అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ మరుఫ్ మృధా ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లను మరుఫ్ మృధా అసభ్యపదజాలంతో దూషించాడు. అయితే ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు అతడిని ఐసీసీ మందలించింది.
ఐసీసీ ఆర్టికల్ 2.5 ప్రకారం.. బ్యాటర్ ఔటైనప్పుడు సదరు క్రికెటర్‌ను అవమానపరిచడం గానీ, అసభ్యపదజాలాన్ని ఊపయెగించకూడదు. ఈ నేపథ్యంలోనే మరుఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది.
24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment