suryakumar yadav
-
సూర్యకుమార్ యాదవ్‌లా సూపర్ షాట్ ఆడిన లబూషేన్.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25లో భాగంగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ స్కై ట్రేడ్‌మార్క్ 360 డిగ్రీస్ స్కూప్ షాట్ ఆడాడు. లబూషేన్ ఈ షాట్‌ను అచ్చుగుద్దినట్లు సూర్యకుమార్ యాదవ్‌లా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.😱 MARNUS 😱That's some shot at The Gabba! #BBL14 pic.twitter.com/VTTdEULcEy— KFC Big Bash League (@BBL) January 16, 2025ఎప్పుడూ క్లాసీ షాట్లు ఆడే లబూషేన్ విన్నూత్నమైన షాట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లబూషేన్ 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో లబూషేన్‌కు ఇదే అత్యధిక స్కోర్.లబూషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మ్యాట్ రెన్షా (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అల్సోప్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. నాథన్ మెక్‌స్వీని (1), మ్యాక్స్ బ్రయాంట్ (4) విఫలమయ్యారు.లబూషేన్ ధాటికి హరికేన్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా రిలే మెరిడిత్‌కు లబూషేన్ చుక్కలు చూపించాడు. లబూషేన్ స్కై తరహా సూపర్ సిక్సర్‌ను మెరిడిత్ బౌలింగ్‌లోనే బాదాడు. మెరిడిత్ తన కోటా నాలుగు ఓవర్లలో వికెట్లు ఏమీ తీసుకోకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. హరికేన్స్ కెప్టెన్ నాథన్ ఇల్లిస్ మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ.. 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. మార్కస్ బీన్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ పడగొట్టారు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ ధాటికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆ జట్టు 8.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. ఓవెన్ 20 బంతుల్లో బౌండరీ, అర డజను సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కాలెబ్ జువెల్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. కాలెబ్ 24 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. చార్లీ వకీం డకౌట్ కాగా.. కాలెబ్‌కు జతగా నిఖిల్ చౌదరీ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ నెగ్గాలంటే 70 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లుఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.డెడ్‌లైన్ ఆరోజేగ్రూపు-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండబోతుఉన్నాడు.వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్‌మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్‌లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్‌పై కూడా మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.సూర్య, సంజూలకు నో ఛాన్స్అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్‌కప్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు. వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ -
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
గోవాలో భార్యతో టీమిండియా కెప్టెన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నా పార్ట్నర్ సూపర్: భార్య దేవిశాతో సూర్యకుమార్(ఫొటోలు)
-
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ) తొలి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టాడు. కర్ణాటక బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకం బాదాడు. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై భారీ స్కోరు సాధించింది.కాగా వీహెచ్‌టీ 2024-25 ఎడిషన్ రౌండ్ వన్‌లో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై కర్ణాటకతో తమ తొలి మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి గ్రౌండ్ ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆయుశ్, హార్దిక్ హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ(6) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే(78)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ హార్దిక్ తామోర్(84) ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయ్యర్ విశ్వరూపంఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే 114 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 207కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ధనాధన్ దంచికొట్టాడు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో దూబే 63 పరుగులు చేసి.. అయ్యర్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.టీ20 తరహాలో వీరబాదుడుకాగా వన్డేలో టీ20 తరహాలో వీరబాదుడు బాదిన ఈ ఇద్దరి కారణంగా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ముంబై 382 పరుగులు సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు.మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్న ‘స్కై’ 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు.ముంబై వర్సెస్ కర్ణాటక తుదిజట్లుకర్ణాటకమయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అనీష్ కేవీ, నికిన్ జోస్, స్మరన్ రవిచంద్రన్, అభినవ్ మనోహర్, కృష్ణన్ శ్రీజిత్(వికెట్ కీపర్), శ్రేయస్ గోపాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, ప్రవీణ్ దూబే, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్.ముంబైఅంగ్క్రిష్ రఘువంశీ, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, ఎం.జునేద్ ఖాన్, తనూష్ కొటియన్.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
టీ20 ఫార్మాట్లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సారథిగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఈ ముంబై బ్యాటర్.. దేశీ టీ20 టోర్నీలోనూ ట్రోఫీ గెలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు ఆదివారం మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతోటోర్నీ ఆసాంతం రాణించిన శ్రేయస్ సేన టైటిల్ పోరులో మధ్యప్రదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చిన ముంబై.. ఆఖరి మెట్టుపై కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మధ్యప్రదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) కారణంగా మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే, పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు.ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. 174 పరుగులతో స్కోరు సమమయ్యాక ముంబై బ్యాటర్ అథర్వ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (37; 4 ఫోర్లు) రాణించాడు.చివర్లో సూర్యాంశ్ షెగ్డే (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అథర్వ అంకొలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యాంశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబై సొంతమైంది.ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన తొలి సారథిగాఈ నేపథ్యంలో భారత్‌లో ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందుకోవడం విశేషం. కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అయ్యర్‌ను ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు గాయం తగ్గినప్పటికీ.. దానిని సాకుగా చూపాడని తేలడంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. కానీ.. టీ20 జట్టులో మాత్రం అతడికి స్థానం ఇవ్వడం లేదు.టీమిండియా తరఫున గతేడాది డిసెంబరులో చివరగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, తాజాగా దేశీ టీ20 టోర్నీలోనూ సత్తా చాటి.. టీమిండియా సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్ పంపించాడు.వచ్చే ఏడాది పంజాబ్ జట్టుకుఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయగా.. పంజాబ్ కింగ్స్ వేలంపాటలో అతడిని కొనుక్కుంది. ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రూ. 27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్) అయ్యర్ కంటే ముందున్నాడు.చదవండి: ‘రోహిత్, గంభీర్ మధ్య విభేదాలు?.. ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు.. కానీ’ -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు)
-
రఫ్పాడించిన రహానే.. విధ్వంసకర సెంచరీ మిస్.. అయితేనేం..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.శతకానికి రెండు పరుగుల దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్‌కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.రాణించిన శివాలిక్ శర్మబరోడా ఇన్నింగ్స్‌లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్‌రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టిన రహానేఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టాడు.కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్‌లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది. సూర్య విఫలంమిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
అందమైన వధువుగా నువ్వు.. నాకెంతో సంతోషం: సోదరి పెళ్లి... టీమిండియా కెప్టెన్ భావోద్వేగం(ఫొటోలు)
-
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్‌తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్‌తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్‌లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్‌లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్‌బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్‌పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్‌గా 46 రన్స్‌తో 187కు పైగా స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్‌లో మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తిలక్... ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు. తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్‌లో తిలక్‌ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు. -
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్‌లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
టీమిండియాతో సిరీస్.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
టీ20 సిరీస్‌లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్ జట్టు తహతహలాడుతున్నాయి.మొదటి రెండు టీ20లలో అలాఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్‌లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్ గిబ్స్ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్, జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.3-1తో ప్రొటిస్ జట్టుదే సిరీస్ఆ రెండు మ్యాచ్‌లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటిస్ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్ గిబ్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్బూమ్తో వ్యాఖ్యలు చేశాడు.మిగిలిన రెండు టీ20లలోకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకునిఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్ గిబ్స్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డాన్ వాన్ బంగ్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.ఇక గిబ్స్ తర్వాత వన్డేల్లో జస్కరన్ మల్హోత్రా (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్‌లో మళ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ(2021లో) బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు.సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టుసంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్‌కుమార్ వైశాఖ్, రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్.సౌతాఫ్రికా జట్టురియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్నీల్ బార్ట్‌మన్, లుథో సిపామ్లా.చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్! -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
మరో విజయం లక్ష్యంగా...
జిఖెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్): టి20 క్రికెట్లో జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఇక్కడా విజయం సాధిస్తే 2–0తో ముందంజ వేస్తుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సమరంలో ఆపై సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం ఉండదు. మరో వైపు స్వదేశంలో కూడా ప్రభావం చూపలేక సమష్టి వైఫల్యంతో చిత్తయిన దక్షిణాఫ్రికాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ అవకాశాలు కాపాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక్కడి పిచ్‌పై చక్కటి బౌన్స్ ఉండటంతో అటు బ్యాటింగ్‌కు, ఇటు పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాబట్టి ఆసక్తికర పోరు జరగవచ్చు. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం తక్కువ. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ సారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు (12 మ్యాచ్‌లు)నే సమం చేస్తుంది. అందరూ చెలరేగితే... తొలి టి20లో భారత్ బ్యాటింగ్ పదునేమిటో కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కాస్త తడబాటుకు గురైనా స్కోరు 200 దాటడం విశేషం. సంజు సామ్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటం సానుకూలాశం కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న అతనికి ఇది చివరి అవకాశం కావచ్చు. సూర్యకుమార్ ఎప్పటిలాగే తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. తిలక్ వర్మ కూడా తొలి పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. చివరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో పాండ్యా, రింకూ సింగ్ తొందరగానే అవుటైనా వారు తమ స్థాయికి తగినట్లు ఆడితే భారత్‌కు తిరుగుండదు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటం జట్టు బ్యాటింగ్ లోతును చూపిస్తోంది. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్‌ను అర్థం చేసుకోవడంతో సఫారీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పేసర్ అర్‡్షదీప్ కూడా సత్తా చాటుతుండగా...పునరాగమనంలో అవేశ్ ఆకట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఉన్న జట్టు మరోసారి చెలరేగితే వరుసగా రెండో విజయం జట్టు ఖాతాలో చేరడం ఖాయం. గెలిపించేది ఎవరు... సొంతగడ్డపై ఇటీవలే విండీస్ చేతిలో 0–3తో టి20 సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫార్మాట్లో ఇంకా తడబడుతూనే ఉంది. తొలి పోరులో బౌలర్ల వైఫల్యంతో ముందుగా భారీగా పరుగులిచ్చుకున్న జట్టు...ఆ తర్వాత బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శన కూడా చూపించలేదు. మార్క్రమ్ మళ్లీ విఫలం కాగా...రికెల్టన్, స్టబ్స్ కూడా నిలబడలేకపోయారు. క్లాసెన్, మిల్లర్ జోడీపై జట్టు అతిగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది. వీరిద్దరు వెనుదిరిగితే చాలు ప్రత్యర్థి చేతికి మ్యాచ్ అప్పగించినట్లే కనిపిస్తోంది. పేరుకే ఆల్‌రౌండర్ అయినా మార్కో జాన్సెన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కొయెట్జీతో పాటు ఇతర బౌలర్లు కూడా రాణిస్తేనే భారత్‌ను సఫారీలు నిలువరించగలరు. పీటర్, సిమ్‌లేన్ గత మ్యాచ్‌లో విఫలమైనా... మరో మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ కూడా రాణించాల్సి ఉంది. -
ఊచకోత..; ఒక్కసారి అతడు హిట్టింగ్ మొదలుపెడితే ఆపలేం: మార్క్రమ్
యాభై బంతుల్లో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు.. మొత్తంగా 107 పరుగులు.. టీమిండియా స్టార్, ఓపెనర్ సంజూ శాంసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికా బౌలింగ్‌ను ఒక రకంగా ఊచకోత కోశాడు. ప్రొటిస్ బౌలర్లపై అటాక్ చేస్తూ పరుగుల విధ్వంసంతో 214కు పైగా స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. ఆద్యంతం అద్భుతమైన షాట్లతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేదుసంజూ జోరుకు కళ్లెం వేయడానికి సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అతడే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత మార్క్రమ్ మాట్లాడుతూ... సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు.అసాధారణ ఇన్నింగ్స్.. అతడిని ఆపలేకపోయాం‘‘ఈ మ్యాచ్‌లో సంజూ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అతడిని అవుట్ చేయడానికి మేము చాలానే ప్లాన్స్ వేశాం. ఎప్పటికప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లాం. ఒక్కసారి అతడు అలా క్రీజులో కుదురుకుని హిట్టింగ్ మొదలు పెట్టాక.. అతడిని ఆపడం కుదిరేపని కాదు.అదొక్కటే మాకు సానుకూలాంశంఅతడి ముందు ఒక రకంగా తలొగ్గడం తప్ప ఏమీ చేయలేకపోయాం. అయితే, డెత్ ఓవర్లలో మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఆట తీరు మాకు ఈ మ్యాచ్‌లో సానుకూలాంశం’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లో పొరపాట్లను సరి చేసుకుని మెరుగైన ఆట తీరుతో ముందుకు వస్తామని తెలిపాడు.Sanju Chetta is on fire! 