boxoffice
-
బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్.. అదే ప్రధాన కారణం: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కై ఫోర్స్ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హైజరైన అక్షయ్ బాక్సాఫీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఓటీటీల వల్లే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అక్షయ్ కుమార్ అన్నారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల భారీగా తగ్గిందని తెలిపారు. పెద్ద చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీలేనని వెల్లడించారు.అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..'ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి ఆరా తీశా. ఏ సినిమా అయినా ఓటీటీలో చూస్తామని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీనే అని నాకు అర్థమైంది. కరోనా టైమ్‌లో ఓటీటీ వేదికగా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. అది ఒక అలవాటుగా మారిందని' అన్నారు. కాగా.. తెలుగులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now. Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు..3 రోజుల్లోనే భారీ మైల్ స్టోన్..
-
పుష్పరాజ్ మరో రికార్డ్.. అరుదైన క్లబ్లో చేరిన పుష్ప-2
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తియినప్పటికీ వసూళ్ల రాబట్టడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. తొలి రోజు నుంచి రికార్డుల సునామీ సృష్టిస్తోన్న పుష్పరాజ్.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.బాలీవుడ్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో పుష్ప-2 హిందీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ వసూళ్లు కేవలం 31 రోజుల్లోనే పుష్ప-2 సాధించింది. ఈ కలెక్షన్లతో రూ.800 కోట్ల అరుదైన క్లబ్లో చేరింది. ఇప్పటికే హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.వివాదంలో పుష్పరాజ్..అయితే ఈ మూవీ విడుదలకు ముందు రోజు విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల నాంపల్లి కోర్టు సైతం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.ఆస్పత్రిలో మహిళ కుమారుడు..సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ కుమారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు, అల్లు అరవింద్ ఆ బాలుడిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల సాయం ప్రకటించారు. ఇప్పటికే వారి ఫ్యామిలీకి చెక్కులు కూడా అందజేశారు. Brand #Pushpa inagurates 𝟖𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄 CLUB in Hindi ❤🔥#Pushpa2TheRule has a RECORD BREAKING COLLECTION in Hindi with 𝟖𝟎𝟔 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐍𝐄𝐓𝐓 in 31 days 💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/bRAgO99ygp— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2025 -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. ఆ ఒక్కటి వచ్చుంటే?
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో రూ.1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే 2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.హిందీలో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.770 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగానూ ఘనతను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.#Pushpa2TheRule is RULING THE INDIAN BOX OFFICE with its record breaking run 💥💥The WILDFIRE BLOCKBUSTER GROSSES 1799 CRORES WORLDWIDE in 4 weeks ❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/n5k1aSWQ0N— Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2025 -
తగ్గిన పుష్పరాజ్ కలెక్షన్స్.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- సుకుమార్ మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. హిందీలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పుష్పమానియా కొనసాగుతోంది.తాజాగా పుష్పరాజ్ మరో రికార్డ్ సృష్టించాడు. ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే రూ.1719 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినప్పటికీ.. తాజా వసూళ్లు చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం కాస్తా కష్టంగానే అనిపిస్తోంది.కాగా.. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1 చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.There is no stopping #Pushpa2TheRule at the box office 💥💥Becomes the fastest Indian film to cross 1719.5 CRORES WORLDWIDE in 22 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/CztMIusNBW— Mythri Movie Makers (@MythriOfficial) December 27, 2024 -
థియేటర్లలో 200 రోజులు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనదైన నటనతో వెండితెరపై అభిమానులను అలరించారు. ఆయన తన కెరీర్లో నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల తన బ్లాక్ బస్టర్‌ను చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో డైలాగ్స్, సీన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మరో మూవీకి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.1991లో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. థియేటర్లలో 200 రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబుకు అందించింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. పి.వాసు, పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు. కేవీ మహదేవన్ సంగీమందించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తన కెరీర్లో గొప్ప మెలురాయిగా నిలిచిపోయిందన్నారు.మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' అసెంబ్లీ రౌడీ (1991) నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను. ఆకట్టుకునే కథాంశంతో పి.వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ కింగ్ అనే బిరుదు అందించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలోని కేవీ మహదేవన్ మ్యూజికల్ హిట్లు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి' అంటూ పోస్ట్ చేశారు. 🌟 Assembly Rowdy (1991) – A cherished milestone in my journey! 🌟Playing such a powerful role in this action, comedy-drama, directed by Sri. B. Gopal, was truly memorable. With an engaging storyline by Sri. P. Vasu and impactful dialogues from the Paruchuri Brothers, the film… pic.twitter.com/SX9vHm580D— Mohan Babu M (@themohanbabu) December 25, 2024 -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే పలు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు వేల కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. తాజా వసూళ్లు చూస్తే మరికొద్ది రోజుల్లోనే ఈ అరుదైన మైలురాయిని పుష్ప-2 మూవీ చేరుకునేలా కనిపిస్తోంది.అయితే నార్త్‌లో పుష్పరాజ్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. తాజాగా హిందీ పుష్ప-2 మరో రికార్డ్ సాధించింది. రిలీజైన 19 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త సృష్టించింది. దీంతో అత్యంత వేగంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. హిందీ సినీ చరిత్రలోనే పుష్ప-2 అరుదైన ఘనత సాధించింది. Pushpa Raj introduces the 700 CRORE CLUB to HINDI CINEMA 💥💥 The FIRST EVER FILM to collect 700 CRORES in HINDI ✨#Pushpa2TheRule collects massive 704.25 CRORES NETT in Hindi ❤🔥❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/9Mg6plgJyE— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2024 -
మలయాళ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!
ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
ఇండియన్ బాక్సాఫీస్ రూలర్‌గా 'పుష్ప'రాజ్.. తొలిరోజు ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. భారత సినీ చరిత్రలోనే భారీ రికార్డ్‌ను బన్నీ క్రియేట్ చేశాడు. ఇండియాలో ఇప్పటి వరకు మొదటిరోజు కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఈ రికార్డ్‌ను ఇప్పుడు పుష్ప కొట్టేశాడు. బాక్సాఫీస్ వద్ద తన బ్రాండ్ సత్తా ఏంటో ఈ చిత్రం ద్వారా బన్నీ చూపించాడు.డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో పుష్ప రూల్ ప్రారంభమైంది. కలెక్షన్ల పరంగా టాలీవుడ్, బాలీవుడ్, ఓవర్సీస్లలో టాప్‌లో కొనసాగుతోంది. ప్రీ సేల్ బుకింగ్స్‌లో కూడా తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శించింది. ఇలా తొలిరోజు పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వాటా ఉంటే ఆ తర్వాత బాలీవుడ్ ఉంది. అమెరికాలోనే సుమారు రూ. 35 కోట్ల వరకు రాబట్టినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను దాటేసిన అల్లు అర్జున్బాలీవుడ్లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఇప్పటి వరకు ఉంది. అయితే, తాజాగా 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. పుష్ప తర్వాతే బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)బుక్‌మైషోలో 'పుష్ప'గాడి రికార్డ్'పుష్ప 2'ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేశారు. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డ్స్ అన్ని బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా లక్షకు పైగానే టికెట్లు విక్రయించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ప్రభాస్ 'కల్కి' పేరుతో ఉన్న రికార్డ్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ అధిగమించింది. 'పుష్ప 2' భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి.THE BIGGEST INDIAN FILM creates HISTORY at the box office ❤️🔥#Pushpa2TheRule grosses 294 CRORES worldwide on Day 1 making it THE HIGHEST OPENING DAY in Indian Cinema 💥💥💥#Pushpa2BiggestIndianOpenerRULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1… pic.twitter.com/uDhv2jq8dc— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
Pushpa-2: అస్సలు తగ్గేదే లే..! తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!
‘అస్సలు తగ్గేదేలే... పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్’ అంటూ సినిమాలో ఉన్నట్లు విడుదలైన అన్ని చోట్లా పుష్పరాజ్ మ్యానియా భారీగా కనిపించింది. సినిమా మొత్తం అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే జాతర సీన్ కి థియేటర్లు ఈలలు కేకలతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ కార్మికుడి నుంచి స్మగ్లింగ్ కింగ్‌పిన్ గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన అల్లు అర్జున్ ... తొలి భాగాన్ని మించిపోయి రెండో భాగంలో తన సత్తా చూపాడని ప్రేక్షకులు కీర్తిస్తున్నారు.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకే పుష్పగాడి రూలింగ్ (ప్రీమియర్స్) మొదలైంది.‘పుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది. గురువారం సాయంత్రం నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్, సీఈవో చెర్రీలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి, తమ ఆనందం పంచుకున్నారు. తొలి రోజు రూ. 250 కోట్లు?బాక్సాఫీస్ నివేదికల ప్రకారం ‘పుష్ప 2’ ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్’తో సహా పలు చిత్రాల కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. తొలి రోజు దాదాపు రూ. 250 కోట్ల వసూళ్లు ఖాయం అని గురువారం వసూళ్లను బట్టి అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రం అంచనాలకు అందని విధంగా అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా, హిందీ మాట్లాడే ప్రేక్షకులు సైతం తొలి పార్ట్‌ని మించి ‘పుష్ప 2: ది రూల్’కి జేజేలు పలుకుతున్నారు.జాతరే జాతర..‘పుష్ప 2’ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేసి, ఆశ్చర్యపరిచారు మేకర్స్. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో థియేటర్లు జాతరను తలపిస్తుండడం విశేషం. బాక్సాఫీస్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ పుష్ప కలెక్షన్ల వేట సాగుతోంది. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు పాత రికార్డ్స్ బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా 95.71వేల టికెట్లు విక్రయించిన రికార్డు ఇప్పటిదాకా ప్రభాస్ ‘కల్కి’ పేరిట ఉండగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దీన్ని అధిగమించింది.కేవలం ఒక గంటలో 97.74 వేల టికెట్లను విక్రయించడం ద్వారా కొత్త ఆల్–టైమ్ రికార్డును నెలకొల్పింది. మరో విశేషం ఏంటంటే వారాంతపు రోజుల్లో ‘కల్కి’ ఈ రికార్డును సాధించగా, ‘పుష్ప 2’ సాధారణ వారపు రోజున దానిని సాధించడం. ఆల్ ఇండియా బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను అందించే సాక్నిక్ ప్రకారం... ‘పుష్ప 2’ భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది.చదవండి: షారుఖ్నే దాటేసిన బన్నీ.. నిజంగా ఇది విధ్వంసమే!ఉత్తర అమెరికాలో ప్రీ–సేల్స్ 2.5 మిలియన్లను అధిగమించడం కూడా రికార్డే. ప్రస్తుత టాక్ని బట్టి సినీ పరిశ్రమ వర్గాలు ‘పుష్ప 2’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్‌ని అంచనా వేస్తున్నారు. ఇదే వేగంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే వసూళ్లు మొత్తంగా రూ. 800– 1,000 కోట్ల కలెక్షన్లు దాటేసినా ఆశ్చర్యం లేదని పీవీఆర్ ఐనాక్స్ ప్రతినిధి గౌతం దత్తా అంటున్నారు.ఉత్తరాదిన కూడా వీర విహారం‘పుష్ప 2: ది రూల్’ ఉత్తరాదిన కూడా వీర విహారం చేస్తోంది. ఈ సినిమా చూసిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కునాల్ కోహ్లీ అల్లు అర్జున్, సుకుమార్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘అల్లు అర్జున్ మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ కోసం ‘పుష్ప 2’ చూడండి. రష్మిక ఫ్యాబ్యులెస్. కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్‌కు అర్థం చెబుతూ సుకుమార్ ఒక కంప్లీట్ మసాలా ఎంటర్టైనర్ని అందించారు. అల్లు అర్జున్ నటనతో ఈ సినిమా బాక్సాఫీస్‌లో కొత్త చరిత్ర లిఖించనుంది’’ అని ఆయన పొగడ్తలతో ముంచెత్తడం ఉత్తరాదిలో ఈ సినిమా ప్రభంజనానికో నిదర్శనం. చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా.. ఫట్టా?పుష్ప: ది ర్యాంపేజ్‘పుష్ప 2’కి కొనసాగింపుగా ‘పుష్ప: ది ర్యాంపేజ్’ రానుంది. అయితే ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్‌లకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే ‘పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు మొదలవుతాయని ఊహించవచ్చు. ఇక ‘పుష్ప 2’ భారీ విజయంతో ‘పుష్ప 3’ పై భారీ అంచనాలు ఉండటం సహజం. -
పుష్ప రాజ్ వసూళ్ల వేట
-
మట్కా,కంగువా ఫస్ట్ డే కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. భారీ అంచనాలతో ఆయన నటించిన 'మట్కా' చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్ కెరియర్లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'మట్కా' రికార్డ్ క్రియేట్ చేసింది.'పలాస' సినిమాతో మెప్పించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సుమారు రూ. 40 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. 'మట్కా' టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకునేలా ఉండటం, వరుణ్ భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు ఆసక్తిరేకెత్తించే సీన్స్ పెద్దగా సినిమాలో కనిపించలేదు. దీంతో 'మట్కా' మొదటిరోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కనీసం రూ. 2 కోట్లు అయినా రావడం కష్టమని చెప్పవచ్చు.కంగువా కలెక్షన్స్సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం 'కంగవ'. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. అయితే, కంగువా మొదటిరోజు రూ. 58.62 కోట్లు రాబట్టినట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కంగువా నిర్మాతలకు కూడా భారీగా నష్టాలు తప్పవని చెప్పవచ్చు. -
'అమరన్' కలెక్షన్స్.. శివ కార్తికేయన్ కెరీర్లో అరుదైన రికార్డ్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం 'అమరన్'. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ కెరిర్లో ఒక మైల్స్టోన్ లాంటి సినిమాగా అమరన్ నిలిచిపోనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు.వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే రూ. 35 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా అమరన్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరింది. కేవలం తమిళనాడులోనే రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన అమరన్.. శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ కెక్కింది. ఆయన నటించిన గత సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు డాక్టర్ (25 రోజులు), డాన్ (12రోజులు) పట్టింది. అయితే, ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమరన్ చిత్రాన్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రజనీకాంత్ కూడా చూశారు. సినిమా బాగుందంటూ వారు ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఆయన అసువులు బాసిన వీరుడిగా నిలిచారు. ఆయన పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించారు. -
రూ.500 కోట్ల క్లబ్లో చిన్న సినిమా.. ఏకంగా ఆ జాబితాలో టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా అరుదైన క్లబ్లో చేరింది. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.502.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే గదర్-2 ఆల్ టైమ్ వసూళ్లను దాటేయనుంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్-2 బాక్సాఫీస్ వద్ద రూ. 525 కోట్లు నికర వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన 'స్త్రీ 2 మొదటి రోజు నుంచే రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 500 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ఘనత సాధించింది. అయితే ఈ నెలలో బాలీవుడ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ మూవీ కంటే ముందు జవాన్(రూ. 640 కోట్లు), పఠాన్(రూ.543 కోట్లు), యానిమల్(రూ.553 కోట్లు), గదర్-2 (రూ. 525 కోట్లు) ముందున్నాయి. -
తగ్గేదేలే.. దంగల్, అవతార్-2ను వెనక్కినెట్టిన స్త్రీ-2!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా రూ.474 గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.402 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ-2 రెండో వారాంతంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' (రూ. 373.05 కోట్లు), 'జైలర్' (రూ. 348.55 కోట్లు), 'సంజు' (రూ. 342.57 కోట్లు), 'దంగల్' (రూ. 387.38 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 391.4 కోట్లు) చిత్రాలను అధిగమించింది.ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్ పార్ట్-1(రూ. 406.45 కోట్లు), 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 421 కోట్లు), '2.0' (రూ. 407.05 కోట్లు) వసూళ్లను దాటేయనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) చిత్రాల నెట్ కలెక్షన్స్‌ను అధిగమించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
తగ్గేదేలే అంటోన్న విశ్వక్ సేన్.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటి రోజు అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9.07 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో వీకెండ్ కావడంతో వసూళ్ల పర్వం ఏమాత్రం తగ్గలేదు. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు 6.03 కోట్లు వసూళ్లతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్కు చేరుకోగా.. మూడో రోజు మిగిలిన ఏరియాల్లోను రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా థియేటర్లలో 52 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. గామి ప్రత్యేకతలు.. ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్ ఎన్నో కష్టాలు పడింది. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్ చేయడం విశేషం. #Gaami is going super strong all over 💥 Collects 15.1CRORE+ gross worldwide in 2 days with super positive WOM & remains #1 choice of moviegoers this week 💥💥 Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 🤩 🎟️… pic.twitter.com/l13z6Wik1b — UV Creations (@UV_Creations) March 10, 2024 -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
Prabhas Salaar: బాక్సాఫీస్ వద్ద సలార్ జోరు.. ఐదో రోజు ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ నటించిన సలార్ ప్రభంజనం ఐదు రోజు కూడా కొనసాగింది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే.. నాలుగు, ఐదు రోజుల్లో కాస్తా తగ్గినట్లు కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. రూ.500 కోట్ల క్లబ్లో చేరితే.. బాహుబలి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తర్వాత ప్రభాస్ మూడో చిత్రంగా సలార్ నిలవనుంది. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్‌ను దాటేశాయి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు చేరుకున్న సలార్.. ఐదో రోజు అదే ఊపులో దూసుకెళ్లింది. సలార్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.రూ.490.23 కోట్లు కొల్లగొట్టిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ కలెక్షన్స్ పరంగా సలార్ భారీ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల మార్కుకు చేరువలో ఉంది. ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ ఐదు రోజుల్లో రూ.280.30 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించారు. #Salaar WW Box Office #Prabhas is racing towards his 3rd ₹500 cr club film after #Baahubali and #Baahubali2. Day 1 - ₹ 176.52 cr Day 2 - ₹ 101.39 cr Day 3 - ₹ 95.24 cr… pic.twitter.com/0maGBGaqY8 — Manobala Vijayabalan (@ManobalaV) December 27, 2023 -
రిలీజ్‌కు ముందే సలార్ రికార్డ్.. అట్లుంటది మనతోని..!
ఈ వారంలో రిలీజవుతున్న ప్రభాస్ సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎంతోమంది అభిమానులు టికెట్స్ దొరకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సలార్ బుకింగ్స్ రూ.18 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే సలార్‌కు ఒక రోజు ముందే బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనుండండతో కలెక్షన్స్ పైనే అందరి దృష్టి పడింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఓ రేంజ్లో దూసుకెళ్తోన్న సలార్ ముందు.. షారుక్ ఖాన్ డంకీ పోటీలో నిలుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టిను ఆనంద్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
బాక్సాఫీస్ వద్ద లియో జోరు.. నెగెటివ్ టాక్ వచ్చినా తగ్గేదేలే!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈనెల 19 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టిన లియో.. దాదాపు మూడో రోజు అదే జోరును కొనసాగించింది. శనివారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.40 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సినిమా రిలీజ్ రోజు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన లియో.. మూడో రోజే రెండొందల కోట్ల మార్కును దాటేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు. మొత్తంగా తమిళనాడులో మూడు రోజుల్లో కలిపి రూ.56.9 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.27.63 కోట్లు, రెండో రోజు రూ.15.95 కోట్లు, మూడో రోజు రూ.13.32 కోట్లు వసూలు మాత్రమే రాబట్టింది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం రిలీజ్‌పై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. తెలుగులోనూ రిలీజ్‌పై స్టేలు ఇవ్వడం కలెక్షన్లపై కాస్తా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. -
రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. (ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్) ఈ మూవీ రన్‌టైమ్ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5.50 కోట్ల షేర్.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్‌గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్‌పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్‌ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న జైలర్.. రెండు రోజుల్లోనే వందకోట్ల మార్క్!
సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రోజే రూ.52 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండు రోజు సైతం అదే ఊపులో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) జైలర్ రెండు రోజుల్లోనే రూ.100 కోట్లను దాటేసిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తలైవాకు దక్షిణాదిలో భారీగా అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా రజినీకాంత్ సినిమాలకు విదేశాల్లోనూ క్రేజ్ అదేస్థాయిలో ఉంది. దీంతో ఈజీగా రూ.100 కోట్ల మార్కును అధిగమించింది జైలర్. వీకెండ్స్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్టార్ హీరో కుమార్తె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు! )