పాకిస్తాన్‌దే సిరీస్‌ | Australia lose in the second T20I as well | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌దే సిరీస్‌

Feb 1 2026 3:57 AM | Updated on Feb 1 2026 3:57 AM

Australia lose in the second T20I as well

రెండో టి20లోనూ ఆ్రస్టేలియా ఓటమి 

లాహోర్‌: ఐసీసీ టి20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌ జట్టు ఆ్రస్టేలియాపై సిరీస్‌ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్‌ 90 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సల్మాన్‌ ఆగా (76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఉస్మాన్‌ ఖాన్‌ (53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్‌ గ్రీన్‌ (20 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలినవాళ్లు ప్రభావం చూపలేక పోయారు. అబ్రార్‌ అహ్మద్, షాదాబ్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement