Brad Haddin
-
అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదికగా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్రమే భాగమయ్యాడు. ఆ మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్(మూడో టెస్టు)కు తుది జట్టు నుంచి అతడిని టీమ్‌మెనెజ్‌మెంట్ తప్పించింది.ఆ మ్యాచ్ తర్వాతే అశ్విన్ ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కకపోవడంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు."టీమిండియా సరైన గేమ్ ప్లాన్‌తో ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. వారు తమ మొదటి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేదని అప్పుడే ఆర్ధమైంది. అయితే అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కపోవడంతో అతడు నిరాశచెందినట్లు ఉన్నాడు. బహుశా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లు అన్పిస్తోంది. వరల్డ్ క్రికెట్లో అశ్విన్ నంబర్ 1 స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఎవరూ కూడా బెంచ్‌కే పరిమితం కావాలనుకోరు. కచ్చితంగా అతడు నిరాశకు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మధ్యలోనే తన కెరీర్‌ను ముగించాడని" హాడిన్ విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా అశ్విన్ రిటైర్మెంట్పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.టెస్టు క్రికెట్లో అశ్విన్ మార్క్..అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడనున్నాడు.చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ను తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ నియమించింది. కాగా గత నెలలో ట్రెవర్ బేలిస్‌ను జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా పంజాబ్ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పడు బేలిస్‌తో కలిసి హాడిన్ పనిచేయనున్నాడు. కాగా గతంలో వీరిద్దరూ కలిసి ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాప్‌గా పనిచేశారు. "హాడిన్‌ను పంజాబ్ కింగ్స్ తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేసింది. త్వరలోనే మిగిలిన సహాయక సిబ్బందిని నియమిస్తుంది" ఐపీఎల్ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇక హాడిన్ ఆస్ట్రేలియా తరపున 66 టెస్టులు, 126 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ నిరాశపరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. చదవండి: T20 WC NAM VS UAE: కంటతడి పెట్టిన డేవిడ్ వీస్.. అద్భుత పోరాటం అంటూ నెటిజన్ల కితాబు -
Ind Vs Sl: పంత్ ఖాతాలో అరుదైన రికార్డు.. ధోని, గిల్‌క్రిస్ట్‌లను ‘దాటేశాడు’!
Rishabh Pant Stats: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆడేది టెస్టు మ్యాచ్ అని నాకు తెలుసు కానీ నా బ్యాట్‌కు తెలియదన్నట్లుగా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బోర్ అనే మ్యాచ్‌కు బోలెడంత జోష్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో అందివ్వగల సమర్థుడు పంత్. భారత బ్యాటర్ హనుమ విహారి అవుటైన 34 ఓవర్లో క్రీజులోకి వచ్చిన పంత్ ఐదో బంతిని డీప్‌మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా తరలించాడు. మరుసటి ఓవర్ వేసిన ధనంజయ డిసిల్వాకు వరుస 4, 6లతో తన ధాటిని చూపించాడు. తర్వాత ఓవర్లోనే విరాట్ కోహ్లి అవుటైనా పంత్ జోరు మాత్రం తగ్గలేదు. లంక స్పిన్ బౌలింగ్ కొనసాగించినంత సేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మెరిపించాడు. పది ఓవర్లయినా క్రీజులో నిలువని రిషభ్ కేవలం 28 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీ కొట్టి మరీ ఫిఫ్టీ పూర్తి చేయడం విశేషం. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మాత్రమే కాదు. ఇది కూడా! ఈ క్రమంలో పంత్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) రికార్డును బద్దలుకొట్టాడు. సిక్సర్ల వీరుడు! అంతేగాకుండా.. టెస్టుల్లో ఆడిన 50 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(42) బాదిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు (51 ఇన్నింగ్స్)తో కలిపి మొత్తంగా 44 సిక్సర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో పంత్ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని(31 సిక్సర్లు), ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్(31), ఆడం గిల్‌క్రిస్ట్(30), ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్(21) ఉన్నారు. కాగా ధోని తన టెస్టు కెరీర్లో భాగంగా 90 టెస్టుల్లో 78 సిక్సర్లు కొట్టాడు. యువ సంచలనం పంత్ మాత్రం 30 మ్యాచ్‌లలోనే 44 సిక్స్‌లు బాదడం గమనార్హం. ఇక మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్ల జాబితాలో గిల్‌క్రిస్ట్ 100 మాక్సిమమ్స్తో టాప్‌లో ఉన్నాడు. ధోని 79, బ్రాడ్ హాడిన్ 54 సిక్స్‌లు కొట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో మ్యాచ్‌లో 42వ ఓవర్ ఆఖరి బంతికి జయవిక్రమ రిటర్న్ క్యాచ్‌తో పంత్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. చదవండి: IPL 2022- Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా -
"ఇంగ్లండ్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. రూట్ వద్దే వద్దు"
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. ఇక సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్( బ్యాక్సింగ్ డే టెస్ట్) డిసెంబర్26న మెల్బోర్న్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో అయిన గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఆదే విధంగా మరోసారి ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటకీ, సారథిగా జట్టును నడిపించలేక పోతున్నాడాని తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో జో రూట్‌పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కీలక వాఖ్యలు చేశాడు. రూట్ టెస్టు కెప్టెన్‌గా పనికిరాడని, అతడి స్ధానంలో బెన్ స్టోక్స్‌కు అవకాశం ఇవ్వాలి అని అతడు అభిప్రాయపడ్డాడు. "రెండో టెస్ట్ నాలుగో రోజు జో రూట్ గైర్హాజరీ నేపథ్యంలో బెన్ స్టోక్స్ బాధ్యతలు స్వీకరించాడు. అతడు ఆ సమయంలో ఫీల్డ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అతడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఫీల్డ్ విధానం కూడా చాలా బాగుంది. కేవలం 20 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ బౌలర్లు నాలుగు వికెట్లు పడగొట్టారు. స్టోక్స్ తన కెప్టెన్సీతో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టాడు. నా దృష్టిలో రూట్ కంటే స్టోక్స్ అత్యత్తుమ కెప్టెన్" అని హాడిన్ పేర్కొన్నాడు. డే-నైట్ టెస్ట్‌లో ఘోర పరాజయం తర్వాత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని రూట్ చేసిన వాఖ్యలపై హాడిన్ మండిపడ్డాడు. "అతడు కోచ్‌తో పాటు సెలక్షన్ కమిటీలో పాల్గొన్నాడు. అనంతరం సరైన జట్టును ఎంపిక చేశామని రూట్, కోచ్ ప్రకటించారు. ఇప్పుడు ఇలా బౌలర్లను నిందించడం సరికాదు" అని హాడిన్ పేర్కొన్నాడు. చదవండి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌పై వేటు.. -
అరుదైన రికార్డును సమం చేసిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్..
లీడ్స్: టీమిండియాతో జరగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఓ ఇన్నింగ్స్ తొలి ఐదు వికెట్లలో భాగస్వామి(క్యాచ్ లేదా స్టంపింగ్) అయిన రెండో వికెట్‌కీపర్‌గా ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ బ్రాడ్ హడిన్ సరసన నిలిచాడు. హడిన్ 2014-15 గబ్బా టెస్ట్‌లో టీమిండియాపై ఈ ఘనత సాధించాడు. ఈ టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 58 పరగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ పేసర్లు ఆండర్సన్(3), ఒలీ రాబిన్సన్(2) నిప్పులు చెరిగే బంతులతో భారత టాపార్డర్‌ను కుప్పకూల్చారు. వీరిద్దరు పడగొట్టిన 5 వికెట్లలో బట్లర్ కీలకపాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, పంత్‌ల క్యాచ్‌లను అందుకుని టీమిండియా పతనానికి పరోక్ష కారకుడిగా నిలిచాడు. కాగా, కడపటి వార్తలు అందేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేరుకోలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, ఓవర్టన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, రాబిన్సన్, సామ్ కర్రన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్(19), రహానే(18) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. -
IPL 2021: కెప్టెన్సీ చేజారినా.. వార్నర్ మాత్రం..
సిడ్నీ: క్లిష్ట పరిస్థితుల్లోనూ డేవిడ్ వార్నర్ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. తనపై వేటు పడినా జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 సీజన్లో ఎస్ఆర్హెచ్ వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం... ఈ సీజన్లో హైదరాబాద్ చివరగా ఆడిన మ్యాచ్‌లో తుదిజట్టులో కూడా అతడికి స్థానం కల్పించలేదు. దీంతో, బెంచ్‌కే పరిమితమైన వార్నర్.. 12వ ఆటగాడిగా డ్రింక్స్ మోయడానికే పరిమితమయ్యాడు. ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఈ విషయం అస్సలు మింగుడుపడలేదు. జట్టుకు తొలి ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన కెప్టెన్‌కు ఇంతటి అవమానమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వార్నర్ మాత్రం ఈ విషయంపై ఒక్కసారి కూడా కామెంట్ చేయలేదు. అంతేకాదు డగౌట్లో కూర్చుని జట్టును ఉత్సాహపరుస్తూ తన అవసరం ఉన్నప్పుడల్లా సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ.. ‘‘వార్నర్‌ను తొలగించడం పట్ల ప్రతి ఒక్కరు షాక్‌కు గురయ్యారు. కానీ తను మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించాడు. నిజానికి వరుస ఓటముల నేపథ్యంలో జట్టులో మార్పులు చేయాలని భావించింది. ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడటం లేదని కఠిన చర్యలు చేపట్టింది. ఈ విషయాలను డేవీ అర్థం చేసుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో తను ఒకడు. బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చినా తనేమీ బాధపడలేదు. ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చాడు. డ్రింక్స్ మోసుకుంటూ పరుగులు తీశాడు. జట్టు సమావేశాల్లో కూడా తన గొంతు బలంగా వినిపించేవాడు. కఠిన పరిస్థితులను అతడు డీల్ చేసిన విధానం అమోఘం’’ అంటూ వార్నర్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించాడు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్-2021 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఆరింటిలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. చదవండి: BAN Vs SL: శ్రీలంక కొత్త కెప్టెన్‌గా కుశాల్ పెరీరా -
సన్‌రైజర్స్‌కు డబుల్ ధమాకా.. జట్టులో చేరిన స్టార్ ఆటగాళ్లు
చెన్నై: ఐపీఎల్ 2021 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌లు శుక్రవారం చెన్నైలో ల్యాండయ్యారు. వీరితోపాటు ఆ జట్టు సహాయ కోచ్ బ్రాడ్ హడిన్ కూడా చెన్నైకు వచ్చాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. "ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి.. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బ్రాడ్ హడిన్‌లకు స్వాగతం" అంటూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. 🚨The eagles have landed🚨 We repeat, the eagles have landed! Welcoming skipper @davidwarner31, Kane and Brad Haddin to Chennai. Let’s go Risers! #OrangeOrNothing #ReturnOfTheRisers #OrangeArmy pic.twitter.com/jgclaoQLLB — SunRisers Hyderabad (@SunRisers) April 2, 2021 ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ జట్టు తమ తొలి ఐదు మ్యాచ్‌లను చెన్నైలోనే ఆడనుంది. ఈ నెల 11న తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల అనంతరం హైదరాబాద్ జట్టు.. ఢిల్లీలో నాలుగు మ్యాచ్‌లు, ఆతరువాత కోల్‌కతాలో మూడు, బెంగళూరులో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, కొద్ది రోజుల కిందటే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో సన్‌రైజర్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: ప్రముఖ మోడల్‌తో పంత్ డేటింగ్.. పాత గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్..? -
ఓడిపోతామనే నాల్గోటెస్టు ఆడమంటున్నారా?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. జనవరి 7వ తేదీన సిడ్నీలో మూడో టెస్టు ఆరంభం కానుండగా, అటు తర్వాత జనవరి 15వ తేదీ నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్టు జరుగనుంది. అయితే ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించే ఆంక్షలతో టీమిండియా నాల్గో టెస్టు ఆడలేమని అంటోంది. క్వీన్‌లాండ్స్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో మ్యాచ్‌ను ఇక్కడే నిర్వహించినా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని సీఏ చూస్తోంది. అయితే దీనికి టీమిండియా ససేమేరా అంటోంది. ఒక్క మ్యాచ్ కోసం కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం లేదని, మూడో టెస్టు జరిగే సిడ్నీలోనే నాల్గో టెస్టు కూడా