Indian Films
-
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్‌డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్‌షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్‌లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్లో తెరకెక్కించిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' కేన్స్‌లో పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది. పాయల కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్ చిత్రమిది. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారాల కోసం పోటీలో నిలిచింది. దాదాపుగా పామ్ డి ఓర్ అవార్డు కోసం పోటీ పడుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా.. గతంలో 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన 'స్వహం' మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలతో కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' పోటీ పడుతోంది. ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీకి 'లేడీబర్డ్', 'బార్బీ' డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ అధ్యక్షత వహించనున్నారు. అంతే కాకుండా బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం 'సంతోష్' కూడా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది. కాగా.. గతంలో పాయల్ కపాడియా డాక్యుమెంటరీ 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' 2021 ఎడిషన్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డ్‌ను గెలుచుకుంది. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అనే మూవీని ఒక నర్సు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన భారతీయ చిత్రాలలో చేతన్ ఆనంద్, వి శాంతారామ్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎంఎస్ సత్యు, మృణాల్ సేన్ రచనలు ఉన్నాయి. 'నీచా నగర్' పామ్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. Explore the dark heart of India with Sandhya Suri’s sophomore feature SANTOSH, in Official Selection at UN CERTAIN REGARD.#Santosh #SandhyaSuri @shahanagoswami @sunita_rajwar #GoodChaos @hautetcourt #LionfishFilms @BFI @Festival_Cannes #Cannes2024 #UnCertainRegard pic.twitter.com/UClJuS7rtW — mk2 films (@FilmsMk2) April 11, 2024 ALL WE IMAGINE AS LIGHT – Payal KAPADIA#Competition #Cannes2024 — Festival de Cannes (@Festival_Cannes) April 11, 2024 -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు
ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి లగాన్, దిల్వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాటు దేశంలో రెండవ అతిపెద్ద నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్లో 1977లో ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రూ.1258 కోట్లను రాబట్టడమే కాదు ఆస్కార్ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కన్నడ మూవీల జాబితాలో వసూళ్లకు సంబంధించిన టాప్ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్-2. 100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్) అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీస్ దంగల్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్‌లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) బాహుబలి-2 ద కంక్లూజన్ రెండు భాగాలుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్ బాహుబలి-2 రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించింది కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్ హిట్ అయిన కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా కేజీఎఫ్2 తెరకెక్కింది.ఈ మూవీలో 2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) బజరంగీ భాయీజాన్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు. పీకే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు. ---- పోడూరి నాగ ఆంజనేయులు -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు ఆస్కార్
-
చైనాలో మన సినిమా ఆడుతోంది
ముంబై: భారతీయ సినిమాలు మన దేశంలో కంటే చైనాలో ఎక్కువగా ఆడుతున్నాయట. ‘అయిదారేళ్ల క్రితం భారత్‌లో 12,000 థియేటర్లు ఉండేవి. ఇప్పుడీ సంఖ్య 8,000లకు వచ్చి చేరింది. ఇదే సమయంలో చైనాలో సినిమా ప్రదర్శనశాలలు 10,000 నుంచి ఏకంగా 70,000లకు పెరిగాయి. అందుకే కొన్ని భారతీయ సినిమాలు ఇక్కడి కంటే మెరుగ్గా చైనాలో రాణిస్తున్నాయి’ అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ ట్రెండ్‌ను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరిన్ని థియేటర్లు ప్రారంభం కావడమే ఇందుకు పరిష్కారమని అన్నారు. పశ్చిమ బెంగాల్లో 10 లక్షల జనాభా ఉన్న మాల్డాలో ఒక్క థియేటర్ లేదని గుర్తుచేశారు. సరైన ధరలో సినిమా.. సినిమా ప్రదర్శనశాలలను తెరవాలనుకునే ఔత్సాహికుల కోసం ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ప్రారంభించామని చంద్ర తెలిపారు. ‘ఇన్వెస్ట్ ఇండియాతోపాటు అనుమతులను సులభతరం చేసేందుకు నేషనల్ సింగిల్ విండో పోర్టల్ సాయంతో ఇది పనిచేస్తుంది. కర్నాటకలో జిల్లా కేంద్రాల్లో గడిచిన 3–4 నెలల్లో ఆరు థియేటర్ల ఏర్పాటుకు సాయం చేశాం. ‘రూ.75కు టికెట్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. సినిమా సరైన ధరలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎగ్జిబిషన్ పరిశ్రమ కూడా ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. నేరుగా మొబైల్లో.. 5జీ నెట్వర్క్ రాకతో టీవీ ఛానెళ్లను నేరుగా మొబైల్‌కు ప్రసారం చేసే అవకాశం ఉంటుందని అపూర్వ చంద్ర అన్నారు. ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఫోన్లో చిన్న పరికరాన్ని జోడించడం ద్వారా వందలాది ఛానెళ్లను వీక్షించడంపై ప్రసార భారతి ఇప్పటికే అమలు చేయదగ్గ భావనతో ముందుకు వచ్చిందని తెలిపారు. -
ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'
ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ (అంతర్జాతీయ ఉత్తమ చిత్రం) విభాగంలో నామినేషన్ ఎంట్రీ పోటీ కోసం మన దేశం తరఫున గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రకథ విషయానికి వస్తే... గుజరాత్‌లోని సౌరాష్ట్రలో గల చలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల సమయ్ (భవిన్ రాబరి) సినిమా ప్రొజెక్టర్ టెక్నీషియన్ ఫజల్ (భవేష్ శ్రీమాలి)ని మచ్చిక చేసుకుని, సినిమా హాల్ ప్రొజెక్షన్ బూత్‌లోకి ప్రవేశిస్తాడు. అలా వేసవిలో చాలా సినిమాలు చూస్తాడు. ఆ తర్వాత అతనే సొంతంగా ఓ ప్రొజెక్షన్ని తయారు చేయాలనుకుంటాడు. సినిమా అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందనే కథతో ఈ చిత్రం సాగుతుంది. చిత్రదర్శకుడు నలిన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ‘‘ఛెల్లో షో’పై నమ్మకం ఉంచి, మా చిత్రాన్ని ఆస్కార్‌కు ఎంపిక చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మళ్లీ ఊపిరి తీసుకోగలుగుతున్నాను. అలాగే సినిమా అనేది వినోదాన్ని, స్పూర్తిని, విజ్ఞానాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు పాన్ నలిన్ . ఈ సంగతలా ఉంచితే.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ని ఎంపిక చేయకపోవడంపట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తూ, ట్వీట్లు చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని చిత్రబృందం ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి పంపించిందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
Cannes Film Festival: గోస్ టు కాన్స్
పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్ టు కాన్స్’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కాన్స్ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. లైలా... రోషిణి... ఓ ఇల్లు జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్ చిన్, మహీన్ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్ జగహ్ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్ ఉమెన్ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓ బాలుడి జ్ఞాపకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు. నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్’ బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్’. హర్షద్ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్ ఫండెడ్’ మూవీగా ‘ఫాలోయర్’ రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చేస్తున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది. పేదరికాన్ని జయించాలని... ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాగ్జాన్ 2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్ లీకేజ్ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్జాన్’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్ గ్జయ్. బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
నేడు 'పద్మావతి' నాడు ఎన్నో....
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా బన్సాలీ తీసిన బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' విడుదలను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, దానికి వ్యతిరేకంగా దేశంలో ఏదో చోట గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ సినిమాకు వ్యతిరేకంగా ఇలా గొడవలు జరగడం దేశంలో ఇదే మొదటి సారి కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ మనోభాలకు విరుద్ధంగా ఉందంటూ ఏదో సినిమాకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆందోళనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఓసారి హిందూ కమ్యూనిటీ వారు గొడవలు చేస్తే మరోసారి ముస్లిం కమ్యూనిటీ వారు, మరోసారి మరో కమ్యూనిటీ వారు గొడవలు చేయడం మామూలయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చలనచిత్ర సర్టిఫికేట్ బోర్డు కలిగి ఉన్నా, సినిమాలపై గొడవలు చేయడం కొన్ని వర్గాలకు రివాజుగా మారిపోయింది. ఇప్పుడు పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్న రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ కర్ణిసేన ఇంతకుముందు 2008లో అశుతోష్ గోవారీకర్ తీసిన బాలీవుడ్ చిత్రం జోధా అక్బర్ చిత్రాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సినిమాలో హృతిక్ రోషన్ ముఘల్ చక్రవర్తి అక్బర్గాను, ఐశ్వర్యరాయ్ ఆయన భార్య జోధాగాను నటించారు. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ వారు గొడవ చేయడంతో అప్పడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్‌లో సినిమా విడుదలను నిషేధించింది. అప్పుడు బహుజన సమాజ్‌వాది అధికారంలో ఉన్న యూపీలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో, బీజీపీ ఆధీనంలోని ఉత్తరాఖండ్‌లో కూడా ఈ సినిమా విడుదలను నిషేధించారు. 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై అమృత్ నహతా నిర్మించిన వ్యంగ్య చిత్రం 'కిస్సా కుర్సీ కా' పై కాంగ్రెస్ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి కాంగ్రెస్ యువజన నాయకుడు సంజయ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సినిమా ప్రింట్లనే కాకుండా ఒరిజనల్ నెగెటివ్ ప్రింట్‌ను కూడా దగ్ధం చేశారు. ఆ తర్వాత 1978లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నహతా ఆ సినిమాను పునర్మించి విడుదల చేశారు. గొడవ, రాజకీయ జోక్యం వల్ల మణిరత్నం తీసిన 'బాంబే' సినిమా కూడా ఆలస్యంగా విడుదలయింది. అందులో హిందూ హీరోకు ముస్లిం భార్యకు మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడాన్ని ముస్లిం వర్గాలు వ్యతిరేకించాయి. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం చెలరేగిన ముంబై అల్లర్ల నేపథ్యంలో సినిమా తీయడం, అప్పటి శివసేన చీఫ్ బాల్‌ఠాక్రేను పోలిన పాత్రలో టూ ఆనంద్‌ను చూపించడం వివాదాస్పదమైంది. ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాకనే ఆ సినిమా విడుదలను హిందూ సంఘాలు అనుమతించాయి. దాంతో 1995, మార్చి 10వ తేదీన ఆ సినిమా విడుదలయింది. ఆ సినిమా అప్పుడు సూపర్ హిట్టయింది. 1998లో విడుదలయిన దీపా మెహతా తీసిన చిత్రం 'ఫైర్' కూడా ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కాన్ని చూపించడం పట్ల కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అది మన సంస్కృతి కానందున ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఆ సినిమాకు వ్యతిరేకంగా ముంబై, ఢిల్లీ, సూరత్, పుణెలలో శివసేన, భజరంగ్ దళ్లు ఆందోళన చేశాయి. సినిమా థియేటర్లను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాను పునస్సమీక్షకు సెన్సార్ బోర్డుకు ప్రభుత్వం మళ్లీ పంపించిగా, రెండోసారి కూడా ఎలాంటి కత్తిరింపులు లేకుండా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించింది. అయినప్పటికీ వారు దీపా మెహతను మరచిపోలేదు. ఆమె షబానా ఆజ్మీ, నందితా దాస్, అక్షయ్ కుమార్‌తో కలసి తన 'వాటర్' చిత్ర నిర్మాణం కోసం 2000 సంవత్సరంలో వారణాసికి వెళ్లారు. అక్కడ ఆమె సిట్టింగ్‌లనూ హిందూ మూకలు దగ్ధం చేయడమే కాకుండా ఆమె దిష్టిబొమ్మలను తగులబెట్టి నదిలో పడేశారు. అక్కడ ఒక్క షాట్‌ను మాత్రమే తీయగలిగినా దీపా మెహతా తన పూర్తి చిత్రాన్ని ఇతర నటీ నటులతో శ్రీలంకలో పూర్తి చేశారు. ఇక అనిల్ శర్మ తీసిన 'గదర్-ఏక్ ప్రేమ్ కహాని' కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం' బన్సాలీ తీసిన 'బాజీరావ్ మస్తానీ' సినిమాలన్నీ వివాదాస్పదమయ్యాయి. వాటన్నింటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలన్నీ కూడా సినిమాలు బాగా ఆడేందుకే ఉపయోగపడ్డాయి. -
ముకేశ్ అంబానీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ బాలీవుడ్ లో పాకిస్థాన్ కళాకారుల నిషేధం వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో నిర్వహించిన ఇంటర్ యాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆద్వర్యంలో ది ప్రింట్ నిర్వహించిన ఆఫ్ ది కఫ్ షో లో ఆయన పాకిస్తాన్ నటుల పై నిషేధాన్ని పరోక్షంగా సమర్థించి సంచలనం రేపారు. కళలు, సంస్కృతి కన్నా తనకు భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. నేషన్ కమ్స్ ఫస్ట్ అనీ ఈ విషంయలో తాను చాలా క్లియర్ గా ఉన్నాననీ వ్యాఖ్యానించారు. తాను మేధావిని కాననీ , తనకు ఇవన్నీ అర్థం కావని చెప్పారు కానీ నిస్సందేహంగా భారతీయులందరిలాగానే తనకు దేశమే ముఖ్యమనీ, మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందని అంబానీ చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా రాజకీయాల్లో చేరతారా అని ప్రశ్నించినపుడు దానికి ప్రతికూల సమాధాన మిచ్చారు తనకు రాజకీయాలు అచ్చిరావన్నట్టు అంబానీ మాట్లాడారు. కాగా సర్జికల్ దాడుల నేపథ్యంలో పాక్ - ఇండో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ థాకరే పాకిస్తాన్ నటులను దేశంనుంచి విడిపోవాలన్న వ్యాఖ్యలతో దుమారం రేగింది. మరోవైపు పాకిస్టాన్ నటులు నటించిన యేదిల్ హై ముష్కిల్ సినిమానను ప్రదర్శించబోమని మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక, గోవా కు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమాను తేల్చిచెప్పారు. అటుసల్మాన్, ప్రియాంకా తదితరులంతా పాక్ నటులపై ఎందుకు నిషేధం విధించారంటూ ప్రశ్నించడం పెనుదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. -
'సినిమాలపై నిషేధంతో పైరసీ ముప్పు'
కరాచి: ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత చలనచిత్రాలను పాకిస్థాన్‌లో పూర్తిగా నిషేధించడం పైరసీ వేళ్లూనుకునేందుకు దారితీస్తుందని ఆ దేశ సినీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనతోనే సుమారు 50–60 శాతం ఆదాయం పొందే సినిమా థియేటర్ల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ కళాకారులపై భారత్‌లో నిషేధం విధించిన పిమ్మట పాక్‌లోనూ భారత సినిమాల ప్రదర్శనను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సినిమా థియేటర్ల యజమానులు పాక్ ప్రభుత్వానికి సంఘీభావంగా నిలిచారని డాన్ పత్రిక పేర్కొంది. ‘ భారీగా ఆదాయం వస్తున్నా భారత సినిమాల ప్రదర్శనను నిలిపేయాలన్నది స్థానిక భాగస్వాముల అగత్య నిర్ణయం. భారత సినీ పరిశ్రమ వర్గాలు మా కళాకారులపై నిషేధం విధించకుంటే మేమూ ప్రతిచర్యకు పాల్పడం. భారత చలన చిత్రాలకు పాకిస్థాన్ మూడో అతిపెద్ద మార్కెట్ అన్న సంగతిని వారు మరవకూడదు’ అని లాహోర్‌లోని సూపర్ సినిమా జనరల్ మేనేజర్ ఖోరెమ్ గుల్తాసాబ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విడుదలైన వాటితో పాటు పాత చిత్రాలతో పాకిస్థాన్ లో థియేటర్లు నడిపిస్తున్నారు. గతేడాది కేవలం 6 పాక్ చిత్రాలే విడుదలయ్యాయి. ప్రస్తుతానికైతే వీక్షకుల సంఖ్య తగ్గకున్నా, నిషేధం దీర్ఘకాలం కొనసాగితే పాకిస్తాన్ చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
భవిష్యత్తు భారతీయ సినిమాలదే
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశాలలో భారత్ ఒకటి. ఇండియాలో ఏడాదికి 20 భాషల్లో1500 నుంచి 2,000 మధ్యలో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు 2.1బిలియన్ డాలర్ల కలెక్షలన్లు వసూలు చేస్తున్నాయి. ఇది 2020 నాటికి 11 శాతం వృద్ధి సాధించి 3.7 బిలియన్ డాలర్లు(రూ.24,684 కోట్లు) ఉండనుందని డెలాయిట్ టచ్ థామస్ తన రిపోర్టులో వెల్లడించింది. భవిష్యత్తు భారతీయ సినిమాలదే నని నివేదిక తెలిపింది. ఇండియాలో ఇప్పుడే పట్టణాలుగా రూపొందుతున్ననగరాల్లో సైతం సినిమాకు డిమాండు పెరుగుతోందని నివేదిక తెలిపింది. అంతే కాకుండా అత్యుదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియన్ సినిమాలో ఎక్కువగా వాడుతున్న కారణంగా విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్నాయని తేల్చంది. బాలీవుడ్ సినిమాలు 43 శాతం వసూల్లు సాధించగా ప్రాంతీయ చిత్రాలు 57 శాతం రెవెన్యూని సాధిస్తున్నాయి. డబ్బింగ్ అయిన ఇంగ్లీష్, చైనా సినిమాలు సైతం ఇండియాలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నయి. ఫైరసీ, సినిమా ఖర్చులు పెరగడం, అధిక పన్నులు ఇతరత్రా సమస్యులన్నా అధిక స్ధాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయని నివేదిక తెలిపింది.