
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీని రద్దు చేసే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఐసీసీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గోనేందుకు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌తో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.
దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం ఐసీసీకి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నవంబర్ 11న లహోర్‌లో జరగాల్సిన ఓ మేజర్ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. ఈ ఈవెంట్‌లో టోర్నీలో పాల్గోనే జట్ల జాతీయ జెండాలతో పాటు షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయాలని భావించింది. కానీ రద్దు చేయ
కాగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వంద రోజుల కౌంట్‌డౌన్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఐసీసీ అధికారి ఒకరూ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు.
"ఈ టోర్నీలో పాల్గోనే జట్లతో పాటు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌తో కూడా చర్చలు జరుపుతున్నాము. షెడ్యూల్ ఖారారైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాము. ట్రోఫీ టూర్ ఫ్లాగ్, ట్రోఫీని లాంఛ్ చేసేందుకు లహోర్‌లో ఓ ఈవెంట్ నిర్వహించాలని భావించాము. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
చదవండి: PAK vs AUS: నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment