గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్‌పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది టైటిట్‌ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి!
ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్‌ల మహిళల T20 సిరీస్‌లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్‌గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమే
బీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్‌లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్‌కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్‌లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.
అయితే ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ అయిన బార్టన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గణితంలో లెక్చరర్‌గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment