T20 series
-
WI vs Aus: పదేళ్ల తర్వాత తొలిసారిగా.. షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో పోటీపడనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే తమ దేశంలో పర్యటించనుందని తెలిపింది.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో తొలి సిరీస్మరోవైపు.. ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి బెన్ ఓలివర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డులకు ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత ఇరుజట్లు టెస్టు సిరీస్ ఆడటం శుభసూచకమని.. ఈ సిరీస్‌ను మూడు మ్యాచ్‌లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025-2027 ఎడిషన్‌లో ఇదే తమకు ఇదే తొలి సిరీస్ అని.. ఈసారీ ఫ్రాంక్ వొరిల్ ట్రోఫీని తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఐదు టీ20లు కూడా ఆడనున్నట్లు ఓలివర్ తెలిపారు. ఏడాది తర్వాత జరునున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదే ఆరంభ సన్నాహకం కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప్రస్తుతంశ్రీలంక పర్యటనలో ఉంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఇక ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లకు షెడ్యూల్మూడు టెస్టులుతొలి టెస్టు: జూన్ 25- 20- బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్రెండో టెస్టు: జూలై 3-7- సెయింట్ జార్స్, గ్రెనెడామూడో టెస్టు: జూలై 12- 16- కింగ్స్టన్, జమైకాటీ20 సిరీస్‌తొలి టీ20- జూలై 20- కింగ్స్టన్, జమైకారెండో టీ20- జూలై 22- కింగ్స్టన్, జమైకామూడో టీ20- జూలై 25- బసెటెరె, సెయింట్ కిట్స్నాలుగో టీ20- జూలై 26- బసెటెరె, సెయింట్ కిట్స్ఐదో టీ20- జూలై 28- బసెటెరె, సెయింట్ కిట్స్అతడి జ్ఞాపకార్థంవెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో విజేతకు ఫ్రాంక్ వొరిల్ అవార్డు ప్రదానం చేస్తారు. వెస్టిండీస్ జట్టు తొలి నల్లజాతి కెప్టెన్‌గా పేరొందిన వొరిల్ జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు. 1960-61లో తొలిసారి ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని ప్రదానం చేశారు.ఇక 1995 నుంచి ఇప్పటి దాకా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే, గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆసీస్ ఆధిపత్యాన్ని తగ్గించింది. గబ్బాలో అనూహ్య విజయంతో సిరీస్‌ను 1-1తో డ్రా చేసి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్‌పై టెస్టు విజయం నమోదు చేసింది.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ పాకిస్తాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రిజ్వాన్ బృందంతో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. జూలై 31 నుంచి టీ20లు, ఆగష్టు 8 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. -
‘ఇగో’ చూపించాలనుకుంటే జట్టులో చోటుండదు: సంజూకు వార్నింగ్
టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ ‘ఇగో’ చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టీ20 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.స్వదేశంలో బట్లర్ బృందంతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)లో సంజూ మొత్తంగా కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. పదే పదే ఒకే రీతిలో అవుటయ్యాడు. షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగాడు.‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడు.మరోసారి పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి.. అతడు తన ‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నా. ‘లేదు.. లేదు.. నేను ఈ షాట్ కచ్చితంగా ఆడగలను’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.అసలు అతడు ఫామ్‌లేమితో సతమతమయ్యాడా? లేదంటే.. ‘ఇగో’ ట్రిప్‌నకు ఏమైనా వెళ్లాడా? నాకైతే అతడి గురించి ఏమీ ఏమీ అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌లో.. నిజంగా తీవ్రంగా నిరాశపరిచాడు.జైస్వాల్ తిరిగి వస్తాడుసంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నాం కదా! ఇదిలో ఇలాగే ఆడితే మాత్రం.. సెలక్టర్లు మాత్రం అతడిపై మరోసారి వేటు వేస్తారు. యశస్వి జైస్వాల్ తిరిగి వస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను కాదని యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తారు’’ అని చిక్కా సంజూకు హెచ్చరికలు జారీ చేశాడు.గాయం.. ఆరు వారాలు దూరంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్‌తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్ చేస్తుండగా సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.‘స్కానింగ్‌లో స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో శాంసన్ ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. పుణే వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు జమ్మూ కశ్మీర్‌తో కేరళ ఆడే రంజీ క్వార్టర్ ఫైనల్ పోరులో అతను బరిలోకి దిగడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సామ్సన్ ఐపీఎల్ కల్లా అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది.ఇక ఐపీఎల్లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గురువారం(ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో జరిగే తొలి వన్డేతో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్! వైరల్
ఇంగ్లండ్‌తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్‌కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్‌తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.150 పరుగుల తేడాతో మట్టికరిపించికాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్‌లు ఉన్నాయి.అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం వల్ల దూరంఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్‌తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు. చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో భారీ తేడాతో గెలుపొంది.. ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్లలో ఇంత వరకు.. ఏ టీమ్కీ సాధ్యం కాని రీతిలో ‘బిగ్గెస్ట్ విక్టరీ(Biggest Victory)’ల విషయంలో అత్యంత అరుదైన ఘనత సాధించింది.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1(India Won Series With 4-1)తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో ఈ సిరీస్ ఆరంభించిన టీమిండియా.. చెన్నైలోనూ గెలిచింది. అయితే, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.ఏకపక్ష విజయం అయితే, పడిలేచిన కెరటంలా పుణె వేదికగా మరోసారి సత్తా చాటి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో టీమిండియాకు ఇంగ్లండ్ గట్టి పోటీనివ్వగా.. నామమాత్రపు ఆఖరి టీ20లో మాత్రం సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.అభిషేక్ పరుగుల సునామీవాంఖడేలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మార్క్‌వుడ్ సంజూ శాంసన్(16)ను త్వరగానే పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించినా.. ఆ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు కనబరిచాడు.ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇతరులలో తిలక్ వర్మ(15 బంతుల్లో 24), శివం దూబే(13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.బౌలర్ల విజృంభణ ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) అర్ధ శతకం సాధించగా.. మిగతా వాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెన్ డకెట్ 0, కెప్టెన్ బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్‌స్టోన్ 9, జాకొబ్ బెతెల్ 10, బ్రైడన్ కార్సే 3, జేమీ ఓవర్టన్ 1, జోఫ్రా ఆర్చర్ 1*, ఆదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0 పరుగులు చేశాడు.ప్రపంచంలోనే ఏకైక జట్టుగాఫలితంగా 97 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, శివం దూబే, అభిషేక్ శర్మచ వరుణ్ చక్రవర్తి తలా రెండు.. రవి బిష్ణోయి ఒక వికెట్ తీశాడు. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. టీమిండియా చేతిలో 150 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది.కాగా టీమిండియా అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థి జట్టుపై 150 పైచిలుకు పరుగులతో విజయం సాధించడం ఇది రెండోసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. అంతేకాదు.. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లపై ఎక్కువసార్లు(4) గెలుపొందిన టీ20 టీమ్‌గానూ తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఇక వన్డేల్లోనూ బిగ్గెస్ట్ విక్టరీ సాధించిన జట్టుగా టీమిండియాకు రికార్డు ఉంది. శ్రీలంకపై 2023లో తిరువనంతపురం వేదికగా 317 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్లు(ఫుల్ మెంబర్ సైడ్)👉ఇండియా- న్యూజిలాండ్‌పై 2023లో అహ్మదాబాద్ వేదికగా 168 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఇంగ్లండ్‌పై 2025లో ముంబై వేదికగా 150 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్- వెస్టిండీస్‌పై 2018లో కరాచీ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఐర్లాండ్‌పై 2018లో డబ్లిన్ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇంగ్లండ్- వెస్టిండీస్‌పై 2019లో బెసెటెరె వేదికగా 137 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- సౌతాఫ్రికాపై 2024లో జొహన్నస్‌బర్గ్ వేదికగా 135 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య -
అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్ అరుదైన ఘనత
సౌతాఫ్రికా గడ్డపై శతకాలతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్ సంజూ శాంసన్(Sanju Samson).. స్వదేశంలో మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఐదో టీ20 సందర్భంగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్‌తో కలిసి ఎలైట్ క్లబ్లో చేరాడు.కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సంజూ శాంసన్ రెండు అంతర్జాతీయ టీ20 శతకాలు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై కూడా బ్యాట్ ఝులిపిస్తాడని ఎదురుచూసిన అభిమానులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ నిరాశపరిచాడు.ఆరంభం బాగున్నాకోల్కతాలో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన సంజూ.. ఆ తర్వాత చెన్నైలో ఐదు, రాజ్‌కోట్‌లో మూడు, పుణెలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో సంజూ శాంసన్ అంచనాలు అందుకోలేకపోయాడు. ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయాడు.తొలి బంతికే సిక్స్ బాదిమొత్తంగా ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ సంజూ విఫలమైనప్పటికీ.. తన ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ఆరంభించడం ద్వారా అరుదైన ఫీట్ నమోదు చేశాడు.టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ బాదిన మూడో భారత క్రికెటర్‌గా సంజూ చరిత్రకెక్కాడు. అంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు. కాగా ఇంగ్లండ్‌తో ఐదో టీ20లొ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీప్ స్వ్కేర్ లెగ్ మీదుగా ఫ్లాట్ సిక్స్(70 మీటర్లు) బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతడు మరో సిక్స్, ఫోర్ బాదడం విశేషం.సంజూకు భారత మాజీ క్రికెటర్ మద్దతుఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ ఇంగ్లండ్‌తో ఐదు టీ20లలో కలిపి కేవలం 51 పరుగులే చేశాడు. దీంతో అతడి నిలకడలేమి ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘టీ20 క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. ముఖ్యంగా బ్యాటింగ్ టాలెంట్ కోసం చూస్తున్నట్లయితే.. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.మ్యాచ్‌పై వారి ప్రభావం ఎలా ఉంటోంది.. జట్టు కోసం వారు ఏం చేయగలరన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంజూ శాంసన్ విషయానికొస్తే.. కఠినమైన పిచ్‌లపై అతడు అద్బుతమైన శతకాలతో జట్టును గెలిపించాడు.టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిదికాబట్టి అలాంటి వాళ్లు కొన్నిసార్లు విఫలమైనా పెద్దగా పట్టించుకోకూడదు. అయితే, దీర్ఘకాలంలో ఇదే పునరావృతమైనా కాస్త వేచిచూడాలి. టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిది. దూకుడుగా ముందుకెళ్లేందుకు రిస్క్ తీసుకుంటే ఇలాంటివి తప్పవు. ఇలాంటి వాళ్లకు ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు’’ అని సంజయ్ మంజ్రేకర్ సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, ఐదో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన క్రికెటర్లురోహిత్ శర్మ- 2021లో ఇంగ్లండ్‌పై- అహ్మదాబాద్ వేదికగా ఆదిల్ రషీద్ బౌలింగ్లోయశస్వి జైస్వాల్- 2024లో జింబాబ్వేపై- హరారే వేదికగా సికందర్ రజా బౌలింగ్లోసంజూ శాంసన్- 2025లో ఇంగ్లండ్‌పై- ముంబై వేదికగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్All those fake narrative PR by Rishabh Pant against Sanju Samson that "can't play extra pace, can't play short ball, can't play Archer". Sanju silenced all those critics by his performance🥵 . 6️⃣, 6️⃣ and 4️⃣ vs Jofra Archer in the FIRST over of the match. pic.twitter.com/YmAxAqoXrw— Rosh🧢 (@ImetSanjuSamson) February 3, 2025 -
వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.4-1తో కైవసంఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో సిరీస్‌ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.అనంతరం రాజ్‌కోట్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అభిషేక్ శర్మ ఊచకోతఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.97 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రిస్క్ అని తెలిసినాఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.మ్యాచ్‌కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.వాళ్లిద్దరు అద్భుతంఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్‌లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025 -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం లెక్కచేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 37 బంతల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు తన హాఫ్ సెంచరీని శర్మ కేవలం 17 బంతుల్లోనే అందుకున్నాడు.ఓవరాల్‌గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో ఈ పంజాబీ క్రికెటర్ సత్తాచాటాడు. ఇక సెంచరీతో చెలరేగిన శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన అభిషేక్.. గిల్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్దానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంకపై హిట్‌మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే శతకొట్టాడు.👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 13 సిక్స్‌లు కొట్టిన అభిషేక్.. రోహిత్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.బటీ20ల్లో ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండేది. ఫించ్ ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన శర్మ.. ఫించ్ రికార్డును బద్దలు కొట్టాడు.భారత్ విజయ భేరి..ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ విజయంతో ముగించింది. ఆఖరి టీ20లో 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(135)తో పాటు.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. వుడ్ రెండు, అర్చర్,రషీద్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.చదవండి: తొలి కల నెరవేరింది -
అభిషేక్...అమోఘం
ఇన్నింగ్స్ తొలి బంతికే సామ్సన్ సిక్స్‌తో భారత్ ఆట ఆరంభం. మూడో ఓవర్లో బౌండరీతో అభిషేక్ ధాటి కాస్త ఆలస్యం! అంతే ఇక ఆ ఓవర్లోనే రెండు సిక్స్‌లతో పదునెక్కిన ప్రతాపం. ఆర్చర్, మార్క్ వుడ్, ఓవర్టన్ ఇలా పేసర్లు మారినా... లివింగ్‌స్టోన్, రషీద్‌లు స్పిన్నేసినా... బంతి గమ్యం, అభిషేక్ వీరవిహారం... ఈ రెండూ ఏమాత్రం మారలేదు. 13 సిక్సర్లతో ‘వాంఖెడే’కు అభిషేకం... 37 బంతుల్లోనే శతకం... 18వ ఓవర్ దాకా అతనొక్కడిదే విధ్వంసం!ఆఖరి పోరు గెలిచి ఆతిథ్య దేశం ఆధిక్యానికి గండి కొట్టేద్దామనుకుంటే ఇంగ్లండ్ కనీసం జట్టంతా కలిపి 100 పరుగులైనా కొట్టలేకపోయింది. ప్రత్యర్థి పేస్, స్పిన్ వైవిధ్యం అభిషేక్ శర్మ ధాటిని ఏ ఓవర్లోనూ, ఏ బౌలింగ్‌తోనూ అసలు ప్రభావమే చూపలేకపోయింది. ముంబై: ఏఐ... అదేనండీ అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కానీ వాంఖెడే స్టేడియంలో మాత్రం మరో ఏఐ... అదే భయ్యా అభిషేక్ ఇంటలిజెంట్ బ్యాటింగ్ వైపే ఓ గంటసేపు కన్నార్పకుండా చూసేలా చేసింది. ఇది కదా ఫన్... ధన్ ధనాధన్! ఇదే కదా ఈ టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మిస్సయ్యింది. అయితేనే ఆఖరి పోరులో ఆవిష్కృతమైంది. అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ఆమోఘ శతకం, అదేపనిగా విధ్వంసం ముంబై వాసుల్ని మురిపించింది. టీవీ, మొబైల్ యాప్‌లలో యావత్ భారత అభిమానుల్ని కేరింతలతో ముంచెత్తింది. అతని ఆటలో అయ్యో ఈ షాట్‌ను చూడటం మిస్ అయ్యామే అని బహుశా ఏ ఒక్కరికీ అనిపించి ఉండకపోవచ్చు! ఎందుకంటే ప్రతి షాట్ హైలైట్స్‌నే తలదన్నేలా ఉంది. ఆదివారం అసలైన టి20 వినోదాన్ని పంచిన చివరి టి20లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 247 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు మెరిపించాడు. బ్రైడన్ కార్స్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టమైన లక్ష్యం ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ 10.3 ఓవర్లలోనే 97 పరుగుల వద్దే ఆలౌటైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాదిన అర్ధశతకంతో ఆ మాత్రం స్కోరు చేసింది. మిగతావారిలో జాకబ్ బెథెల్ (10; 1 సిక్స్) తప్ప అందరివి సింగిల్ డిజిట్లే! షమీ 3 వికెట్లు పడగొడితే ఒక్క ఓవర్ వేసిన అభిషేక్, దూబే, వరుణ్‌లు తలా 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 11వ ఓవర్ ముగియక ముందే స్పిన్‌తో దున్నేశారు. ఇంగ్లండ్ పాలిట సిక్సర పిడుగల్లే... మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే మ్యాచ్ అంతటిని అభిషేక్ ఒక్కడే షేక్ చేశాడు. ఐదు పదుల బంతులు (54) ఎదుర్కొంటే ఇందులో కేవలం 5 మాత్రమే డాట్ బాల్స్. అంటే పరుగు రాలేదు. కానీ మిగతా 49 బంతుల్లో ‘రన్’రంగమే... ప్రత్యర్థి బౌలర్లేమో లబో... దిబో! ఇది అభిషేక్ సాగించిన విధ్వంసం. 17 బంతుల్లోనే అతను సాధించిన ఫిఫ్టీ భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధశతకమైంది. అంతేనా... పవర్ ప్లే (6 ఓవర్లు)లో జట్టు స్కోరు 95/1 ఇది భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లోనే అత్యధిక స్కోరైంది. ఆ తర్వాత 37 బంతుల్లోనే దంచేసిన మెరుపు శతకం శాశ్వత దేశాల మధ్య రెండో వేగవంతమైన సెంచరీగా పుటలకెక్కింది. 2017లో మిల్లర్ (దక్షిణాఫ్రికా) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టాడు. 3.5 ఓవర్లో 50 పరుగులు దాటిన భారత్ స్కోరు అతనొక్కడి జోరుతో 6.3 ఓవర్లోనే వందకు చేరింది. భారత్ 12వ ఓవర్లో 150, 16వ ఓవర్లో 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. మిగతావారిలో శివమ్ దూబే కాస్త మెరిపించాడు. అయితే దూబే (2–0–11–2) బౌలింగ్ స్పెల్‌తో గత మ్యాచ్ ‘కన్కషన్’ విమర్శలకు తాజా మ్యాచ్‌లో బంతితో సమాధానమిచ్చాడు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 16; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 135; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) కార్స్ 24; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; దూబే (సి) రషీద్ (బి) కార్స్ 30; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 9; రింకూసింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; అక్షర్ రనౌట్ 15; షమీ నాటౌట్ 0; రవి బిష్ణోయ్ (సి) కార్స్ (బి) ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–21, 2–136, 3–145, 4–182, 5–193, 6–202, 7–237, 8–247, 9–247. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–55–1, మార్క్‌వుడ్ 4–0–32–2, ఓవర్టన్ 3–0–48–1, లివింగ్‌స్టోన్ 2–0–29–0, అదిల్ రషీద్ 3–0–41–1, బ్రైడన్ కార్స్ 4–0–38–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సబ్–జురేల్ (బి) దూబే 55; డకెట్ (సి) అభిషేక్ (బి) షమీ 0; బట్లర్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 7; హ్యారీ బ్రూక్ (సి) వరుణ్ (బి) రవి బిష్ణోయ్ 2; లివింగ్‌స్టోన్ (సి) రింకూ (బి) వరుణ్ 9; జాకబ్ (బి) దూబే 10; కార్స్ (సి) వరుణ్ (బి) అభిషేక్ 3; ఓవర్టన్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ 1; ఆర్చర్ నాటౌట్ 1; రషీద్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 6; మార్క్‌వుడ్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 97. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–59, 4–68, 5–82, 6–87, 7–90, 8–90, 9–97, 10–97. బౌలింగ్: షమీ 2.3–0–25–3, హార్దిక్ పాండ్యా 2–0–23–0, వరుణ్ 2–0–25–2, రవి బిష్ణోయ్ 1–0–9–1, శివమ్ దూబే 2–0–11–2, అభిషేక్ 1–0–3–2. ఆహా... ఆదివారంభారత క్రీడాభిమానులకు ఆదివారం పండుగలా గడిచింది. మధ్యాహ్నం కౌలాలంపూర్‌లో భారత అమ్మాయిల జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చిరస్మరణీయ ఆటతీరుతో అదరగొట్టింది. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించింది. రాత్రి ఇటు ముంబైలో భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌పై వీరంగం సృష్టించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టి20ల్లో రెండోసారి ‘శత’క్కొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్న అభిషేక్ అమోఘమైన ఆటతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135) చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్; న్యూజిలాండ్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. 2 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన సెంచరీ (37 బంతుల్లో) చేసిన రెండో ఆటగాడు అభిషేక్. రోహిత్ శర్మ (35 బంతుల్లో; శ్రీలంకపై) అగ్రస్థానంలో ఉన్నాడు. 13 ఈ మ్యాచ్‌లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు. భారత్ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. రోహిత్ (10 సిక్స్‌లు; శ్రీలంకపై), సామ్సన్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై), తిలక్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై) రెండో స్థానాల్లో ఉన్నారు. -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ అరంగేట్రంలోనే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy)నూ హర్షిత్ ఆడవచ్చని అంచనా వేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. గతేడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నాడు కోల్‌కతా మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షిత్‌కు జాతీయజట్టులో త్వరగానే అవకాశం వచ్చింది.ఆసీస్‌లో అరంగేట్రంఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పెర్త్ టెస్టులో నాలుగు వికెట్లతో మెరిశాడు. అయితే, అంతకంటే ముందే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చికానీ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి మూడు వికెట్లు కూల్చాడు. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(9)తో పాటు జాకొబ్ బెతల్(6) రూపంలో కీలక వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్ జేమీ ఓవర్టన్(19)ను కూడా అవుట్ చేశాడు.‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ వివాదం సంగతి పక్కనపెడితే... కీలక సమయంలో కీలక వికెట్లు తీయడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు‘‘హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్‌గా లేకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయం. పేస్‌లో వైవిధ్యం చూపడంతో పాటు.. మూడు వికెట్లు తీసిన తీరు ఆకట్టుకుంది’’ అని కమ్రన్ అక్మల్ పేర్కొన్నాడు.అదే విధంగా స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి మాట్లాడుతూ.. ‘‘రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వీరిద్దరు గనుక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే టీమిండియా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా ఉండేది’’ అని కమ్రన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. పాకిస్తాన్ మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం రవి బిష్ణోయి ప్రదర్శనను ప్రశంసించాడు. వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తీరు ఎంతో బాగుందని కొనియాడాడు. గత మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని నాలుగో టీ20లో రాణించాడని పేర్కొన్నాడు.బుమ్రాకు వెన్నునొప్పికాగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌లో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు.అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం బుమ్రాకు ఫిట్నెస్ ఆధారంగా చోటిచ్చారు. ఒకవేళ టోర్నీ నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌గా లేకుంటే.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు చాన్స్ ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కమ్రన్ అక్మల్ మాత్రం హర్షిత్ రాణా పేరును తెరమీదకు తెచ్చాడు.టీ20 సిరీస్ మనదేఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో మాత్రం విఫలమైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో టీ20లో జయకేతనం ఎగురవేసి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
‘ఐదో టీ20లో తప్పక ఆడిస్తాం.. అతడి రాకతో జట్టులో జోష్’
దాదాపు ఏడాది తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami). ఇంగ్లండ్‌తో మూడో టీ20(India vs England) సందర్భంగా భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మంగళవారం నాటి(జనవరి 28) ఈ మ్యాచ్‌లో షమీ కొత్త బంతితో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా రాజ్‌కోట్ టీ20లో మూడు ఓవర్లకే పరిమితమైన షమీ.. మొత్తంగా 25 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో అతడికి ఆడే అవకాశం రాలేదు. షమీపై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను మళ్లీ వెనక్కి పిలిపించింది.తుది జట్టులోకి వస్తాడా? లేదా? ఈ నేపథ్యంలో షమీ మళ్లీ తుది జట్టులోకి వస్తాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో షమీని ఆడిస్తామనే సంకేతాలు ఇచ్చాడు. నాలుగో టీ20 జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షమీ బాగానే ఉన్నాడు.అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్‌లలోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం రావచ్చు. అయితే, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.భారత క్రికెట్‌కు కొత్త జోష్ఏదేమైనా.. అతడు తిరిగి టీమిండియాలోకి రావడం బౌలింగ్ విభాగానికి సానుకూలాంశం. ఎంతో అనుభవజ్ఞుడు. తన అనుభవాలను యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. బౌలర్‌గా తన జ్ఞానాన్ని వాళ్లకూ పంచుతున్నాడు. షమీ రాకతో భారత క్రికెట్‌కు కొత్త జోష్ వచ్చింది. షమీ నుంచి గొప్ప ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ తర్వాత షమీ జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండ గాయం వేధిస్తున్నా ఐసీసీ టోర్నీలో మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తర్వాతే సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. కోలుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది.అనంతరం.. బెంగాల్ తరఫున రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న షమీని.. బీసీసీఐ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసింది. అదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ చోటిచ్చింది. ఐదో టీ20లో ఆడటం పక్కా!అయితే, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్పిన్నర్లకు పెద్ద పీట వేసిన యాజమాన్యం.. ఒకే ఒక్క స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం షమీకి ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో పదిహేను పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. అంతకు ముందు కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్‌సేన.. తాజా విజయంతో 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఇప్పటికే భారత్ సిరీస్ గెలిచింది కాబట్టి.. అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చి.. షమీని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా.. హర్షిత్ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్‌లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ సంజూ శాంసన్(1), వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.దూబే, హార్దిక్ అదరగొట్టారుఈ క్రమంలో అభిషేక్ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా రాకతో సీన్ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.హర్షిత్ రాణా రాకతో..అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ మైదానంలోకి పంపింది.ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్(3/33)తో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్‌రౌండర్ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్బౌలర్ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా పంపడం విమర్శలకు దారితీసింది.నిబంధనలకు విరుద్ధంఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ స్థానంలో బౌలర్.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్(like-for-like replacement) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావాలి. రూల్ బుక్‌లో ఇది స్పష్టంగా రాసి ఉంది.ఉదాహరణకు.. బెక్ డకెట్ తలకు గాయమైతే.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్‌నే పంపాలి. కానీ బౌలర్‌ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్ చేయలేడు .ఒకవేళ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్‌నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను రప్పించారు. హర్షిత్‌కు బదులు మహ్మద్ షమీని రప్పించవచ్చు కదా.12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాంఎందుకంటే.. హర్షిత్ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్‌కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తాడు. కానీ.. హర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్ బౌలర్. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందిదూబే బ్యాటింగ్ చేశాడు.. హర్షిత్ బౌలింగ్ చేశాడు’’ అని ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు -
చరిత్ర సృష్టించిన సకీబ్ మహమూద్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
పూణే వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటకి ఆ జట్టు పేసర్ సకీబ్ మహమూద్ మాత్రం నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు.రెండో ఓవర్ వేసిన మహమూద్.. తొలి బంతికే సంజు శాంసన్ (1) వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సకీబ్ బోల్తా కొట్టించాడు.ఆ ఓవర్‌ను మూడు వికెట్లతో పాటు మెయిడిన్‌గా సకీబ్ ముగించాడు. ఈ క్రమంలో మహమూద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సకీబ్ సాధించిన రికార్డులు ఇవే..👉టీ20ల్లో భారత్‌పై ట్రిపుల్ వికెట్ మెయిడెన్ తొలి బౌలర్‌గా సకీబ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌గా కూడా ఈ ఘనత సాధించలేదు. అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ బౌలర్ కూడా సకీబ్ కావడం గమనార్హం. ఇంతవరకు ఏ ఇంగ్లీష్ బౌలర్ కూడా ఇతర జట్లపై కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేసిన బౌలర్‌గా వెస్టిండీస్ మాజీ పేసర్ జెరోమ్ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. 2007లో గ్కెబెర్హాలో దక్షిణాఫ్రికాపై రెండో ఓవర్లోనే జెరోమ్ టేలర్ ఈ ఫీట్ సాధించాడు.రాణించిన దూబే, హార్దిక్..కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో మహమూద్తో పాటు ఓవర్టన్ రెండు,రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు సాధించారు.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య
భారత క్రికెట్ జట్టు మరో టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో టీమిండియా(Teamindia) విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో మెరిసినప్పటకి ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే, హార్దిక్ పాండ్యాలపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. అదేవిధంగా మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు మద్దతు అద్భుతంగా ఉంది. మా విజయాలు వెనక వారి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. 10 వికెట్లకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మేము వెనకంజ వేయాలని అనుకోలేదు. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బే. నేను అస్సలు ఊహించలేదు. కానీ అక్కడ నుంచి మా బ్యాటర్లు ఆడిన విధానం నిజంగా అద్భుతం. హార్దిక్ పాండ్యా, దూబే ఆసాధరణ బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ తమ అనుభవాన్ని చూపించారు. మేం ఎప్పుడూ మాట్లాడేది ఇదే. నెట్స్‌లో ఎలా ఆడుతారో, మ్యాచ్‌లో ఆలానే స్వేఛ్చగా ఆడాలని మా బాయ్స్‌కు చెబుతాం. మా ఆటగాళ్లు నెట్ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు నెట్ ప్రాక్టీస్‌లో ఆడినట్లే గేమ్‌లో కూడా ఆడుతున్నారు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సరైన దిశలోనే పయనిస్తున్నామని నేను భావిస్తున్నాను. పవర్ ప్లే తర్వాత(7 -10 ఓవర్ల మధ్య) పరుగులు సాధించడం అంత ఈజీ కాదు. ఇంగ్లండ్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడినప్పటికి.. తర్వాత మేము కొన్ని వికెట్లు తీసి గేమ్‌ని మా నియంత్రణలోకి తీసుకున్నాము. దురదృష్టవశాత్తు శివమ్ దూబే ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. హర్షిత్ రాణా మూడువ సీమర్‌గా బరిలోకి దిగాడు. అతడు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముంబైలో జరిగే ఆఖరి టీ20లో కూడా మేము దుమ్ములేపుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు.. గేమ్నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
నాలుగో టీ20లో ఇంగ్లండ్ పై భారత్ విజయం
-
పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం
టాప్–ఫోర్ పరుగుల్లో వెనుకబడినా... ఓ దశలో జట్టు స్కోరు(12/3) గుబులు రేపినా... మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపులతో భారత్ మ్యాచ్ గెలిచి టి20 సిరీస్ కైవసం చేసుకుంది. వరుణ్ మాయాజాలం మలుపుతిప్పగా... రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాల బౌలింగ్ భారత్ నాలుగో టి20లో గెలిచేలా చేసింది. పుణే: సమం కాదు... సొంతమే! సిరీస్‌ను ఆఖరి సమరం దాకా లాక్కెళ్ల కుండా భారత్ నాలుగో టి20లోనే తేల్చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 15 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్ సకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డకెట్ (19 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపూ దంచేశారు. అయితే గత మ్యాచ్ మాదిరి వరుణ్ చక్రవర్తి (2/28) స్పిన్ మలుపు మరుగున పడకుండా... దూబే స్థానంలో ‘కన్కషన్’గా వచ్చిన హర్షిత్ రాణా (3/33), రవి బిష్ణోయ్ (3/28) పేస్–స్పిన్‌ల వైవిధ్యం ఇంగ్లండ్‌ను లక్ష్యానికి దూరం చేసింది. దూబే, పాండ్యా ఫిఫ్టీ–ఫిఫ్టీ సంజూ సామ్సన్ (1), తిలక్‌వర్మ (0), కెపె్టన్ సూర్యకుమార్ (0)ల వైఫల్యంతో భారత్ 12/3 స్కోరు వద్ద కష్టాల్లోపడింది. అభిõÙక్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)ల జోరు ఎంతోసేపు సాగలేదు. ఈ దశలో దూబే, పాండ్యా ఆరో వికెట్‌కు వేగంగా 87 పరుగులు జోడించారు.27 బంతుల్లో హార్దిక్, 31 బంతుల్లో దూబే అర్ధసెంచరీలు సాధించారు. దీంతో భారత్ పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగింది. మరోవైపు డకెట్, సాల్ట్ (23; 4 ఫోర్లు)లు ధాటిగా ఛేదన ఆరంభించారు. ఇంగ్లండ్ స్కోరు 62కు చేరగానే డకెట్, కాసేపటికే సాల్ట్, బట్లర్ (2)... వందకు చేరే క్రమంలో లివింగ్‌స్టోన్ (9) అవుటయ్యారు. అయినా 14 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. ఈ దశలో 15వ ఓవర్ వేసిన వరుణ్ క్రీజులో పాతుకుపోయిన బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్ (0)లను అవుట్ చేయడంతో 30 బంతుల్లో 49 పరుగుల సమీకరణం విజయానికి ఊపిరిపోసింది. బిష్ణోయ్, రాణాలు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) సకిబ్ 1; అభిషేక్ (సి) జాకబ్ (బి) రషీద్ 29; తిలక్ (సి) ఆర్చర్ (బి) సకిబ్ 0; సూర్యకుమార్ (సి) కార్స్ (బి) సకిబ్ 0; రింకూసింగ్ (సి) రషీద్ (బి) కార్స్ 30; దూబే రనౌట్ 53; పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 53; అక్షర్ (సి) జాకబ్ (బి) ఓవర్టన్ 5; అర్ష్ దీప్ రనౌట్ 0; రవిబిష్ణోయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–12, 4–57, 5–79, 6–166, 7–180, 8–180, 9–181. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–0, సకిబ్ 4–1–35–3, బ్రైడన్ కార్స్ 4–0–39–1, ఓవర్టన్ 4–0–32–2, అదిల్ రషీద్ 4–0–35–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 23; డకెట్ (సి) సూర్యకుమార్ (బి) బిష్ణోయ్ 39; బట్లర్ (సి) రాణా (బి) బిష్ణోయ్ 2; బ్రూక్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 51; లివింగ్‌స్టోన్ (సి) సామ్సన్ (బి) రాణా 9; జాకబ్ (సి) సూర్యకుమార్ (బి) రాణా 6; కార్స్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 0; ఓవర్టన్ (బి) రాణా 19; ఆర్చర్ (బి) బిష్ణోయ్ 0; రషీద్ నాటౌట్ 10; సకిబ్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–62, 2–65, 3–67, 4–95, 5–129, 6–133, 7–137, 8–146, 9–163, 10–166. బౌలింగ్: అర్ష్ దీప్‌సింగ్ 3.4–0–35–1, హార్దిక్ పాండ్యా 1–0–11–0, వరుణ్ చక్రవర్తి 4–0–28–2, అక్షర్ పటేల్ 3–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–28–3, హర్షిత్ రాణా 4–0–33–3. -
గంభీర్ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్ కోచ్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి.బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూకోల్కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్‌పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ముందుగా బ్యాటింగ్‌కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో జురెల్ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్ సుందర్ 6, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వచ్చాయి. మా వ్యూహాల్లో భాగమే..ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్లో గౌతం గంభీర్ బ్లూప్రింట్ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్ చేస్తాడు. ఇక ధ్రువ్ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్ ఆర్డర్లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.వీలైనన్ని అవకాశాలు ఇస్తాంఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడించాలని సూచించాడు. చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
Ind vs Eng: టీమిండియాకు శుభవార్త!.. పాపం అతడిపై వేటు!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India Vs England)కి ముందు టీమిండియాకు శుభవార్త! నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పుణె మ్యాచ్‌లో ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ధ్రువీకరించాడు.భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి మూడు పూర్తి చేసుకుంది. కోల్‌కతా, చెన్నై టీ20లలో గెలిచిన టీమిండియా.. రాజ్‌కోట్(Rajkot T20I)లో మాత్రం విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌పై ఆధిక్యం 2-1కు తగ్గింది.వెన్ను నొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.జురెల్‌పై వేటు పడే అవకాశంఈ విషయం గురించి కోచ్ డష్కాటే మాట్లాడుతూ.. అతడు బుధవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఒకవేళ రింకూ తిరిగి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. అయితే, అతడు వస్తే ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది.మూడో టీ20లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన జురెల్.. ఒత్తిడిలో చిత్తైపోయాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకాస్త ముందు వస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ఆరు, ఏడు స్థానాల్లో పంపడంతో జురెల్‌కు దెబ్బ పడింది.రింకూ లేదంటే.. ఆ ఇద్దరిలో ఒకరు?ఇక రింకూకు కోల్‌కతా టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. గతేడాది కూడా అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పద్దెనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 245 పరుగులే చేశాడు. అయితే, 2023లో మాత్రం 12 మ్యాచ్‌లలోనే 262 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతారా? లేదంటే.. శివం దూబే, రమణ్‌దీప్ సింగ్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా శుక్రవారం పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉండగా.. 2-2తో సమం చేయాలని బట్లర్ బృందం భావిస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన ఐదో టీ20 జరుగుతుంది.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు(అప్డేటెడ్)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివం దూబే, రమణ్‌దీప్ సింగ్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్‌తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్‌లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్‌ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్‌లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సంజూ- జురెల్‌లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్‌లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే!: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా టీ20లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.తీరు మార్చుకోని సూర్యఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ సూర్య నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ ‘మిస్టర్ 360’.. మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ 12 పరుగుల వద్ద పేసర్ బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తాజాగా రాజ్‌కోట్(Rajokot T20I) వేదికగా సాగిన మూడో టీ20లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందడంతో సూర్య వైఫల్యంపై పెద్దగా చర్చ జరుగలేదు. ఆ రెండు టీ20లలో బౌలర్లతో పాటు.. వరుసగా అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79), తిలక్ వర్మ(55 బంతుల్లో 72*) బ్యాట్‌తో రాణించడంతో భారత్ గెలుపొందింది.అయితే, మూడో టీ20లో బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగాబ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, సూర్య వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే‘‘ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడాలని భావిస్తే.. అందుకు సరైన బంతిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా ఏ బంతికైనా అగ్రెసివ్‌గానే ఉంటానంటే కుదరదు. ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించడం కుదరదు కదా!..టీమిండియా ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు వారి అత్యుత్తమ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటమే కారణం. అందుకే వాళ్లు వరల్డ్ చాంపియన్స్ అయ్యారు. కానీ.. పదే పదే ఒకే తరహా తప్పులు చేస్తే ఎలా? సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.. రెండు మంచి షాట్లు ఆడాడు. అంతే.. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. జట్టు గెలుపునకు అతడు తన వంతు సహకారం అందించనేలేదు’’ అని మైకేల్ వాన్ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా రాజ్‌కోట్‌లో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 48-2 ఉన్న సమయంలో సూర్య క్రీజులోకి వచ్చాడు. రాగానే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు షాట్లు బాదిన సూర్య.. మార్క్ వుడ్ బౌలింగ్‌లోనూ తన ట్రేడ్‌మార్క్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. బట్లర్ బృందం 171 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సూర్యసేన 145 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఇంగ్లండ్ చేతిలొ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదుమ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి 2-1కి తగ్గింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్‌కోట్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య
ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలని భావించిన టీమిండియాకు చుక్కెదురైంది. రాజ్‌కోట్ టీ20లో సూర్యకుమార్ సేన ప్రత్యర్థి చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీనిరంజన్ షా స్టేడియంలో మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(5) వికెట్ తీసి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్(Ben Ducket) ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.మెరుపు అర్ధ శతకం బాది మెరుగైన స్కోరుకు బాటలు వేశాడు. డకెట్.. 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ జోస్ బట్లర్(24) కూడా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించగా వరుణ్ చక్రవర్తి అతడిని బోల్తా కొట్టించాడు.లివింగ్‌స్టోన్ ధనాధన్మిగతా వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone- 24 బంతుల్లో 43 రన్స్) దంచికొట్టగా.. ఆదిల్ రషీద్(10), మార్క్ వుడ్(10) డబుల్ డిజిట్ స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.టీమిండియా తడ‘బ్యాటు’ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. ఓపెనర్లలో సంజూ శాంసన్(3) మరోసారి నిరాశపరచగా.. అభిషేక్ శర్మ(14 బంతుల్లో 24) కాసేపు మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14) మరోసారి విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్(6), ధ్రువ్ జురెల్(2) చేతులెత్తేశారు.ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40) మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(15)తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఇక టెయిలెండర్లలో మహ్మద్ షమీ 7 పరుగులు చేయగా.. రవి బిష్ణోయి 4, వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా ఉన్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్ సాగేకొద్దీ మంచు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మా చేతుల్లో ఉందనుకున్నా.అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్కానీ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతడిని వరల్డ్‌క్లాస్ బౌలర్ అంటారు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పిన్నర్లు అవసరం ఎంతగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే మా జట్టులో వారే ఎక్కువగా ఉన్నారు.ప్రతి టీ20 మ్యాచ్ నుంచి మేము సరికొత్త పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈసారి బ్యాటింగ్ పరంగా మా పొరపాట్లు ఏమిటో గుర్తించగలిగాం. ఇక షమీ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు సాధిస్తున్న ఫలితాలే.. అతడి క్రమశిక్షణ, కఠిన శ్రమకు నిదర్శనం. మైదానం లోపలా.. వెలుపలా ఆట పట్ల అతడి అంకితభావం ఒకేలా ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కీలకమైన ఇన్ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మ(18) వికెట్ తీసి.. టీమిండియా ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో జేమీ ఓవర్టన్ మూడు, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్‌వుడ్ ఒక వికెట్ తీశాడు. ఇక తన అద్భుత ప్రదర్శన(5/24)కు గానూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా -
మూడో టీ20లో భారత్ పై 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
-
Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్ షో’ మొదలెడితే..
ఇంకా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్ బాకీ ఉంది. సంజూ శాంసన్(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్‌తోనే భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ‘హ్యాట్రిక్’ విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్‌పైనే కన్నేసింది. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్‌కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది.ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్–డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్‌లో గునక ‘పవర్ ప్లే’ కనబడితే భారత్‌కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.టాపార్డర్ రాణిస్తే... ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు.బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్‌పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుంది. గత మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్ కన్నా కూడా మన బౌలింగ్ దళం గట్టి ప్రభావమే చూపింది. ఇంగ్లండ్ టాపార్డర్‌ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్‌దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్‌ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కన బెట్టొచ్చు.భారమంతా బ్యాటర్లపైనే... ఇంగ్లండ్ కూడా గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుంది. హిట్టింగ్ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్‌ను దెబ్బతీసి మ్యాచ్‌ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్‌కు 1–1తో చెక్ పెట్టేది. కార్స్, మార్క్‌వుడ్, ఆర్చర్, రషీద్‌లతో కూడిన బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్ సాల్ట్, డకెట్‌లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్‌షో ముగిసి ‘ఫాస్ట్ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.పిచ్, వాతావరణం రాజ్‌కోట్ పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్‌పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్‌ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తుది జట్లు (అంచనా) భారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్/షమీ, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్రాజ్కోట్ సూర్యకు ప్రత్యేకంరాజ్కోట్లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో (2013లో ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్‌పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్‌లో (2017లో న్యూజిలాండ్ చేతిలో) ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
భారత్‌తో మూడో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
రాజ్‌కోట్ వేదికగా మంగళవారం(జనవరి 28) భారత్‌తో మూడో టీ20లో తలపడేందుకు ఇంగ్లండ్ సన్నదమవుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే రాజ్‌కోట్‌కు చేరుకున్న బట్లర్ సేన సోమవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో మూడో టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది.తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్ టీ20లో ఆడిన జట్టునే మూడో మ్యాచ్‌కు కూడా కొనసాగించారు. చివరి మ్యాచ్‌లో ఆకట్టుకున్న జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ తమ స్దానాలను సుస్థిరం చేసుకున్నారు. రెండో టీ20లో బ్రైడన్ కార్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌లో 31 పరుగులతో పాటు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లను కార్స్ తీసుకున్నాడు.అదే విధంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఫిల్ సాల్ట్, బెన్ డకెట్లకు ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మరో అవకాశమిచ్చింది. విధ్వంసకర ఆటగాడిగా పేరు గాంచిన సాల్ట్ తొలి రెండు టీ20ల్లో వరుసగా 0,6 పరుగులు మాత్రమే చేశాడు. డకెట్ది కూడా అదే తీరు. కోల్‌కతాలో 4 పరుగులు చేసిన డకెట్.. చెపాక్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు లైమ్ లివింగ్ స్టోన్ కూడా తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. మిడిలార్డర్లో అతడి వైఫల్యం ఇంగ్లండ్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో వీరు రాణించకపోతే తదుపరి మ్యాచ్‌కు వేటు పడే ఛాన్స్ ఉంది. అయితే టాప్ క్లాస్ బ్యాటర్లు సైతం విఫలమకావడంతో కెప్టెన్ జోస్ బట్లర్‌పై ఒత్తడి పెరుగుతుంది.తొలి టీ20లో 68 పరుగులతో కెప్టెన్ నాక్ ఆడిన జోస్.. రెండో మ్యాచ్‌లోనూ 45 పరుగులతో రాణించాడు. కాగా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2తో వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజ్‌కోట్‌లో తప్పకగెలవాల్సిందే.ఇక మూడో టీ20లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. ధ్రువ్ జురెల్ స్ధానంలో శివమ్ దూబే, రవి బిష్ణోయ్ ప్లేస్‌లో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో మరోసారి ఇంగ్లీష్ జట్టుకు కఠిన సవాలు ఎదురుకానుంది.మూడో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టుబెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు(అంచనా)సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: మాజీ క్రికెటర్
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ తెలుగు తేజం.. ఇప్పటికే రెండు శతకాలు సాధించాడు. కష్టతరమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్(India vs England)లోనూ అదరగొడుతున్నాడు.స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుతో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట.. తాను మాత్రం బ్యాట్ ఝులిపించాడు.సూపర్ ఫినిషింగ్ టచ్ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఫోర్ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. ఈ రెండు సందర్బాల్లోనూ 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి టీమిండియాను గెలిపించడం విశేషం.ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్‌ను ఏకంగా మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)తో పోలుస్తూ ఆకాశానికెత్తడం విశేషం. ‘‘ఆఖరి వరకు అతడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. పద్దెమినిదవ ఓవర్లోనూ ఏమాత్రం భయపడలేదు.తిలక్ వర్మ అచ్చం ఆ దిగ్గజం మాదిరేఅంతెందుకు పందొమ్మిదవ ఓవర్లో టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అప్పుడూ అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. ఫోర్‌తో ఫినిష్ చేశాడు. అతడు ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు జట్టును కూడా కాన్ఫిడెంట్‌గా ఉంచుతున్నాడు.ధోని కంటే కాస్త మెరుగేగతంలో మనకు ఇలాంటి దిగ్గజం ఒకరు ఉండేవారు. అతడు మరెవరో కాదు మహేంద్ర సింగ్ ధోని. తను కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ముగించేవాడు. అతడిలాంటి వ్యక్తి.. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇలాంటి ఫలితాలు రాబట్టడం మామూలు విషయం కాదు’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో టైమ్అవుట్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా తిలక్ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 156కు పైగా స్ట్రేక్రేటుతో 707 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 120. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు గెలిచింది. ఆధిక్యంలో టీమిండియాతొలి టీ20లో ఏడు వికె ట్ల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగనుంది. తదుపరి పుణె, ముంబైలలో మిగిలిన టీ20లు జరుగుతాయి.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!2️⃣-0️⃣ 🙌Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! 👌Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB— BCCI (@BCCI) January 25, 2025 -
షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా?
సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం కోసం మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని సమాచారం. పూర్తి ఫిట్‌గా ఉన్నా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో(India vs England 3rd T20I)నూ అతడిని ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలను షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.కాగా దశాబ్ద కాలంగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్‌గా షమీకి పేరుంది. అయితే, వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా గాయపడ్డ ఈ బెంగాల్ పేసర్ కోలుకోవడానికి ఈసారి చాలా సమయమే పట్టింది. చీలమండ గాయం వేధిస్తున్నా.. వరల్డ్‌కప్ టోర్నీని పూర్తయ్యేదాకా పంటిబిగువన నొప్పిని భరించిన షమీ.. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఇరవై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.శస్త్ర చికిత్స తర్వాతతద్వారా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు ఏడాదికాలంగా టీమిండియాకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. దేశవాళీ క్రికెట్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. బెంగాల్ తరఫున దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగాడు. నిలకడగా బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసిన షమీ... ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలక్టర్లు షమీకి చోటిచ్చారు. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20తో అతడు రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. తుదిజట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా స్పిన్నర్లకు పెద్దపీట వేసిన క్రమంలో అతడికి మొండిచేయి ఎదురైంది.పూర్తి ఫిట్‌గా ఉన్నాడుఅదే విధంగా.. చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ షమీని ఆడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లోనూ అతడిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘కోల్‌కతాలో జరిగిన తొలి టీ20కి ముందే షమీ నన్ను తన దగ్గరకు పిలిపించాడు.అంతా బాగానే ఉందని.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు చెప్పాడు. అయితే, జట్టు యాజమాన్యం ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి షమీ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.గంభీర్‌తో సమస్యా?అయితే, ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టీ20లలో మాత్రం అతడిని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా.. వన్డే సిరీస్‌లోనూ షమీకి అవకాశం ఇస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ మేరకు మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా యాజమాన్యం నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయి. కోచ్ గౌతం గంభీర్, షమీ మధ్య సమన్వయ, సమాచార లోపం లేదనే అనుకుంటున్నా’’ అని బద్రుద్దీన్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సూర్యకుమార్ సేన.. రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కింది. తద్వారా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రాజ్‌కోట్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. రెండో టీ20 భారత్‌దే (ఫోటోలు)
-
సూపర్ ఇన్నింగ్స్.. తిలక్‌కు సలాం కొట్టిన సూర్యకుమార్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తన అద్బుతప్రదర్శనతో భారత్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. సంజూ శాంసన్, అభిషేక్, సూర్య వంటి ప్రధాన ఆటగాళ్లు తేలిపోయిన చోట తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం టెయిలాండర్లతో కలిసి తన సూపర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఆఖరివరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ముగించాడు.ఓవరాల్‌గా వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో అందుకుంది. తద్వారా చెపాక్ టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.సూర్య పిధా.. కాగా హైదరాబాదీ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) పిధా అయ్యాడు. విజయనంతరం గ్రౌండ్లోకి వచ్చిన సూర్య.. తిలక్ వద్దకు వెళ్లి తల వంచి మరి చప్పట్లు కొడుతూ అభినందించాడు. అందుకు తిలక్ కూడా సంతోషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తిలక్, సూర్యకు మంచి అనుబంధం ఉంది.వర్మ భారత జట్టులోకి రాకముందే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యతో కలిసి ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసినఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్‌లో జరగనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా Tilak Verma with Suryakumar yadav after match yesterday at Chapeuk.!!!!- A beautiful Video, Mumbai Indians boy's..!!pic.twitter.com/y3Jcb2ou3G— MANU. (@Manojy9812) January 26, 2025 -
ఎస్ఆర్హెచ్కు గుడ్‌న్యూస్.. చెపాక్‌లో దుమ్ములేపిన ఆల్‌రౌండర్
చెన్నై వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్(Brydon Carse) తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దుమ్ములేపాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన కార్స్.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్త్తో 31 పరుగులు చేశాడు. 29 ఏళ్ల కార్స్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. లేదంటే ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించిండేది. కార్స్ బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్కు గుడ్‌న్యూస్..కాగా బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఈ తరహా ప్రదర్శన చేయడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్-2025 మెగా వేలంలో కార్స్‌ను ఎస్ఆర్హెచ్ కేవలం రూ. కోటిరూపయాలకే సొంతం చేసుకుంది. భారత్ పిచ్‌లపై తొలిసారి ఆడినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అందరిని కార్స్ మెప్పించాడు. కార్స్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు.మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభవం మాత్రం అతడికి ఉంది. సౌతాఫ్రికా టీ20, ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్‌లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆడాడు. కాగా ఎస్ఆర్హెచ్లో ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ వంటి అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ , రాహుల్ చాహర్, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్ , అనికేత్ వర్మ , ఎషాన్ మలింగ , సచిన్ బేబీ.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
Ind vs Eng: అతడికి గాయం.. భారత జట్టులోకి శివం దూబే!
ముంబై ఆల్‌రౌండర్ శివం దూబే(Shivam Dube) టీమిండియాతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత అతడు భారత టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడని సమాచారం.లంక పర్యటనలో ఆఖరిగాకాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024) గెలిచిన భారత జట్టులో భాగమైన శివం దూబే ఆ తర్వాత.. శ్రీలంకతో టీ20లలో ఆడాడు. అనంతరం సొంతగడ్డపై జరిగిన బంగ్లాదేశ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు ఎంపిక చేసి జట్టులో.. అదే విధంగా సౌతాఫ్రికాకు వెళ్లిన టీమ్‌లోనూ శివం దూబేకు సెలక్టర్లు చోటివ్వలేదు.తాజా రంజీ మ్యాచ్‌లో డకౌట్లుఈ క్రమంలో అతడు తన సొంత జట్టు ముంబై తరఫున దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, రంజీ మ్యాచ్‌లలోనూ భాగమయ్యాడు. తాజాగా జమ్మూ కశ్మీర్‌తో శనివారం ముగిసిన మ్యాచ్‌లోనూ శివం దూబే ఆడాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సున్నా చుట్టాడు.నితీశ్ రెడ్డికి గాయం?అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓ వికెట్ మాత్రం తన ఖాతాలో వేసుకోగలిగాడు. అయితే, అనూహ్యంగా శివం దూబేకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గాయపడిన మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. స్థానాన్ని దూబేతో భర్తీ చేసినట్లు తెలిపింది.అయితే, నితీశ్ రెడ్డి గాయం తాలూకు వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. కానీ వెంటనే అతడు మైదానంలో దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని సమాచారం. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో బుధవారం తొలి మ్యాచ్ జరిగింది.తొలి టీ20లో భారత్ విజయంఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో సూర్యకుమార్ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసన బట్లర్ బృందం 132 పరుగులకే ఆలౌట్ కాగా.. 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.ఇక ఈ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చసే అవకాశం కూడా రాలేదు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ఈ ఆంధ్ర క్రికెటర్.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో చిరస్మరణీయ శతకం సాధించాడు. దూబే జట్టుతో చేరేది అపుడేఅనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీ అయిన 21 ఏళ్ల నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది. అయితే, ఇదే రోజు రంజీ మ్యాచ్ ముగించుకున్న శివం దూబే ఇప్పటికిప్పుడు భారత జట్టుతో చేరలేడు. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగే మూడో టీ20 నుంచి అతడు టీమిండియాతో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. చదవండి: ICC టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు -
Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!
ఇంగ్లండ్‌తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.చీలమండ నొప్పిఈ సందర్భంగానే అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్‌ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్ సెషన్లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.సంజూకు జోడీ ఎవరు?ఒకవేళ అభిషేక్ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్‌తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్‌కు ప్రమోట్ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.తొలి టీ20లో అభిషేక్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. బట్లర్ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.షమీ వస్తాడా?కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్ అర్ష్‌దీప్ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్‌దీప్ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. అందుకే ఈసారి అర్ష్‌దీప్‌తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్‌కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్‌తో భర్తీ చేయడం విశేషం.బ్యాటర్ల వైఫల్యంతాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.బట్లర్ అర్ధ శతకం చేసినాఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్‌వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతంఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్‌గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్‌ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..టీమిండియా ఘన విజయంఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సుడిగాలి ఇన్నింగ్స్‌తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.జోఫ్రా ఆర్చర్‌కు వికెట్లుఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్‌కు దక్కాయి. సంజూ శాంసన్‌తో పాటు.. సూర్యకుమార్ యాదవ్‌లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.అదృష్టం వల్లే గెలిచారు‘‘ఈరోజు మ్యాచ్‌లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్‌లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్‌లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్‌లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై! -
టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తిలక్ వర్మ!
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకెంతో ఇష్టమని.. టీ20లలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తాను తిలక్‌నే ఎంచుకుంటానని బ్రాడ్ హాగ్ తెలిపాడు.ఐపీఎల్లో సత్తా చాటికాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆగష్టులో వెస్టిండీస్(West Indies Tour)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుస సెంచరీలుఅదే పర్యటనలో వన్డేల్లోనూ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 21 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 635 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా రెండు శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు.. ఈ రెండూ కూడా సౌతాఫ్రికా గడ్డపై.. అదీ వరుస మ్యాచ్‌లలో సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.ఇక ఇప్పటికి నాలుగు వన్డేలు పూర్తి చేసుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ 68 పరుగులు చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో బ్యాటర్‌గా, సారథిగా సత్తా చాటి ఫైనల్‌కు చేర్చాడు.ఇక తిలక్ వర్మ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.టీమిండియా కెప్టెన్ కావడం ఖాయంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్ వర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.అభిషేక్ భేష్అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ శర్మను కూడా బ్రాడ్ హాగ్ ఈ సందర్భంగా అభినందించాడు. ‘‘కొన్నిసార్లు అతడు విఫలమైన మాట వాస్తవం. అయితే, కోచ్‌తో పాటు కెప్టెన్ మద్దతు ఉండటం అతడికి సానుకూలాంశం. ఎందుకంటే.. టీ20 క్రికెట్లో టాపార్డర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది.ఓపెనింగ్ బ్యాటర్‌కు మేనేజ్మెంట్ కాస్త స్వేచ్ఛనిస్తుంది. పవర్ ప్లేలో పరుగులు రాబట్టి మంచి పునాది వేస్తే.. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనర్. అతడు ఈరోజు అద్భుతంగా ఆడాడు. ఇలాగే మున్ముందూ కొనసాగాలి’’ అని బ్రాడ్ హాగ్ ఆకాంక్షించాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 232.35.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికి ఇవ్వాల్సింది.. మూడు ఓవర్లలోనే..
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో టీమిండియా(India Beat England) శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కట్టడి చేయగా.. లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగి అభిషేక్ శర్మ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చాడు.ఈ మ్యాచ్‌లో సత్తా చాటి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh), వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలను టీమిండియా అభిమానులు హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ముగ్గురి చక్కటి ఆట తీరు వినోదాన్ని పంచిందంటూ కితాబులిస్తున్నారు. ఇక వీరిలో వరుణ్ చక్రవర్తిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించిన విషయం తెలిసిందే.అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’కు అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే అర్హుడని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?.. అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?.. కానేకాదు..నా వరకైతే అర్ష్‌దీప్ మాత్రమే ఈ అవార్డుకు అర్హుడు. ఎందుకంటే.. ఇంగ్లండ్ టాపార్డర్‌ను అతడు కుప్పకూల్చాడు. ఒకరకంగా.. కేవలం మూడంటే మూడు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశాడు’’ అని బసిత్ అలీ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రశంసించాడు.అత్యుత్తమంగా రాణించాడుఅదే విధంగా.. ‘‘వరుణ్ చక్రవర్తి కూడా బాగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అయినా సరే.. అద్భుతంగా బౌలింగ్ చేసింది మాత్రం అర్ష్‌దీప్ అనే చెబుతాను. అతడు ఈరోజు అత్యుత్తమంగా రాణించాడు. రవి బిష్ణోయి కూడా ఫరవాలేదు. వికెట్ తీయలేకపోయినా కాస్త పొదుపుగానే బౌల్ చేశాడు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.బౌలర్ల విజృంభణకాగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(0), బెన్ డకెట్(4)లను వచ్చీ రాగానే అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. ఆరంభంలోనే మూడు ఓవర్లు వేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే మాత్రమే ఇచ్చాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా(2/42), అక్షర్ పటేల్(2/22) రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆదిల్ రషీద్ రనౌట్‌లో భాగమయ్యాడు.బ్యాటర్ల సత్తాఇక లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు. సంజూ వేగంగా(20 బంతుల్లో 26) ఆడి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. అభిషేక్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లసాయంతో 79 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ కాగా.. తిలక్ వర్మ(9*) , హార్దిక్ పాండ్యా(3*) అజేయంగా నిలిచి పనిపూర్తి చేశారు.చదవండి: అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్ -
అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) ప్రశంసలు కురిపించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపిస్తే అది కచ్చితంగా మ్యాచ్ విన్నింగ్సే అవుతుందని కొనియాడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సుదీర్ఘకాలం టీ20 జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్లి చేశాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఈ పంజాబీ బ్యాటర్ డకౌట్ అయి విమర్శల పాలయ్యాడు. అయితే, అదే వేదికపై శతకంతో చెలరేగి తానేంటో నిరూపించుకున్నాడు.సంజూకు కెప్టెన్ మద్దతుఅయితే, ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 జట్టులో ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్(Sanju Samson)తో పాటు అభిషేక్‌ను మేనేజ్మెంట్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్‌గా సంజూనే కొనసాగిస్తామని ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి ఢోకా లేనట్లే.జైస్వాల్ రూపంలో ముప్పుఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో గనుక విఫలమైతే అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో లెఫ్టాండర్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో అతడికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాట్ ఝులిపిస్తేనే మరికొంతకాలం జట్టుతో కొనసాగగలడని అంచనా వేశాడు.ఇరవై బంతుల్లోనే అందుకు తగ్గట్లుగానే అభిషేక్ శర్మ తొలి టీ20లోనే దుమ్ములేపాడు. కేవలం ఇరవై బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 79 రన్స్ సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిషేక్ శర్మ ఆట తీరును ప్రశంసించాడు. ‘‘అభిషేక్ హై- రిస్క్ బ్యాటర్. ఒకవేళ అతడు పరుగుల వరద పారించాడంటే.. ఆ మ్యాచ్‌లో జట్టు గెలవాల్సిందే.ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్అభిషేక్ శర్మ ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్. 20-22 బంతుల్లోనే 60 పరుగులు చేయగలడు. ఇలాంటి వాళ్లను జట్టులో సుదీర్ఘకాలం కొనసాగించాలి. ఈరోజు అతడు కాస్త నెమ్మదిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అతడి ఆట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి నిదర్శనం. అతడి ఆడిన షాట్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి’’ అని పీయూష్ చావ్లా కితాబులిచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ప్రత్యర్థిని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. అభిషేక్ శర్మ(79) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా వేగంగా టార్గెట్‌ను ఛేదించింది. ఇక ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన మూడు వికెట్ల వీరుడు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్‌లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.అర్ష్‌దీప్ అదరగొడితే..కాగా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడుఅర్ష్దీప్తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు. అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది. అభిషేక్ శర్మ ధనాధన్సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.జోఫ్రా ఆర్చర్ సూపర్స్టార్మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్‌స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్‌ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025 -
మా బాయ్స్ అందరూ అద్బుతం.. గౌతీ భాయ్ చాలా సపోర్ట్‌గా ఉంటాడు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ అదిల్ రషీద్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసినందుకు సంతోషంగా ఉందని సూర్య చెప్పుకొచ్చాడు."సిరీస్‌ను విజయంతో ఆరంభించినందుకు సంతోషంగా ఉంది. మా విజయంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు సత్పలితాలను ఇచ్చింది. ఆరంభంలోనే అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టి మాకు ఒక ప్లాట్ ఫామ్ సెట్ చేశాడు.ఈ మ్యాచ్‌లో మా బౌలర్లందరూ తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. ఆ తర్వాత మా బ్యాటర్లు కూడా అద్బుతంగా ఆడారు. గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇదే తరహా బ్యాటింగ్ చేశాము. ముఖ్యంగా అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు ముందే తెలుసు. ఇక కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సిన బాధ్యత హార్దిక్ పాండ్యాపై ఉందని మాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాము. ముగ్గురు స్పిన్నర్లు కూడా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ అదనపు బాధ్యతలు తీసుకుని రాణిస్తున్నాడు. మాకు గౌతీ భాయ్(గౌతం గంభీర్) పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. మేము టీ20 వరల్డ్‌కప్-2024 కంటే కొంచెం భిన్నంగా ఆడాలనుకుంటున్నాము. ఫీల్డింగ్‌లో కూడా మేము చాలా మెరుగుపడ్డాము. అందుకోసం సెషన్లలో ఫీల్డింగ్ కోచ్‌తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నాము. హాఫ్ ఛాన్స్‌లను కూడా క్యాచ్లగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భారత్ గ్రాండ్ విక్టరీ
-
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్‌లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్‌కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్‌తో వన్డేల్లో శుబ్‌మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం: సూర్య
సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్(India Vs England)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.ఇక టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో సెమీస్‌లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్‌ను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. సారథిగా సూపర్ హిట్ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్స్వీన్ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల నేపథ్యంలో కొత్త వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం‘‘హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు.ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లుటీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.నేను బాగా ఆడలేదు కాబట్టేఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.చదవండి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్! నితీశ్‌కు చోటు? -
పరుగుల వరదకు సై
ఒకరిని మించి మరొకరు ధాటిగా ఆడే బ్యాటర్లు... భారీ స్కోర్లకు వేదికలైన చిన్న మైదానాలు... మంచు ప్రభావంతో బౌలర్లకు తిప్పలు... రాబోయే పక్షం రోజుల్లో టి20ల్లో క్రికెట్లో ఎన్ని కొత్త రికార్డులు నమోదు కానున్నాయో! వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేసిన 11 మ్యాచ్‌లలో 7 సార్లు 200 స్కోరు దాటించిన టీమిండియా తమ దూకుడును ప్రదర్శించగా... విధ్వంసానికి మారుపేరువంటి మెకల్లమ్ కోచింగ్‌లో ఇంగ్లండ్ కూడా ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో వరుసగా లక్ష్యాలను ఛేదిస్తూ తామూ తక్కువ కాదని నిరూపించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు టి20 సమరాలు అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనున్నాయి. గత వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ చిత్తయిన తర్వాత ఇరు జట్లు ఇప్పుడే తొలిసారి తలపడనుండగా... చివరకు పైచేయి ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం.కోల్‌కతా: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాల తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి దిగుతోంది. టెస్టులతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన జట్టుతో ఇప్పుడు టీమిండియా టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 పోరులో విశ్వ విజేత జట్టు తలపడుతుంది. ఇందులో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు మొదటి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే రెండు టీమ్‌లు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. టి20 కోచ్‌గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్ తనదైన శైలిలో కొత్తగా ఇంగ్లండ్ జట్టును సిద్ధం చేశాడు. షమీపై అందరి దృష్టి... గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌కు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి కూడా ఎంపికైన షమీ టి20 ఫార్మాట్ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. రెండు నెలల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై మెరుపు ప్రదర్శన కనబర్చి 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చివరి మ్యాచ్‌తో పోలిస్తే దాదాపు అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సంజు సామ్సన్ అంతర్జాతీయ క్రికెట్లో తన జోరును ప్రదర్శించాలని భావిస్తుండగా, రెండో ఓపెనర్‌గా అభిషేక్ రాణించాల్సి ఉంది. వరుసగా రెండు అంతర్జాతీయ టి20 సెంచరీలు సాధించిన హైదరాబాదీ తిలక్ వర్మ కూడా అదే ఉత్సాహంతో సిద్ధం కాగా... మిడిలార్డర్లో సూర్యకుమార్, హార్దిక్, రింకూ సింగ్ భారీ స్కోరును అందించగలరు. నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. కీపర్‌గా సాల్ట్... తొలి టి20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ముందు రోజే ప్రకటించింది. తొలిసారి వైస్ కెప్టెన్‌గా నియమితుడైన హ్యారీ బ్రూక్ మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటగలడు. సాల్ట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. చివరి స్థానం వరకు ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయగల సమర్థులు కావడం ఇంగ్లండ్ బలం. పిచ్, వాతావరణం ఈడెన్ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన లేదు. 24 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్ వేదికగా రెండు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 5 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయం దక్కింది. 7 ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో ఆరింటిలో భారత్ నెగ్గగా... ఎదురైన ఒక పరాజయం ఇంగ్లండ్ చేతిలోనే (2011లో) కావడం గమనార్హం. తుది జట్ల వివరాలు భారత్ (అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్, షమీ, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్/సుందర్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, ఒవర్టన్, అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్. -
బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు.. కోటక్‌కు ఇది అగ్ని పరీక్షే
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టింది. ఈ చర్యల్లో భాగంగా దేశవాళీ పోటీల్లో క్రికెటరలందరూ పాల్గొనాలని, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సితాన్షు కోటక్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.ఈ పదవికి పోటీ పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రఖ్యాత ఇంగ్లండ్ బ్యాటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా తన సంసిద్ధతను వ్యక్తం చేసాడు. అయితే బీసీసీఐ ముందే ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన సితాన్షు కోటక్‌ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. కోటక్ దేశవాళీ క్రికెట్లో 10,000 పరుగులు పైగా సాధించాడు కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. 2013లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత, కోటక్ కోచింగ్ రంగంలోకి దిగి తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2020లో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. 2019 నుండి నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇటీవలి కాలంలో భారత్ వైట్-బాల్ సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్‌కు సహాయ కోచ్‌గా సేవలందించాడు . బుధవారం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్‌తో కోటక్ తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కోటక్ నియామకం తప్పనిసరిఇటీవల స్వదేశం, విదేశాలలో జరిగిన సిరీస్‌ల్లో భారత్ బ్యాటర్లు పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే అంతకుముందు స్వదేశంలో న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్ ల పై సైతం భారత బ్యాటర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు 0-3 తేడాతో పరాజయం పాలైంది. అప్పుడే బీసీసీఐ బ్యాటింగ్ కోచ్ ని నియమించి వుంటే ఆస్ట్రేలియా సిరీస్ లో కొద్దిగా పరువు దక్కేది. ఈ నేపథ్యంలో కోటక్ నియామకం కొద్దిగా ఆలస్యమైనా సరైన నిర్ణయం గా కనిపిస్తోంది.బ్యాటింగ్ కోచ్‌గా అనుభవం..అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించకపోయినా, కోటక్ రెండు దశాబ్దాల పాటు దేశవాళీ పోటీల్లో రాణించాడు. ఫస్ట్-క్లాస్ మరియు లిస్ట్ ఎ ఫార్మాట్లలో కలిపి 10,000 పైగా పరుగులు సాధించాడు. కోటక్ వార్విక్షైర్తో కౌంటీ క్రికెట్లో కూడా కొంతకాలం ఆడాడు. కోటక్ 130 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 15 సెంచరీలు మరియు 55 అర్ధ సెంచరీలతో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. ఇంకా 89 లిస్ట్ ఎ మ్యాచ్ లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 42.23 సగటుతో 3,083 పరుగులు సాధించాడు.అన్ని ఫార్మాట్లలో కోచింగ్ సమర్ధతకోటక్ బీసీసీఐ, వేల్స్ క్రికెట్ బోర్డు నుండి లెవల్ 1 మరియు లెవల్ 2 కోచింగ్ పరీక్షలు పూర్తిచేసాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఇండియా ఎ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో అనుభవం గడించిన కోటక్ కొంతకాలం భారత పరిమిత ఓవర్ల జట్టుకి సహకారం కూడా అందించాడు. కోటక్ ఐపీల్ లో 2016లో గుజరాత్ లయన్స్‌కు సహాయ కోచ్‌గా పనిచేశాడు. సురేష్ రైనా, ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వంటి ఆటగాళ్లతో కలిసి పనిచేసి రాటుదేలాడు.ఇటీవలి కాలంలో కోటక్ భారత జట్టుతో కలిసి పలు పర్యటనలకు వెళ్ళాడు. రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ అందుబాటులో లేని సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ కి సహాయ కోచ్ గా పని చేశాడు. 2023లో జస్ప్రిత్ బుమ్రా నేతృత్వంలో భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడినప్పుడు కోటక్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్ల అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ లో మార్పులు చేయగల ప్రజ్ఞాపాటవాలు కోటక్ కి పుష్కలంగా ఉన్నాయి. అయితే జట్టులోని ఎంతో అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మన్ కి కొత్తగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా వంటి పిచ్ ల పై భారత్ బ్యాట్స్‌మన్ రాణించిన సందర్భాలు తక్కువే. అయితే ఇటీవల కాలంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు వచ్చిన తర్వాత భారత బ్యాటర్లు విదేశీ పర్యటనలలో కూడా రాణించగలమని నిరూపించుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో బీసీసీఐ జట్టు లోపాల్ని సరిదిద్దడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగా కోటక్ ని బ్యాటింగ్ కోచ్ గా నియమించారు. అయితే ఇది సత్ఫలితాలను ఇస్తుందా లేదా అన్న విషయం రాబోయే ఇంగ్లాండ్ పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ తో తేలిపోతుంది. కోటక్ కి ఇది అగ్ని పరీక్షే! -
భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సర్వం సిద్దమైంది. బుధవారం(జనవరి 22) ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. మొదటి టీ20లో ఇంగ్లండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. పేస్ బౌలర్లలో కోటాలో మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్‌లకు చోటు దక్కింది. శ్రీలంకతో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడిన మార్క్‌వుడ్ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లైనప్‌లోకి తిరిగి వచ్చాడు. అదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా వికెట్ కీపర్‌గా కెప్టెన్ జోస్ బట్లర్ బదులుగా ఫిల్ సాల్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.మరోవైపు భారత్ తొలి టీ20లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లగా ఉండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వీరిద్దరితో పాటు బంతిని పంచుకోనున్నాడు. స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ Firepower with bat and ball 💥 Brendon McCullum has named the first white-ball team of his reign for tomorrow's opening IT20 v India 💪 pic.twitter.com/DSFdaWVPrB— England Cricket (@englandcricket) January 21, 2025 ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ పురుషుల జట్టుకు కొత్త వైస్ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ తరంగం హ్యారీ బ్రూక్ ఇకపై పరిమిత ఓవర్ల జట్టుకు ఉప నాయకుడిగా పనిచేస్తాడని మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు బ్రూక్ నియామకానికి సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మూడేళ్ల నుంచి అదరగొడుతున్నాడుకాగా 2022లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇక 25 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 24 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లలో అతడి సగటు 30.73.. స్ట్రైక్‌రేటు 146.07. వన్డేల్లో బ్రూక్ సగటు 39.94.. స్ట్రైక్‌రేటు 106.83. మూడేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో ఎనిమిది, వన్డేల్లో ఒక శతకం సాధించాడు.బట్లర్ వారసుడిగాఇలా అద్భుత ప్రదర్శనతో మేనేజ్మెంట్ను ఆకట్టుకుంటున్న బ్రూక్‌ను వైస్ కెప్టెన్ పదవి వరించింది. బట్లర్ వారసుడిగా అతడిని చూస్తున్న యాజమాన్యం భవిష్యత్తులో సారథిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఊహాగానాలు రాగా.. బ్రూక్ మాత్రం పెద్దగా స్పందించలేదు.ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు చేరువగా..ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ ఆడుతున్నాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడి.. 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో 2024 ఎడిషన్‌కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. 2025 మెగా వేలం సందర్భంగా రూ. 6.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్‌కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగనుండగా.. ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. కోల్‌కతా, చెన్నై, రాజ్‌కోట్, పుణె, ముంబై, టీ20లకు.. నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ వన్డేలకు ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ల కోసం భారత్- ఇంగ్లండ్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి. చదవండి: Ind vs Eng: భారత తుదిజట్టులో వీరే.. ఆ ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం! -
Ind vs Eng 1st T20: భారత తుదిజట్టులో వీరే!
ఇంగ్లండ్‌తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్‌లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.ఓపెనింగ్ జోడీ అదేకాగా ఇంగ్లండ్‌తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.వరుసగా మూడు శతకాలుఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.షమీ రాక.. రాణాకు నో ఛాన్స్ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే యాక్షన్‌లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్‌గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు?
టెస్టుల్లో వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా.. మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22న టీ20తో మొదలై.. ఫిబ్రవరి 12న మూడో వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.గంభీర్‌కు చేదు అనుభవాలుఈ క్రమంలో మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. గతేడాది శ్రీలంక పర్యటనతో కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీకి ఆరంభంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం 2-0తో ఓడిపోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది.అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టుల్లో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు.. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో 3-1తో ఓడి ట్రోఫీని కోల్పోయింది. ఇందుకు టీమిండియా బ్యాటర్ల వైఫల్యమే ప్రధానం కారణం.ద్రవిడ్‌తో సితాన్షు కొటక్ఈ ఘోర పరాభవాల నేపథ్యంలో బ్యాటింగ్‌కు ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. గంభీర్ ఏరికోరి తన సహాయక సిబ్బందికిలోకి తీసుకున్న అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ డష్కాటే పని తీరుపై గుర్రుగా ఉన్న మేనేజ్మెంట్.. వారిని తప్పించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు కీలక విషయాలు వెల్లడించాయి. ‘‘సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరతాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు తుది నిర్ణయం జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతోంది. కాబట్టి బీసీసీఐ ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది.ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు కోల్‌కతాలో మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. అందరు ఆటగాళ్లు జనవరి 18నే రిపోర్టు చేయాల్సి ఉంటుంది’’ అని సదరు వర్గాలు తెలిపాయి.కాగా సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాన్షు కొటక్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ మాజీ బ్యాటర్.. ఇండియా-‘ఎ’ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో చివరగా కోచ్‌గా వ్యవహరించాడు.దేశీ క్రికెట్లో అద్భుతమైన రికార్డుసౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన సితాన్షు కొటక్.. 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 8061 పరుగులు చేశాడు. ఇక గతంలో టీమిండియా తాత్కాలిక కోచ్‌గానూ కొటక్ వ్యవహరించాడు. 2023లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ఆడినప్పుడు అతడు జట్టుతోనే ఉన్నాడు.కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో విక్రం రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అయితే, జూలై 2024 తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సితాన్షు కొటక్ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు తాజా సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
షమీ పునరాగమనం
న్యూఢిల్లీ: సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భారత జట్టులోకి 14 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం సెలక్టర్లు శనివారం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు లభించింది. ముందుగా కాలి మడమ, ఆపై మోకాలి గాయంతో బాధపడిన షమీ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2023 నవంబర్ 19న ఆ్రస్టేలియాతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించలేదు. గాయంతో కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టిన షమీ వరుసగా మూడు ఫార్మాట్లలో కూడా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టి20 టోర్నీలతో ప్రస్తుతం గురువారం విజయ్‌హజారే వన్డే టోర్నీ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కూడా షమీ బరిలోకి దిగాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో ముగిసిన ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేసే అంశంపై చర్చ జరిగింది. అయితే పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత షమీ ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. నిజానికి భారత్ తరఫున నవంబర్ 2022 తర్వాత అతను టి20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఫార్మాట్లో యువ పేసర్ల రాకతో షమీ దాదాపుగా జట్టుకు దూరమైపోయాడు. అయితే ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తోనే జరిగే వన్డే సిరీస్, ఆపై చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను ఎంపిక చేయనున్న నేపథ్యంలో వాటికి ముందు టి20ల ద్వారా షమీ ఫిట్నెస్ను పూర్తి స్థాయిలో పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్లో అతనికి చోటు లభించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల ఈ బృందం ఎంపికలో ఎలాంటి భారీ మార్పులు, సంచలనాలు చోటు చేసుకోలేదు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతినివ్వగా...గాయంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు తమ చివరి సిరీస్ ఆడిన టీమ్‌లో (దక్షిణాఫ్రికాతో) ఉన్న ఐదుగురు ఆటగాళ్లు తమ స్థానాలు నిలబెట్టుకోలేకపోయారు. రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు ఆసీస్‌తో టెస్టులు ఆడిన నితీశ్, హర్షిత్, సుందర్, జురేల్‌లను ఈ టి20 టీమ్‌లోకి తీసుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న రియాన్ పరాగ్నూ పక్కన పెట్టారు. ఈ నెల 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న జరిగే ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. భారత జట్టు వివరాలు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్ ), సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్. -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
టీమిండియా యువ బౌలర్‌కు వెన్నునొప్పి.. మరో పేసర్ అవుట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భారత క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడం ద్వారా యువకులు అంతర్జాతీయ టీ20లలోనూ ఆడే అవకాశం దక్కించుకుంటున్నారు. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ గతేడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు.అరేంగేట్ర మ్యాచ్లోనేలక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరేంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్.. తన పేస్ పదనుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ స్పీడ్‌స్టర్. అయితే, కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా.. ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిఅనంతరం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మయాంక్ యాదవ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాతో మూడు మ్యాచ్‌లలోనూ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో మయాంక్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న టీ20 సిరీస్‌కైనా ఎంపికవుతాడని భావిస్తే.. ఈసారి కూడా గాయం అతడికి అడ్డంకిగా మారింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదని సమాచారం.వెన్నునొప్పి వేధిస్తోందిఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని వెన్నునొప్పి వేధిస్తోంది. కాబట్టి ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించకపోవచ్చు. సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ రంజీ జట్టులో కూడా మయాంక్ పేరు లేకపోవడం గమనించే ఉంటారు’’ అని పేర్కొన్నాయి.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో తీరికలేకుండా గడిపిన ఈ ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని.. ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం తిరిగి రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అప్పుడే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బుమ్రా, సిరాజ్, షమీ గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ టీ20 సిరీస్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 సిరీస్, వన్డే షెడ్యూల్టీ20లుతొలి టీ20- జనవరి 22- కోల్కతారెండో టీ20- జనవరి 25- చెన్నైమూడో టీ20- జనవరి 28- రాజ్కోట్నాలుగో టీ20- జనవరి 31- పుణెఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబైవన్డేలుతొలి వన్డే- ఫిబ్రవరి 6- నాగ్పూర్రెండో వన్డే- ఫిబ్రవరి 9- కటక్మూడో వన్డే- ఫిబ్రవరి 12- అహ్మదాబాద్.చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
Ind vs Eng: తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!పంత్‌కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్‌గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్‌లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్‌లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్‌కు లైన్ క్లియర్‌గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్‌బర్గ్‌లో 47 బంతుల్లోనే 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్! -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. విండీస్‌కు ఘోర పరాభవం
వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దుమ్ములేపింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండు టెస్టు, మూడు వన్డే, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.టీ20లను విజయంతో ఆరంభించిటెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన బంగ్లా జట్టు.. వన్డేల్లో మాత్రం 3-0తో చిత్తుగా ఓడింది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం ఆది నుంచే సత్తా చాటిన లిటన్ దాస్ బృందం.. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ఏడు, ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ నెగ్గింది.జాకెర్ అలీ ధనాధన్ ఇక సెయింట్ విన్సెంట్ వేదికగా నామమాత్రపు మూడో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ లిటన్ దాస్ విఫలం కాగా.. పర్వేజ్ హుసేన్ ఇమాన్(39) మెరుగ్గా ఆడాడు. మిగతా వాళ్లలో మెహదీ హసన్ మిరాజప్ 29 రన్స్ చేయగా.. జాకెర్ అలీ ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు.జాకెర్ అలీ మొత్తంగా 41 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 189 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, గుడకేశ్ మోటీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రొమారియో షెఫర్డ్ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రొమారియో షెఫర్డ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 23, వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 15 రన్స్ చేశాడు. మిగతావాళ్లంతా పూర్తిగా విఫలం కావడంతో.. 16.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. టస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తాంజిమ్ హసన్ సకీబ్, హసన్ మహమూద్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జాకెర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మెహదీ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక మూడో టీ20లో విండీస్‌ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌కు.. టీ20లలో ఆ జట్టును వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. తద్వారా లిటన్ దాస్ బృందం బంగ్లా తరఫున సరికొత్త చరిత్ర సృష్టించింది.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్‌లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాధ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్‌కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదింది. అలీన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్‌బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
పాకిస్తాన్‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్.. సెంచరీ మిస్ఇందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(11) విఫలం కాగా.. సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్ పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మన్, డయాన్ గాలియెమ్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.రీజా హెండ్రిక్స్ విధ్వంసం.. ‘తొలి’ శతకంపాక్ యువ పేసర్ జహన్‌బాద్ ఖాన్ ఓపెనర్ రియాన్ రికెల్టన్ను రెండు పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తలవంచకతప్పలేదు.రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్‌ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్‌కు ఇదే తొలి శతకం కావడం విశేషం.సిరీస్ సౌతాఫ్రికా కైవసంఇక రీజాకు తోడుగా రాసీ వన్ డెర్ డసెన్ మెరుపు ఇన్నింగ్స్(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్ బౌలర్లలో జహన్‌బాద్ ఖాన్‌కు రెండు, అబ్బాస్ ఆఫ్రిదికి ఒక వికెట్ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
Zim vs Pak: తొలి టీ20లో పాకిస్తాన్ గెలుపు
జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.108 పరుగులకే ఆలౌట్జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)👉జింబాబ్వే స్కోరు:108 (15.3)👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.చదవండి: ‘పింక్’ మ్యాచ్‌లో భారత్‌దే విజయం -
భారత్‌తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.డిసెంబరు 15న టీ20తో మొదలునవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్‌కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్‌కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ మహిళా జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్టీ20 సిరీస్👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబైవన్డే సిరీస్👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా. -
ఆసీస్‌తో మూడో టీ20.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్‌లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్‌తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి -
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్‌తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్‌తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్‌లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్‌లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
సంజూ భారీ సిక్సర్.. లేడీ ఫ్యాన్ చెంపకు తగిలిన బంతి! వీడియో
సౌతాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆఖరి టీ20లో మాత్రం దెబ్బతిన్న సింహంలా విజృంభించాడు. జోహన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శాంసన్ కొట్టని ఓ భారీ సిక్సర్ నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళా అభిమాని ముఖానికి తగిలింది. ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన స్టబ్స్ రెండో బంతిని మిడిల్ అండ్ లెగ్‌లో ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శాంసన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ఆ బంతి మొదట సెక్యూరిటీ గార్డును తాకి, ఆపై స్టాండ్స్‌లో ఉన్న అమ్మాయి దవడకు తగిలింది.దీంతో ఆ లేడీ ఫ్యాన్ నొప్పిని భరించలేక ఏడ్చేసింది. ఆమెకు వెంటనే ఐస్ తెచ్చి దవడపై ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆమె గాయపడినట్లు తెలియగానే సంజూ క్షమాపణలు కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ను 135 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు Wishing a quick recovery for the injured fan! 🤕🤞Keep watching the 4th #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 👈#JioCinemaSports pic.twitter.com/KMtBnOa1Hj— JioCinema (@JioCinema) November 15, 2024 -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్‌బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్‌పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్‌గా 46 రన్స్‌తో 187కు పైగా స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్‌లో మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
సామ్ కుర్రాన్ విధ్వంసం.. విండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. 2019 తర్వాత కరేబియన్ గడ్డపై టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.ఇక వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా..షెఫర్డ్(30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, జెమ్మీ ఓవర్టన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 146 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్(26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్ స్టోన్(39), విల్ జాక్స్(32) పరుగులతో సత్తాచాటారు. విండీస్ స్పిన్నర్ 4 వికెట్లతో చెలరేగినప్పటకి తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక నాలుగో టీ20 ఇరు జట్ల మధ్య నవంబర్ 16న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై! -
మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్రిస్బేన్ వేదికగా పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాబా స్టేడియంలో ఆసీస్- పాక్ మధ్య గురువారం తొలి టీ20 జరిగింది.వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ టీ20 మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగాఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్(19 బంతుల్లో 43) రాకతో సీన్ మారింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగా.. నాలుగో నంబర్ బ్యాటర్ టిమ్ డేవిడ్(10) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో మాక్సీకి తోడైన మార్కస్ స్టొయినిస్(7 బంతుల్లో 21 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.మాక్సీ, స్టొయినిస్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’కు గురైంది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో 64 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(8)ను అవుట్ చేసి స్పెన్సర్ జాన్సన్ వికెట్ల వేట మొదలుపెట్టగా.. జేవియర్ బార్ట్లెట్ మహ్మద్ రిజ్వాన్(0)ను డకౌట్ చేశాడు. అనంతరం ఉస్మాన్ ఖాన్(4)ను కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు.ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ బాబర్ ఆజం(3)తో పాటు.. ఇర్ఫాన్ ఖాన్(0) వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగిన బార్ట్లెట్ ఆఘా సల్మాన్(4)ను వెనక్కి పంపగా.. నాథన్ ఎల్లిస్ హసీబుల్లా ఖాన్(12) పనిపట్టాడు. అయితే, అబ్బాస్ ఆఫ్రిది(20 నాటౌట్)తో కలిసి టెయిలెండర్ షాహిన్ ఆఫ్రిది(6 బంతుల్లో 11) బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేయగా.. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా అతడిని బౌల్డ్ చేశాడు. అనంతరం.. పాక్ ఇన్నింగ్స్ ఆఖరి వికెట్‌గా నసీం షాను బౌల్డ్ చేసి వెనక్కి పంపించాడు. 64 పరుగులకేఈ క్రమంలో పాకిస్తాన్ ఏడు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 64 రన్స్ చేసింది. ఫలితంగా ఆసీస్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించి ఆసీస్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా రెండో టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
పాక్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత.. చరిత్ర పుటల్లోకి!
పాకిస్తాన్‌తో తొలి టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. 226కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేసిన మాక్సీ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.ఇక మాక్సీతో పాటు మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం ఏడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.కాగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలైంది.గాబా స్టేడియంలో గురువారం నాటి ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో టీ20ని ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9).. అదే విధంగా టిమ్ డేవిడ్(10) విఫలం కాగా.. మాక్సీ, స్టొయినిస్ దంచికొట్టారు.చరిత్ర పుటల్లోకి!ఇక పాక్‌తో తొలి టీ20 సందర్భంగా మాక్స్వెల్ పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10012) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో చేరారు. 'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్‌లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
టీమిండియా తదుపరి హెడ్‌కోచ్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.శుభారంభమే అయినాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ హీరో గౌతం గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు.అయితే, లంకతో వన్డే సిరీస్‌లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్‌వాష్ విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలుఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మాత్రంమరోవైపు.. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జింబాబ్వే టూర్లో లక్ష్మణ్ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్ జట్టుపై కూడా సూర్యకుమార్ సేన సత్తా చాటుతోంది.సెంచూరియన్‌లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ లక్ష్మణ్‌పై ప్రశంసలు కురిపించాడు.టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు‘‘ఈరోజు వీవీఎస్ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో నంబర్లో బ్యాటింగ్‌కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ గనుక విఫలమైతే.. వీవీఎస్ తదుపరి కోచ్‌గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.11 పరుగుల తేడాతో టీమిండియా విజయంకాగా సెంచూరియన్‌లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్‌కు బదులు తిలక్ వర్మ మూడో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్‌రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్‌బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అశ్విన్ రికార్డు బద్దలు...ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.చదవండి: IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది -
టీమిండియాతో సిరీస్.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
టీ20 సిరీస్‌లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్ జట్టు తహతహలాడుతున్నాయి.మొదటి రెండు టీ20లలో అలాఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్‌లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్ గిబ్స్ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్, జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.3-1తో ప్రొటిస్ జట్టుదే సిరీస్ఆ రెండు మ్యాచ్‌లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటిస్ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్ గిబ్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్బూమ్తో వ్యాఖ్యలు చేశాడు.మిగిలిన రెండు టీ20లలోకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకునిఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్ గిబ్స్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డాన్ వాన్ బంగ్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.ఇక గిబ్స్ తర్వాత వన్డేల్లో జస్కరన్ మల్హోత్రా (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్‌లో మళ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ(2021లో) బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు.సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టుసంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్‌కుమార్ వైశాఖ్, రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్.సౌతాఫ్రికా జట్టురియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్నీల్ బార్ట్‌మన్, లుథో సిపామ్లా.చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్! -
WI vs Eng: డూ ఆర్ డై.. సిరీస్ మొత్తానికి విధ్వంసకర వీరుడు దూరం
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. తమ టీమ్‌లో మూడు కీలక మార్పులు చేసినట్లు బుధవారం వెల్లడించింది. యువ పేసర్ షమార్ స్ప్రింగర్ పునరాగమనం చేయనుండగా.. మరో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ సైతం రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.వన్డే సిరీస్ విండీస్దేఅదే విధంగా.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇంగ్లండ్‌తో మిగిలిన టీ20లకు దూరమైనట్లు విండీస్ బోర్డు పేర్కొంది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. వన్డే సిరీస్‌ను ఆతిథ్య విండీస్ 2-1తో గెలుచుకోగా.. మొదటి రెండు టీ20లలో గెలిచి ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.17 బంతుల్లో 30 పరుగులుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం మూడో టీ20 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు మిగిలిన సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. కాగా బట్లర్ బృందంతో తొలి టీ20లో పాల్గొన్న రసెల్.. 17 బంతుల్లో నాలుగు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. అయితే, వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.ఈ మ్యాచ్ సందర్భంగా మడమ నొప్పితో బాధపడ్డ ఆండ్రీ రసెల్.. రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. అయితే, గాయం తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో అతడిని మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. మరోవైపు.. గత నెలలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన షమార్ స్ప్రింగర్ రీఎంట్రీ ఇచ్చాడు.డూ ఆర్ డై మ్యాచ్అదే విధంగా.. మూడో వన్డే సందర్భంగా కెప్టెన్ షాయీ హోప్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు నిషేధం ఎదుర్కొన్న అల్జారీ జోసెఫ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా రసెల్ దూరం కావడం విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బలాంటిది. ఇక సెయింట్ లూసియా వేదికగా మూడో టీ20లో గెలిస్తేనే వెస్టిండీస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా తొలి టీ20లో ఎనిమిది వికెట్లు, రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఇంగ్లండ్ విండీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయిర్, టెర్రాన్ హిండ్స్, షాయీ హోప్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
సౌతాఫ్రికాతో మొదటి టీ20లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించలేకపోయింది. కీలక బ్యాటర్లంతా విఫలం కావడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ గెలవాలంటే.. మిగిలిన రెండు టీ20లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.సంజూ శాంసన్ ధనాధన్ సెంచరీ వల్లనిజానికి డర్బన్‌లో జరిగిన తొలి టీ20లోనూ ఓపెనర్ సంజూ శాంసన్(50 బంతుల్లో 107), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33) రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. మిగతా వాళ్లంతా విఫలమైనా 202 రన్స్ రాబట్టగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ప్రొటిస్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.రెండో టీ20లో మాత్రంఅయితే, గెబెహా వేదికగా రెండో టీ20లో మాత్రం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) అనూహ్య రీతిలో డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(4) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య సైతం నాలుగు పరుగులకే వెనుదిరగగా.. మిడిలార్డర్లో తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) కాసేపు క్రీజులో నిలబడ్డారు.ఇక లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్(9) నిరాశపరచగా.. టెయిలెండర్ అర్ష్‌దీప్ సింగ్(7 నాటౌట్) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా కేవలం 124 పరుగులే చేసింది. అయితే, సౌతాఫ్రికాను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు మాత్రం ఆఖరి వరకు గట్టి పోరాటం చేశాడు.అయినప్పటికీ 19 ఓవర్లలోనే ప్రొటిస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది. టీమిండియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ 1-1తో సమం చేసింది. ఇలా తొలి రెండు మ్యాచ్‌లలోనూ బౌలర్లు వందశాతం పాసైనా.. బ్యాటర్లలోనే నిలకడ లోపించింది. ఆల్‌రౌండర్ అవసరం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెంచూరియన్ వేదికగా మూడో టీ20పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సూర్య సేన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలదు. ఈ క్రమంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌ను అరంగ్రేటం చేయించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఎనిమిదో స్థానంలో మనకు ఓ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. అతడు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగలగాలి.అతడిని ఆడిస్తేనే మంచిదిఅతడు స్పిన్నరా? లేదంటే ఫాస్ట్ బౌలరా అన్న అంశంతో మనకు పనిలేదు. హార్దిక్ పాండ్యా కాకుండా.. అతడిలా ఆడగలిగే మరో క్రికెటర్ కావాలి. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రధాన లోటు అదే. ప్రస్తుతం రమణ్‌దీప్ సింగ్ సరైన ఆప్షన్లా కనిపిస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టులో ఆడిస్తే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప జియో సినిమా షోలో పేర్కొన్నాడు.కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టుతో ఉన్నాడు. అయితే, రమణ్‌దీప్ సింగ్‌కు లైన్ క్లియర్ కావాలంటే.. మిగిలిన ఆటగాళ్లలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. అలాంటి పరిస్థితిలో తొలి రెండు టీ20లలో ఘోరంగా విఫలమైన ఏకక ఆటగాడు అభిషేక్ శర్మ(7, 4)నే తప్పించే అవకాశమే ఎక్కువగా ఉంది. అదే జరిగితే ఓపెనింగ్ జోడీలోనూ మార్పు వస్తుంది. కాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బౌలర్లు అద్భతంగా పోరాడినప్పటికి బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయారు. మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ తొలి ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శ్మ (4), సూర్యకుమార్ యాదవ్ (4) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27) పర్వాలేదన్పించారు.పాండ్యా సెల్పిష్ ఇన్నింగ్స్.. !ఇక భారత ఇన్నింగ్స్ 8 ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు స్కోర్ 120 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. ఓ వైపు వికెట్లు క్రమం తప్పకుండా పడతుండడంతో హార్దిక్ సింగిల్స్ తీస్తూ భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.ఆఖరి మూడు ఓవర్లలో హిట్టింగ్‌కు హార్దిక్ ప్రయత్నించాడు. కానీ ఆఖరిలో కూడా పాండ్యా ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో స్ట్రైక్ తన వద్దే అంటిపెట్టుకున్న పాండ్యా కేవలం బౌండరీ మాత్రమే బాదాడు. ఓవరాల్‌గా 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. స్ట్రైక్ రేట్ 86.67తో 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఓ సిక్స్ మాత్రమే ఉన్నాయి. అయితే స్లో స్ట్రైక్ రేట్‌తో ఆడిన పాండ్యాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేరాడు. పాండ్యాను ఉద్దేశించి అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ జట్టు అవసరాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అలీ ఆరోపించాడు."పాండ్యా సార్ ఆజేయంగా నిలిచి 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతడు ఈ ఇన్నింగ్స్ జట్టు కోసం కాదు తన కోసం ఆడాడు. హార్దిక్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన తీరు క్షమించరానిది. అర్ష్‌దీప్ సింగ్ సిక్సర్ కొట్టినప్పటికి అతడు హార్దిక్ స్ట్రైక్ కూడా ఇవ్వలేదు. భారత్ చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నప్పటికి పాండ్యా సింగిల్స్‌ను తిరష్కరించాడు. స్ట్రైక్ తనవద్దే అంటిపెట్టుకుని ఏమి సాధించాడు. అతడి కంటే అక్షర్ పటేల్ ఎంతో బెటర్. పాండ్యా కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 27 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
బ్రిడ్జిటౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెఫార్డ్ 22 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, మౌస్లీ, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అర్చర్, రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.జోస్ బట్లర్ విధ్వంసం..అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.అతడితో పాటు విల్ జాక్స్(38) రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు, అకిల్ హోస్సేన్ ఓ వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: IND vs SA: సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు