బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదికగా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్రమే భాగమయ్యాడు. ఆ మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్(మూడో టెస్టు)కు తుది జట్టు నుంచి అతడిని టీమ్‌మెనెజ్‌మెంట్ తప్పించింది.
ఆ మ్యాచ్ తర్వాతే అశ్విన్ ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కకపోవడంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
"టీమిండియా సరైన గేమ్ ప్లాన్‌తో ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. వారు తమ మొదటి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేదని అప్పుడే ఆర్ధమైంది. అయితే అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.
తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కపోవడంతో అతడు నిరాశచెందినట్లు ఉన్నాడు. బహుశా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లు అన్పిస్తోంది. వరల్డ్ క్రికెట్‌లో అశ్విన్ నంబర్ 1 స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఎవరూ కూడా బెంచ్‌కే పరిమితం కావాలనుకోరు. కచ్చితంగా అతడు నిరాశకు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మధ్యలోనే తన కెరీర్‌ను ముగించాడని" హాడిన్ విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా అశ్విన్ రిటైర్మెంట్‌పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
టెస్టు క్రికెట్‌లో అశ్విన్ మార్క్..
అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడనున్నాడు.
చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే..
Comments
Please login to add a commentAdd a comment