Record
-
ఓటీటీలో సంచలన రికార్డు సాధించిన 'దేవర’
-
పుష్ప 2 మరో రికార్డ్.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో పుష్ప మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది.తాజాగా ఈ మూవీ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీమియర్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్నా మరోసారి అలరించనుంది. 𝐓𝐡𝐞 𝐅𝐀𝐒𝐓𝐄𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 𝐭𝐨 𝐡𝐢𝐭 $𝟏𝐌+ 𝐏𝐫𝐞-𝐒𝐚𝐥𝐞𝐬 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐔𝐒 𝐁𝐨𝐱 𝐎𝐟𝐟𝐢𝐜𝐞 💥💥PUSHPA RAJ’s dominance is redefining the BOX OFFICE with a NEW DIMENSION 💥🪓 #Pushpa2TheRule pic.twitter.com/lzGvlwTeqr— Pushpa (@PushpaMovie) November 19, 2024 -
మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్
'పుష్ప 2' ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెగ చూసేస్తున్నారు. ఎంతలా అంటే ఇప్పటివరకు టాలీవుడ్లో మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల ట్రైలర్స్ వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ ఇంకా సమయం ఉండగానే దాటేశాడు. సరికొత్త రికార్డ్ సృష్టించాడు.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో 24 గంటల్లో ఎక్కుమంది చూసింది అయితే మహేశ్ 'గుంటూరు కారం' ట్రైలర్‌నే. 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ప్లేస్‌లో ప్రభాస్ సలార్ 32.58 మిలియన్ వ్యూస్‌తో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈ స్టోరీ రాసేటప్పటికే అంటే 15-16 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి?ఇక ట్రైలర్ విషయానికొస్తే కథనేం పెద్దగా రివీల్ చేయలేదు. కానీ జాతర ఎపిసోడ్, పుష్పరాజ్‌కి ఎలివేషన్స్, భన్వర్ సింగ్ షెకావత్ సీన్లు చాలానే చూపించారు. పక్కా కమర్షియల్‌గా ట్రైలర్ కట్ చేశారు. 2:48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ వైల్డ్ ఫైర్ అనేలా ఉంది. డిసెంబరు 5న థియేటర్లలో బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?) -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఒక్క రోజులోనే క్రేజీ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Crazy 55 Million+ Views ♥️Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥🔗 https://t.co/ihtvtgPel9In cinemas worldwide from 10th Jan.GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024 -
ఎక్కేద్దాం... ఎగిరిపోదాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే 2.6 శాతం ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం విశేషం.నవరాత్రి, దసరా, దుర్గా పూజ ముగిసిన తర్వాత తొలి పనిదినం కావడంతో ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా నమోదైంది. అక్టోబర్ 14న మొత్తం 6,435 విమాన సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించాయి. భారత్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దూసుకుపోతుండడంతో విమానయాన సంస్థల మధ్య పోటీ వేడి మీద ఉంది. ఈ ఏడాది ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇండిగో మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు, ఎయిర్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. స్పైస్‌జెట్ 30 బేసిస్ పాయింట్లు, ఆకాశ ఎయిర్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించాయి. సెప్టెంబర్‌లో ఇలా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1.30 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం సాగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ల సంఖ్య 6.4 శాతం దూసుకెళ్లింది. వాస్తవానికి నాలుగు నెలలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో క్షీణత నమోదవుతోంది. 2024 మే నెలలో 1.38 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ప్యాసింజర్ల సంఖ్య జూన్ నుంచి వరుసగా 1.32 కోట్లు, 1.29 కోట్లు, 1.31 కోట్లుగా ఉంది. రద్దు అయిన విమాన సర్వీసుల సంఖ్య 0.85 శాతం ఉంది. మే నెలలో ఇది 1.7 శాతంగా నమోదైంది.ఫ్లైబిగ్ ఎయిర్ అత్యధికంగా 17.97 శాతం క్యాన్సలేషన్ రేటుతో మొదట నిలుస్తోంది. 4.74 శాతం వాటాతో అలయన్స్ ఎయిర్, 4.12 శాతం వాటాతో స్పైస్‌జెట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సలేషన్ రేటు అతి తక్కువగా ఎయిర్ ఇండియా 0.13 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 0.27, ఇండిగో 0.62, విస్తారా 0.88 శాతం నమోదైంది. విమానాల రద్దు ప్రభావం గత నెలలో 48,222 మంది ప్రయాణికులపై పడింది. పరిహారం, సౌకర్యాలకు విమానయాన సంస్థలు రూ.88.14 లక్షలు ఖర్చు చేశాయి. సర్వీసులు ఆలస్యం కావడంతో 2,16,484 మందికి అసౌకర్యం కలిగింది. నష్టపరిహారంగా విమానయాన సంస్థలు రూ.2.41 కోట్లు చెల్లించాయి. గత నెలలో మొత్తం 765 ఫిర్యాదులు అందాయి. 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదుల శాతం 0.59 ఉంది. మార్కెట్ లీడర్‌గా ఇండిగో.. సమయానికి విమాన సర్వీసులు అందించడంలో దేశంలో తొలి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా ఏకంగా 63 శాతానికి ఎగసింది. సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ 82.12 లక్షల మందికి సేవలు అందించింది. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా 15 శాతం వాటాతో 19.69 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చింది.13.08 లక్షల మంది ప్రయాణికులతో విస్తారా 10 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 5.35 లక్షల మంది ప్రయాణికులతో 4.1 శాతం వాటా సొంతం చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 10.7 శాతం మార్కెట్ వాటా కైవసం చేసుకున్న స్పైస్‌జెట్ గత నెలలో 2 శాతం వాటాకు పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ సంస్థ 2,61,000 మందికి సేవలు అందించింది. ఆక్యుపెన్సీ రేషియో స్పైస్‌జెట్ 80.4 శాతం, విస్తారా 90.9, ఇండిగో 82.6, ఎయిర్ ఇండియా 80.1, ఏఐఎక్స్ కనెక్ట్ 81.6 శాతం నమోదైంది. -
18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ
కఠ్మాండు: ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులోఅధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు. బుధవారం ఉదయం 6.05 గంటలకు టిబెట్‌లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని ‘ఎయిట్ థౌజెండర్స్’ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనీరింగ్, క్లైంబింగ్ ఫెడరేషన్(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జని్మంచిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెపె్టంబర్ 30న పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్‌లోని ‘మనాస్లూ’ శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. బుధవారం నాటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్‌కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి. -
‘లాల్బాగ్చా రాజా’ కానుకల వెల్లువ : వేలంలో బంగారు ఇటుకకు రూ. 75.90 లక్షలు
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు. ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్బాగ్చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్బాగ్చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు. ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్బాగ్చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు. లెక్కించేందుకే రెండు మూడు రోజులు ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు. -
తొలి ఆసియానటిగా చరిత్ర సృష్టించిన అన్నా: భావోద్వేగం
ప్రతిష్టాత్మక 76వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్‌లో నటి అన్నా సవాయ్ చరిత్ర సృష్టించారు, ఉత్తమ నాటక నటిగా ఎమ్మీ అవార్డ్ గెల్చుకున్న తొలి ఆసియా సంతతి నటిగా చరిత్రకెక్కారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్టాత్మక అవార్డును తీసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఆదర్శంగా ఉండే మహిళలందరికీ తన అవార్డు అంకితమని పేర్కొనడం అక్కడున్న వారినందర్నీ ఆకర్షించింది.పాపులర్ సిరీస్ షోగన్ మొత్తం 18 ఎమ్మీలను గెలుచుకోగా ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు (25) అందుకున్న సిరీస్ కూడా 'షోగన్' కావడం విశేషం.షోగన్‌లో తన పాత్రకు అన్నా సవాయ్ నాటకంలో ఉత్తమ నటిగా ఎమ్మీని గెలుచుకుంది. భాగంగా షోగన్‌లో లేడీ మారికో పాత్రకు ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుంది. దీనిపై అన్నా సంతోషంగా వ్యక్తం చేసింది. షోగన్ బృందానికి ప్రతి ఒక్క సిబ్బందికి నటీనటులకు ధన్యవాదాలు చెప్పింది. ముఖ్యంగా సహనటుడు హిరోయుకి సనదాకు కృతజ్ఞతలు తెలిపింది. తన తల్లికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. View this post on Instagram A post shared by Emmys / Television Academy (@televisionacad) కాగా న్యూజిలాండ్‌లో జన్మించిన అన్నా 10వ ఏట తన కుటుంబంతో కలిసి జపాన్‌కు వెళ్లింది. 2004లో నిప్పాన్ టీవీ ప్రొడక్షన్ అన్నీలో టైటిల్ క్యారెక్టర్‌గా 11 ఏళ్ల వయసులో బుల్లితెరపై నట జీవితాన్ని ప్రారంభించింది.ఈ తర్వాత జేమ్స్ మెక్టీగ్ 2009 మార్షల్ ఆర్ట్స్ చిత్రం నింజా అస్సాస్సిన్లో కిరికోగా తన సినీ రంగ ప్రవేశం చేసింది. -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
అమర్నాథ్ యాత్ర రికార్డులు బద్దలు!
అమర్నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్నాథ్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్నాథ్ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.అమర్నాథ్ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. జమ్మూలోని యాత్రి నివాస్, చంద్రకోట్ యాత్రి నివాస్, శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్నాథ్ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.సంవత్సరం యాత్రికుల సంఖ్య2011 6.34 లక్షలు2012 6.22 లక్షలు2013 3.53 లక్షలు2014 3.73 లక్షలు2015 3.52 లక్షలు2016 2.20 లక్షలు2017 2.60 లక్షలు2018 2.85 లక్షలు2019 3.42 లక్షలు2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.2022 3.04 లక్షలు2023 4.50 లక్షలు2024 ఇప్పటివరకు 5.10 లక్షలు -
పారిస్ ఒలింపిక్స్‌లో.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్టు! ఎంతంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్‌లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్‌కు పేరు తీసుకువచ్చింది. -
వర్షాల ఎఫెక్ట్.. గాలి నాణ్యతలో ఢిల్లీ సరికొత్త రికార్డు
ఢిల్లీ: నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీకి ఉపశమనం లభించింది. గురువారం(ఆగస్టు 8) రాజధానివాసులు గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగి ఆగస్టు 8న సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో 53గా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎమ్) ఒక ట్వీట్లో తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగినట్లు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే గుడ్, 50 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 ఉండే ఓ మోస్తరు, 201 నుంచి 300 ఉంటే పూర్, 301నుంచి 400 ఉంటే వెరీ పూర్‌గా పరిగణిస్తారు. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)
-
ఈపీఎఫ్‌వో రికార్డ్.. భారీగా పెరిగిన ఉద్యోగాలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్‌లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్‌లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.మే నెలలో ఈపీఎఫ్‌వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది. -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్‌లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
అల్ట్రా రన్నర్ మీనల్
ఆమె ఖాతాలో అనేక రేస్‌లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్‌గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్. ‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్‌లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్లోనూ నేనే ముందున్నాను.ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్‌గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు2014లో ఒక ట్రెడ్మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్ఫాస్ట్లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. డిప్రెషన్ నుంచి కోలుకొని...2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో బెడ్‌రెస్ట్‌లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.ప్రణాళికతో దినచర్యమల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్‌గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్‌లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్‌ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్‌లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్. -
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్‌లో విస్తారమైన ఎస్టేట్‌ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
కాశీ కారిడార్‌లో సరికొత్త రికార్డు.. 16 కోట్లు దాటిన భక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది. -
బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది. -
‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు.. ఏ ప్రాంతాన్నీ వదలని ప్రధాని?
పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా ప్రధాని మోదీ ఈ ఏడాది ఏకంగా 22 ర్యాలీలు నిర్వహించారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తాను చేపట్టే ర్యాలీలతో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతీ ప్రాంతాన్నీ కవర్చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడ ర్యాలీలు చేపట్టకపోవడం విశేషం. మార్చి 16న ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బెంగాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నేడు (బుధవారం) నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది.2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బెంగాల్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అవినీతి, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు తదితర అంశాలతో ప్రధాని మోదీ అధికార తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సీఏఏపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. సందేశ్‌ఖాలీలోని మహిళల అణచివేతపై దుమ్మెత్తిపోశారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలకు న్యాయం చేసే విధంగా ఆ ప్రాంతానికి చెందిన రేఖా పాత్రకు టికెట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రధాని మోదీ మహిళలకు బీజేపీ అండగా ఉంటుందనే సందేశాన్ని అందించారు. -
బోర్డర్లు చెరిపేసిన బామ్మ: క్రికెట్ అరంగేట్రంలోనే రికార్డు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్‌పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది టైటిట్‌ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి! ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్‌ల మహిళల T20 సిరీస్‌లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్‌గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమేబీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్‌కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.అయితే ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ అయిన బార్టన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గణితంలో లెక్చరర్‌గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. -
రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్ డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ. 2.1 లక్షల కోట్లను అత్యధిక మిగులును చెల్లించనుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి బదిలీ చేసిన రూ.87,420 కోట్లతో పోలిస్తే ఈసారి రెండితలు కన్నా అధికం. రికార్డ్ మొత్తంలో ఆర్బీఐ చెల్లించనున్న డివిడెండ్ ప్రభుత్వం తన బడ్జెట్ లోటు లక్ష్యమైన 5.1 శాతం జీడీపీని చేరుకోవడంలో సహాయపడుతుంది.ఆర్బీఐ చెల్లించనున్న డివిడెంట్‌తో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చనుంది. దీంతో ప్రభుత్వం వివిధ అంశాలల్లో గణనీయమైన ఖర్చు చేసేందుకు మరింత సౌలభ్యం కలగనుంది. పెట్టుబడులపై వచ్చే మిగులు ఆదాయం, కరెన్సీ ముద్రణ కోసం తీసుకునే రుసుము, తమ వద్ద డాలర్ల విలువలో హెచ్చుతగ్గులపై వచ్చే ఆదాయం నుంచి ఆర్బీఐ ఏటా డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది. -
రికార్డులు బద్దలు కొట్టిన శ్రీనగర్, బారాముల్లా ఓటర్లు
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఐదవ దశ ఓటింగ్‌లో జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదయ్యింది.సోమవారం జరిగిన పోలింగ్‌లో బారాముల్లాలో 59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది 1984 తర్వాత అత్యధికం. కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి పీకె పాల్ ఈ వివరాలను తెలిపారు. 1967లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందన్నారు. 1984లో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 58.90 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఇది 59శాతంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,37,865 మంది ఓటర్లు ఉన్నారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 2,103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2019లో ఈ నియోజకవర్గంలో 34.6 శాతం ఓటింగ్ జరగగా, 1989లో అది 5.48 శాతం మాత్రమే ఉంది.దీనికి ముందు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత అత్యధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇవే మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడి ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు జమ్మూ కశ్మీర్ ఓటర్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.