మాకు శుభారంభం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, ఆ కామెంట్‌కు యువీ.. ‘‘కేవలం మెదడు ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యం’’ అన్న అర్థంలో జవాబు ఇచ్చాడు.కాగా అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఎదుగుదలలో యువీది కీలక పాత్ర. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు. అయితే, బాగా ఆడినపుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే విమర్శించడం యువీకి అలవాటు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున అభి వీరబాదుడు బాది.. నిర్లక్ష్యపు షాట్‌కు అవుటైనపుడు.. ‘నీ కోసం స్లిప్పర్ ఎదురు చూస్తోంది’ అంటూ యువీ చొరవగా ట్వీట్ చేశాడు. చదవండి: Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’ -
బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్! అతడి అరంగేట్రం
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సూర్య సేనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.నితీష్ కుమార్‌కు నో ఛాన్స్..ఇక రెండో టీ20లో అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్‌కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇదొక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో)
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.తొలుత బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన పాండ్యా.. తర్వాత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అయితే హార్దిక్ ఆడిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.పాండ్యా నో లుక్ షాట్.. భారత ఇన్నింగ్స్ 12 ఓవర్లో మూడో బంతిని హార్దిక్‌కు బంగ్లా పేసర్ టాస్కిన్ అహ్మద్ షార్ట్ పిచ్ బాల్ డెలివరీగా సంధించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం తను ఆశించిన మేరకు బౌన్స్ కాలేదు. అయితే ఇక్కడే హార్దిక్ తన యూటిట్యూడ్ను చూపించాడు. బంతిని చూడకుండానే నో లుక్ ర్యాంప్ షాట్ ఆడాడు.ఆడిన తర్వాత కనీసం బంతి ఎటువైపు వెళ్లింది అన్నది కూడా పాండ్యా చూడలేదు. బంతి కీపర్ తలపై నుంచి మెరుపు వేగంతో బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బౌలర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. పాండ్యా షాట్ చూసిన బంగ్లా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!The shot. The reaction. The result ➡️ EPIC 😎WATCH 🎥🔽 #TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank https://t.co/mvJvIuqm2B— BCCI (@BCCI) October 6, 2024 -
ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు.. బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్ధిని కేవలం 127 పరుగులకే కట్టడి చేసిన సూర్య సేన.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.ఇది కేవలం భారత జట్టు కాదని, ఐపిఎల్ స్టార్లతో కూడిన జట్టు అని అలీ కొనియాడాడు. కాగా బంగ్లాతో సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ మినహా మిగితా సీనియర్ ఆటగాళ్లంతా దూరమయ్యారు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదరగొట్టిన మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి యువ ఆటగాళ్లకు బంగ్లాతో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరితో పాటు గత రెండు ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శన కనబరిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటు దక్కింది. అయితే వీరు ముగ్గురూ తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. వరుణ్, మయాంక్ బౌలింగ్‌లో అదరగొట్టగా.. నితీష్ బ్యాటింగ్‌లో 16 పరుగులతో పర్వాలేదన్పించాడు."ఇది భారత్ టీమ్ కాదు, యువకులతో కూడిన ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్. ఈ సిరీస్‌కు యశస్వీ జైశ్వాల్, గిల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా తొలి టీ20లో ఆడలేదు. అయినప్పటకి భారత్ 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. హార్దిక్ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అస్సలు పాకిస్తాన్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ జట్టు ఇదేనా? భారత్‌పై టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూశారు. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే ఆటతీరును కనబరుస్తున్నారు. భారత్ గత కొంత కాలంగా వరల్డ్ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరోసారి బంగ్లా దేశ్ భారత్ ముందు తలొగ్గక తప్పదు. మరోవైపు మయాంక్ యాదవ్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా మలిచాడు. 149.8 kmph వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టాడు. అతడు 150 కి.మీ పైగా వేగంతో అతడు బౌలింగ్ చేయగలడు. కానీ అతడు ఇప్పుడే గాయం నుంచి కోలుకుని రావడంతో ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కచ్చితంగా అతడు బుమ్రా, షమీ, సిరాజ్‌ల సరసన చేరుతుడాని" తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సిక్సర్ బాది టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.విరాట్ కోహ్లి అరుదైన రికార్డు బద్దలుఈ క్రమంలో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన సూర్యకుమార్ సేన తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో.. బ్యాటర్లు విఫలం కావడంతో 19.5 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ధనాధన్ దంచికొట్టారుఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(ఏడు బంతుల్లో 16) వేగంగా ఆడగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 29) ధనాధన్ దంచికొట్టాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి 16(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని చూడకుండానే వికెట్ కీపర్ తల మీదుగా పాండ్యా ఆడిన ర్యాంప్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. సిక్సర్‌తో ముగింపుఈ క్రమంలో పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులతో 243కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. పన్నెండవ ఓవర్ ఐదో బంతికి.. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఛేజింగ్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఇలా మ్యాచ్ ఫినిష్ చేయడం ఐదోసారి. అంతకు ముందు విరాట్ కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను అధిగమించిఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న హార్దిక్ పాండ్యా.. భారత్ తరఫున 87 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అర్ష్‌దీప్ సింగ్(86)ను అధిగమించి.. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టీమిండియా ప్రపంచ రికార్డు.. పాకిస్తాన్‌తో పాటు టాప్‌లో
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.127 పరుగులకు బంగ్లా ఆలౌట్తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో రోహిత్ సేన పర్యాటక జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ టీ20లలోనూ శుభారంభం చేసింది. గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా కొత్త క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడింది.టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ మూడు(3/14), హార్దిక్ పాండ్యా(1/26), మయాంక్ యాదవ్(1/21) ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లలో రీ ఎంట్రీ వీరుడు వరుణ్ చక్రవర్తి మూడు(3/31), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్(1/12) తీశారు.పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సమంఈ క్రమంలో టీమిండియా.. అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. తద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, ఉగాండా, వెస్టిండీస్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు👉టీమిండియా- 42 సార్లు👉పాకిస్తాన్- 42 సార్లు👉న్యూజిలాండ్- 40 సార్లు👉ఉగాండా- 35 సార్లు👉వెస్టిండీస్- 32 సార్లుఇదిలా ఉంటే.. తొలి టీ20లో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(29), అభిషేక్ శర్మ(16) ధనాధన్ దంచికొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(29) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు నితీశ్ రెడ్డి 16.. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39) పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్Hardik Pandya finishes off in style in Gwalior 💥#TeamIndia win the #INDvBAN T20I series opener and take a 1⃣-0⃣ lead in the series 👌👌Scorecard - https://t.co/Q8cyP5jXLe@IDFCFIRSTBank pic.twitter.com/uYAuibix7Q— BCCI (@BCCI) October 6, 2024 -
నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్
ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ టీమిండియా తరఫున అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో తన తొలి ఓవర్లోనే మెయిడెన్ వేసి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో.. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగలిగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా టీమిండియాలో అడుగుపెట్టి మయాంక్ ఈ మేర రాణించడం విశేషం.కాస్త ఆందోళనగానే ఉన్నాఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. అరంగేట్రానికి ముందు తన మనఃస్థితి ఎలా ఉందో వివరించాడు. ‘‘మ్యాచ్‌కు ముందు నేను కాస్త ఆందోళనగానే ఉన్నా. ఎందుకంటే.. గాయం తర్వాత నేను కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.డైరెక్ట్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. అయితే, మా కెప్టెన్ వచ్చి నాతో మాట్లాడాడు. బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించాలనే ఆతురత వద్దని.. సహజమైన శైలిలో ఆడాలని సూచించాడు. గ్వాలియర్ వికెట్ కూడా మరీ అంత బౌన్సీగా లేదు.అందుకే స్లో బాల్స్ వేశానుకాబట్టి నేను మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్‌లోనూ నేను కొన్ని స్లో బాల్స్ వేశాను. ఇక గంభీర్ భయ్యా కూడా మ్యాచ్ ఆరంభానికి ముందే నాతో మాట్లాడారు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అనే విషయం మరిచిపోతేనే ఒత్తిడి నుంచి బయటపడగలనని చెప్పారు.ఆందోళన చెందకుండా కూల్‌గా ఉండాలని.. ప్రయోగాలకు వెళ్లకుండా సహజమైన శైలినే అనుసరించాలని చెప్పారు. కెప్టెన్, కోచ్ సూచనలు పాటించడం వల్లే సానుకూల ఫలితం వచ్చింది’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20వేదిక: శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం.. గ్వాలియర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ స్కోరు: 127 (19.5)టీమిండియా స్కోరు: 132/3 (11.5)ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(3/14).చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
తొలి టీ20.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదిపడేసింది. కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ( 39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, మెహాది హసన్ మిరాజ్ తలా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచాడు. వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు చేరారు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. -
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్..
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మయాంక్.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను మెయిడెన్ ఓవర్‌తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్ సాధించాడు. -
పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా?
టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జెర్సీలో కన్పించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత తుది జట్టులో వరుణ్ చోటు దక్కించుకున్నాడు.86 మ్యాచ్‌లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చిన భారత జట్టు మెనెజ్‌మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది.గంభీర్ ఎఫెక్ట్.. కాగా వరుణ్ చక్రవర్తి పునరాగమనం వెనక గంభీర్ మార్క్ ఉంది. చక్రవర్తికి గంభీర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చక్రవర్తి తన ప్రదర్శనతో గౌతీని ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023, 24 సీజన్లలో మొత్తంగా వరుణ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని గంభీర్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.పాపం బిష్ణోయ్బిష్ణోయ్ గత కొన్నాళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్ణోయ్ నిరూపించుకున్నాడు. గతంలో నెం1 టీ20 బౌలర్‌గా రవి నిలిచాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024కు మాత్రం అతడిని సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్నర్‌ను జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ఎంపిక చేశారు. ఈ రెండు పర్యటనలలోనూ బిష్ణోయ్ సత్తాచాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్ణోయ్..శ్రీలంకపై 6 కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటకి బంగ్లాతో తొలి టీ20కు బిష్ణోయ్‌ను పక్కటన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. -
IND Vs BAN: బంగ్లాతో తొలి టీ20.. మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఢిల్లీ యువ పేసర్ మయాంక్ యాదవ్ భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేతుల మీదగా వీరిద్దరూ భారత క్యాప్‌లను అందుకున్నారు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేయడంతో ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. కాగా గ్వాలియర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.తుది జట్లుబంగ్లాదేశ్: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాంభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్లు వాళ్లే: సూర్య
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో ముందుకు వెళ్లనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. అంతేకాదు.. మయాంక్ యాదవ్ ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.సూర్యకుమార్ సారథ్యంలోకాగా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో చెన్నై, కాన్పూర్ టెస్టుల్లో గెలుపొందిన రోహిత్ సేన.. సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా టీ20లకు సిద్దమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. టీ20 మ్యాచ్‌కు సరిపోయే పిచ్ ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ప్రణాళికల గురించి వెల్లడించాడు. ‘‘ఈసారి అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇక మేము ఇక్కడ రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. అయితే, వికెట్ మరీ లోగా, స్లోగా ఏమీ లేదు. కొంతమంది మూడు రోజులు కూడా ఇక్కడ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.వికెట్లో ఎవరికీ పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. టీ20 మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ ఇది. అయితే, మ్యాచ్ ఏకపక్షంగా మాత్రం ఉండబోదనే అనుకుంటున్నాం’’ అని సూర్య తెలిపాడు. ఇక తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన యువ పేసర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తావనకు రాగా.. అతడిని ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా సూర్యకుమార్ అభివర్ణించాడు.అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‘‘ప్రస్తుతం జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఇక మయాంక్ విషయానికొస్తే.. అతడు ఎక్కువగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. అయితే, మయాంక్ ఆట తీరు ఎలా ఉంటుందో అందరూ ఇప్పటికే చూశారు.అతడి రాక వల్ల జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్లో అతడి ఎక్స్ ట్రా పేస్‌ను మనం చూశాము. కాబట్టి మయాంక్‌పైనే అందరి దృష్టి ఉంది. జట్టులోని మిగతా యువ ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా మయాంక్ జట్టుతో చేరడం శుభసూచకం. టీమిండియాకు అతడి వల్లే మేలు జరుగుతుందని భావిస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకునికాగా ఈ ఏడాది ఐపీఎల్-2024లో అరంగేట్రం చేశాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకుని ఆటలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: ‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’ 🗣️ It's a good opportunity for the youngsters & newcomers.#TeamIndia Captain @surya_14kumar ahead of the T20I series against Bangladesh.#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/T7kM6JO02o— BCCI (@BCCI) October 5, 2024 -
ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం(అక్టోబరు 6) గ్వాలియర్ వేదికగా తొలి టీ20కి షెడ్యూల్ ఖరారైంది.అది సానుకూలాంశమేఈ నేపథ్యంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. జట్టులో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయగల బ్యాటర్లు ఉండటం సానుకూలాంశమని తెలిపాడు. శ్రీలంక పర్యటనలోనూ ఈ తరహా ప్రయోగం చేశామని.. ఆటగాళ్లలో ఉన్న భిన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదన్నాడు. అందుకే బ్యాటర్ల చేతికీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడమని తెలిపాడు.రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడాఈ క్రమంలో సూర్యకుమార్ ఐపీఎల్ భవితవ్యం, ఫ్రాంఛైజీ క్రికెట్ కెప్టెన్సీ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు నన్ను ఇరుకున పెట్టేశారు(నవ్వుతూ). ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా.. అవసరమైనపుడు సలహాలు ఇచ్చేవాడిని. మీకే తెలుస్తుందిఇక టీమిండియా విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో పాటు.. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలోనూ నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు నడిపించాలో ఇతర కెప్టెన్లను చూసి నేర్చుకోవడానికి సందేహించను.జీవితం ఇలా ముందుకు సాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగబోతుందో మీకే తెలుస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెప్టెన్సీ అంశంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా సూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.పాండ్యా సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవంకాగా ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా సారథ్యంలో ముంబై ఘోర పరాభవం చవిచూసింది. ముంబై ఇండియన్స్ సారథిగా సూర్య?ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జట్టులో ఉన్న సూర్య గతంలో అతడి గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులోనూ ఇదే తరహా మార్పు జరుగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య వ్యాఖ్యలు కూడా వాటికి కాస్త ఊతమిచ్చేలాగానే ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్‌బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని తిలక్ వర్మతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటివరకు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 తర్వాత ఈ హైదరాబాదీ గాయ పడ్డాడు. దీంతో అతడిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది.భారత టీ20 జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మచదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
Ind vs Ban: హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం షురూ
సాక్షి, హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 12న మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider వెబ్సైట్/యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో మార్పిడి చేసుకొని మ్యాచ్ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అమ్ముతున్నామని...ఆఫ్‌లైన్‌లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచి్చంది. -
టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్
టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.మొదటి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామని శాంటో థీమా వ్యక్తం చేశాడు."భారత్‌తో టీ20 సిరీస్‌కు మేము అన్ని విధాల సన్నద్దమయ్యాం. ఈ సిరీస్‌ను గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాము. దూకుడుగా ఆడాలనుకుంటున్నాము. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరేందుకు మాకు మంచి అవకాశం లభించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము సెమీస్‌కు చేరుకోలేకపోయాము.మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ భారత్‌పై సత్తాచాటుతారని భావిస్తున్నాను. మేము భారత్‌తో టెస్ట్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. మేము ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. టెస్టు క్రికెట్‌కు టీ20 పూర్తిగా భిన్నం. ఆ రోజున ఎవరూ మెరుగైన ప్రదర్శన చేస్తే వారిదే విజయమని" షాంటో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ -
భారత్-బంగ్లా తొలి టీ20.. స్టేడియం వద్ద మూడంచెల భద్రత
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కన్నేసింది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.తుది జట్లు అంచనాభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్ -
ఇదేం బౌలింగ్?.. హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!
దాదాపు రెండు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సందర్భంగా ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో యువ పేస్ దళంతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్ శైలి పట్ల మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టంప్స్‌నకు మరీ దగ్గరగా బంతిని విసిరే విధానాన్ని మార్చుకోవాలని హార్దిక్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. పరిగెత్తుతూ.. బాల్‌ను రిలీజ్ చేసేటపుడు కూడా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఆల్‌రౌండర్‌తో మోర్కెల్ గట్టిగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తన శైలికి భిన్నంగా మోర్కెల్ కాస్త స్వరం హెచ్చించి మరీ.. పాండ్యాకు పదే పదే బౌలింగ్ యాక్షన్ గురించి హితభోద చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే, ఇందుకు పాండ్యా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం.. యువ ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లపై మోర్కెల్ దృష్టి సారించి.. వారి చేత ప్రాక్టీస్ చేయించినట్లు సమాచారం.సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీటఇదిలా ఉంటే.. పేస్ బ్యాటరీ స్పీడ్ గన్స్‌ను తీసుకువచ్చిందంటూ ఈ బౌలర్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా హార్దిక్ పాండ్యా చివరగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ టూర్ సందర్భంగా భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పేరును ప్రకటిస్తారనుకుంటే.. బీసీసీఐ మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీట వేసింది. మూడు టీ20లు.. వేదికలు ఇవేఅరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్‌కు గాయాల బెడద పొంచి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇక తాజా సిరీస్ విషయానికొస్తే.. ఆదివారం(అక్టోబరు 6) నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా జరిగే మూడు మ్యాచ్‌లకు గ్వాలియర్(అక్టోబరు 6), ఢిల్లీ(అక్టోబరు 9), హైదరాబాద్(అక్టోబరు 12) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో మొదటి టీ20 కోసం గ్వాలియర్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా యువ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.చదవండి: T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024 -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్ 6న బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్‌లు ఆడి 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విరన్‌దీప్ 84 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్‌దీప్, విరాట్ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (15), ఆఫ్ఘన్ ఆటగాడు మొహమ్మద్ నబీ (14), టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఉన్నారు.కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్‌కు సిద్ధం! -
టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్‌కు సిద్ధం!
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా పేస్ బౌలర్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. భారత స్పీడ్ గన్స్ అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా పసికూన బంగ్లాదేశ్‌పై ఫైరింగ్‌కు సిద్దమవుతున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో భారత పేస్ విభాగం రాటుదేలుతుంది. టీమిండియా పేసర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమైన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ -
బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 (అక్టోబర్ 6న) గ్వాలియర్ వేదికగా జరుగనుండగా.. రెండో టీ20 (అక్టోబర్ 9న) ఢిల్లీలో.. మూడో టీ20 (అక్టోబర్ 12న) హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లను ఇదివరకే ప్రకటించారు. తొలి టీ20 ప్రారంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో భారత తుది జట్టులో ఎవరెవరు ఉంటారన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు సూర్యకుమార్ నాయకత్వం వహిస్తుండగా.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా మిగతా సభ్యులుగా ఉన్నారు.ఓపెనర్లుగా సంజూ, అభిషేక్యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం దాదాపుగా ఖరారైంది. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్య, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వరుసగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.నితీశ్‌కు ఎదురుచూపు తప్పదు..!పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్, దూబే తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఎదురుచూపు తప్పేలా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయ్ ఎంపిక దాదాపుగా ఖరారు కాగా.. వరుణ్ చక్రవర్తికి నిరాశ తప్పదు. పేసర్ల కోటాలో అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బంగ్లాదేశ్‌తో తొలి టీ20కు భారత తుది జట్టు (అంచనా):అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్చదవండి: T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్