australia
-
IND VS AUS: భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
IND VS AUS 1st Test Day 3 Live Updates: భారీ ఆధిక్యం దిశగా టీమిండియాఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్‌దత్ పడిక్కల్ (17) క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్‌కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.తొలి వికెట్ కోల్పోయిన భారత్201 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (77) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌కు (102) జతగా దేవ్‌దత్ పడిక్కల్ క్రీజ్‌లోకి వచ్చాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్ఓపెనర్ యశస్వి జైస్వాల్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వి సెంచరీలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ 74 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 62 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 197/0గా ఉంది. మూడో రోజు మొదలైన ఆటభారత, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోర్ 172/0 వద్ద భారత్ మూడో రోజు ఆట ప్రారంభించింది. కేఎల్ రాహుల్ (62), యశస్వి జైస్వాల్ (90) క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మిచ్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20) ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో నాథన్ మెక్‌స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26) రెండంకెల స్కోర్లు చేశారు. -
పెర్త్‌పై పట్టు
బౌలర్ల అసమాన ప్రదర్శనకు... ఓపెనర్ల సహకారం తోడవడంతో పెర్త్ టెస్టుపై టీమిండియాకు పట్టు చిక్కింది. తొలి రోజు పేస్‌కు స్వర్గధామంలా కనిపించిన పిచ్‌పై రెండో రోజు భారత ఓపెనర్లు చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ్రస్టేలియా బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోగా... జైస్వాల్, రాహుల్ అర్ధశతకాలతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మన పేసర్ల ధాటికి ఆ్రస్టేలియా 104 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్... మూడోరోజు ఇదే జోరు కొనసాగిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో బోణీ కొట్టడం ఖాయం!పెర్త్: ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అన్న చందంగా... తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్ సెలెక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్‌లో సాధికారికంగా ఆడటంతో ఆ్రస్టేలియాతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కంగారూ పేసర్ల కఠిన పరీక్షకు భారత ఓపెనర్లు సమర్థవంతంగా ఎదురు నిలవడంతో పెర్త్ టెస్టులో బుమ్రా సేన పైచేయి దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 67/7తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మిషెల్ స్టార్క్ (112 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (21) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగినా... స్టార్క్ మొండిగా పోరాడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా... హర్షిత్ రాణా 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (193 బంతుల్లో 90 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువవగా... తొలి ఇన్నింగ్స్‌లో సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరిన రాహుల్ (153 బంతుల్లో 62 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయతి్నంచినా ఆసీస్ ఈ జోడీని విడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు 17 వికెట్లు కూలగా... రెండో రోజు మూడు వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారకపోయినా... భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించనుంది. స్టార్క్ అడ్డుగోడలా.. తొలి రోజు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన భారత బౌలర్ల సహనానికి రెండోరోజు స్టార్క్ పరీక్ష పెట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తలపిస్తూ తన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు.ఓవర్‌నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీని కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన బుమ్రా... టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. నాథన్ లయన్ (5) కూడా త్వరగానే ఔట్ కాగా... చివరి వికెట్‌కు హాజల్‌వుడ్ (31 బంతుల్లో 7 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి స్టార్క్ చక్కటి పోరాటం కనబర్చాడు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ఎన్ని ప్రయోగాలు చేసినా సాధ్యపడలేదు. ఈ ఇద్దరు పదో వికెట్‌కు 110 బంతుల్లో 25 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించారు. చివరకు హర్షిత్ బౌలింగ్‌లో స్టార్క్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫలితంగా భారత జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనింగ్ అజేయం తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ... రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే అయినా... భీకర పేస్‌తో విజృంభిస్తున్న కంగారూ బౌలర్లను కాచుకుంటూ జైస్వాల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్లిష్టమైన బంతుల్ని డిఫెన్స్ ఆడిన ఈ జోడీ... చెత్త బంతులకు పరుగులు రాబట్టింది. జైస్వాల్ కచ్చితమైన షాట్ సెలెక్షన్‌తో బౌండరీలు బాదాడు. రాహుల్ డిఫెన్స్‌తో కంగారూలను కలవరపెట్టాడు. సమన్వయంతో ముందుకు సాగిన ఓపెనర్లిద్దరూ బుల్లెట్లలాంటి బంతుల్ని తట్టుకొని నిలబడి... గతితప్పిన బంతులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3.01 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట జైస్వాల్ 123 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కాసేపటికి రాహుల్ 124 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. టెస్టు క్రికెట్లో జైస్వాల్‌కు ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్‌సెంచరీ కాగా... ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన ఆసీస్ బౌలర్లు... మూడో రోజు తొలి సెషన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేదానిపై భారత ఆధిక్యం ఆధారపడి ఉంది. మైదానంలో బాగా ఎండ కాస్తుండటంతో... నాలుగో ఇన్నింగ్స్‌లో పగుళ్లు తేలిన పిచ్‌పై లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చు. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు పెర్త్ టెస్టుకు అభిమానులు ఎగబడుతున్నారు. రెండో రోజు శనివారం ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 32,368 మంది అభిమానులు వచ్చారు. ఈ స్టేడియం చరిత్రలో టెస్టు మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకుల హాజరు కావడం ఇదే తొలిసారి. ‘భారత్, ఆ్రస్టేలియా తొలి టెస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రెండు రోజుల్లో 63,670 మంది మ్యాచ్‌ను వీక్షించారు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచ్ (2006–07 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మ్యచ్)కు అత్యధికంగా 1,03,440 మంది హాజరయ్యారు. ఇప్పుడు తాజా టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... ఇంకో 39,771 మంది తరలివస్తే ఆ రికార్డు బద్దలవనుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ రాణా 26; లయన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ రాణా 5; హాజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 104. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59, 8–70, 9–79, 10–104. బౌలింగ్: బుమ్రా 18–6–30–5, సిరాజ్ 13–7–20–2, హర్షిత్ రాణా 15.2–3–48–3, నితీశ్ రెడ్డి 3–0–4–0, సుందర్ 2–1–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172. బౌలింగ్: స్టార్క్ 12–2–43–0, హాజల్‌వుడ్ 10–5–9–0, కమిన్స్ 13–2–44–0, మార్ష్ 6–0–27–0, లయన్ 13–3–28–0, లబుషేన్ 2–0–2–0, హెడ్ 1–0–8–0. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు భారత్ జోరు
-
కుప్పకూలి... కూల్చేసి...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక కష్టమే అనిపించిన దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే... బంతితో తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బుమ్రా చాటి చెప్పగా... అతడికి సిరాజ్, హర్షిత్ రాణా చక్కటి సహకారం అందించారు. రెండో రోజు ఇదే జోరు కొనసాగి... బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడైతే ఈ మ్యాచ్‌పై భారత్‌కు పట్టు చిక్కుతుంది. పెర్త్: బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఆట ముగిసే సమయానికి భారత్ భారీ ఆధిక్యం సాధించే స్థితిలో నిలిచింది. ఆ్రస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో (59 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలవగా... రిషబ్ పంత్ (78 బంతుల్లో 37; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (74 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4 వికెట్లు... స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (28 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు), స్టార్క్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు తొలి సెషన్లో వీలైనంత త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేస్తే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కుతుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడితే ఈ టెస్టు ఫలితాన్ని శాసించే అవకాశం లభిస్తుంది. బుల్లెట్‌లాంటి బంతులతో.. బ్యాటర్ల వైఫల్యంతో డీలా పడ్డ జట్టులో బుమ్రా తిరిగి జవసత్వాలు నింపాడు. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. మూడో ఓవర్లో మెక్‌స్వీనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా... ఏడో ఓవర్లో ఆసీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఉస్మాన్ ఖ్వాజా (8)ను అవుట్ చేసిన బుమ్రా... ఆ మరుసటి బంతికి ప్రమాదకర స్టీవ్ స్మిత్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కెప్టెన్ స్పూర్తితో చెలరేగిన యువ పేసర్ హర్షిత్ రాణా మంచి వేగంతో ఆకట్టుకోగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ మెయిడెన్లతో విజృంభించాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (11)ను హర్షిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినా... ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అది సరైందనే భావన బలపడింది. మార్ష్ (6) రూపంలో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న సిరాజ్... క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ (52 బంతుల్లో 2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్ సారథి కమిన్స్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. పేస్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. నమ్మకాన్ని నిలబెట్టుకున్న నితీశ్ ప్లేయర్ల సహనానికి పరీక్ష పెట్టే పెర్త్ పిచ్‌పై మొదట మన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లు విజృంభిస్తుంటే... కుదురుకోవడానికి ప్రయత్నించకుండా బాధ్యతారహిత షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) మూడో ఓవర్లోనే అవుట్ కాగా... 23 బంతులు ఎదుర్కొన్న దేవదత్ పడిక్కల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఆదుకుంటాడనుకున్న కోహ్లి (5) ఎక్కువసేపు నిలవలేకపోగా... కాస్త పోరాడిన కేఎల్ రాహుల్ అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ధ్రువ్ జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న పంత్‌కు నితీశ్ జత కలవడంతో భారత జట్టు కోలుకోగలిగింది.ఆసీస్ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న పంత్... కమిన్స్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌తో ఆకట్టుకోగా... తొలి టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి ధాటిగా ఆడాడు. ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం పంత్ వెనుదిరిగాడు. పంత్ అవుటయ్యాక నితీశ్వేగంగా ఆడి జట్టు స్కోరును 150కి చేర్చి చివరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 26; పడిక్కల్ (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) హాజల్‌వుడ్ 5; పంత్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 37; జురేల్ (సి) లబుషేన్ (బి) మార్ష్ 11; సుందర్ (సి) కేరీ (బి) మార్ష్ 4; నితీశ్ రెడ్డి (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 41; హర్షిత్ (సి) లబుషేన్ (బి) హాజల్‌వుడ్ 7; బుమ్రా (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 8; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–32, 4–47, 5–59, 6–73, 7–121, 8–128, 9–144, 10–150. బౌలింగ్: స్టార్క్ 11–3–14–2; హాజల్‌వుడ్ 13–5–29–4; కమిన్స్ 15.4–2–67–2; లయన్ 5–1–23–0; మార్ష్ 5–1–12–2. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (బ్యాటింగ్) 19; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (27 ఓవర్లలో 7 వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59. బౌలింగ్: బుమ్రా 10–3–17–4; సిరాజ్ 9–6–17–2; హర్షిత్ రాణా 8–1–33–1. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు నితీశ్‌కు మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లీ టెస్టు క్యాప్ అందించగా... హర్షిత్‌కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ జాతీయ జట్టు క్యాప్ ఇచ్చి అభినందించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 315వ ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి, 316వ ప్లేయర్‌గా హర్షిత్ నిలిచారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్‌లో నితీశ్ తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. న్యూఢిల్లీలో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆ్రస్టేలియా ఓపెనర్ మెక్‌స్వీనీ కూడా పెర్త్ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. -
టీమిండియాతో తలపడబోయే ప్రైమ్ మినిస్టర్ జట్టు ఇదే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మధ్యలో (తొలి టెస్ట్ అనంతరం) భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. కాన్బెర్రా వేదికగా ఈ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (నవంబర్ 22) ప్రకటించింది. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌లో ప్రస్తుత ఆసీస్ జట్టులోని సభ్యుడు స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌కు ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ టిమ్ పైన్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. జాక్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ జట్టు ఆస్ట్రేలియా అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలతో నిండి ఉంది. ఈ జట్టులో స్కాట్ బోలాండ్, మ్యాట్ రెన్షాలకు జాతీయ జట్టుకు ఆడిన అనుభవం ఉంది. మిగతా ఆటగాళ్లంతా అన్క్యాప్డ్ ప్లేయర్లే. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన మూడేళ్లలో భారత్ పింక్ బాల్ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి.టీమిండియా విషయానికొస్తే.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. తాను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయాన్ని హిట్‌మ్యాన్ బీసీసీఐకి ఇదివరకే తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ జట్టు మొత్తం పాల్గొంటుంది. రెండో టెస్ట్ పింక్ బాల్‌తో ఆడే టెస్ట్ కాబట్టి టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా ఉపయెగపడుతుంది.ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI స్క్వాడ్..జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, మహ్లీ బియర్డ్‌మన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఐడాన్ ఓ'కానర్, ఒల్లీ డేవిస్, జేడెన్ గుడ్విన్, సామ్ హార్పర్, హన్నో జాకబ్స్, సామ్ కాన్స్టాస్, లాయిడ్ పోప్, మాథ్యూ రెన్షా, జెమ్ ర్యాన్.ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 22) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు పేట్రేగిపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత ఇన్నింగ్స్ 98/6 స్కోర్ వద్ద కొనసాగుతుంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 26, దేవ్‌దత్ పడిక్కల్ 0, విరాట్ కోహ్లి 5, ధృవ్ జురెల్ 11, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులకు ఔటయ్యారు. రిషబ్ పంత్ (27), నితీశ్ కుమార్ రెడ్డి (15) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు.ఇక భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటికి బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో కంగారులను దెబ్బతీయగా.. సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(41) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడితో వికెట్ కీపర్ రిషబ్ పంత్(37) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్కెప్టెన్ కమిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి కమిన్స్(3) పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 59/7 (24.4). ఆరో వికెట్ డౌన్..భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన లబుషేన్.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 23 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 48-6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..38 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 39-5నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.కష్టాల్లో ఆసీస్.. 19 పరుగులకే 3 వికెట్లు డౌన్19 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా వరుస బంతుల్లో ఉస్మాన్ ఖ్వాజా (8), స్టీవ్ స్మిత్‌ను (0) ఔట్ చేశాడు. 7 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 19/3గా ఉంది. ట్రవిస్ హెడ్, లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియానాథన్ మెక్స్వినీ రూపంలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఖవాజా , లబుషేన్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 19-1.150 పరుగులకు ఆలౌటైన టీమిండియా150 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నితీశ్ కుమార్ రెడ్డి (41) చివరి వికెట్‌గా వెనురిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియాబుమ్రా రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి బుమ్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. సిరాజ్ క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి 35 పరుగులతో ఆడుతున్నాడు. భారత్‌స్కోరు: 144-9(49)ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా128 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లబూషేన్ క్యాచ్ పట్టడంతో హర్షిత్ రాణా (7) ఔటయ్యాడు. నితీశ్ కుమార్‌కు (27) జతగా బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ ఔట్121 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (37) ఔటయ్యాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి (27) జతగా హర్షిత్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా73 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మిచ్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రిషబ్ పంత్‌కు (17) జతగా నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్‌లోకి వచ్చాడు. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది టీమిండియా. 59 పరుగుల వద్ద మిచ్ మార్ష్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి జురెల్ (11) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. కష్టాల్లో టీమిండియాలంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25)పంత్ పది, జురెల్ నాలుగు పరుగులతోక్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా47 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా ధృవ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా32 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (5) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా14 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి దేవ్‌దత్ పడిక్కల్ డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల టీమ్ స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్ మెక్‌స్వీనికి క్యాచ్‌ని జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్పెర్త్లోని అప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని డెబ్యూ చేయనున్నాడు. తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
BGT: ఆసీస్‌తో తొలి టెస్ట్.. ఆంధ్రా కుర్రాడితో పాటు మరో ఆటగాడి అరంగేట్రం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఆంధ్ర ఆటగాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తమ డెబ్యూ క్యాప్‌లు అందుకున్నారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మరో కీలక మార్పు కూడా చేసింది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్‌ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తాడు. అలాగే వన్‌డౌన్‌లో దేవ్‌దత్ పడిక్కల్ బరిలోకి దిగనున్నాడు. ధృవ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలో ఉంటాడు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని అరంగేట్రం చేయనున్నాడు. మెక్‌స్వీని డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధం
-
India vs Australia: ఎవరిదో శుభారంభం!
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుంది. 136 ఏళ్ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా మూడు సిరీస్‌లలో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. 1888లో ఇంగ్లండ్ జట్టు మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు భారత జట్టుకు ఈ అవకాశం లభిస్తోంది. అయితే ఈసారి భారత జట్టుకు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం... తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం... గాయంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ వైదొలగడం... పుజారా, రహానే వంటి టెస్టు స్పెషలిస్టులు లేకపోవడం... కోహ్లి, కేఎల్ రాహుల్ ఆటలో నిలకడలేమి... వెరసి భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదు. గత రెండు పర్యాయాల్లో భారత జట్టు చేతిలో సిరీస్ కోల్పోయిన ఆ్రస్టేలియా ఈసారి మాత్రం అదరగొట్టే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. భారత్‌పై తొలి టెస్టు నుంచే ఒత్తిడి పెంచి ఈ సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో కమిన్స్ బృందం ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండుసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ... ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 4–0తో గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో చిక్కి కివీస్ చేతిలో వైట్‌వాష్ కు గురైన భారత జట్టు... పేస్‌కు సహకరించే ఆ్రస్టేలియా గడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి! పెర్త్: పోరాటతత్వానికి పెట్టింది పేరైన ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సమరానికి భారత జట్టు సిద్ధమైంది. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి సిరీస్‌లో ఐదు టెస్టులు నిర్వహించనుండగా... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు అత్యవసరం కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం. గత రెండు ఆసీస్ పర్యటనల్లో (2018–19, 2020–21) సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా... వరుసగా మూడోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఒత్తిడిలో కనిపిస్తోంది. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టుకు ఇదే తొలి విదేశీ టెస్టు సిరీస్ కాగా... అతడితో పాటు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి ఈ పర్యటన మరింత కీలకం కానుంది. గత ఆసీస్ పర్యటనలో రాణించిన పుజారా, రహానే, షమీ, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేకపోగా... యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ పరీక్ష కానుంది. మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ మెరుగైన సాధనతో సిద్ధంగా ఉంది. నితీశ్ రెడ్డి అరంగేట్రం! ఆ్రస్టేలియా పర్యటనలో రాణిస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కెరీర్ తొలి నాళ్లలో సచిన్ టెండూల్కర్ ‘వాకా’ పిచ్‌పై శతకంతోనే మరింత పేరు ప్రఖ్యాతలు సాధించగా... 2014 ఆసీస్ టూర్ లో కోహ్లి నాలుగు శతకాలతో చెలరేగి ‘కింగ్’ అనిపించుకున్నాడు. యావత్ ప్రపంచ దృష్టి సారించే ఆ్రస్టేలియా పర్యటన ద్వారా పుజారా, రిషభ్ పంత్ సాధించిన గుర్తింపు తక్కువేమీ కాదు. అలాగే ఇక్కడ విఫలం కావడంతోనే కెరీర్‌కు ముగింపు పలికిన ప్లేయర్లకూ కొదవలేదు. గతంలో దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఇలాగే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లి, రోహిత్, అశ్విన్ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కనిపించే మాటల యుద్ధం ఈసారి పెద్దగా తెర పైకి రాకపోగా... తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనుండటం... ఆసీస్ సీనియర్ల నోటికి తాళాలు వేసినట్లు కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... గాయంతో దూరమైన గిల్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయనున్నాడు. కోహ్లి, పంత్‌తో కలిసి ధ్రువ్ జురేల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి, ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు జట్టులో స్థానం పక్కా కాగా... తాత్కాలిక కెప్టెన్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, హర్షిత్లలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. స్మిత్ అచ్చొచ్చిన స్థానంలోనే... డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్న ఆ్రస్టేలియా జట్టు పలు ప్రయోగాలు చేసి విఫలమైంది. టీమిండియాతో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఆ సమస్య తీరినట్లే అనిపిస్తోంది. ఇటీవల భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’జట్టుకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనీ ఈ సిరీస్‌లో ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.దీంతో స్మిత్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బరిలోకి దిగనున్నాడు. లబుషేన్, ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్, అలెక్స్ క్యారీలతో ఆసీస్ మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ పిచ్‌పై మెరుగైన గణాంకాలు ఉన్న నాథన్ లయన్ స్పిన్ బాధ్యతలు మోయనుండగా... కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ భారత టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టడానికి అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యారు. 24న రోహిత్ శర్మ రాక... వ్యక్తిగత కారణాలరీత్యా ఆ్రస్టేలియాతో తొలి టెస్టుకు దూరమైన భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈనెల 24న జట్టుతో చేరనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టులో బుమ్రా జట్టును నడిపించనుండగా... మొదటి టెస్టు మూడో రోజు రోహిత్ టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు (డే అండ్ నైట్) రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. పిచ్, వాతావరణం పెర్త్ పిచ్ పేస్‌కు, బౌన్స్‌కు ప్రసిద్ధి. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు అకాల వర్షం కారణంగా పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ వెల్లడించగా... రెండు రోజులుగా బాగా ఎండ కాయడంతో వికెట్ పూర్వ స్థితికి చేరింది. పచ్చికతో కూడిన పిచ్‌పై తొలి రోజు ఆట కీలకం కానుంది.భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ ఎంతో ప్రత్యేకమైంది. ఈసారి ఐదు మ్యాచ్‌లు ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత ఎక్కువ. తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనున్నప్పటికీ... ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అనుకోవడం లేదు. వేలంలో చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందులో ప్లేయర్లు చేయాడానికి ఏమీ ఉండదని అందరికీ తెలుసు. స్వదేశంలో ఆడేటప్పుడు అంచనాల ఒత్తిడి ఉండటం సహజమే. భారత్ కఠిన ప్రత్యర్థి. వారిని ఎదుర్కొనేందుకు మేం బాగా సిద్ధమయ్యాం. ఐపీఎల్ సందర్భంగా భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. బంతిని స్వింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో రాణించే సత్తా అతడిలో ఉంది. –ప్యాట్ కమిన్స్, ఆ్రస్టేలియా కెప్టెన్ కెప్టెన్సీని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తా. దాని కోసం సదా సిద్ధంగా ఉంటా. చిన్నప్పటి నుంచి సవాళ్లను ఎదుర్కోవడం అలవాటే. గతంలో నాయకత్వం చేసిన అనుభవం ఉంది. అయితే ఇది ఒక్క మ్యాచ్‌కే... రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ రెండో టెస్టు నుంచి బాధ్యతలు తీసుకుంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. రోహిత్, కోహ్లిని అనుకరించాలని చూడను. దేశానికి సారథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. మేనేజ్మెంట్కు అతడిపై విశ్వాసం ఉంది. కోహ్లి బ్యాటింగ్‌పై వ్యాఖ్యలు చేయను. అతడి సారథ్యంలోనే జట్టులోకి వచ్చా. జట్టులో అతడి ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలుసు. –బుమ్రా, భారత కెప్టెన్ 52 ఆ్రస్టేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత జట్టు ఇప్పటి వరకు 52 టెస్టులు ఆడింది. ఇందులో 9 టెస్టుల్లో గెలిచింది. 30 టెస్టుల్లో ఓడిపోయింది. 13 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.4 ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుండటం ఇది నాలుగోసారి. గతంలో 1947లో, 1977లో, 1991లో రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. ఐదు టెస్టులతో కూడిన మూడు సిరీస్లలోనూఆ్రస్టేలియా జట్టే విజేతగా నిలవడం గమనార్హం. తుది జట్లు (అంచనా) భారత్: బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లి, పంత్, జురేల్, అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ, సిరాజ్/ఆకాశ్‌దీప్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. -
బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు..!
క్రికెట్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్ అంపైర్ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ వెర్యార్డ్ రిజర్వ్ క్రికెట్ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి (స్ట్రయిట్ డ్రైవ్) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్ అంపైర్ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
IND Vs AUS: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా హీరోలు వీరే..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 రేపటి (నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభం కానుంది.తొలి టెస్ట్ ప్రారంభం నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు.. అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లపై ఓ లుక్కేద్దాం.టాప్-5 బ్యాటర్లు..5. చతేశ్వర్ పుజరా- 11 మ్యాచ్‌ల్లో 47.28 సగటున 993 పరుగులు (3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు)4. రాహుల్ ద్రవిడ్- 16 మ్యాచ్‌ల్లో 41.64 సగటున 1166 పరుగులు (సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు)3. వీవీఎస్ లక్ష్మణ్- 15 మ్యాచ్‌ల్లో 44.14 సగటున 1236 పరుగులు (4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)2. విరాట్ కోహ్లి- 13 మ్యాచ్‌ల్లో 54.08 సగటున 1352 పరుగులు (6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు)1. సచిన్ టెండూల్కర్- 20 మ్యాచ్‌ల్లో 43.20 సగటున 1809 పరుగులు (6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)టాప్-5 బౌలర్లు..5. జస్ప్రీత్ బుమ్రా- 7 టెస్ట్‌ల్లో 32 వికెట్లు4. బిషన్ సింగ్ బేడీ- 7 టెస్ట్‌ల్లో 35 వికెట్లు3. రవిచంద్రన్ అశ్విన్- 10 టెస్ట్‌ల్లో 39 వికెట్లు2. అనిల్ కుంబ్లే- 10 టెస్ట్‌ల్లో 49 వికెట్లు1. కపిల్ దేవ్- 11 టెస్ట్‌ల్లో 51 వికెట్లు -
పెర్త్‌లో బౌన్సీ పిచ్
పెర్త్: అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా... బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని... సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్‌లోని ‘వాకా’ పిచ్ అసాధారణ పేస్, అస్థిర బౌన్స్‌కు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నాడు. ‘ఇది సంప్రదాయ పెర్త్ టెస్టు పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల ఒక రోజంతా వృథా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి పేస్‌కు అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్‌ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్‌పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే. పిచ్‌పై ఉన్న పచ్చిక పేసర్లను ఊరిస్తుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది’ అని ఐజాక్ వివరించాడు. ‘వాకా’ పిచ్‌పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్‌పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా... అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
కోహ్లి ‘కీ’లకం!
జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్‌లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్మెంట్లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్‌లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్‌తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది! సుదీర్ఘ ఫార్మాట్‌ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్‌లో ఆసీస్‌పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి. పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్‌లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్‌లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే. ఫామ్ అందుకుంటాడా... గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్‌ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది. భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లిని వదిలేయండి: వాట్సన్ కీలక సిరీస్‌కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్‌ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్‌లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు. కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్‌ఫుట్‌కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు. విరాట్ ఒక చాంపియన్: లయన్ భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్‌లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు. -
BGT 2024-25: టీమిండియాతో తొలి టెస్ట్.. ఆసీస్ తుది జట్టు ఇదే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ బెర్త్‌లను ఖరారు చేస్తుంది. ఈ కారణంగా ఈ సిరీస్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్‌లో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాల్సి ఉంది.ఇలా జరగడం అంత ఆషామాషి విషయమేమీ కాదు. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలంటే భారత్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. భారత్ ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (0-3 తేడాతో సిరీస్ కోల్పోయింది) ఎదుర్కొంది. దీని ప్రభావం బీజీటీపై ఎంతో కొంత ఉంటుంది. మరోవైపు ఈ సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. తొలి టెస్ట్‌కు శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండడని సమాచారం. వ్యక్తిగత కారణాల (రెండో సారి తండ్రైనందున) చేత రోహిత్ తొలి టెస్ట్‌కు దూరం కానున్న విషయం తెలిసిందే.నలుగురు పేసర్లతో అటాక్ చేయనున్న ఆసీస్తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీమిండియాను నలుగురు పేసర్లతో అటాక్ చేయనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచ్ మార్ష్ టీమిండియాపై నిప్పులు చెరగనున్నారు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత బ్యాటర్లు ఆసీస్ పేసర్లను ఏమేరకు ఎదుర్కొంటారో వేచి చూడాలి.ఆసీస్ బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే.. డేవిడ్ వార్నర్‌కు రీప్లేస్‌మెంట్‌గా నాథన్ మెక్‌స్వీని బరిలోకి దిగడం దాదాపు ఖరారైపోయింది. మెక్‌స్వీని.. ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్‌డౌన్‌లో మార్నస్ లబూషేన్ బరిలోకి దిగనుండగా.. స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఐదో స్థానంలో ట్రవిస్ హెడ్ బరిలోకి దిగనుండగా.. ఆల్‌రౌండర్‌గా మిచ్ మార్ష్.. వికెట్‌కీపర్‌గా అలెక్స్ క్యారీ బరిలో ఉంటారు. తొలి టెస్ట్‌లో ఆసీస్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. స్పిన్ విభాగం నుంచి నాథన్ లియోన్ బరిలో ఉంటాడు.భారత్‌తో తొలి టెస్ట్ ఆసీస్ తుది జట్టు (అంచనా)..ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, నాథన్ లియోన్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ -
స్టోయినిస్ ఊచకోత.. పాక్‌ను ఊడ్చేసిన ఆస్ట్రేలియా
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆరోన్ హార్డీ మూడు వికెట్లతో పాక్ నడ్డి విరచగా.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు వికెట్లు.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 11.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (3 వికెట్లు కోల్పోయి). మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి పాక్ బౌలర్లను చీల్చిచెండాడు. జోష్ ఇంగ్లిస్ 24 బంతుల్లో 27 పరుగులు.. జేక్ ఫ్రేజర్ 11 బంతుల్లో 18 పరుగులు.. టిమ్ డేవిడ్ 3 బంతుల్లో 7 పరుగులు.. మాథ్యూ షార్ట్ 4 బంతుల్లో 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా గెలుపొందిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 117 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
హోబర్ట్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ (4-1-21-3), ఆడమ్ జంపా (4-0-11-2), స్పెన్సర్ జాన్సన్ (3.1-0-24-2), జేవియర్ బార్ట్లెట్ (3-0-25-1), నాథన్ ఇల్లిస్ (3-0-20-1) ధాటికి 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సాహిబా్జాదా ఫర్హాన్ 9, ఉస్మాన్ ఖాన్ 3, అఘా సల్మాన్ 1, అబ్బాస్ అఫ్రిది 1, జహందాద్ ఖాన్ 5, సూఫియాన్ ముఖీమ్ 1 పరుగు చేశారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన తొలి గేమ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టీ20లో 13 పరుగుల తేడాతో నెగ్గింది. టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
కోహ్లిపై ఒత్తిడి పెంచండి!
మెల్బోర్న్: ఆ్రస్టేలియా గడ్డపై విరాట్ కోహ్లి ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా 54.08 సగటుతో 1352 పరుగులు చేసిన కోహ్లి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. కెపె్టన్‌గా 2018–19లో తొలిసారి భారత జట్టుకు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ అందించిన ఘనత అతని సొంతం. అందుకే ఇటీవల కోహ్లి గొప్ప ఫామ్‌లో లేకపోయినా...ఆసీస్ దృష్టిలో అతనే ప్రధాన బ్యాటర్. కోహ్లిని నిలువరిస్తే భారత్‌ను అడ్డుకున్నట్లే అని అక్కడి మాజీ ఆటగాళ్లకూ తెలుసు. అందుకే కోహ్లిపై ఒత్తిడి పెంచాలని, అతడి భావోద్వేగాలతో ఆడుకోవాలని దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తమ బౌలర్లకు చెబుతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన విషయం వారి మనసుల్లో ఇంకా ఉంటుందని...దానిని కొనసాగించాలని అతను అన్నాడు. ‘ఒక జట్టు సొంతగడ్డపై 0–3తో ఓడి వస్తుందంటే కచ్చితంగా మనమే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్‌పై ఒత్తిడి కొనసాగించాలి. వారు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లిపై కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి’ అని మెక్‌గ్రాత్ చెప్పాడు. అయితే కొన్ని సార్లు ఇలా రెచ్చగొడితే కోహ్లి మరింత దూకుడుగా చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆసీస్ మాజీ పేసర్ చిన్న హెచ్చరిక కూడా జారీ చేశాడు. ‘కోహ్లిని లక్ష్యంగా చేసుకొని ఆ్రస్టేలియా బౌలర్లు పదేపదే తలపడితే అతనూ సిద్ధమైపోతాడు. అది అతడి అత్యుత్తమ ఆటను కూడా బయటకు తీయవచ్చు. సిరీస్ ఆరంభంలోనే తక్కువ స్కోర్లకు కట్టడి చేయగలిగితే కోహ్లి కూడా కోలుకోవడం కష్టమవుతుంది. నా దృష్టిలో కోహ్లితో భావోద్వేగాలపాలు ఎక్కువ. బాగా ఆడటం మొదలు పెడితే అస్సలు ఆగిపోడు. ఒక వేళ విఫలమైతే మాత్రం అదే కొనసాగుతుంది’ అని మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డాడు. -
బుమ్రా సారథ్యంలో...
పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు రెగ్యులర్ టాప్–3 బ్యాటర్లలో ఇద్దరు లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయంతో శుబ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టాపార్డర్‌లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు. మరో వైపు పేస్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బుమ్రా ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అతను ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సోమవారం భారత్ తమ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి మంగళవారం నుంచి మ్యాచ్ వేదిక అయిన ఆప్టస్ స్టేడియంలో సాధన చేస్తుంది. రెండో టెస్టునుంచి అందుబాటులోకి... సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా...మ్యాచ్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్ ఆడటంపై చర్చ జరిగింది. దీనికి ఫుల్స్టాప్ పెడుతూ కెప్టెన్ తుది నిర్ణయం తీసుకున్నాడు. మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపించిన అతను తొలి మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో (డే అండ్ నైట్) టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని...నవంబర్ 30నుంచి ఆ్రస్టేలియన్ పీఎం ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడతానని బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ఈశ్వరన్‌కూ అవకాశం! శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శుబ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్ రాహుల్ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్స్‌రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఆదివారం మళ్లీ బ్యాటింగ్ చేసిన రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు రాహుల్ స్వయంగా వెల్లడించాడు. రాహుల్ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్‌తో పాటు రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని ఆటపై సందేహాలు రేగాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్ అవకాశం దక్కవచ్చు. మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. అవసరమైతే అతనూ టెస్టు సిరీస్ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్‌పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ కూడా ఆ్రస్టేలియాలోనే ఆగిపోయారు. నితీశ్ రెడ్డికి చాన్స్! పెర్త్ టెస్టులో భారత జట్టులో మూడో పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఇప్పటి వరకు ప్రసిధ్ కృష్ణ పేరు వినిపించిది. ప్రాక్టీస్ గేమ్‌లోనూ అతను రాణించాడు. అయితే నెట్ సెషన్స్‌లో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న హర్షిత్ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ‘ట్రంప్ కార్డ్’ కాగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్ మధ్య పోటీ నెలకొంది. ప్రసిధ్ ఇప్పటికే భారత్ తరఫున 2 టెస్టులు ఆడగా...హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ గేమ్‌లో తన స్వింగ్ బౌలింగ్‌లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపర్చేందుకు నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఆదివారం టీమ్ ప్రాక్టీస్‌లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన మొహమ్మద్ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని...సిరీస్ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
భారతీయుల చూపు ఆ్రస్టేలియా వైపు!
సాక్షి, హైదరాబాద్: ఖలిస్తానీ వేర్పాటువాదుల కారణంగా ఇటీవల కెనడాతో భారత్ సంబంధాలు దెబ్బతినటంతో ఆ దేశానికి ఉద్యోగాల కోసం, ఉన్నత విద్యకోసం వెళ్లాలని భావించిన భారతీయులు పునరాలోచనలో పడ్డారు. కెనడాలో ఉద్యోగావకాశాలు కూడా తగ్గిపోవటంతో మరో సురక్షితమైన, అపార అవకాశాలు ఉన్న దేశం కోసం చూస్తున్నారు. అలాంటివారికి ఇప్పుడు ఆస్ట్రేలియా అవకాశాల గనిలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ కమిషన్ కమిషనర్ విక్ సింగ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా’లో పాల్గొనేందుకు వచ్చిన సింగ్.. ఆ్రస్టేలియాలో ఇక్కడి విద్యార్థులకు ఉన్న అవకాశాల గురించి ‘సాక్షి’కి వివరించారు. పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వీలు.. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా వీసా జారీ చేస్తున్నామని విక్ సింగ్ చెప్పారు. వేరే దేశాలవారికి రెండున్నరేళ్ల పాటు పనిచేసుకునే వీలు కల్పిస్తుండగా, భారతీయ విద్యార్థులకు అదనంగా మరో ఏడాది పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఇరు దేశాల మధ్య ఎక్టా ద్వైపాక్షిక ఒప్పందం నేపథ్యంలో ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు. చదువుకునే సమయంలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని గుర్తుచేశారు. పర్యాటకులకు కూడా అద్భుతమైన అనుభూతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్నెన్నో అవకాశాలు.. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు తమ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించేందుకు సానుకూలంగా ఉందని విక్ సింగ్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ‘సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, బిజినెస్, హెల్త్ రంగాలతోపాటు క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వినూత్న కోర్సులు చదివేందుకు భారతీయ విద్యార్థులు ఆ్రస్టేలియాకు వస్తుంటారు. మా దేశంలోని 43 యూనివర్సిటీల్లో దాదాపు సగం వరకు వరల్డ్ టాప్ 200 జాబితాలో ఉన్నాయి. టాప్ 100 జాబితాలో 9, టాప్ 20 జాబితాలో మూడు ఆస్ట్రేలియా వర్సిటీలు ఉన్నాయి. నవకల్పనల్లో (ఇన్నోవేషన్) ఆస్ట్రేలియా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మనమంతా వాడుతున్న వైఫైని ఆస్ట్రేలియాలోనే కనిపెట్టారు. ఆస్ట్రేలియా వర్సిటీల్లో చదివిన విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మా దేశంలో స్కూల్ స్థాయి నుంచే ఏఐని వినియోగిస్తున్నాం’అని వివరించారు. -
చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్రపుటల్లకెక్కాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్సీ.. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 10000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మ్యాక్సీకి ముందు ఈ రికార్డు కీరన్ పోలార్డ్ పేరిట ఉండేది. పోలీ 6640 బంతుల్లో 10000 పరుగుల మార్కును క్రాస్ చేయగా.. మ్యాక్సీ కేవలం 6505 బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో మ్యాక్సీ, పోలీ తర్వాత క్రిస్ గేల్ (6705), అలెక్స్ హేల్స్ (6774), జోస్ బట్లర్ (6928) ఉన్నారు.పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10031) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు దక్కుతుంది. గేల్ ఈ ఫార్మాట్లో 10060 బంతులు ఎదుర్కొని 14562 పరుగులు చేశాడు.కాగా, ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య ఇవాళ (నవంబర్ 16) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిడ్నీ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఆడమ్ జంపా రెండు, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐదేసిన స్పెన్సర్ జాన్సన్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. ఇవాళ (నవంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.SPENSER JOHNSON FIVE WICKET HAUL.- A terrific spell against Pakistan! 👌pic.twitter.com/W8J1lMp4Xl— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. జాన్సన్‌కు టీ20 కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. మరో ఎండ్‌లో ఆడమ్ జంపా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో పేసర్ జేవియర్ బార్ట్లెట్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశాడు. బార్ట్లెట్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బాబర్ ఆజమ్ 3, ఫర్హాన్ 5, అఘా సల్మాన్ 0, అబ్బాస్ అఫ్రిది 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 0, సూఫియాన్ ముఖీమ్ 0, హరీస్ రౌఫ్ 2 పరుగులకు ఔటయ్యారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 హోబర్ట్ వేదికగా నవంబర్ 18న జరుగుతుంది. -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఆస్ట్రేలియా
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. రౌఫ్ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో బౌలర్ అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ కీలకమైన మాథ్యూ షార్ట్ వికెట్‌తో పాటు టెయిలెండర్ల వికెట్లు తీశాడు. స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 20, జోస్ ఇంగ్లిస్ 0, మ్యాక్స్‌వెల్ 21, స్టోయినిస్ 14, టిమ్ డేవిడ్ 18, ఆరోన్ హార్డీ 28, జేవియర్ బార్ట్లెట్ 5, స్పెన్సర్ జాన్సన్ 0 పరుగులకు ఔటయ్యారు. నాథన్ ఇల్లిస్ 1, ఆడమ్ జంపా 0 పరుగులతో అజేయంగా నిలిచారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 7 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాక్ 7 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది
పెర్త్: వరుసగా మూడోసారి ఆ్రస్టేలియా గడ్డపై ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని సొంతం చేసుకునే లక్ష్యంతో భారత క్రికెటర్లు తమ సన్నాహాలు మొదలు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వెస్టర్న్ ఆ్రస్టేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో భారత జట్టు సభ్యులంతా ముమ్మర ప్రాక్టీస్ చేశారు. ఆ్రస్టేలియాలో అనధికారిక టెస్టులు ఆడేందుకు వచ్చిన పలువురు భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లు సీనియర్ జట్టు సభ్యులను కలిశారు. ‘కింగ్ కోహ్లి’ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో తలమునకలై చెమటోడ్చాడు. అతనికి, రిషభ్ పంత్‌కు సిరాజ్, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లు సైతం నెట్స్‌లో శ్రమించారు. అయితే భారత కెపె్టన్ రోహిత్ శర్మ టీమిండియాతో ఇంకా కలవలేదు. అతని భార్య ప్రసవ తేది సమీపిస్తుండటంతో శ్రీమతికి తోడుగా ముంబైలో ఉన్నాడు. కాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్... తొలిటెస్టు కల్లా తమ కెపె్టన్ అందుబాటులోకి వస్తాడని చెప్పాడు. ఆసీస్ మీడియా అసత్య ప్రచారం అభిమానులు, ప్రేక్షకులకు దూరంగా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తామని టీమిండియాగానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)గానీ చెప్పలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)ను కోరలేదు. అయినా సరే ఆసీస్ మీడియా పనిగట్టుకొని అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ‘వాకా’ గ్రౌండ్లో గేట్లు మూసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకే భారత ఆటగాళ్లు మొగ్గుచూపారని, అక్కడి భారతీయులకు దూరంగా, వేరెవరిని అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక రాసింది. నిజానికి ‘వాకా’లో నవీకరణ పనులు జరుగుతున్నాయి. ఏడీసీఓ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఈ పనులు చేస్తోంది. ఇది పక్కనబెట్టి సదరు పత్రిక భారత క్రికెటర్లు ‘నో డ్రోన్ ఫ్లయ్ జోన్’ ఏర్పాటు చేసుకున్నారని, సాధారణ ప్రజానీకం, క్రికెట్ అభిమానులెవర్ని అనుమతించడం లేదని, ఫొటోలు, వీడియోలు తీసేందుకు కఠినమైన ఆంక్షలు విధించారని ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.మంగళవారం నుంచి ఆదివారం వరకు భారత జట్టుతో పాటు, అక్కడే ఉన్న భారత్ ‘ఎ’ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాలుపంచుకుంటున్నారు. శుక్రవారం నుంచి సీనియర్ భారత్, ‘ఎ’ జట్ల మధ్య ‘సెంటర్ వికెట్ ట్రెయినింగ్’లో భాగంగా వార్మప్ మ్యాచ్ జరుగనుంది. దీనికి ప్రేక్షకులను అనుమతించాల్సిందిగా భారత జట్టు మేనేజ్మెంట్ కోరింది. -
ఆస్ట్రేలియాలో తటవర్తి గురుకులం అవధానం..
ఆస్ట్రేలియా దేశం నుంచి వికసించిన భాషాకమలం తటవర్తి గురుకులంలో మరో అద్భుతమైన అవధానం జూమ్ మాధ్యమంలో జరిగింది. ఇందులో పలు దేశాల నుంచి తెలుగు పండితులు, భాషాభిమానులు, అవధానులు పాల్గొన్నారు. తటవర్తి గురుకులం వ్యవస్థాపకులు సద్గురువులు, అవధాని తటవర్తి కల్యాణచక్రవర్తి గారు తమ గురుకులం నుంచి పద్య కవులకు అవధానులకు శిక్షణనిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు.తటవర్తి గురుకులం విద్యార్ధి కుమారి అహల్య 13 ఏళ్ళ వయసులోనే తెలుగు సాహితి ప్రక్రియ అయిన అష్టావధానం దిగ్విజయంగా పూర్తి చేసి, చిన్నారి మహిళా అవధానిగా అవతరించారు. గొప్ప కవులకు, పండితులకు సైతం కష్టసాధ్యమైన అష్టావధానం ప్రక్రియలో , 8 మంది ప్రాశ్నికులు / పృచ్చకులు అడిగే ప్రశ్నలకు, అక్కడికక్కడే పద్యాల రూపంలో ఆశువుగా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఇటువంటి విశేషాన్ని చిన్నారి అహల్య 13 ఏళ్ళ వయసులోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇదే గురుకులం నుండి కొన్ని వారాల క్రితం అక్టోబరు 12 విజయదశమి సందర్భంగా మరో చిన్నారి సంకీర్త్ వింజమూరి కూడా అష్టావధానం పూర్తి చేసి, పండితుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నారి సంకీర్త్కి కూడ 13 ఏళ్ళు కావడం గమనార్హం. ఇద్దరు చిన్నారులు ఇంగ్లీషు మీడియంలో 8వ తరగతి చదువుతున్నారు. విదేశాల్లో ఉంటూ తెలుగు మాట్లాడటం, చదవటమే గొప్ప అనుకునే రోజుల్లో, ఆస్ట్రేలియా తెలుగు భాష సేవకోసం గురుకులం స్థాపించి, స్వయానా తాము 120 కి పైగా అష్టావధానాలు చేసిన గురువు గారు కల్యాణ చక్రవర్తి గారు, గోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన వారు. ఈయన వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వివిధ దేశాల్లో విద్యార్థులకు, ఔత్సాహికులకు పద్య రచనలో మెళకువలు నేర్పుతూ, తెలుగు వారికే సొంతమైన పద్య రూపకాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఆయన అవధానార్చన పేరుతో తెలుగు రాష్ట్రాల్లో జీర్ణ స్థితిలో ఉన్న ఆలయాలకు అంకితం ఇస్తూ , అష్టావధానాలు చేస్తున్నారు, అలాగే ఆయా ఆలయాలకు ఆర్థికంగా వీలైనంత సహాయం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 120కి పైగా అష్టావధానాలు పూర్తిచేశారు. ఆస్ట్రేలియాలో ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా అనేక పురాణ ప్రవచనాలు, భాష్యాలు చెప్తూ , తెలుగు సాహిత్యం, భక్తి ఆధ్యాత్మిక రంగాల్లో తటవర్తి గురుకులం, గురువులు తటవర్తి కల్యాణ చక్రవర్తి గారు తమదైన రీతిలో సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు.పద్య రచన, పద్య కల్ప ద్రుమమ్ ( రాసిన ఒక్కో పద్యానికి ఒక్కో చెట్టు నాటడం) అనే కార్యక్రమం, ఆన్లైన్లో అవధాన పరిచయ కోర్సులు నడుపుతూ తెలుగు భాష కు మరింత జీవం పోస్తున్నారు. వీరి గురుకులంలో పద్యాలు వ్రాయడం నేర్చుకున్న కవులు , ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మొదటి తెలుగు పద్య శతకాలు రచించి చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా , యూకే, న్యూజీలాండు, సింగపూరు, దుబాయ్ ఇలా అనేక దేశాల నుంచి తొలి పద్య శతకాలు వీరి గురుకులం కవుల నుంచి వెలువడ్డాయి. (చదవండి: లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ 5కే వాక్‌థాన్‌కు మంచి స్పందన) -
చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ తరఫున కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు తాకలేకపోయారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్ ఆసీస్ టాప్ స్కోరర్‌గా జోస్ ఇంగ్లిస్ నిలిచాడు. ఇంగ్లిస్ తొలి వన్డేలో 49 పరుగులు చేశాడు. ఇదే ఈ సిరీస్ మొత్తానికి ఆసీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్.పాక్‌తో సిరీస్‌లో బ్యాటర్ల చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆసీస్ 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 22 ఏళ్లలో సొంతగడ్డపై పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం ఆసీస్‌కు ఇదే మొదటిసారి. ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి వన్డేలో గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో గెలిచింది.ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..జోస్ ఇంగ్లిస్- 49 (తొలి వన్డే)స్టీవ్ స్మిత్- 44 (తొలి వన్డే)స్టీవ్ స్మిత్- 35 (రెండో వన్డే)పాట్ కమిన్స్- 32 (తొలి వన్డే)సీన్ అబాట్- 30 (మూడో వన్డే)