హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన హెచ్‌సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్‌లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్‌లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు. అయితే మన రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రికెటర్లను హెచ్‌సీఏ వెనక్కి పంపించింది.
ఈ నేపథ్యంలో పద్దతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించలేదని అక్కడికి వచ్చిన యువ క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాదు ఒక యువ క్రికెటర్ దగ్గర హెచ్‌సీఏ డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. వన్‌డౌన్ ప్లేయర్‌గా అవకాశం ఇస్తామంటూ యువ క్రికెటర్ దగ్గర రూ. లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాధితుడు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది.
కాగా హెచ్‌సీఏ తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హెచ్ సీయూ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదు. ఈ సెలక్షన్ ఒక్కో జిల్లాకు ఒకరోజు ఇస్తే క్రికెటర్లు ఆ రోజు వచ్చేవారు. కానీ అందరూ ఒకటే రోజు రావడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన పిల్లలు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు'' అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు!
ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు! ఇక్కడికొచ్చాక..
Comments
Please login to add a commentAdd a comment