
టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ.. దేశవాళీ క్రికెట్‌లో తమ సొంత జట్టును వీడేందుకు సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, జైస్వాల్ (Yashasvi Jaiswal) ముంబై జట్టును వీడి.. గోవాకు ఆడటం అధికారికంగా ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు ధ్రువీకరించాయని జాతీయ మీడియా పేర్కొంది.
ఖండించిన ఎంసీఏ
మరోవైపు.. జైస్వాల్ బాటలో సూర్య కూడా టీమ్ మారుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, సూర్యకుమార్ (Suryakuar Yadav) విషయంలో వస్తున్న వదంతులను ఎంసీఏ ఖండించింది.‘సూర్యకుమార్ యాదవ్ గురించి మీడియాలో వస్తున్న వదంతుల గురించి మాకు సమాచారం ఉంది. అయితే ఈ విషయంపై మేం ఇప్పటికే సూర్యతో మాట్లాడాం. అతను తాను ముంబైకే ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు.
ఆ వార్తలన్నీ నిరాధారం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించకుండా ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని అందరినీ కోరుతున్నాం’ అని ఎంసీఏ కార్యదర్శి అభయ్ హడప్ పేర్కొన్నారు. సూర్య కూడా సోషల్ మీడియా ద్వారా నేరుగా ఈ వార్తలను కొట్టిపారేశాడు. ‘ఈ వార్త రాసింది జర్నలిస్టా, స్క్రిప్ట్ రైటరా. కామెడీ సినిమాలు చూడటం మానేసి ఈ కథనాలు చదువుకుంటే చాలు. అర్థంపర్థం లేని విషయమిది’ అని సూర్య వ్యాఖ్యానించాడు.
HCA స్పందన ఇదే
మరోవైపు.. జైస్వాల్‌కు సంబంధించిన కథనంలో మరో భారత ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) కూడా హైదరాబాద్‌ను వీడి గోవాకు ఆడబోతున్నట్లుగా వచ్చింది. ఈ విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్పష్టతనిచ్చింది. తిలక్ వర్మతో వ్యక్తిగతంగా మాట్లాడానని, అతడు హైదరాబాద్‌కే ఆడతానని చెప్పినట్లు హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. దేవరాజ్ తెలిపారు.
ఇదీ చదవండి: రబడ ఇంటి బాట
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐపీఎల్ నుంచి స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సఫారీ పేసర్... వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిన్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ గురువారం వెల్లడించింది. తాజా సీజన్‌లో గుజరాత్ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడగా... అందులో రెండింట్లో బరిలోకి దిగిన రబడ 2 వికెట్లు పడగొట్టాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు.
‘ముఖ్యమైన వ్యక్తిగత కారణాలతో రబడ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు’ అని గుజరాత్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. అతడు తిరిగి వస్తాడా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. రబడ సేవలు దూరమైనా... మహ్మ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ రూపంలో గుజరాత్ టైటాన్స్‌కు నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకే చెందిన గెరాల్డ్ కోట్జీ, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్‌లో ఒకరిని విదేశీ పేసర్ కోటాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా అరుదైన రికార్డు