న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశాలలో భారత్ ఒకటి. ఇండియాలో ఏడాదికి 20 భాషల్లో1500 నుంచి 2,000 మధ్యలో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు 2.1బిలియన్ డాలర్ల కలెక్షలన్లు వసూలు చేస్తున్నాయి. ఇది 2020 నాటికి 11 శాతం వృద్ధి సాధించి 3.7 బిలియన్ డాలర్లు(రూ.24,684 కోట్లు) ఉండనుందని డెలాయిట్ టచ్ థామస్ తన రిపోర్టులో వెల్లడించింది. భవిష్యత్తు భారతీయ సినిమాలదే నని నివేదిక తెలిపింది.
ఇండియాలో ఇప్పుడే పట్టణాలుగా రూపొందుతున్ననగరాల్లో సైతం సినిమాకు డిమాండు పెరుగుతోందని నివేదిక తెలిపింది. అంతే కాకుండా అత్యుదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియన్ సినిమాలో ఎక్కువగా వాడుతున్న కారణంగా విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్నాయని తేల్చంది. బాలీవుడ్ సినిమాలు 43 శాతం వసూల్లు సాధించగా ప్రాంతీయ చిత్రాలు 57 శాతం రెవెన్యూని సాధిస్తున్నాయి. డబ్బింగ్ అయిన ఇంగ్లీష్, చైనా సినిమాలు సైతం ఇండియాలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నయి. ఫైరసీ, సినిమా ఖర్చులు పెరగడం, అధిక పన్నులు ఇతరత్రా సమస్యులన్నా అధిక స్ధాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయని నివేదిక తెలిపింది.
భవిష్యత్తు భారతీయ సినిమాలదే
Published Sun, Sep 25 2016 5:10 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement