
అంతర్జాతీయ క్రికెట్‌కు హాడిన్ గుడ్‌బై
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రపంచకప్ విజయంతో వన్డేలకు వీడ్కోలు పలికిన హాడిన్... తాజాగా అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌లో 67 టెస్టులు ఆడిన హాడిన్ బిగ్‌బాష్ టి20లో మాత్రం సిడ్నీ సిక్సర్ తరఫున ఆడతాడు. ఈ యాషెస్ ముగిసిన తర్వాత రిటైరైన నాలుగో ఆసీస్ క్రికెటర్ హాడిన్.