టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో కాస్త ఆసౌక్యరంగా కన్పించిన బుమ్రాను వెంటనే స్కానింగ్ తరలించారు.
కానీ ఇప్పటివరకు బుమ్రా గాయం ఏ దశలో ఉందన్నది బీసీసీఐ గానీ టీమ్‌మెనెజ్‌మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ జస్ప్రీత్ గాయం కాస్త తీవ్రమైనదిగానే అన్పిస్తోంది. అతడి గాయం అంత సీరియస్ కాకపోతే అతడు కచ్చితంగా కీలకమైన సిడ్నీ టెస్టులో బౌలింగ్ చేసేవాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం..!
కాగా జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా నుంచి గురువారం భారత్‌కు చేరుకోనున్నాడు. స్వదేశానికి వచ్చాక గతం(2022)లో న్యూజిలాండ్‌లో తనకి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్టార్ పేసర్ ఏన్సీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నట్లు వినికిడి.
కాగా బుమ్రా గాయం గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అతడు నాలుగు నుంచి ఐదు వారాల ఆటకు దూరం కాక తప్పదు. ఆ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాలంటే ఏన్సీఎ వైద్య బృందం క్లియరెన్స్ కచ్చితంగా కావాలి.
ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంటుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఒకవేళ గ్రూపు స్టేజి మ్యాచ్‌లకు బుమ్రా దూరమైతే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే బీసీసీఐ ఇంకా బుమ్రా గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్‌పేసర్ మహ్మద్ షమీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
షమీ ప్రస్తుతం విజయ్‌హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. షమీ గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ఇంగ్లండ్‌తో జరిగే వన్డేల్లో ఆడనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
ఆసీస్ గడ్డపై అదుర్స్..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌ను భారత్ కోల్పోయినప్పటికీ తన ప్రదర్శనతో ప్రత్యర్ధిని సైతం ఆకట్టుకున్నాడు. మొత్తం 5 మ్యాచ్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.
చదవండి: అశ్విన్ రిటైర్మెంట్‌కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment