collection
-
రూ. 1.93 లక్షల కోట్లు.. ఐదేళ్ల టోల్ ట్యాక్స్
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll plazas) నుంచి ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో ఎంత టోల్ వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.1.93 లక్షల కోట్లు ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ రూపంలో అందింది. దీనికి సంబంధించిన వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లోక్‌సభలో వెల్లడించింది.ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం దేశంలోనే అత్యధిక టోల్ ట్యాక్స్‌ను గుజరాత్‌లోని ఎన్‌హెచ్-48లోని వడోదర-భరూచ్ సెక్షన్(Vadodara-Bharuch section)లో ఉన్న టోల్ ప్లాజా వసూలు చేసింది. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుండి 2023-24 వరకు) రూ.2,043.81 కోట్ల టోల్ వసూలు చేసింది. టోల్ ఆదాయాల జాబితాలో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా రెండవ స్థానంలో నిలిచింది. ఇది ఎన్‌హెచ్-48లోని గుర్గావ్-కోట్‌పుట్లి-జైపూర్ విభాగంలో ఉంది. గత ఐదేళ్లలోఈ ప్లాజాలో రూ.1,884.46 కోట్ల విలువైన టోల్ వసూలు చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. 2019-20 నుండి 2023-24 వరకు ఐదు సంవత్సరాలలో ఇది రూ.1,538.91 కోట్ల టోల్ వసూలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారజోధ టోల్ ప్లాజా గత ఐదు సంవత్సరాలలో రూ.1,480.75 కోట్ల టోల్ వసూలు చేసి జాబితాలో 4వ స్థానంలో ఉంది. టాప్ 10 ఆదాయాన్ని ఆర్జించే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్లో, రెండు రాజస్థాన్‌లో రెండు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట -
బాలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతున్న ఛావా మూవీ.!
-
రికార్డుల్లో అస్సలు తగ్గేదే లే
పుష్పరాజ్ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో అస్సలు తగ్గేదే లే అంటూ సరికొత్త రికార్డులు నెలకొల్పారు. నాలుగు రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్ల వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ఓ పాటలో అలరించారు.సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది. ‘‘బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగిస్తున్నాడు పుష్పరాజ్. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్కి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు.ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని, భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’’ అని మేకర్స్ తెలిపారు. ‘‘పుష్ప 2’ బాలీవుడ్లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నాలుగో రోజైన ఆదివారం రూ. 86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా ఒక్క రోజులో 86 కోట్ల నెట్‌ను సాధించలేదు.హిందీలో నాలుగు రోజులకుగానూ రూ. 291 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఒక రికార్డు ప్రకటించేలోపే మరో కొత్త రికార్డును ‘పుష్ప 2’ సాధిస్తుండటం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. రష్మికా మందన్నా నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కూబా ఫొటోగ్రఫీ మా సినిమాకు అదనపు ఆకర్షణలు. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో అల్లు అర్జున్ ఇండియా నంబర్ వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నారు’’ అని కూడా చిత్రయూనిట్ పేర్కొంది. అల్లు అర్జున్‌కు అమితాబ్ ప్రశంస‘పుష్ప–2’లో అద్భుతమైన నటన కనబరచిన అల్లు అర్జున్‌ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం అభినందిస్తున్నారు. అలాగే ‘పుష్ప 2’ సాధిస్తున్న విజయంపైనా స్పందిస్తున్నారు. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అల్లు అర్జున్‌కి ‘మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన నటుడు ఎవరు? అనే ప్రశ్న యాంకర్ నుంచి ఎదురైంది. ఇందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ– ‘‘అమితాబ్ బచ్చన్‌గారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే ఆయనంటే ఎంతో ఇష్టం’’ అని చెప్పారు.వైరల్‌గా మారిన ఈ వీడియోపై ట్విట్టర్ వేదికగా స్పందించారు అమితాబ్ బచ్చన్. ‘‘అల్లు అర్జున్... మీ మాటలు నా హృదయానికి చేరాయి. మీరు నా అర్హతకు మించిన కితాబులు ఇచ్చారు. మేమందరం మీ నటన, ప్రతిభకి అభిమానులం. మీరు మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేయాలి. ఇలానే విజయాలు సాధిస్తుండాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను’’ అంటూ పోస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కి అల్లు అర్జున్ స్పందిస్తూ–‘‘అమితాబ్గారూ... మీరు సూపర్ హీరో. మీరు నా గురించి ఇలా మాట్లాడటం ఆనందంగా ఉంది. మీ హృదయం నుండి వచ్చిన ఈ ప్రశంసలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్ చేశారు. -
Pushpa-2: అస్సలు తగ్గేదే లే..! తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!
‘అస్సలు తగ్గేదేలే... పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్’ అంటూ సినిమాలో ఉన్నట్లు విడుదలైన అన్ని చోట్లా పుష్పరాజ్ మ్యానియా భారీగా కనిపించింది. సినిమా మొత్తం అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే జాతర సీన్ కి థియేటర్లు ఈలలు కేకలతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ కార్మికుడి నుంచి స్మగ్లింగ్ కింగ్‌పిన్ గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన అల్లు అర్జున్ ... తొలి భాగాన్ని మించిపోయి రెండో భాగంలో తన సత్తా చూపాడని ప్రేక్షకులు కీర్తిస్తున్నారు.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకే పుష్పగాడి రూలింగ్ (ప్రీమియర్స్) మొదలైంది.‘పుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది. గురువారం సాయంత్రం నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్, సీఈవో చెర్రీలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి, తమ ఆనందం పంచుకున్నారు. తొలి రోజు రూ. 250 కోట్లు?బాక్సాఫీస్ నివేదికల ప్రకారం ‘పుష్ప 2’ ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్’తో సహా పలు చిత్రాల కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. తొలి రోజు దాదాపు రూ. 250 కోట్ల వసూళ్లు ఖాయం అని గురువారం వసూళ్లను బట్టి అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రం అంచనాలకు అందని విధంగా అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా, హిందీ మాట్లాడే ప్రేక్షకులు సైతం తొలి పార్ట్‌ని మించి ‘పుష్ప 2: ది రూల్’కి జేజేలు పలుకుతున్నారు.జాతరే జాతర..‘పుష్ప 2’ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేసి, ఆశ్చర్యపరిచారు మేకర్స్. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో థియేటర్లు జాతరను తలపిస్తుండడం విశేషం. బాక్సాఫీస్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ పుష్ప కలెక్షన్ల వేట సాగుతోంది. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు పాత రికార్డ్స్ బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా 95.71వేల టికెట్లు విక్రయించిన రికార్డు ఇప్పటిదాకా ప్రభాస్ ‘కల్కి’ పేరిట ఉండగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దీన్ని అధిగమించింది.కేవలం ఒక గంటలో 97.74 వేల టికెట్లను విక్రయించడం ద్వారా కొత్త ఆల్–టైమ్ రికార్డును నెలకొల్పింది. మరో విశేషం ఏంటంటే వారాంతపు రోజుల్లో ‘కల్కి’ ఈ రికార్డును సాధించగా, ‘పుష్ప 2’ సాధారణ వారపు రోజున దానిని సాధించడం. ఆల్ ఇండియా బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను అందించే సాక్నిక్ ప్రకారం... ‘పుష్ప 2’ భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది.చదవండి: షారుఖ్నే దాటేసిన బన్నీ.. నిజంగా ఇది విధ్వంసమే!ఉత్తర అమెరికాలో ప్రీ–సేల్స్ 2.5 మిలియన్లను అధిగమించడం కూడా రికార్డే. ప్రస్తుత టాక్ని బట్టి సినీ పరిశ్రమ వర్గాలు ‘పుష్ప 2’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్‌ని అంచనా వేస్తున్నారు. ఇదే వేగంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే వసూళ్లు మొత్తంగా రూ. 800– 1,000 కోట్ల కలెక్షన్లు దాటేసినా ఆశ్చర్యం లేదని పీవీఆర్ ఐనాక్స్ ప్రతినిధి గౌతం దత్తా అంటున్నారు.ఉత్తరాదిన కూడా వీర విహారం‘పుష్ప 2: ది రూల్’ ఉత్తరాదిన కూడా వీర విహారం చేస్తోంది. ఈ సినిమా చూసిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కునాల్ కోహ్లీ అల్లు అర్జున్, సుకుమార్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘అల్లు అర్జున్ మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ కోసం ‘పుష్ప 2’ చూడండి. రష్మిక ఫ్యాబ్యులెస్. కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్‌కు అర్థం చెబుతూ సుకుమార్ ఒక కంప్లీట్ మసాలా ఎంటర్టైనర్ని అందించారు. అల్లు అర్జున్ నటనతో ఈ సినిమా బాక్సాఫీస్‌లో కొత్త చరిత్ర లిఖించనుంది’’ అని ఆయన పొగడ్తలతో ముంచెత్తడం ఉత్తరాదిలో ఈ సినిమా ప్రభంజనానికో నిదర్శనం. చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా.. ఫట్టా?పుష్ప: ది ర్యాంపేజ్‘పుష్ప 2’కి కొనసాగింపుగా ‘పుష్ప: ది ర్యాంపేజ్’ రానుంది. అయితే ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్‌లకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే ‘పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు మొదలవుతాయని ఊహించవచ్చు. ఇక ‘పుష్ప 2’ భారీ విజయంతో ‘పుష్ప 3’ పై భారీ అంచనాలు ఉండటం సహజం. -
ఏసీ బెర్త్‌కు రూ.1000.. నాన్ ఏసీకి రూ.500
సాక్షి, హైదరాబాద్: ఏసీ బెర్త్‌కు రూ.1000..నాన్ ఏసీ బెర్త్‌కు రూ.500. ఇవి టికెట్ చార్జీలు కాదు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్తులు కావాలంటే టికెట్ కలెక్టర్లకు (టీసీలకు) సమర్పించుకోవలసిన ఆమ్యామ్యాలు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లు, కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరహా బేరాలు జోరుగా సాగుతున్నాయి. టీసీలే స్వయంగా డబ్బులు తీసుకొని బెర్తులు కట్టబెట్టడంతో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న వారు నిశ్చింతంగా ప్రయాణం చేస్తున్నారు. నిజానికి టికెట్ నిర్ధారణ అయితే తప్ప ట్రైన్లో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణికుల జాబితా విడుదల అవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లు మాత్రమే రిజర్వేషన్ లభించిన ప్రయాణికులు. కానీ ప్రతి ట్రైన్‌కు వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులు ఉంటారు. చార్ట్ (జాబితా) సిద్ధమైన తరువాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు వారి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయి. కానీ కొందరు ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ప్రయాణం చేస్తారు. ఏదో ఒకవిధంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో టికెట్లను రద్దు చేసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ తాకిడి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపైనే కొందరు టీసీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీల్లో బెర్తులకు రూ.500, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో బెర్తులకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.శబరి రైళ్లకు డిమాండ్ ఫుల్... ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు తరలివెళ్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు సైతం దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సైతం డిమాండ్ బాగా ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలన్నా, ఫ్లైట్‌లో వెళ్లాలన్నా పెద్దమొత్తంలో వెచ్చించవలసి ఉంటుంది. చార్జీల భారం దృష్ట్యా ఏదోఒకవిధంగా రైళ్లలో వెళ్లడమే మంచిదని భావించే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు నవంబర్ 27వ తేదీన 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17230)లో సికింద్రాబాద్ నుంచి శబరికి బయలుదేరారు. వాళ్ల ప్రయాణానికి ఇంచుమించు నెల రోజుల క్రితమే సెకండ్ ఏసీ రిజర్వేషన్ కోసం టికెట్లు కొనుగోలు చేశారు. కానీ ప్రయాణ తేదీ నాటికి కూడా టికెట్లు నిర్ధారణ కాలేదు. రిజర్వేషన్ లభించలేదు. చార్ట్ (ప్రయాణికుల జాబితా) సిద్ధమైన తరువాత కూడా ఆ ప్రయాణికులు వెయిటింగ్ జాబితా (5 నుంచి 8 వరకు)లోనే ఉండిపోయారు. అయినప్పటికీ టికెట్లను రద్దు చేసుకోకుండా అదే ట్రైన్లో బయలుదేరారు. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికి వెళ్లి టీసీని సంప్రదించారు. ‘మొదట్లో ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్ తిరుపతికి చేరుకున్న తరువాత ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 చొప్పున మొత్తం రూ.4000 తీసుకొని నాలుగు బెర్తులు కేటాయించాడు. సెకండ్ ఏసీలోనే ఆ సదుపాయం లభించడంతో ప్రయాణం నిశ్చింతగా సాగింది.’ అని ఆ ప్రయాణికులు చెప్పారు. తమతో పాటు మరి కొందరికి కూడా రూ.1000 చొప్పున తీసుకొని ఏసీ బోగీల్లో, రూ.500 చొప్పున తీసుకొని స్లీపర్‌లో బెర్తులు ఇచి్చనట్లు వారు చెప్పారు.ఎలా సాధ్యం... ⇒ రిజర్వేషన్లు నిర్ధారణ అయిన ప్రయాణికులు ఆకస్మికంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకో వ చ్చు. అలాంటి వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ట్రైన్లో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్, టికెట్ కలెక్టర్, తదితర సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలను తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ మిషన్లలో నమోదు చేయాలి. ⇒ ఈ క్రమంలోనే కొందరు టీసీలు ఇలాంటి ప్రయాణికుల వివరాలను నమోదు చేయడంలోనే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.⇒ సదరు ప్రయాణికుల పేరు వద్ద ‘కాన్సిల్’ అని కాకుండా ‘జాయిన్’ అని నమోదు చేసి ఆ బెర్తులను వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు కేటాయిస్తున్నారు. అయితే ఆన్లైన్ టికెట్లపైన ఇది సాధ్యం కాదు. రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే టీసీలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్‌కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్ రోల్స్ రాయిస్ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..లేటెస్ట్ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్ సింగ్‌కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్‌ను చూస్తే ఇది తెలుస్తుంది. ఇంకా తన కార్ల కలెక్షన్లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.ఆనంద్ మహీంద్రా నుంచి..విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్‌కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్‌ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్‌లో ఈ క్రూయిజర్ మోటార్‌బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్‌పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్‌లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా. -
రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్
ఎన్టీఆర్ 'దేవర' మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానం దక్కించింది. తాజాగా దేవర రెండురోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దేవర సినిమా రెండురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 243 కోట్లు రాబట్టింది. అయితే, మొదటిరోజు కంటే భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు మాత్రం కేవలం రూ. 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే, బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్లో ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాగా.. సెకండ్ డే నాడు రూ. 9 కోట్లు రాబట్టింది. మూడో రోజు కూడా అక్కడ భారీగానే టికెట్ల కొనుగోలు జరిగింది. ఇదీ చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్అయితే, రెండో రోజు నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానున్నడంతో మొత్తంగా రూ. 500 కోట్ల క్లబ్లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.The wave of #Devara's rage FLOODS the Box Office putting ALL TERRITORIES on notice! 🔥🔥𝟐 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐁𝐎𝐂 𝟐𝟒𝟑 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 💥💥- https://t.co/hGPUm1Tsio#BlockbusterDevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/HbjFm2tmJ4— NTR Arts (@NTRArtsOfficial) September 29, 2024 -
10 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మరో సారి బలంగా నమోదయ్యాయి. ఆగస్ట్‌లో రూ.1.75 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో సమకూరింది. 2023 ఆగస్టు నెలలో రూ.1.59 లక్షల కోట్ల ఆదాయంతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది జూలై నెలకు జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో పోల్చితే ఆగస్ట్‌లో స్వల్పంగా తగ్గాయి. 2024 ఆగస్టులో దేశీ లావాదేవీలపై జీఎస్టీ ఆదాయం 9.2 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లుగా నమోదైంది.దిగుమతి చేసుకున్న వస్తువులపై స్థూల జీఎస్టీ ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్లకు చేరింది. ఇక ఆగస్టులో రూ.24,460 కోట్ల జీఎస్టీ రిఫండ్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలో పోల్చితే 38 శాతం పెరిగాయి. రిఫండ్లను సర్దుబాటు చేసి చూస్తే, నికర జీఎస్టీ ఆదాయం 6.5 శాతం పెరిగి రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. పండుగలకు ముందు జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరగడం వినియోగం బలంగా ఉన్నట్టు సూచిస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు. -
శ్రద్ధ కపూర్ దెబ్బకు షారుఖ్ ఖాన్ రికార్డ్స్ అవుట్..!
-
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
FDCI ICW 2024: సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్.. (ఫొటోలు)
-
'డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్' సినిమాకు భారీ కలెక్షన్స్
హాలీవుడ్ సూపర్ హీరో సినిమా 'డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3650 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రంగా నిలిచింది. భారత్‌లో కూడా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం రూ. 1675 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా 'డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్' జులై 26న విడుదలైంది. సూపర్ బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా తెలుగునాట థియేటర్లలో సందడి చేస్తుంది. మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాలో రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ మూవీ బాక్స్ ఫీస్‌ని షేక్ చేస్తుంది.దాదాపుగా మూడు రోజుల్లో రూ. 3650 కోట్లు కలెక్ట్ చేసి కాసుల వరద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ కలెక్షన్ల హవా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల అదరణ దక్కింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్రదారు రయన్ రెనాల్డ్స్ పలికిన ప్రతి సంభాషణకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి తెలుగులో విశేషాదరణ లభిస్తుంది. -
ప్రభాస్‌కు అది రోటీన్.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. కల్కి మూవీకి పార్ట్-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో భైరవగా సందడి చేసిన ప్రభాస్.. సీక్వెల్లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో పార్ట్-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
మనీష్ మల్హోత్రా : కళ్లు చెదిరే అల్టిమేట్ జ్యుయల్లరీ! (ఫొటోలు)
-
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
-
చురుగ్గా రబీ ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ధర అందించడంతోపాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గోనె సంచులు (గన్నీ), హమాలీ, రవాణా (జీఎలీ్ట) చార్జీల కింద టన్నుకు రూ.2,523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు 1.02 లక్షల మంది రైతుల నుంచి రూ.2,196 కోట్ల విలువైన 10.05 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.వీటిల్లో నిర్దిష్ట సమయానికి 45,468 మంది రైతులకు రూ.1,008.93 కోట్లు చెల్లింపులను పూర్తి చేసింది. ఈసారి ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసిన్పటికీ రైతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో మేలైన దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ రెండో ముందస్తు అంచనా చెబుతోంది. వాస్తవానికి రబీలో ప్రాథమికంగా 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.గత అనుభవాల దృష్ట్యా అకాల వర్షాలు, అనుకోని విపత్తులు సంభవిస్తే తక్షణం ధాన్యాన్ని తరలించే విధానంపై ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ పటిష్ట ప్రణాళిక అమలు చేస్తోంది. చాలావరకు కోతలు పూర్తవడంతో ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలిస్తోంది.50 శాతంపైనే కొనుగోలు తూర్పు, పశి్చమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. ఎగుమతిదారులు చాలామంది సాధారణ రకాలకు సైతం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుండటం విశేషం. ఉత్తరాంధ్రలో ఫైన్ వెరైటీలు సాగు చేస్తున్నారు.వాటికి బయటి మార్కెట్లో డిమాండ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఏటా దిగుబడుల్లో సగటున 50 శాతంపైనే కొనుగోళ్లు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. ఇలా ఐదేళ్లలో 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. దొడ్డు ధాన్యానికి డిమాండ్రబీలో గోదావరి జిల్లాల్లో సాగు చేసే జయ రకం (దుడ్డు/»ొండాలు) ధాన్యానికి మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. గతేడాది నుంచి ప్రభుత్వం జయ రకం ధాన్యాన్ని సేకరించడం ప్రారంభించడంతో ప్రైవేటు వ్యాపారుల దందాకు అడ్డుకట్ట పడింది. పూర్తి మద్దతు ధరతోపాటు జీఎల్టీ చార్జీలను ఇస్తుండటంతో రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో దిగొచ్చని ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరకు కంటే రూ.100 నుంచి రూ.300 ఎక్కువ ఇచ్చి కళ్లాల నుంచే ధాన్యాన్ని కొనుగోలు చేశారు.ఫలితంగా రైతులకు మంచి ధర కలి్పంచడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఈ ఏడాది 3 లక్షల టన్నుల వరకు జయ రకం ధాన్యాన్ని సేకరించేలా పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క జయ రకం విషయంలోనే కాకుండా సాధారణ రకాల ధాన్యం ఉత్పత్తులను కూడా మద్దతు ధర/అంతకు మించి ఇచ్చి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారుల స్థానంలో ప్రతి మండలంలో మొబైల్ బృందాలను నియమించింది.ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో చాలామంది రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ ఆయా జిల్లాల జేసీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ప్రభుత్వ కాల్‌సెంటర్ వచి్చన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. -
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
మొదలైన ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. ప్రతి రైతుకు సంపూర్ణ మద్దతు ధర చెల్లింపే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాథమికంగా ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కల్లాలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ఎక్కడా జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. అకాల వర్షాలు, అనుకోని విపత్తులు సంభవిస్తే తక్షణం ధాన్యాన్ని తరలించే విధానంపై ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. గోదావరి జిల్లాల్లో కోతలు మొదలవడంతో వచి్చన ధాన్యాన్ని వచి్చనట్టు కొనుగోలు చేస్తోంది. విప్లవాత్మక మార్పులతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో విప్లవాత్మక మార్పులు చేసింది. దళారులు, మిల్లర్ల దోపిడీని పూర్తిగా అరికట్టి రైతులను నష్టపోకుండా కాపాడింది. రైతుకు మద్దతు ధర దక్కాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ–క్రాప్ ఆధారిత ధాన్యం సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా టీడీపీ హయాంలో కంటే ఎక్కువ మంది రైతులకు మద్దతు ధర దక్కింది. ఏటా దిగుబడుల్లో సగటున 50 శాతంపైనే కొనుగోళ్లు చేస్తూ రైతులకు అండగా నిలిచింది. ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అదే టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. అంటే టీడీపీ హయాంలో కంటే 20 లక్షల మంది రైతులకు అదనంగా మద్దతు ధర అందించింది. జీఎల్టీ లబ్ధి అదనం టీడీపీ హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనుగోలు కేంద్రాలకు పంటతో వచి్చన రైతుల నుంచి ధాన్యం తీసుకోవడానికి ముప్పుతిప్పలు పెట్టేది. దీంతో రైతులు వచి్చనకాడికి దళారులు, మిల్లర్లకు ధాన్యాన్ని అప్పజెప్పాల్సి వచ్చేది. ఇలా సేకరించిన ధాన్యాన్ని దళారులు తిరిగి ప్రభుత్వానికి విక్రయించి రైతుల పేరుతో పూర్తి మద్దతు ధర కొట్టేసేవారు. ఇక్కడ రైతులు మద్దతు ధర కోల్పోవడంతోపాటు కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు రూ.వేలకు వేలు వెచి్చంచాల్సి వచ్చేది. గతంలో రైతులే ధాన్యాన్ని రవాణా చేస్తే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరించినట్టు లెక్కల్లో చూపించి ఏటా రూ.కోట్లు దోచేసేవారు. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ రైతులకే గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టీ) ఖర్చులను చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గోనె సంచులు, హమాలీ కూలీ, ధాన్యం రవాణాకు టన్నుకు రూ.2,523 చొప్పున రైతులకు అదనంగా చెల్లిస్తోంది. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. బొండాలు రకానికీ మార్కెట్లో మంచి ధర గోదావరి జిల్లాల్లో సాగు చేసే జయ రకం (బొండాలు) ధాన్యానికి మార్కెట్లో మంచి రేటు లభిస్తోంది. గతేడాది నుంచి ప్రభుత్వం జయ రకం ధాన్యాన్ని కూడా సేకరించడం ప్రారంభించడంతో ప్రైవేట్ వ్యాపారుల దందాకు అడ్డుకట్ట పడింది. దీంతో దిగొచి్చన వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.300 కంటే ఎక్కువ ఇచ్చి కల్లాల నుంచే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది 3 లక్షల టన్నుల వరకు జయ రకం ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు సమస్య లేకుండా.. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారుల స్థానంలో ప్రతి మండలంలో మొబైల్ బృందాలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచి్చన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. -
ఆర్యన్ ఖాన్ కొత్త బ్రాండ్ జాకెట్ ధర వింటే షాకవ్వుతారు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడి కొత్త బ్రాండ్ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా..వీటి ధరలు చూసి కంగుతింటున్నారు అభిమానులు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో సందడి చేశారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు వచ్చేసి ఏకంగా రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి. ఈ బ్రాండ్ ఎక్స్ 2 అందుబాటులోకి వచ్చిందంటూ వెబ్సైట్ http://dyavolx.comలో బుక్ చేసుకోండి. ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటాయి, గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం విశేషం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది. ఇవన్నీ ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లో ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చిన కలెక్షన్ల ధరలైతే ఏకంగా రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇవి కాస్త బెటర్ అని చెప్పొచ్చు. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఇక తన కొడుకు బ్రాండ్‌కు షారుక్ ఇస్తున్న ప్రమోషన్ కూడా బాగా కలిసి వస్తోంది. అందులో షారుక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతనికి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) (చదవండి: రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...) -
మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలుండవ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్ అవర్స్‌లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. -
13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..
Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది. 1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో సహా టోల్లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది. 1996 సమయంలో ఈ సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది. ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే.. సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్‌లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
రెండో రోజుకే చల్లబడ్డ భగవంత్ కేసరి కలెక్షన్స్
-
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్ (ఫొటోస్)
-
హైదరాబాద్ లో ఘనంగా తనిష్క్ కాకతీయ కలెక్షన్స్ ప్రారంభం (ఫోటోలు)
-
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం.. బంగారు ఆభరణాల కలెక్షన్
హైదరాబాద్: సంపద, సంతోషం, సుఖం అందించే దేవత లక్ష్మీదేవిని పూజిస్తూ చేసుకునే పవిత్ర వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ అతిపెద్ద జ్యువెలరీ బ్రాండ్– తనిష్క్ ‘ఆర్ణ’ పేరుతో ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఈ కలెక్షన్లో ప్రత్యేకమైన నెక్‌వేర్, హరామ్, వంకీలు, నడుము వడ్డాణాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్సహా అత్యంత నాణ్యమైన, విభిన్న డిజైన్లతో కూడిన బంగారం, కలర్ స్టోన్స్, ముత్యాల ఆభరణాలు ఉన్నాయి. తనిష్క్ ఆభరణాల ఎక్స్చేంజ్పై 20 శాతం వరకూ తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని సంస్థ అన్ని షోరూమ్‌లలో లభ్యమవుతుందని తనిష్క్ ప్రకటనలో పేర్కొంది. -
బేబీ మూవీ ఆల్ టైం రికార్డ్
-
సింగర్ ఉషా తొలి జీతం ఎంతో తెలుసా? వావ్ అనిపించే చీరల కలెక్షన్
Legend Usha Uthup: ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. కేవలం తన గొంతులో మాత్రమే ప్రత్యేకతను నింపుకోలేదు..ఆమె ఆహార్యం కట్టూ, బొట్టూ అన్నీ స్పెషలే. ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఉష ఒక నటి, సామాజిక కార్యకర్త కూడా. ప్రత్యేకమైన శైలి, వాయిస్‌తో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసిన లెజెండరీ సింగర్. అయితే, ఉషా ఉతుప్ కట్టుకునే చీరలు చూస్తే ఆమెకు సారీస్ మీద పెద్ద మోజు ఇట్టే అర్థమైపోతోంది. దేశంలో అన్ని రంగాల చీరల కలెక్షన్ ఆమె వద్ద ఉంది. ఈ లిస్ట్ దాదాపు 600కు పై మాటే. ఉషా ఉతుప్ సారీస్ అండ్ సాంగ్స్ లతాజీ ,ఆశా జీ (లతా మంగేష్కర్ , ఆశా బోన్స్లే)తో సహా ప్రఖ్యాత గాయకులకు బాలీవుడ్ హీరోయిన్ల పాటలు పాడుతుంటే, వాంప్‌ల కోసం పాడమని నన్ను అడిగేవారు. కానీ దాన్ని కూడా నేను బ్రేక్ చేశాను. రేఖ, శ్రీదేవి లాంటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు పాటలు పాడాను అంటారు ఉషా. పంజాబీ, బెంగాలీ, మరాఠీ , హిందీ, తెలుగు భాషల్లో అనేక పాటలకు తన గాత్రాన్ని అందించిన ఘనత ఆమె సొంతం. ‘‘నాకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉన్నందుకు గర్వపడుతున్నా..నేను ఎవరిలాగానో పాడలేను..నాలాగా మాత్రమే పాడతాను. అందరికీ భిన్నంగా స్టేజ్ మీద ఎలా అలరించాలో అలాగా చేస్తాను.’’ ఇదీ ఉషా స్టయిల్. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేల మందికి ఉపాధి) ప్రతీ భారతీయ అమ్మాయికి చీర ఒక అబ్సెషన్. చిన్నతనంలోనే అమ్మ చీరను చుట్టకుని మురిసిపోయేంత ప్రేమ. ఈ నేపథ్యంలో ఖరీదైన వందల చీరలు ఉషా వార్డ్‌రోబ్‌లోకి కొలువు దీరాయి. అలాగే తన తల్లి అనుభవాలను కూడా ఆమె మీడియాతో పంచకున్నారు. మధ్యతరగతి మహిళ తన తల్లికి ఎక్కువ చీరలు కొనే స్థోమత లేకపోయిందని ఉషా ఉతుప్ గుర్తు చేసుకున్నారు. అలాగే తన తల్లి గడి, చుక్కలు, చారలు అంటే చాలా ఇష్టపడేవారి చెప్పారు. ముఖ్యంగా తన చీరల్లో పూజ బోర్డర్, బంగారు హంసలున్న మావ్-హూడ్ కాంజీవరం చీర చాలా ఖరీదైందని చెప్పారు. అంతేకాదు చాలా పాతదే అయినా ఈ ట్రెడిషనల్ చీరంటే తన కుమార్తెకు కూడా చాలా ఇష్టమనట. ఈ సందర్బంగా మరో విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) బ్లాక్ సారీ అంటే.. నలుపు రంగు చీర కట్టుకున్నప్పుడల్లా తన అత్తగారికి చాలా కోపం వచ్చేదని చెప్పారు. తమిళ అయ్యర్ కుటుంబం నుండి వచ్చిన తనకు బ్లాక్ సారీస్ అంటే చాలా ఇష్టంమని, సాధారణంగా ఇక్కడి మహిళలు నలుపు రంగును మహిళలందరూ ఇష్టపడతానన్నారు. అయితే కేరళకు చెందిన కుటుంబాన్ని వివాహం చేసుకున్నా.. అందుకే నల్ల చీర కట్టుకున్నప్పుడల్లా అత్తగారికి కోపం వచ్చేది అంటూ తన కెంతో ఇష్టమైన నల్లటి చీరను కూడా చూపించారు. ఉషా ఉతుప్ తొలి సంపాదన ఉషా ఉతుప్ తొలి సంపాదన నెలకు రూ. 750. తాను యాదృచ్ఛికంగా తన ఆంటీ సహాయంతో సింగింగ్‌లో వచ్చానన్నారు. అప్పుడపుడూ కొన్ని గిగ్‌లు పొందడానికి సహాయం చేసింది. అలా సింగింగ్ మీద ఆసక్తి పెరిగింది. ఒక హోటల్‌తో నైట్‌క్లబ్ గాయనిగా చేరారు. అక్కడ నెలకు రూ. 750 వచ్చేది అని చెప్పారు. నిజంగా ఆ సమయంలో డబ్బు సంపాదించడంలో థ్రిల్ వేరే అంటారు ఉష. -
Dhoni Cars, Bikes Collection: ధోనీ అంటేనే సెన్సేషన్ అదో..వైబ్రేషన్ చూడండి ఆయన క్లాసిక్ కలెక్షన్ (ఫోటోలు)
-
చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది అస్సలు చెప్పలేం. అలా గతవారం నిఖిల్ పాన్ ఇండియా చిత్రం 'స్పై' రిలీజైంది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడింది. దీనితోపాటే థియేటర్లలోకి వచ్చిన 'సామజవరగమన' అనే చిన్న సినిమా అనుహ్యంగా హిట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇంతకీ వసూళ్ల సంగతేంటి? లాభాలు ఎంత? 'సామజవరగమన' కథేంటి? బాలు(శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వరరావు(సీనియర్ నరేష్)ని డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్పలు పడుతుంటాడు. ఎందుకంటే డిగ్రీ పాస్ అయితేనే తాత వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి తండ్రికి దక్కుతుంది. అలా తండ్రితో పరీక్షలు రాయించే క్రమంలో సరయూ(రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తన బావ పెళ్లి వల్ల బాలుకి చిక్కులు వస్తాయి. ఇంతకీ అవేంటి? బాలు-సరయూ ఒక్కటయ్యారా అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) కలెక్షన్స్ ఎంత? ఈ సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినాసరే విడుదలైన తొలిరోజు మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం రూ.2.89 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రెండో రోజుల్లో రూ.6.31 కోట్ల గ్రాస్ వచ్చింది. మూడోరోజుకి అయితే.. తొలి రెండురోజుల్లో వచ్చిన దానికి రెట్టింపు వసూళ్లు దక్కాయి. అంటే రూ.12.96 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. నాలుగురోజైన ఆదివారం దాదాపు రూ.7 కోట్ల వరకు వచ్చాయి. దీంతో మొత్తం కలిపి రూ.19.80 కోట్ల గ్రాస్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. సక్సెస్‌కి కారణమేంటి? ఓ చిన్న సినిమాకు అదీ కూడా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన దానికి ఈ తరహా హిట్ టాక్ రావడం చాలా అరుదైన విషయం. 'సామజవరగమన' ఇది చేసి చూపించింది. కుటుంబమంతా కలిసి చూసేలా ఎంటర్ టైన్మెంట్ ఉండటం చాలా కలిసొచ్చింది. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు పెద్దగా జనాల్ని అలరించకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టారని, ఈ పాటికే ఆ మొత్తం వచ్చేసినట్లు సమాచారం. ఇకపై వచ్చే కలెక్షన్ అంతా లాభామే! BALU gadi family ni intha baga receive chesukunna prathi family ki 🙏🏻🙏🏻 Couldn't have asked for a better reception than this to our #Samajavaragamana ❤️ pic.twitter.com/TIoH87l9ZA — Sree Vishnu (@sreevishnuoffl) July 3, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!) -
నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం!
దేశీయంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 12 శాతం వృద్దిని సాధించి రూ.1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ.1.87లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1,57,090 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు స్థూలంగా (Gross) 1.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం 4వ సారి, 1.4 కోట్లను వసూలు చేయడం 16 నెలలకు పెరిగింది. ఇక 1.5లక్షల కోట్ల మార్క్‌ను 7వ సారి అధిగమించినట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. జూన్ నెలలో గ్రాస్ జీఎస్టీ రూ.1.61,497 కోట్లు వసూలైంది. వాటిల్లో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు) ఉండగా.. సెస్ రూ.11,900 కోట్లు రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి. ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. 👉 ₹1,61,497 crore gross #GST revenue collected for June 2023; records 12% Year-on-Year growth 👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark for 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception 👉… pic.twitter.com/Q17qM9mTEX — Ministry of Finance (@FinMinIndia) July 1, 2023 -
జపాన్ లో కేజీయఫ్ సిరీస్ రిలీజ్
-
ఇదీ ప్రభాస్ రేంజ్ అంటే ఆది పురుష్ రికార్డు బిజినెస్ ...
-
సంచలనం సృష్టిస్తున్న రవితేజ శ్రీలీల..
-
ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్ మూవీస్ ధ్వంసం అవుతున్న ధీయేటర్లు
-
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన బిచ్చగాడు 2 కలెక్షన్స్
-
జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫెరారీ రోమా జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) లంబోర్ఘిని ఉరుస్ మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. పోర్స్చే కారెరా ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!) ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్‌హెచ్‌ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
బాక్స్ ఆఫీస్ ని పీస్ పీస్ చేస్తున్నవిరూపాక్ష కలెక్షన్స్..
-
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్‌ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్‌గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్‌లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్‌గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్‌లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్‌లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్‌బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్‌గా ఫోర్బ్స్ గుర్తించింది. -
ప్రభుత్వ కార్యాలయాల్లోని ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు
-
కలెక్షన్ల సునామి సృష్టించనున్న సలార్
-
జపాన్ లో బాహుబలి -2 రికార్డును తుడిచేసిన RRR
-
జీఆర్టీ జ్యువెలర్స్: పోల్కి దేవాన్షి ఆభరణాలు అదరహ!
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ పోల్కి వజ్రాలతో తీర్చిదిద్దిన దేవాన్షి ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. చరిత్రలో రాజ కుటుంబీకులు, సంస్థానాధీశులు ధరించిన ఈ వజ్రాభరణాలు నిపుణులైన హస్తకళాకారుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి. ఈ అద్భుత శ్రేణిపై 15% వరకు ప్రత్యేక ఆఫర్ లభిస్తుంది. ప్రత్యేక రూపకల్పన కోరుకునే కస్టమర్ల కోసం సంప్రదాయ, సమకాలిక అంశాలను మేళవించి పోల్కి దేవాన్షి ఆభరణాలను తీసుకొచ్చామని సంస్థ ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ తెలిపారు. GRT Jewellers brings you the Devanshi Polki Collection, where every design is a masterpiece! Exclusively Available at: UsmanRoad (Chn) Coats Road (Chn) Vijayawada (AP) Vizag (AP) Somajiguda (Hyd) Tirupati (AP) Jayanagar (BLR) Malleswaram (BLR)#grtjewellers #polki #diamond — GRT JEWELLERS (@GRTJewellers) November 3, 2022 -
సినిమా ఇండస్ట్రీలకి ఈర్ష కలిగిస్తున్న తమిళ సినిమాలు
-
మెగాస్టార్ కార్ గ్యారేజ్...
-
జీఆర్టీ జ్యువెలర్స్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్
హైదరాబాద్: వివాహ వేడుకల కోసం జీఆర్టీ జ్యువెలర్స్ సాటిలేని హస్తకళతో ఆభరణాల డిజైన్లను విడుదల చేసింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, విలువైన రత్నాలతో రూపొందిచిన ఉంగరాలు, గాజులు, చెవిదిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు, వంకీలు వంటివి ఈ విస్తృత శ్రేణి కలక్షన్లో ఉన్నాయి. సంప్రదాయ ఆభరణాలకు బంగారు స్పర్శ, ట్రెండ్ జోడించిన ఈ ప్రత్యేక డిజైన్లు వివాహ వేడుకలను మరుపురాని క్షణాలుగా చిరస్మరణీయం చేస్తాయని కంపెనీ ఎండీ జీఆర్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..) -
అమితాబ్ బచ్చన్ 'జుండ్' సినిమా మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే ?
Amitabh Bachchan Jhund Movie First Day Collection Is 1 Crore Above: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం 'జుండ్’'. ఇందులో బిగ్‌బి ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టీ సిరీస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదలైంది. సానుకూల స్పందనతో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. మంచి టాక్‌తో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 1.5 కోట్లు రాబట్టింది. నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బార్సే జీవితం ఆధారంగా జుండ్ సినిమా తెరకెక్కింది. విజయ్ బార్సే పాత్రలోకి అమితాబ్ పరకాయ ప్రవేశం చేశాడు. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారని తెలుస్తోంది. అందుకు తన పారితోషికాన్ని తగ్గించమని మేకర్స్‌కు అమితాబ్ చెప్పిన విషయాన్ని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఆ డబ్బు వాపస్ చేయండి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 డిసెంబర్లో ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూర్చారన్న ఆరోపణలతో ఆందోళనకారుల నుంచి జరిమానాల రూపంలో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశారని, ఆ డబ్బు రీఫండ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారుల ఆస్తులను అటాచ్ చేశారని, వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు జారీ చేసిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన ‘ఉత్తరప్రదేశ్ రివకరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్’ కింద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన రికవరీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ పర్వేజ్ అరీఫ్ టిటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్ల క్రితం మరణించిన వృద్ధుల పేరిట కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈ నెల 11న యూపీ సర్కారును ఆదేశించింది. -
డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద 2021 డిసెంబరు నెలలో రూ, 1,29,780 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, పన్ను ఎగవేతల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇది సాధ్యమైందని ఆర్థిక శాఖ శనివారం పేర్కొంది. సీజీఎస్టీ కింద రూ. 22,578 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ. 28,658 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 69,155 కోట్లు, సెస్ కింద రూ.9,389 కోట్లు వసూలైనట్లు వివరించింది. కిందటి ఏడాదితో పోలిస్తే డిసెంబరు పన్ను ఆదాయంలో 13 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. 2021లో వరుసగా ఆరో నెల కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటడం గమనార్హం. అయితే నవంబరులో రూ. 1.31 లక్షల కోట్లు వసూలు కాగా... డిసెంబరులో ఇది రెండు వేల కోట్లు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటున నెలకు రూ.1.10 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 1.15 లక్షల కోట్లు వసూలు కాగా... మూడో త్రైమాసికంలో నెలవారీ సగటు బాగా పెరిగి రూ.1.30 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు 2020 డిసెంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 6% వృద్ధితో తెలంగాణలో రూ.3,760 కోట్లు, –2% తగ్గుదలతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,532 కోట్లు వసూళ్లయ్యాయి. చదవండి: గడువు(డిసెంబర్ 31)లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది? -
ఆ ఇంట్లో ఎటుచూసినా సెల్‌ఫోనే!:కొట్టేసినవి కాదు.. కొన్నవే
ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్. ఎదుటివాళ్లు మాట్లాడేది పట్టించుకోకుండా అందులోనే ముఖం పెట్టేయడం. స్మార్ట్‌ఫోన్ ధ్యాసలో తిండి, నిద్రకు దూరం.. ఇవన్నీ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇక్కడో పిచ్చోడు ఫోన్‌కు అడిక్ట్ కాలేదు. కానీ, ఫోన్ల కలెక్షన్లతో తన ఇంటిని నింపేసుకుంటూ పోతున్నాడు. కప్‌బోర్డులు, బెడ్రూం, కిచెన్ డబ్బాల్లో.. ఆఖరికి కారును కూడా ఫోన్లతోనే నింపేశాడు. ఇదంతా ఎందుకని అడిగితే ఓ ప్రత్యేక కారణం ఉందని చెప్తూ పోయాడు. ‘నా పేరు జయేష్ కాలే. ముద్దు పేరు మిస్టర్ నోకియా. వయసు 35 సంవత్సరాలు. ఓ కంపెనీలో డిజైన్ హెడ్‌గా పని చేస్తున్నాడు. ఉండేది ముంబై(మహారాష్ట్ర) థానేలో ఓ అపార్ట్మెంట్లో. ప్రస్తుతం నా కలెక్షన్స్‌లో 3,500 హ్యాండ్సెట్స్ ఉన్నాయి. వీటి కోసం 20 లక్షల దాకా ఖర్చు చేశా. వర్కింగ్ కండిషన్ ఫోన్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కే ప్రయత్నం చాలా క్రితమే చేశా. కానీ, ఇప్పటికైతే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరెక్కింది. మీ వరకు ఇవి ఫోన్ కలెక్షన్లు. కానీ, నా వరకు ఇవి చంటిపాపలు. మీకు తెలిసి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నా దృష్టికి తెండి’ అంటూ వాటిని లెక్కపెట్టుకుంటూ ఉండిపోయాడు జయేష్. ఆ ఘటన తర్వాత.. చదువుకునే రోజుల్లో జయేష్ ‘నొకియా 3310’ మోడల్ ఫోన్ వాడేవాడు. ఓరోజు రెండో అంతస్థు నుంచి అది కిందపడిపోయిందట. భయంతో కిందకు పరిగెత్తి చూస్తే.. ఫోన్ పార్ట్ పార్ట్‌లుగా పడి ఉందట. అయినా కూడా ఫోన్ కండిషన్లోనే పని చేసేసరికి అతను ఆశ్యర్యపోయాడట. ‘ఆ ఘటనతో నోకియాకు వీరాభిమానిగా మారిపోయా’ అంటాడతను. అందుకే అతని దగ్గర ఉన్న కలెక్షన్లలో చాలావరకు నోకియా హ్యాండ్‌సెట్లే ఉన్నాయి. ఐదు నుంచి ఆరేళ్ల కష్టపడి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి హ్యాండ్సెట్లు తెప్పించుకున్నాడు. మాగ్జిమమ్ ఫీచర్ ఫోన్ తాలుకావే. చాలావరకు రేర్ పీసులు. వీటిలో ఎక్కువ వర్కింగ్ కడింషన్లో గనుక ఉండిఉంటే ఈపాటికే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేవాడే. కానీ, చాలావరకు పని చేయడం ఆగిపోయాయి. కొన్నింటికి యాక్సెసరీస్ దొరకట్లేదు. అందుకే లిమ్కా బుక్ రికార్డుతో సరిపెట్టుకున్నాడు. భార్య కోపం.. పిచ్చోడు అనుకున్నారట జయేష్ కాలేకి చాలా కాలం క్రితమే నోకియా మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ దక్కింది. ఫోన్ల కోసం ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాడతను. ఇదంతా చూసి ఇంట్లోవాళ్లు తెగ తిట్టారు. భార్య చాలా రోజులు మాట్లాడడమే మానేసిందట. బంధువులు, స్నేహితులు అతనికి ‘ఫోన్ పిచ్చోడు’ అనే ముద్ర వేశారు. కానీ, జయేష్ వాటన్నింటిని నవ్వుతూ స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతని లక్క్ష్యం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కడం కాబట్టి. అప్పటిదాకా వీలైనన్ని ఎక్కువ ఫోన్లను సేకరించి తీరతానని అంటున్నాడతను. పాత వీడియో చదవండి: భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు.. -
క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను ప్రారంభించిన రిలయన్స్ జ్యువెల్స్..!
భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్‌గా పేరొందిన రిలయన్స్ జ్యువెల్స్ సరికొత్త క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను విడుదల చేసింది.వీటిలో హ్యాండ్‌క్రాఫ్టెడ్, హెరిటేజ్ గోల్డ్, డైమండ్ ఆభరణాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కలెక్షన్ వివాహ వేడుకలకు మాత్రమే కాకుండా నిశ్చితార్ధం, సంగీత్, మెహెందీ, రిసెప్షన్ లాంటి అనేక ఇతర వేడుకలకు సరిపోతాయని రిలయన్స్ జ్యువెల్స్ పేర్కొంది. #SampannVivah థీమ్‌తో వెడ్డింగ్ సీజన్స్‌కు రిలయన్స్ జ్యువెల్స్ సన్నాహమైంది. ఈ నూతన ఆభరణాల శ్రేణితో కాబోయే నవవధువుల జీవితాల్లో సౌభాగ్యం, సంతోషాలు లభించాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా వివాహ కలెక్షన్లను రిలయన్స్ జ్యువెల్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేక వివాహ ఆఫర్‌ను డిసెంబర్ 23 వరకు అందించనుంది. ఈ ఆఫర్లో భాగంగా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు సౌకర్యాన్ని అందించనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ...క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్‌తో ప్రతి ఒక్క వధువు వైవాహిక జీవితం సంతోషంగా, వైభవంగా సాగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. భారత వారసత్వ, కళారూపాలు ఉట్టిపడేలా సమకాలీన హ్యండ్క్రాఫ్డ్ డిజైన్స్ ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన కలెక్షన్లను దేశవ్యాప్తంగా విస్తరించిన అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్‌తో పాటుగా, కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చునని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త! -
ఫ్యాబ్ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ
సాక్షి, ముంబై: పాపులర్ డిజైనర్ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా వివాదంలో చిక్కుకుంది. రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్‌పై దుమారం రేగింది. ప్రేమకు, కాంతికి చిహ్నమైన దీపావళికి పండుగకు స్వాగతం. జష్న్-ఇ-రివాజ్ పేరుతో ఫ్యాబ్ ఇండియా తీసుకొస్తున్న దీపావళి కలెక్షన్, భారతీయ సంస్కృతికి అందమైన సేకరణ అంటూ దీపావళి కలెక్షన్ యాడ్‌ను ట్వీట్ చేసింది. ఇదే ఇపుడు వివాదాస్పదమైంది. (Meghana Raj :ఇంతకంటే మంచి సమయం లేదు: మేఘన) రాబోయే దీపావళి పండుగ గురించి చేసిన ప్రకటనలో తమ కలెక్షన్‌ను 'జష్న్-ఇ-రివాజ్' గా బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల స్పందనతో వివాదాస్పదమైంది. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫలితంగా కంపెనీ తన అసలు ట్వీట్‌ను తొలగించింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ట్విటర్లో ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఒ టీవీ మోహన్ దాస్ పై కూడా విమర్శలు గుప్పించడం గమనార్హం. మరోవైపు ఆ యాడ్‌లో తప్పేమీ లేదు. దయచేసి వివాదం సృష్టించ వద్దు అంటూ కొంతమంది ప్రముఖులు, ఇతర నెటిజన్లు కోరుతున్నారు. (Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత) Deepavali is not Jash-e-Riwaaz. This deliberate attempt of abrahamisation of Hindu festivals, depicting models without traditional Hindu attires, must be called out. And brands like @FabindiaNews must face economic costs for such deliberate misadventures. https://t.co/uCmEBpGqsc — Tejasvi Surya (@Tejasvi_Surya) October 18, 2021 Maan you do not get it! Use of Alien terms for a Hindu festival is a deliberate attempt to take away our heritage and subvert it! You can use any brand name you want post Diwali but at this time,linking it to Diwali shows a perverted mindset! @sankrant https://t.co/N1HRNPjHIc — Mohandas Pai (@TVMohandasPai) October 18, 2021 Hello @FabindiaNews , You have named your company as Fab India but don't even know how Indians dress up during Diwali . You call your collection traditional but forgot traditions of India. pic.twitter.com/xJP7KmsV4H — Superstar Raj 🇮🇳 (@NagpurKaRajini) October 18, 2021 -
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం.. ‘టిక్లింగ్ టేల్స్’
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం కథ. పిల్లల మెదళ్లను చురుగ్గా మార్చగలిగే సాధనం కథ కానీ, ఈ డిజిటల్ యుగంలో యంత్రాలతో కుస్తీ పడే పిల్లలకు కథ చేరువలో లేదు.నాయనమ్మ, తాతయ్య లేని చిన్న కుటుంబాలు.సంపాదనలో తల్లీదండ్రులవి తీరికలేని క్షణాలు. ఇలాంటి లోకంలో పిల్లల మానసిక శక్తి గురించి ఆలోచించారు డాక్టర్ శ్వేత.టిక్లింగ్ టేల్స్ అంటూ పిల్లలకోసం కథల పందిరి అల్లుతున్నారు. రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన శ్వేత వృత్తిరీత్యా దంతవైద్యురాలు. తల్లి అయ్యాక మూడేళ్ల కొడుకు తను ఏం చెప్పినా ‘ఊ..’ కొట్టే విధానం ఆమెను కట్టిపడేసింది. ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం గల ఆ చిన్న వయసు ‘కథ చెప్పవూ’ అని అడుగుతున్నట్టుగా అనిపించేది’ అంటారు శ్వేత. ఆ ఆలోచనే ఇప్పుడు వేలాది మంది పిల్లలకు కథలు చెప్పేలా చేసింది అంటారామె. అక్కణ్ణుంచే ‘టిక్లింగ్ టేల్స్’అంటూ లిటిల్ స్టార్స్‌కి కథల పందిరి వేస్తోంది. తల్లిదండ్రులకు కథలు చెప్పడంలో నైపుణ్యాలు చెబుతుంది. స్కూళ్లలో కథల వర్క్‌షాప్స్ నడుపుతోంది. పిల్లల పుట్టిన రోజులు, పాఠశాల వార్షికోత్సవాలు.. అది ఇది అని ఏమీ లేకుండా పిల్లలు ఎక్కడుంటే అక్కడ కథలతో దోస్తీ చేయిస్తుంది. రచయిత్రిగా, కథకురాలిగా, శిక్షకురాలిగా, కోచ్‌గా, టిక్లింగ్ టేల్స్ డైరెక్టర్‌గా డాక్టర్ శ్వేత అద్భుతమైన పాత్రలను పోషిస్తోంది. చదవని వారికి వినిపించే కథ ‘చిన్నతనం లో తల్లితో కలిసి భయం భయంగా లైబ్రరీకి వెళ్లిన తొలిరోజులను ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటుంది శ్వేత. అక్కడ తను చూసిన కథల పుస్తకాలు పఠనం పట్ల ఎలా ఆసక్తిని పెంచిందో చెబుతుంది. ఆ ఆసక్తే ఇప్పుడు ప్రతిభావంతులైన కథకుల బృందానికి నాయకత్వం వహించేలా చేసింది’ అంటోంది ఈ డాక్టర్. ‘బాగా చెప్పాలంటే బాగా చదవాలనే విషయాన్ని ఎప్పుడో గ్రహించాను. ఇప్పుడు పిల్లలను చూడండి. వారు ఎంతసేపూ వీడియో గేమ్స్ ఆడటమే చూస్తున్నాం. కథల పుస్తకాలు చదవడం అనేదే మనం చూడటంలేదు. ఈ తరం ఎక్కడికి వెళుతుందో అనే ఆందోళన నాది. నా కొడుకుతో కాసేపు సమయం గడిపినా వాడిని కథల్లోకి తీసుకెళ్లిపోతాను. నేను చదివిన విషయాలన్నీ వాడికి కథలుగా మార్చి చెబుతుంటాను. వాడిపై ఆ కథల ప్రభావం, ఫలితాన్ని చూసినప్పుడు తల్లిగా నా ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్ధమైంది. అప్పుడే మా ఇంటి నాలుగు గోడలు దాటి కథలు వినే పిల్లల సంఖ్య పెరగాలన్న విషయం గ్రహించాను. ఎక్కువమంది పిల్లలకు కథలు వినసొంపుగా చెప్పాలంటే నేను మరిన్ని పుస్తకాలతో ప్రేమలో పడాలి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఇంట్లో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైనా తల్లితండ్రులు ఈ సూత్రాన్ని పాటించవచ్చు’ అంటారు డాక్టర్ శ్వేత. ఈ కథాస్టార్ బృందంలో ఆరుగురు కథలు చెప్పే ప్రతిభావంతులైన తల్లులు ఉన్నారు. ఈ బృందం రేపటితరానికి కథలతోఎలాంటి మార్గం వేయాలో సమావేశాలు ఏర్పరచుకుంటారు. తాము చేయబోయే, చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. కథా ప్రపంచంలోకి ప్రయాణం ‘టిక్లింగ్ టేల్స్’ అంటూ కథలు చెప్పడం 2013 లో ప్రారంభించింది డాక్టర్ శ్వేత. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదామె. టిక్లింగ్ టేల్స్ ముఖ్య ఉద్దేశం పాఠకులను పెంచడం, పిల్లలను తిరిగి పుస్తకాల లోకంలోకి తీసుకురావడం, వారిని చదివించేలా చేయడం, కథ చెప్పే సెషన్ల తోపాటు, ఉపాధ్యాయులతో శిక్షణా కార్యక్రమాలు, పాఠశాల సెషన్లు ఏర్పాటు చేయడం వంటివీ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కథ ‘కథలు వినడం ప్రతి బిడ్డ జన్మహక్కు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మనసు కూడా హెల్దీగా ఉండాలి. అందుకు ప్రతి బిడ్డకు మంచి ఆలోచన విధానం కలిగించాలి. కథలు ప్రతి బాల్యంలో అంతర్భాగం గా మారాలి. ఇంట్లో ఒక మేధావిని పెంచాలనుకుంటే ఆ బిడ్డకు అద్భుత కథలు చెప్పాలి. అలాగని ఉనికిలో లేని విషయాల గురించి చెప్పకూడదు. కథ ద్వారా ఏది మంచిది, ఏది మంచిది కాదనేది వారికి తెలిసిపోవాలి. కథలు చెప్పేటప్పుడు పిల్లలను తక్కువ అంచనా వేయవద్దు..’ అంటూ తల్లిదండ్రులకు, టీచర్లకు తన వర్క్‌సెషన్ల ద్వారా వివరిస్తారు డాక్టర్ శ్వేత. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టిక్లింగ్ టేల్స్ వర్చువల్ ప్లానెట్ వెంచర్ ద్వారా కథా శ్రవణాన్ని అందిస్తోంది. పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటంతోపాటు మ్యూజిక్‌తో కూడిన ఆడియో కథలనూ జతచేసి ఇస్తున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఆసక్తికరంగా ఆడియో కథల పుస్తకాల ద్వారా పదాల ఉచ్చారణ, పఠనం, శబ్దాన్ని నేర్పుతున్నారు. పిల్లలు కథను గుర్తుకు తెచ్చుకోవడానికి, తిరిగి ఆస్వాదించడానికి దేశవ్యాప్తంగా పప్పెట్ షోలను కూడా నిర్వహిస్తాం’ అని చెబుతున్నారు ఈ డాక్టర్. -
డ్యూక్ నయా కలెక్షన్ అమేజీంగ్..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్.. డ్యూక్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 2021’ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయ ఫ్యాషన్ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుంటూనే, స్వావలంభన, భారత్ భావాలకు అనుగుణంగా భారత్‌లో వీటిని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. టీషర్ట్స్, షర్ట్స్, డెనిమ్, ట్రౌజర్స్, టాప్స్, జెగ్గింగ్స్, యాక్టివేర్, స్పోర్ట్స్‌వేర్, యాక్ససరీస్, ఫుట్‌వేర్, వంటివి వీటిలో ఉన్నాయి. ధరల శ్రేణి రూ.425-2,499 వరకూ ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది? -
అగ్గిపెట్టె కళ.. ప్రపంచ చరిత్ర చూపుతూ
చీకటింట వెలుతురుకు జన్మనివ్వడమే కాదు గత వైభవ కాంతినీ కళ్లకు కడుతుంది అగ్గిపెట్టె. నమ్మకం కుదరకపోతే అఖంఢ భారతావనితో పాటు ఖండాంతర ఖ్యాతిని కళ్లకు కట్టే ఈ మ్యాచ్ బాక్స్ లోగోలను ఒకసారి తిలకించండి. అమితాబ్ బచ్చన్ కూలీ సినిమా నుంచి టాటా నానో వరకు ఆసక్తి కథనాలను మ్యాచ్బాక్స్ లోగోలతో పరిచయం చేస్తాను రండి.. అంటూ ఆహ్వానిస్తోంది శ్రేయ కాటూరి. సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘ఆర్ట్ ఆన్ ఎ బాక్స్’ శ్రేయకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. మ్యాచ్ బాక్స్ ద్వారా ప్రపంచ చరిత్రను విశ్లేషణాత్మకంగా చూపుతూ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అగ్గిపెట్టె కథలు ఢిల్లీలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల శ్రేయ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా అనుకోకుండా వివిధ దేశాల ప్రసిద్ధ సంస్కృతులకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా వినూత్నంగా తను అప్పటికే అలవాటుగా అప్పుడప్పుడు సేకరించిన మ్యాచ్బాక్స్లపై ఆమె దృష్టి పడింది. ఆ దృష్టి కోణం ఆమెను వినూత్నంగా ఆలోచింపజేసింది. ఆ ఆసక్తి వివిధ దేశాలకు సంబంధించిన 5,000 మ్యాచ్ బాక్స్ లోగోలను సేకరించి, శోధించి, విశ్లేషించేంతగా మారింది. అగ్గిపెట్టెల లోగో రూపకల్పనలో ఉన్న కథలను తెలుసుకుంటున్నకొద్దీ ఆమెకెన్నో విషయాల మీద అవగాహన పెరిగింది. ఈ విషయాలను పంచుకోవడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సరైన వేదికగా భావించింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘ఆర్ట్ ఆన్ ఎ బాక్స్’ పేరుతో అగ్గిపెట్టెల కథలు మొదలుపెట్టింది. రంగురంగుల లేబుళ్ల సాక్ష్యం.. ప్రిన్స్ చార్లెస్ పెళ్లి వంటి ముఖ్యమైన చారిత్రక సంఘటనను స్మరించుకునే అగ్గిపెట్టె లేబుల్ కూడా శ్రేయ సేకరణలో ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత త్రివర్ణ పతాకం, అశోకచక్రం వంటి జాతీయ చిహాలు, స్వాతంత్య్ర సమరయోధులను కూడా మ్యాచ్బాక్స్లపైన చిత్రీకరించినవి ఉన్నాయి. ఆమె పరిశోధన అక్కడితో ఆగలేదు. అగ్గిపెట్టెల లోగోల కళను అర్థం చేసుకోవడంపై మరింతగా దృష్టి సారించింది. ‘‘సామాజిక దృక్కోణంలో అగ్గిపెట్టెల గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. మతం, లింగ భేదం, దేశం ఇలా మూడు డొమైన్లను కేంద్రంగా ఉపయోగించి మ్యాచ్బాక్స్ల వెనుక ఉన్న కథలను పునర్నిర్మించాను. అందులో లేబుళ్లదే అసలైన ప్రాధాన్యత’’. అంటుంది. సంస్కృతుల అవగాహన ఈ పరిశోధన పూర్తి చేయడానికి ఏడాదికి పైగానే పట్టింది. చాలా ఆసక్తిగా అనిపించింది. వేల మ్యాచ్బాక్స్లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలవీ నా దగ్గర ఉన్నాయి. భారతదేశంలో అగ్గిపెట్టెలను అధ్యయనం చేసిన తరువాత, మతపరమైన చిహ్నాలను దైవిక ఐకానోగ్రఫీ రూపంలో ఉపయోగించడంలో నిరంతరం కృషి జరిగిందని తెలుసుకున్నాను. స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చినవి, జాతీయవాద స్ఫూర్తిని పెంచినవి.. ఒక్కోటి తెలుసుకుంటూ వెళితే ఆ ప్రయాణం అత్యంత అద్భుతంగా అనిపించింది స్త్రీని వస్తువుగా చూపిన కాలం 90 లలో లోగోలు బ్రాండ్ల వంటి వినియోగదారు ఉత్పత్తులను బట్టి మ్యాచ్బాక్స్ లేబుల్స్ మార్చారు. మరొకటి లింగ ప్రాతినిధ్యం పరంగా ఉంది. ఇది పితృస్వామ్య ఆధిపత్య శ్రేణులదని గమనించాను. నేను చూసిన ఒకే ఒక లేబుల్ పి.టి. ఉష మాత్రమే. ఎప్పుడూ పెళ్లికూతురు, బాలీవుడ్ ప్రముఖ తారల బొమ్మలు. మహిళలను ఎలా చిత్రీకరిస్తారనే దానిపైన నిర్వచనం సంవత్సరాలుగా మారనేలేదని స్పష్టమైంది. సాంకేతిక పరంగా చూస్తే మైక్రోసాఫ్ట్, ఆపిల్, కింగ్‌ఫిషర్ వంటి బ్రాండ్లు ఎలా అభివృద్ధి చెందాయో అగ్గిపెట్టెల లోగోలు చూపాయి. సాధారణ ఇతివృత్తాలు జంతువులు, మొక్కలు, పక్షులు, రేడియోలు, కార్లు .. వంటివి మ్యాచ్బాక్స్లలో ఉన్నాయి. నా స్థాయిలో నేను నా ప్రాజెక్ట్ ద్వారా ప్రజలను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు కొన్ని విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. అగ్గిపెట్టె కళ ద్వారా మహిళల చిత్రాల చిత్రణ నిర్వచనాన్ని మార్చలేమా? అన్నదే నా ప్రశ్న. మహిళల చిత్రాలను రైతులు, ఉపాధ్యాయులు లేదా వ్యోమగామిగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది స్ఫూర్తిదాయకమైన మహిళలు వివిధ రంగాలలో అసాధారణమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దేశాల మధ్య వైరుధ్యం వివిధ దేశాల నుండి అగ్గిపెట్టెల నమూనా లో ఖచ్చితంగా పెద్ద తేడా ఉంది. నేను సేకరించిన మ్యాచ్బాక్స్ల గరిష్ట సంఖ్య అమెరికా, భారత్. అమెరికాలోని బార్లు, రెస్టారెంట్ల నుండి కొన్ని సేకరించాను. వాటి డిజైన్ బ్రాండ్ ఆధారితమైనవి. అమెరికా మ్యాచ్‌బాక్స్‌లు అక్కడి చరిత్రలో 60 నుంచి 80 ల మధ్య కాలంలో ప్రత్యేకంగా ప్రింటింగ్ కంపెనీలు, హోటళ్ళు, రెస్టారెంట్ల కోసం ప్రకటనల సాధనంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జాతీయవాద భావాలను ప్రేరేపించడానికి బాగా ఉపయోగ పడ్డాయి. ఇతర దేశాల విషయానికొస్తే స్వీడన్ అగ్గిపెట్టెల డిజైన్ భిన్నంగా ఉంటుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, రష్యా, చైనా అగ్గిపెట్టెలు కొన్ని ఉన్నాయి. సమాజాన్ని మార్చేవిధంగా లోగో.. మిగతా కాలాలతో పోల్చితే 90ల కాలంలోనే కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఆ వ్యత్యాసాన్ని అధ్యయనం చేయడం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. సిండ్రెల్లా, చోటా భీమ్ చిత్రాలు కూడా ఆ లోగోల్లో ఉన్నాయి. చూడటానికి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అగ్గిపెట్టెలు ప్రధానంగా ఎరుపు, పసుపు, నారింజ రంగులను ఒక నమూనాగా ఉపయోగించారు. ఇవి అగ్నిని సూచించడమే కారణం. ఈ కళలో ప్రఖ్యాత మహిళల చిత్రాలను, సమాజం భావనను మార్చేవిధంగా, మహిళల ప్రస్తుత ఆత్మస్థైర్య చిత్రాలను మార్చాలని కోరుకుంటున్నా’’ అని వివరిస్తుంది శ్రేయ. -
జీఎస్టీ.. వసూళ్లు భేష్
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో రాష్ట్రం మెల్లిగా పురోగమన బాటపట్టింది. కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.32,671.62 కోట్ల జీఎస్టీ వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, కరోనా కారణంగా రాబడులు తగ్గి పోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(2020, ఏప్రిల్) నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలపాటు జీఎస్టీ వసూళ్లు మందగించాయి. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజల వినియోగ సామర్థ్యం తగ్గిపోవడం, ఆశించిన మేర వ్యాపారాలు లేకపోవడమే దీనికి కారణాలు. అయితే, సెప్టెంబర్ తర్వాత రిటర్నుల దాఖలు పెరగడం, మార్కెట్లు కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడంతో తొలిసారి గత ఏడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.3 వేల కోట్లు దాటింది. డిసెంబర్లో రూ.3,543 కోట్ల జీఎస్టీ రాబడులు రావడంతో ఈ రంగం గాడిలో పడిందని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ, ఈ పురోగతి ఏయే రంగాల్లో జరిగిందన్న దానిపై వాణిజ్య పన్నుల శాఖ పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సి ఉంది. ఔషధ రంగమే సింహభాగం.. ఈ ఏడాది జీఎస్టీ రాబడుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔషధ రంగంలో మంచి వృద్ధి కనిపిస్తోందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శానిటైజర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ఆక్సీమీటర్లు, బీపీ, షుగర్ తనిఖీ పరికరాలు, థర్మామీటర్లు, ఆవిరి పట్టే యంత్రాలు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయని, ఇప్పుడు ఈ అమ్మకాలకు సంబంధించిన రిటర్నులన్నీ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయని అంటున్నారు. వీటికితోడు ఎలక్ట్రానిక్స్ రంగం ఈ ఏడాది మంచి వృద్ధి సాధిస్తుందని కూడా తెలుస్తోంది. పాఠశాలలు నడవకపోవడంతో రాష్ట్రంలోని కోట్లాదిమంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులే శరణ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల అమ్మకాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజారవాణా వ్యవస్థ కొన్నాళ్లపాటు పూర్తిగా స్తంభించిపోవడం, ఆ తర్వాత ప్రజారవాణాను వినియోగించుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది. ఈ నేపథ్యంలో గత ఆరుమాసాలుగా కార్లు, బైకులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని, వీటి రిటర్నులు కూడా భారీగానే దాఖలవుతున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేసింది. రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో నిర్మాణ కార్యకలాపాలు కూడా మెరుగుపడ్డాయని, సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్ వినియోగం పెరిగిందని, ధరలు కూడా అదేస్థాయిలో పెరగడంతో పన్నులు ఎక్కువగా వస్తున్నాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు. లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ కొనుగోళ్లే ఎక్కువగా జరిగాయని, పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా పోయిందని, అందుకే మూడు నెలలుగా జీఎస్టీ రిటర్నుల లావాదేవీల సంఖ్య కూడా పెరుగుతోందని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కిచెన్ వస్తువుల అమ్మకాల్లో కూడా గణనీయ వృద్ధి కనిపిస్తోందని తెలుస్తోంది. ఐటీ సర్వీసులు, బంగారం అమ్మకాల్లో పెద్దగా వృద్ధి లేకపోయినా ఆయా రంగాలు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లో జీఎస్టీ రాబడులు మరింత పుంజుకుంటాయని, రూ.25 వేల కోట్ల వరకు ఈ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల అధికారులు వెల్లడిస్తున్నారు. -
రిలయన్స్ ఆభర్ కలెక్షన్స్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ సంస్థ రిలయన్స్ జ్యువెల్స్ వార్షికోత్సవ కానుగా అద్భుతమైన కలెక్షన్స్‌ను లాంచ్ చేసింది. ‘‘ఆభర్’’ పేరుతో వినూత్న డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జ్యువెల్స్ తెలిపింది. ఒక దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌కు అండగా నిలిచిన వినియోగదారులందరికీ కృతజ్ఞతగా వి వోయూ (మేము మీకు రుణపడి ఉన్నాము ) థీమ్‌తో ఒక ప్రమోషన్ వీడియోను విడుదల చేసింది. కస్టమర్లకు కృతజ్ఞతను చాటేలా ఈ ప్రమోషన్ క్యాంపైన్‌ను స్కేర్క్రో ఎం అండ్ సీ సాట్చి డిజైన్ చేయడం విశేషం. 3-15 గ్రాములతో 54 ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ అందుబాటులో ఉంచింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ పై 24 శాతం, డైమండ్ జువెలరీ పై 30 శాతం తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఆస్టు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అలాగే కోవిడ్-19కు సంబంధించిన భౌతిక దూరం లాంటి అన్ని మార్గదర్శకాలతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. ఆధునిక మహిళల అభిరుచులకు తోడుగా, ఆశ, వెలుగులు నింపేలా లాంతర్ల స్ఫూర్తితో డిజైన్లను రూపొందించినట్టు తెలిపింది. కఠినమైన సమయాల్లో వారి మద్దతు ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
లైబ్రరీ ఫోటోలు పోస్ట్ చేస్తే పెళ్లి ప్రపోజల్స్!
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గలేదు. ట్విటర్లో తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్ చేసిన షౌమిక్ అనే యూజర్‌కు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువెత్తాయి. ‘నేనేంటో తెలియని వారి కోసం...నేను లైబ్రరీలో నివసిస్తున్నా’ అంటూ తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్ చేసిన షౌమిక్కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ ఫోటోల్లో ఒక చోట స్టడీ కమ్ వర్క్ డెస్క్ ఉండగా, మరో మూల కుర్చీ కనిపించాయి. వేలాది బుక్స్ మధ్య డెస్క్, కుర్చీ ఉన్న ఫోటోలు అమితంగా ఆకట్టుకున్నాయి. చదవండి : ఒక్కో బుక్... ఒక్కో కిక్ ఈ ట్వీట్‌ను షౌమిక్ పోస్ట్ చేయగానే పుస్తక ప్రియులు అతను విస్తారంగా చేపట్టిన పుస్తక సేకరణ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు 8000కు పైగా లైక్స్ దక్కగా పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతడి పుస్తక అభిరుచిని అభినందించగా, మరికొందరు అతడి రూమ్మేట్గా ఉంటామన్నారు. అంతేకాదు..షౌమిక్ పుస్తక కలెక్షన్‌కు మెచ్చి పలువురి నుంచి ఆయనకు పెళ్లి ప్రతిపాదనలూ అందాయి. ఇక తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన రావడంతో ఉద్వేగానికి గురైన షౌమిక్ ఇవి తాను సేకరించిన మొత్తం బుక్స్‌లో 75 శాతమని, తన వద్ద 8000కు పైగా బుక్స్ ఉన్నాయని మరో ట్వీట్ చేశారు. -
కరోనా ఎఫెక్ట్ : జీఎస్టీ వసూళ్లు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సంక్షోభంతో జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పన్ను వసూళ్లు జూలై మాసంలో 87,422 కోట్ల రూపాయలకు పడిపోయాయి. గత ఏడాది (జూలై 2019) ఇదే కాలలో 1.02 లక్షల కోట్లను రాబట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 14.36 శాతం క్షీణించింది. జూన్ నెలలో 90,917 కోట్ల రూపాయలతో పోలిస్తే జూలైలో వసూలు 3.84 శాతం క్షీణించింది. (అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు) 2020 జూలైలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం, 87,422 కోట్ల రూపాయలు. ఇందులో సీజీఎస్టీ 16,147 కోట్లు, ఎస్జీఎస్టీ 21,418 కోట్లు, ఐజీఎస్టీ 42,592 కోట్లు, సెస్ 7,265 కోట్లుగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 86 శాతం అని పేర్కొంది. గత నెలలో వచ్చిన ఆదాయాలు ప్రస్తుత నెల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2020 లకు సంబంధించిన పన్నులను జూన్ నెలలో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు చెల్లించారని పేర్కొంది. అలాగే 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు 2020 సెప్టెంబర్ వరకు రిటర్నులను దాఖలు చేసేందుకు సడలింపు ఉన్న విషయాన్ని గమనించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. (వాహన కొనుగోలుదారులకు ఊరట) -
రిలయన్స్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్స్, స్పెషల్ ఆఫర్ కూడా
సాక్షి, హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్ నూతన సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చిన వినూత్న ఆభరణాల ఆఫర్‌ను హాలిడే కలెక్షన్స్ పేరుతో కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను తీసుకొచ్చింది. అత్యధ్బుతమైన హస్తకళా నైపుణ్యాన్ని జోడించి ‘బెల్లా ది హాలిడే కలెక్షన్’ పేరుతో సరికొత్త, సమకాలీన స్టైలిష్ ఆభరణాలను ప్రారంభించింది. రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, డైమండ్ కేటగిరీల్లో స్పెషల్ నెక్లెస్‌లను, బ్రాస్లెట్లను లాంచ్ చేసింది. అధునాతన డిజైన్, స్టయిల్‌తో తమ బెల్లా కలెక్షన్ ఆకట్టుకుంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. తమ బెల్లా ఆభరణాలకు వినియోగదారులనుంచి మంచి ఆదరణ లభిస్తుందనే విశ్వాసాన్ని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రూ. 5 వేల నుంచి ఇవి లభ్యమని చెప్పారు. అలాగే అందమైన డైమండ్ లైన్ బ్రాస్లెట్స్ రూ .69,999 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక ధరలో లభిస్తాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది. బంగారు ఆభరణాలపై 20 శాతం, డైమండ్ ఆభరణాలపై 20 శాతం మేకింగ్ చార్జీలపై డిస్కైంట్ లభ్యం. ఈ ఆఫర్ 16 వ తేదీ ఫిబ్రవరి 2020 వరకు చెల్లుతుంది. వందకు పైగా నగరాల్లో 200 పైగా స్టోర్లతో సేవలను అందిస్తున్న రిలయన్స్ జ్యువెల్స్ త్వరితగతిన విస్తరిస్తోంది. రిలయన్స్ జ్యువెల్స్ బ్రాండ్ 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలను మాత్రమే అందిస్తోంది. -
కొత్త ‘లెక్కలు’ పంపండి!
సాక్షి, హైదరాబాద్: జనాభా లెక్కల సేకరణకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. 2021 జనాభా లెక్కల కోసం వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల అనంతరం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పునర్విభజనకు సంబంధించిన సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర జనగణన వ్యవహారాల డైరెక్టర్ ఇలంబర్తి లేఖ రాశారు. 2011 అనంతరం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన నేపథ్యంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో రెండు జిల్లాల కేంద్రాలు, 58 మండలాలు, 460 గ్రామాల పేర్లు కనిపించకుండా పోవడం, కొన్ని పేర్లు మార్పులు జరగడం వంటి వాటిని గుర్తించిన∙కేంద్ర జనగణనశాఖ డైరెక్టర్.. పొరపాటున మాయమైతే వెంటనే నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. 2018 జనవరి 1 నుంచి మారిన గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లాల సరిహద్దులను గుర్తించి 2019 అక్టోబర్ 31 వరకు విడుదల చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ల కాపీలను కూడా పంపాలని ఆదేశించారు. -
‘వెదురు’ లేని అక్రమాలు
సాక్షి, రుద్రవరం(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు సేకరణ ప్రక్రియ సెప్టెంబరులో మొదలయ్యింది. లాగింగ్ (కలప డిపో) సిబ్బంది రుద్రవరం, చెలిమ అటవీ రేంజ్ పరిధిలోని ఎనిమిది కూపుల్లో శ్యాంపిల్ ప్లాట్లు వేయించారు. ఆ నివేదికల ఆధారంగా నంద్యాలలో డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో కూపు నుంచి వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు (కలప డిపోకు తరలించడం), గ్రేడింగ్ అనే మూడు అంశాలకు సంబంధించి మొత్తం ఎనిమిది కూపులకు గాను 24 టెండర్లు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి టెండర్లను ఏకపక్షంగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. గత ఐదేళ్లూ వెదురు సేకరణలో అక్రమాలకు పాల్పడిన వీరు..ఈసారి కూడా రంగంలోకి దిగడం గమనార్హం. నిబంధనలు గాలికి.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూలీలతో వెదురు సేకరించి డిపోలకు తరలించాలి. ఉదాహరణకు రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం కూపులో వెదురు సేకరణ టెండరును శంకర్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టరే సదరు కూపులో వెదురు సేకరించాలి. అక్కడ సేకరించిన వెదుర్లను చెన్నయ్య అనే రవాణా కాంట్రాక్టర్ తన వాహనంలో రుద్రవరం కలప డిపోకు తరలించాలి. ఈ రెండు పనులకు సంబంధించి ఒక్కో వెదురుపై ప్రభుత్వం రూ.5 చొప్పున చెల్లిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. నేరుగా వ్యాపారులు ఎవరికి వారుగా కూలీలతో వెదుర్లను సేకరించుకుంటున్నారు. వెదురు గ్రేడింగ్‌ను బట్టి ఒక్కో దానిపై రూ.4.50 నుంచి రూ.11.50 వరకు కూలి చెల్లిస్తున్నారు. అనంతరం ఒక్కో వెదురుకు రూ.2 చొప్పున బాడుగ ఇచ్చి డిపోకు తరలిస్తున్నారు. అక్కడా కొంత సొమ్ము చెల్లించి గ్రేడింగ్ చేయించి లాట్లుగా పేర్చి వేలానికి సిద్ధం చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని కూపుల్లోనూ ఇదేవిధంగా జరుగుతోంది. వాస్తవానికి ఇందులో ఓ మతలబు ఉంది. వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు, గ్రేడింగ్ కాంట్రాక్టర్లు...వెదుర్లను వేలం పాడే వ్యాపారులు అందరూ ఒక్కరే. రుద్రవరం కలప డిపో పరిధిలో పది మంది, గాజులపల్లి (చెలిమ అటవీ రేంజ్) డిపో పరిధిలో మరో పది మంది దాకా వ్యాపారులు సిండికేట్ అయ్యి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వెదురు సేకరణ, వేలం పాటల్లో అంతా తామై వ్యవహరిస్తూ భారీఎత్తున అక్రమాలకు ఒడిగడుతున్నారు. వీరికి అధికారుల సహకారం కూడా ఉంటోంది. కొత్త వారిని దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర కంటే అధికంగా కూలీలకు ఇస్తూ సొంతంగా వెదుర్లను సేకరించుకుంటున్నారంటేనే అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కనుమరుగవుతున్న వెదుర్లు వేలానికి ముందు అటవీ అధికారులు అడవిలోకి వెళ్లే కూలీలకు వెదురు నరకడంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిదేమీ ఇవ్వకపోవడంతో కూలీలు వెదుర్లను అడ్డదిడ్డంగా నరికి వేస్తున్నారు. ఒక పొద నుంచి వెదురు సేకరించాలంటే భూమికి అడుగు ఎత్తు ఉంచి నరకాలి. అలాగే ఆ పొదలో ముదురు వెదుర్లు కనీసం ఐదు మిగిల్చాలి. అలా ఉంచక పోవడంతో ఆ వెదురు పొద పట్టు కోల్పోయి కూలిపోతోంది. ఇలా అడవిలో ఎక్కడ చూసినా కూలిన వెదురుపొదలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా దినదినానికి వెదురు ఉత్పత్తి తరిగి పోతోంది. కొరవడిన అధికారుల పర్యవేక్షణ వెదురు వేలం మొదలుపెట్టే ముందు కలప డిపో అధికారులు శ్యాంపిల్ ప్లాట్లు మేస్త్రీలతో వేయించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. టెండర్లు పూర్తయ్యి వెదురు సేకరణ ప్రారంభం కాగానే.. కూలీల వెంట ఉండి నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. కూపుల్లో వెదుర్లను సేకరించిన తర్వాత వాటిని వాహనంలోకి చేర్చే సమయంలో సదరు ఫారెస్టర్ వెదుర్ల సంఖ్యను లెక్కించి వాటికి అనుమతి పత్రం అక్కడే ఇవ్వాలి. అయితే వారు ఇళ్ల వద్ద ఉంటూ మేస్త్రీలను అడవికి పంపిస్తున్నారు. మేస్త్రీలు అడవి లోపలి నుంచి వాహనాలు బయటకు వచ్చే సమయానికి రోడ్లపైకి చేరుకుని.. కూలీలు చెప్పినన్ని వెదుర్లకు అనుమతి పత్రాలు ఇస్తున్నారు. -
తేలిన లెక్క..!
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మూగ జీవాల లెక్క తేలింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మా టిక్స్ సెంటర్ (ఎన్ఐఎస్) చేపట్టిన 20వ జంతు గణన జిల్లాలో పూర్తయింది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో 2018 సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే మొదటి తేదీ వరకు ఈగణనపూర్తి చేశారు. గతంలో 2011, 2012లో జంతు గణన చేయగా.. మళ్లీ ఇప్పుడు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గృహాల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లి ఎన్ని జంతువులు ఉన్నాయనే లెక్కలను తేల్చారు. ఈ గణన ప్రకారం జంతువులకు అవసరమైన వైద్యశాలలు, మందులు, ఇతర వసతులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరించనుంది. జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగినప్పటికీ కోళ్ల సంఖ్య తగ్గింది. జిల్లా వ్యాప్తంగా గల ఫౌల్ట్రీ పరిశ్రమ ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు కారణం. అలాగే కుందేళ్లు, గాడిదలు, గుర్రాల సంఖ్య తగ్గాయి. పెరిగిన గొర్రెలు, పశువులు.. జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, పశువులు, గేదెలు, మేకలు, కోళ్లు, పందులు, కుక్కలు, సీమకోళ్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. మాంసహార ప్రియులైన ప్రజలకు అవసరమైన మేకలు, గొర్రెలు, పందులు, సీమకోళ్ల సంఖ్య పెరిగింది. అలాగే పాల దిగుబడి కోసం గేదెలు, ఆవుల సంఖ్య కూడా పెరిగింది. 2012గణనతో పోల్చితే కోళ్లు, కుందేళ్లు, గాడిదలు, గుర్రాలు మినహా మిగతా జంతువుల సంఖ్య పెరగడం విశేషం. ఔత్సాహికవేత్తల ద్వారా సీమకోళ్లు, టర్కీకోళ్లు, పందుల పెంపకం పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగినప్పటికీ పశువుల సంఖ్య పెద్దగా తగ్గలేదు. 2011లో 98వేలు ఉన్న పశువులు ప్రస్తుతం 1,14,003కు పెరిగాయి. అలాగే పాడిగేదెలు 1.60 లక్షల నుంచి 1,73,181కి పెరగడం విశేషం. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో గొర్రెల సంఖ్య ఈ సంవత్సరం భారీగా పెరిగింది. 2011లో 4,50,000 ఉన్న గొర్రెలు ప్రస్తుతం 7,66,685కు పెరిగాయి. జిల్లాలోని నాన్ ఆయకట్టు ప్రాంతమైన ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని వర్షాధార మండలాల్లో ప్రస్తుతం తీవ్ర కరువు నెలకొంది. ఈ ప్రాంతాల్లో పాడిపై జనం పెద్ద ఎత్తున ఆధారపడి జీవిస్తున్నారు. గేదెలు, ఆవుల ద్వారా నిత్యం సుమారు లక్షకు పైగా లీటర్ల పాల ఉత్పత్తి చేయడం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటున్నారు. అయితే జిల్లాలో గతంలో చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో పెద్ద ఎత్తున ఫౌల్ట్రీ పరిశ్రమ ఉండేది. కరువు పరిస్థితులు, తీవ్రమైన ఎండ, నీటి ఎద్దడి పెరిగిన దాణా రేట్లతో ఫౌల్ట్రీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. యాదగిరిగుట్ట, కొలనుపాక, రాయగిరి ప్రాంతాల్లో గతంలో జట్కాలు (టాంగాలు) అధికంగా ఉండేవి. దీంతో గతంలో 512 గుర్రాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 381కి తగ్గింది. ఆటోలు రావడం, టాంగాలపై ఎక్కే వారి సంఖ్య తగ్గడం, వాటిపై ఆధారపడ్డ వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కోవడం, మరికొందరు ఆ వృత్తిని వదిలేయడం వంటి కారణాలతో గుర్రాల సంఖ్య తగ్గుతోంది. గాడిదల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇంటింటికి వెళ్లి లెక్కలు.. జిల్లాలో 2011లో 1,60,272 ఇళ్లలో జంతు గణన చేశారు. ప్రస్తుతం 1,80,263 ఇళ్లలో ఈగణన జరిగింది. ఇందుకోసం 25మంది సూపర్వైజర్లు 17 మండలాల్లో 68 మంది ఎన్యుమరేటర్లు ఎనిమిది నెలలుగా జంతుగణన చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గణనతో ఇవీ లాభాలు.. జంతు గణన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ధిష్టమైన లెక్క తెలుస్తుంది. ఆయా జంతువులకు కావాల్సిన దాణా, ఎండుగడ్డి, పచ్చిగడ్డి సేకరణతోపాటు జంతువులకు కాలానుగుణంగా వచ్చే జబ్బులకు అవసరమయ్యే మందులు సిద్ధం చేయడానికి ఈ లెక్క దోహదపడుతుంది. అలాగే సంచార, పశువైద్యశాలలు, ప్రస్తుతం ఉన్నవి సరిపోతాయా లేక మరిన్ని పెంచాలా అన్న విషయం తెలుస్తుంది. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మాంసం, పాల కోసం ఆయా జంతువుల సంఖ్య ప్రస్తుత లెక్కలకు అనుగుణంగా సరిపోతుందా మరింత పెంచాల్సిన అవసరం ఉందా వంటి విషయాలను శాస్త్రీయంగా పరిశోధించి అవసరమైన చర్యలను తీసుకుంటారు. మొత్తంగా బడ్జెట్లో జంతువులకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయింపులకు ఈసర్వే ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తయిన జంతు గణన జిల్లాలో జంతుగణన పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల జంతువుల వివరాలను సేకరించి లైవ్‌స్టాక్ సెన్సెస్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాం. వీటి ఆధారంగా ప్రభుత్వాలు నిధుల కేటాయిస్తాయి. గతంలో పోల్చితే కోళ్లు, గాడిదలు, గుర్రాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నందున గొర్రెలు, పాడి పశువుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. – మదన్‌కుమార్, జిల్లా పశువైద్యాధికారి -
రిలయన్స్ ‘అపూర్వం’ కలెక్షన్ : అక్షయ తృతీయ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ మరోసారి అద్భుతమైన కలెక్షన్స్‌ను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఇచ్చే రిలయన్స్ తాజాగా హస్తకళలు, ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు ప్రేరణగా జ్యుయల్లరీ రూపొందించింది. రానున్న అక్షయ తృతీయ సందర్భంగా ‘అపూర్వం’ పేరుతో టెంపుల్ జ్యుయల్లరీని ఆవిష్కరించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన హంపితో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలో ముఖ్యమైన, ప్రముఖ స్మారక చిహ్నాలు, వివిధ కట్టణాల సున్నితమైన వంపులు, శిల్పాలు ప్రేరణగా విభిన్నమైన కళాకృతులతో ఆభరణాలను రూపొందించింది. అక్షయ తృతీయ ఆఫర్ అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది రిలయన్స్ జువెల్స్. 2019 మే 7 వ తేదీ వరకు బంగారు ఆభరణాల మేకింగ్ చార్జీపై 25శాతం, వజ్రాల ఆభరణాలపై 25 శాతం తగ్గింపును అందిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హంపితోపాటు బేలూరులోని చెన్నకేశవ ఆలయం, ప్రసిద్ధ భువనేశ్వరి ఆలయం గోపురం, ఏనుగులు, గుర్రాలు, కమలం, ఆలయ ద్వారం వద్ద చెక్కిన దశావతారం ఇతర అనేక నృత్య రూపాల స్ఫూర్తిగా అతి క్లిష్టమైన డిజైన్లతో ఆభరణాలను తమ వినియోగదారులకోసం సిద్ధం చేశామని రిలయన్స్ జువెల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
వైఎస్ఆర్ అభిమాని.. నోటేశ్వరుడు
ఒక సామాన్యుడు వార్తల్లోకి వచ్చేదెప్పుడు? అసామాన్యమైన పని చేసినప్పుడు. వినూత్నంగా ఏదైనా చేసిప్పుడు. వైవిధ్యంగా ఆలోచించినప్పుడు. ఆలోచనను ఆచరణలో చూపించినప్పుడు. చెన్నారెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఇలాంటి అసామాన్య సామాన్యుడే. చిలకలూరి పేట ఆయనది. వైఎస్ఆర్ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. అందుకే చేతల్లో చూపించారు! ఆయన ఏం చెప్తున్నారో వింటే.. ఆయన ఏం చేశారో, ఏం చేస్తున్నారో తెలుస్తుంది. వైఎస్ఆర్ పుట్టినరోజు (8–7–1949) ‘‘నేను చదువుకున్నది తొమ్మిదో తరగతి. చిలకలూరి పేటలో చిన్న హోటల్ నడిపాను. పిల్లలు పెద్దయ్యారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘ఇన్నాళ్లు కష్టపడినది చాలు ఇక ఆ పని మానుకో’ అని పిల్లలు ఒత్తిడి చేయడంతో హోటల్ వ్యాపారం నుంచి బయటకొచ్చాను. నాలుగు ప్రదేశాలు చూసే అవకాశం అప్పుడు వచ్చింది నాకు. మూడేళ్ల కిందట స్నేహితుడితో బెంగుళూరు వెళ్లాను. అక్కడ ఒక ఎగ్జిబిషన్లో మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఒక స్టాల్ ఉంది. అందులో వాజ్‌పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయి. ఆ తేదీల అంకెలతో కూడిన కరెన్సీ నోట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. అక్కడ మనం కోరిన పది రూపాయల నోటు కావాలంటే మూడు వందలివ్వాలన్నమాట. అలాంటిది చూడడం అదే మొదటి సారి. నాకిష్టమైన వైఎస్ఆర్ జీవితంలో ఘట్టాల తేదీల కరెన్సీ నోట్లను సేకరించాలనిపించింది. కానీ ఆ తేదీలేవి నాకు కచ్చితంగా గుర్తు లేవు. అందుకుని మా పెళ్లి రోజు తేదీ, మనుమరాళ్ల పుట్టిన రోజుల తేదీలు వచ్చే కరెన్సీ నోట్లు కొనుక్కుని, ఎగ్జిబిషన నిర్వహకుల ఫోన్ నంబరు తీసుకుని మా ఊరికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్యమైన తేదీలను సేకరించ మొదలుపెట్టాను. వైఎస్ఆర్ పుట్టిన రోజు, పెళ్లి రోజు, తండ్రయినరోజు (జగన్ గారి పుట్టిన రోజు) తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు, పాదయాత్ర తేదీలు, రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తేదీలు, షష్టిపూర్తి తేదీ, చివరిగా ఆయన మనల్ని వదిలిపోయిన రోజును కూడా లిస్ట్ రాసుకుని ఆ నోట్లను తెప్పించుకున్నాను. పనిలో పనిగా ఆ మహానుబావుణ్ని నేను కలిసిన తేదీ కరెన్సీ నోటు కూడా. నర్సరావు పేటలో 2005, జూన్ 25వ తేదీన ఆయన్ని చూడగలిగాను. ప్రతి తేదీకి ఒక్కరూపాయి, ఐదు, పది, ఇరవై రూపాయల నోట్లను సేకరించాను. వై.ఎస్.జగన్ పుట్టినరోజు (21–12–1972) వైఎస్ఆర్ ఓ అధ్యయనం రాజశేఖరరెడ్డి గారి గురించి వివరాల కోసం ఒక అధ్యయనమే చేశాను. ఎన్ని వివరాలు సేకరించానో, వాటన్నింటినీ తేదీల ఆధారంగా పుస్తకంలో రాసుకున్నాను. వాళ్ల సొంతూరు బలపనూరుకెళ్లి వారి మూడు ఇళ్లనూ చూశాను. సమాధుల దగ్గరకెళ్లి వైఎస్ఆర్ తాతగారు వెంకట రెడ్డి, తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ పుట్టిన తేదీలు, పోయిన తేదీలు, ఇతర బంధువులు చిన కొండారెడ్డి, పురుషోత్తమ రెడ్డి, రత్నమ్మల వివరాలు కూడా సేకరించాను. అన్ని తేదీలను సేకరించడం ఒకెత్తయితే వైఎస్ఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కోసం పడిన ప్రయాస చిన్నది కాదు. నా దగ్గర ఆయన గురించిన పదకొండు పుస్తకాలున్నాయి. అవన్నీ ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తర్వాతి ఘట్టాలకు అక్షర రూపాలే. ఆయన తొలినాళ్ల గురించి తెలిసిన వాళ్లు పెద్దగా లేరు. తెలిసిన వాళ్లు కూడా విషయాలను చెప్పగలుగుతున్నారే తప్ప తేదీలను చెప్పలేకపోతున్నారు. దాంతో రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు ఏయే సంవత్సరాల్లో జరిగాయో తెలుసుకుని, ఆయన ఏ ఏడాది గెలిచిందీ తెలుసుకున్న తర్వాత లైబ్రరీలకెళ్లి పాత పేపర్లు వెతికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తేదీని (1978, మార్చి 15వ తేదీ) పట్టుకున్నాను. ఇంటర్నెట్లో ఏడాది ఉంది కానీ తేదీ లేదు. ఒకసారి దారి పట్టుకున్న తర్వాత ఇక నేను ఎక్కడా ఆగిపోలేదు. వైఎస్ తన గురువు వెంకటప్పయ్య పేరుతో స్కూలు కట్టిన తేదీ, ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రసంగించిన తేదీ, ఆయన ముఖ్యమంత్రిగా ప్రారంభించిన స్కీముల తేదీలతో సహా ప్రతి ఘట్టాన్ని ఫైల్ చేశాను. నా దగ్గరున్న కరెన్సీ నోట్ల ఆల్బమ్ తిరగేస్తే... ఆ మహానుభావుడి జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. వైఎస్ఆర్ పెళ్లిరోజు (9–2–1972) ముగ్గురు నడిచిన నేల నాకు వైఎస్ఆర్ పాదముద్రలే కాదు, తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన పిల్లలన్నా అంతే అభిమానం. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన మీద వైఎస్ఆర్ నడిచిన తేదీ, షర్మిలమ్మ నడిచిన తేదీ, జగన్మోహన్ రెడ్డి నడిచిన తేదీల కరెన్సీ నోట్లున్నాయి నా దగ్గర. అలాగే షర్మిలమ్మ పాదయాత్ర ప్రారంభ తేదీ, ముగింపు తేదీల కరెన్సీ నోట్లున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రనయితే మరీ విపులంగా ఫైల్ చేశాను. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రతి వంద కిలోమీటర్ల మైలు రాయిని చేరిన తేదీలతోపాటు, ప్రతి పాతిక, యాభై... ఇలా ప్రతి రోజునూ రికార్డు చేశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నేళ్లలో ఆయన చేసిన ఓదార్పు యాత్ర, లక్ష్య దీక్ష, జల దీక్ష, జన దీక్ష, హరితయాత్ర, ఫీజు పోరు, రైతు దీక్ష, సాగు పోరు, మహా ధర్నా, కరెంటు పోరు, చేనేత దీక్ష, విద్యుత్ ధర్నా, విభజన వ్యతిరేక దీక్ష, బాబు వైఫల్యాల ధర్నా, సమైక్యాంధ్ర దీక్ష, సిఆర్డిఎ ధర్నా, పొగాకు రైతుల కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్ష, కరువు ధర్నా... ఇలా ప్రతి ఘట్టాన్ని నోట్ చేశాను. ఆ తేదీలు వచ్చేటట్లు కరెన్సీ నోట్లు సేకరించాను. నాకు ఓపిక ఉన్నంత కాలం ఇలా సేకరిస్తూనే ఉంటాను. వీటన్నింటితో వైఎస్ఆర్ వర్ధంతి రోజున ప్రదర్శన పెట్టాలనేది నా కోరిక’’ అంటారు భాస్కర్ రెడ్డి. వై.ఎస్.విజయమ్మ పుట్టినరోజు (19–4–1956) ఒక్క పది రూపాయల నోటుకు మూడు వందలు చొప్పున ఇన్నేసి నోట్లను సేకరించడానికి భాస్కర్ రెడ్డి ఖర్చు చేసిన మొత్తం మూడు లక్షల వరకు ఉంటుంది. ఆయన మాత్రం ‘‘మహానుభావుడి మీద నాకున్న అభిమానానికి వెల కట్టలేను. ఆ ప్రేమ అమూల్యం’’ అంటారు. - ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఆదాయం జూలై నెలలో తిరిగి గాడిన పడింది. పన్ను వసూళ్లు అంతకుముందు నెలలో ఉన్న రూ.95,610 కోట్ల నుంచి రూ.96,483 కోట్లకు పెరిగాయి. ఈ వే బిల్లు అమలు చేశాక నిబంధనల అమలు పెరగడం సానుకూల ఫలితాన్నిచ్చింది. జూలైలో 66 లక్షల వ్యాపార సంస్థలు రిటర్నులు దాఖలు చేశాయి. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జీఎస్టీఆర్–3బీ రిటర్నులు ఈ స్థాయిలో దాఖలవడం ఇదే ప్రథమం. పన్ను వసూళ్లు అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.03 లక్షల కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.94,016 కోట్లుగా నమోదయ్యాయి. జూన్‌లో రూ.95,610 కోట్లుగా ఉన్నాయి. పన్ను ఎగవేతలను నివారించేందుకు తీసుకొచ్చిన ఈ–వే బిల్లు కారణంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయని, అయితే బడ్జెట్ అంచనా సగటు నెలవారీ వసూళ్ల కంటే తక్కువే ఉన్నట్టు ‘ట్యాక్స్‌మన్’ సంస్థ డీజీఎం విషాల్ పేర్కొన్నారు. -
చుక్కకూర విత్తనాల సేకరణ ఎలా?
► మన విత్తనాలను మనం కట్టుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే విత్తనాలు ఒక్కోసారి మొలవవు. మొలిచినా బూడిద తెగులువి అయ్యుండే ప్రమాదం ఉంటుంది! చక్కని ఆరోగ్యవంతమైన విత్తనాలను మనం మన తోటలోనే కట్టుకోవడం మంచిది. ► చుక్క కూర పూత దశకు రాగానే రెండు, మూడు బలమైన ఆరోగ్యవంతమైన మొక్కలను విత్తనం కోసం వదలాలి. వాటిని కొయ్యకూడదు. ► పువ్వుల మధ్యలో విత్తనాలు ఉంటాయి. చిన్న చిన్న స్పాంజి ముక్కల్లా కనిపిస్తాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తన రకం చుక్కకూర! ► పువ్వులు క్రమంగా ఎండుతాయి. బాగా ఎండిన తరువాత పువ్వుల గుత్తులను కొయ్యాలి. మరో రెండు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత కుండలో నిల్వ చేసుకోవడం మంచిది! పైన మూత పెట్టుకోవాలి. వెంటనే కానీ తరువాత కానీ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నాటుకోవచ్చు. ఈ దిగువ విత్తనాలు వందల మందికి ఇవ్వవచ్చు. అలా ఇస్తున్నాం కూడా, మా మిద్దెతోట చూడ వచ్చిన వారికి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు -
నత్తనడక
మండపేట: జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం డిమాండ్ రూ.115.31 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.61.63 కోట్లు మాత్రమే వసూలైంది. 74.5 శాతం పన్నుల వసూళ్లతో జిల్లాలో పెద్దాపురం పురపాలకసంఘం ముందంజలో ఉండగా 43 శాతంతో పిఠాపురం చివరిస్థానంలో ఉంది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా నూరుశాతం వసూళ్లు ప్రశార్థకంగా మారింది. ఆర్థిక సంఘం నిధుల విడుదలకు నూరుశాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేయడంతో అధికారుల అలసత్వం పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరకార్పొరేషన్లతోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 2,41,493 ప్రైవేటు భవనాలున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు నాటికి ఆయా భవనాలు ద్వారా మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 115.31లు డిమాండ్ కాగా ఇప్పటి వరకు కేవలం రూ. 61.63 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాకినాడ నగర పాలక సంస్థలో 52.8 శాతం వసూలు కాగా, రాజమహేంద్రవరంలో 51.27 శాతం వసూలయ్యాయి. అమలాపురం మున్సిపాల్టీలో 56.3 శాతం, రామచంద్రపురంలో 48.8 శాతం, పిఠాపురంలో 43.9 శాతం, మండపేటలో 68.2 శాతం, తునిలో 72 శాతం, పెద్దాపురంలో 74.5 శాతం, సామర్లకోటలో 49.6 శాతం పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 69.2 శాతం, ఏలేశ్వరంలో 65 శాతం, ముమ్మిడివరంలో 50 శాతం పన్నులు వసూలయ్యాయి. నూరుశాతం వసూలు గగనమే 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు మేరకు స్థానిక సంస్థలు నూరుశాతం పన్నులు వసూలు తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్నుల వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతర సమీక్ష జరుగుతోంది. మరో ఐదు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితితో నూరుశాతం వసూలు గగనమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఖాకీల ‘స్పెషల్’ దందా
సాక్షి,సిటీబ్యూరో: బెదిరింపులతో పాటు వసూళ్ల దందాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్న నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల క్రితం డీసీపీల ఆధీనంలోని స్పెషల్ పార్టీలను రద్దు చేశారు. అయినా కొందరు అధికారులు అనధికారికంగా వీటిని కొనసాగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ళు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నారు. నగరంలోని అత్యంత కీలకమైన పశ్చిమ మండల పరిధిలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. సాక్షాత్తు వెస్ట్ జోన్ డీసీపీకి క్యాంప్ క్లర్క్‌గా వ్యవహరిస్తున్న హెడ్–కానిస్టేబుల్ ఇందులో ప్రధాన భూమిక పోషించడం గమనార్హం. ఈ ముగ్గురికీ పోలీసు అధికారి కుమారుడు తోడయ్యాడు. కొన్నాళ్ళుగా యథేచ్ఛగా దందాలు సాగిస్తున్న వీరి ఆగడాలకు ఓ స్పా యజమాని ధైర్యం చేయడంతో చెక్ పడింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు మంగళవారం హెడ్–కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ సహా మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు ఖాకీలూ కొన్నాళ్ళ క్రితమే బదిలీ అయినప్పటికీ వెస్ట్‌జోన్‌లోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నగరంలోనే సీనియర్ రైటర్‌గా పేరు పొందిన ఖతీబ్ అహ్మద్ (హెడ్సీ 2478) గత కొంతకాలంగా హెడ్–కానిస్టేబుల్ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీ వద్ద క్యాంప్ క్లర్క్‌గా (సీసీ) పని చేస్తున్నాడు. కానిస్టేబుళ్లు బి.వేణుగోపాల్ (పీసీ 3991), పి.విజయ్‌బాబు (పీసీ 5466) ఇదే డీసీపీ స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు సుదీర్ఘ కాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్ళను బదిలీ చేశారు. ఈ బదిలీల నేపథ్యంలో అహ్మద్ బేగంపేట, వేణుగోపాల్ కుల్సుంపుర, విజయ్‌బాబు లంగర్‌హౌస్ ఠాణాలకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ అటాచ్మెంట్ విధానంలో డీసీపీ కార్యాలయం కేంద్రంగా పాత విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాంప్ క్లర్క్‌గా ఉన్న ఖతీబ్ అహ్మద్ అక్రమ వసూళ్లకు పథకం రూపొందించగా వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న వేణుగోపాల్ స్నేహితుడు బి.శశికుమార్‌లతో కలిసి రంగంలోకి దిగాడు. ఈ నెల 8న జస్ట్ డయల్‌కు కాల్ చేసిన శశికుమార్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న స్పా, మసాజ్ సెంటర్ల వివరాలు తెలుసుకున్నారు. వారి వివరాలు ఆధారంగా రోడ్ నెం.10లోని ‘లగ్జరీ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా’ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. అహ్మద్ సూచనల మేరకు మిగిలిన ముగ్గురూ ఆ స్పాపై దాడి చేసి, అందులో పని చేస్తున్న నలుగురు యువతులతో పాటు మేనేజర్ సూర్యను ఓ గదిలో బంధించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తమకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పా యజమాని ఆర్.రాజు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అనుమతితో నెల రోజుల క్రితమే స్పా ఏర్పాటు చేశామని, తమ సంస్థలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదని చెప్పినా వినకుండా డబ్బు ఇవ్వాలని బెదిరించారు. బేరసారాల తర్వాత నిందితులు రాజు నుంచి రూ.1.35 లక్షలు తీసుకున్నారు. తిరిగి వెళ్తూ తమ కదలికలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో స్పాలో ఉన్న డిజిటల్ వీడియో రికార్డర్‌ను (డీవీఆర్) సైతం ఎత్తుకెళ్లారు. ఈ నెల 10న బాధితుడు రాజు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు బాధితుడు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12న కేసు నమోదు చేసుకున్న స్పెషల్ టీమ్–1 ఏసీపీ కె.నర్సింగ్‌రావు దర్యాప్తు చేపట్టి ఈ వ్యవహారంతో టాస్క్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఆపై నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్పాలో పని చేస్తున్న టెలీకాలర్ రిజిస్టర్లో నమోదు చేసుకున్న ఫోన్ కాల్స్ వివరాలను ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే శశికుమార్‌కు చెందిన ఫోన్ నెంబర్ పోలీసులకు లభించడంతో అతడికి అదుపులోకి తీసుకుని విచారించగా... మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్ళు, హెడ్–కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓపక్క ఈ దర్యాప్తు సాగుతుండగానే ముగ్గురు పోలీసులను వెస్ట్‌జోన్ నుంచి రిలీవ్ చేసి గతంలో బదిలీ అయిన స్థానాలకు పంపేశారు. కీలక ఆధారాలు లభించిన నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు మంగళవారం ఖతీబ్ అహ్మద్, వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు శశికుమార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి డీవీఆర్, రూ.95 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరు గతంలోనూ ఇలాంటి దందాలు చేసి ఉంటారనే అనుమానంతో లోతుగా విచారించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల్లో కానిస్టేబుల్ వేణుగోపాల్ తండ్రి సైతం అంబర్‌పేట సీపీఎల్‌లో ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగం సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ శశికుమార్ తండ్రి వెల్దండ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని విచారిస్తే ఈ దందా వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది స్పష్టమవుతుందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. వీరిపై కుట్ర, బెదిరించడం తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. -
రెండు వారాల్లో రూ. 200 కోట్లు క్రాస్
సాక్షి, సినిమా : వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగు పెట్టినా.. కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లు దాటిపోయింది. ‘పద్మావత్’ సినిమా ఇప్పటివరకు రూ. 212.5 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారంలో రూ. 166.50 కోట్లు, రెండో వారంలో రూ. 46 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.212.50 కోట్లు వసూలు చేసిందని పోస్ట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. #Padmaavat biz at a glance... Week 1: ₹ 166.50 cr Weekend 2: ₹ 46 cr Total: ₹ 212.50 cr India biz. SUPER-HIT. — taran adarsh (@taran_adarsh) 5 February 2018 -
తేనెటీగల చిరకాల మిత్రుడు!
తేనెటీగల జీవన విధానాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని అత్యంత నాణ్యమైన తేనె సేకరించడంలో మాదు నాగేశ్వరరావుది అందెవేసిన చేయి. పరిసర ప్రాంతాల్లో పెట్టెలను ఏర్పాటు చేసి 67 ఏళ్లుగా తేనె సేకరించడమే ఆయన వ్యాపకం. నాణ్యత విషయంలో రాజీ పడరు. ఆయన వద్ద నుంచి ఇతర దేశాల్లోని తెలుగు వారు సైతం తేనెను కొనుగోలు చేస్తుంటారు. నాగేశ్వరరావు అనుభవాలు ఆయన మాటల్లోనే... మా స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. అత్తవారిది ఈడుపుగల్లు. మాది వ్యవసాయ కుటుంబం. మా ప్రాంతానికి చెందిన శేషాచలం, అప్పారావు, కొల్లి రాజారావు వంటి వారి వద్ద నుంచి మెలకువలు నేర్చుకున్నాను. 1950లో గాంధీజీ తేనె పరిశ్రమను స్థాపించాను. ప్రత్యేకంగా తయారు చేసుకున్న తేనె పెట్టెలు చెట్లు, పండ్లతోటలు, ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. డెల్టా ప్రాంతంలో కన్నా అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన తేనె ఉత్తమం. నవంబర్, డిసెంబర్ నెలల్లో తేనెటీగల సంతతి పెరుగుతుంటుంది. జనవరి నాటికి పెట్టెలు ఇరుకు అవుతాయి. ఈగలను మరో పెట్టెలోకి తరలించటం ద్వారా అవి మరో ప్రాంతానికి వలస వెళ్లకుండా కాపాడుకోవాలి. తద్వారా తేనె ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ ఉండొచ్చు. గతంలో తేనె పెట్టెలను ఖాదీ గ్రామోద్యోగ మిషన్ సబ్సిడీపై ఇస్తుండేది. ప్రస్తుతం బయటి మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. పంటలపై రసాయనిక పురుగు మందుల వాడకం పెరుగుతున్నందున తేనెటీగల సంఖ్య తగ్గుతున్నది. పుప్పొడి సేకరించే తరుణంలో తేనెటీగలు పురుగుమందుల ప్రభావంతో చనిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో వేప, తాటి గులకల మీది నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. కలప కోసం ఆ చెట్లను నరికేస్తున్నారు. ఆ సీజన్లో తేనె అనుకున్నంతగా రావటం లేదు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కొందరు సినిమాతారలకు కూడా తేనె ఇచ్చాను. తొలి రోజుల్లో వీసె తేనె రూ. 12కి విక్రయించటం తెలుసు. ప్రస్తుతం కిలో రూ.260కి ఇస్తున్నాం. తేనె సేకరణలో చాలా మందికి శిక్షణ ఇచ్చాను. మొబైల్: 99592 65559. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
ఇంజినీరింగ్ కళాశాలల వసూళ్ల దందా
పవన్ జేఎన్టీయూ అనుబంధ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఎంసెట్‌లో ర్యాంకు రాగానే ఇంజినీరింగ్ కళాశాల వారు తమ కళాశాల ఆప్షన్ ఎంపిక చేసుకోమని చెప్పారు. లైబ్రరీ, ల్యాబ్, ఇతరత్రా అన్ని రకాల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని వాగ్దానం చేశారు. కళాశాలలో సీటు పొందిన మూడు నెలల తర్వాత ఫీజు మోత ప్రారంభించారు. బిల్డింగ్ ఫీజు, ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, సెమినార్ల ఫీజు అంటూ రకరకాల పేర్లతో అందినకాడికి దోచేస్తున్నారు. ఇలా పవన్ ఒక్కరే కాదు... జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని సింహభాగం అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిదీ ఇదే పరిస్థితి. జేఎన్టీయూ: ఎన్నికల ముందు రాజకీయ నాయకులు హామీ ఇచ్చినట్టుగా... ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు ఎంసెట్ కౌన్సెలింగ్ ముందు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం చూపుతారు. అలవికానీ హామీలు ఇస్తారు. వర్సిటీ నిర్ణయించిన కంటే ఒక్కరూపాయి అదనంగా తీసుకోబోమని నమ్మిస్తారు. తమ కళాశాలలో సకల సౌకర్యాలతో పాటు క్యాంపస్ ఇంటర్వూ్యలు భారీగా ఉంటాయంటూ వల వేస్తారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సీటు ఆప్షన్ ఇచ్చి.. సీటు దక్కిన తర్వాత ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమ అసలు రూపం బయట పెడతాయి. ల్యాబ్ ఫీజు నుంచి వర్సిటీ ఫీజు, స్కాలర్షిప్ అప్లికేషన్ వరకు వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తాయి. ఇష్టం ఉన్నా.. లేకున్నా వారడిగినంత మొత్తం చెల్లించాల్సిందే. పోనీ అదనపు ఫీజులు కట్టలేక చదువుతున్న కళాశాలను వదిలి ..ఇతర కళాశాలకు మార్పు చేయించుకోవడానికి సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక అదే కళాశాలలోనే కోర్సు పూర్తి చేయాల్సి వస్తోంది. భరించలేనంత భారం ఉన్నత, సాంకేతిక విద్యలో నమోదు శాతం పెరగాలి. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వల్లే ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 35 వేల ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. ఏఎఫ్ఆర్సీ( అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) కళాశాలల్లో కోర్సు ఫీజు మొత్తాన్ని పెంచింది. ఉదాహరణకు ఒక కళాశాలలో ఏడాదికి కోర్సు ఫీజు రూ. 50 వేలు అనుకుంటే, రూ.35 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ పోనూ .. తక్కిన 15 వేలు కట్టాల్సి ఉంది. ఈ మొత్తం కట్టడానికి తల్లిదండ్రులు ముందే సిద్ధమవుతారు. కానీ కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ నిర్ధారించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది తమకు తలకుమించిన భారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. పర్యవేక్షణ లోపం ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో అధిక ఫీజుల వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులపై ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాలు ఏ మేరకు కల్పించాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన మినహా అనుబంధ కళాశాలల్లో వర్సిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజుల వసూలుకు అడ్డుకట్ట వేయడానికి ఫిర్యాదుల పెట్టే, ఈ– మెయిల్ లాంటి రహస్య సదుపాయాలు కల్పిస్తే.. విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం అధిక ఫీజుల వసూలుతు అడ్డుకట్ట వేయడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఇప్పటికే విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. నేరుగా ఫిర్యాదు చేయడానికి మెయిల్ ఐడీని ఇస్తాం.. విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ అనంతపురం -
డీజే రిపోర్ట్ : తొలి వారం వంద కోట్లు
నెగెటివ్ టాక్ తో కూడా రికార్డ్ సృష్టించటం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అలవాటుగా మారిపోయింది. ఇటీవల బన్నీ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ డివైడ్ టాక్ తోనే మొదలయ్యాయి. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న బన్నీ, ప్రతి సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్ల విషయంలో బన్నీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన డీజే దువ్వాడ జగన్నాథమ్ కూడా డివైడ్ టాక్ తో మొదలైన కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారంలోనే ఏకంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి డీజే రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లలో ఒక వారంలో 100 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అఫిషియల్ గా ప్రకటించారు. అంతేకాదు దర్శకుడు హరీష్ శంకర్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. 'వంద కోట్ల సినిమా ఇచ్చిన సభ్య సమాజానికి శతకోటి వందనాలు, కలెక్షన్ల పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా'మని ట్వీట్ చేశాడు. Vanda kotla cinema ichina Sabhya samaajaanaki Shata koti vandanaalu.. Detailed fugures will be announced soon pic.twitter.com/6ghIage8mE — Harish Shankar .S (@harish2you) 30 June 2017 -
రూ.500 నాణెం సేకరణ
అమలాపురం టౌన్ : కోల్కత్తా టంకశాల దేశంలో తొలసారిగా విడుదల చేసిన రూ.500 నాణేన్ని అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. 2015 అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగిన మూడో భారత్ – ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కోల్కత్తా టంకశాల ఈ నాణేన్ని విడుదల చేసిందని కృష్ణ కామేశ్వర్ తెలిపారు. 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ ఉపయోగించి తయారు చేశారు. ఇదే సదస్సును పురస్కరించుకుని భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన ఆరు ఉబ్బెత్తు చిత్రాల ముద్రణతో ఉన్న తపాలా బిళ్లల మినియేచర్‌ను కూడా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. -
అయ్యో...ఇదేమి కష్టం
- నడవలేని రోగులకు చక్రాల బళ్లేవీ... - లంచం ఇస్తేనే కదిలేది లేదంటే అంతే - జీజీహెచ్‌లో నరకం చవిచూస్తున్న రోగులు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకంటూ రోగులు హడలిపోతున్నారు. ఏ రోగమొచ్చినా పెద్ద దిక్కుగా నిలవాల్సిన పెద్దాసుపత్రి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. వైద్యం మాట ఎలా ఉన్నా చక్రాల బండి కూడా కనీస అవసరాలు తీర్చలేకపోతోంది. వీల్ చైర్లు లేవంటూ రోగులకు నరకం చూపిస్తున్నారు. చేయి తడిపిన వారికే కుర్చీ అంటూ బేరాలకు దిగుతుండడంతో ఏమి చేయాలో తెలియక రోగి సహాయకులు దిక్కులు చూస్తున్నారు. కాకినాడ వైద్యం: ప్రమాదాలబారిన పడిన వాళ్లని ... శస్త్ర చికిత్సకు గురైన వారిని, నడవలేని రోగులను తరలించేందుకు ఆసుపత్రిలో వీల్‌చైర్ ఎంతో అవసరం. జిల్లాకు దిక్సూచిగా ఉన్న జీజీహెచ్‌లో కుర్చీల కొరత ... అరకొరగా ఉన్న సిబ్బందిని సాకుగా చూపించి ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్‌కు వస్తున్న రోగులను కొంతమంది నరకం చూపిస్తున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో నడవలేని రోగులను రోగ నిర్థారణ పరీక్షల కోసం ఇతరత్రా అవసరాల కోసం ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తోపుడు కుర్చీలపై తీసుకెళ్లాలి. తప్పనిసరై తీసుకువెళ్లాలంటే అడిగినంత లంచం ఇవ్వాల్సిందే. లేదంటే రోగిని అలాగే వదిలేసి వెళ్లిపోయిన ఘటనలుండడంతో రోగుల సహాయకులు, బంధువులు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఏళ్ల తరబడిగా సిబ్బంది నియామకం చేపట్టపోవడంతో ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. కాకినాడ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సలు పొందేందుకు నిత్యం మూడు వేల మంది రోగులు వచ్చీ,పోతుంటారు. జీజీహెచ్‌లో అధికారికంగా 1065 పడకలుండగా అనధికారికంగా 1,800 మంది దాకా ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. మెడికల్, సర్జికల్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరోలజీ, గైనిక్, టీబీ, ఎమర్జన్సీ విభాగంలోని ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ వంటి 25 విభాగాల్లో రోగులకు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్‌పేషెంట్ రోగులకు రోగ నిర్థారణ పరీక్షల కోసం రోజుకి 300 మందికి, ఓపీల్లోని సుమారు 200 మంది రోగులకు పరీక్షలకు సిఫారసు చేస్తూంటారు. వీరిలో అనారోగ్యంతో ఉండీ నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులను సంబంధిత పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 70 మంది మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్‌వో), 30 మంది ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్వో)లు జీజీహెచ్‌లో పని చేస్తున్నారు. మరో 50 మంది దాకా సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేస్తే రోగులకు సకాలంలో సేవలందే అవకాశం ఉంటుంది. రోగులను తీసుకెళ్లేందుకు 96 తోపుడు ఇనుప కుర్చీలు, 110 స్ట్రెక్చర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో సేవలందక రోగులు గగ్గోలు పెడుతున్నారు. వార్డుల నుంచి రోగ నిర్థారణ పరీక్షల కేంద్రాలకు తీసుకెళ్లడంలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తీవ్ర జాప్యం చేయడంతోపాటు రూ. 50లు ఇస్తేనే గానీ కుర్చీల్లో తీసుకెళ్లడం కుదరదని కరాఖండీగా చెప్పేయడంతో రోగులుతో వచ్చిన సహాయకులే ఆ పని చేస్తున్నారు. అడిగినంత డబ్బులివ్వకపోతే కుర్చీలు ఖాళీగా లేవంటూ ఇక్కట్లకు గురిచేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులివ్వకపోతే నరకమే... . తోపుడు కుర్చీలో వార్డు నుంచి ల్యాబ్‌కి తీసుకెళ్లినందుకు రూ.50 అడుగుతున్నారు. డబ్బులివ్వకపోతే తీసుకెళ్లడం కుదరదు, లేకపోతే మీరే తీసుకెళ్లండంటూ రోగిని అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. పి,నారాయణమ్మ, రోగి బంధువు, జగన్నాథపురం. డబ్బులడిగితే చర్యలు సిబ్బంది ఎవరైనా రోగులను డబ్బులడిగినా, తోపుడు కుర్చీపై తీసుకెళ్లడంలో తీవ్ర జాప్యం చేసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్ మూర్తి,సీఎస్‌ఆర్‌ఎంవో, ప్రభుతాసుపత్రి, కాకినాడ. -
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
– ఆసీలు వసూళ్లలో ఆగని దందా – గతేడాది సైకిల్‌కు రూ2 బదులుగా రూ.20 వసూలు – అన్ని మార్కెట్లలో ఇదే తంతు – సహకరించిన కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు – తన హయాంలో రద్దు చేయించిన దివంగత మంత్రి జక్కంపూడి సాక్షి, రాజమహేంద్రవరం: ఎండా, వాన తేడా లేకుండా సైకిళ్లు, తోపుడుబండ్లు, బుట్టలతో రోడ్లపై నిలబడి పండ్లు, ఇతర తినుబండారాలు అమ్ముకుని బతికే బుడుగ జీవులను రాజమహేంద్రవరం కార్పొరేషన్లో ఆశీలు వసూళ్ల విషయంలో కాంట్రాక్టర్లదే ఇష్టా రాజ్యంగా మారుతోంది. నగరంలో ఉన్న ఏడు మార్కెట్లలో ఆశీలు వసూలు చేసుకునే హక్కును వేలంపాట ద్వారా ప్రతి ఏడాదీ నలుగురు కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారు. గత ఏడాది జాంపేట మార్కెట్లో హక్కును చందర్రావు అనే కాంట్రాక్టర్ వేలంలో దక్కించుకున్నారు. మార్కెట్ నిర్వహణ, స్వీపర్ చార్జీలతో కలిపి సుమారు రూ.13.5 లక్షలు నగరపాలక సంస్థకు చెల్లించారు. ఆశీల రేట్లు 11 ఏళ్ల తరువాత ప్రస్తుతం నాలుగు రెట్లు పెంచారు. ఈ ఏడాది జాంపేట మార్కెట్లో ఆశీల వసూలు చేసుకునే టెండర్‌ను డి.శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.41 లక్షలకు దక్కించుకున్నారు. చందర్రావు కూడా పాటలో పాల్గొన్నా తృటిలో చేజారింది. అతనికి కంబాల చెరువు వద్ద ఉన్న మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్లో కాంట్రాక్ట్ వచ్చింది. వీరితోపాటు మరో ఇద్దరు కాంట్రాక్టులను వేరొకరికి వెళ్లకుండా గత కొన్నేళ్లుగా జాగ్రత్తపడుతున్నారు. గత ఏడాదితోపాటు అంతకు ముందు ఏడాది కూడా ఆశీల కాంట్రాక్టర్లు రోడ్డుపై వ్యాపారులు చేసుకునే బడుగు జీవులను అడ్డంగా దోచేస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరపాలక సంస్థ పేర్కొన్న గెజిట్ ప్రకారం కాకుండా ఇష్టారీతిన వసూళ్లు చేశారు. గత ఏడాది గెజిట్ ప్రకారం నగరంలోని గౌతమీ ఘాట్ వద్ద ఉన్న హోల్‌సేల్ అరటిపళ్ల మార్కెట్లో సైకిల్‌కు రూ.5, మిగిలిన జాంపేట, సెంట్రల్ కూరగాయల మార్కెట్, ఆల్కట్తోట మార్కెట్, నాగులచెరువు మార్కెట్లలో సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద రోజు వారీ రూ.2 ఆశీలు వసూలు చేయాలి...కానీ కాంట్రాక్టర్లు రూ.20 వసూలు చేశారు. ఇలా తోపుడు బండ్లు, బుట్టలలో పండ్లు, ఇతర తినుబండారాలు తెచ్చి అమ్ముకునే వారి వద్ద వసూలు చేశారు. చెప్పిన మేర కట్టకుంటే వ్యాపారాలు చేసుకోనివ్వకపోవడంతో కట్టామని వ్యాపారులు వాపోతున్నారు. ఇదే విషయం నగరపాలక సంస్థ అధికారులు కూడా వచ్చి చెప్పడంతో చెల్లించామని పేర్కొంటున్నారు. అంతకు ముందు ఏడాది (2015)లో రూ.15, ప్రస్తుతం రూ.30 తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఇచ్చిన టోకెన్లు చూపిస్తున్నారు. రూ. 720కి బదులు రూ. 7200 వసూలు.. మార్కెట్లలో సైకిల్, మోటారు సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద గతేడాది నగర పాలక సంస్థ నిర్ణయించిన రూ.2కు బదులుగా 10 రెట్లు పెంచి రూ. 20 వసూలు చేశారు. ఒక సైకిల్ వ్యాపారి వద్ద రోజుకు రూ.2 లెక్కన నెలకు రూ. 60 వసూలు చేయాలి. కానీ పది రెట్లు పెంచి రోజుకు రూ. 20 లెక్కన నెలకు రూ.600 వసూలు చేశారు. ఇలా ఏడాదికి రూ.720 బదులు బడుగు జీవుల వద్ద రూ. 7,200 దోచుకున్నారు. ఇలా కాంట్రాక్టర్లు అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నా నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాకుండా కాంట్రాక్టర్ల వద్ద నెలవారీ మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు ఉన్నారని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా రెవెన్యూ అధికారులు మార్కెట్లోకి వచ్చి కాంట్రాక్టర్లు చెప్పే రేట్లు సరైనవేనని చెప్పడం గమనార్హం. ఒక్కొక్క సైకిల్ వ్యాపారి వద్ద ఏడాదికి రూ.720 బదులు అదనంగా రూ.6,480 వసూలు (మొత్తం రూ.7,200) చేశారు. ఇలా వందలాది మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు. ఉదాహరణకు జాంపేట మార్కెట్ బయట రోడ్డుపై రోజుకు దాదాపు 100 మంది సైకిల్, మోటారు సైకిల్, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.6,480 చొప్పున 100 మంది వద్ద ఏడాదికి రూ.6,48,000 అదనంగా వసూలు చేశారు. నగరంలోని మార్కెట్ల వద్ద రోడ్లపై చిరు వ్యాపారులు వేల సంఖ్యలో ఉంటారు. ఈ లెక్కన కాంట్రాక్టర్లు రూ. కోట్ల రూపాయలు బుడుగుజీవుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని వాపోతున్నారు. జక్కంపూడి ఔదార్యం... ఆశీలు భారంగా మారాయని, రద్దు చేయిస్తే తాము నాలుగు మెతుకులు తింటామని చిరువ్యాపారులు విజ్ఞప్తి మేరకు తన హయాంలో దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రద్దు చేయించారు. ఆయన హయాం తరువాత ఆశీలు వసూళ్లు ప్రారంభించారు. అయితే అవి నామమాత్రపు రేట్లే అయినా కాంట్రాక్టర్లు మాత్రం పది రెట్లు ఎక్కువగా వసూలు చేస్తుండడంతో చిరువ్యాపారులకు భారంగా మారింది. గతేడాది రూ.20 తీసుకున్నారు మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగళ్లు, నేను జాంపేట మార్కెట్లో పదేళ్లుగా సైకిల్, మాటారు సైకిల్‌పై వ్యాపారం చేస్తున్నాను. 26 కి.మీ. దూరంలోని చాగళ్లు నుంచి జాంపడ్లు తీసుకువస్తాను. గత ఏడాది నా వద్ద ఆశీలు రూ.20 తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది రూ.15 వసూలు చేశారు. ఇప్పుడు రూ.30 చెల్లించాలని చెబుతూ టోకెన్ ఇస్తున్నారు. – రాంబాబు, జాంపడ్ల వ్యాపారి, చాగళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా. కాంట్రాక్టర్ల దోపిడీని నియంత్రించాలి ఆశీల వసూళ్లు నియంత్రణ లేకుండాపోయింది. సైకిళ్లపై ఎండలో నిలబడి అమ్ముంకుటే రోజుకు రూ.వందో రెండొందలో వస్తాయి. అందులో ఆశీలుకే రూ.30 వసూలు చేస్తే వారు ఎలా బతకాలి. పెంచిన రేట్లే కట్టలేం...తగ్గించేలా చూడాలని మమ్మల్ని చిరు వ్యాపారులు అడుగుతున్నారు. ఇక పెంచిన రేటు రూ.8 బదులు రూ.30 తీసుకుంటే ఎలా?. అధికారులు వారిపై నిఘా పెట్టాలి. నిబంధనలకు మించి వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు. -
అథోగతి
పన్ను వసూళ్ల అథమంలో నంబర్ 2 వెనుకబడ్డ పిఠాపురం మున్సిపాలిటీ బకాయిదారుల్లో బడా బాబులు పిఠాపురం : ఆధ్యాత్మిక కేంద్రంగా, రాచరికపు పాలనకు ప్రతీకగా చరిత్ర పుటల్లో నిలిచిన పీఠికాపురం చరిత్రను ఇప్పటి నేతలు తిరగరాశారు. ఇప్పుడు ఘన చరిత్ర గల పిఠాపురం అథోగతి పాలవుతోంది. తమ పాలనలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులే పన్నులు ఎగ్గొడుతుండడంతో పన్నుల వసూళ్లలో వెనుబడి రాష్ట్రంలో రెండో అథమ స్థానానికి చేరుకుంది. వెనుకబడ్డ పన్నుల వసూళ్లకు ప్రత్యేకాధికారిని ప్రభుత్వం నియమించినా పాలకుల నిర్వాకాన్ని ప్రత్యేకాధికారి బయటపెట్టగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణాన్ని పాలించాల్సిన నేతలే పట్టణ అభివృద్ధికి మూలమైన పన్నులు ఎగ్గొడుతుంటే పట్టణం అథోగతి పాలవకుండా ఎలా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో వెనుకబడ్డ 30 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా వాటిలో 43.67 శాతం బకాయిలతో పిఠాపురం మున్సిపాలిటీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. పిఠాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ. 3.12 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటికి రూ.1.40 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ .1.72 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల్లో ఎక్కువ మంది బడా బాబులే ఉన్నారు. కేవలం 250 మంది మాత్రమే ఎక్కువ బకాయిలు ఉన్నారు. ఏళ్ల తరబడి వీరి నుంచి బకాయిలు వసూలు కాలేదు. దీంతో వీరికి రెడ్ నోటీసులు జారీ చేసినా ఫలితం కనిపించక పోవడంతో ఈ మున్సిపాలిటీలో పన్నుల బకాయిలపై చర్యలు తీసుకోవడంలో భాగంగా మరో కమిషనర్‌ను సైతం నియమించారు. అలాగే కుళాయిల బకాయిలు రూ. 40 లక్షలకు పైగా ఉంది. నీతులు చెప్పే నేతలే బకాయిదారులు అధికారం ఉంది కదాఅని అడ్డంగా పనులు చేస్తున్నారంటూ ప్రతిపక్షం నిలదీసే ప్రయత్నం చేస్తే కనీసం మాట కూడా వినిపించకుండా అరుపులు కేకలతో అడ్డు తగులుతున్నారు అధికార పార్టీ నేతలు. అక్రమ పింఛన్ల వ్యవహారంలోనే కాదు పన్నుల చెల్లింపులోనూ వీరు తమ ప్రతాపం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిఠాపురం మున్సిపాలిటీలో సుమారు రూ.లక్షలు బకాయిలుండగా వాటిలో సుమారు రూ. లక్షల్లో తెలుగుదేశం నేతలు వారి బంధువులవే ఉండడం గమనార్హం. ముఖ్యంగా మున్సిపాలిటీ పాలకవర్గంలో అధికార పార్టీకి చెందిన కీలక నేత ఎక్కువ బకాయి పడినప్పటికీ ఆయన కౌన్సిల్ సమావేశంలో నీతులు చెప్పడం తప్ప తాను మాత్రం బకాయిలు చెల్లించకపోవడం ఎగవేతను తేటతెల్లం చేస్తోంది. రూ.1.72 కోట్ల బకాయిల్లో 250 మంది బడా బకాయిదారులు ఉండగా వారిలో ఎక్కువ మొత్తాలు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. వారిలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దైవ సాక్షిగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని తాను ప్రాతినిథ్యం వహించే మున్సిపాలిటీ అభివృద్ధికి తనశక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేసిన నేతలే పన్నులు ఎగవేతకు శ్రీకారం చుడితే ఏఅధికారి అయినా ఏం చేయగలరన్న వాదనలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం మొండి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకాధికారి ఆద్వర్యంలో మొండి బకాయిదారులపై చర్యలు తీసుకుంటాం. బకాయిలు చెల్లించని వారిపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడం. సాధారణ నిధులతోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ నిధులే వసూలు కాకపోతే పట్టణంలో ఏపనీ చేయలేం. - ఎం రామ్మోహన్, కమిషనర్, పిఠాపురం మున్సిపాలిటీ -
మంత్రి పేరుతో దందా
కాంట్రాక్టులు ఇస్తానని వసూళ్లు రంపచోడవరం : రాష్ట్ర మంత్రిపేరుతో ఇంజినీరింగ్ శాఖ అధికారులను, సిబ్బందిని బెదిరించి దందాకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. సదరు మంత్రి వద్ద తనకు ఎంతో పలుకుబడి ఉందని పర్సంటేజీలు ఇస్తే ఇంజినీరింగ్ పనులు మంజూరు చేస్తానని ఆ వ్యక్తి వసూళ్లకు తెగబడుతున్నాడు. రంపచోడవరంలో ఒక ప్రభుత్వ అతిథి గృహాన్ని అడ్డాగా చేసుకుని ఆయన తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అతడి వద్దకే జేఈ స్థాయి నుంచి డీఈ స్థాయి వరకు ఇంజినీర్లు వెళ్లి మాట్లాడి వస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆ వ్యక్తి ఇంజినీరింగ్ ఉన్నతాధికారి గదిలోనే కూర్చుని ఉపాధి హామీ ప్రత్యేక ప్రాజెక్టు పనుల విషయమై కాంట్రాక్టర్లతో మాట్లాడేవాడంటే ఆయనకు ఆయా అధికారులతో ఎంత పరిచయాలు ఉన్నాయో తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కూడా ఆయన మంత్రి పేరుతో రంపచోడవరంలో తిష్టవేసి చక్రం తిప్పాడు. అతడి దందాపై ‘మంత్రి బంధువువైతే ఓకే’ పేరుతో వచ్చిన కథనంతో రంపచోడవరం వదిలి వెళ్లిపోయాడు. తాజాగా సదరు వ్యక్తి ఉంటున్న ప్రభుత్వ భవనంలోకి శనివారం రాత్రి స్థానిక పోలీసులు వెళ్లి అతడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతడితో పాటు అక్కడే ఒక జేఈ ఉండడం విశేషం. అసలు ఏ హోదాతో అతడికి ప్రభుత్వ అతిథి గృహాన్ని కేటాయించారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అతిథి గృహంలో ప్రైవేట్ వ్యక్తి ఎందుకు ఉన్నాడు? అనే దానిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు ఆ భవనానికి వెళ్లారు. తాజాగా జరిగిన సంఘటనతో అతడి వల్ల మోసపోయిన చోటా మోటా కాంట్రాక్టర్లు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఏజెన్సీకి సంబంధం లేని వ్యక్తి ఇంజనీరింగ్ శాఖలోని కొంత మందితో సంబంధాలు పెట్టుకుని ఈ దందాలకు తెగబడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకంలో చేసి వర్క్‌ల్లో ఫైనల్ బిల్లులు విషయంలో కూడా సదరు వ్యక్తి చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించి నివేదికలు ఇవ్వాల్సిన క్వాలిటి కంట్రోల్ అధికారులను సైతం మేనేజ్ చేయగలనని చెప్పుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యవహారాలపై నిగ్గు తేలాలంటే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిందే. -
అరుదైన శంఖాల సేకరణ
స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఫౌండేష¯ŒS ఆధ్వర్యాన సముద్ర తీరంలో శనివారం అరుదైన శంఖాల సేకరణ జరిగింది. తీరంలో 22 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 100కు పైగా అరుదైన శంఖాలు సేకరించినట్లు సంస్థ ప్రతినిధులు పీడీ వెంకటేశ్, టి.షణ్ముఖ్, యు.సత్యరాజు తెలిపారు. చింతలమోరి సముద్ర తీరంలో వాటిని వారు ప్రదర్శించారు. ఈ శంఖాలపై తాము ప్రత్యేక సర్వే చేస్తున్నట్లు తెలిపారు. – మలికిపురం -
త్వరగా భూసేకరణ
సమీక్ష సమావేశంలో జేసీ సూచన కాకినాడ సిటీ : జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్డు విస్తరణ తదితర భూసేకరణ పనులపై ఆయన సమీక్షించారు. ఏలేరు పరిధిలో భూసేకరణకు 12 గ్రామాలకు ప్రిలిమినరీ నోటిఫకేషన్ విడుదల చేసినందున రైతులతో సమావేశాలు జరిపి ఈనెల 18వ తేదీ నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిర్లంపూడిలోని నాలుగు గ్రామాలకు సంబంధించి మార్పుల ప్రతిపాదనలను తక్షణం ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి ఏలేరు ఆధునికీకరణకు భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆర్డీవోలకు సూచించారు. సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డుకు సంబంధించి ఈనెల 20వ తేదీ నాటికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌కు సూచించారు. రంగంపేటలోని 13 గ్రామాలకు గానూ 7 గ్రామాలకు ప్రిలిమినరీæ నోటిఫికేషన్ జారీచేశామని, మిగిలిన ఆరు గ్రామాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు బీఆర్ అంబేడ్కర్, విశ్వేశ్వరరావు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలో ప్రజాసాధికార సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేటా నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ కలెక్టరేట్ నుంచి పాల్గొని సర్వే పురోగతి, చేపట్టిన చర్యలను వివరించారు. సీసీఎల్ఏ మాట్లాడుతూ సర్వేకు సంబంధించి ఎటపాక, చింతూరు మండలాల్లో ప్రగతి మందకొడిగా ఉందని వేగంగా చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
నీటి రుసుము వసూళ్లలో నిర్లక్ష్యం
–రూ.30.92 కోట్లకుగాను వసూలు చేసింది రూ.13.05 కోట్లే –పెద్ద నోట్ల రద్దును సద్వినియోగం చేసుకోని వైనం – బకాయి: రూ.17.87 కోట్లు అనంతపురం అర్బన్ : మునిసిపాలిటీలకు ఆస్తి పన్ను, నీటి రుసుము ప్రధాన ఆదాయ వనరులు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి చార్జీ కోట్ల రూపాయల్లో నిలిచిపోయింది. నీటి చార్జీ వసూలుకు రద్దయిన పాత నోట్లను తీసుకోవచ్చునని ప్రభుత్వం ఆదేశిస్తూ అందుకు కొంత గడువు కూడా ఇచ్చింది. మునిసిపల్ అధికారులు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వసూలు డిమాండ్ రూ.30.92 కోట్లు అనంతపురం కార్పొరేష¯ŒSతో పాటు, జిల్లాలోని 11 మునిసిపాలిటీల పరిధిలో 1,17,280 నీటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి పాత బకాయితో కలుపుకుని ప్రస్తుత ఏడాది వసూలు చేయాల్సిన నీటి చార్జీ రూ.30.92 కోట్లు ఉంది. ఇందులో రూ.13.05 కోట్లను (42.13శాతం) మాత్రమే మునిసిపాలిటీలు వసూలు చేశాయి. ప్రస్తుతం రావాల్సిన బకాయి రూ.17.87 కోట్లు . -
వసూళ్ల వెలుగులు!
– పెద్ద నోట్ల రద్దుతో ముందస్తు విద్యుత్ బిల్లుల చెల్లింపులు – నెల బిల్లు కంటే వంద రెట్లు అధికంగా చెల్లిస్తున్న వినియోగదారులు – కలెక్షన్ అంతా రూ.500, రూ.వెయ్యి నోట్లే – 11న ఒకే రోజు రూ. 9.98కోట్లతో రికార్డు – నెలనెలా బిల్లులో మైనస్ అవతుందని ధీమా కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఓ వినియోగదారుడికి ఈనెల రూ.1,074 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే ఆయన మంగళవారం ఆశాఖకు రూ.1,00,000 చెల్లించాడు. అంతారూ.వెయ్యి నోట్లతోనే. మీ బిల్లు రూ.1,074లే కదా.. రూ.లక్ష కడుతున్నారేంటి? అని పవర్ హౌస్‌లోని కౌంటరు ఉద్యోగి ప్రశ్నించగా.. మా ఇష్టమండి.. అడ్వాన్స్‌గా చెల్లించవచ్చని అధికారులే ప్రకటన ఇచ్చారు. మీరు అడగడమేంటి అని సమాధానం ఇవ్వడంతో ఆడబ్బును తీసుకొని రసీదు ఇచ్చారు. దీంతో ఈ లెక్కన దాదాపు 8 ఏళ్ల వరకు ఆయన బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లోని ఓ పరిశ్రమకు నెలవారి బిల్లు దాదాపు రూ.8వేలు వస్తుంది. కాని ఆ పరిశ్రమ యజమాని ఇటీవలే రూ.6లక్షల నగదును చెల్లించాడు'. .. వీరిద్దరే కాదు. ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేలాంది మంది వినియోగదారులు తమకు వచ్చిన విద్యుత్ బిల్లు కంటే వందరెట్లు అధికంగా చెల్లిస్తున్నారు. అదంతా రూ.500, రూ.వెయ్యి నోట్లతోనే. నెలవారి బిల్లులు సకాలంలో చెల్లించండయ్యా బాబు అని ఆశాఖ అధికారులు నెత్తినోరు కొట్టుకున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసే వినియోగదారులు ఇప్పుడు కౌంటర్ల వైపు పరుగుతీస్తున్నారు. రద్దయిన పెద్ద నోట్లతో విద్యుత్ బిల్లులు కట్టవచ్చని, అదీ పాత బకాయిలతోపాటు ముందస్తు (అడ్వాన్స్) చెల్లింపులు చేయవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించడంతో రూ.వెయ్యి, రూ.500 నోట్లతో కేంద్రాల వద్ద కివ్∙లైనులో నిలబడి కట్టేస్తున్నారు. వచ్చిన బిల్లులు పక్కనపెడితే కొందరు వంద రెట్ల వరకు అధికంగా చెల్లిస్తున్నారు. తరువాత ఎలాగూ నెలనెలా బిల్లులో మైనస్ అవతుందని ధీమాతో రద్దయిన పాత పెద్ద నోట్లను ఇలా చెలామని చెసుకుంటున్నారు. దీంతో ఆశాఖ ఖజానా రూ.500, రూ.వెయ్యి నోట్లతో నిండిపోతోంది. ఈనెల 8తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు పెద్ద నోట్ల స్వీకరణకు అనుమతి లేకపోవడంతో రోజుకు కేవలం లక్షల్లోనే ఆదాయం వచ్చింది. పాత నోట్లతో విద్యుత్ బిల్లులు చెల్లించవ్చని ప్రకటించడంతో 11వ తేదీన ఒకే రోజు రూ.9.98కోట్ల రికార్డు స్థాయి కలెక్షన్ వచ్చింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు కట్టడంతో సంస్థ, జిల్లా చరిత్రలోనే మొదటి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో రూ.22 కోట్ల రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో బిల్లులు కట్టగా వాటిలో ఎల్టీ (గృహాలు, షాపులు, చిన్న ఫ్యాక్టరీలు) రూ.15.61కోట్ల కట్టగా పారిశ్రామికులు రూ.6.39కోట్ల చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలివైన వినియోగదారులు తమ డబ్బులు ఇలా తెలుపు చేసుకుంటున్నారు. – గత ఎమినిది రోజుల కలెక్షన్ ఇలా.. తేదీ ఎల్టీ హెచ్‌టీ మొత్తం 9వ తేదీన రూ.52.41లక్షలు రూ.9.79లక్షలు రూ.62.20లక్షలు 10వ తేదీన రూ.42.04లక్షలు రూ.44.85లక్షలు రూ.86.89లక్షలు 11వ తేదీన రూ.5.79కోట్లు రూ.4.18కోట్లు రూ.9.98కోట్లు 12వ తేదీన రూ.2.15కోట్లు రూ.9.11లక్షలు రూ.2.24కోట్లు 13వ తేదీన రూ.1.69కోట్లు రూ.13.12లక్షలు రూ.1.82కోట్లు 14వ తేదీన రూ.3.23కోట్లు రూ.31.88లక్షలు రూ.3.54కోట్లు 15వ తేదీన రూ.1.63కోట్లు రూ.19.29లక్షలు రూ.1.82కోట్లు 16వ తేదీన రూ.1.12కోట్లు రూ.51.20లక్షలు రూ.1.63కోట్లు -
ఉద్యమ పాదంపై పుట్టుమచ్చ
...థర్టీ ఇయర్స్ రివల్యూషన్! ఉద్యమం చేయడం ఎంత నిజమో... నిజం చెప్పడం అంతే ఉద్యమం! నారాయణమూర్తికి... నిజం అంటే ఏంటి? ఉద్యమం అంటే ఏంటి? మనసులో మాట... పెదాల మీద ఉంటే అదే నిజం! అదే ఉద్యమం అంటాడు. సత్యవాక్కు పలికేవాడు... సత్యపథం పట్టక మానడు కదా! సిల్వర్ జూబ్లీ సినిమాలిచ్చినా, కోట్ల కలెక్షన్లు కొట్టినా ఇప్పటికీ... షేర్ ఆటోలో తిరుగుతాడు. కాలిబాట పడతాడు. మరి అదే కదా.. సత్యపథం! గాంధీ ఉద్యమంలో... ‘అహింస’ సత్యాగ్రహం అయితే... ఆర్. నారాయణమూర్తి గుండెల్లో... ‘విప్లవం’ సత్య ఆగ్రహం. నిప్పులా రగిలే సత్యం... జ్వాలలా ఎగసిపడే ఆగ్రహం. తెర మీద బొమ్మ పడింది! అదిగో... నారాయణమూర్తి నడుచుకుంటూ వస్తున్నాడు.ఆ ఉద్యమపాదంపై ప్రజలు పెట్టిన కాటుక చుక్కే ఈ పుట్టుమచ్చ. ఆడియన్స్... ఈలలు, చప్పట్లు, కేరింతలు... ఎర్రటి విప్లవంలా తెర మీద భగభగమండుతున్నాడు. ఇదిగో... ఈ ఇంటర్వ్యూలో... అలాగే మాట్లాడుతున్నాడు.భగ భగ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే. ‘అర్ధరాత్రి స్వతంత్రం’తో హీరోగా మొదలై, ఇప్పటికి 30 ఏళ్లయింది. సంపాదించింది ఎంత? పోగొట్టుకున్నది ఎంత? ఆర్. నారాయణమూర్తి: 30 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సమస్యలే నా సినిమాలు. కార్మిక, ఆదివాసీ, దళితుల, స్త్రీ, రైతు, భూ పోరాటం.. ఇలా ఎన్నో విషయాలపై సినిమాలు తీస్తున్నా. పోగొట్టుకున్నది ఏం ఉంటుంది? ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నా కాబట్టి, అభిమానం సంపాదించుకున్నా. 30 ఏళ్లయ్యాయని గుర్తు పెట్టుకుని, ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ వచ్చిందంటే, అది నేను సంపాదించుకున్నదే. సమస్యల్ని చూపిస్తే మార్పొస్తుందా? మార్పు అనేది వస్తుంది. సమాజం గ్యారంటీగా మారుతుంది. మార్పు కోసం డాక్టర్, సైంటిస్ట్, కార్టూనిస్ట్, పొలిటిషీయన్, మీ జర్నలిస్టులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో పోరు చేస్తారు. కళాకారుడిగా నేను నా సినిమాల ద్వారా మార్పు కోసం ఫైట్ చేస్తున్నా. నా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ చూసి ఎందరో ఉద్యమబాట పట్టారు. ‘ఎర్రసైన్యం’ చూసి భూపోరాటం చేశారు. ‘దండోరా’ చూసి సారాకొట్లు బద్దలు కొట్టారు. అది మంచి మార్పేగా. గాంధీ ‘శాంతి’ అంటే మీవి పోరాటం వైపు మళ్లిస్తున్నాయి... మళ్లిస్తున్నాయంటే పొరపాటు. ఒక్క గాంధీ వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదుగా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పోరాటం చేయమన్నారు కదా. ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రం. ఓ విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అభివృద్ధి పేరు చెప్పి, ఇండస్ట్రియలైజేషన్ చేసేస్తున్నారు. అంతా మలినం. రొయ్యల వ్యాపారానికి గండిపడింది. పర్యావరణం నాశనం. భూములు లేకుండా పోయాయి. రైతుల పరిస్థితేంటి? ఉద్యమాలు చెయ్యాలా? వద్దా? చేసినా పోలీసులు కొడుతుంటే తిరుగుబాటు చేయరా? చేయకపోతే ఆ వాయిస్ ఎలా తెలుస్తుంది? మీ ఆర్థిక లావాదేవీలన్నీ వైట్‌లోనే ఉంటాయా? సీ మై ఫ్రెండ్... ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘వేగు చుక్కలు’ వరకూ 20 ఏళ్లపాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. అది చూసి కొంతమంది ఇలాం టివి తీశారు. ఒకటీ రెండు తీశాక మొనాటనీ వచ్చిందని మానేశారు. నేను మాత్రం తీస్తూనే ఉన్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి సక్సెసవుతున్నా. మొదట్నుంచీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్, డెరైక్షన్, మ్యూజిక్ - అంతా నేనే కాబట్టి, బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. సినిమా రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. ‘ఆల్ వైట్.. నో బ్లాక్’. మొనాటనీ అని కొంతమంది మానేశారన్నారు. మరి ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు తీస్తే.. మీకు విసుగు రాలేదా? నా బతుకు ఇంతేనా? మార్పు లేదా? అనే ఆలోచన ఏ మనిషి మనసులోనైనా వస్తే, అతడికి విసుగొస్తుంది. అప్పుడు ముందుకు సాగలేడు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా తల్లిపై ఉన్న అభిమానం, ఆరాధన, ఇష్టం, గౌరవం తగ్గలేదు. సినిమాలపై అయిష్టం రాలేదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువా? ఆటోల్లో తిరుగుతుంటారు. కారుల్లో తిరిగినా మిమ్మల్ని అడిగేవాళ్లు ఎవరుంటారు? అవును. ఎందుకు అడుగుతారు? సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్‌లో కూడా నాకు రెండు జతల బట్టలే. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు. డాక్యుమెంట్లు లేవు. చాప, దిండు మాత్రమే. డబ్బులు తేనప్పుడూ నా దగ్గర ఉండేది చాపా, దిండూనే. ఊళ్లో బంగ్లా, స్థలాలు కొన్నారని విమర్శ. దానికేమంటారు? ఓసారి మా ఊరు వెళ్లండి. నేను చేసిన మంచి పనులు కనిపిస్తాయి. ఆస్పత్రి కట్టించా. విద్యాలయాలకు డొనేట్ చేశా. పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. ఆంధ్ర, తెలంగా ణాల్లో బోర్లు వేయించా. కానీ ఎక్కడా చెప్పుకోను. మీర న్నట్లు మా ఊళ్లో నా సంపాదన ఉందనుకుంటే.. బంగ్లా కట్టించానేమో చూడండి. మా అమ్మా నాన్న ఏ ఇంట్లో ఉన్నారో చూడండి. రీసెంట్గా మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకతే ఉంది. ఊళ్లో నాకు ఎకరం స్థలం లేదు. థియేటర్లు లేవు. దొంగచాటు వ్యాపారాలేవీ చేయట్లేదు. ఒకవేళ మీరన్నది నిజమైతే ఇక ‘సాక్షి’ నన్ను ఇంటర్వ్యూ చేయొద్దు. ‘ప్రజల్ని మోసగిస్తూ, పేదోడిలా నటిస్తున్న నారాయణమూర్తి’ అని హెడ్‌లైన్స్ పెట్టి రాయండి. నేను చెప్పినది కరెక్టని భావిస్తే, ‘ఎలా చెబుతున్నాడో అలానే బతుకు తున్న ఆర్. నారాయణమూర్తికి సెల్యూట్’ అని రాయండి. మీ సినిమాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కానీ... సమాజం అందుకు దాదాపు విరుద్ధంగా ఉంటోంది. యస్.. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరుగుతోంది. యువత ఆ సంస్కృతికి అలవాటు పడడం, ఆకర్షితులు కావడం సహజం. అంతెందుకు? విశాఖ బీచ్‌లో లవర్స్‌ను ఆహ్వానిస్తున్నారంట. దేశ, విదేశీ ప్రేమికుల ముద్దులాట, కౌగిలింతలను చూసి, ఎంజాయ్ చేయమంటారా? ఎంత దుర్మార్గమైన చర్య. మనకి ఆ సంస్కృతిని అలవాటు చేయడమే కదా! ఓసారి హైదరాబాద్‌లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో నడుస్తుంటే.. ఓ అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే, ‘హగ్ కల్చర్’ అట. ‘నీది ఏ దేశం?’ అనడిగా. హైదరాబాదే అని చెప్పింది. ఈ హగ్ కల్చర్, ముద్దులు, ఇవన్నీ మనకు కాదు, యూరోపియన్లకు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే ఎంత భ్రష్టు పడుతుంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన బీచ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్నా. అందాల పోటీలూ డబ్బు కోసమే. ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎలాగైతే మానవ సంబంధాల్ని కోల్పోతున్నామో, అలాగే వెస్ట్రన్ కల్చర్‌తో మన సంస్కృతి, భాషలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. రేపులు, గట్రా పెరగడానికి యూరోపియన్ కల్చర్ ప్రభావమే కారణం. చిన్నపిల్లలతో టీవీల్లో డ్యాన్సులు ఏంటమ్మా? పసిపిల్లలకేం తెలుసు? చివరికి వాళ్లు ఈ సంస్కృతికి అలవాటు పడతారు. మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా? కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ పిలిచింది. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళితే.. సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడు మనకిచ్చిన వరంగా ఫీలవ్వాలి. నిద్ర, తిండి మినహాయిస్తే మిగతా టైమంతా జనం కోసమే ఆలోచించాలి. ఓ కాలు సినిమా పడవపై, మరో కాలు రాజకీయమనే పడవపై వేసి ప్రయాణించలేను. నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తినీ కాను. ‘అయామ్ ఎ కామన్ మ్యాన్’. ప్రజల పార్టీ వ్యక్తిని. రాజకీయాల్లోకెళ్తే పొల్యూట్ అవుతామేమోనని భయమా? మీరు మీరుగా ఉన్నప్పుడు ఎవరూ మార్చలేరు. మరోలా ఉండాలనుకున్నప్పుడు మారిపోతారు. అది వాళ్ల వీక్నెస్. సినిమాల్లోకి, పాలిటిక్స్లోకెళితే నాశనమవుతారనేది కరెక్ట్ కాదు. ఓ కమిట్మెంట్తో నిజాయతీగా ఉన్నవాణ్ణి, ఉండాలనుకునేవాణ్ణి ఏదీ ప్రభావితం చేయలేదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నేనేమైనా మారానా? తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చారు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మీ అభిప్రాయం? 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎన్టీఆర్‌గారు ధైర్యంగా ‘నేను సమైక్యాంధ్రా’ అన్నారు. అది ఆయన క్యారెక్టర్. 1972లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఇండస్ట్రీ అంతా సెలైంట్‌గా ఉంటే.. కృష్ణగారు ధైర్యంగా ముందుకొచ్చి ‘జై ఆంధ్రా’ అన్నారు. అది కృష్ణగారి క్యారెక్టర్. ఇప్పుడు నేను ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అన్నాను. ఇది నా క్యారెక్టర్. తెలంగాణ అనేది ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన ఉద్యమం అని నమ్మినవాణ్ణి. అందుకే, మద్దతుగా నిలిచా. విడిపోతే, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతాయని ఉద్యమానికి మద్దతిచ్చా. అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు హ్యాపీ. అయితే... ఈ రెండు రాష్ట్రాలను విభజించిన యూపీఏ ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మొదట్నుంచి తెలంగాణ కోరుకుంటున్న బీజేపీ, వెంకయ్య నాయుడు కూడా ప్రతేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాలన్నారు. ఎన్నికల ముందు తిరుపతి సభలో మోదీగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎన్నికల్లో మోదీ నెగ్గారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? రాజ్యాంగం ప్రకారం, గత ప్రభుత్వం (యూపీఏ) ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ‘ప్రత్యేక హోదా వస్తే మీకు లాస్. ప్యాకేజీ ఇంపార్టెంట్’ అంటూ మీడియా సహాయంతో ఊదరగొడుతున్నారు. మాట తప్పడం మహా దుర్మార్గం. పాలకులకు ప్రజలంటే భయం, భక్తులు ఉండాలి. లేనప్పుడు మోనార్కిజం వస్తుంది. ఇప్పుడు మోనార్కల్లా ప్రవర్తిస్తున్నారు. వెంకయ్యనాయుడి మాటలు, చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయకపోవడం కరెక్ట్ కాదు. పలు మీటింగుల్లో ప్రత్యేక హోదా కావాలని నేనూ చెప్పా. ఈరోజు ముఖ్యంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డిగారు బీభత్సంగా ఫైట్ చేస్తున్నారు. హోదా కోసం ఫైట్ చేస్తున్నవాళ్లందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఇప్పుడు బయటి బేనర్లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా చేస్తున్నారు. సడన్‌గా బయట సినిమా చేయడానికి కారణం? యాక్టర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనుంది. యాక్టింగ్ పిచ్చితో మద్రాస్ వెళ్లినోణ్ణి. గతంలో పలువురు మిత్రులు మంచి వేషాలు ఆఫర్ చేశారు. కానీ, మొనాటనీ ఉంటే జనాలు సినిమా చూడడం మానేస్తారు. అది బ్రేక్ చేస్తూ డిఫరెంట్ వేషాలు వేయాలనుంది. ఇప్పటి వరకూ ఉద్యమకారుడు, రైతు, కార్మికుడు, నిరుద్యోగి, రిక్షావోడు, దళితుడు - ఇలా అనేక వేషాలు వేశా. ఇప్పుడు కానిస్టేబుల్, ప్యూన్, జవాను, గుమస్తా, బక్కరైతు, కులవృత్తులకు సంబంధించిన హీరో పాత్రలు చేయాలనుంది. దేవుడి దయ వల్ల ఆర్.నారాయణ మూర్తి అనే మార్క్ వచ్చింది. ముసలోణ్ణి అయినా ‘త్రిశూల్’లో దిలీప్‌కుమార్, ‘శంకరాభరణం’లో సోమయాజులుగారి తరహాలో నటిస్తా. ఏ మనిషికైనా తన అర్హత, అనర్హతలు ఏంటో ఇతరుల కంటే తనకే బాగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో మహా అయితే మరో నాలుగైదేళ్లు ఉంటా. అప్పటివరకూ నటిస్తా. ‘నా రాజ్యానికి నేనే రాజు’ అనేది నా పాలసీ. హ్యాపీగా ఉండాలంటే... అమ్మానాన్నలను మించిన దైవం లేదు. పిల్లలకు వాళ్ల తల్లితండ్రులు, తల్లితండ్రులకు వాళ్ల పిల్లలు గొప్పోళ్లు. మా అమ్మానాన్నలు పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లు. చిన్నప్పటి నుంచి కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్లడం, దెబ్బలు తినడమే నా పని. మళ్లీ ఉద్యమాల్లోకి వెళ్లేవాణ్ణి. వాళ్ల జీన్స్ నాలో ఉండడమే ఈ ప్రవర్తనకు కారణం అనుకుంటున్నా. నేను నా యాంగిల్లో వెళ్తున్నాను. మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. మన అంతరాత్మ ప్రకారం నడుచుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకే సార్... మోదీగారు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో కొంతమంది సినీ పెద్దలు ‘బ్లాక్’ని వైట్ చేసుకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారట. మీ సంగతేంటి? (గట్టిగా నవ్వుతూ)... నాకు బ్లాక్ అండ్ వైట్ తేడా తెలియదు. నల్లధనం ఉండకూడదనే ఆశయంతో మోదీగారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కానీ, మోదీగారిని నేనేం ప్రశ్నిస్తున్నానంటే... ఎన్నికలకు ముందు విదేశీ బాం్యకుల్లో ఉన్న నల్ల డబ్బుని జనానికి పంచేస్తానన్నారు కదా. ముందా పని చేయమంటున్నా. ఎందుకు చేయలేకపోయారు? 500, 1000 రూపాయిల నోటుని రద్దు చేసినప్పుడు 2000 రూపాయి నోటు ఎందుకు? మోదీ హఠాత్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులపాలు చేస్తోంది. లోయర్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉంది. అంటే.. పెద్ద నోట్ల రద్దు తప్పంటారా? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ల ఇబ్బందుల గురించి ఆలోచించాలి. దీన్నే అదనుగా తీసుకుని పెట్రోల్ బంకుల్లో, కొన్ని కిరాణా కొట్లలో 500 నోటిస్తే.. నోటుకు సరిపడా కొనాల్సిందేనంటున్నారు. మోదీగారు వాగ్దానం చేసినట్లుగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు తెచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అది ఎందుకు చేయలేకపోతున్నారని ఆయనను ప్రశ్నిస్తున్నా. గెలవడానికి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు ‘తాత్కాలిక’ అవసరాల కోసం ఓటేసి నంతవరకూ సమాజం బాగుపడదు. అందుకే ఓటేసే ముందు ‘శాశ్వతాన్ని’ దృష్టి పెట్టుకోవాలి. వారసులేనా వచ్చేది? వ్యాపారస్థుడి కొడుకు వ్యాపారస్థుడు.. డాక్టర్ కొడుకు డాక్టర్.. అవుతున్నప్పుడు హీరో కొడుకు హీరో కావడంలో తప్పేంటి? రాజకీయ నేత కొడుకు రాజకీయ నేత అయితే తప్పేంటి? అనే చర్చ ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతోంది. ఎవరి అభిరుచి, ఆసక్తి ప్రకారం వాళ్లు నడుచుకోవచ్చనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అయితే సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో రాణించాలని, అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని 90 శాతం మందికి ఉంది. వారసత్వం సరైనదని మీరే వస్తుంటే.. బయటవాళ్లెప్పుడు హీరోలవుతారు? మంత్రులవుతారు? జనాభా దామాషాలో అట్టడుగు వర్గాలూ అందలం ఎక్కాలి. - డి.జి. భవాని -
వసూళ్ల ఫీవర్....?
–పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు ఉరుకులు...పరుగులు –కలెక్టర్ హెచ్చరికలతో అధికారుల్లో గుబులు –జిల్లా వ్యాప్తంగా రూ.77.84కోట్లు మేరకు బకాయిలు కొవ్వూరు: వారం రోజుల్లో తొభైశాతం కంటే తక్కువగా పన్నులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ హెచ్చరికలు ఈవోపీఆర్ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల్లో గుబులు రేపుతున్నాయి.లక్ష్యాల సాధన కోసం పల్లెల్లో ఉరుకులు పరుగులు తీస్తున్నారు.2015–16 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో పంచాయతీలకు ఇంటి, కుళాయి పన్నులు కలిపి రూ.6.46 కోట్లు వసూలు కావాల్సి ఉంది.దీనిలో ఇళ్ల పన్నుల వసూళ్లు సరాసరి 93శాతం రాగా, కుళాయి పన్నులు మాత్రం 86 శాతమే వసూలు అయ్యాయి.దీంతో గత ఏడాది రావాల్సిన పన్నులను వారం రోజుల్లో తొభైశాతం పైబడి వసూలు చేయని వారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఏలూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెచ్చరించారు.జిల్లాలో 23 మండలాల్లో తొభైశాతం లోపు పన్నులు వసూలు చేసిన మండలాలున్నాయి.కలెక్టర్ హెచ్చరికల నేపధ్యంలో ఆయా మండలా లకు చెందిన ఈవోపీఆర్ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో మైక్ ప్రచారాలతో పన్నుల వసూళ్లకు చర్యలు చేపట్టారు.కిందిస్ధాయి సిబ్బందికి పన్నుల వసూళ్లపై దిశనిరే్ధశం చేశారు.అయితే నిరే్ధశించిన మేరకు వీరిలో లక్ష్యాలను చేరుకునేది ఎంతమంది అనేది వేచిచూడాల్సిందే.ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే ఆరునెలలు పూర్తయ్యింది. పంచాయతీలకు ఇంటి,కుళాయి పన్నుల రూపేణా బకాయిలతో కలిపి రూ.77.84 బకాయిలు వసూలు కావాల్సి ఉంది.ఈ పన్నుల్లో కేవలం ఇంటి పన్నులు ఆరుశాతం, కుళాయి పన్నులు తొమ్మిది శాతం మాత్రమే వసూలయ్యాయి.ముఖ్యంగా పంచాయతీల్లో ఇళ్ల పన్నులు రివిజన్ చేయడం మూలంగా పన్నులు భారీగా పెరిగాయి.దీంతో లక్ష్యాల సాధనలో అధికారులు అపసోపాలు పడుతున్నారు.ఈ వారంలో నిరే్ధశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు కాకపోతే ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం అధికారులను వెంటాడుతుంది. 23 మండలాల్లో తక్కువగా వసూలైన పన్నులు: జిల్లా కేంద్రమైన ఏలూరు మండలంలో ఇంటి పన్నులు ఎనభై ఐదుశాతం వసూలైతే, కుళాయి పన్నులు 82శాతమే వసూలు చేశారు.వేలేరుపాడు మండలంలో ఇంటిపన్నులు నూరుశాతం వసూలు చేసినప్పటికీ కుళాయి పన్ను మాత్రం కేవలం మూడు శాతం వసూలు చేసి జిల్లాలో చివరిస్ధానంలో నిలిచింది.కుళాయి పన్నులు వసూళ్లలలో జిల్లాలో కుక్కునూరు,లింగపాలెం మండలాల్లో 42 శాతంతో వెనుకబడి ఉన్నాయి. మొగల్తూరులో 43 శాతం, పోలవరం 52 శాతం, వీరవాసరం లో 58 వసూళ్లలతో తర్వత స్ధానాల్లో ఉన్నాయి. పెదవేగి,చింతలపూడి, పెరవలి మండలాల్లో 70 శాతం లోపు కుళాయి పన్నులు వసూలు చేసిన జాబితాలో ఉన్నాయి. టి.నరసాపురం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి, దెందులూరు, గణపవరం, పెదవేగి, పెంటపాడు, ఉంగుటూరు, చాగల్లు, దేవరపల్లి, మండలాల్లోను,ఆచంట, ఆకివీడు, కాళ్ల మండలాల్లో కుళాయి పన్నులు తొభైశాతం లోపు మాత్రమే వసూలు అయ్యాయి.ఇళ్ల పన్ను వసూలులో చాగల్లులో 71శాతంతో చివరిస్ధానంలో ఉండగా పోలవరం 76శాతం,వీరవాసరం 77, లింగపాలెంలో 79 శాతం,ఏలూరులో 85,ఉండ్రాజవరం, దేవరపల్లి మండలాల్లో 89 శాతం వసూళ్లలతో తర్వత స్ధానాల్లో ఉన్నాయి. ఇప్పుడు లక్ష్య సా««దlన కోసం ఈ మండలాల్లో అధికారులు నానా ప్రయాసలు పడుతున్నారు. అక్రమ కుళాయిలపై నో యాక్షన్: జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో అక్రమ కుళాయి కనెక్షన్ లున్నాయి.రాజకీయ ఓత్తిళ్లు, ఇతర కారణాలతో వీటిని నియంత్రించ కపోవడంతో పంచాయతీలకు రావాల్సిన లక్షలాది రుపాయిల సోమ్ములు పక్కదారి పడుతుంది. అక్రమ కుళాయి కనెక్షన్లపై దష్టి సారిస్తే పంచాయతీలకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదిశగా దష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది. -
‘మామూళ్లు’ మామూలే!
* దసరా వసూళ్ల వేటలో ఎక్సైజ్, వాణిజ్య సిబ్బంది * హెచ్చరికలు బేఖాతరు * పట్టించుకోని ఉన్నతాధికారులు...ఆందోళనలో వ్యాపారులు నరసరావుపేట టౌన్: ‘దసరా మామూళ్లు నిషేధించాం... ఏ శాఖవారైనా వసూలు చేస్తే చర్యలు తీసుకొంటాం’ అంటూ ప్రభుత్వం ప్రతిసారి చెబుతున్నా పరిస్థితి మారటంలేదు. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ ‘పని’లో తాము ఉంటున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే... నరసరావుపేటలో గత పదిరోజులుగా దసరా మామూళ్ల పేరిట అక్రమదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు ఉన్నతాధికారుల ఉదాశీనత, మరికొందరు అధికారుల ప్రోత్సాహంతో సిబ్బంది విధులు పక్కన పెట్టి మామూళ్ల వేటలో పడ్డారు. ముఖ్యంగా రెండు ప్రభుత్వ కీలక శాఖలైన ఎక్సైజ్, వాణిజ్య శాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది చెలరేగిపోతుండడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలో గత పదిరోజులనుంచి ఆ రెండు శాఖలకు చెందిన సిబ్బంది దసరా మామూళ్ళపేరిట వ్యాపారుల నుంచి అందినంత దండుకుంటున్నారు. డబ్బులు తరువాత ఇవ్వండి...ఎంత ఇచ్చేది రాయండి అంటూ ముద్రించిన రశీదుపుస్తకాలపై దర్జాగా రాయించుకుంటున్నారు. వాటిని చూపించి ‘అందరూ మామూళ్లు ఇస్తున్నారు... మీరుకూడా ఇవ్వాలంటూ’ ఒత్తిడి తెచ్చి తీసుకుంటున్నట్లు కొందరు వ్యాపారులు వాపోతున్నారు. గతంలో దసరామామూళ్లు నిషేధమని కార్మికశాఖ ప్రతిదుకాణంలో బోర్డులు ఏర్పాటుచేసింది. అదేవిధంగా పలు అసోసియేషన్లు దసరామామూళ్ల నిషేధంపై తీర్మానాలు చేశాయి. అయినప్పటికీ సిబ్బంది ఒత్తిడితో ఇచ్చుకోక తప్పడంలేదని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. డివిజన్వ్యాప్తంగా వసూళ్ళు.. డివిజన్ స్థాయి ఎక్సైజ్, వాణిజ్య శాఖల కార్యాలయాలు నరసరావుపేట పట్టణంలో కొనసాగుతుండటంతో ఆశాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది డివిజన్లోని మద్యం, ఇతర వ్యాట్, టీఓటీ లైసెన్స్‌లు కలిగిన వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. నూతనంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారి నుంచి అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా స్పందించకపోవడంతో ఎంతోకొంత ముట్టచెప్పాల్సి వస్తోందంటూ కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని చెప్పారు. అదేవిధంగా సీటీఓ మంజులరాణి దృష్టికి తీసుకు వెళ్లగా సిబ్బంది దసరామామూళ్లకు పాల్పడినట్టు తేలితే చర్యలు తీసుకొంటామని తెలిపారు. -
భవిష్యత్తు భారతీయ సినిమాలదే
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశాలలో భారత్ ఒకటి. ఇండియాలో ఏడాదికి 20 భాషల్లో1500 నుంచి 2,000 మధ్యలో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు 2.1బిలియన్ డాలర్ల కలెక్షలన్లు వసూలు చేస్తున్నాయి. ఇది 2020 నాటికి 11 శాతం వృద్ధి సాధించి 3.7 బిలియన్ డాలర్లు(రూ.24,684 కోట్లు) ఉండనుందని డెలాయిట్ టచ్ థామస్ తన రిపోర్టులో వెల్లడించింది. భవిష్యత్తు భారతీయ సినిమాలదే నని నివేదిక తెలిపింది. ఇండియాలో ఇప్పుడే పట్టణాలుగా రూపొందుతున్ననగరాల్లో సైతం సినిమాకు డిమాండు పెరుగుతోందని నివేదిక తెలిపింది. అంతే కాకుండా అత్యుదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియన్ సినిమాలో ఎక్కువగా వాడుతున్న కారణంగా విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్నాయని తేల్చంది. బాలీవుడ్ సినిమాలు 43 శాతం వసూల్లు సాధించగా ప్రాంతీయ చిత్రాలు 57 శాతం రెవెన్యూని సాధిస్తున్నాయి. డబ్బింగ్ అయిన ఇంగ్లీష్, చైనా సినిమాలు సైతం ఇండియాలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నయి. ఫైరసీ, సినిమా ఖర్చులు పెరగడం, అధిక పన్నులు ఇతరత్రా సమస్యులన్నా అధిక స్ధాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయని నివేదిక తెలిపింది. -
వంద శాతం రుణ వసూళ్లే లక్ష్యం
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య పాత గుంటూరు: 2016–17 రుణ వసూళ్ల కార్యాచరణ ప్రణాళిక త్వరగా సిద్ధం చేసి నూరు శాతం వసూళ్ల లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిపాలనా కార్యాలయంలో శుక్రవారం బ్యాంకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాంచీలు, సంఘాల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన ఖరీఫ్ రుణాలను సత్వరం మంజూరు చేయాలని సూచించారు. సెప్టెంబరు 30 నాటికి సాధించాల్సిన నిర్దేశిత లక్ష్యాలను సిబ్బంది అధిగమించాలని ఆదేశించారు. జిల్లాలోని రైతాంగానికి దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అరటి మొక్కల పెంపకానికి ఎకరానికి రూ.80 వేలు రుణం మంజూరు చేయాలన్నారు. పలు అంశాలపై సమీక్షించేందుకు ఈ నెల 19న గుంటూరు, తెనాలిలో, 20న గురజాల, నరసరావుపేటలో సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. -
వాణిజ్య పన్ను వసూళ్లలో దూకుడు
సాక్షి, హైదరాబాద్: వ్యాట్‌తోపాటు లగ్జరీ ట్యాక్స్, వినోదపన్ను మొదలైన 7రకాల పన్ను వసూళ్లలో రాష్ట్రం దక్షిణాదిలో రెండోస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు జరిగిన పన్ను వసూళ్లలో కర్ణాటక 12.50% వృద్ధిరేటుతో తొలిస్థానంలో నిలవగా, రాష్ట్రం 11.88%తో రెండోస్థానంలో నిలిచింది. ఏపీ 11.60% వృద్ధితో 3వ స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో కేరళ (7%), తమిళనాడు (6.5%) ఉన్నాయి. వాణిజ్యపన్నుల శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల మేర ఆదాయం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. తొలి 4 నెలల్లో(ఏప్రిల్-జూలై) రూ.11,500 కోట్లు సాధించింది. -
భూములిస్తేనే తీసుకుంటాం..
♦ ప్రకటించిన పరిహారాన్నే ఇస్తాం ♦ లేదంటే.. పక్క జిల్లాలో భూములను సేకరిస్తాం ♦ ఫార్మా భూముల సేకరణలో అధికారులు ♦ మరో రెండు రోజుల్లో రైతులతో సమావేశం కానున్న జేసీ ఫార్మా భూముల సేకరణలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. 2013 భూ సేకరణ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ రాను రాను పెరుగుతోంది. ఇందు కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండడం, వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా రెండు రోజుల పాదయాత్ర చేశారు. దీంతో ఆలోచనలో పడిన అధికారులు.. మరోమారు రైతులతో సమావేశమయ్యారు. ఇక్కడ భూములు ఇవ్వని పక్షంలో పక్క జిల్లాకు వెళ్లి సేకరిస్తామని బెదిరించడం కొసమెరుపు. - యాచారం. ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునే విషయంలో అధికార యంత్రాంగం పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. ఈ గ్రామంలోని రైతులు భూసేకరణ చట్టం - 2013 పరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి రాకపోవడంతో అధికార యంత్రాంగం ఆలోచనలో పడింది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు ఇప్పటికే రెవెన్యూ, టీఎస్ఐఐసీ, సర్వే శాఖ అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. కానీ.. స్థానికంగా ఆందోళనలు, ధర్నాల నేపథ్యంలో భూసేకరణ విషయంలో కొంత మొత్తబడినట్లు తెలుస్తోంది. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం రైతులు పరిహారం పెంపు డిమాండ్ న్యాయమైనదే అయినప్పటికీ ప్రభుత్వ హామీ ఇవ్వని నేపథ్యంలో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగంలో గుబులు పుట్టుకున్నట్లు సమాచారం. మొదటి విడతగా కుర్మిద్ద గ్రామంలోని సర్వే నంబరు 92, 264, 292, 293, 311లలో 690 ఎకరాలను సేకరించి 364 మంది రైతులకు రూ. 55 కోట్లకు పైగా పరిహారాన్ని చెల్లించింది. కుర్మిద్దలో అసైన్డ్ భూమి ఎకరాకు రూ. 8 లక్షలు, కబ్జా రైతులకు రూ.7.70 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. రెండో విడతగా నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో రెండో విడిత కింద నక్కర్తమేడిపల్లి గ్రామంలోని 184, 131, 213, 247 తదితర సర్వే నంబర్లల్లో 1,953.09 ఎకరాల భూములను ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకోవడానికి అధికార యంత్రాంగ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భూ రికార్డులను పరిశీలించి, నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో తీసుకోడానికి నిర్ణయించిన భూముల్లో డ్రోన్ సర్వే కూడా జరిపారు. పక్షం రోజుల కింద భూసర్వేకు వెళ్లిన అధికారులను అడ్డుకోవడం, నాలుగు రోజుల కింద ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ రజత్‌కుమార్‌సైనీ సమావేశంలో కూడా రైతుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భూసేకరణ చట్టం మేరకే పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనే వీరభద్రం కుర్మిద్ద, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో రైతుల్లో మరింత చైతన్యం పెరిగినట్లైంది. ఈ నేపథ్యంలో జేసీ రజత్‌కుమార్ సైనీ రెండు, మూడు రోజుల్లో మారోమారు రైతులతో సమావేశమై పరిహారం ఇచ్చే విషయంలో, ఇతర నింబంధనల గురించి చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో రైతులు ఒప్పుకుంటే సరే.. లేదంటే కొద్ది రోజుల పాటు నక్కర్తమేడిపల్లిలో భూసేకరణ నిలిపి పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో ఫార్మాసిటీకి భూసేకరణ చేయనున్నట్లు అధికారుల్లో ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమ్మతి ఉంది.. కానీ.. ఫార్మాకు భూములు ఇవ్వడానికి అధిక శాతం రైతుల్లో సమ్మతి ఉంది. కానీ.. పరిహారం పెంపు విషయంలోనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయంలో జేసీ రజత్‌కుమార్ సైనీ రైతు బిడ్డలా ఆలోచించి పరిహారం పెంచి ఇస్తే పేద రైతులకు న్యాయం జరుగుతుంది. - పాశ్ఛ భాషా, సర్పంచ్ నక్కర్తమేడిపల్లి ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి రైతులకు పరిహారం పెంపు విషయంలో ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి. నక్కర్తమేడిపల్లిలోని రైతులు పట్టవిడుపుతో ఉండొద్దు. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. భూసేకరణకు సహకరిస్తే అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం. - పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం -
తాజ్ కృష్ణలో ట్రెండ్జ్ వివహ్ కలెక్షన్
-
ఆర్టీఏలో అర్ధరాత్రి ‘వసూల్ రాణి’
వరంగల్: ఆమె రోడ్డెక్కిందంటే ఆ రహదారిలో వెళ్లే వాహనదారులకు హడల్.. పెన్ను పట్టిందంటే చాలు.. రాసే ఫైన్ 50 వేల రూపాయలపైనే. అయితే ఈ ఫైన్ కేవలం రశీదు కావాలని అడిగిన వ్యక్తులకే మాత్రమే. అదే రశీదు అక్కర్లేదనుకుంటే అందులో సగం డబ్బులు ఆమె చేతిలో పెడితే చాలు వాహనాన్ని వదిలేస్తారు. లేదంటే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి ఫైన్ మొత్తం కట్టాల్సిందే. ఆమె గురించి తెలిసిన వాహనదారులు అంత మొత్తం డబ్బులు కట్టలేక.. ఫైన్‌లో సగం డబ్బులు చెల్లించి బతుకు జీవుడా అంటే తమ బండ్లు తీసుకెళుతున్నారు. సదరు అధికారిణి మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వాహనదారులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ప్రస్తుతం ఆర్టీఏలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ రవాణాశాఖలో ఏఎంవీఐగా పనిచేస్తున్న సదరు అధికారిణి శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లింది. తిరిగి అర్ధరాత్రి తన అద్దె వాహనంలో డ్రైవర్, ఆనుచరులతో కలిసి వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్ధరాత్రి వరకు తిష్టివేసింది. మామునూరు గ్రామశివారులో రహదారి నుంచి వెళ్లే వాహనాలను ఆమె ఆపి తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు పలు సాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. కిలోమీటర్ మేర లారీలతోపాటు పలు రకాల వాహనాలు నిల్చిపోగా వందలాది వాహనదారులు మాముళ్లు సమర్పించుకున్నారు. పెనాల్టీ కట్టినట్లుగా రశీదు కావాలని నిలదీసిన వాహనదారుల పై ఆ మహిళా అధికారి మండిపడ్డారు. వాహనాల తాళం చెవులు లాక్కోవడమేగాక వాహనాలను సీజ్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ మహిళా అధికారిని ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఎస్కె సైదులు ఆమె సమక్షంలోనే అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా వసూళ్ల దందా నడుస్తుండగా ఓ మీడియాకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగడంతో సదరు అధికారిని గమనించి ప్రైవేట్ డ్రైవర్‌తోపాటు అక్కడి నుంచి జారుకుంది. దీంతో బాధిత వాహనదారులు మహిళా అధికారిని ఇంట్లో పని చేసే సైదులును పట్టుకుని దేహశుద్ధి చేసి మామునూరు పోలీసులకు అప్పగించారు. ఆతడి వద్ద రూ.3 వేలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ చానల్ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎంవీఐ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న సైదులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత రవాణా శాఖ డీటీ సీ శివలింగయ్యకు సమాచారం అందజేశామని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యుగంధర్ వెల్లడించారు. పోలీసు నివేదిక ఆధారంగా ఏఎంవీఐపై చర్యలు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సదరు మహిళా ఏఎంవీఐ ఆర్ధరాత్రి అక్రమంగా మామూళ్లు వసూళ్లు చేస్తోందనే ఆరోపణలపై విచారిస్తున్నామని డీటీసీ శివలింగయ్య తెలిపారు. మామునూరు సీఐతో మాట్లాడి వివరాలు సేకరించామని, పోలీసుల నివేదికను బట్టి ఏఎంవీఐపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. - శివలింగయ్య, డీటీసీ -
ప్రకృతి ప్రేమికుడు
♦ దేశ, విదేశాల నుంచి మొక్కలు, చెట్ల సేకరణ ♦ వంద ఎకరాల్లో పెంపకం, సంరక్షణ ♦ బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా సాగుతున్న రాందేవ్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయనకు చిన్ననాటి నుంచి మొక్కలంటే ప్రాణం. అటవీశాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేసే తండ్రి వెంట అడవుల్లో తిరుగుతూ మొక్కలు, చెట్లపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. పెద్దయ్యాక వ్యాపారంలో స్థిరపడినా.. వాటిపై మక్కువ మాత్రం వదలలేదు. దేశంలోనే అతిపెద్దదైన బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయనే వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన రాందేవ్. 25 ఏళ్ల క్రితం వ్యాపారంలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఒకవైపు వ్యాపారాన్ని చూసుకుంటూనే మరోవైపు తనకు ఆసక్తి ఉన్న మొక్కలు, చెట్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ ప్రకృతి ప్రేమికుడి కథనమే ఆదివారం ప్రత్యేకం.. - మొయినాబాద్ శంకర్పల్లి మండలం పొద్దటూరు, మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామాల సరిహద్దుల్లో భూమి కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు రాందేవ్. వంద ఎకరాలకు విస్తరించిన క్షేత్రంలో దేశ, విదేశాల నుంచి తెచ్చిన వేల మొక్కలు, చెట్లు పెంచుతు న్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇటలీ నుంచి తెచ్చిన ఆలీవ్, వియాత్నం నుంచి తెచ్చిన ఫైకస్, ఇండోనేషియా నుంచి తెచ్చిన రెగెస్టోమియా వంటి సుమారు వెయ్యి రకాల చెట్లు ఉన్నాయి. 1,200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్టు, 2008 ఒలింపిక్స్ సందర్భంగా చైనాలో ప్రత్యేకంగా పెంచిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న చెట్లను చూసి.. 2006-07లో హైదరాబాద్-బీజాపూర్ రహదారి విస్తరణ సందర్భంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెద్ద పెద్ద మర్రి వృక్షాలను నరికేస్తున్నారనే విషయం తెలుసుకున్న రాందేవ్ వాటిని రక్షించేందుకు ముందుకొచ్చారు. అధికారులతో మాట్లాడి 200 చెట్లకు పునర్జన్మనిచ్చారు. భారీ క్రేన్ల సాయంతో వేళ్లతో సహా పెకిలించి వాటిని భారీ వాహనాల్లో తన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. వేళ్లు పాడవకుండా రసాయ ప్రక్రియ చేసి చెట్లను క్రేన్ల సాయంతో నాటారు. ఇలా మొత్తం చెట్లు తరలించేందుకు సుమారు రూ.37 లక్షలు ఖర్చు చూశారు. నాటిన చెట్లను రక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యం మన దేశంలో బొటానికల్ గార్డెన్లు చాలా తక్కువగా ఉన్నా యి. ఈ విష యమై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను. పలువురు ముఖ్యమం త్రులను కలిసి వివరించాను. ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్ స్పందించారు. ఆ రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. దీనికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం. - రాందేవ్ 1,500 ఏళ్ల నాటి చెట్టు.. ఇటీవల మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో రియల్ వ్యాపారులు ఓ భారీ చెట్టును నరికేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న రాందేవ్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అది ఆఫ్రికన్ జాతికి చెందిన అడెన్సోనియా డిజిటాటా అనే 1,500 ఏళ్ల నాటి వృక్షమని తెలుసుకున్నారు. దాన్ని రూ.14 వేలకు కొనుగోలు చేసి జేసీబీల సాయంతో కూకటి వేళ్లతో తొలగించారు. 45 అడుగుల చుట్టుకొలత, 70 అడుగుల ఎత్తున్న ఈ భారీ వృక్షాన్ని తరలించేందుకు ముంబై నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తెప్పించారు. రెండు భారీ క్రేన్ల సహాయంతో వృక్షాన్ని భారీ వాహనంలోకి ఎక్కించి తన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఆ చెట్టు వేర్లకు రసాయన ప్రక్రియ చేపట్టి భారీ క్రేన్ల సహాయంతో నాటారు. వృక్షాన్ని తరలించేందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చుచేశాడు. -
పన్నుల పెంపు.. ధరలపై ఒత్తిడి
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లలో సర్వీసు పన్నులు దాదాపు 25శాతం పెరిగాయట. ఆర్థికసంవత్సరం 2016లో దాదాపు రూ.2.1లక్షల కోట్లు సేకరించినట్టు అంచనా. అయితే ఈ పన్నుల పెరుగుదల కారణంగానే రిటైల్ ధరల పెరుగుదలపై ఒత్తిడి తీవ్రతమవుతుందని మార్కెట్ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిడి, కార్లు, మొబైల్ ఫోన్లపై వేసే ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కంటే ఈ సర్వీసు పన్నులు ఎక్కువగా ఉన్నాయట. 2015 ఏప్రిల్ లో ప్రభుత్వం సేకరించిన 12.3 శాతం పన్నులు 2015 మే వరకు 14శాతానికి పెరిగాయని తెలుస్తోంది. రెస్టారెంట్లు, పెట్రోలు పంపులు, మల్టీ ఫ్లెక్సిల్స్ లాంటి వాటిపై వేసే పన్నులు సర్వీసు టాక్స్ ల కిందకు వస్తాయి. పీవీఆర్ భారత్ లో కలిగిఉన్న 500 మల్టీప్లెక్సిల్స్ పై రూ.1,750 కోట్ల అమ్మకాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ.40కోట్లు సర్వీసు పన్నులు చెల్లించారట. అయితే 2014 ఆర్థికసంవత్సరంలో ఈ పన్నుల మొత్తం కేవలం రూ.7.3కోట్లు మాత్రమే. అయితే కేవలం పన్నుల రేట్లు పెంచడం ద్వారానే ఈ మొత్తం పెరగడం లేదని, పన్నుల ఎగవేతపై ప్రభుత్వం తీసుకునే చర్యలు సర్వీసు పన్నుల కలెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.. అయితే పన్నుల రేట్ల పెంపు, టాక్స్ బేస్ పెరగడం కూడా పన్నుల కలెక్షన్ కు సహాయపడుతుందని తెలిపారు. టెక్నాలజీ సహాయంతో సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ పన్నుల ఎగవేతదారులను గుర్తించడం ప్రారంభించింది. దీంతో ఎగవేతదారులను నిరోధించగలిగామని సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.93 లక్షలు
అన్నవరం: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి ఏప్రిల్ నెలకు హుండీల ద్వారా రూ.93,01,588 ఆదాయం సమకూరింది. శుక్రవారం హుండీలను లెక్కించగా నగదు రూ.88,61,208, చిల్లర నాణాలు రూ.4,40,380 వచ్చాయని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. నగదుతోపాటు 103 గ్రాముల బంగారం, 445 గ్రాముల వెండి, 298 అమెరికన్ డాలర్లు, 20 యునెటైడ్ అరబ్ దీర్హామ్స్, 36 ఖతార్ రియాల్స్, రెండు సింగపూర్ డాలర్లు, 500 ఒమెన్ బైసాలు, 30 కెనడా డాలర్లు లభించాయని తెలిపారు. నిలువు దోపిడీ సమర్పించిన భక్తురాలు సత్యదేవునికి ఓ భక్తురాలు నిలువు దోపిడీ సమర్పించినట్లు ఈఓ తెలిపారు. గొలుసుతో కూడిన మంగళసూత్రం, నాలుగు గాజులు, రెండు చెవి దిద్దులు, ఒక పాపిడి బిళ్ల, ఒక ముక్కు పుడక, మూడు ఉంగరాలు, చిన్న కాసుల పేరు ఒక పట్టుబట్టలో మూటగట్టి పడవేసినట్లు తెలిపారు. వీటన్నిటి బరువు సుమారు 20 గ్రాములుంటుందన్నారు. హుండీల లెక్కింపులో ఈఓతో పాటు దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు తదితరులున్నారు. -
కలెక్షన్ కింగ్
♦ పురాతన నాణేలు, స్టాంపుల సేకరణ ♦ ప్రత్యేకత చాటుతున్న వాజేడు లైబ్రేరియన్ ♦ కళాశాలలో ప్రదర్శన వాజేడు: స్వాతంత్య్రం రాకపూర్వం చలామణిలో ఉన్న నాణేలు, పురాతన స్టాంపులు చూడాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఏ మ్యూజి యంకో వెళ్లాలి. కానీ, మ్యూజియం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాడు వాజేడు ప్రభుత్వ జూని యర్ కాలేజీ లైబ్రేరియన్ నవీన్. పురాతన నాణేల నుంచి, ఆధునిక నాణేల వరకు, దేశ, విదేశీ కరెన్సీ, దేశంలో ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సేకరించాడు. వాటిని ఏ కాలంలో వినియోగించేవారో ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరిస్తున్నాడు. అణా పైసల నుంచి రూ.10 వరకు నాణేలనూ ప్రదర్శిస్తున్నాడు. వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అలపర్ల నవీన్ స్వస్థలం భద్రాచలం. అతడి తండ్రి వీజే పీటర్ పాతతరం రూపాయి నాణేన్ని దాచాడు. నవీన్ చిన్నతనంలో ఉన్నప్పుడు పీటర్ అలా చేయడాన్ని గమనించాడు. అప్పటి నుంచి నవీన్ కూడా ప్రాచీన నాణేలు సేకరించి భద్రపర్చడం నేర్చుకున్నాడు. 9వ తరగతి చదువు తున్నప్పటి (1993) నుంచి పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు, పలు సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సేకరించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. స్వాతంత్య్రం రాక ముందు చలామణిలో ఉన్న 17 పురాతన నాణేలను సేకరించారు. ఒక్కపైసా నుంచి రూ.10 వరకు నాణేలను సేకరించారు. వాడుకలో ఉన్న పలు ఏడాదుల్లో వచ్చిన భారతదేశ కరెన్సీ రూ.1 నోటు నుంచి రూ.1000 నోటు వరకు సేకరించి భద్రపర్చారు. అమెరికా, ఈజిప్ట్, కతార్, ఒమన్, యూఏఈ, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్, అరేబియా, శ్రీలంక, ఇథియోపియా, కెన్యా, బ్రెజిల్, ఫిలిప్పైన్స్, బహ్రెయిన్‌తోపాటు మొత్తం 20 దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన అనంతరం విడుదలైన మొదటి స్టాంపు, మహాత్మాగాంధీ మృతి అనంతరం ఆయన ఫొటోతో విడుదలైన మొదటి స్టాంపు, 1993 నుంచి 2016 వరకు విడుదలైన మినీ ఏజర్ సీట్స్ (నాలుగు, ఐదు స్టాంపులు కలిసి ఉన్న సీట్)లను 134 సేకరించారు. రూ.25 వేలు ఖర్చు చేసి వాటన్నింటినీ కళాశాలలో ప్రదర్శిస్తున్నారు. వాటి ప్రత్యేకతను నవీన్ వివరిస్తున్నారు. -
ఔను! 'దిల్వాలే' నిరాశపర్చింది: షారుఖ్
ముంబై: బాలీవుడ్లో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచిన జోడీ షారుఖ్ ఖాన్, కాజోల్. వీరు గతంలో కలిసి నటించిన చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వీరు మళ్లీ జత కట్టడంతో 'దిల్వాలే' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ జోడీ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తమ మ్యాజిక్‌ను చూపుతుందని చాలామంది భావించారు. అయితే 'దిల్వాలే' మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించినప్పటికీ ఆ ఊపును కొనసాగించలేకపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే విషయాన్ని షారుఖ్ సైతం అంగీకరించాడు. 'దిల్వాలే' పెద్ద విజయాన్ని సాధించలేకపోయిందని చెప్పాడు. 'ఈ సినిమా ఆడాల్సినంత గొప్పగా ఆడలేదు. వ్యక్తిగతంగా ఈ విషయంలో నిరాశ చెందాను. అయితే, భారత్‌లో కంటే విదేశాల్లో 'దిల్వాలే' మంచి కలెక్షన్లు సాధించింది. జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయాన్ని ఇది చాటుతోంది' అని షారుఖ్ తెలిపారు. సంజయ్ లీలా భన్సలీ 'బాజీరావు మస్తానీ' సినిమాతో పోటీపడి.. డిసెంబర్ 18న విడుదలైన 'దిల్వాలే' మొత్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసింది. అయినా ఈ సినిమా ప్రక్షకుల నుంచి సానుకూల స్పందన రాబట్టలేకపోయింది. -
కలెక్షన్ కింగ్
పైసా మే పరమాత్మ హై అని ఎవరైనా అంటే.. అదేమో గానీ తన ఆత్మ మాత్రం వాటి చుట్టూనే తిరుగుతుంటుంది అంటారాయన. అయితే అయనకు డబ్బుపై ఆశ కాదు... అభిరుచి. నాణేల నుంచి కరెన్సీ నోట్ల దాకా సేకరించే సరదా. ‘మనకున్న అలవాట్లే మనల్ని మంచి అభిరుచులకు చేరువ చేస్తాయి. బహుశా ఆ హాబీనే నన్ను బ్యాంక్ ఉద్యోగం ఎంచుకునేలా చేసి ఉంటుంద’ని అంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమల్ చక్రవర్తి. పురాతన నాణేల నుంచి నయా కరెన్సీ నోట్ల వరకు ఇలా ప్రతి ఒక్కటీ సేకరించిన ఆయన.. అన్న ఇచ్చిన తొలి పూర్వపు నాణేమే ఈ రోజు భారీ కలెక్షన్ చేసే దిశగా నడిపించిందని చెప్పారు. ‘ఆ తర్వాత మిత్రులు, కొంత మంది స్క్రాప్ వ్యాపారుల నుంచి విభిన్న నాణేలు సేకరించాను. ఇదే క్రమంలో నాకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బద్వాణీలో ఎస్బీఐ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను. హెచ్‌సీయూ సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్లో ఫ్యాకల్టీగా చేస్తున్నా. ఆర్బీఐ విడుదల చేసే స్మారక నాణేలు కూడా భద్రంగా దాచిపెడుతున్నాన’ని వివరించారు చక్రవర్తి. ది బెస్ట్.. ‘హరప్పా, మొహంజోదారా, కుషాణ్, మొఘల్ కాలాల నాటి ఆకర్షణీయమైన నాణేలు... ది వరల్డ్ ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాంక్ నోట్లు... ఇలా 85 దేశాలకు చెందిన నోట్లు, నాణేలు సేకరించారు చక్రవర్తి. 300 బీసీకి చెందిన అలెగ్జాండర్, నెపోలియన్ కాయిన్స్, బెనిన్ రిపబ్లిక్, నిజాం, తంజావూరుకు చెందిన రూ.1000 నాణేం, ఆస్ట్రేలియాకు చెందిన పెంగో నోట్, యుగోస్లోవియాకు చెందిన ఐదు ట్రిలియన్ల నోట్, పది మిలియన్ల జపనీస్ నరోట్, జార్జ్ 6 కింగ్ కాయిన్, బంగ్లాదేశ్‌కు చెందిన 60 టకల నోట్లు చూసి చాలా మంది ఆయనను అభినందిస్తున్నారు. వీటి సంఖ్య వేలల్లోనే ఉంటుందంటున్నారు చక్రవర్తి. - సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
వసూళ్ల ‘ఎక్సైజ్’ రాజాలు!
మద్యం దుకాణాలపై దందా కొత్తగా వచ్చిన అధికారుల వేధింపులు నెలసరి మామూళ్ల కోసం ఒతిళ్లు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు అత్యంత అవినీతిమయమైన శాఖల్లో ఎక్సైజ్- 4వ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న అధికారుల్లో కొందరు మాత్రం మొదటి స్థానంలో ఉండటానికి పెద్ద పెద్ద ఎక్సైజ్లే చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన సీఐల బదిలీల్లో పలు ప్రధాన స్టేషన్లకు వచ్చిన కొత్త అధికారులు కేసులకంటే నెలసరి మామూళ్లపైనే దృష్టి సారించారు. అంతా తెలిసినా ‘ నా వాటా ఎంత చెప్పు..?’ అంటూ ఉన్నతాధికారులు లెక్కలు సరి చేసుకుంటున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లా ఎక్సైజ్ శాఖలో దీర్ఘకాలంగా ఒకే స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలకు బదిలీలు చేస్తూ గత నెల 21న ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న కొందరు సీఐలను పక్క మండలాలకు, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇతర జిల్లాల్లో ఉన్న సీఐలను మన జిల్లాకు కూడా బదిలీ చేశారు. ఇలా మొత్తం 34 మంది సీఐలు బదిలీ అయ్యారు. అయితే కొత్త స్టేషన్లకు వెళ్లిన సీఐలు తమ విధులను పక్కనపెట్టి, జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. సర్కిళ్ల నుంచి డిస్టిలరీలు, చెక్‌పోస్టులు.. ఇలా ప్రతీ చోటా వసూళ్ల దుకాణాలు తెరిచారు. సర్కిళ్లల్లో పనిచేస్తున్న సీఐలు ఆ పరిధిలో ఉన్న లెసైన్స్ కలిగిన మద్యం దుకాణాల యజమానులను పిలిపించి బెదిరింపులకు దిగుతున్నారు. ప్రాధాన్యత, మద్యం దుకాణాల్లో జరిగే వ్యాపారం ఆధారంగా ఒక్కో దుకాణ యజమాని నుంచి ఒక్కో మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ మామూళ్లు నెలకు కనిష్టంగా రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.80 వేల వరకు ఉంటోంది. తిరుపతిలో అయితే కొన్ని దుకాణాల కొత్త సీఐలు నెలకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ప్రాధాన్యత ఉన్న పోస్టు కోసం పైస్థాయిలో రూ.లక్షలు ముట్టచెప్పి వచ్చామని, ఆ మాత్రం ఇచ్చుకోకపోతే ఎలా? అంటూ కొందరు సమర్థించుకుంటున్నారు. గతంలో కూడా ఇదే తరహా వ్యవహారం జరగడంతో చిత్తూరులోని ఎక్సైజ్ సూపరింటెండెండ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయినా ఆశాఖలో అవినీతి కిక్కు దిగడం లేదు. ఎక్సైజ్‌శాఖలో ఈ దందాల వ్యవహారంపై ఉన్నతాధికారులు పెదవి విప్పడం లేదు. సీఐలు వసూలు చేసే నెలసరి మామూళ్లలో ఉన్నతాధికారులకు సైతం లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఎన్‌ఫోర్సుమెంట్‌లో పనిచేసి ఇటీవల సర్కిల్‌కు వెళ్లిన పేరు వెల్లడికి ఇష్టపడని ఓ సీఐ చెప్పారు. ఏమయ్యా.. నేను చార్జ్ తీసుకుని 15 రోజులవుతోంది. ఇప్పటి వరకు కనిపించలేదు. కనీసం పలకరించాలని కూడా తెలియదా..? ఏం వ్యాపారం చేసుకోవాలని ఉందా, లేదా.? ఇంతకుముందు ఎలాగ ఉండేదో మా కానిస్టేబుళ్లు అంతా చెప్పారు. నేను చాలా స్ట్రిక్ట్. గతంలో జరిగింది వదిలేయ్. ఇప్పుడు నెలకు రూ.40 వేలు ఇవ్వాల్సిందే. లేకుంటే నీ ఇష్టం.. - చిత్తూరు ఈఎస్ పరిధిలోని ఓ సీఐ తప్పుడు మార్గాల్లో డిస్టిలరీ నిర్వాహకుల నుంచి విధుల్లోకి చేరిన 15 రోజుల్లోనే రూ.లక్ష వరకు వసూలు చేశారా సీఐ. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఇది తానొక్కడికే కాదని, ఉన్నతాధికారులకు సైతం ఇవ్వాలని చెబుతున్నారు. -
33రోజుల్లో మల్లన్న ఆదాయం రూ.1.90కోట్లు
శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఉభయ దేవాలయాలలో మంగళవారం భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 1,90,61,638 లభించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. నిత్య కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారని అన్నారు. నగదుతో పాటు 115 గ్రాముల బంగారు, 4 కేజీల 850 గ్రాముల వెండి లభించిందన్నారు. అలాగే, విదేశీ కరెన్సీ 2314 యూఎస్ఏ డాలర్లు, 10 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, 1 కువైట్ దినార్, 35 యూఏఈ దిర్హమ్స్, 9 మలేషియా రింగిట్స్, 2 సౌదీరియాల్స్ హుండీల ద్వారా వచ్చాయన్నారు. ఈ మొత్తం స్వామి అమ్మవార్లకు 33 రోజులలో వచ్చిన ఆదాయంగా ఈవో పేర్కొన్నారు. -
తమ్ముడు కాదన్న చిత్రం..అన్న చేసిన ప్రయోగం
-
రక్షకుడే.. భక్షకుడై
- ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నిర్వాకం - కేసులో అనుమానితుడి నుంచి బలవంతంగా లక్షల రూపాయల వసూలు - తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు - కాళ్ల బేరానికి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ - రాజీకి ఒప్పుకోని బాధితుడు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆ ఎస్ఐకు జీతం కంటే గీతంపైనే దృష్టి. అమాయకులను టార్గెట్ చేసి విచారణ పేరుతో ప్రైవేట్‌గా నిర్భందిస్తాడు. కేసుల్లో ఇరికిస్తానని భయపెట్టి రూ.లక్షలు గుంజేస్తాడు. కరుడు గట్టిన దొంగను మరిపిస్తున్నాడు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, అన్యాయం చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని నిర్బంధించి తనదైన శైలిలో చుక్కలు చూపించాడు. తట్టుకోలేక డిమాండ్ చేసిన రూ.5 లక్షలు ఆ వ్యక్తి ఎస్ఐకు ముట్టజెప్పాడు. అనంతరం బాధితుడు ఆ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. సదరు ఎస్ఐ బాధితుడి వద్దకు వెళ్లి కాళ్ల బేరానికి దిగాడు. రాజీకి రాకపోవడంతో ఆ ఎస్ఐ చుక్కలు చూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని తిరుపతి ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఓ బ్లూకోల్ట్ కానిస్టేబుల్‌తో కలసి ఓ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నాడు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఓ ప్రైవేటు గదిలో మూడు రోజులపాటు బంధించాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తామని భయపెట్టాడు. భయపడి ఆ వ్యక్తి డబ్బు సమకూర్చి బయటపడ్డాడు. బాధితుడి బంగారు ఉంగరాన్ని కానిస్టేబుల్ తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ కుదవ అంగడిలో ఉంగరాన్ని పెట్టి నగదు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం బాధితుడు అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై నిఘా వర్గాలతో ఎస్పీ విచారించగా సదరు ఎస్‌ఐదే తప్పని తేలడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్ఐని పిలిపించారు. రాజీ కుదుర్చుకో.. లేదంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బెంబేలెత్తిన ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి డబ్బు తీసుకుని బాధితుని వద్దకు వెళ్లి రాజీ కావాలంటూ కాళ్లవేళ్ల పడ్డారు. వారు పెట్టిన బాధలు విడమరిచి చెబుతూ తనను అన్యాయంగా హింసించారని, రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆ ఎస్ఐ ఇప్పటికే రెండుమార్లు సంప్రదింపులు జరిపారు. అయినా బాధితుడు రాజీకి రాకపోవడంతో ఏమిచేయాలో తెలియక సదరు ఎస్ఐ కాలుకాలిన పిల్లిలా అధికారుల చుట్టూ తనను కాపాడండి అంటూ ప్రదక్షణలు చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు అందింది వాస్తవమే హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది వాస్తవమే. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించా. మాకు అందిన ఫిర్యాదులో బాధితుని నుంచి ఎస్ఐ డబ్బు తీసుకున్నట్లు లేదు. తప్పు చేస్తే ఎంతటివారినైనా క్షమించేది లేదు. చర్యలు తప్పకుండా తీసుకుంటాం. - గోపీనాథ్‌జెట్టి, అర్బన్ జిల్లా ఎస్పీ -
ఎగిరే కెమెరాలతో.. వార్తల సేకరణ!!
-
హ్యాపీ న్యూయర్ భారీ వసూళ్లు
-
రజనీని విజయ్ అధిగమించారా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ వసూళ్లను ఇళయదళపతి అధిగమించారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో వాడివేడిగా జరుగుతున్న చర్చ ఇదే. నటుడు విజయ్ నటించిన తాజా చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఈ చిత్రం తెరపైకి వస్తుందా? రాదా? అంటూ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఈ చిత్రం పలు అవరోధాలను ఎదుర్కొని నిర్ణయించిన తేదీకే దీపావళి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు బద్దలు కొడుతోందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. కత్తి చిత్రం విడుదలైన తొలి రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.26 కోట్ల 80 లక్షలు వసూలు చేసిందని దర్శకుడు పేర్కొన్నారు. మన దేశంలో రూ.16 కోట్ల 45 లక్షలు, విదేశాలలో ఏడు కోట్ల 35 లక్షలు వసూలు చేసిందని మురగదాస్ ప్రకటించారు. అదే విధంగా దక్షిణాదిలోనే ఏ చిత్రమూ ఇంత వసూలు చేయలేదని చెప్పారు. తమిళ చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రజనీకాంత్ ఎందిరన్ చిత్రం నమోదైందన్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని అజిత్ నటించిన ఆరంభం చిత్రం దక్కించుకుందన్నారు. తాజాగా ఆ రెండు చిత్రాలను కత్తి చిత్రం అధిగమించిందనే అభిప్రాయాన్ని ఎఆర్ మురుగదాస్ వ్యక్తం చేశారు. అలాగే నటుడు విజయ్ నటించిన చిత్రాలన్నింటికంటే మంచి కథాంశం ఉన్న చిత్రంగా కత్తి మరో ఘనతను చాటుకుంటోంది. -
హోంగార్డుల వసూళ్ల దందా
సాక్షి, గుంటూరు: జిల్లాలోని పలువురు హోంగార్డులు వసూల్ రాజాలుగా మారుతున్నారు. కొందరు పోలీస్ అధికారులు వీరి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బందికి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరిని గౌరవ వేతనంపై నియమిస్తోంది. కానీ కొందరు పోలీస్ అధికారులు సొంత పనులు, సొమ్ము వసూళ్లకు వీరిని ఉపయోగించుకుంటుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోంది. కానిస్టేబుళ్లయితే ఇళ్లలో పనిచేయడానికి ముందుకురారని, వసూలు చేసిన సొమ్ములో అధికం శాతం నొక్కేస్తారని భావిస్తున్న కొందరు అధికారులు హోంగార్డులను చేరదీస్తున్నారు. హోంగార్డులు స్థానికులు కావడంతో నిందితులు, బాధితులతో నేరుగా మాట్లాడి అధికారి జేబులు నింపేందుకు ఉపయోగపడుతున్నారు. దీంతో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకూ ఎవరికైనా సంబంధిత అధికారితో పని ఉంటే ముందుగా హోంగార్డులను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. అధికారుల తరఫున వసూళ్ల దందా నడుపుతున్న హోంగార్డులు ఎస్సైలను సైతం లెక్కచేయడంలేదు. రాత్రిపూట సదరు పోలీస్ అధికారిని ఇంటి వద్ద దింపేశాక హోంగార్డులు రోడ్లపై బెదిరింపులకు దిగుతున్నారు. వచ్చేపోయే వాహనాలను ఆపి తనిఖీల పేరిట, హోటళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే పొద్దున్నే తమ అధికారికి లేనిపోనివి చెప్పి స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండ, గురజాల, మాచర్ల, తెనాలి వంటి ప్రాంతాలతోపాటు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో లాటరీ, క్రికెట్ బెట్టింగ్, పేకాట, వ్యభిచారం, బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారు ఈ హోంగార్డులతో నెలవారీ మామూళ్లు మాట్లాడుకుని తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగితే అక్రమార్కులను అప్రమత్తం చేసి స్థావరాలు మార్పించడం కూడా వీరే చేస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి సొంతంగా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా నెలనెలా లక్షలాది రూపాయలు వసూలు చేసి పెడుతున్న హోంగార్డులను కొందరు అధికారులు బదిలీ అయ్యూక కూడా వదల్లేకపోతున్నారు. తామెక్కడికి వెళితే వీరినీ అక్కడికే బదిలీ చేయిస్తున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే తమకు అత్యంత సన్నిహితంగా ఉండే మరో పోలీస్ అధికారి వద్దకు వీరిని చేర్చి జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నారు. కొందరు హోంగార్డులు ఏకంగా పోలీస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి దీపావళి మందుగుండ, క్వారీ పేలుళ్ల వంటివాటికి అనుమతులు ఇచ్చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. హోంగార్డుల దందాను అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోకపోతే మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉంది. పోలీస్ విధులకు మాత్రమే వినియోగించుకోవాలి: ఆర్ఐ ప్రేమ్‌కుమార్ దీనిపై హోంగార్డుల ఆర్ఐ ప్రేమ్‌కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా హోంగార్డులను పగలైనా, రాత్రైనా 8 గం టలు మాత్రమే విధుల్లో ఉపయోగించుకోవాలని చెప్పా రు. అయితే కొంతమంది ఎస్సైలు, సీఐలు వారిని తమ సొంత పనులకు, వసూళ్లకు కూడా ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయనీ, తన అనుమతి లేకు ండా హోంగార్డులను ఇష్టంవచ్చినట్లు అధికారులు ఎక్కడికి బదిలీ అయితే అక్కడకు మార్చుకోవడానికి వీలులేదనీ పేర్కొన్నారు, ఇది చట్ట విరుధ్ధమనీ, ఎవ రైనా పోలీసు అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిై పె ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. హోంగార్డులు కొందరు యూనిఫాం ధరించకుండా మఫ్టీల్లో తిరుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసకుంటామన్నారు. -
మూడు రోజుల్లోనే రూ. 71.72 కోట్ల వసూళ్లు
న్యూఢిల్లీ: హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 70 కోట్ల మార్క్ దాటింది. ఒక్క మనదేశంలొనే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 71.72 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల స్థాయిని దాటేసింది. రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'బ్యాంగ్ బ్యాంగ్'లో హృతిక్ కు జంటగా కత్రినా కైఫ్ నటించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. -
నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’
చిన్న చిత్రాల జాబితాలో విడుదలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురిపించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి రీమేక్‌గా కన్నడలో రూపొందించిన ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆయన కుమారుడు సుమంత్, నటి కృతి కర్బంద హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విష్ణువర్థన్, చారులతా వంటి రీమేక్‌లను అందించిన దర్శకుడు పీ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుడు సుమంత్‌ను ఎలాగైనా సరే శాండల్‌వుడ్‌లో స్టార్‌ని చేయాలనే లక్ష్యంతో శైలేంద్రబాబు ఈ చిత్ర నిర్మాణానికి, ప్రచారానికి ఎక్కువగానే ఖర్చు పెట్టారని గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా సాధించే విజయం పైనే సుమంత్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం. -
కళ్లల్లో కారం చల్లి రూ 2.77 లక్షలు దోపిడీ
నల్లకుంట ఠాణా పరిధిలో ఘటన నల్లకుంట: బైక్‌పై వెళ్తున్న కలెక్షన్బాయ్ను గుర్తు తెలియని వ్యక్తులు తమ బైక్‌లతో ఢీకొట్టారు... కళ్లల్లో కారం చల్లి అతడి చేతిలో ఉన్న రూ. 2.77 లక్షల నగదు బ్యాగ్‌ను లాక్కొని ఉడాయించారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తూర్పు మండలం అదనపు డీసీపీ ఎల్టీ. చంద్రశేఖర్ తెలిపిన వివరాలు... సీతాఫల్మండి మైలార్‌గడ్డ నివాసి చిప్ప రాజేందర్(38) ట్రూప్ బజార్‌లోని మారుతి ఎలక్ట్రికల్స్‌లో సేల్స్‌మెన్/ కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 25, 26 తేదీల్లో వసూలు చేసిన డబ్బు రూ 2.77 లక్షలను కార్యాలయంలో అప్పగించకుండా తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. గురువారం తన వద్ద ఉన్న డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని సుల్తాన్ బజార్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జమ చేసేందుకు ఉదయం 11.30కి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. సరిగ్గా 11.45కి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ సమీపంలోని లలితానగర్ గండిమైసమ్మ ఆలయం వీధి వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు రాజేందర్ బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిపోయిన రాజేందర్ చేతిలోని క్యాష్‌బ్యాగ్‌ను ఓ వ్యక్తి లాక్కోవడానికి ప్రయత్నించగా వదలలేదు. దీంతో వారు రాజేందర్ కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కుని పారిపోయారు. సమీపంలో ఉన్న ఓ మహిళతో పాటు అదే వీధిలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న కొందరు యువకులు అడ్డుకునేందుకు యత్నించగా వారిని కూడా దుండగులు బెదిరించి పారిపోయారు. వెంటనే బాధితుడు నల్లకుంట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారం తెలిసి తూర్పుమండలం అదనపు డీసీపీ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లింబారెడ్డి, కోటిరెడ్డి, సీసీఎస్ డీసీపీ బాలరాజు నల్లకుంట స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడు రాజేందర్‌ను తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మైలార్గడ్డలోని అతని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఘటనపై అనుమానాలు... బాధితుడు రాజేందర్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది అంతుబట్టడంలేదు. ఈ దోపిడీకి పాల్పడిన ముఠాకు రాజేందర్‌కు ఏమైనా సంబంధాలున్నాయా? లేక బిగ్ బజార్లో మాదిరిగానే ఇందులో కూడా తెలిసిన వారి హస్తం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఆరు రోజుల క్రితం సుల్తాన్‌బజార్‌లో నలుగురు దుండగులు రెండు పల్సర్ బైక్‌లపై వచ్చి రూ. 50 లక్షలు దోచుకెళ్లిన సంఘటన.., ఇప్పుడు నల్లకుంటలో జరిగిన దోపిడీ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ఈ దోపిడీ కూడా అదే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
లేటరైట్ రైట్
గనులపై బడాబాబుల కన్ను జీకే వీధి, చింతపల్లిలో జోరుగా తవ్వకాలు మైదాన ప్రాంతాలకు భారీగా తరలింపు చోద్యం చూస్తున్న రెవెన్యూశాఖ పాడేరు,న్యూస్‌లైన్ : ఏజెన్సీలో నిక్షిప్తమైన లేటరైట్ ఖనిజాన్ని అక్రమార్కులు తవ్వుకుపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనప్పటికీ వీరు పెచ్చుమీరిపోతున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గూడెంకొత్తవీధి, చింతపల్లి, డుంబ్రిగుడ ప్రాంతాల్లో విలువైన లేటరైట్ ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదను తవ్వుకుపోయేందుకు బడాబాబులంతా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆందోళనలతో రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పైగా లేటరైట్ తవ్వకాలపై నిషేధం విధించింది. ఏజెన్సీ 11 మండలాల పరిధిలో ఎలాంటి ఖనిజ సంపదను తవ్వినా కేసులు నమోదు చేస్తామని 2013లో అప్పటి ఆర్డీఓ ఎం.గణపతిరావు హెచ్చరించారు. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన వంటి పరిణామాలు బడా వ్యాపారులకు కలిసి వచ్చింది. రెండు నెలల నుంచి చింతపల్లి, జీకేవీధి మండలాల్లో లేటరైట్ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. సిమెంట్ కర్మాగారాలకు ముడిసరుకుగా ఉపయోగించే లేటరైట్ మట్టికి ఎంతో డిమాండ్ ఉంది. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు సిండికేట్‌గా చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలోనూ, జీకే వీధి మండలం చాపరాతిపాలెం వద్ద యంత్రాల సహాయంతో లేటరైట్ ఖనిజాన్ని భారీగా తవ్వుతున్నారు. ఆర్అండ్బీ రోడ్డుకు ఆనుకునే రాజుపాకల కాఫీ తోటల సమీపంలో ఇప్పటికే 200 లారీల లోడుల లేటరైట్ మట్టిని మైదాన ప్రాంతాలకు తరలించారు. డౌనూరు ప్రాంతంలో స్టాక్ పాయింట్‌ను దర్జాగా పెట్టేశారు. ఈ క్వారీలకు తాత్కాలిక రోడ్లను కూడా నిర్మించారు. ఇంత జరుగుతున్నా ఆయా మండలాల రెవెన్యూ యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో లేటరైట్ తవ్వకాలు జరుగుతుండటంతో డుంబ్రిగుడ మండలంపై కూడా బడాబాబులు దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ కూడా తవ్వకాలకు వ్యూహం పన్నుతున్నారు. విలువైన ఖనిజ సంపదను దోచుకునే ముఠాలు మన్యంలో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అనుమతులు లేకపోయినా లేటరైట్ ఖనిజ సంపదను తవ్వుకుపోతున్న వైనం గిరిజనులను ఆందోళనకు గురిచేస్తోంది. చర్యలు తీసుకుంటాం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో లేటరైట్ అక్రమ తవ్వకాలను ‘న్యూస్‌లైన్’ పాడేరు ఆర్డీఓ జి.రాజకుమారి దృష్టికి తీసుకు వెళ్లింది. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ముందస్తు ఏర్పాట్లు
ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం రేపటి నుంచి సిబ్బందికి శిక్షణ తరగతులు కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి ఉద్యోగుల వివరాల సేకరణ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో జిల్లా యం త్రాంగం తలమునకలైంది. నోటిఫికేషన్‌కు ముందు ఎన్నికలు విధులు నిర్వర్తించే సిబ్బంది జాబితాను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సెక్టర్, నోడల్ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేసి అనుమతుల కోసం ఎన్నికల సంఘానికి పంపించింది. ప్రస్తుతం పీఓ, ఏపీఓల తో పాటు ఇతర ఎన్నికల సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు నియమించిన ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఈ నెల 4, 5 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల వివరాల సేకరణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అన్ని కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో 3506 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల సంఖ్యకు పది శాతం అధికంగా 3857 మంది పీఓలను, 3857 మంది ఏపీఓలతో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటి వరకు 30 రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి 13,996 మంది ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించారు. 16 కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 19,020 మంది వివరాలు కలెక్టరేట్‌కు చేరాయి. మరో 15 శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు వచ్చిన వెంటనే వాటిని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ర్యాండమైజ్ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దాదాపుగా సగం పని ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు. -
చీపురుపల్లి తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
చీపురుపల్లి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో వసూళ్లకు పాల్ప డి ఉద్యమాన్ని నడిపించారని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారినుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలతో చీపురుపల్లి తహశీల్దార్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ కాంతి లాల్ దండే సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తహశీల్దార్ సస్పెన్షన్ వెనుక రాజకీయ కారణాలున్నాయ న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నియోజకవర్గం. నిబంధనలకు విరుద్ధమైనా ఇక్కడ అధికా ర పార్టీ నాయకులు చెప్పింది చేయాల్సిందే. వారు ఆదేశించిందే వేదంగా పని చేస్తేనే ఉద్యోగంలో ఉంటారు. లేకుంటే బదిలీయే కాదు ఏకంగా సస్పెన్షనే ఉద్యోగులకు బహుమానం గా దక్కుతుంది. అందుకు ఉదాహరణే చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ సస్పెన్షన్ అని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పింది వినడం లేదన్న అక్కసుతోనే మంత్రి బొత్స స్థాయిలో కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తహశీల్దార్‌ను సస్పెండ్ చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ రామకృష్ణ, అధికార పార్టీ నాయకులను పక్కన పెట్టడమే కాకుండా పరోక్షంగా ఇతర పార్టీ నాయకులకు సహకరి స్తున్నారన్న అక్కసు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా ఏసీబీ ట్రాప్ చేయించేం దుకు కూడా ఇటీవల పూనుకున్నారన్న వాదనలు కూడా వినిపించాయి. రాజ కీయ కారణాలతో సస్పెన్షన్ వేటు వేయించడం అన్యాయమంటూ అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.