![Ajith Kumar Latest Movie Vidaamuyarchi One Week Collections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/vidamuyarchi.jpg.webp?itok=QVgVmHR9)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే విడాముయర్చి (తెలుగులో పట్టుదల) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోవడంపై విఫలమైంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విడాముయర్చి అధిగమించలేకపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించారు.
ఈ మూవీ రిలీజైన వారం రోజులైనా కేవలం రూ.రూ. 71.3 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఏడో రోజు కేవలం రూ. 2.50 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో వందకోట్ల నెట్ వసూళ్లు సాధించాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి రెండో వారంలోనైనా విడాముయర్చికి కలిసొస్తుందేమో చూడాలి. అయితే ఈనెల 14న లవర్స్ డే రోజున మరిన్ని కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. దీంతో ఈ సినిమాకు తీవ్రమైన పోటీ తప్పేలా లేదు
కాగా.. ఈ సినిమాను భారీ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. 1997 అమెరికన్ చిత్రం బ్రేక్‌డౌన్ ఆధారంగా విడాముయర్చిని రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్ బైజాన్‌లో జరిగింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణియన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment