న్యూఢిల్లీ: ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది.
అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్‌హెచ్‌ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!
Comments
Please login to add a commentAdd a comment