ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి లగాన్, దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాటు దేశంలో రెండవ అతిపెద్ద నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్‌లో 1977లో ఎన్‌టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది.
1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ రూ.1258 కోట్లను రాబట్టడమే కాదు ఆస్కార్ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అయితే కన్నడ మూవీల జాబితాలో వసూళ్లకు సంబంధించిన టాప్ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్-2. 100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్)
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీస్
దంగల్
అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్‌లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో)
బాహుబలి-2 ద కంక్లూజన్
రెండు భాగాలుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్ బాహుబలి-2 రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది.
ఆర్‌ఆర్‌ఆర్
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించింది
కేజీఎఫ్-2
ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్ హిట్ అయిన కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా కేజీఎఫ్2 తెరకెక్కింది.ఈ మూవీలో 2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్ లావణ్య ఎంగేజ్‌మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?)
బజరంగీ భాయీజాన్
సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు.
పీకే
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు నటించారు.
సీక్రెట్ సూపర్ స్టార్
చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు.
---- పోడూరి నాగ ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment