Under-19 Cricket team
-
టీమిండియాతో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. స్టార్ క్రికెటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ మరుఫ్ మృధా ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లను మరుఫ్ మృధా అసభ్యపదజాలంతో దూషించాడు. అయితే ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు అతడిని ఐసీసీ మందలించింది. ఐసీసీ ఆర్టికల్ 2.5 ప్రకారం.. బ్యాటర్ ఔటైనప్పుడు సదరు క్రికెటర్‌ను అవమానపరిచడం గానీ, అసభ్యపదజాలాన్ని ఊపయెగించకూడదు. ఈ నేపథ్యంలోనే మరుఫ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అఫ్గాన్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. ఫైనల్లో టీమిండియాతో ఢీ
ప్రోటీస్ గడ్డపై అఫ్గానిస్తాన్- భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న అండర్-19 ట్రై సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. ప్రోటీస్ బౌలర్ల దాటికి 139 పరుగులుకు కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా 5 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. మోకోనా 3 వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బౌలర్లలో నుమాన్ షా(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో స్టీవ్ స్టోల్క్(40), వైట్‌హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా- భారత జట్లు తలపడనున్నాయి. -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ బౌలర్ ఓవరాక్షన్! వీడియో వైరల్
వరల్డ్‌క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో అండర్-19 ఆసియాకప్-2023లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ జీషన్ ఓవరాక్షన్ చేశాడు. ఏం జరిగిదంటే? భారత్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన జీషన్ బౌలింగ్లోమొదటి బంతిని భారత బ్యాటర్ రుద్ర పటేల్ మిడాన్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వేళ్లాడు. కీలక వికెట్ తీయడంతో పాక్ పేసర్ గాల్లోకి ఎగురుతూ సంబరాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో అతడి సెలబ్రేషన్స్ శృతిమించాయి. బ్యాటర్ దగ్గర వెళ్లి తన వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ జీషన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు మరి అంత ఓవరాక్షన్ పనికిరాదుంటా కామెంట్లు చేస్తున్నారు. Peak rivalry 🔥 Second wicket down for India🔥 #PAKvINDpic.twitter.com/cpfRi7xURd — Hassan Nawaz (@iam_hassan56) December 10, 2023 -
హెచ్‌సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన హెచ్‌సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్‌లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్‌లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు. అయితే మన రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రికెటర్లను హెచ్‌సీఏ వెనక్కి పంపించింది. ఈ నేపథ్యంలో పద్దతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించలేదని అక్కడికి వచ్చిన యువ క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాదు ఒక యువ క్రికెటర్ దగ్గర హెచ్‌సీఏ డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. వన్‌డౌన్ ప్లేయర్‌గా అవకాశం ఇస్తామంటూ యువ క్రికెటర్ దగ్గర రూ. లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాధితుడు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. కాగా హెచ్‌సీఏ తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హెచ్ సీయూ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదు. ఈ సెలక్షన్ ఒక్కో జిల్లాకు ఒకరోజు ఇస్తే క్రికెటర్లు ఆ రోజు వచ్చేవారు. కానీ అందరూ ఒకటే రోజు రావడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన పిల్లలు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు'' అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు! ఇక్కడికొచ్చాక.. -
భారత బౌలర్లు అదుర్స్.. సౌతాఫ్రికా 54 పరుగులకే ఆలౌట్! సిరీస్ మనదే
TeamIndia Win Final T20I Against South Africa Women- కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్‌లో భారత అండర్–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4–0తో దక్కించుకుంది. ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ అమ్మాయి యషశ్రీ 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.. మిగతా వాళ్లలో.. ఫలక్ నాజ్, సోనమ్ యాదవ్, పార్షవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం భారత్ 9.2 ఓవర్లలో 3 వికెట్లకు 55 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ షఫాలీ వర్మ (22; 3 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష (10 నాటౌట్; 1 ఫోర్) రాణించారు. చదవండి: 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ‘మట్టి కుస్తీ’ సవాల్.. ‘హింద్ కేసరి’ విశేషాలు.. పూర్తి వివరాలు Sara Khadem: ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం.. చెస్ ప్లేయర్‌కు బెదిరింపు -
భారత యువ ఆటగాడికి బంపర్ ఆఫర్.. ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున..!
భారత అండర్-19 స్పిన్నర్ కౌశల్ తాంబేకు బంపర్ ఆఫర్ తగిలింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెట్ బౌలర్‌గా తాంబే ఎంపికయ్యాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొన్న తాంబేను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోయినా.. ఐపీఎల్లో భాగమయ్యే ఛాన్స్‌ను తాంబే కొట్టేశాడు. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో తాంబే అద్భుతంగా రాణించాడు. కాగా అతడు సహచర ఆటగాళ్లు యష్ ధుల్, విక్కీ ఓస్ట్వాల్ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక తాంబే.. డేవిడ్ వార్నర్, పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్ అజిత్ అజిత్ అగార్కర్ వంటి దిగ్గజాల ముందు తన బౌలింగ్ స్కిల్స్‌ను తాంబే ప్రదర్శించనున్నాడు. ఇక మార్చి 26 నుంచి వాంఖడే వేదికగా ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. విలియమ్సన్ ఇక..! Training at the DC camp = High intensity 🔥 Can’t wait to see them ROAR in #IPL2022 🤩💙#YehHaiNayiDilli @TajMahalMumbai pic.twitter.com/67R1r8DVaZ — Delhi Capitals (@DelhiCapitals) March 17, 2022 -
షేక్ రషీద్‌కు రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం
సాక్షి, అమరావతి: భారత క్రికెట్ అండర్ –19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను వైఎస్ జగన్ అభినందిస్తూ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం కేటాయింపుతో పాటు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ రషీద్ గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ల రషీద్.. అంతర్జాతీయ క్రికెట్లో చక్కగా రాణిస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలో, అండర్ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు. కాగా, రషీద్ సీఎంను కలిసిన సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు ఉన్నారు. -
టీమిండియా కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే!
టీమిండియా అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ ఐపీఎల్లో అరంగట్రేం చేయనున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో యష్ ధుల్‌ను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతడి కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకి ఢిల్లీ యష్ ధుల్‌ను కైవసం చేసుకుంది. ఇక అండర్-19 ప్రపంచ కప్‌ను యష్ ధుల్ అందించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో యష్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు. అదే విధంగా యష్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధర దక్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. డేవిడ్ మలన్,మార్నస్ లబుషేన్, ఇయాన్ మోర్గాన్,సౌరభ్ తివారి,ఆరోన్ ఫించ్ వంటి స్టార్ ఆటగాళ్లు రెండో రోజు వేలంలో అమ్ముడు పోలేదు. చదవండి: IPL 2022 Auction: చేతన్ సకారియాకి బంపర్ ఆఫర్.. అప్పుడు 1.2 కోట్లు.. ఇప్పడు ఏకంగా..! -
ఢిల్లీ జట్టుకు ఆడనున్న యష్ ధుల్!
అండర్-19 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్ యష్ ధుల్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ఆడనున్నాడు. మరో వైపు ఇషాంత్ శర్మ ఢిల్లీ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇషాంత్ శర్మ తన నిర్ణయాన్ని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీకి తెలియజేశాడు. ఇక యష్ ధుల్ ఫిబ్రవరి 10న గౌహతికి చేరుకుంటాడు. అక్కడ 5 రోజుల క్వారంటైన్లో యష్ ఉండనున్నాడు. యష్ ధుల్ తో సహా జట్టు మొత్తం అహ్మదాబాద్‌లో ఉన్నారు. భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేను వీక్షించారు. అదే విధంగా ప్రపంచకప్ గెలిచిన అండర్-19 జట్టును బీసీసీఐ సత్కరించింది. ఇక రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ప్రదీప్ సాంగ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. "అతడి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. చాలా రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడకపోయినా, అతడు ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాని" డీడీసీఏ సెలెక్టర్ పేర్కొన్నాడు. జట్టు: ప్రదీప్ సాంగ్వాన్, నితీష్ రాణా, ధృవ్ షోరే, ప్రియాంష్ ఆర్య, యశ్ ధుల్, క్షితిజ్ శర్మ, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, లలిత్ యాదవ్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), లక్షయ్ థరేజా, నవదీప్ సైనీ, సిమర్జిత్ సింగ్, మయాంక్ యాదవ్, కె. మిశ్రా, శివంగ్ వశిస్ట్, శివం శర్మ చదవండి: 'కోహ్లి నుంచి తొలి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల' -
అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్
అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో రానున్న ఐపీఎల్-2022 మెగా వేలంలో యువ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వాఖ్యలు చేశాడు. వేలంలో భారత అండర్-19 పేస్ బౌలర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ కోసం చాలా జట్లు పోటీపడతాయి అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. హంగర్గేకర్ ఇన్స్వింగర్స్ను బాగా బౌలింగ్ చేయగలడని అశ్విన్ కొనియాడాడు. "అతడు ఇన్స్వింగర్స్ను బాగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుత భారత ఆర్మ్ పేసర్లలో ఇషాంత్ శర్మకు మాత్రమే ఉంది. ఇన్‌స్వింగర్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇన్‌స్వింగర్స్ బౌలింగ్ చేసే అతడికి వేలంలో కచ్చితంగా డిమాండ్ ఉంటుందని నేను భావిస్తున్నాను" అని యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా హంగర్గేకర్ బ్యాట్‌తోను, బాల్‌తోను రాణించగలడు. అండర్-19 ఆసియా కప్‌ని భారత్ కైవసం చేసుకోవడంలో హంగర్గేకర్ కీలకపాత్ర పోషించాడు. చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ మంచి మనసు.. యంగ్ బౌలర్‌కి ఆర్థిక సాయం! -
బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. ప్రతీకారం తీర్చుకుంటుందా?
వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న అండర్–19 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో యువ భారత్ జట్టు తలపడనుంది. కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, సిద్ధార్థ్æ, ఆరాధ్య యాదవ్, మానవ్ కోలుకోవడంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అయితే తాత్కాలిక కెప్టెన్ నిశాంత్‌కు కరోనా సోకడంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు -
మూడు మ్యాచ్‌లు.. 228 పరుగులు.. అతడు వేలంలోకి వస్తే జట్లు పోటీ పడాల్సిందే!
ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా మెగావేలం జరగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రానున్న మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తలు మొదలపెట్టాయి. ఈ క్రమంలో అండర్-19 ప్రపంచ కప్‌లో అదరగొడుతున్న భారత యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువన్షీ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రఘువన్షీ 228 పరుగులు చేశాడు. దీంట్లో ఒక అర్ధసెంచరీతో పాటు, సెంచరీ కూడా ఉంది. అదే విధంగా అండర్-19 ఆసియా కప్‌లో కూడా రఘువన్షీ అధ్బుతంగా రాణించాడు. దీంతో అతడితో పాటు ఆల్‌రౌండర్ రాజ్ బావాను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజ్ బావా బ్యాట్‌తోను, బాల్‌తోను ఈ మెగా టోర్నమెంట్లో రాణిస్తున్నాడు. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రాజ్ బావా 162 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. చదవండి: SA vs IND 3rd ODI: 'కెప్టెన్‌గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు' -
క్రికెట్ జట్టు: సచిన్ కొడుకుకు పిలుపు!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను భారత అండర్-19 క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరగనున్న అండర్-19 సిరీస్‌లో అర్జున్ టెండూల్కర్ భారత జట్టు తరఫున ఆడనున్నాడు. జూలైలో శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్-19 జట్టు రెండు ఫోర్ డే మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది. 18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఫోర్డే మ్యాచుల్లో భారత జట్టుకు అతను ప్రధాన ఆటగాడు కానున్నాడు. అయితే, ఐదు వన్డే మ్యాచులకు ప్రకటించిన జట్టులో మాత్రం అతన్ని తీసుకోలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉనాలోని జోనల్ క్రికెట్ అకాడమీ (జెడ్‌సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని ప్రధాన అండర్-19 ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇండియా అండర్-19 క్రికెట్ టీం సభ్యులు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్, ఐఏఎస్ అధికారి చిత్రా రామచంద్రన్‌లు కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.