🔥💥Watch the 1st #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#TeamIndia #JioCinemaSports #SanjuSamson pic.twitter.com/kTeX4Wf6AQ— JioCinema (@JioCinema) November 8, 2024 కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్య సేన శుక్రవారం మార్క్రమ్ బృందంతో తొలి మ్యాచ్‌లో తలపడింది. తిలక్ సైతండర్బన్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజూ అద్భుత శతకం, తిలక్ వర్మ(18 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్ల విజృంభణలక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 61 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయి(3/28) చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ ఒకటి, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ ఎనిమిది పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
'చాలా సంతోషంగా ఉంది.. ఈ క్షణం కోసమే పదేళ్లుగా ఎదురుచూస్తున్నా'
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో తనకు వచ్చిన అవకాశాలను శాంసన్ రెండు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.గత నెలలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై శివతాండవం చేసిన సంజూ.. ఇప్పుడు సఫారీ గడ్డపై బీబత్సం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. కేవలం 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ఈ కేరళ స్టార్ నిలిచాడు. ఇక తన అద్బుత ఇన్నింగ్స్‌పై సంజూ శాంసన్ స్పందించాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఆధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో సంజూ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు."నేను ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఈ క్షణం కోసమే గత 10 ఏళ్ల నుంచి వేచి ఉన్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు.నా కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్లకు దక్కింది. కానీ నేను గాల్లో తేలిపోవాలనుకోవటం లేదు. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని" అని భారత్ ఇన్నింగ్స్ అనంతరం సంజూ పేర్కొన్నాడు."ఈ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌ను నేను అస్వాదించాను. నా ఫామ్‌ను పూర్తిగా వినిగియోగించుకున్నాను. మేము దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నాము. మూడు నాలుగు బంతులు ఆడిన తర్వాత కచ్చితంగా బౌండరీ కోసం ప్రయత్నించాల్సిందే. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శాంసన్ చెప్పుకొచ్చాడు.చదవండి: IND-A vs AUS-A: తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి -
#INDvsSA : తొలి టి20లో భారత్ ఘన విజయం...సెంచరీతో చెలరేగిన సామ్సన్ (ఫొటోలు)
-
అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య
యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత్- ప్రొటిస్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా.. పరాభవాల నుంచి కోలుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రశ్న ఎదురైంది. అతడిని సౌతాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని విలేఖరులు అడుగగా.. ‘‘రుతు అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు.అతడి కంటే ముందు చాలా మందే ఉన్నారుఇక అతడి కంటే ముందు చాలా మంది ఆటగాళ్లు కూడా ఇలాగే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆడించాలో మేనేజ్మెంట్కు బాగా తెలుసు. యాజమాన్యం నిర్ణయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. రుతు ఇంకా యువకుడే. అతడికీ ఏదో ఒక రోజు టైమ్ వస్తుంది’’ అని సూర్య కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చాడు.కొత్త జోడీకాగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే, టీ20 ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ స్థానమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా టీ20లలో యశస్వి జైస్వాల్- శుబ్‌మన్ గిల్ జోడీ ఓపెనర్లుగా పాతుకుపోగా.. వారి గైర్హాజరీలో కొత్తగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీని బీసీసీఐ పరిశీలిస్తోంది.కెప్టెన్‌గా అవకాశాలుఅయితే, సౌతాఫ్రికాతో సిరీస్ కంటే ముందే భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ రుతు చివరగా జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 సిరీస్ ఆడాడు. ఆ టూర్లో 158కి పైగా స్ట్రైక్‌రేటుతో 133 పరుగులు సాధించాడు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్ గడ్డపై విఫలంఅంతేకాదు.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న రుతు.. అక్కడ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో 0, 5 పరుగులు చేసిన రుతు.. రెండో టెస్టులో 4, 11 రన్స్ చేశాడు. ఇక తొలి టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్-ఎ.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'