Hyderabad Cricket Association
-
CT 2025: టీమిండియా మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్‌గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశం హెచ్‌సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్‌రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.ఈ మేరకు మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్ -
ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్‌రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్‌రైజర్స్‌కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్‌లు, లిఫ్ట్‌లు, లాంజ్‌లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
HCA: ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు ఇస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్‌గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్‌లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్‌తో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్‌లో లీగ్ దశలో ఐదు మ్యాచ్‌ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్‌తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్‌కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్లో ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయాయి. 2022–23 సీజన్లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది. వచ్చే సీజన్లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు... ‘ప్లేట్’ డివిజన్లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్లో 56 వికెట్లతో టాపర్‌గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్‌ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు. దీంతో పాటు వచ్చే సీజన్లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు. -
HCA: అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా?
సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర సీనియర్ మహిళల క్రికెట్ జట్టు కోచ్... టీమ్‌తో పాటు మ్యాచ్ కోసం బస్సులో ప్రయాణిస్తున్నారు... ఎంతో బాధ్యతగా, హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి కట్టు తప్పారు. బస్సులోనే మద్యం బాటిల్ తీసి దర్జాగా సేవించారు. ఆపై ముందు సీట్లో దానిని పెట్టుకొని అదే కొనసాగించారు! ఈ వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ మహిళల టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న విద్యుత్ జైసింహ చేసిన నిర్వాకమిది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెంటనే స్పందించింది. జైసింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ వేటు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో పాటు విచారణ ముగిసే వరకు హైదరాబాద్ క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ఈ ఘటన ఎప్పటిదనే విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. బస్సులోకి ఆల్కహాల్‌ను ఎవరు తీసుకొచ్చారు, ఎలా అనుమతించారనే దానిపై కూడా విచారణ చేస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రకటించారు. అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా? పాతతరం క్రికెట్ దిగ్గజం ఎంఎల్ జైసింహ కుమారుడైన విద్యుత్ గతంలో హెచ్‌సీఏలో వేర్వేరు బాధ్యతల్లో పని చేశారు. తండ్రి పేరుతోనే సికింద్రాబాద్‌లో చాలా ఏళ్లుగా ఒక ప్రైవేట్ క్రికెట్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను విద్యుత్ జైసింహ ఖండించారు. తానెప్పుడూ టీమ్ బస్సులోకి మద్యాన్ని తీసుకురాలేదని, తాగలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు నిరాధారమని... ఒక హైదరాబాద్ మాజీ క్రికెటర్ కుమార్తెను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జైసింహ వివరణ ఇచ్చారు. జై సింహా ప్రవర్తన గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు అప్పట్లోనే లేఖ కోచ్ జై సింహా తాగుడుకు బానిసగా మారారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. తమ ముందు మద్యం తాగొద్దని పలుసార్లు వారించినా వినలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే టీం నుంచి తీసేస్తానని బెదిరించారన్నారు. ఈ క్రమంలో.. మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గత జనవరిలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు జనవరిలో లేఖ కూడా రాశారు. -
HCA: మహిళా క్రికెట్ హెడ్‌కోచ్‌పై వేటు
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్‌లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్‌సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
ఉప్పల్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్.. వారికి ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు జగన్మోహన రావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో జగన్మోహన రావు మాట్లాడుతూ.. మేము ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 5 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం. అయితే మ్యాచ్ కి ముందే స్కూల్ నుంచి లెటర్ హెచ్‌సీఏకు పంపించాల్సి ఉంటుంది. హెచ్‌సీఏకు పాఠశాల నుంచి లెటర్ అందితే టిక్కెట్లను నేరుగా వారివద్దకే పంపిస్తాం. ఒక స్కూల్ కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తాం. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ గా ఫుడ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లకు ఫ్రీ ఎంట్రీ.. అదే విధంగా ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని జగన్మోహన రావు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని ఆయన చెప్చుకొచ్చారు. కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 26వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి జింఖానా మైదానంలో ఫిజికల్ టిక్కెట్లను హెసీఏ విక్రయించనుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!? -
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
హెచ్‌సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్‌లో పేర్కొంది. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్ -
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
హెచ్‌సీఏ వివాదాన్ని పరిష్కరించండి.. హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు, విశాఖ ఇండస్ట్రీస్‌కు మధ్య నెలకొన్న వివాదాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా వాణిజ్యకోర్టును హైకోర్టు ఆదేశించింది. అక్కడే సమస్యపై తుది పరిష్కారానికి రావాలని ఇరు పార్టీలకు సూచించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. -
అజారుద్దీన్‌కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్‌రావు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై ఒక్క ఓట్ తేడాతో జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. అమర్నాథ్కు 62 ఓట్లు పడగా.. జగన్ మోహన్‌రావు 63 ఓట్లు సొంతం చేసుకున్నారు. అదే విధంగా హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) గెలుపొందారు. కాగా మొత్తం 6 పదవుల కోసం బరిలో 24 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. మాజీ క్రికెటర్లు వీవియస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్,స్రవంతి సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా హెచ్‌సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు. -
HCA: ప్రశాంతంగా ముగిసిన హెచ్‌సీఏ ఎన్నికల పోలింగ్.. గెలిచేదెవరో?
ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అనేక వివాదాల అనంతరం.. హెచ్‌సీఏ పీఠం ఎవరు దక్కించుకోనున్నారన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కాగా ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటిగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల అధికారి తొలుత ప్రెసిడెంట్ స్థానానికి ఎన్నికైన అభ్యర్థి పేరునే ప్రకటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హెచ్‌సీఏ అధ్యక్ష రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హెచ్‌సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు. బరిలో ఉన్న ప్యానెల్, అభ్యర్థులు వీరే.. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ: ఎ.జగన్మోహన్ రావు, పి.శ్రీధర్, ఆర్.హరినారాయణ రావు, నోయల్ డేవిడ్, సీజే శ్రీనివాస్, అన్సర్ అహ్మద్ ఖాన్. క్రికెట్ ఫస్ట్: అమర్నాథ్, జి.శ్రీనివాస రావు, ఆర్.దేవరాజ్, సి.సంజీవ్ రెడ్డి, చిట్టి శ్రీధర్, సునీల్ కుమార్. ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెచ్‌సీఏ: పీఎల్ శ్రీనివాస్, సి. బాబూరావు, ఆర్ఎం భాస్కర్, రోహిత్ అగర్వాల్, జెరార్డ్ కార్, డీఏజే వాల్టర్. గుడ్ గవర్నెన్స్: కె. అనిల్‌కుమార్, దల్జీత్ సింగ్, వి.ఆగమరావు, బసవరాజు, పి.మహేంద్ర, వినోద్ ఇంగ్లే. -
అజారుద్దీన్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్‌సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! ఇక మర్చిపోవాల్సిందే!
HCA Elections- Setback for Azhar: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి హెచ్‌సీఏలో చక్రం తిప్పాలనుకున్న అజారుద్దీన్ ఆశలకు గండిపడింది. కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది. సుప్రీంకు చేరిన పంచాయితీ 2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. అందుకే అనర్హత వేటు ఇదిలా ఉంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏకసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంను ఆశ్రయించగా అతడికి నిరాశే ఎదురైంది. ఈసారికి మర్చిపోవాల్సిందే ఈ విషయంపై స్పందించిన అజారుద్దీన్ సన్నిహిత వర్గాలు.. ‘‘ఒకవేళ అక్టోబరు 31 తర్వాత ఓటర్ల లిస్టులో అజర్ పేరును చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినా ఉపయోగం ఉండదు. అయితే, అతడికి వ్యతిరేకంగా కొందరు పన్నిన కుట్రను బయటపెట్టేందుకు... అజారుద్దీన్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అతడికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయం బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాయి. చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మోగిన ఎన్నికల నగారా
-
టీమిండియా మాజీ కెప్టెన్‌కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (అక్టోబర్) 20వ తేదీన ఎన్నికలు నిర్వహరణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోజే ఫలితాలు ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబరు 14న నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మోగిన ఎన్నికల నగారా కాగా వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా మహ్మద్ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెచ్‌సీఏ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయండి.. హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆరువారాల్లో రూ.17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర, చరాస్తులపై థర్డ్ పారీ్టకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్‌సీఏకు సూచించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ అడ్మినిస్టేటర్, జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన ఆ అటాచ్మెంట్లు రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ.శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్‌సీఏ తరఫున సీనియర్ న్యాయవాది రాజాశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ వేరొక చోట ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిందన్నారు. దాని ఫలితంగా అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున సీనియర్ న్యాయవాది సునీల్ వాదనలు వినిపిస్తూ.. 2016లో మధ్యవర్తిత్వ తీర్మానం ఆమోదించగా, ఏడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని.. విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించకుండా ఉండేందుకు హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విశాఖ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పులో భాగంగా హెచ్‌సీఏ రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
ప్రపంచకప్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ కె. దుర్గాప్రసాద్ వరల్డ్ కప్‌కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు. ‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్‌లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ లైట్లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్ చెప్పారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉన్నాయి. -
CWC 2023: పాకిస్తాన్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఈనెల 29న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్‌ను వాయిదా వేయాలని వారు హెచ్‌సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్‌ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్‌కప్ టికెటింగ్ పార్డ్నర్ బుక్ మై షోకు సూచించింది. కాగా, వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్‌లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ డే అండ్ మ్యాచ్‌లుగా సాగనున్నాయి. సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు) ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) అక్టోబర్ 2: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) అక్టోబర్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి) ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) -
బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్‌కప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) బీసీసీఐను అభ్యర్దించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్ధన మెరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్ల విక్రయాలకు కూడా బీసీసీఐ సిద్దమైంది. అంంతలోనే హెచ్‌సీఏ.. భారత క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. కాగా వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే(ఆక్టోబర్) 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్‌లకు భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సిఎకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులల అభ్యర్దను పరిగణలోకి తీసుకున్న హెచ్సిఏ.. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసింది. కాగా వాస్తవానికి పాక్-శ్రీలంక మ్యాచ్ ఆక్టోబర్ 12 హైదారాబాద్గా జరగాల్సింది. కానీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో ఆ మ్యాచ్ రెండు రోజులు ముందు వచ్చింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్‌పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి చదవండి: ODI WC 2023: సంజూ శాంసన్ కాదు.. వన్డే ప్రపంచకప్‌లో భారత వికెట్ కీపర్ అతడే! -
హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడింది. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా పని చేసిన వీరవల్లి సుందరం (వీఎస్) సంపత్ హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) లావు నాగేశ్వరరావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ మొత్తం వీఎస్ సంపత్ నేతృత్వంలోనే జరుగుతుంది.