ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ టీమిండియా తరఫున అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో తన తొలి ఓవర్లోనే మెయిడెన్ వేసి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో.. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగలిగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా టీమిండియాలో అడుగుపెట్టి మయాంక్ ఈ మేర రాణించడం విశేషం.
కాస్త ఆందోళనగానే ఉన్నా
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. అరంగేట్రానికి ముందు తన మనఃస్థితి ఎలా ఉందో వివరించాడు. ‘‘మ్యాచ్‌కు ముందు నేను కాస్త ఆందోళనగానే ఉన్నా. ఎందుకంటే.. గాయం తర్వాత నేను కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.
డైరెక్ట్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. అయితే, మా కెప్టెన్ వచ్చి నాతో మాట్లాడాడు. బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించాలనే ఆతురత వద్దని.. సహజమైన శైలిలో ఆడాలని సూచించాడు. గ్వాలియర్ వికెట్ కూడా మరీ అంత బౌన్సీగా లేదు.
అందుకే స్లో బాల్స్ వేశాను
కాబట్టి నేను మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్‌లోనూ నేను కొన్ని స్లో బాల్స్ వేశాను. ఇక గంభీర్ భయ్యా కూడా మ్యాచ్ ఆరంభానికి ముందే నాతో మాట్లాడారు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అనే విషయం మరిచిపోతేనే ఒత్తిడి నుంచి బయటపడగలనని చెప్పారు.
ఆందోళన చెందకుండా కూల్‌గా ఉండాలని.. ప్రయోగాలకు వెళ్లకుండా సహజమైన శైలినే అనుసరించాలని చెప్పారు. కెప్టెన్, కోచ్ సూచనలు పాటించడం వల్లే సానుకూల ఫలితం వచ్చింది’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20
వేదిక: శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం.. గ్వాలియర్
టాస్: టీమిండియా.. బౌలింగ్
బంగ్లాదేశ్ స్కోరు: 127 (19.5)
టీమిండియా స్కోరు: 132/3 (11.5)
ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(3/14).
చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
Comments
Please login to add a commentAdd a comment