నిర్వహిస్తే బాగుంటుందని సూత్రప్రాయంగా సూచించింది. అయితే దీనికి ఆసీస్ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా నాల్గోటెస్టును వాకౌట్ చేస్తామని హెచ్చరించింది. కఠినమైన ఆంక్షలు విధిస్తే ఆ టెస్టు ఆడబోమనే సంకేతాలు పంపింది. (రోహిత్ బీఫ్ ఆర్డర్ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్!) దీనిపై ఆసీస్ మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో ఎలాగూ గెలవలేమనే సాకుతోనే వాకౌట్ చేస్తామంటున్నారా అంటూ టీమిండియాపై ఆరోపణలు చేశాడు. ఫాక్స్ క్రికెట్‌తో హాడిన్ మాట్లాడుతూ.. ‘ ఒక క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియానికి భారత్ ఎందుకు వెళ్లాలని అనుకుంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియానే ఫేవరెట్. ఆ విషయం టీమిండియాకు తెలుసు. ఇక్కడ సుదీర్ఘ కాలంగా ఆసీస్‌దే పైచేయి. వేరే జట్టులు ఇక్కడ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. టీమిండియా క్రికెటర్లు ఎప్పట్నుఉంచో బయో బబుల్ నిబంధనల్ని పాటిస్తూ వస్తున్నారు. అటువంటప్పుడు చివరి టెస్టుకు నిబంధనలు పాటిస్తే తప్పేముంది. ఇది నాకు తెలిసినంతవరకూ ఒక సాకు మాత్రమే’ అంటూ హాడిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
సన్‌రైజర్స్ చెంతకు మరో ఆసీస్ మాజీ క్రికెటర్
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. తమ బలాబలాలను పరీక్షించుకుంటూనే, గత సీజన్లో జరిగిన పొరపాట్లపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లు, కోచింగ్ బృందంలో మార్పులు చేపట్టాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందంజలో ఉంది. గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌కు సేవలందిస్తున్న టామ్ మూడీపై వేటు వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ చిరకాల కోరికను అందించిన ట్రేవర్ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమించించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ను సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు సన్‌రైజర్స్ యాజమాన్యం ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌కు స్వాగతం’అంటూ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది. ఇక ప్రధాన కోచ్ ట్రేవర్ బేలిస్ కూడా ఆసీస్‌కు చెందిన వాడే కావడం విశేషం. ఇక వచ్చే సీజన్‌కు సన్‌రైజర్స్‌కు సంబంధించిన పూర్తి సహాయక సిబ్బంది వివరాలను కూడా తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మురళీథరన్‌లు మెంటార్లుగా వ్యవహరిస్తారని తెలిపింది. ఇక 2015 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో హాడిన్ సభ్యుడు. యాషెస్- 2015 అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హాడిన్ 2016లో పలు సిరీస్‌లకు ఆసీస్-ఏ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఆసీస్ తరుపున 66 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 3,266 పరుగులు చేయగా.. 126 వన్డేల్లో 3,122 పరుగులు సాధించాడు. We welcome Brad Haddin as the Assistant Coach of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/XqEn8Y10LX — SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 Mentors, Coaches and Support Staff of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/r7E0Rvm83x — SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 -
ఫీల్డింగ్ కోచ్ గా హాడిన్
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ ను ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ గా ఎంపికచేశారు. గతంలో ఆసీస్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా సేవలందించిన హాడిన్ కు ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు అప్పచెబుతూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ గ్రెగ్ బ్లెవెట్ స్థానంలో హాడిన్ ను ఫీల్డింగ్ కోచ్ గా నియమించారు. 2019 వరకూ హాడిన్ ఫీల్డింగ్ కోచ్ గా కొనసాగనున్నారు. ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు హాడిన్ కోచ్ గా పనిచేశారు. మరొకవైపు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీపీఎల్) లో ఇస్లామాబాద్ ప్రాంఛైజీకి కోచ్ గా హాడిన్ సేవలందించారు. ఆసీస్ తరపున 66 టెస్టులకు ప్రాతినిథ్య వహించిన హాడిన్ 262 క్యాచ్ లు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో 126 వన్డేలు, 34 అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్ లను హాడిన్ ఆడాడు. 2015లో తన అంతర్జాతీయ క్రికెట్ కు హాడిన్ గుడ్ బై చెప్పాడు. -
ధోనిని అనుకరించాడు!
-
ధోనిని అనుకరించాడు!
న్యూఢిల్లీ:గతేడాది అక్టోబర్‌లో మహేంద్ర సింగ్ ధోని చేసిన రనౌట్ మ్యాజిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ లో రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో ఆ దేశ స్టార్ ఆటగాడు రాస్ టేలర్‌ను ధోని చేసిన రనౌట్ మ్యాచ్‌కే హైలెట్ అయ్యింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ధోని.. వికెట్ల వైపు చూడకుండానే బంతిని విసిరి టేలర్‌ను అవుట్ చేశాడు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా ఆడిన టేలర్ వేగంగా సింగిల్ పూర్తి చేసుకొని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో ధావల్ విసిరిన త్రో కోసం ధోని ముందుకు దూసుకొచ్చాడు. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ. ఆ బంతి వికెట్లకు తగలడం టేలర్ రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. అయితే అదే తరహా అవుట్ కోసం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ తాజాగా యత్నించినా సక్సెస్ అయితే కాలేదు. పురుషుల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని రనౌట్ చేయడానికి ధోని తరహాలోనే హాడిన్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి వికెట్లను తగిలే సరికి బ్యాట్స్ మన్ క్రీజ్‌లోకి వచ్చేశాడు. దీనిపై బీబీఎల్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. వికెట్ల వెనుక నుంచి గతంలో ఎంఎస్ ధోని చేసిన మ్యాజిక్‌ను హాడిన్ టచ్ చేసే యత్నం చేశాడని బీబీఎల్ తన ట్వీట్లో పేర్కొంది. -
అంతర్జాతీయ క్రికెట్‌కు హాడిన్ గుడ్‌బై
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రపంచకప్ విజయంతో వన్డేలకు వీడ్కోలు పలికిన హాడిన్... తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెరీర్లో 67 టెస్టులు ఆడిన హాడిన్ బిగ్‌బాష్ టి20లో మాత్రం సిడ్నీ సిక్సర్ తరఫున ఆడతాడు. ఈ యాషెస్ ముగిసిన తర్వాత రిటైరైన నాలుగో ఆసీస్ క్రికెటర్ హాడిన్. -
టి20 మాత్రమే ఆడతా: హాడిన్
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ కాలం జట్టును అంటిపెట్టుకుని ఉన్న 37 ఏళ్ల హాడిన్ టెస్టు క్రికెట్ నుంచి వైదొలగుతున్న్టట్టు బుధవారం ప్రకటించాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున టి20లు మాత్రమే ఆడతానని వెల్లడించాడు. గత మే నెలలోనే వన్డే క్రికెట్ కు అతడు గుడ్ బై చెప్పాడు. 'లార్డ్స్ నుంచి తిరిగివచ్చాక రియల్ లైజ్ అయ్యాను. బ్యాట్స్ మన్ గా పరుగులు చేయడం నా బాధ్యత. కానీ యాషెన్ సిరీస్ లో విఫలమయ్యాను. ఫలితంగా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా' అని హాడిన్ తెలిపాడు. 66 టెస్టులు ఆడిన హాడిన్ కు గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత 30 ఏళ్ల వయసులో తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. టెస్టుల్లో అతడు 270 వికెట్లు పడగొట్టాడు. 32.98 సగటుతో 3266 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు,18 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
'ఆ పేలుడు పరికరంతో హడిన్ కు సంబంధం లేదు'
సిడ్నీ:ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఇంటి ఆవరణలో దొరికిన పేలుడు పరికరంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. హడిన్ ఇంటి సమీపంలో శుక్రవారం పేలుడు పదార్థ పరికరం లభించడంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడు పరికరంతో హడిన్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. పేలుడు పదార్థాలతో హడిన్ కు కానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలినట్లు రైడ్ లోకల్ ఏరియా కమాండ్ సూపరిండెంట్ జోన్ డంకన్ శనివారం పేర్కొన్నారు. కాగా, అనుమానాస్పద పేలుడు పరికరంపై ఎవరికైనా సమాచారం తెలిస్తే తమను సంప్రదించాల్సిందిగా స్థానికులకు విజ్ఞప్తి చేశారు. -
వన్డేలకు హాడిన్ వీడ్కోలు
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ విజయానంతరం గత మార్చిలోనే తాను ఇక వన్డేలు ఆడలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 126 వన్డేలు ఆడిన హాడిన్ 3,122 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 170 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు చేశాడు. ‘నా వన్డే కెరీర్ అద్భుతంగా సాగింది. ఆసీస్ తరఫున మూడు ప్రపంచకప్‌ల్లో పాలుపంచుకున్నాను. ఇక ముగింపునకు ఇదే సరైన సమయంగా భావించాను’ అని 37 ఏళ్ల హాడిన్ తెలిపాడు. అయితే టెస్టు ఫార్మాట్లో కొనసాగుతున్న హాడిన్ నేడు (సోమవారం) వెస్టిండీస్, ఇంగ్లండ్‌లతో టెస్టు సిరీస్ కోసం జట్టుతో పాటు వెళ్లనున్నాడు. -
వన్డే క్రికెట్‌కు హాడిన్ వీడ్కోలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం 37 ఏళ్ల హాడిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 126 వన్డేలు ఆడిన తను 3,122 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. కీపర్‌గా 170 క్యాచ్‌లు అందుకోగా 11 స్టంపింగ్స్ చేశాడు. క్లార్క్ కూడా ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. బట్టలిప్పేసిన ఫాల్క్‌నర్: ఐదోసారి ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఆదివారం రాత్రి ఫైనల్ ముగిశాక పార్టీలో రెచ్చిపోయారు. తెల్లవారుజాము వరకు జరిగిన ఈ సంబరంలో పేసర్ ఫాల్క్‌నర్ ఓ అడుగు ముందుకేసి నగ్నంగా చిందులేశాడట. ఈ విషయాన్ని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాడిన్ బయటపెట్టాడు. -
భారత్‌ను తక్కువ అంచనా వేయం: హాడిన్
మెల్బోర్న్: వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్‌ను తక్కువ అంచనా వేయడం లేదని... రాబోయే మ్యాచ్‌ల్లో భారత్ జట్టు మరింత దూకుడుగా ఆడుతుందని ఆస్ట్రేలియా వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ‘ఇప్పటికే టీమిండియా సత్తా ఏంటో చూపింది. ఇక నుంచి మరింత దూకుడును చూపిస్తుంది. కాబట్టి మా మిడిల్, లోయర్ ఆర్డర్ బాగా రాణించాల్సిన అవసరం ఉంది. జాన్సన్ మరోసారి తన పవర్‌ను చూపించాలి’ అని హాడిన్ పేర్కొన్నాడు. గాబాలోని ప్రాక్టీస్ పిచ్‌పై భారత జట్టు ఫిర్యాదు చేయడాన్ని వికెట్ కీపర్ విమర్శించాడు. పిచ్‌లలో ఏం లోపం ఉందో చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ‘మ్యాచ్ తర్వాత అదే వికెట్‌పై భారత్ ప్రాక్టీస్ చేసింది. తర్వాత మా బౌలర్లు కూడా దానిపైనే ప్రాక్టీస్ చేశారు. అప్పుడు లేని లోపం మ్యాచ్ తర్వాత ఏం కనబడిందో’ అని హాడిన్ తెలిపాడు. స్మిత్ కెప్టెన్సీకి మద్దతిచ్చిన హాడిన్... సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారన్నాడు. ప్రస్తుతం స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్నాడు. ఈ సిరీస్‌లో తాను పరుగులు చేయలేకపోవడంపై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్ లయోన్‌పై ప్రశంసలు కురిపించాడు. -
ఇక ఆటపై దృష్టి: హాడిన్
వరుసగా రెండో రోజు ఆసీస్ జట్టు ప్రాక్టీస్ జట్టుతో కలిసిన క్లార్క్ అడిలైడ్: గత రెండు వారాలుగా భావోద్వేగ పరిస్థితుల తర్వాత మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఎక్కువగా ఆలోచించి సమస్యలను జటిలం చేసుకోదల్చుకోలేదన్నాడు. వరుసగా రెండో రోజు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఆసీస్ జట్టు నెట్స్‌లో బౌన్సర్లు వేయడం కాస్త తగ్గించింది. ‘ఇప్పుడే మళ్లీ క్రికెట్లోకి వచ్చాం. ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లందరూ కోరుకున్నారు. రాబోయే రెండు రోజులు బాగా శ్రమిస్తాం. ఆదివారం మాకు అత్యంత కీలకమైన రోజు’ అని హాడిన్ పేర్కొన్నాడు. శుక్రవారం సిడ్నీలో ఉన్న కెప్టెన్ క్లార్క్... శనివారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే అతని ఫిట్‌నెస్‌పై మాత్రం సందేహాలు వీడటం లేదు. మరోవైపు తొలి టెస్టుకు తాను సారథ్యం వహించడంపై ఆలోచించడం లేదని హాడిన్ వెల్లడించాడు. ‘మధ్యాహ్నం క్లార్క్ ప్రాక్టీస్‌కు వచ్చాడు. సెషన్లో బాగా ఆడాడు. కాబట్టి నాకు కెప్టెన్సీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. సుదీర్ఘకాలంగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన కెప్టెన్ కూడా. తొలి టెస్టులో తొలి గంట క్లార్క్ కెప్టెన్‌గా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టు అడిలైడ్‌లో ఆడటంపై మాట్లాడుతూ... ‘వేదిక మారినప్పుడు ప్రణాళికలు కూడా మారుతాయి. ఈ పిచ్ కూడా బాగుంది. వేదిక గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా భావన. పరిస్థితులు ఎలా ఉన్నా ఆడటం మన బాధ్యత కాబట్టి. దాన్ని సమర్థంగా నిర్వహించాలి. మా తరహా క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. బౌన్సర్లు వేయాలా? వద్దా? అనేది క్లిష్టమైన అంశం. అయితే మాపై ఒత్తిడి ఉన్నా ప్రణాళిలకను మాత్రం అమలు చేస్తాం. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను చూపిస్తాం’ అని వైస్ కెప్టెన్ వివరించాడు. క్లార్క్‌కు మినహాయింపు తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడే అంశంలో క్లార్క్‌కు మినహాయింపు ఇచ్చారు. హ్యూస్ మృతితో కాస్త ఒత్తిడిలో ఉన్న అతను తొలి టెస్టులో ఆడతాడో లేదోనన్న సందిగ్ధం కూడా నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టెస్టుకు ముందు రోజు కెప్టెన్లు మీడియాతో మాట్లాడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం క్లార్క్‌కు బదులుగా పేసర్ జాన్సన్ మాట్లాడతాడు. ఆసీస్ జట్టు జెర్సీపై ‘408’ ఇటీవల మృతి చెందిన హ్యూస్కు నివాళిగా... భారత్‌తో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ జెర్సీపై ‘408’ నంబర్‌ను ధరించనున్నారు. తమ సహచరుడి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో హ్యూస్ 408 ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. సాధారణంగా ప్రతి టెస్టు ఆటగాడికి వాళ్లు ధరించే జెర్సీపై వ్యక్తిగత నంబర్ ఉంటుంది. కానీ మంగళవారం మొదలయ్యే తొలి టెస్టులో ప్రతి ఆసీస్ ప్లేయర్ హ్యూస్ టెస్టు క్యాప్ నంబర్‌ను ధరించనున్నారు. హ్యూస్ మృతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా అభిమానులు అతడిని గుర్తు చేసుకుంటూ తమ ఇంటి ముందు క్రికెట్ బ్యాట్లను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఓ దొంగకు మాత్రం ఇదేమీ పట్టలేదు. ఒక ఇంటి ముందు ఉంచిన బ్యాట్‌ను ఎత్తుకుపోయాడు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.